Shopping mall
-
చీరల పవర్ అంటే గిట్లుంటది మరి
-
చంద్రబాబు‘లూలూ’ గోల్ ‘మాల్’!
సాక్షి, అమరావతి: ‘లూలూ’గ్రూపుపై చంద్రబాబు సర్కారు వల్లమాలిన ప్రేమ చూపింది. లూలూ గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ జనవరి 17న సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుపై ఆ సంస్థకు ధారాదత్తం చేసింది. విశాఖలోని హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్.. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన (ఆర్ఎఫ్పీ) నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది. హార్బర్ పార్క్‌లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.150 కోట్లకుపైగా పలుకుతోందని విశాఖ వాసులు చెబుతున్నారు. అంటే.. ఏకంగా రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని ‘లూలూ’కు రాసిచ్చేసినట్లు స్పష్టమవుతోంది. బీచ్ పక్కనే ఉన్న హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల ఖరీదైన భూమి వీఎంఆర్డీఏ(విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) అధీనంలో ఉంది. అత్యంత విలువైన ఈ భూమిలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలంటే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ప్రైవేటు సంస్థను ఎంపిక చేయాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి వీల్లైదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. “లూలూ’కు 99 ఏళ్లకు నామమాత్రపు అద్దెపై అప్పగిస్తూ.. ఆ సంస్థ ఛైర్మన్ విధించిన షరతులన్నింటికీ తలూపుతూ ఖరీదైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టేసింది. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారడం వల్లే నిబంధనలు తుంగలో తొక్కి “లూలూ’పై వల్లమాలిన ప్రేమ చూపించినట్లు స్పష్టమవుతోంది.18 ఏళ్ల అనుబంధం.. ఆగమేఘాలపై పచ్చజెండాటీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లూలూ ప్రాజెక్టుకు చంద్రబాబు తిరిగి పచ్చ జండా ఊపారు. గతేడాది సెప్టెంబరు 28న సీఎం చంద్రబాబుతో సమావేశమైన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలీ విశాఖలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు. దీనిపై అదే రోజు “ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేయగా.. తనకు చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందంటూ లూలూ గ్రూప్ ఛైర్మన్ ప్రతిస్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో విశాఖ హార్బర్ పార్క్‌లో 13.43 ఎకరాల భూమిని అప్పగిస్తే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామంటూ ఈ ఏడాది జనవరి 17న సీఎం చంద్రబాబుకు లూలూ గ్రూపు ఛైర్మన్ లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 13న ఎస్ఐపీబీ(స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఆమోదముద్ర వేశారు.ఇలా కలిశారు.., అలా జీవో ఇచ్చేశారు భారీ రాయితీలు.. అత్తెసరు అద్దెతమకు భూమిని 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని.. మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యే వరకూ లేదా మూడేళ్ల వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకూ అద్దె మినహాయింపు ఇవ్వాలని లాలూ గ్రూపు ఛైర్మన్ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. పదేళ్లకు ఒకసారి పది శాతం అద్దె పెంచాలని, సాధ్యమైనన్ని అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాటన్నింటికీ ప్రభుత్వం తలూపడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఎకరానికి నామమాత్రంగా రూ.50 లక్షలు అద్దెగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితర ప్రోత్సాహకాల కింద లూలూ గ్రూప్‌నకు రూ.170 కోట్లకుపైగా ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చర్చ సాగుతోంది. లాలూ గ్రూప్ కోరికల చిట్టాకు తలూపి అంత లబ్ధి చేకూరుస్తున్నా ఆ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి అద్దె రూపంలో అత్తెసరు ఆదాయం మాత్రమే రానుండటం గమనార్హం. దీన్నిబట్టి ఇందులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 2018 ఫిబ్రవరి 16న నాటి టీడీపీ సర్కార్ లూలూ సంస్థకు పీపీపీ పద్ధతిలో షాపింగ్ మాల్, ఎనిమిది స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి భూమిని నామమాత్రపు లీజుపై కేటాయించి భారీ రాయితీలు కల్పిస్తూ ఏకపక్షంగా కట్టబెట్టింది. దీని వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.ఆదాయాన్ని ఆర్జించే వీలున్నా..వాస్తవానికి లూలూ మాల్‌కు అప్పగిస్తున్న భూమిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణాలను చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, అద్దెలకు ఇవ్వడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అయితే దీన్ని కాదని.. ఓ ప్రైవేట్ సంస్థకు కారుచౌకగా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు అత్యంత ఖరీదైన స్థలాన్ని కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక గూడుపు ఠాణీ వ్యవహారాలే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడకు సమీపంలోనే రహేజా నిర్మిస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ కూడా ఉంది. నిజంగానే షాపింగ్ మాల్ కట్టాలనుకుంటే ప్రభుత్వమే నిర్మించవచ్చు. బ్యాంకు రుణం కూడా పొందే వీలుంది. అలాకాకుండా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాల మాదిరిగా ధారాదత్తం చేయడం, రూ.వందల కోట్ల రాయితీలు కల్పించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూమిని ఒకవేళ ప్రైవేట్ పరం చేయాలనుకుంటే టెండర్లు నిర్వహించి బహిరంగ ప్రకటన జారీ చేయాలి. రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని ఖజానాకు జమ చేసి పారదర్శకంగా వ్యవహరించాలి. దీనికి విరుద్ధంగా 99 ఏళ్ల పాటు లీజు.. పలు రాయితీలు కల్పించడం వెనుక గోల్ఙ్‌మాల్’ వ్యవహారాలు దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఎకరానికి చెల్లించే అద్దె: రూ.50 లక్షలు ⇒ లీజు గడువు: 99 ఏళ్లు⇒ రాయితీల రూపంలో లూలూ పొందే లబ్ధి: రూ.170 కోట్లు(స్టాంపు డ్యూటీ మినహాయింపు, జీఎస్టీ రాయితీలు తదితరాలు) -
హైదరాబాద్ : రంజాన్ వేళ చార్మినార్ వద్ద షాపింగ్ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కార్ల బుకింగ్
హైదరాబాద్ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్‌గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్‌మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఉగాదికి కోరిక తీరింది.. వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనంతెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..! జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో -
కాల్పుల కలకలం
గోల్కొండ: గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్ గార్డెన్లో దావత్ – ఎ– రంజాన్ షాపింగ్ ఎక్స్‌పోలో శనివారం రెండు స్టాళ్ల నిర్వాహకుల మధ్య జరిగిన గొడవ గాలిలోకి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో దావత్– ఎ– రంజాన్ పేరుతో రంజాన్ షాపింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్స్పో శుక్రవారం రాత్రి ముగిసింది. శనివారం ఉదయం నిర్వాహకులు తమ స్టాళ్లను తొలగిస్తున్నారు. కాగా.. ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్ సోదరులు బొమ్మల షాపు నిర్వహిస్తుండగా.. వీరి స్టాల్ పక్కనే దుబాయ్‌కి చెందిన తౌఫిక్ అనే వ్యక్తి పర్ఫ్యూమ్ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫారూక్ అహ్మద్ తనకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇవ్వాలని తౌఫిక్‌ను అడుగుతున్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ స్టాళ్లను ధ్వంసం చేయసాగారు. పర్ఫ్యూమ్ స్టాల్ నిర్వాహకుడు తౌఫిక్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన మీర్ హసీబుద్దీన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తమపైనే షికాయత్ చేస్తావా అంటూ ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్‌లు కలిసి తౌఫిక్‌పై దాడికి వెళ్లారు. వీరి మధ్య పరస్పరం తోపులాట చోటుచేసుకుంది. ఇది గమనించిన ఈవెంట్ ఆర్గనైజర్ మీర్ హసీబుద్దీన్ తనపై కూడా దాడి జరగవచ్చనే అనుమానంతో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే స్టాళ్లను తొలగించిన వ్యాపారులు, వారి సహాయకులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన మీర్ హసీబుద్దీన్ నుంచి రివాల్వర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బోలెడంత షాపింగ్..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, డిజిటల్ అవగాహన కలిగిన యువ కస్టమర్లు, విస్తరిస్తున్న మహిళా శ్రామిక శక్తి.. ఇంకేముంది బోలెడంత షాపింగ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదార్లు గత ఏడాది రూ.82,00,000 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. మన దేశంలోకి విదేశీ కంపెనీల రాక, అలాగే బీటూసీ బ్రాండ్లు వెల్లువెత్తడం, మారుతున్న ప్రజల అభిరుచులతో రిటైల్ మార్కెట్ అంచనాలను మించి రికార్డులను సృష్టిస్తోంది. వచ్చే దశాబ్దంలో భారతీయ రిటైల్ మార్కెట్ ఏటా 8.8 శాతం వృద్ధి చెంది 2034 నాటికి రూ.1,90,00,000 కోట్లు మించిపోనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడించింది.రిటైల్ రంగం పరుగెడుతోంది..ఆన్లైన్ షాపింగ్ విస్తృతి2014లో రూ.35,00,000 కోట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన రిటైల్ రంగం ఏటా 8.9 శాతం దూసుకెళ్లిందంటే కొనుగోలు తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవచ్చు. జీవనశైలి, వినోదం కోసం చేస్తున్న వ్యయాలు ఏటా 10 శాతం పెరిగాయి. వ్యవస్థీకృత రిటైల్‌లో పెట్టుబడులు 2014–2024 మధ్య రెండింతలయ్యాయి. ఈ కాలంలో ఆన్లైన్ షాపింగ్‌లో 30 శాతం వృద్ధి నమోదైంది. వినియోగానికి అనుగుణంగా రిటైల్ రంగం పరుగెడుతోంది. భారతదేశ వినియోగ వృద్ధి ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అంచనా. 32.5 కోట్లుగా ఉన్న గృహాల సంఖ్య 2034 నాటికి 40.7 కోట్లకు చేరుకోనుందని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ బ్రాండ్లకు సై..ప్రపంచీకరణ, విదేశీ బ్రాండ్ల పట్ల భారతీయులు సాను కూలంగా భావిస్తున్నారు. గ్లోబల్ బ్రాండ్లకై వినియోగ దారుల డిమాండ్‌ను తీర్చడానికి గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారత్‌కు 60కిపైగా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి.ఆర్థిక స్తోమతనుబట్టి.. వినియోగదార్ల కొనుగోళ్లను నిర్ణయి స్తున్న అంశాలు ఆర్థిక స్తోమతనుబట్టి మారు తున్నాయి. దిగువ మధ్యతరగతి కస్టమర్లలో అత్యధికుల షాపింగ్‌ను ధర ప్రభావితం చే స్తోంది. మధ్య తరగతి, అధిక ఆదాయ కుటుంబాల్లో ఎక్కువ మంది ఫీచర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.కొనుగోలు నిర్ణయం ఇలా..ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే అత్యధికులు ఆఫ్లైన్పైనే ఆధారపడుతున్నారు. అంటే ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను చూసి, ముట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారన్న మాట. మిశ్రమ మార్గాలలో అంటే నేరుగా షాప్‌కు వెళ్లి వస్తువులను పరిశీలించి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం లేదా ఆన్లైన్లో పరిశోధించి ఆఫ్‌లైన్‌లో కొనడం.లోకల్‌కే మొగ్గు..భారతీయ బ్రాండ్లు, స్థానిక ఉత్పత్తులను కొనడానికి జనం ఇష్టపడుతున్నారు. 2016 నుండి భారత్‌లో 600లపైచిలుకు స్వదేశీ డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీటీసీ) బ్రాండ్లు ఉద్భవించాయి. -
మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్‌మార్ట్
పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. ఆ టెక్నాలజీతో ఒక్క దొంగతనం జరగకుండా చూడవచ్చు. అయినప్పటికీ చిన్నాచితక దొంగతనాల వల్ల పెద్ద పెద్ద షాపులు సైతం బిక్కచచ్చిపోతున్నాయి.ఏంచేయాలో తోచక దిక్కులు చూస్తున్నాయి. షాప్‌లిఫ్టింగ్ అనేది అమెరికాలో పెద్ద సమస్యగా మారింది, ఒక నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య అమెరికా అంతటా షాప్ లిఫ్టింగ్ 93 శాతం పెరిగింది. గత సంవత్సరం కూడా తక్కువేమీ లేదు.సౌత్ మెంఫిస్ వాల్ మార్ట్ నుంచి నూడుల్స్, ఇతర ప్యాకెట్లను దొంగిలించినందుకు అష్లే క్రాస్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 37 ఏళ్ల క్రాస్ చిన్నాచితక దొంగతనాల్లో పెద్ద పేరు తెచ్చుకుంది. అష్లే క్రాస్‌ను మల్టీనేషనల్ రిటైల్ స్టోర్ వాల్‌మార్ట్ ‘అథరైజేషన్ ఆఫ్ ఏజెన్సీ’ జాబితాలో చేర్చింది. అమెరికాలోని ఏ వాల్ మార్ట్లోకీ అడుగు పెట్టకుండా ఆమెను నిషేధించారు.‘మేము మా కస్టమర్లకు విలువ ఇస్తాం. వారు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. అరుదుగా అయినప్పటికీ కొందరిని స్టోర్లలోకి స్వాగతించని సందర్భాలు ఉన్నాయి’ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది? -
ఎయిర్‌పోర్ట్స్.. మాలా‘మాల్’!
ప్రీమియం రిటైల్ స్టోర్స్.. లగ్జరీ బొటిక్స్.. డైనింగ్ ఏరియాలు.. వెల్నెస్ సెంటర్లు.. స్పాలు.. కాఫీ షాపులు.. రెస్టో బార్లు.. 24 గంటలూ కిటకిటలాడే జనాలు... ఇవన్నీ ఏదైనా భారీ షాపింగ్ మాల్లో ప్రత్యేకతలు అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టుల నయా అవతారం ఇది. విమానయాన కార్య కలాపాల నుంచి వచ్చేది అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ.. ఆదాయాలను దండిగా పెంచుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇప్పుడు షాపింగ్ మాల్స్(shopping mall) కు ఎక్కువ.. ఎయిర్‌పోర్టుల(airport)కు తక్కువ అనే రేంజ్లో నడుస్తున్నాయి!! – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీయంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణలో దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయం ఢిల్లీతోపాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ కంపెనీ చేతిలోనే ఉంది. ప్రయాణికుల రాకపోకల్లో ఇవి రికార్డులు సృష్టిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికుల ట్రాఫిక్‌తో దుమ్మురేపింది.తొలి తొమ్మిది నెలల్లో ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టు ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.3,775 కోట్లు. ఇందులో విశేషం ఏముందంటారా? తాజా లెక్కల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే! ఆదాయంలో విమాన (ఏరో) కార్యకలాపాల వాటా 20 శాతమే. మరో 57 శాతం విమానయేతర కార్యకలాపాలు (నాన్–ఏరో) సమకూర్చిపెట్టాయి. అంటే రిటైల్, డ్యూటీ–ఫ్రీ సేల్స్, అద్దెలు, ప్రకటనలు, ఆహార–పానీయాల విక్రయం తదితర మార్గాల్లోనే లభించాయి. దీన్నిబట్టి చూస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇప్పుడో భారీ మాల్ కింద లెక్క!ఏరో ‘మాల్స్’ కిటకిట..: ఒకవైపు నగరాల్లోని భారీ మాల్స్‌లో రిటైల్ గిరాకీ తగ్గుముఖం పడుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తాజా నివేదిక ప్రకారం... దేశంలోని 8 ప్రధాన నగరాల షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలాల లీజింగ్ గతేడాది 10శాతం తగ్గిపోవడం గమనార్హం. అదే ఎయిర్‌పోర్టుల్లోని మాల్స్ మాత్రం కిటకిటలాడి పోతున్నాయి. జీఎంఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య అద్దెల రూపంలో ఏకంగా రూ.597 కోట్లు (2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో) లభించడం విశేషం. ప్రయాణికుల రద్దీ చూస్తే.. దేశీ ట్రాఫిక్‌లో 17 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్‌లో 28 శాతంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు టాప్‌లో ఉంది.ఎయిర్‌పోర్టు ఆదాయంలో 28 శాతం రిటైల్, డ్యూటీ–ఫ్రీ షాపుల ద్వారా, 18 శాతం అద్దెల ద్వారా లభించగా, మరో 10 శాతం ఆహార–పానీయాల అమ్మకం ద్వారా తోడైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు డ్యూటీ–ఫ్రీ షాపుల్లో ఒక్కో ప్రయాణికుడి సగటు ఖర్చు రూ.1,026 కావడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్..ఎయిర్‌పోర్టుల విమాన సంబంధ ఆదాయాల్లో.. ల్యాండింగ్ ఫీజులు, విమానాల పార్కింగ్ చార్జీలు, ప్రయాణికుల సెక్యూరిటీ ఫీజులు, విమానాల టెర్మినల్ స్పేస్ అద్దెలు, గేట్లు, సర్వీసులకు సంబంధించి వినియోగ ఫీజులు కీలకమైనవి. అయితే అంతపెద్ద ఏరియాలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ ఆదాయం ఏ మూలకూ సరిపోదు. అందులోనూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు భారీ పెట్టుబడులు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. అందుకే ఎయిర్‌పోర్టులను ఫైవ్‌స్టార్ మాల్స్‌గా మార్చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నీ నాన్–ఏరో బిజినెస్‌లపైనే ఫోకస్ చేస్తున్నాయి.సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్టుకు కూడా 55 శాతం ఆదాయం నానో–ఏరో కార్యకలాపాల ద్వారానే వస్తోంది. రిటైల్, డ్యూటీ–ఫ్రీ, ఫుడ్–బేవరేజ్ షాపులకు అధిక స్పేస్ కేటాయిస్తుండటంతో ఎయిర్‌పోర్టులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. దీంతో షాపింగ్ స్పేస్ పెరిగిపోయి విమానాశ్రయాలు ఇరుకైపోయాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల నాన్–ఏరో ఆదాయం సగటున 40–50 శాతం కాగా.. మన దగ్గర దానికి మించి ఉండటం విశేషం. ఆదాయం కోసం మాల్ సదుపాయాలను విస్తరించినప్పటికీ.. ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దుబాయ్, చాంగి ఎయిర్‌పోర్టులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.భారత్‌లో అతిపెద్ద మాల్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో..28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం (బిల్టప్ ఏరియా)తో దేశంలోనే అతిపెద్ద మాల్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోసిటీలో ఏర్పాటవుతోంది. 2027 మార్చి కల్లా ఈ మెగా మాల్ అందుబాటులోకి వస్తుందని అంచనా. దీని అండర్ గ్రౌండ్లో 8,000కుపైగా కార్లు పార్క్ చేయొచ్చట! వరల్డ్ మార్క్ ఏరోసిటీ పేరుతో 2.5 బిలియన్ డాలర్లతో చేపట్టిన ఫేజ్–2 విస్తరణ ప్రాజెక్టులో భాగమిది.భారత్‌లో తొలి ‘ఏరోట్రోపోలిస్ (విమానాశ్రయం చుట్టూ నిర్మిస్తున్న మెట్రోపాలిటన్ ఏరియా)’గా కూడా ఇది రికార్డు సృష్టించనుంది. భారతీ రియల్టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఫేజ్–2లో మొత్తం 35 లక్షల చదరపు అడుగుల లీజింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏరోసిటీలోని 11 స్టార్ హోటళ్లలో 5,000 గదులు ఉండగా.. విస్తరణ తర్వాత 15 హోటళ్లు, 7,000 గదులకు పెరగనున్నాయి. కాగా ప్రస్తుతం కొచ్చిలో ఉన్న లులు ఇంటర్నేషనల్ మాల్ 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో అతిపెద్ద మాల్గా ఉంది.హైదరాబాద్‌లోనూ..హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో కూడా 20 ఎకరాల్లో భారీ మాల్ నిర్మాణంలో ఉంది. మొత్తం విస్తీర్ణం 8 లక్షల చదరపు అడుగులు. 100కు పైగా దేశ, విదేశీ దిగ్గజ బ్రాండ్ స్టోర్లు సహా అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ స్పేస్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 2,000 సీట్ల సామర్థ్యంలో ఐనాక్స్ 11 స్క్రీన్ల థియేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదే ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా.68.8 బిలియన్ డాలర్లు.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రిటెయిలింగ్ మార్కెట్ అంచనా ఇది. ఏటా 6.9 శాతం వృద్ధి చెందుతుందని లెక్కలేస్తున్నారు. 2023లో ఇది 43.2 బిలియన్ డాలర్లుగా ఉంది.విమాన ప్రయాణికుల జోరు ఇది.. (కోట్లలో)ఎయిర్ ట్రాఫిక్ 2024 2023 వృద్ధి(%)దేశీయ 16.13 15.20 6.11అంతర్జాతీయ 6.45 5.79 11.4 -
అద్దెకు బాయ్‌ఫ్రెండ్!
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్‌ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో షాపింగ్ మాల్స్.. రిటైల్ స్పేస్‌కు గిరాకీ
గతేడాది హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి (Real estate) బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ క్రమంగా పెరుగుతోంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ.లావాదేవీలు జరిగాయని తెలిపింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ.విస్తీర్ణంలో 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి.సిటీలో మూడు మాల్స్ గతేడాది అత్యధికంగా హైదరాబాద్‌లో మూడు మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. పుణె, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కత్తాలో ఒక్క మాల్ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ.షాపింగ్ మాల్ స్పేస్ మార్కెట్లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది.నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్లలో అపర్ణా సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. కూకట్పల్లి 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్ మాల్స్ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.5–25 శాతం పెరిగిన అద్దెలు నగరంలో ఫ్యాషన్, హైపర్ మార్కెట్, ఫుడ్ అండ్ బేవరేజ్ వంటి విభాగాల పనితీరు బాగుండటంతో రిటైల్ స్పేస్‌కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా కొంపల్లి, కోకాపేట, ఏఎస్‌రావ్ నగర్, నల్లగండ్ల, వనస్థలిపురం, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కార్యకలాపాలు జరిగాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొంపల్లి, కొత్తపేట, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు పెరిగాయి. గత కొన్ని త్రైమాసికాలలో ఆయా ప్రాంతాలలో అద్దెలు 5–25 శాతం మేర వృద్ధి చెందాయి. -
ఆన్లైన్ షాపింగ్‌లో బిజీనా.. అయితే బీకేర్‌ఫుల్!
ఐరన్ మ్యాన్ 3 టీ షర్ట్ కావాలా.. ఆన్‌లైన్‌కు వెళ్లు, బ్లూటూత్ అవసరమా నెట్లో చూడు.. లంచ్‌కి వెజిటబుల్స్ లేవా జొమాటోలో ఆర్డర్ పెట్టు.. ఇది ప్రస్తుతం నగరంలో నడుస్తోన్న కొత్త రకమైన మానియాగా వైద్యులు చెబుతున్నారు.. నగరవాసుల ధోరణిలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గృహిణులకు, విద్యార్థులకు, సమయాభావంతో షాపింగ్‌కు వెళ్లలేని వారికి అత్యంత సౌకర్యంగా ఉంటున్న ఈ షాపింగ్ ట్రెండ్.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కొందరిలో తీవ్రస్థాయి వ్యసనంగా మారడం ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. తొలుత దీనిని ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’గా పేర్కొన్న సైకాలజిస్ట్స్.. ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధికి ఒనియోమానియా అని నామకరణం చేశారు. ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అని పేర్కొనే వ్యాధి ఆధునికుల్లో ముదురుతోందని గుర్తించారు. ‘దీనిని ప్రత్యేక మానసిక ఆరోగ్య స్థితిగా గుర్తించడానికి ఇది సరైన సమయం’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆస్ట్రిడ్ ముల్లర్ అన్నారు. కాంప్రహెన్సివ్ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 5% మంది పెద్దలను సీబీడీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. వీరిలో ముగ్గురిలో ఒకరు తీవ్రమైన ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దీనినే ఒనియోమానియాగా వ్యవహరిస్తున్నారు. ఒనియోమానియా అనేది గ్రీకు భాషలోని ‘ఒనియోస్‘ అనే పదం నుంచి ఉద్భవించింది, ఇది ‘ఉన్మాదం’, ‘పిచ్చితనం’ అనే దానిని సూచిస్తుంది. కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ (సీబీడీ) ముదిరి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలకు దారితీసే స్థాయిని షాపింగ్ ద్వారా నిర్ధారిస్తారు. తక్షణ ఉత్సాహం కోసం.. ఆన్లైన్ షాపింగ్ వ్యసనపరులం అయ్యామా లేదా అనేదానికి సమాధానంగా వారం రోజుల్లో మనం ఎన్ని ప్యాకేజీలను రిసీవ్ చేసుకున్నాం? అనేది లెక్కిస్తే సరి అంటున్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అంకుర్ సింగ్. ఆన్లైన్ షాపింగ్ వ్యసనాన్ని కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ దాటి ఒనియోమానియాగా పిలుస్తున్నామని, ఇది జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీసే అతి పెద్ద ప్రవర్తనా సమస్య అని హెచ్చరించారు. ఈ ఆన్లైన్ షాపింగ్ తక్షణ ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. హార్మోన్లపై ప్రభావం.. కొనుగోలు వల్ల కలిగే ఉత్సాహంతో బాక్స్‌ను ఓపెన్ చేసిన మరుక్షణమే డోపమైన్ హోర్మోన్ విడుదలవుతుంది. ఇది మరింత షాపింగ్ చేయాల్సిన అవసరాన్ని తెస్తుందని అంకుర్ వివరించారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి షాపింగ్‌ను ఒక మార్గంగా ఉపయోగించడం పెరుగుతోందని, చివరికి మరింత తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోందని విశ్లేషించారు. షాపింగ్ నుంచి పొందిన తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని పదే పదే కోరుకోవడం, మాదకద్రవ్య దురి్వనియోగానికి సమానమైన వ్యసనాన్ని సృష్టించగలదని హెచ్చరించారు.నష్టాలెన్నో.. సాధారణ వ్యక్తిగత షాపింగ్ సరదా ఎవరికీ హానికరం, లేదా బాధించేది కాదని చాలా మంది భావించవచ్చు. అయితే, ఇది స్థూల ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఉమ్మడి ఆర్థిక ఖాతాను కలిగి ఉన్న సందర్భాల్లో.. ఇది కొనుగోళ్లను దాచిపెట్టమని ప్రేరేపిస్తుంది. ఇది నెమ్మదిగా అపరాధ భావం లేదా అవమానం, ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం లోపించడం వంటి భావనలను కలిగిస్తుంది. ఈ ప్రవర్తన సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తులు తమ షాపింగ్ అలవాట్లపై నియంత్రణ కోల్పోవచ్చు. ఇది ఆకస్మిక నిర్ణయాలకు దారి తీస్తుందని, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఆపలేకపోవడం వ్యాధి తీవ్రతకు చిహ్నమని, ఈ అలవాటు అనుబంధాలపై సైతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు పొదుపు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు. ఇలా వదులుకోవాలి.. ⇒ ఆన్లైన్లో గడపడం కన్నా వ్యాయామం చేయడం, స్నేహితులతో ముచ్చట్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిచాలి. ⇒ విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కఠినమైన బడ్జెట్‌ను సెట్ చేసుకోవాలి. పరిమితుల్లో ఉండేలా ఖర్చులను నిర్ణయించుకోవాలి. ⇒ ప్రచార ఈ మెయిల్స్ నుంచి సబ్స్క్రిప్షన్స్ తీసేయడం, ఫోన్ వగైరా డివైజ్‌ల నుంచి షాపింగ్ యాప్‌లను తగ్గించేయాలి. ⇒ తరచూ షాపింగ్ వెబ్సైట్లను సందర్శించకుండా నియంత్రించుకోవాలి. ⇒ అవసరం లేని వస్తువులను జాబితా తయారు చేసి పొరపాటున కూడా అవి కొనుగోలు చేయవద్దని నిర్ణయించుకోవాలి. మొదటి పది ఇవే.. నగరవాసులు అత్యధికంగా ఈ–షాప్ చేస్తున్నవాటిలో అగ్రస్థానంలో పుస్తకాల కొనుగోలు ఉంటే, ఆ తర్వాత వరుసగా దుస్తులు, మూవీ టిక్కెట్స్, ప్రయాణ టిక్కెట్లు, యాక్సెసరీస్, కార్డ్స్, డిజిటల్ డివైజ్‌లు, ఫుట్‌వేర్, గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్.. వగైరా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన వాళ్లు తరచూ సందర్శిస్తున్న షాపింగ్ సైట్లలో.. స్నాప్ డీల్, అమెజాన్, ఇబే, మింత్ర, జెబాంగ్, ఫ్లిప్‌కార్డ్, షాప్‌క్లూస్, దేశీడైమ్, ఫ్యాషన్ ఎన్ యు.. వంటివి ఉన్నాయి.నగరమా బీకేర్‌ఫుల్.. కరోనా మహమ్మారితో లాక్డౌన్ వల్ల నగరవాసులు ఫిజికల్ స్టోర్లను విస్మరించి, ఆన్లైన్లో ఆర్డర్ చేసేలా అలవాటుపడ్డారు. పైగా నగరంలో ఒక చోటు నుంచి మరోచోటుకు రాకపోకలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు..వంటివి దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఇ–కామర్స్ విపరీతంగా పెరిగింది. అంతేకాక స్మార్ట్ఫోన్ల వినియోగం ఆన్లైన్ షాపింగ్ విజృంభణకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ పరంగా 5.73 శాతంతో నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. కాగా రంగారెడ్డి జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండడం గమనార్హం. నానాటికీ విస్తరిస్తున్న వ్యాపార వ్యూహాలను గమనిస్తే.. త్వరలోనే నగరం టాప్‌కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీంతో పాటే వ్యసనబాధితుల సంఖ్యలోనే అగ్రగామి కావడం జరగవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేవలం పుస్తకాలే.. తొలుత దాదాపు 50 పుస్తకాలకు పైగా ఆన్లైన్ ద్వారానే కొన్నాను. అలా అలా ఇప్పుడు రెగ్యులర్ ఈ–షాపర్ అయిపోయా. కేవలం పుస్తకాలే కాకుండా టేబుల్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా ఆన్లైన్లోనే కొంటున్నాను. – నికుల్గుప్తాతక్కువ ధరలకు.. నగరంలోని షోరూమ్‌లు అందించే వాటికన్నా.. ఆన్లైన్ ద్వారానే ఎక్కువ లేటెస్ట్ వెరైటీలు దొరుకుతాయి. బర్త్‌డే లేదా పార్టీ, ఫంక్షన్‌కు తగినవి, లేటెస్ట్ ఫ్యాషనబుల్ గూడ్స్ ఇంటి నుంచే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం షాపింగ్‌లో దాదాపు 70 శాతం ఆన్లైన్ మీదే. – పూజానేతి -
మాల్స్‌లో తగ్గిన రిటైల్ లీజింగ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్లలో (ప్రముఖ షాపింగ్ ప్రాంతాలు) రిటైల్ స్థలాల లీజింగ్ 2024లో 10 శాతం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 64 లక్షల చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపాలు 2024లో నమోదయ్యాయి. హైదరాబాద్, చెన్నై మాత్రం రాణించాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో స్థూల రిటైల్ స్పేస్ లీజింగ్ 71 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ‘‘భార త రిటైల్ స్పేస్ విభాగం 2025లో గణీయమైన వృద్ధిని చూడనుంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో 50–60 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్స్ స్థలాలు ఈ ఏడాది వినియోగంలోకి రానున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీ ఈవో అన్హుమన్ మ్యాగజిన్ తెలిపారు. మధ్య శ్రేణి ఫ్యాషన్, వ్యాల్యూ ఫ్యాషన్, క్రీడా వ్రస్తాలు, జ్యుయ లరీ విభాగాల నుంచి బలమైన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సైతం మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. రిటైల్ కేంద్రాలు షాపింగ్, డైనింగ్, వినోదం కలిసిన వినూత్నమైన అనుభవాన్ని అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. పట్టణాల వారీగా లీజింగ్ → హైదరాబాద్ మార్కెట్లో 2024లో రిటైల్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 10 లక్షల చదరపు అడుగులకు చేరింది. అంతక్రితం ఏడాది ఇది 7 లక్షల చదరపు అడుగులుగానే ఉంది. → చెన్నైలోనూ రిటైల్ స్పేస్ లీజింగ్ 6 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 7 లక్షల ఎస్ఎఫ్టీకి పెరిగింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో 2023లో 14 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, 2024లో 10 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో పెద్దగా మార్పు లేకుండా 19 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. → ముంబైలో 10 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 8 లక్షల ఎస్ఎఫ్టీకి లీజింగ్ తగ్గింది. → పుణెలోనూ 8 లక్షల చదరపు అడుగుల నుంచి 6 లక్షలకు పరిమితమైంది. → కోల్‌కతాలో రిటైల్ స్పేస్ లీజింగ్ లక్ష చదరపు అడుగుల నుంచి 2 లక్షలకు పెరిగింది. → అహ్మదాబాద్‌లో 5 లక్షల నుంచి 4 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
కొత్తపేటలో హీరోయిన్ శ్రీలీల సందడి
-
చెన్నై షాపింగ్ మాల్ లో మీనాక్షి చౌదరి సందడి
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీనటి శ్రీలీల (ఫొటోలు)
-
కడపలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్‌పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
దీపావళి షాపింగ్ చేస్తున్నారా?: డబ్బు ఆదా కోసం ఐదు టిప్స్..
దీపావళి వచ్చేస్తోంది.. ఇప్పటికే చాలామంది షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు పెట్టడం. ఇలా డబ్బు ఖర్చుపెట్టే క్రమంలో కొంత ఆదా చేసే మార్గాల కోసం అన్వేషిస్తారు. దీనికోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్ వేసుకోవడంపండుగ వస్తోంది కదా అని కంటికి కనిపించిందల్లా.. కొనేస్తే పర్సు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి? దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. కిరాణా వస్తువులు, స్వీట్స్ వంటివన్నీ కూడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. పండుగ సీజన్లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్స్ వాడుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని అనవసర వస్తువులను కొనుగోలు చేయకూడదు.క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉపయోగించుకోవడందసరా, దీపావళి సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ విరివిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ షాపింగ్‌లో క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు ఎక్కువ. వీటిని ఉపయోగించుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.ధరలను సరిపోల్చడంఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఒక వస్తువు ధర ఏ ప్లాట్ఫామ్లో ఎంత ఉందో గమనించాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. ధరలను సరిపోల్చడానికి ప్రైస్ ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించడం ఉత్తమం.డిస్కౌంట్స్ తెలుసుకోవడంషాపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చాలా సైట్స్ డిస్కౌంట్స్ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డిస్కౌంట్స్ లభించే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా నష్టపోవడం ఖాయం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుబ్యాంక్ ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవడంషాపింగ్ చేసే క్రమంలో బ్యాంకులు అందించే ఆఫర్స్ వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల మీద డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటివి ఈ పండుగల సమయంలో చాలానే లభిస్తాయి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే.. డబ్బు కొంత ఆదా అవుతుంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తే.. నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి. లేకుంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. -
జనగామలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, జనగామ: జనగామలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. దీంతో పక్క షాపులకు కూడా విస్తరించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది అదుపుచేయలేకపోతున్నారు. పక్కనే ఎస్బీఐ బ్యాంక్ ఉండటంతో బ్యాంక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆలేరు, కోదాడ, స్టేషన్ ఘన్పూర్, కోడకండ్లతో సహ 6 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. -
‘జెన్-జీ’తో రూ.1,500 లక్షల కోట్ల వ్యాపార అవకాశం!
భారత్‌లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.నివేదికలో వివరాల ప్రకారం..జెన్-జీ తరం మార్కెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్‌ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.విభిన్న రంగాల్లో జెన్‌జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్టైన్మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్‌ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్‌లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్‌గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్‌ను ఉపయోగిస్తున్నారు.బ్రాండ్ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్‌లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్ల సోషల్ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్‌జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్టైన్మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. -
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సందడి చేసిన శ్రీలీల (ఫొటోలు)
-
మాంగళ్య షాపింగ్ మాల్లో సంయుక్త మీనన్ సందడి
-
నిజామాబాద్‌లో సందడి చేసిన పాయల్, రామ్ (ఫొటోలు)
-
రిటైల్ షాపింగ్ మాల్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో 2024–27 మధ్య కాలంలో 18 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ రిటైల్ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం (స్పేస్/వసతి) అందుబాటులోకి వస్తుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ అంచనా వేసింది. ఈ కాలంలో తాజా డిమాండ్‌లో ఇది మూడింట ఒక వంతుగా తెలిపింది. భారత్‌లో తలసరి రిటైల్ స్పేస్ ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయిల్యాండ్, వియత్నాం తదితర దక్షిణాసియా దేశాల కంటే తక్కువగా ఉందని.. రిటైల్ స్పేస్ భారీ వృద్ధి అవకాశాలను ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం టాప్–8 పట్టణాల్లో రిటైల్ స్పేస్ 60 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు తెలిపింది. అంటే 2027 నాటికి మొత్తం రిటైల్ మాల్స్ విస్తీర్ణం 78 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోన్నట్టు అంచనా వేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కొత్తగా ఒక్క మాల్ కూడా నిర్వహణలోకి రాలేదని తెలిపింది. భారత్ మాదిరే తలసరి ఆదాయం కలిగిన ఇండోనేíÙయాతో పోల్చి చూస్తే.. 2027 నాటికి తలసరి రిటైల్ స్పేస్ 1.0కు చేరుకునేందుకు గాను భారత్‌లో 55 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర అదనంగా రిటైల్ మాల్స్ నిరి్మంచాల్సిన అవసరం ఉంటుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. సరఫరా పెరిగేలా చర్యలు అవసరం.. ‘‘భారత రిటైల్ రంగం కీలక దశలో ఉంది. వినియోగదారుల విశ్వాసం, విచక్షణారహిత వినియోగం పెరుగుతుండడం ఈ రంగం సామర్థ్యాలను తెలియజేస్తోంది. ఈ వృద్ధి అవకాశాలను సది్వనియోగం చేసుకునేందుకు సరఫరా వైపు సవాళ్లను పరిష్కరించడం ఎంతో అవసరం. నాణ్యమైన రిటైల్ వసతులు లభించేలా చర్యలు తీసుకోవాలి. చురుకైన భారత రిటైల్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు 55 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ వసతి అదనంగా అవసరం. ఈ దిశగా స్థిరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు పరిశ్రమ భాగస్వాముల సమిష్టి కృషి అవసరం. తద్వారా భారత రిటైల్ రంగం పూర్తి సామర్థ్యాలను అందుకోగలుగుతుంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ సౌరభ్ శట్దాల్ వివరించారు. గురుగ్రామ్ తదితర పట్టణాల్లో నాణ్యమైన రిటైల్ మాల్ వసతులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నట్టు సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ సైతం తెలిపారు. మెరుగైన షాపింగ్, వినోదం అన్నింటినీ ఒకే చోట వినియోగదారులు కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రీమియం షాపింగ్ డిమాండ్ ప్రస్తుత సరఫరా మించి ఉన్నట్టు ఎలారా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వినీత్ దావర్ తెలిపారు. టైర్–2, 3 నగరాల్లో మాల్స్ విస్తరణ వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. -
ఢిల్లీలోని మూడు మాల్స్, ఓ ఆసుపత్రికి బాంబు బెదిరింపు
దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువైపోయాయి. పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ప్రార్థన స్థలాలు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ప్రముఖుల ఇళ్లే టార్గెట్‌గా వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలోని మూడు మాల్స్‌కు, ఓ ఆసుపత్రికి సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.చాణక్యపురిలోని చాణక్య మాల్, సాకేత్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీవాక్, వసంత్ కుంజ్‌లోని ఆంబియెన్స్ మాల్ సహా చాణక్యపురిలోని ప్రైమస్ ఆసుపత్రికి ఈ మెయిల్ ద్వారా బాబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. కొన్ని గంటల్లో బాంబు పేలుతుందంటూ దుండగులు మెయిల్లో పేర్కొన్నట్లు చెప్పారు.సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఆయా మాల్స్, ఆసుపత్రి వద్దకు చేరుకొని సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. చివరకు ఆ బెదిరింపు బూటకమని తేలిందికాగా ఈ నెల 17న గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు మాల్ మేనేజ్మెంట్కు మెయిల్ ద్వారా బెదిరించారు. ‘ప్రతి ఒక్కరినీ చంపేందుకు మాల్లో బాంబులు అమర్చాం. మీలో ఎవ్వరూ తప్పించుకోలేరు, అందరూ చస్తారు’ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మాల్ అధికారులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మాల్‌ను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి బాంబూ దొరకలేదని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఇక -
సోదరితో పాటు షాపింగ్ చేసిన షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బృందంలోని సభ్యులంతా హడావుడిగా భారత్‌కు తరలివచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షేక్ హసీనా టీమ్‌లోని చాలా మంది ఇక్కడికి వచ్చే సమయంలో తమ దుస్తులతో పాటు ఇతర రోజువారీ వినియోగ వస్తువులను కూడా తీసుకురాలేదు.భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు సమర్పించారు. అనంతరం ఆమె భారత్ తరలివచ్చారు.తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లె క్స్‌కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించారు. అయితే ఈ కొనుగోలు అధికారికంగా ధృవీకృతం కాలేదు. ప్రస్తుతం షేక్ హసీనా.. హిండన్ ఎయిర్‌బేస్‌లోని సేఫ్ హౌస్‌లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.షేక్ హసీనా భద్రత కోసం ఆమె ఉంటున్న ప్రాంతంలో కమాండోలను మోహరించారు. షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమెను కలుసుకున్నారు. -
ధోతీ ధరించాడని అనుమతి నిరాకరణ.. మాల్ అధికారులకు షాక్
బెంగళూరు: ధోతీ ధరించారన్న కారణంతో ఓ రైతును మాల్ సిబ్బంది లోపలికి అనుమతించలేని ఘటన మంగళవారం బెంగళూరులో చోటుచేసుకున్న విఫయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా కూడా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది. సంబంధిత మాల్‌పై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. వృద్ధ రైతుకు ధోతి ధరించినందుకు ప్రవేశం నిరాకరించిన జీటీ వరల్డ్ షాపింగ్ మాల్‌ను వారం రోజులపాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.వృద్ధ రైతుకు ధోతీ ధరించినందుకు ప్రవేశం నిరాకరించడంతో బెంగళూరు షాపింగ్ మాల్‌ను వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చర్యకు పాల్పడినందుకు చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకే ఏడు రోజులు మూసివేయాలని ఆదేశించినట్లు గురువారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ వెల్లడించారు.Under Karnataka Congress govt patronage Farmers are being abused and insulted for wearing Dhoti? Banned entry in a mall! Karnataka CM wears a dhoti! Dhoti is our pride.. should farmer wear a tuxedo in a mall? How is Karnataka Congress allowing this? They are most anti… pic.twitter.com/NvctuwPBpp— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) July 17, 2024 కాగా బెంగళూరులోని జీటీ మాల్లో సినిమా చూసేందుకు ఓ తండ్రీ, కుమారులు వచ్చారు. మాల్‌లోకి వెళ్తుండగా అక్కడి భద్రతా సిబ్బంది ఆ రైతుని అడ్డగించి లోపలికి అనుమతి నిరాకరించారు. ఆ రైతు ధోతీ ధరించిన కారణంగా అనుమతి లేదని సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో మాల్ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా మాల్ యజమాని, సెక్యూరిటీ సిబ్బంది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 126(2) కింద కేసు నమోదు అయ్యింది. అలాగే బుధవారం రైతు సంఘాలు మాల్ ఎదుట ఆందోళనకు కూడా దిగాయి. ఆ రైతుకి, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేలాదిమంది రైతులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది రైతు, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పారు. -
చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
బీజింగ్: చైనాలోని జిగాంగ్ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అధికారిక వార్తా సంస్థ జిన్హువా నుండి అందిన సమాచారం ప్రకారం 14 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.అగ్నిమాపక దళంతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా భవనం దిగువన ఉన్న షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి కారణమేమిటి? ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి కారణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైనాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తలు తరచూ జరగుతుంటాయి. ఈ ఏడాది మే 20 నాటికి 947 మంది వివిధ విపత్తుల కారణంగా మృతి చెందారు. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు 40 శాతం మేరకు పెరిగాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, లేదా గ్యాస్ లైన్ల లీకేజీ, నిర్లక్ష్యం మొదలైనవి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. A MASSIVE fire in China leaves 8 dead and many trapped in a Zigong shopping mall.More confirmation of Hanke’s School Boy’s Theory of History: It’s just one damn thing after another.pic.twitter.com/7OCuGbnNKZ— Steve Hanke (@steve_hanke) July 17, 2024 -
షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ (దుకాణాలకు సంబంధించి స్థలం)కు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎనిమిది ప్రముఖ నగరాల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ 15 శాతం వృద్ధి చెంది 6.12 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 5.33 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఎనిమిది నగరాల్లోని ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 13.89 లక్షల చదరపు అడుగులుగా ఉందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 13.31 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేడ్ ఏ, బి షాపింగ్ మాల్స్, ప్రముఖ వీధుల్లోని రిటైల్ వసతుల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో అద్దెలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రధాన వీధుల్లో మరింత డిమాండ్.. రిటైల్ లీజింగ్‌లో ముఖ్యంగా ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ విభాగం తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నట్టు కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. కొత్త మాల్స్ పరిమితంగా ప్రారంభం కావడం, అధిక నాణ్యత కలిగిన వసతులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రముఖ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై లీజుకు రిటైలర్లు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్–జూన్ కాలంలో మొత్తం లీజింగ్‌లో 70 శాతం ప్రధాన వీధులకు సంబంధించే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గ్రేడ్ ఏ మాల్స్, ప్రధాన వీధుల్లోని (రహదారులపై) రిటైల్ స్పేస్‌కు బలమైన డిమాండ్ కొనసాగింది. దేశీయ రిటైల్ మార్కెట్ చైతన్యాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రధాన వీధుల్లో అద్దెలు కూడా చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. గ్రేడ్ ఏ విభాగంలో త్వరలో రానున్న 45 లక్షల చదరపు అడుగుల స్పేస్‌తో మధ్య కాలానికి అద్దెల ధరలు స్థిరతపడతాయని అంచనా వేస్తున్నాం. ఇది డిమాండ్–సరఫరా పరస్థితులను మారుస్తుంది. అయితే, ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ లీజు కార్యకలాపాలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నది మా అంచనా. లీజింగ్ పరిమాణంలో 53 శాతం వాటా ఆక్రమించే ప్రముఖ బ్రాండ్లు, ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) బలమైన పనితీరు చూపిస్తుండడం దేశంలో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్ ప్రాధాన్యతను గుర్తు చేస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ హెడ్ సౌరభ్ తెలిపారు. -
షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలోని ఓ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లాజిక్స్ మాల్లోని ఓ బట్టల దుకాణంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు, షాప్ నిర్వాహకులు, జనాలు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాసచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్పడం ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా మాల్లోని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మాల్ బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అయితే మాల్ లోపల పొగలు కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.VIDEO | Fire breaks out at Logix Mall, Wave City Centre, #Noida. Several fire tenders at the spot. More details are awaited(Source: Third Party) pic.twitter.com/9gQR1wmIuV— Press Trust of India (@PTI_News) July 5, 2024 -
మనోళ్లు వీడియో షాపింగ్‌లోనూ ముందంజ
సాక్షి, హైదరాబాద్: మనోళ్లు వీ–కామర్స్ (వీడియో కామర్స్)లోనూ దుమ్మురేపుతున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఓ అడుగు ముందే ఉంటున్న భారత యువతరం వీ–కామర్స్‌లోనూ ముందుకు సాగుతోంది. టెక్, డిజిటల్, ఆన్లైన్ షాపింగ్‌లో ముందంజలో ఉంటున్న భారతీయులు వీ–కామర్స్‌ను సైతం సులభంగా అందిపుచ్చుకుంటున్నారు. వీడియో మాధ్యమం ఆధారంగా భారత కస్టమర్లు వీ–కామర్స్ ఆఫర్లు, డీల్స్‌ను పరిశీలిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే అత్యధికంగా ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్న విషయం తెలిసిందే. 2023 జూన్–2024 మే మధ్యలో ఇంటర్నెట్లో మనవాళ్లు 20 లక్షల గంటలకుపైగా ఈ డీల్స్, ఆఫర్స్‌ను సమీక్షించినట్టుగా వెల్లడైంది.ఈ విషయంలో దేశీయంగా చూస్తే టాప్–5 నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నిలిచాయి. ఇంతేకాకుండా వీ–కామర్స్ వైపు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాలు (వీరిలో 30 ఏళ్లలోపు వారు, మహిళలు అధికం) కూడా మొగ్గుచూపుతున్నట్టు తేలడం విశేషం. డైరెక్ట్ టు కన్జుమర్ (డీ 2 సీ) బ్రాండ్లు, విక్రయదారులు, రైతులు ఇతర వర్గాల వారు కూడా వీ–కామర్స్ ఆఫరింగ్స్ పట్ల ఉత్సాహం చూపడంతోపాటు ఇందులో తమకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్నట్టుగా రెడ్‌సీర్ అధ్యయనం నివేదిక స్పష్టంచేసింది.దీనిని ఉటంకిస్తూ... వీడియో కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వీ–కామర్స్ పట్ల భారత్‌లో సానుకూల స్పందన పెరుగుతున్నట్టుగా పేర్కొంది. మొత్తంగా వీడియో కామర్స్ పరంగా (ఓవరాల్ వీడియో కామర్స్ ఎంగేజ్మెంట్) చూస్తే టయర్ 2, 3 ప్రాంతాల్లోని వారు 65 శాతం దాకా ఉన్నట్టుగా ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రధానంగా ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ డెకర్, ఫరి్నíÙంగ్‌పై వీరు దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది తాము నిర్వహించిన ఫార్మర్స్ అల్ఫాన్సో మ్యాంగో డే లైవ్ స్ట్రీమ్ (రైతు నుంచి వినియోగదారుడిని నేరుగా కలిపేలా), బిగ్ భారత్ డీ 2 సీ లైవ్ స్ట్రీమ్, ద ఎండ్ ఆఫ్ సీజన్ సేల్, జీరో అవర్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతోపాటు వినియోగదారులు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
దేశంలో పెరిగిపోతున్న ఘోస్ట్ మాల్స్.. ఏంటివి?
దేశంలోని ప్రధాన నగరాల్లో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరిగిపోతున్నాయి. 40 శాతం కంటే ఎక్కువగా ఖాళీలు ఉండే షాపింగ్ మాల్స్‌ను ఘోస్ట్ మాల్స్ అంటారు. అటువంటి మాల్స్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక, 'థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024' సూచిస్తోంది.నివేదిక ప్రకారం.. ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య 2023లో 64కి పెరిగింది. ఇది 2022లో 57గా ఉండేది. ఇది రిటైల్ రంగంలో ఒడిదుడుకుల ధోరణిని ప్రతిబింబిస్తోంది. 2023లో మొత్తం 13.3 మిలియన్ చదరపు అడుగుల స్థూల లీజు విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్.. 'ఘోస్ట్ షాపింగ్ సెంటర్స్'గా వర్గీకరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది గత సంవత్సరంతో పోల్చితే విస్తీర్ణంలో 58 శాతం పెరుగుదలను సూచిస్తుంది.నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ఢిల్లీలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఘోస్ట్ షాపింగ్ సెంటర్ స్టాక్‌లో 19 శాతం క్షీణత నమోదు కావడం విశేషం.విలువపై ప్రభావం:ఘోస్ట్ షాపింగ్ సెంటర్ల పెరుగుదల కారణంగా 2023లో దాదాపు రూ. 6,700 కోట్లు లేదా 798 మిలియన్ డాలర్ల విలువను కోల్పోవచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. ఇది రిటైల్ రంగంపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది. భూ యజమానులు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.దుకాణదారులకు మెరుగైన రిటైల్ అనుభవం ప్రాముఖ్యతను నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ నొక్కి చెప్పారు. "గ్రేడ్ ఏ మాల్స్ ముఖ్యంగా రాణించాయి, బలమైన ఆక్యుపెన్సీ, ఫుట్ ట్రాఫిక్, కన్వర్షన్ రేట్లను సాధిస్తున్నాయి. తద్వారా తమ వినియోగదారులకు విలువను అందిస్తున్నాయి" అన్నారు.మరోవైపు దేశవ్యప్తంగా 8 కొత్త రిటైల్ కేంద్రాలను చేర్చినప్పటికీ, 2023లో 16 షాపింగ్ కేంద్రాలు మూసివేయడంతో, టైర్1 నగరాల్లో మొత్తం షాపింగ్ కేంద్రాల సంఖ్య 263కి తగ్గింది. డెవలపర్లు నివాస లేదా వాణిజ్యపరమైన అభివృద్ధిని చేపట్టడం వంటి వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉండే, ఆదాయం లేని షాపింగ్ కేంద్రాలను కూల్చివేశారు. కొన్నింటిని శాశ్వతంగా మూసివేశారు. -
సిడ్నీ మాల్లో కత్తిపోట్లు.. అయిదుగురు మృతి
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బిజీగా ఉంటే ఓ షాపింగ్‌మాల్‌లో కాల్పులు, కత్తిపోట్ల దాడి జరిగింది. వెస్ట్‌ఫీల్డ్ బోండీ జంక్షన్‌లోని మాల్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3. 40 గంటలకు(భారత కాలమాన ప్రకారం 12.30PM ) వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మాల్‌లోకి ప్రవేశించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కత్తిపోట్లకు గురై మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కత్తిపోట్లు, కాల్పులతో దద్దరిల్లిన ఆ మాల్ నుంచి వందల సంఖ్యలో జనం పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. UPDATE: Sydney Terrorist Attack It was an 'ISLAMIC TERROR ATTACK' It's 100% confirm now. Terrorist was Pro - Palestine and Hezbollah. This Jihadi stabbed a 9 month old too. Inhuman cult !! pic.twitter.com/8Enj83dOch — Sunanda Roy 👑 (@SaffronSunanda) April 13, 2024 ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి భయానకంగానే ఉంది. మాల్లో ఉన్న వారిని అధికారులు బయటకు పంపించారు. అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్లో తిరగడం కనిపిస్తోంది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి రక్తస్రావాన్ని ఆపేందుకు దుకాణంలోని దుస్తుల్ని ఉపయోగించినట్లు చెప్పారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Officer's heroic actions at Sydney mall saved lives. Deserves highest honor, like Cross of Valour, for bravery and selflessness. #Sydney #bondi #Australia pic.twitter.com/ycdiQlom4u — Rudra 🔱 (@invincible39) April 13, 2024 -
ప్రధాని మోదీ వాటర్ గన్లకు ఆదరణ!
రంగుల పండుగ హోలీకి దేశవ్యాప్తంగా సన్నాహాలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మార్కెట్లలో పండుగ కొనుగోళ్లు జరుగుతుండగా, మరోవైపు పూలతో ఇళ్లను అలంకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, ఎంపీలతో సహా అనేక రాష్ట్రాల మార్కెట్లలో జనం మోదీ మాస్క్‌లను, వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వాతావరణానికి ఈ హోలీ వేడుకలు తోడై ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి, ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్‌గన్‌ను జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు అంతటా హోలీ సందడి కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో జనం ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో హోలీ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో వివిధ దేశాల రాయబారులు పూలతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
మాల్లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి..
కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk — Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024 -
హీరోయిన్ కాజల్‌కి చేదు అనుభవం.. అభిమాని ప్రవర్తనతో షాక్
హీరోయిన్లు షాపింగ్ మాల్స్, ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్లు అందరూ ఇలాంటి వాటిని ఫేస్ చేశారు. కాబట్టి జన సమూహం ఉండే చోట తెగ ఇబ్బంది పడుతుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రాగా, అక్కడ ఓ అభిమాని వల్ల చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్.. 2020లో గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చింది. ఇక కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టింది. 'భగవంత్ కేసరి' చిత్రంతో గతేడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చింది. ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. వాళ్లకు సెల్ఫీలు కూడా ఇచ్చింది. అందరూ బాగానే ఉన్నారు. ఓ తుంటరి అభిమాని మాత్రం కాజల్‌తో ఫొటో దిగుతూ ఆమె నడుముపై చెయ్యేశాడు. దీంతో ఆమె అవాక్కయింది. వెంటనే అతడిని బౌన్సర్లు పక్కకు లాగేశారు. గతంలో కాజల్‌కి ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా 'భ్రమయుగం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) TL spammed with thalaiviii @MsKajalAggarwal latest pictures 🥰 (Gentle Remainder: it's not her bday or years of kajal or movie release. It's just a mall launch.. feel the power of kaaj 😍)#MrsPerfect @MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/w24XyfhfBm — 𝐊𝐀𝐑𝐓𝐇𝐈𝐂𝐊 (@KarthickS_31) March 6, 2024 -
ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
'షాపింగ్ మాల్' హీరో ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు. కానీ వీళ్లలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువమంది. ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యం ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నారో అంతే ఫాస్ట్‌గా కనుమరుగైపోతారు. 'షాపింగ్ మాల్' సినిమా హీరోది కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అసలెలా ఉన్నాడనేది చూద్దాం. తమిళనాడులోని దిండిగల్ పుట్టి పెరిగిన మహేశ్.. స్వతహాగా వాలీబాల్ ప్లేయర్. ఓ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇతడిని చూసిన డైరెక్టర్ వసంతబాలన్.. తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు. కానీ తనకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేశ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మారడంతో అదే వసంతబాలన్ తీసిన 'అంగడి తెరు' మూవీలో హీరోగా నటించాడు. దీన్నే తెలుగులో 'షాపింగ్ మాల్' పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) 'షాపింగ్ మాల్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. ఆ తర్వాత మాత్రం కెరీర్‌ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తమిళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అలానే మలయాళ, ఫ్రెండ్, తెలుగులోనూ తలో చిత్రం చేశాడు. కానీ ఏం లాభం... ఒక్కటంటే ఒక్క మూవీ కూడా 'షాపింగ్ మాల్' మాదిరి హిట్ అవ్వలేదు. మనోడికి పేరు రాలేదు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సెటిలైపోయారు కానీ హీరోగా పలు సినిమాలు చేసిన మహేశ్ మాత్రం హిట్లు లేకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. సినిమాల వల్లనో ఏమో గానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత ఇతడిని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత 'షాపింగ్ మాల్' హీరో అని తెలిసి తెలుగు నెటిజన్స్ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) -
చైనాలో అగ్ని ప్రమాదం.. 39 మంది బలి
బీజింగ్/నాన్‌చాంగ్: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం ఒక దుకాణసముదాయంలో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్జిన్యూ నగరంలోని ఈ భవన సమదాయంలో ఇంకా కొందరు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక గ్జియాన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. -
Golriz Ghahraman: దొంగతనం ఉదంతంలో న్యూజిలాండ్ మహిళా ఎంపీ రాజీనామా
వెల్లింగ్టన్: దుకాణాల్లో వస్తువులు దొంగలించిందన్న ఆరోపణలపై న్యూజిలాండ్ మహిళా ఎంపీ గోలిజ్ గ్రాహమన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లోని బొటిక్, షాపింగ్‌మాల్‌లో మూడు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. షాపింగ్‌మాల్‌లో అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్, డ్రెస్‌ను ఆమె దొంగలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు దర్యాప్తు కొనసాగుతుండటంతో గోలిజ్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన చర్యకు బేషరతు క్షమాపణలు చెప్పారు. గతంలో ఆమె మానవహక్కుల కేసులు వాదించే లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి గ్రీన్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇరాన్ నుంచి వలసవచ్చి 2017 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో ఎంపీ అయిన తొలి వలస వ్యక్తిగా రికార్డులకెక్కారు. -
పెరిగిపోతున్న ప్రాధాన్యత.. దేశంలో 11 షాపింగ్ మాల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో కొత్తగా 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొత్తం విస్తీర్ణం 59.48 లక్షల చదరపు అడుగులు అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. భారతీయ మార్కెట్లోకి ప్రవేశం, విస్తరించడం కోసం రిటైలర్ల నుండి బలమైన ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందని వివరించింది. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ విధానాలను మార్చడం, సహాయక వ్యాపార వాతావరణం ఈ వృద్ధికి ఆజ్యం పోసిందని తెలిపింది. ‘ఏడు ప్రధాన నగరాల్లో ఈ మాల్స్ ఏర్పాటయ్యాయి. 2022తో పోలిస్తే గతేడాది కొత్తగా తోడైన రిటైల్ స్పేస్‌లో 72 శాతం వృద్ధి నమోదైంది. 2022లో హైదరాబాద్, పుణే, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కత నగరాల్లో నూతనంగా 34.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనమిది మాల్స్ ప్రారంభం అయ్యాయి’ అని నివేదిక తెలిపింది. హైదరాబాద్‌లోనే అధికం.. ‘గతేడాది అందుబాటులోకి వచ్చిన మాల్స్‌లో హైదరాబాద్ ఏకంగా మూడు మాల్స్‌ను సొంతం చేసుకుంది. పుణే, చెన్నై రెండు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్ ఒక్కొక్కటి చేజిక్కించుకున్నాయి. కోవిడ్ తదనంతరం ఈ నగరాల్లో ఇంత మొత్తంలో రిటైల్ స్పేస్ తోడవడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ జోరు కొనసాగుతుంది. 2019లో కొత్తగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్–ఏ, బీ–ప్లస్ మాల్స్ తెరుచుకున్నాయి. 2020–22 మధ్య ఏటా సగటున 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్పేస్ తోడైంది. కోవిడ్ తదనంతరం చాలా గ్రేడ్–ఏ మాల్స్ ఖాళీ లేక రిటైలర్లు నాణ్యమైన రిటైల్ స్థలం కొరతను ఎదుర్కొన్నారు’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వివరించింది. -
తిరుపతిలో షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ (ఫొటోలు)
-
Krithi Shetty: నెల్లూరులో షాపింగ్ మాల్ ప్రారంభించిన ఉప్పెన భామ కృతిశెట్టి (ఫొటోలు)
-
బెజవాడలో కృతీ శెట్టి.. ఎంత ముద్దుగా ఉందో! (ఫోటోలు)
-
షాపింగ్ మాల్ బుగ్గి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాజ్‌టాకీస్ రోడ్‌లోని అయ్యప్ప షాపింగ్ మాల్లో రాత్రి 11.20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన నైట్ వాచ్‌మన్ మాల్ యజమానికి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించేలోపే భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి, గాంధారి, ఇందల్వాయి, రామాయంపేట, నిజామాబాద్‌ల నుంచి ఆరు ఫైర్ ఇంజన్లను, 50 మంది సిబ్బందిని రప్పించారు. భవనం నాలుగు అంతస్తుల్లో ఉండటంతో హైదరాబాద్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్విసెస్ విభాగం నుంచి భారీ స్కై లిఫ్ట్‌ను తెప్పించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో పాటు స్కైలిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు 50 ట్యాంకర్ల నీటిని తీసుకు వచ్చి మంటలను ఆర్పారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయితే మాల్లోని దుకాణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. -
షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం.. 8 కోట్ల ఆస్తినష్టం!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.8 నుంచి 10 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. మొదటి, రెండవ అంతస్తులో ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ అసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఇదీ చదవండి: ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం? -
షాపింగ్ వైపే భారతీయుల చూపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ వేదికలు విస్తరించినప్పటికీ రిటైల్ స్టోర్లకు వెళ్లడం భారతీయులకు అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ విధానంగా నిలిచింది. ఇన్–స్టోర్ షాపింగ్ జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఉత్పత్తిని ముట్టుకోవడం, అనుభూతి చెందగల అవకాశం ఉండడమే. ఉత్పత్తుల ఖచ్చితమైన ప్రామాణికత, నాణ్యత కారణంగా ఆఫ్‌లైన్ షాపింగ్‌ను దాదాపు 54 శాతం మంది ఇష్టపడుతున్నారని డిజిటల్ రుణ సంస్థ నౌగ్రోత్ సర్వేలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25కుపైగా నగరాల్లో సుమారు 3,000 మంది వర్తకులు, కొనుగోలుదార్లు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. కుటుంబంతో షాపింగ్.. హోమ్ డెలివరీని వినియోగదార్లు కోరుకుంటున్నారు. ఇంటికి సరుకులు పంపాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారని 60 శాతం విక్రేతలు తెలిపారు. దాదాపు సగం మంది తమ స్థానిక స్టోర్లకు విధేయులుగా ఉన్నారు. ఒక కుటుంబంలోని అనేక తరాలు తరచుగా ఒకే రిటైలర్ నుండి షాపింగ్ చేయడం వల్ల విశ్వాసం, పరిచయానికి దారి తీస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి స్థానిక రిటైలర్ నుండి 35 శాతం మంది భారతీయులు షాపింగ్ చేస్తున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది కస్టమర్లు రిటైల్ స్టోర్‌లో కుటుంబ షాపింగ్ అనుభవాన్ని విలువైనదిగా భావిస్తున్నారు. పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో స్టోర్లకు వినియోగదార్లు అధికంగా వస్తున్నారు. ఫ్లాష్ సేల్స్ సమయంలో.. భారతీయ కొనుగోలుదార్లలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్ విక్రయ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేకంగా షాపింగ్ చేస్తున్నారు. 26 ఏళ్లలోపు ఉన్న జెన్–జీ కస్టమర్లలో 14 శాతం మంది పూర్తిగా ఆన్‌లైన్‌ను ఎంచుకుంటున్నారు. 43–58 మధ్య వయసున్న జెన్–ఎక్స్ వినియోగదార్లలో కేవలం 5 శాతం, 27–42 మధ్య వయసున్న మిల్లేనియల్స్లో 11 శాతం మంది ఆన్లైన్ వేదికగా షాపింగ్ చేస్తున్నారు. ఫ్లాష్ సేల్స్, ఈ–కామర్స్ కంపెనీల ద్వారా అధిక తగ్గింపులను అందించే సమయాల్లో ఆన్లైన్లో ఎక్కువ విక్రయాలు నమోదవుతున్నాయి. ఫ్లాష్ సేల్స్ సమయంలో మాత్రమే ఆన్లైన్ షాపింగ్‌ను 35 శాతం మంది ఇష్టపడుతున్నారు. ఈ–కామర్స్‌తో ముప్పు లేదు.. తమ కార్యకలాపాలకు ఈ–కామర్స్‌తో ఎటువంటి ముప్పు లేదని 80 శాతంపైగా వర్తకులు ధీమా వ్యక్తం చేశారు. ఆన్లైన్ విక్రయ వేదికలు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని 18 శాతం మంది వెల్లడించారు. భారత్‌లో ఎఫ్ఎంసీజీ, రిటైల్ అమ్మకాల్లో ఆఫ్‌లైన్ వాటా ఏకంగా 97 శాతం ఉంది. ఫుడ్, బెవరేజ్ విభాగంలో 95 శాతం, కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో ఆఫ్‌లైన్ 93 శాతం కైవసం చేసుకుంది. దాదాపు 60 శాతం మంది రిటైలర్లు భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ సహాయంతో రిటైల్ స్టోర్లపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. 70 శాతం మంది రిటైలర్లు తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి కొత్త ఔట్లెట్లను తెరవాలని యోచిస్తున్నారు. -
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
Rashi Khanna Latest HD Images: ఓరుగల్లులో సినీనటి రాశీఖన్నా సందడి (ఫోటోలు)
-
Anu Emmanuel: వికారాబాద్ లో సినీ తార అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫోటోలు)
-
ఖమ్మంలో షాపింగ్ మాల్ ప్రారంభించిన రీతూ వర్మ (ఫొటోలు)
-
నంద్యాలలో జీవీ మాల్ ప్రారంభించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
చీట్ ఆఫ్ ది డే! దొంగ డీల్స్!
పండగలు రాబోతున్నాయి. ఇంటిల్లిపాదికి బట్టలు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలన్న ప్లాన్‌లో ఉంది రోజా. ఆన్లైన్ షాపింగ్ అయితే సులువైన పని అనుకుంటూనే వాటిలోని ఆఫర్లను చెక్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వస్తువుల అమ్మకాలలో ఇచ్చే డీల్స్ చూస్తోంది. అనుకున్న బ్రాండ్‌లో ఓ ఫోన్ డీల్ కనపడింది. అత్యంత తక్కువ ధరకే వస్తోంది, నిమిషాల్లోనే ఆ డీల్ ముగుస్తుంది. అందుకే వెంటనే క్లిక్ చేసింది. అక్కడ నుంచి పోర్టల్‌లోకి వెళ్లడం, ఫోన్ బుక్ చేయడం చకచకా జరిగిపోయాయి. అమౌంట్ డెబిట్ అయ్యింది. కానీ, వస్తువు బుక్ అయినట్టుగా చూపించడం లేదు. ఆ తర్వాత చెల్లించిన డబ్బు గురించి ప్రయత్నించింది. కానీ, ఆ డబ్బు తిరిగి తన అకౌంట్లోకి రాలేదు. ఆన్లైన్లో నకిలీ పండగ ఆఫర్ మోసాలు అధికంగా జరుగుతుంటాయి. వాటిలో... ప్రీ డెలివరీ నోటిఫికేషన్ స్కామ్, ఫేక్ షాపింగ్ సైట్లు, ఫేక్ గిఫ్ట్ కార్డులు, వోచర్లు, కూపన్లు, ఫేక్ స్వచ్ఛంద సంస్థలు, ఫేక్ ప్రయాణ ఆఫర్లు ఉంటాయి. ఇవన్నీ. డీల్ ఆఫ్ ది డే, ఆఫర్స్ అంటూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. తక్కువ ధరకు వస్తువులు, సేవలు లభిస్తాయన్న మన ఆశ స్కామర్ల చేతికి చిక్కేలా చేస్తుంది. నకిలీ షాపింగ్ సైట్లను గుర్తించడానికి సులభమైన మార్గాలు యుఆర్ఎల్ ప్రక్కన ప్యాడ్‌లాక్ ఉన్న //http చెక్ చేయడం ద్వారా సైట్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవచ్చు. సైట్ యుఆర్ఎల్ సందేహంగా నిజమైన రిటైలర్ అధికారిక చిరునామాకు దగ్గరగా ఉండి, కొన్ని అక్షరాలలో తేడా ఉండటం మరొక సంకేతం. బ్రౌజ్ చేస్తున్నప్పుడు రిటైలర్ యుఆర్‌ఎల్‌ని మాన్యువల్‌గా టైప్ చేయడం ద్వారా నకిలీ డొమైన్లను అడ్డుకోవచ్చు. ఇ–మెయిల్, టెక్ట్స్ లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా షార్ట్ లింక్స్ వస్తుంటాయి. మీ ఆర్డర్ గురించి మీకు సందేహాలు ఉంటే ఆన్లైన్లో అమ్మకందారు ఏరియా చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్‌ను నిర్ధారించుకోవాలి. సైట్లో కస్టమర్ సర్వీస్, సంప్రదింపు వివరాలు లేనట్లయితే సందేహించాలి. మీరు షాపింగ్ స్కామ్‌కు గురైతే... వెంటనే మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫిర్యాదు చేయాలి. స్కామర్ మీ అకౌంట్స్‌కి యాక్సెస్ తీసుకున్నట్లు వారికి తెలియజేయాలి. మీ బ్యాంక్ అకౌంట్‌పై కంట్రోల్‌కి ఆన్లైన్ పాస్‌వర్డ్‌లను మార్చండి. రెండు కారకాల ప్రమాణీకరణను (2ఊఅ)ని పాటించాలి. ∙అనుమానిత సైట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసినట్లయితే, స్కామర్లు ఇన్స్టాల్ చేసిన మాల్వేర్, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ కోసం మీ పరికరాలను స్కాన్ చేయడానికి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. మీరు ఇంతకు ముందెన్నడూ ఆర్డర్ చేయని సైట్‌ని సందర్శిస్తున్నట్లయితే, వెబ్‌సైట్‌లోని ‘అబౌట్’ సెక్షన్‌ని చెక్ చేయాలి. వెబ్సైట్ ఎంత పాతదో దానితోపాటు కొన్ని కస్టమర్ రివ్యూలను చూడాలి. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు స్కామ్‌కు గురైనట్లయితే వెంటనే పోలీసు రిపోర్ట్ ఫైల్ చేయాలి. https://cybercrime.gov.in/ కూ రిపోర్ట్ చేయచ్చు. --అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!) -
చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి
నందిపేట్ (ఆర్మూర్): తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్‌ని తెరిచే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూర్ రాజశేఖర్ భార్య, కూతురు రిషిత (4)తో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్‌లోకి సరుకులు కొనేందుకు వెళ్లారు. రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా పక్కనే ఐస్‌క్రీంలు ఉన్న ఫ్రిడ్జ్‌ని తెరిచేందుకు రిషిత ప్రయత్నించింది. ఫ్రిడ్జ్‌కి కరెంట్ సరఫరా కావడంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. ఫ్రిడ్జికి అలాగే అంటుకుని కొన్ని సెకన్లపాటు వేలాడింది. గమనించిన తండ్రి పాపను తీసుకుని స్థానిక ఆస్పత్రికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..: షాపింగ్‌మాల్ యజమానుల నిర్లక్ష్యం వల్లే రిషిత మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాల్ ఎదురుగా రోడ్డుపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలుపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, మాల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
నేడు ‘లులు’ మాల్ ప్రారంభం
కూకట్పల్లి: ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షాపింగ్ మాల్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు ‘లులు’ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అ్రషఫ్ అలీ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్‌ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ లులు మాల్‌ను మొదటి విడతలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. మరో రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో లులు మాల్‌ను తీర్చిదిద్దుతామని అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వివరించారు. భారతదేశంలో కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో కోయంబత్తూరులలో ఇప్పటికే లులు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మాల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన షాపింగ్ ఔట్లెట్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్స్‌తో సినిమా హాళ్లు, ఫుడ్ కోర్టు, పిల్లల వినోద కేంద్రం ఉంటాయని తెలిపారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆనంద్ ఏవీ. నిషద్ ఎంఎ, వి.నందకుమార్, షిబు ఫిలిప్స్, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రెజిత్ రాధాకృష్ణన్, అబ్దుల్ సలీం, ఇ.అష్రన్, నౌషద్ కిజక్కుప్పరల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ + ఆఫ్‌లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్మోబీ -
శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. #WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr — ANI (@ANI) August 30, 2023 -
విమానంలో వచ్చి.. చీరల చోరీ
బనశంకరి: విమానంలో వచ్చి బెంగళూరులో దిగుతారు. వస్త్ర దుకాణాల్లో షాపింగ్ పేరుతో ఖరీదైన చీరలను చోరీ చేసి వచ్చిన దారినే వెళతారు. ఇటువంటి ఖతర్నాక్ కిలేడీ ముఠాను ఆదివారం అశోక్‌నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన రమణి, రత్నాలు, చుక్కమ్మ. వీరు ఏపీ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి స్కార్పియో కారులో బెంగళూరులో సంచరించేవారు. ఇలా చీరల తస్కరణ చీరల దుకాణాల్లో కొనుగోలు చేసే నెపంతో సిబ్బంది కళ్లుగప్పి విలువైన చీరలను మాయం చేయడంలో ఆరితేరినవారని పోలీసులు తెలిపారు. శ్రీమంతుల తరహాలో ఒంటినిండా బంగారు నగలు ధరించి షాపులకు వెళ్లి లక్షల విలువైన చీరలను చూపించాలని సిబ్బందిని అడిగేవారు. మరిన్ని చీరలను చూపించాలని కోరేవారు, చీరలను తేవడానికి సిబ్బంది షాపు లోపల స్టోర్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో కిలేడీలు చీరలు బండిల్స్‌ను దాచుకుని అక్కడ నుంచి వెళ్లిపోయేవారు. ఇలా వెళ్తున్న ఓ మహిళ కాలి వద్ద చీర ఉన్నట్లు షాపు సెక్యూరిటీ గమనించి యజమానికి తెలిపాడు, తరువాత సీసీ కెమెరాలు పరిశీలించగా మహిళల లాఘవం వెలుగులోకి వచ్చింది. ఫుటేజీలతో సహా అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఆదివారం లేడీ గ్యాంగ్ ను అరెస్ట్‌చేసిన అశోకనగర పోలీసులు వీరి వద్ద నుంచి రూ.14 లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్‌కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్‌గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్‌కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్‌లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్‌లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!
నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం) తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్‌మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
బంపర్ ఆఫర్.. ఈ కెడ్రిట్ కార్డ్ ఉండే 10% క్యాష్‌బ్యాక్, ఇంకా బోలెడు బెనిఫిట్స్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ, ప్రైవేట్‌రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్‌పై ఈ కార్డు పనిచేయనున్నట్లు తెలిపింది. స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. అంతేకాకుండా ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. బెనిఫిట్స్ ఇవే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్విగ్గీ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ మరియు మరిన్నింటిలో ఖర్చులపై 10% క్యాష్‌బ్యాక్‌తో సహా అనేక రకాల ప్రయోజనాలను ఈ కార్డుదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్ పేమెంట్, యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, ఇన్సురెన్స్, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్ బ్యాక్ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్‌బ్యాక్ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్బ్యాక్కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్‌బ్యాక్‌కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మఈజీ, బుక్‌మైషో ఇంకా మరెన్నో ప్లాట్‌ఫారమ్‌లలో షాపింగ్ చేయడంపై కార్డ్ హోల్డర్లు 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందుకుంటారు. ఈ అదనపు 5% క్యాష్‌బ్యాక్ ప్రయోజనం Nike, H&M, Adidas, Zara మొదలైన బ్రాండెడ్ వెబ్సైట్లకు కూడా వర్తిస్తుంది.ఇంకా, కస్టమర్లు ఇతర ఖర్చులపై 1% తిరిగి పొందుతారు. కార్డ్ హోల్డర్లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్‌బ్యాక్ పొందుతారు. వీటిని వివిధ లావాదేవీల కోసం స్విగ్గీ అంతటా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు 3-నెలల కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌ను పొందగలరు. ఇది ఫుడ్, కిరాణా, డైనింగ్ అవుట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్‌లలో ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ పొందడంతో పాటు, స్విగ్గీ, HDFC కార్డ్ హోల్డర్లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్‌లతో పాటు మరిన్ని వంటి ప్రపంచ స్థాయి మాస్టర్‌కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్విగ్గీ యాప్‌లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు స్విగ్గి యాప్ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే? -
విషాదం.. నాలుగు రోజుల్లో కుమారుడి జన్మదినం..
నల్గొండ: తమ కుమారుడి మొదటి జన్మదిన వేడుకలకు సంబంధించిన సామగ్రి కొనుగోలు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. అక్కడే సామగ్రి ఖరీదు చేస్తుండగా తల్లి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మార్కండేయనగర్ కాలనీకి చెందిన గోశిక ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండకు చెందిన స్వాతి(30)తో వివాహం జరిగింది. వీరికి కుమార్తె స్వీటి(05), కుమారుడు విబ్బు ఉన్నారు. వీరు ప్రస్తుతం ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 25న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకుగాను ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. ప్రస్తుతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాపింగ్ చేస్తుండగా స్వాతి అకస్మాత్తుగా కిందపడిపోయింది. అక్కడే ఉన్న భర్త ప్రవీణ్, కుటుంబ సభ్యులు కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. దీంతో చిన్నారులు తల్లిలేని వారయ్యారు. కుమారుడి జన్మదిన వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తూ గుండెపోటుకు గురై తల్లి మృతిచెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఇదిలా ఉండగా శనివారం దైవ దర్శనం నిమిత్తం శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలోనే ఇలా జరిగింది. -
విశాఖ సిగలో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్‌గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది. మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది. డీఎఫ్బీవోటీ పద్ధతిలో..! వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది. అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీఎఫ్బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌మాల్.. ఎక్కడో తెలుసా!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. చైనాలోని గువాంగ్డాంగ్ ప్రావిన్స్ డోంగువాన్ నగరంలో ఉన్న ఈ మాల్ పేరు ‘న్యూ సౌత్ చైనా మాల్’. దీనిని 2005లో ప్రారంభించారు. మొత్తం 96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. దీనిలోని దుకాణాల విస్తీర్ణమే 71 లక్షల చదరపు అడుగులు. తొలి పదేళ్లు ఈ మాల్ దాదాపు 99 శాతం ఖాళీగానే ఉండేది. నిర్మాణంలో మార్పులు చేపట్టాక 2018 నుంచి దీని పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇందులో ఐమాక్స్ థియేటర్లు, విశాలమైన పిల్లల ఆటస్థలం చూడటానికే ఎక్కువమంది వస్తుంటారు. ఈ మాల్లోని ఏడు జోన్లను ప్రపంచంలోని ఏడు అంతర్జాతీయ ప్రాంతాల శైలిలో నిర్మించడం విశేషం. చదవండి: ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే! -
ప్రకాశం: షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం.. 2కోట్ల నష్టం!
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దర్శి పట్టణంలోని అభి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల ప్రకారం.. నగరంలోని అభి షాపింగ్ మాల్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగి ఎగిసిపడుతున్నాయి. ఇక, అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లు అక్కడకి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఫైర్ సిబ్బంది గంటకు పైగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్ మాల్లోని బట్టలు దగ్దమయ్యాయి. దీంతో, దాదాపు 2కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి -
మెగా విద్వేష షాపింగ్ మాల్: నడ్డా
న్యూఢిల్లీ: ప్రేమ దుకాణం పేరిట రాహుల్ మెగా విద్వేష షాపింగ్ మాల్ తెరిచారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అభివృద్ధిని ప్రపంచమే గుర్తించింది. దాన్ని యువరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు సర్జికల్ స్రైక్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. హిందువులు, ముస్లింలను విడదీయడంపై మాట్లాడుతారు. సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ప్రేమ దుకాణం నడుపుతున్నానంటూ చెప్పుకుంటుంటారు. నిజానికది మెగా విద్వేష షాపింగ్ మాల్’’ అన్నారు. -
అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి
నేరేడుచర్ల/హుడా కాంప్లెక్స్ (హైదరాబాద్): అమెరికాలోని టెక్సాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాటికొండ ఐశ్వర్య (27) మృతి చెందింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె.. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. కొన్ని నెలల కిందే అక్కడ ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. షాపింగ్ కోసమని వెళ్లి..: ఐశ్వర్య కుటుంబం స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల. తాత రామనర్సింహారెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశారు. తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఆర్థిక వివాదాల పరిష్కారాల కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే హైదరా బాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సరూర్‌నగర్ హుడాకాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. 2019 జనవరిలో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. టెక్సాస్ వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశాక.. అక్కడే పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున) టెక్సాస్‌లోని డాలస్‌లో ఓ ఫ్రెండ్‌తో కలసి షాపింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో షాపింగ్ మాల్‌లోకి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. కాల్పుల్లో ఐశ్వర్య ముఖం ఛిద్రం కావడంతో తొలుత ఆమె ఎవరనేది తెలియలేదు. పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యను గుర్తించి సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు మూడు రోజులు పట్టవచ్చని ఆమె సోదరుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు.. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా? అల్లారుముద్దుగా చూసుకున్న ఐశ్వర్య ఇక లేదనే విషయం తెలిసి ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొన్ని నెలల కిందే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిన ఆమెను గుర్తు చేసుకుంటూ తండ్రి తాటికొండ నర్సిరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ‘‘నన్ను, అమ్మను వెంట తీసుకెళతానంది. తనతోపాటు నేను కూడా అక్కడే ఉండాలన్నది. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా?’’ అంటూ ఆయన తీవ్రంగా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. (చదవండి : అమెరికాలో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?) రోజూ ఫోన్ చేసి మాట్లాడేదని, వేళకు మందులు వేసుకోవాలని చెప్పేదని, ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమైందంటూ ఐశ్వర్య తల్లి విలపించింది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తన మనవరాలు దుండగుడి కాల్పుల్లో మృతిచెందడం దురదృష్టకరమని ఐశ్వర్య తాత తాటికొండ రామనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి -
HYD: షాపింగ్ మాల్స్‌లో ఐటీ సోదాలు.. కస్టమర్లకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల సెర్చ్ వారెంట్‌తో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని వరమహాలక్ష్మీలో ఐటీ అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. ఇక, సోదాల సందర్బంగా సంస్థ ఇప్పటి వరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ పోలీసులు.. కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. ఫిలిం నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కళామందిర్ గ్రూప్స్, వరమహాలక్ష్మీ, కేఎల్ఎం, కాంచీపురం అనుబంధ వ్యాపార సంస్థల లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు -
హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
హైదరాబాద్: నగరంలో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్,గచ్చిబౌలి తదితర ప్రాంతల్లో ఐటీ విభాగం సోదాలు చేస్తోంది. ప్రధానంగా వస్త్ర వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కళామందిర్, వరమహాలక్ష్మీ, కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారుల ఇళ్లుతో పాటు వారి షోరూమ్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షాపింగ్ మాల్ ఆపరేటర్ల ఆదాయం 7-9 శాతం అధికం కానుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. కోవిడ్ ముందస్తు కాలం 2019-20 ఆదాయంలో ఇది 125 శాతానికి సమానమని వివరించింది. రిటైల్ విక్రయాలు బలంగా ఉండడం, అద్దెలు పెరగడం ఈ వృద్ధికి కారణమని తెలిపింది. (డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు) ‘ప్రయాణ నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత సామాజికంగా సాధారణ స్థితికి రావడంతో 2022-23లో మాల్స్‌కు కస్టమర్ల రాకలో గణనీయమైన వృద్ధికి దారితీసింది. రాబడి 60 శాతం పెరిగి కోవిడ్ ముందస్తు స్థాయి ఆదాయంలో ఇది 116 శాతానికి చేరుకుంది. అధిక ఆక్యుపెన్సీ స్థాయిలు, వ్యయ నియంత్రణ చర్యలు, బలమైన బ్యాలెన్స్ షీట్ల మద్దతుతో ఘనమైన లాభదాయకత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్ ఆపరేటర్ల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 2022–23లో లీజింగ్ రేటు చదరపు అడుగుకు 12–14 శాతం దూసుకెళ్లింది’ అని వివరించింది. పుంజుకునే అవకాశం.. ఈ రంగంలో ఆరోగ్యకర పనితీరును పరిగణనలోకి తీసుకుంటే మూలధన వ్యయం మధ్యస్థ కాలానికి దగ్గరలో పుంజుకునే అవకాశం ఉంది. ఇందులో గణనీయమైన భాగం ప్రపంచ పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ ద్వారా సమకూరవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ప్రభావం, గతంలో రెపో రేటు పెంపుదలతో వెనుకబడిన ప్రభావం రిటైల్ అమ్మకాలతో సహా విచక్షణతో కూడిన వ్యయాన్ని తగ్గించగలదని క్రిసిల్ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) క్రిసిల్ రేటింగ్స్ దేశవ్యాప్తంగా 28 మాల్స్‌ను విశ్లేషించింది. ఇవి 17 నగరాల్లో 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజుకు స్థలాన్ని కలిగి ఉన్నాయి. వీటికి మొత్తం రూ.8,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. సాధారణంగా మాల్ ఆపరేటర్లు లీజు ఒప్పందాల ప్రకారం తమ ఆదాయంలో దాదాపు 85 శాతాన్ని కనీస హామీ అద్దెల నుండి సమకూర్చుకుంటారు. మిగిలినది అద్దెదారుల ఆదాయ పని తీరుతో ముడిపడి ఉంటుంది. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) -
Sreeleela : హైదరాబాద్ ఏ ఎస్ రావునగర్ నగర్ లో శ్రీలీల సందడి ( ఫొటోలు)
-
కార్లలో వచ్చి చోరి.. కథ అడ్డం తిరగడంతో యజమానికి ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొనుగోలుదారుల్లా వచ్చి.. మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్‌లేని స్కారి్పయో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు. వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్‌ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కారి్పయో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కారి్మకుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు. మొదటిసారి దొంగతనం చేశామని.. వైరల్‌గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్‌లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు. -
మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్
దసరా, దీపావళి, న్యూ ఇయర్.. ఇలా పండుగలు వస్తున్నాయంటే చాలు.. షాపింగ్ జోరు మొదలైపోతుంది. ఆఫ్‌లైన్ అయిన ఆన్లైన్ అయినా.. మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాల్సిందే. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించేస్తాయి. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎయిర్ టికెట్స్ వరకూ భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి పలు దిగ్గజ కంపెనీలు. వరల్డ్ టాప్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఈ నెల 15 నుంచి 20 వరకూ రిపబ్లిక్ డే మెగా సేల్స్ నిర్వహించింది. మొబైల్స్, స్మార్ట్ వాచెస్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చింది. ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. కేవలం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్సే కాదు.. ఆఫ్లైన్లోనూ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అంటూ భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. టూ విలర్ కొనుగోలుదారులకు రూ.5 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది బజాజ్ సంస్థ. అంతేకాదు.. వినియోగదారులకు సులభ వాయిదాలు కూడా అందిస్తోంది. విజయ్ సేల్స్ కూడా మెగా రిపబ్లిక్ డే సేల్ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తోంది. గాడ్జెట్స్, గృహోపకరణాలు వంటి వస్తువులపై 65 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటున్నారా..? అయితే.. ఇదే మంచి సమయం.. మా షోరూంలో భారీ డిస్కౌంట్స్ లభిస్తాయంటూ రిపబ్లిక్ సేల్స్‌ను ప్రారంభించింది క్రోమా సంస్థ. ఈ నెల 29 వరకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ కొనుగోళ్లపై ఆఫర్స్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్స్ కేవలం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్కు మాత్రమే పరిమితం కాలేదు. దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, గో ఆసియా సైతం.. టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా కేవలం రూ.1705 రూపాయలకే టికెట్లు విక్రయించింది. డొమెస్టిక్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.1199లకు.. ఇంటర్నేషనల్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.6599లకు అందిస్తోంది గో ఆసియా ఎయిర్ లైన్స్. జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని మెగా సేల్స్, క్లియరెన్స్ సేల్స్ అంటూ భారీ డిస్కౌంట్లు ప్రకటించే సంస్కృతి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. అమెరికా ఇండిపెండెన్స్ డే అయిన జూలై 4 వచ్చిందంటే.. అక్కడ షాపింగ్ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోనూ మొదలైపోయింది. రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. -
అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కవర్లా?
కాబూల్: 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచక పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాస్తోంది. వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తూ అణగదొక్కుతోంది. అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోకుండా నిషేధం విధించింది. జిమ్‌లు, పార్కులకు వెళ్లకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా తాలిబన్లు తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పటివరకు అమ్మాయిలపై ఆంక్షలు విధించిన తాలిబన్ సర్కార్.. తాజాగా ఆడ బొమ్మలపై కూడా వివక్ష చూపుతోంది. వస్త్ర దుకాణాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే అమ్మాయిల బొమ్మల మొహాలు కన్పించొద్దని ఆదేశించింది. ఈ మేరకు దుకాణ యజమానులకు హుకుం జారీ చేసింది. దీంతో షాపింగ్ మాల్స్‌లోని అమ్మాయిల బొమ్మల మొహాలకు వస్త్రం లేదా పాలిథీన్ కవర్లను కట్టారు యజమానులు. ఆడ బొమ్మల మొహాలు కన్పించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్ల నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొదట అసలు షాపింగ్ మాల్స్‌లో అమ్మాయిల బొమ్మలను పూర్తిగా తొలగించాలని, లేదా వాళ్ల మొహాలను తీసేయాలని తాలిబన్లు ఆదేశించారని దుకాణ యజమానులు వాపోయారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని మొహాలు కన్పించకుండా కవర్లు చుట్టాలని చెప్పారని వివరించారు. దీంతో తాము కొన్ని బొమ్మలకు వాటి దస్తులకు మ్యాచ్ అయ్యే వస్త్రాన్ని కట్టామని, మరి కొన్నింటింకి స్కార్ఫ్, లేదా పాలిథీన్ కవర్లు చుట్టామని చెబుతున్నారు. షాపింగ్ మాల్స్‌లో ఆడ బొమ్మల మొహాలకు కవర్లు చుట్టిన ఫొటోలను అఫ్గాన్ మానవతావాది సారా వాహేది ట్విట్టర్లో షేర్ చేయగా.. అవి కాసేపట్లోనే వైరల్‌గా మారాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల జీవితం ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు ఈ ఫొటోలే నిదర్శనమని ఆమె అన్నారు. ఇది అత్యంత బాధాకరం అని ఓ నెటిజన్ స్పందించాడు. తాలిబన్లు నీచులంటూ మరొకరు మండిపడ్డారు. The Taliban’s hatred of women extends beyond the living. It is now mandatory for store owners to cover the faces of mannequins. These dystopian images are a sign of how much worse life is going to become for Afghan women if the world doesn’t stand with them. pic.twitter.com/p2p0b0QGRR — Sara Wahedi (@SaraWahedi) January 18, 2023 చదవండి: సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా -
బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
-
Viral: బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!
మనకు ఏమైనా వస్తువు కావాలంటే షాప్‌లోకి వెళ్లి తెచ్చుకుంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మాల్‌కు వెళ్లి సెలెక్ట్ చేసుకొని మరీ కొనుక్కుంటాం. మరి జంతువులకు కూడా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాయి. వాటికి కూడా షాపింగ్ చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే ఓ ఆవుకి వచ్చింది. స్టైలిష్ బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలనిపించిందేమో.. అనుకున్నదే తడువుగా బట్టల షాప్‌లోకి వెళ్లి షాపింగ్ చేసింది. అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగానే అనిపించినా సరిగ్గా ఇలాంటి ఓ సరదా ఘటనే అస్సాంలో గత వారం చోటుచేసుకుంది. ధుబ్రి ప్రాంతంలో దారి తప్పిందో ఏమో గానీ ఓ ఆవు బట్టల షాప్‌లోకి ప్రవేశించింది. స్టోర్ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. షాప్‌లో ఆవు తిరుగుతుంటే అక్కడున్న సిబ్బంది, షాపింగ్ చేస్తున్న మిగతా జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. చివరికి దానంతట అదే బయటకు వెళ్లిపోయింది. అక్కడున్న కొంతమంది ఈ తతంగాన్ని ఫోన్లో వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆవు వాలకం చూస్తుంటే నిజంగా షాపింగ్ చేయడానికి వచ్చిన్నట్లే అనిపిస్తుంది. తనకు సంబంధించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయా అనుకుంటూ అచ్చం కస్టమర్లాగే స్టోర్ మొత్తం షికారు చేసింది. చివరికి ఏవి నచ్చకపోవడంతో నిరుత్సాహ చెందింది. అంతేగాక.. బట్టల షాప్ వాళ్లు డబ్బులు అడగంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే భావిస్తూ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1 — Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022 -
విషాదం: షాపింగ్ మాల్లో తొక్కిసలాట.. 9 మంది మృతి
కంపాలా: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కోసం షాపింగ్‌కి వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో ఆదివారం జరిగింది. దేశ రాజధాని కంపాలా ప్రాంతంలోని ఫ్రీడమ్ సిటీ షాపింగ్ మాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో వినియోగదారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. ఫ్రీడమ్ సిటీలో ఏర్పాటు చేసిన బాణసంచా కొనుగోలు చేసేందుకు భారీగా జనం ఎకబడడంతో తొక్కిసలాట జరిగినట్లు మీడియా పేర్కొంది. దీంతో షాపింగ్ కోసం వచ్చిన పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్‌లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది. బూగీ బీ షాపింగ్‌కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 43 ఏళ్ల బూగీ బీ.. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్ ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
విజయవాడ: వస్త్ర దుకాణంలో బిగ్‌బాస్ ఫేం అరియానా సందడి (ఫొటోలు)
-
ఈఎంఐ, రుణంపై షాపింగ్
హైదరాబాద్: దేశవాసుల్లో సగానికి సగం మంది షాపింగ్‌ను ఈఎంఐ కార్డుపై లేదంటే రుణంపై చే యడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు హోమ్ క్రెడిట్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ వినియోగదారు ధోరణలుపై సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది. ► 25 శాతం మంది క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తామని చెప్పారు. ► బీఎన్‌పీఎల్ తదితర నూతనతరం సాధనాల ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తామని చెప్పిన వారు 10 శాతంలోపు ఉన్నారు. ► 60 శాతం మంది ఎంబెడెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి చూపించారు. అంటే ఈ కామర్స్ సంస్థలే కొనుగోలు మొత్తాన్ని రుణ ఈఎంఐలుగా బదిలీ చేస్తా యి. ► 52 శాతం మంది హైదరాబాదీలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఆర్థిక నిర్వహణ) పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ► ఆన్లైన్ షాపింగ్‌కు ఎంబెడెడ్ ఫైనాన్స్, ఈఎంఐ సాధనాల వినియోగం పట్ల హైదరబాదీలు తక్కువ ఆసక్తి చూపించారు. ► ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆర్థిక అంశాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ► 54 శాతం మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంటే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నట్టు చెప్పారు. ► ఫిన్‌టెక్ వృద్ధి పట్ల 49 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. ► టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో మూడొంతులు మంది జెనరేషన్ జెడ్/మిలీనియల్స్ డిజిటల్ లెండింగ్ (ఆన్లైన్ రుణ సదుపాయాలు) సేవల పట్ల సానుకూలంగా ఉన్నారు. ► దేశవ్యాప్తంగా 16 పట్టణాలకు చెందిన 1,600 మంది హోమ్ క్రెడిట్ కస్టమర్ల అభిప్రాయాను ఈ సర్వే కోసం తెలుసుకున్నారు. ► కరోనా అనంతరం ఆర్థిక అక్షరాస్యత కీలకమైన చర్చనీయాంశంగా మారినట్టు, దేశవ్యాప్తంగా 40 శాతం మంది ఆర్థిక అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపిస్తున్నట్టు హోమ్ క్రెడిట్ ఇండియా తెలిపింది. -
విశాఖలో సందడి చేసిన హీరోయిన్ రాశీఖన్నా (ఫొటోలు)
-
19 ఎకరాలు.. దేశంలోనే పెద్ద మాల్.. ఎక్కడో తెలుసా!
దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అందుబాటులోకి వచ్చింది. షాపింగ్ మాల్స్ అభివృద్ధి, నిర్వహణలో ఉన్న ఫీనిక్స్ మిల్స్ దీనిని ఏర్పాటు చేసింది. 19 ఎకరాల్లో ఫీనిక్స్ సిటాడెల్ మాల్ కొలువుదీరింది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.800 కోట్లు ఖర్చు చేసింది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ జేవీ ద్వారా ఫినిక్స్ మిల్స్ ఈ మాల్‌ను అభివృద్ధి చేసింది. మాల్లోని ప్రధాన భవనం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 300 షాప్స్ ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది ఈ దుకాణాలు రూ.1,000 కోట్ల వ్యాపారం చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. చదవండి: NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్లకు భారీ ఊరట.. -
నకిలీ వస్త్రాలతో అడ్డంగా దొరికిన షాపింగ్ మాల్ యాజమాన్యం..
-
మెటావర్స్‌లో అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ కామర్స్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ ఫ్లిప్‌వెర్స్ అనే మెటావర్స్ వర్చువల్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్లు (ఇవాళే) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ డీఏఓ (eDAO)తో చేతులు కలిపింది. ప్రస్తుతం, ఈ ఫ్లిప్‌వెర్స్ ప్రారంభ దశలో ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్వర్స్తో ఏం చేయొచ్చు ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ఇ-కామర్స్ ప్రపంచాన్ని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు దారుల్ని ఆకర్షించేలా వారికి కొత్త షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. మరో మాటలో చెప్పాలంటే, ఉదాహరణకు యూట్యూబ్‌లో ‘ఫిల్మీమోజీ’ అనే తెలుగు వీడియోస్‌ను చూసే ఉంటారు. ఐఫోన్లో మెమోజీ అనే ఫీచర్‌ను ఉపయోగించి ఇందులో పాత్రలను రూపొందించారు. వీటితో మనుషుల పోలిన అవతారాలను సృష్టించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కూడా అంతే. ఈ ఫ్లిప్వెర్స్లో మీకు నచ్చిన ప్రొడక్ట్‌ను అలా తయారు చేసి డిస్ప్లేలో పెడుతుంది. మెటావర్స్ సాయంతో డిస్ప్లేలో ఉన్న ప్రొడక్ట్‌ను సెలక్ట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తుంది ఫ్లిప్‌వెర్స్ ఈవెంట్ లాంచ్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ..తాము ముందే చెప్పినట్లుగా ..ఫ్లిప్వర్స్ చాలా ప్రత్యేకం. మెటావర్స్ అవతార్ల రూపంలో వర్చువల్ రియాలిటీతో వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. అలాగే, వర్చువల్ షాపింగ్ ద్వారా కొనుగోలు దారులకు నచ్చిన ప్రొడక్ట్‌ను చెక్ చేసుకునే సదుపాయం కల్పిస్తుందని పేర్కొన్నారు. -
షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో షాపింగ్స్ మాల్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. 2020 నుంచి 8 ప్రధాన పట్టణాల్లో 16 కొత్త మాల్స్ తెరుచుకున్నాయి. కరోనా వంటి ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లు ఉన్నా కానీ.. కొత్త మాల్స్ రూపంలో 15.5 మిలియన్ చదరపు అడుగులు వాణిజ్య స్థలం గత 30 నెలల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2022’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2019 డిసెంబర్ నాటికి దేశంలోని హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలో 255 మాల్స్, వీటి నుంచి స్థూల లీజు విస్తీర్ణం 77.4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులో ఉంది. 2022 జూన్ నాటికి భారత్‌లో మొత్తం 92.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం, 271 మాల్స్రూపంలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. గ్రేడ్ ఏ మాల్స్‌కు డిమాండ్.. దేశ రాజధాని ప్రాంతంలో అత్యధికంగా 34 శాతం షాపింగ్ మాల్ విస్తీర్ణం ఏర్పాటై ఉంది. ముంబై 18 శాతం, బెంగళూరు 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. ‘‘రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త పరిపక్వత దశకు చేరుకుంది. చిన్న సైజు నుంచి గ్రేడ్ ఏ మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ మాల్స్‌లో95 శాతం లీజు స్థలం నిండి ఉంది. నాణ్యమైన రియల్ ఎస్టేట్‌కు డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. డెవలపర్ల నుంచి నాణ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి అవసరం’’అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం.. పెట్టుబడులకు, రీట్లకు గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో 39 శాతం విస్తీర్ణం గ్రేడ్ ఏ పరిధిలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది. వీటి పరిధిలో స్థూల లీజు విస్తీర్ణం 36 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. టాప్–8 పట్టణాల్లో మొత్తం గ్రేడ్ ఏ మాల్స్ 52 ఉన్నాయి. గ్రేడ్ బీ కేటగిరీలో 94 మాల్స్ ఉండగా, 29.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు అందుబాటులో ఉంది. గ్రేడ్ సీ పరిధిలో 125 మాల్స్ 27.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి. -
మహబూబ్‌నగర్‌లో సందడి చేసిన కృతిశెట్టి (ఫొటోలు)
-
CBRE India: ఆకర్షించేలా ఉంటేనే మాల్స్‌కి మనుగడ
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, ఇతరత్రా రిటైల్ స్టోర్స్.. కస్టమర్లను ఆకట్టుకునేలా విశిష్టమైన అనుభూతిని అందించగలిగితేనే మనుగడ సాగించగలవని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ సీబీఆర్ఈ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ‘భౌతిక రిటైల్ స్టోర్స్‌కి వెడితే బాగుంటుందని కోరుకునేలా ఉండాలే తప్ప .. ఏదో అవసరార్ధం వెళ్లక తప్పదనే విధంగా ఉండకూడదు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటేనే రిటైల్ స్టోర్స్ విజయవంతం కాగలవు‘ అని సంస్థ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టే కొద్దీ రిటైల్ స్టోర్స్, వినోద కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. 2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) రిటైల్ రంగం గణనీయంగా కోలుకుంది. మొత్తం మీద 2022 ప్రథమార్ధంలో (జనవరి–జూన్) 160 శాతం పైగా వృద్ధి (గతేడాదితో పోలిస్తే) నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ రంగంలో సంస్థలు కస్టమర్లకు భౌతికంగా అనుభూతిని ఎంత మేర మెరుగుపర్చగలమనే అంశంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. స్టోర్ ఫార్మాట్లు, పనితీరులో వైవిధ్యం పాటించడం, ప్రాంతాన్ని బట్టి వ్యూహాలు రూపొందించేందుకు డేటా సైన్స్‌ను ఉపయోగించుకోవడం, వ్యక్తిగతంగా మెరుగైన అనుభూతిని సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు బ్రాండ్లు తమ భౌతిక స్టోర్ల వ్యూహాలను సవరించుకుంటున్నాయని, ప్రత్యేక ’అనుభూతి’ని కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని చంద్నానీ తెలిపారు. -
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్‌ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
రెడీగా ఉండండి.. భారత్‌లో మరిన్ని షాపింగ్ మాల్స్
న్యూఢిల్లీ: యూఏఈకి చెందిన లులూ గ్రూప్ భారత్‌లో మరిన్ని వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ కొచ్చి, త్రివేండం, బెంగళూరు, లక్నో, త్రిసూర్ నగరాల్లో రూ.7,000 కోట్ల వ్యయంతో ఐదు షాపింగ్ మాల్స్‌ను నిర్మించింది. ‘‘భారత మార్కెట్ లూలు గ్రూప్‌నకు అత్యంత కీలకమైంది. ఇక్కడి వ్యవస్థీకృత రిటైల్ రంగం కేవలం 12 శాతం మాత్రమే వినియోగంలో ఉంది. ఈ విభాగంలో భారీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాము’’ అని గ్రూప్ షాపింగ్ మాల్స్ డైరెక్టర్ శిబు ఫిలిప్స్ తెలిపారు. చదవండి: Apple: యాపిల్ భారీ షాక్, ఉద్యోగులపై వేటు! -
రష్యా కావాలనే చేసిన ఉగ్రదాడి: జెలెన్స్కీ
కీవ్: ఐదు నెలల తర్వాత.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు మళ్లీ మారణహోమానికి పాల్పడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ మాల్‌పై రష్యా క్షిపణి దాడుల్లో 16 మంది మృతి చెందారు. సుమారు 59 మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ‘యూరోపియన్ చరిత్రలో ఉగ్రవాదులు(రష్యా, బెలారస్ సైన్యాన్ని ఉద్దేశించి..) ఏమాత్రం జంకు లేకుండా కొనసాగించిన దాడి’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. క్రెమెంచుక్ నగరంలో రద్దీగా ఉన్న ఓ మాల్‌పై సోమవారం రష్యన్ బలగాలు క్షిపణులతో దాడి చేశాయి. ఘటన జరిగిన వెంటనే.. అత్యవసర బలగాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడికక్కడే 16 మంది చనిపోయారు. 59 మందికి గాయాలుకాగా.. 25 మంది ఆస్పత్రిలో చేర్పించారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గగనతలం దాడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలను ఉక్రెయిన్ పెడచెవిన పెడుతుండడంతో.. నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని జెలెన్స్కీకి నాటో యుద్ధ నిపుణులు సూచిస్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఉగ్రదాడులకు పాల్పడుతున్నారంటూ జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. Volodymyr Zelenskyy said that a strike on a mall in #Kremenchuk was deliberate and "one of the most daring terrorist acts in European history." "Peaceful city, ordinary mall, women inside, children, civilians. This was not a mistaken hit. This was a planned Russian strike." pic.twitter.com/Vnze8pBYbZ — NEXTA (@nexta_tv) June 27, 2022 ⚡️ Volodymyr Zelenskyy published a video of a fire in a shopping center in Kremenchug "The occupiers launched a missile strike at shopping center. There were more than a thousand civilians. The mall is on fire, rescuers are extinguishing fire, number of victims is unimaginable." pic.twitter.com/Src2qh3Tdf — NEXTA (@nexta_tv) June 27, 2022 చదవండి: నామరూపాల్లేకుండా ఉక్రెయిన్ నగరాలు -
మంచి నీళ్లివ్వమంటే యాసిడ్ ఇచ్చారు
నిజామాబాద్ నాగారం: గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమంటే యాసిడ్ ఇచ్చారు. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్.విజయ్‌కుమార్ దుస్తుల కొనుగోలు కోసం శనివారం కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్‌మాల్ వెళ్లి దుస్తులు కొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ దాహంగా ఉందని మంచి నీళ్లు ఇవ్వమని సిబ్బందిని కోరారు. సిబ్బంది నీళ్ల మాదిరిగానే ఉండే యాసిడ్ బాటిల్ ఇచ్చారు. విజయ్‌కుమార్ గొంతులోకి పోసుకోగానే తీవ్ర మంట ప్రారంభమై అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారంభించిన వైద్యులు పేషెంట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్‌కు తరలించారు. అంతకు ముందు షాపింగ్ మాల్ నిర్వాహకులతో విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అది యాసిడ్ కాదంటూ అందులో పనిచేసే ఆనంద్ అనే ఉద్యోగి కొంచెం నోట్లో పోసుకోవడంతో గొంతులో మంటరేగి అతను కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు.. తదితర చోట్ల వినియోగదారులకు పార్కింగ్ వసతి కల్పించాల్సిన బాధ్యత వాటి యజమానులదే అని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెయింటనెన్స్ పేరు చెప్పి పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్రమంగా పార్కింగ్ ఫీజుల వసూలు విషయం న్యాయ మూర్తుల దృష్టికి రావడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు.. లాంటి భవనాలను నిర్మించే సమయంలోనే మున్సిపల్ నిబంధనల ప్రకారం పార్కింగ్ సదుపాయం ఉందా? లేదా? అని చూసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఫీజు వసూలు చేయడం గతంలో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ ప్రణాళిక శాఖ డైరెక్టర్‌తో పాటు రెవెన్యూ, హోం శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. -
నల్గొండలో అలజడి రేపిన కృతీ శెట్టి (ఫొటోలు)
-
షాపింగ్‌మాల్‌లోకి దూసుకెళ్లిన కారు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
వాషింగ్టన్: షాపింగ్ మాల్‌లోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని టెంపే నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో రికార్డయ్యాయి. ఇందులో షాపింగ్ మాల్లో ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకుంటూ ఉండగా సడెన్‌గా ఓ వైట్ కలర్ కారు మాల్‌లోకి దూసుకొచ్చినట్లు కనిపిస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని టెంపో పోలీసులు తెలిపారు. డ్రైవర్ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్పై వేయడంతో కారు షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు మాల్‌లోకి చొచ్చుకుపోవడంతో అక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. అలాగే షాపింగ్ మాల్లోని కొన్ని ర్యాక్‌లను కారు కారు ధ్వంసం చేసింది. గాయపడిన ఉద్యోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రిపేర్ కోసం కొన్ని రోజుల పాటు షాపింగ్ మాల్‌ను మూసివేస్తున్నట్లు యాజమాని తెలిపారు. మరోవైపు షాపింగ్ మాల్‌లోకి కారు దూసుకెళ్లి ఇద్దరు ఉద్యోగులను గాయపర్చిన ఈ షాకింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దేవుడి దయ వల్ల ఉద్యోగులకు ఏం జరగలేదని, కారు ఇంకొంచెం స్పీడ్‌గా వచ్చింటో ఏ ప్రమాదం జరిగేదోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: Nepal Plane Missing: నేపాల్‌లో అదృశ్యమైన విమానం ఆచూకీ గుర్తింపు Wow check out this close call!! The driver accidentally left the car in drive and tries to put it in park and unintentionally hit the accelerator. Thankfully only minor injuries! pic.twitter.com/03OWUN9o6c — Tempe Police (@TempePolice) May 26, 2022 -
షాపింగ్ మాల్లో నైట్ పార్టీ.. 900 మంది యువతీ యువకుల హల్చల్
సాక్షి, చెన్నై: కోయంబేడు సమీపంలోని ఓ మాల్లో నైట్ పార్టీలో మద్యం ఏరులై పారింది. అతిగా విదేశీ మద్యం తాగిన యువకుడు మృతి చెందడంతో పార్టీ గుట్టు రట్టయ్యింది. దీంతో ఈ ఘటన తమిళనాడుతో చర్చనీయాంశంగా మారింది. కాగా, చెన్నై శివారు ప్రాంతాలు, నగరంలో ఇటీవల కాలంగా వీకెండ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నా, తగ్గేదే లేదన్నట్లుగా నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగరం నడి బొడ్డున ఉన్న కోయంబేడు సమీపంలోని ఓ మాల్లో నైట్ పార్టీ (అనుమతి లేకుండా) సాగడం వెలుగులోకి వచ్చింది. ఈ మాల్లోని పై అంతస్తును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఈ నైట్ పార్టీ నిర్వహించారు. బ్రిజిల్ నుంచి ప్రముఖ డీజే మన్డ్రో గ్రోవా బృందం ఈ పార్టీలో రాక్ మ్యూజిక్‌ను హోరెత్తించింది. విదేశీ మద్యం ఈ పార్టీలో ఏరులై పారింది. ముందుగా రూ.1500 చెల్లించి రిజర్వు చేసుకున్న 900 మంది యువతీ యువకులను ఈ పార్టీకి నిర్వాహకులు అనుమతించారు. రాక్ మ్యూజిక్ , ఏరులై పారిన మద్యంతో యువత చిత్తయ్యారు. అతిగా మద్యం సేవించిన ఓ యువకుడు స్పృహ తప్పిన సమాచారంతో ఈ పార్టీ గుట్టు రట్టు అయింది. సమాచారం అందుకున్న అన్నానగర్ పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీని అడ్డుకున్నారు. అక్కడున్న యువతను బయటకు పంపించేశారు. నిర్వాహకులు విఘ్నేష్, చిన్న దురై, భరత్, మార్క్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్పృహ తప్పిన యువకుడు ఆస్పత్రిలో మరణించడంతో వివాదం పెద్దదైంది. దీంతో నిర్వాహుకులపై కేసులు నమోదయ్యాయి. మృతి చెందిన యువకుడు మరిపాక్కంకు చెందిన ప్రవీణ్(23)గా గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వందలాది విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ పార్టీలో మత్తు పదార్థాల వాడకంపై అనుమానాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది కూడా చదవండి: నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. వెలుగులోకి అసలు నిజాలు -
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో తారల సందడి
-
అక్షయ.. అద్భుతం (ఫొటోలు)
-
షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్
Fans Gave Shock To Anupama Parameswaran: ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు ఫ్యాన్స్ షాకిచ్చారు. సోమవారం ఆమె సూర్యాపేట జిల్లా కోదాడలోని పీపీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. దీంతో అనుపమను చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనుపమ కాసేపు మీడియాతో ముచ్చటిచ్చింది. అనంతరం ఆమె తిరుగు ప్రయణమవుతుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్, స్థానికులు ఎగబడ్డారు. చదవండి: త్వరలోనే తెలుగు సినిమా చేస్తా : కేజీఎఫ్ హీరోయిన్ అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో తను కాసేపు ఇక్కడే ఉండాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆకతాయిలు ఆమె కారు టైర్లలో గాలి తీశారట. దీంతో ఫ్యాన్స్ తీరుకు అనుపమ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో షాపు నిర్వాహకులు అనపమకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారట. కాగా అనుపమ చివరిగా ‘రౌడీ బాయ్స్’లో సందడి చేసింది. తాజాగా ఆమె నటించిన ‘18 పేజెస్’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె ‘కార్తికేయ 2’, ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: టికెట్ రేట్ల గురించి వేడుకుంటే తప్పేం కాదు: చిరంజీవి -
కోదాడలో అనుపమ సందడి (ఫోటోలు)
-
పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం
చార్మినార్: పాతబస్తీలో ఓవైపు పర్యాటకులు..మరోవైపు రంజాన్ షాపింగ్ రద్దీతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు సైతం ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్ మరింత క్లిష్టంగా మారగా... ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ► రంజాన్ మాసంలో చివరి పది–పన్నెండు రోజులు పాతబస్తీలోని మార్కెట్లు రద్దీగా మారుతాయి. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతం కిటకిటలాడుతుంది. ► అలాగే మక్కా మసీదులో ప్రతి రోజు నిర్వహించే ఐదు నమాజ్‌లకు ముస్లింలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ► దీనిని దృష్టిలో పెట్టుకొని నగర ట్రాఫిక్ ఉన్నతాధి కారులు తాత్కాలిక పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ సౌకర్యం కల్పించిన ప్రాంతాలివే.. ►చార్మినార్ సమీపంలో.. ► యునానీ ఆసుపత్రి ప్రాంగణం ► కుడా స్టేడియం ► మోతీగల్లీ పెన్షన్ ఆఫీసు ► కోట్ల అలీజాలోని ముఫిదుల్లానామ్ హైస్కూల్ ప్రాంగణం ►పంచమొహల్లాలోని కూలగొట్టిన ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలం పార్కింగ్ ఉచితమే.. రంజాన్ మాసంలోని చివరి పది–పన్నెండు రోజులు ఎంతో కీలకం. పాతబస్తీ రద్దీగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమీపంలోని ఆరు ప్రాంతాల్లో వాహనదారుల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశౠం. ఇక్కడ పార్కింగ్ ఉచితం. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే..మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ -
పోతేపోనీ.. రూ.35 లక్షలే కదా సర్.!!
సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏముంది సర్... రూ.35 లక్షలు పోతేపోనీ.. రూ.60 లక్షలు ఇస్తామంటున్నారు కదా.. తిరిగి వారికే ఇచ్చేద్దాం’’ డైమండ్ పార్క్ దరి తందూరీ ఇన్ హోటల్ లీజు వ్యవహారంపై జీవీఎంసీలో గురువారం రాత్రి జరిగిన చర్చ ఇదీ. వివరాల్లోకి వెళ్తే... జీవీఎంసీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో తందూరీ ఇన్ హోటల్ దాదాపు ఇరవై ఏళ్లుగా రూ.1.34 కోట్ల లీజు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.39 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.95 లక్షలు లీజు డబ్బులు చెల్లించాలని జీవీఎంసీ నోటీసులు అందించగా.. హోటల్ యజమానులు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే బకాయిలు పూర్తిగా చెల్లించాలని, అనంతరం వేలం వేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై గురువారం రాత్రి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతిపక్ష కార్పొరేటర్లతోపాటు ఒకరిద్దరు అధికార పార్టీ కార్పొరేటర్లు సమావేశమైనట్లు సమాచారం. రూ.95 లక్షల్లో రూ.౩5 లక్షల వరకూ ఉన్న వడ్డీని మినహాయించాలని కొందరు కార్పొరేటర్లని సదరు యజమాని ఆశ్రయించినట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులను ఒప్పించేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రూ.60 లక్షలు వస్తున్నప్పుడు రూ.35 లక్షలు వదిలేద్దామని అధికారులను ఒప్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: (ఫలించిన సమన్వయ మంత్రం.. శ్రీశైలంలో సడలిన ఉద్రిక్త పరిస్థితులు) -
ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ .. అంతేనా చక్కగా షాపింగ్ కూడా
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో నడక. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ వగైరా... అంతేనా చక్కగా షాపింగ్ చేయొచ్చు. అలా ఆకాశంలో నిల్చుని కాలక్షేపం కూడా చేయొచ్చు.ఇదంతా ఎలా సాధ్యమనుకుంటున్నారా? కచ్చితంగా సాధ్యమే. హైదరాబాద్ మహానగర కూడళ్లలో మణిహారాల్లా రూపుదిద్దుకుంటున్న స్కైవాక్‌లలో షాపింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొదట మెహిదీపట్నం స్కైవాక్‌లో ఈ తరహా షాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. చిన్న చిన్న కియోస్క్‌ల రూపంలో ఉండే ఈ సెంటర్లు స్కైవాక్ పాదచారులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. టీ,కాఫీ, స్నాక్స్ వంటి వాటితో పాటు తక్కువ స్థలంలో విక్రయించేందుకు అనుగుణంగా ఉండే షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. నగరంలోని స్కైవాక్‌లను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్కైవాక్ మార్గాల్లో ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లే పాదచారులు కొద్దిసేపు పైనే సేదతీరేందుకు వీలుగా ఇవి ఉంటాయి. రూ.28 కోట్ల వ్యయంతో.. ► మెహిదీపట్నం కూడలిలో ప్రస్తుతం నిర్మిస్తున్న స్కైవాక్‌లో అన్ని వైపులా సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానున్నట్లు అంచనా. మొత్తం 350 మీటర్ల పొడవులో రూ.28 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు నాలుగు వైపులా నడుచుకుంటూ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కనీసం లక్షమందికి పైగా స్కైవాక్ మార్గంలో రాకపోకలు సాగించవచ్చు. ► ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు షాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఈ స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా హెచ్ఎండీఏకు అదనపు ఆదాయం లభించనుంది. మరోవైపు పాదచారులకు కూడా ఆటవిడుపుగా మారనుంది. తక్కువ స్థలంలో ఏర్పాటు చేయగలిగే షాపులకే స్కైవాక్ అనుకూలంగా ఉంటుందని ఒక అధికారి చెప్పారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం సెప్టెంబర్ నాటికి ఉప్పల్‌లో స్కైవాక్.. ► నిత్యం వాహనాలు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే ఉప్పల్ కూడలిలో స్కైవాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 650 మీటర్ల పొడవుతో రూ.34 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ రింగు రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించేవిధంగా ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ► మెట్రో రైలు దిగిన ప్రయాణికులు తాము ఏ వైపునకు వెళ్లాలనుకొన్నా స్కైవాక్‌లోనే వెళ్లవచ్చు. అలాగే సిటీ బస్సులు, దూరప్రాంతాల బస్సుల్లో వచ్చేవారు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ నాటికి వినియోగించలోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో మరిన్ని.. జన సమ్మర్థం ఉన్న ప్రధాన కూడళ్లలో మరిన్ని స్కైవాక్‌లను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధ్యయనం చేపట్టింది. అమీర్‌పేట్, కోఠి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో స్కైవాక్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. -
కన్నీరు పెడుతున్న ఉక్రేనియన్లు.. షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్‌పై దాడి..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 26వ రోజుకు చేరుకున్నాయి. రష్యా బలగాల ధాటికి ఉక్రెయిన్ విలవిలాడుతోంది. రష్యా వైమానిక దాడుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉక్రెయిన్ జనావాసాలే లక్ష్యంగా రష్యా ట్రూప్ దాడులు జరుపుతున్నాయి. కనీస కనికరం లేకుండా బాండు దాడులు చేస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న రెట్రోవిలీ షాపింగ్ మాల్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఆ దాడిలో ఆరుగురు మృతిచెందారు. దాడి కారణంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మారియపోల్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. నగరంలోని 90 శాతం బిల్డింగ్‌లో ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఆ నగరంలో ఇంకా మూడు లక్షల మంది తలదాచుకుంటున్నారు. వాళ్లకు విద్యుత్తు, నీరు, ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Video of a shell hitting a shopping center. The explosion was incredibly strong, the wave blew out the windows in the neighboring houses. pic.twitter.com/Qe5ztF1vLc — NEXTA (@nexta_tv) March 20, 2022 మరోవైపు.. ఖార్కీవ్లో ఓ సూపర్ మార్కెట్‌పై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో షాపులో ఉన్న ఉక్రెయిన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంక్షోభంలో ఉక్రెయిన్‌కు చెందిన మాజీ ఎంపీ భార్య డబ్బును తరలిస్తూ పోలీసులకు చిక్కారు. మాజీ ఎంపీ కొట్విట్స్కీ భార్య భారీ మొత్తంలో ఉక్రెయిన్ నుంచి డబ్బును తరలిస్తుండగా హంగేరిలో బోర్డర్లో పోలీసులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాంబు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Kharkiv: A #Russian shell explodes next to people who are standing in line at the supermarket. pic.twitter.com/QIZkgV4ZLa — NEXTA (@nexta_tv) March 21, 2022 Ukrainian media report that the wife of former MP Kotvytskyy tried to take $28 million and 1.3 million euros out of #Ukraine via #Zakarpattya. The money was found by the #Hungarian border guards and forced to declare it. pic.twitter.com/ZCjDlIxdwB — NEXTA (@nexta_tv) March 20, 2022 -
హాట్ టాపిక్‌గా చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?
బీజింగ్: చైనా మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది. ఇప్పటికే ఎన్నోసార్లు వివిధ ఆవిష్కరణలు, ప్రపంచాన్ని భయపెడుతూ వార్తల్లో నిలిచిన చైనా.. ఈసారి మాత్రం కొంచెం వైరెటీ పని చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. భార్యలతో షాపింగ్‌కు వెళ్లే భర్తల కోసం చైనీయులు ట్రెండీగా ఆలోచించారు. భార్యలు గంటల కొద్దీ సమయం షాపింగ్ కోసం కేటాయిస్తారాన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో భర్తలు అసహనానికి గురికాకుండా, వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు చైనా ఓ పరిష్కారాన్ని కనుగొంది. షాపింగ్ చేసే భార్యలకు దూరంగా ఉండేందుకు షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్లో 'husband storage' పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాడ్స్‌లో ఓ వ్యక్తి కూర్చునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. కస్టమర్లు ఆ పాడ్స్‌లో కుర్చొన్న సమయంలో వారు వైరే లోకంలో ఉన్నారనే అనుభూతిని కలిగించేందుకు వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది. గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా మానిటర్, గేమ్ ప్యాడ్స్‌ను, కనీస అవసరాలను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతానికి వినియోగదారులకు పాడ్స్‌లో ఉచితంగా గేమ్స్ ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో కస్టమర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని షాపింగ్ మాల్స్ యజమానులు చెబుతున్నారు. కాగా, ఈ పాడ్స్‌లో సమయంగా గడిపిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పాడ్స్‌లో గేమ్స్ ఆడటం ఎంతో కొత్తగా ఉందన్నారు. ఆహ్లదాన్ని అందించినట్టు తెలిపారు. దీంతో పాడ్స్ ఏర్పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. -
ఈ విషయంలో గ్లోబల్ స్థాయిలో భారత్‌కు రెండో ర్యాంకు
లండన్: డిజిటల్ షాపింగ్ కంపెనీలలో పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ మార్కెట్‌గా నిలుస్తోంది. దీంతో 2021లో 175 శాతం అధికంగా 22 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ తరలి వచ్చాయి. 2020లో 8 బిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి. వెరసి ప్రపంచస్థాయిలో యూఎస్ తదుపరి రెండో ర్యాంకులో నిలిచింది. గతేడాది యూఎస్‌లోని డిజిటల్ షాపింగ్ కంపెనీలు 51 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగా.. చైనా సంస్థలు 14 బిలియన్ డాలర్లు, యూకే కంపెనీలు 7 బిలియన్ డాలర్లు చొప్పున ఇన్వెస్ట్మెంట్స్ అందుకున్నాయి. లండన్ అండ్ పార్టనర్స్ రూపొందించిన డీల్‌రూమ్.కో పెట్టుబడుల గణాంకాలివి. 14 బిలియన్ డాలర్లు అంతర్జాతీయంగా 2021లో డిజిటల్ షాపింగ్ కంపెనీలలో పెట్టుబడులకు బెంగళూరు టాప్‌లో నిలిచింది. 14 బిలియన్ డాలర్ల వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులను సాధించింది. 2020లో బెంగళూరు కంపెనీలు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. తాజా జాబితాలో న్యూయార్క్ సిటీ, శాన్ఫ్రాన్సిస్కో, లండన్, బెర్లిన్ 2 నుంచి 5వరకూ స్థానాలు సాధించాయి. ఈ బాటలో దేశీయంగా గురుగ్రామ్ 4 బిలియన్ డాలర్లతో 7వ ర్యాంకులో, 3 బిలియన్ డాలర్లతో ముంబై 10వ పొజిషన్లో నిలిచాయి. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ సేవలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈకామర్స్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వెల్లువెత్తినట్లు డీల్‌రూమ్.కో గణాంకాలు తెలియజేశాయి. యూనికార్న్లకూ.. భవిష్యత్‌లో అత్యధిక యూనికార్న్ స్టార్టప్‌లకు నిలయం కాగల నగరాలలోనూ బెంగళూరుకు జాబితాలో ప్రాధాన్యత లభించింది. లండన్ తదుపరి 5వ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రస్తుతం దేశీయంగా యూనికార్న్ స్టార్టప్‌ల సంఖ్య అత్యధికంగా గల నగరాలలో బెంగళూరు 19 సంస్థలతో 6వ ర్యాంకు సాధించింది. ఇక 13 యూనికార్న్‌లతో గురుగ్రామ్ 7వ ర్యాంకులో నిలవగా.. 7 సంస్థలతో ముంబై 14వ పొజిషన్‌కు చేరుకుంది. గురుగ్రామ్‌లో యూనికార్న్‌ల సంఖ్య 2020లో 3 మాత్రమే కావడం గమనార్హం! కాగా.. 2021లో డిజిటల్ షాపింగ్‌లో గ్లోబల్ వీసీ పెట్టుబడులు దాదాపు రెట్టింపై 140 బిలియన్ డాలర్లను తాకాయి. 2020లో ఇవి 68 బిలియన్ డాలర్లు మాత్రమే. చదవండి: విదేశాల్లో మనోళ్ల పెట్టుబడులు తగ్గాయ్ -
నల్గొండలో సమంత సందడి, చీరకట్టుతో కనికట్టు చేసిన సామ్ (ఫొటోలు)
-
'పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే మాల్స్‌కే ప్రమాదం'
పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. "బిల్డింగ్ రూల్స్ ప్రకారం, భవనం నిర్మించడానికి పార్కింగ్ స్థలం కోసం తగినంత స్థలం అవసరం. పార్కింగ్ స్థలం భవనంలో భాగం. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది. కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ పూర్తి రిస్క్‌తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. ఈ మేరకు వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్‌ను సందర్శించినప్పుడు అతని నుండి పార్కింగ్ ఫీజు రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తాను డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో మాల్ సిబ్బంది ఎగ్జిట్ గేట్లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ మేరకు కోర్టు ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
కడపలో మాంగళ్య షాపింగ్ మాల్
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటైన మాంగళ్య షాపింగ్ మాల్‌ను సినీ తార సమంత ఆదివారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్ మాల్ తక్కువ కాలంలోనే నాణ్యమైన, మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా నిల్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇది తమకు 11వ షోరూమ్ అని, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని సంస్థ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమఃశివాయ వివరించారు. 25000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైల్ ఫ్యాషన్ స్టోర్‌గా 1942లో ప్రారంభమైన కాసం గ్రూప్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ భాగమని, ప్రస్తుతం గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు. -
కడపలో స్టార్ హీరోయిన్ సమంత సందడి
-
Omicron: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka Omicron Restrictions: ఒమిక్రాన్ వైరస్ జాడలు రాష్ట్రంలో బయటపడటంతో ఆ మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు మంత్రి సుధాకర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆరోగ్యసౌధ నుంచి 21 మెడికల్ కళాశాల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రెండు కేసులు బయటపడ్డాయి. ఐదు పాజిటివ్ కేసులు ఉన్నాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపామని తెలిపారు. కేసులు పెరిగితే పీజీ విద్యార్థులను వైద్య సేవలకు వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో నర్సింగ్ సంఖ్య పెంచేందుకు తీర్మానించినట్లు తెలిపారు. పారామెడికల్ కోర్సు చదివే 18 వేల మంది సేవలను కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఐసీయూ ఏర్పాట్లు, పరికరాల కొనుగోలుపై చర్చించినట్లు తెలిపారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశంలో పాల్గొన్న సీఎం బసవరాజబొమ్మై సీఎం బొమ్మై నేతృత్వంలో నిపుణులతో సమావేశం ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు విడుదల చేసే విషయంపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కృష్ణాలో ఆరోగ్య శాఖ మంత్రి క్టర్ కే.సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో సమావేశం అయ్యారు. డిసెంబర్ 10న విధానపరిషత్ ఎన్నికలు, 13 నుంచి బెళగావి శాసనసభా సమావేశాలు ఉన్నందున ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రోజూ లక్ష మందికి కోవిడ్ పరీక్షలు జరపాలని, ఆక్సిజన్, ఐసీయూ పడకల ఏర్పాటు, ఔషధాల సమస్య పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చదవండి: (హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక) మార్గదర్శకాలు ఇవే ►సినిమా హాల్, మాల్స్‌కు వెళ్లేందుకు రెండు డోస్‌ల వ్యాక్సిన్ తప్పనిసరి ►తల్లిదండ్రులు రెండు డోస్‌ల టీకాలు తీసుకుంటునే వారి పిల్లలను పాఠశాలల్లోకి అనుమతి ►పాఠశాల, కాలేజీల్లో సభలు, సమావేశాలకు బ్రేక్ ► వివాహాది కార్యాలకు 500 మందికి మాత్రమే అనుమతి 413 కరోనా కేసులు సాక్షి, బెంగళూరు: గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 413 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 256 మంది డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,97,246కు పెరిగింది. 29,52,101 మంది కోలుకున్నారు. మరణాలు 38,220కి చేరాయి. 6,896 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
మహిళలను భయపెడుతున్న షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్స్
-
సిరి డ్రెస్ డివైన్.. మీ కోసం.. మీ రాజమహేంద్రవరంలో!
మగువలు మెచ్చే అతి పెద్ద షాపింగ్ మాల్ సిరి డ్రెస్ డివైన్ (ఎక్స్‌క్లూజివ్ ఉమెన్స్వేర్)ను రాజమండ్రికి వచ్చేసింది. ఎక్స్‌క్లూజివ్ ఉమెన్స్వేర్లో భాగంగా సల్వార్స్, కుర్తిస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్టర్న్స్, లెగ్గింగ్స్, హాఫ్ సారీస్ ఇంకా మరెన్నో కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. యువతకు నచ్చే ఆకర్షణీయమైన వస్త్రాలను సిరి డ్రెస్ డివైన్ అందించనుంది. వస్త్ర ప్రపంచంలో కనివిని ఎరుగని రీతిలో అత్యధిక డిజైన్లతో, అద్భుతమైన ఫ్యాషన్లతో కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని సిరి డ్రెస్ డివైన్ అందించనుంది. దసరా పండుగను పురస్కరించుకొని రూ. 4999 విలువైన వస్త్రాల కొనుగోలుపై కస్టమర్లకు రూ. 2999 విలువగల బ్రాండెడ్ వాచ్‌ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ షాపింగ్ మాల్‌ను అక్టోబర్ 7న రాజమండ్రిలో తోటరాములు నగర్, జె.ఎన్ రోడ్ వద్ద ఘనంగా ప్రారంభించారు. (అడ్వటోరియల్) -
విషాదం: అందరూ చూస్తుండగానే.. షాపింగ్‌మాల్‌లో షాకింగ్ వీడియో
సాక్షి, ఖమ్మం జిల్లా: నగరంలో విషాదంలో చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగి.. కస్టమర్‌కు బట్టలు చూపిస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా టేబుల్‌పైనే కూప్పకూలిపోయాడు. ఖమ్మం నగరానికి చెందిన చాంద్ పాషా గత కొద్దికాలంగా కేఎల్ఎం షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. రోజువారి పనిలో భాగంగా కస్టమర్‌కు బట్టలు చూపిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి దాకా మాట్లాడిన ఉద్యోగి.. అంతలోనే మృతి చెందడంతో ఉద్యోగులు, కస్టమర్లు షాక్‌కు గురయ్యారు. చదవండి: ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ -
కొత్త మాల్స్ వస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారితో పాతాళంలోకి పడిపోయిన షాపింగ్ మాల్స్ వ్యాపారం... తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. దీంతో మాల్స్ నిర్మాణ సంస్థలకూ జోష్ వచ్చింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 45 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ఇందులో 85 శాతం స్పేస్ ప్రధాన నగరాలలో, 15 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో రానుంది. ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి రానున్న రిటైల్ మాల్ స్పేస్‌లో బెంగళూరులో 12.2 లక్షల చదరపు అడుగుల మాల్ స్పేస్, ముంబై, నోయిడాలలో ఒక్కో నగరంలో 11 లక్షల చదరపు అడుగుల స్పేస్ రానుంది. అమరావతి, లక్నో పట్టణాలలో కొత్తగా రెండు మాల్స్‌లలో 4.7 లక్షల స్క్వేర్ ఫీట్లలో రానున్నాయి. గతేడాది 75 శాతం క్షీణత.. 2019లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 85 లక్షల చ.అ. మాల్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 73 శాతం వృద్ధి. గతేడాది కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యారు. అవసరమైన వస్తువులు, నిత్యావసరాలను ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో భౌతిక రిటైల్ స్పేస్ అవసరం క్షీణించింది. ఫలితంగా 2019తో పోలిస్తే గతేడాది కొత్త రిటైల్ మాల్ స్పేస్ 75 శాతం క్షీణించి.. 21 లక్షల చదరపు అడుగులకు చేరింది. మన దగ్గర తలసరి రిటైల్ స్పేస్ 2 చదరపు అడుగులు అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో సంఘటిత రిటైల్ వ్యాపారం 10 శాతం కంటే తక్కువే. యూఎస్‌లో తలసరి వ్యవస్థీకృత రిటైల్ స్పేస్ 23 చ.అ., దుబాయ్‌లో 16 చ.అ. ఉండగా... మన దేశంలో మాత్రం 2 చ.అ.లుగా ఉంది. గత ఐదేళ్లలో భారతదేశ తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి రేటుతో 1,961 డాలర్లకు పెరిగిందని అనరాక్ రిటైల్ సీఓఓ అండ్ జాయింట్ ఎండీ పంకజ్ రెంజెన్ తెలిపారు. ఏటా సంఘటిత దేశీయ రిటైల్ మార్కెట్ 20–25 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చదవండి: లగ్జరీ అపార్ట్మెంట్స్ కేరాఫ్ హైదరాబాద్ -
నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శుక్రవారం మూడేళ్ల బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరెల్ తన బిడ్డ అస్కియా హనీ(3)తో షాపింగ్ నిమిత్తం సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌కు వచ్చింది. షాపింగ్ చేస్తుండగా చిన్నారి షాపింగ్ మాల్లో ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత బాలిక కనిపించలేదు. ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు షాపింగ్‌మాల్‌లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. చిన్నారిని ఇద్దరు బురుకలు ధరించిన మహిళలు బయటకు ఎత్తుకెళుతున్నట్లు కనిపించింది. పోలీసులు రోడ్డు వెంబడి, బస్టాండ్ , రైల్వేస్టేషన్ వైపు ఉన్న సీసీపుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ఊహకందని ట్విస్ట్
లాస్ ఏంజిల్స్/కాలిఫోర్నియా: మనలో చాలామందికి.. రోడ్డు మీద, వీధుల్లో అప్పుడప్పడు కొందరు తారసపడుతుంటారు. చార్జీకి డబ్బులు తక్కువ ఉన్నాయని.. లేదంటే.. పర్సు మర్చిపోయాను.. తింటానికో లేక ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేవు.. సాయం చేయమని వేడుకుంటుంటారు. మన దగ్గర ఉంటే సాయం చేస్తాం.. లేదంటే పక్కకు తప్పుకుంటాం. అయితే ఇలా అడిగే వారిలో చాలా మంది నకిలీలే ఉంటారు. అందుకే ఇలాంటి వారికి సాయం చేయాలంటే జనాలు ఆలోచిస్తారు. కానీ పెద్దలు ఓ మాట చెప్పారు. సమస్యలో ఉన్నానని.. సాయం కోరితే.. తిరిగి వారి వద్ద నుంచి ఆశించకుండా మనం సాయం చేస్తే.. తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అని. ఈ మాటని నిజం చేసే సంఘటన ఒకటి లాస్ ఏంజిల్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రిస్ ఈవాన్స్ అనే ట్విటర్ అకౌంట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!) ఈ వీడియోలో ఓ మహిళ షాపింగ్ మాల్లో తనకు కావాల్సిన సరుకులు తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె దగ్గరకు ఓ అపరిచితుడు వచ్చి.. ‘‘నా వాలెట్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను.. బాగా ఆకలి వేస్తుంది.. ఈ పూట మీరు నాకు ఆహారం కొనివ్వగలరా’’ అని సదరు మహిళను ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక్కడితో అయిపోలేదు.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పర్స్ మర్చిపోయాను అని చెప్పిన వ్యక్తి సదరు మహిళకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కొన్న సరుకులకు అతడే బిల్ కడతానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆ అపరిచిత వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ.. ‘‘మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు తీసుకున్న ఈ సరుకులన్ని మీకు ఉచితంగా ఇస్తున్నాను. మీకు కావాల్సిన సరుకులన్నింటిని మేమే కొని మీకు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా మంచివారు.. సాటి మనుషుల పట్ల జాలి, దయ కలిగి ఉన్నారు. నేను ఎవరో తెలియకపోయినా.. నేను చెప్పేది నిజమో.. అబద్ధమో కూడా ఆలోచించకుండా.. నా ఆకలి తీర్చడానికి అంగీకరించారు. మీ మంచి మనసుకు ఈ చిన్న బహుమతి’’ అన్నాడు. (చదవండి: ఈ రాజభవనం అద్దె ఎంతంటే......) తాను చేసిన పనికి ఇంత మంచి ఫలితం లభిస్తుందని ఊహించని సదరు మహిళ.. షాక్‌కు గురవుతుంది. అతడి మాటలు విని ఆనందంతో కన్నీరు పెడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు ‘‘మంచి మనసు ఉన్న వారికి ఎప్పుడు మంచే జరగుతుంది’’.. ‘‘ఫలితం ఆశించకుండా ఎవరికైనా మేలు చేసస్తే.. మనకు కూడా మేలు జరుగుతుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. My allergies are acting up 😢 pic.twitter.com/3hoMuXg63o — chris evans (@chris_notcapn) October 4, 2021 చదవండి: Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా? -
నిజామాబాద్‌లో సందడి చేసిన కీర్తి సురేష్ ఫొటోలు
-
నిజామాబాద్‌లో సందడి చేసిన కీర్తి సురేష్
Keerthy Suresh: నిజామాబాద్‌లో హీరోయిన్ కీర్తి సురేష్ సందడి చేసింది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి కీర్తి సురేష్ విచ్చేసింది. ఈ సందర్భంగా కీర్తిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్‌తో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి చిరంజీవితో కలిసి 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె చిరుకు చెల్లెలుగా కనిపించనుంది. చదవండి: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్ -
డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించకూడదట!
కరోనా మహమ్మూరి సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జోమాటో, స్విగ్గీ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫుడ్‌ని డెలివరీ చేశాయి. అంతేకాదు ఆ క్లిష్ట సమయంలో డెలివరీ బాయ్స్ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్లి ఆహారం, నిత్య అవసరాలను ఇళ్ల వద్దకే నేరుగా తీసుకు వచ్చి అందించారు. ఈ మహమ్మారీ సమయంలో డెలివరీ బాయ్స్ హీరోల్లా సేవంలందించి అందరీ ప్రశంసలను అందుకున్నారు. కానీ ఉదయ్‌పూర్‌లోని ఒక మాల్ డెలివరీ బాయ్స్‌ని ఇబ్బందికీ గురి చేసేలా ఒక నోటీస్ అంటించింది. ఈ నోటీస్ చాలా మందిని కలవరపాటుకు గురి చేయడమే కాక ఈ ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి వివక్షత కొనసాగుతోందా అని ఒకింత ఆశ్చర్యపోక తప్పదేమో! (చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి) ఇంతకీ ఆ నోటిస్ సారాంశం ఏంటంటే "జోమాటో, స్విగ్గీ ఫుడ్ డెలిరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయకండి...మెట్ల వైపు నుంచే వెళ్లండి " అని ఉంది. ఈ క్రమంలో వాళ్లు వినియోగదారులకు సమయానికీ ఫుడ్ అందించలేరు, పైగా మరో ఆర్డర్‌ని కూడా తీసుకోలేరు. ఈ నోటిస్ని జర్మలిస్ట్ శోభనా నాయర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పాటు " ఆధునిక కాలపు భూస్వామ్యం" అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌వుతోంది. అంతేకాదు చాలా మంది నెటిజన్లు ఆగ్రహంతో తమదైన శైలిలో ఘాటుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకే ఈ దేశం ఇంకా వెనుకబడి ఉందని ఒకరు, ఇది డెలివరీ బాయ్స్ పట్ల వివక్ష, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని...పలురకాలుగా నెటిజన్లు ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. (చదవండి: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా) Modern day feudalism pic.twitter.com/edqYwQe5Qj — Sobhana K Nair (@SobhanaNair) September 18, 2021 -
బాయ్‌ఫ్రెండ్ కోసం షాపింగ్ మాల్లో తన్నుకున్న యువతులు
పాట్నా: ప్రేమికుడు ముగ్గురు యువతులు పోట్లాడుకున్నారు. ముగ్గురికి ముగ్గురు జట్లు పట్టుకుని కొట్లాడారు. వారి గొడవను వారి ప్రియుడు చూస్తూ నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మోతిజిల్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో ముగ్గురు యువతులు ఎదురుపడ్డారు. ఆ సమయంలో వారి ప్రియుడు అక్కడే ఉన్నాడు. చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్ ఏం జరిగిందో ఏమో గానీ వారు వచ్చి రాగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు చేస్తూ బాహాబాహీకి దిగారు. మరో యువతి వచ్చి కూడా వారిపై దాడి చేసింది. అయితే వారు కొట్టుకుంటున్నా అక్కడే నిలబడ్డ యువకుడు నివారించే ప్రయత్నం చేయలేదు. వారి సిగపట్ల వీడియోను మాల్‌కు వచ్చిన కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఆ అబ్బాయి చాలా లక్కీ!’, ‘మాకు ఒక్కరే దిక్కులేరు నీకు ముగ్గురా బ్రదరూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
ఖమ్మం లో ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి సందడి ఫొటోలు
-
New Zealand: ముగ్గురి పరిస్థితి విషమం: ప్రధాని జెసిండా
న్యూజిలాండ్ ఉగ్రదాడిలో గాయపడిన ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. శనివారం ఉదయం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. భావోద్వేగానికి లోనయ్యారు. దాడి జరిగిన క్షణాల్లోనే తీవ్రవాదిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆమె వివరించారు. ఆక్లాండ్ సీటి న్యూలిన్ షాపింగ్ మాల్లోని కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 3న) ఓ తీవ్రవాది కత్తితో విచక్షణరహితంగా జనాలపై దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమయంలో అప్రమత్తమైన పోలీసులు తీవ్రవాదిని కాల్చి చంపారు. తీవ్రవాది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు చెందిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది అని, శ్రీలంక నుంచి న్యూజిలాండ్‌కు వచ్చాడని, కోర్టు ఆదేశాల మేరకు ఇంతకు మించి పూర్తి వివరాలను వెల్లడించలేమని జెసిండా అన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఆమె కంటతడి పెట్టారు. కత్తుల అమ్మకం బంద్ తాజా ఉగ్రదాడి నేపథ్యంలో కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్.. కత్తులను అమ్మకాల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దాడికి పాల్పడే ముందు షాపింగ్ చేసినట్లు నటించిన ఉగ్రవాది.. అక్కడి కత్తితోనే దాడికి పాల్పడడం విశేషం. ఇక దాడికి ముందు ఉగ్రవాది బస చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చదవండి: తాలిబన్ల సంబరాలు.. అమాయకుల మృతి -
జగిత్యాల: షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం.. రూ. కోట్ల నష్టం
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.18 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. కల్లూర్ రోడ్లో ఐదంతస్తుల్లో నిర్మించిన ఆనంద్ షాపింగ్ మాల్‌ను ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మాల్లో మంటలు వ్యాపించడంతో యజమాని హరికుమార్ పోలీసులకు, మెట్‌పల్లిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. బుధవారం వేకువజామున 2.15 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంట లు రెండంతస్తుల వరకు వ్యాపించాయి. రెండు ఫైరింజన్లతో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈలోగా మొత్తం ఐదు అంతస్తులోని ఫర్నిచర్, వస్త్రాలు మంటలకు ఆహుతయ్యాయి. దాని పక్కనే ఉన్న మరో రెండుషాపులకు సైతం మం టలు వ్యాపించాయి. ఈ రెండింటికి తోడు మరోరెండు ఫైరింజన్లు రావడంతో 18 గంటలపాటు శ్రమించి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాం తంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఇన్వర్టర్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నామని అగ్నిమాపక అధి కారి మురళీమనోహర్‌రెడ్డి తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ఫర్నిచర్, ఇతర సామాగ్రి, ఐదంతస్తుల్లో ని రూ.12 కోట్ల విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయినట్లు షాపు యజమాని తెలిపారు. -
జగిత్యాలలో పాయల్ రాజ్‌పుత్ సందడి
సాక్షి, జగిత్యాలటౌన్: తెలుగు సినిమా కథానాయకి పాయల్ రాజ్‌పూత్ జిల్లా కేంద్రంలో ఆదివారం సందడి చేశారు. పట్టణంలోని మోచీబజార్‌లో ఏర్పాటు చేసిన ఆనంద్ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఆర్ఎక్స్–100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరయ్యారు. సినీ హీరోయిన్ వస్తున్నారనే సమాచారంతో వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో మోచీబజార్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పాయల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ జగిత్యాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను ఆదరిస్తున్న అభిమానులు, ఆనంద్ షాపింగ్ మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. -
జూ నుంచి తప్పించుకుంది; కట్‌చేస్తే షాపింగ్‌మాల్‌లో
లూసియానా: కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. ఎంతో పకడ్బందీగా ఉండే ఎన్‌క్లోజర్ నుంచి ఎలా తప్పించుకుందో అధికారులకు అర్థం కాలేదు. పాపం రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని అధికారులు కారాను వెతికే ప్రయత్నం చేశారు. అలా చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలిసింది. ఇంకేముంది షాపింగ్‌మాల్ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని.. వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో కథ సుఖాంతమైంది. ''మాకు కారా తప్పిపోయిందని తెలిసినప్పటి నుంచి దానిని వెతికే ప్రయత్నంలో పడ్డాం. రెండురోజుల పాటు నిద్రహారాలు మాని కారా కోసం గాలించాం. చివరికి గురువారం ఒక షాపింగ్‌మాల్‌లో చిన్న సందు ద్వారా గోడ సీలింగ్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. కారాను సురక్షితంగా బయటికి తీసి ఎన్‌క్లోజర్‌లో పెట్టేశాం'' అంటూ జూ ప్రధాన అధికారి రోండా స్వాన్సన్ చెప్పుకచ్చాడు. కాగా కారాను (కొండచిలువ) సీలింగ్ నుంచి బయటికి తీసిన వీడియోనూ బ్లూ జూ అక్వేరియం తమ ఫేస్బుక్లో షేర్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. SEE THE MOMENT: Here’s video of Cara the Python was pulled out from the wall somewhere within the Mall of Louisiana. Video is from Blue Zoo Baton Rouge. @WAFB https://t.co/ziVjx9EWIW pic.twitter.com/DFdQBJAeoD — lizkohTV (@lizkohTV) July 8, 2021 -
కరోనా మార్చిన అలవాట్లు.. యుగోవ్ సర్వే ఏం చెప్తోంది..?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్ పరిశోధన సంస్థ యుగోవ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటికొచ్చింది. ఈ మార్పులు ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, భారత్, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 18 వేల మంది పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవి ఇవీ.. తగ్గిన జంక్‌ఫుడ్ వినియోగం కరోనా కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, లాక్డౌన్ విధించారు. వైరస్ తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. జంక్‌ఫుడ్‌కు బదులుగా ఎక్కువ పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను తమ డైట్ చార్ట్‌లో చేర్చినట్లు 66 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అదే సమయంలో మిగతా దేశాల్లోని 38% మంది ఈ విషయాన్ని అంగీకరించారు. 28% మంది జంక్‌ఫుడ్ తినడం తగ్గించినట్లు కూడా తెలిపారు. అదే సమయంలో భారత్‌లో 47% మంది ప్రజలు జంక్‌ఫుడ్ తగ్గించినట్లు పేర్కొన్నారు. మిగతా దేశాల్లోని 15% మంది ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం తగ్గించామని చెబితే, భారత్‌లో ఇది 32%గా ఉంది. అదే సమయంలో, భారత్‌లో 29%, చైనాలో 27% మంది ప్రజలు మునపటి కంటే అధికంగా మద్యం తీసుకున్నామన్నారు. ఇతర దేశాల వారిలో ఇది 25%గా ఉంది. కాస్మోటిక్స్‌పై తగ్గిన మోజు సర్వేలో మరో ఆసక్తికర విషయం సైతం వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధించిన ఆంక్షల ప్రభావం, కాస్మోటిక్ ఉత్పత్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని కారణంగా కాస్మోటిక్ కొనుగోళ్ళు తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో 36% మంది ప్రజలు ప్రస్తుతం కాస్మోటిక్ ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రపంచంలో 33% మంది ప్రజలు సౌందర్య ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేశామని వెల్లడించారు. స్థానిక కిరాణా షాపులకు ఊతం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షాపింగ్ మాల్స్, సూపర్మార్కెట్లు, పెద్ద దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే అలవాటు తగ్గి, దగ్గర్లోని చిన్న కిరాణా షాపులకు మారింది. భారతదేశంలో ప్రజలు చిన్న వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఇంటి సమీపంలో ఉన్న దుకాణాల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం కొనసాగించారు. మొత్తం 17 దేశాలలో 60% మంది స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని అనుకుంటున్నామని తెలిపారు. కావాల్సినవి మాత్రమే కొంటున్నారు ఈ మహమ్మారి సమయంలో కావాల్సిన వస్తువులను మాత్రమే కొంటున్నారని సర్వేలో తేలింది. ఇటువంటి షాపింగ్ ఇండోనేసియాలో 92%, భారతదేశంలో 90% మందికి, అగ్రరాజ్యం అమెరికాలోని 74% మందికి అలవాటైంది. మెక్సికోలో 83%, భారత్‌లో 81% మంది కరోనా కారణంగా తమ షాపింగ్ అలవాట్లు మారిపోయాయని చెప్పారు. అయితే ఈ ప్రభావం చైనీయులపై ఏమాత్రం కనిపించలేదు. కరోనా వల్ల వచ్చిన మార్పులతో చైనా మార్కెట్ తక్కువగా ప్రభావితమైంది. గతేడాది కరోనా వైరస్‌ను కనుగొన్న తరువాత చైనాలో లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. -
Shopping Mall: షాపింగ్ మాల్స్ ఢమాల్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పడిపోయిందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, కన్సల్టెంట్స్ చెబుతున్నారు. ఎనమిది నగరాల్లో సగటున షాపింగ్ సెంటర్లలో అద్దెలు నెలకు 4–5 శాతం తగ్గుతున్నాయి. చాలా మాల్స్‌లో 25 శాతం వరకు అద్దెలు దిగొచ్చాయి. కనీస ఆదాయ గ్యారంటీ ప్రాతిపదికన రిటైలర్లతో మాల్ యజమానులు సాధారణంగా లీజ్ ఒప్పందం చేసుకుంటారు. అయితే గతేడాది లాక్డౌన్ కాలంలో పూర్తిగా అద్దెలు మాఫీ అయ్యాయి. సెకండ్ వేవ్‌లోనూ.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి మార్చి వరకు మాల్ యజమానులు అద్దెలు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో వారి మొత్తం ఆదాయం పడిపోయింది. సెకండ్ వేవ్‌లోనూ ఆదాయం సగానికి వచ్చి చేరిందని పసిఫిక్ గ్రూప్ ఈడీ అభిషేక్ బన్సల్ తెలిపారు. రెంటల్ ఆదాయం 40–50%కే పరిమితమైందని యునిటీ గ్రూప్ డైరెక్టర్ హర్‡్ష బన్సల్ చెప్పారు. కొత్తగా లీజుకిచ్చిన రిటైలర్ల నుంచి అద్దె తగ్గలేదని, అయినా పరిమిత కాలానికి డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ మాల్స్ యజమానుల ఆదాయం 40–50 శాతం పడిపోతుందని కుష్మన్, వేక్ఫీల్డ్ చెబుతోంది. ఇతర ఆదాయాలూ తగ్గాయి.. మొత్తం రెంటల్ ఆదాయంలో మల్టీప్లెక్సుల వాటా 15%. ఇప్పుడు వీటినుంచి ఆదాయం పూర్తిగా రావడం లేదని జేఎల్ఎల్ ఇండియా రిటైల్ సర్వీసెస్ ఎండీ శుభ్రాన్షు పాని పేర్కొన్నారు. అద్దెలే కాకుండా పార్కింగ్, పాప్–అప్ స్టోర్స్, ప్రకటనల ఆదాయమూ కోల్పోయారని సావిల్స్ ఇండియా డైరెక్టర్ హర్షవర్ధన్ సింగ్ తెలిపారు. గతేడాది మార్చి నుంచి వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడమూ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. మాల్స్ పుంజుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ముప్పులా పరిణమించిందని చెప్పారు. -
లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్
న్యూఢిల్లీ: పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి వా రం రోజుల లాక్డౌన్ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లకు దిగారు. నగరంలో పలు ప్రాంతాల్లో మార్కెట్లు, మద్యం దుకాణాలు, మాల్స్ వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. లాక్డౌన్ వేళ బయటకు రాకుండా ఉండాలంటే ఇంట్లో అన్నీ సిద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలు షాపింగ్‌కు పోటెత్తారు. ఈనెల 26 సాయంత్రం 5గంటల వరకు లాక్డౌన్ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే! ఎలాగైనా కొన్ని సరుకులు కొందామని భావిస్తున్న గృహస్థులు ఈ ప్రకటనతో ఒక్కమారుగా పెద్ద ఎత్తున సరుకుల కొనుగోళ్లకు దిగారు. సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు మారలేదని, ఎమర్జెన్సీ వేళల్లో ప్రభుత్వాన్ని నమ్మలేమని, అందుకే సంసిద్ధంగా ఉండేందుకు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నామని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో లాక్డౌన్ ప్రకటన కారణంగా భయాందోళన నెలకొందని, అందుకే ఇలా మూకుమ్మడి కొనుగోళ్లకు దిగారని పరిశీలకులు భావిస్తున్నారు. చదవండి: (పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి) సందట్లో సడేమియా ప్రజల్లో నెలకొన్న భీతిని క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తులు యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చాలా షాపుల్లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెంచేశారని దుయ్యబట్టారు. గతేడాది ఇలాగే శానిటైజర్లు, ఫోర్ క్లీనర్ల రేట్లు పెంచారని, ప్రసుతం యాలక్కాయల్లాంటి కొన్ని పదార్ధాలు స్టాకు లేవని చెబుతున్నారని ఆరోపించారు. లాక్డౌన్ అంటేనే భయంగా ఉందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే మధ్యతరగతి పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీడీఎంఏ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. మాల్స్, జిమ్స్, ఉత్పత్తి యూనిట్లు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్, రెస్టారెంట్లు, బార్లు, పబ్లిక్‌పార్కులు, స్పా మరియు బార్బర్ షాపులు మూసివేయాల్సి ఉంటుంది. చదవండి: (రెండ్రోజుల్లో నిర్ణయం.. సంపూర్ణ లాక్‌డౌన్‌కే మొగ్గు) -
షాపింగ్ మాల్స్‌కు కరోనా సెకండ్ వేవ్ షాక్!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది దేశంలో షాపింగ్ మాల్స్ ఆదాయం 45 శాతం క్షీణించిందని.. 2022 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం 45-55 శాతం మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అయినా సరే కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ వృద్ధి 80–85 శాతానికే చేరుతుందని తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో షాపింగ్ మాల్స్‌లో ఆరోగ్యకరమైన వృద్ధి ఉన్నప్పటికీ.. మాల్స్ ఆదాయం మాత్రం కోవిడ్-19 కంటే ముందు స్థాయికి చేరుకోలేదని పేర్కొంది. (జోరందుకున్న కార్మికుల నియామకం) కరోనా సెకండ్ వేవ్ ఆంక్షలు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ అమ్మకాల మీద మాత్రమే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని, బలమైన స్పాన్సర్లు, ఆరోగ్యకరమైన లిక్విడిలీ ప్రొవైల్స్ కారణంగా మాల్స్ రుణ సేవా సామరŠాధ్యలు ప్రభావితం కావని తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రిటైల్ అమ్మకాలు క్రమంగా కోలుకుంటాయని సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథీ చెప్పారు. ఈ అమ్మకాలు ప్రీ-కోవిడ్‌లో 90 శాతానికి చేరువవుతాయని ఇది అద్దె మాఫీకి హామీ ఇవ్వకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో షాపింగ్ మాల్ యజమానుల అద్దె ఆదాయం మీద ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్పారు. (ఈ–కామర్స్‌కు కరోనా జోష్..!) రిటైల్ అమ్మకాల రికవరీ ఏకరీతిన ఉండదు. 14 రేటింగ్ ఉన్న మాల్స్‌లో మరీ ముఖ్యంగా దేశంలోని మాల్స్ మొత్తం ఆదాయంలో 35-40 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుత మినీ లాక్డౌన్ కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతాయని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మాల్స్‌లోని మొత్తం రిటైల్ విక్రయాలు 55శాతం మేర క్షీణించాయని.. మొదటి అర్ధ భాగంలో మాల్స్ మూసివేతలు గణనీయంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ప్రీ-పాండమిక్‌తో పోల్చితే మాల్స్‌లో ఫుట్‌ఫాల్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. ఫుట్‌ఫాల్స్ సగటు వ్యయం మాత్రం 25 శాతానికి పైగా పెరిగిందని పేర్కొంది. కోవిడ్ ముందుతో పోల్చితే గత ఆర్ధిక సంవత్సరంలో దుస్తులు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్స్, లగ్జరీ, ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగాలు 70 శాతం వరకు కోలుకున్నాయని.. సినిమా, కుటుంబ వినోద కేంద్రాలు మాత్రం క్షీణ దశలోనే ఉన్నాయని తెలిపింది. మాల్స్ మొత్తం ఆదాయంలో సినిమా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆదాయం 10 శాతం వరకుంటుందని క్రిసిల్ పేర్కొంది. -
నిజామాబాద్: షాపింగ్‌మాల్‌లో 75 మందికి కరోనా!
సాక్షి, నిజామాబాద్: షాపింగ్ మాల్స్ కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. జిల్లాలో కరోనా విజృంభిస్తుండడంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోనే అధికంగా కేసులు నమోదవుతుండడంతో వైరస్ నియంత్రణ కోసం టెస్టుల సంఖ్యను పెంచారు. వైరస్‌కు హాట్స్పాట్లుగా ఉండే చోట్ల పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వ్యాపార సముదాయాలలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో షాపింగ్ మాల్స్‌లో చాలామందికి పాజిటివ్ వస్తోంది. దీంతో షాపింగ్ మాల్స్ వైరస్‌కు నిలయాలుగా మారుతున్నాయి. షాపింగ్ మాల్స్‌లో ర్యాపిడ్ టెస్టులు జిల్లాలో కేసుల విృజంభణ దృష్ట్యా ఆరోగ్య శాఖ అధికారులు నియంత్రణ చర్యలు భాగంగా విసృతంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వ్యాపార సముదాయంలో ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. దీంతో కొన్ని రోజులుగా నగరంలోని షాపింగ్ మాల్స్‌లో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వీటిలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని బస్‌స్టాండ్ సమీపంలో గల ఓ షాపింగ్ మాల్స్‌లో ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది రెండు రోజులపాటు సుమారు 190 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా మొత్తం 75 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా శనివారం వినాయక్‌నగర్‌లోని ఓ వ్యాపార సముదాయంలో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రెండు సముదాయాల్లోనే 89 మందికి కోవిడ్ సోకినట్లు తేలింది. నిబంధనలు గాలికి.. ప్రతిరోజూ వందలాది మంది వచ్చే వ్యాపార సముదాయాల్లో కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. చాలా వాటిల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. మాసు్కలు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం అమలు కావడంలేదు. ప్రజలు సైతం మాసు్కలు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయినా షాపింగ్ మాల్స్ నిర్వాహకులు సైతం కనీస సూచనలు చేయడంలేదు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్‌లో నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. నివారణ చర్యలు ఎక్కడ ? అత్యధిక కేసులు నమోదవుతున్న షాపింగ్ మాల్స్‌లో నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఓ వస్త్ర దుకాణంలో 75 మందికి పాజిటివ్ వస్తే వైద్యారోగ్య శాఖ కనీస చర్యలు తీసుకోలేదు. నిబంధనల ప్రకారం షాపింగ్ మాల్స్‌ను మూసివేయాల్సి ఉన్నా యధావిధిగా కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చదవండి: ప్రముఖ నటుడు సోనూసూద్ పేరుతో భారీ మోసం.. -
కరోనా మహమ్మారి కనుమరుగైనట్లేనా?
సాక్షి, హైదరాబాద్: కొంచెం అటు ఇటుగా భారతదేశానికి కరోనా అన్న పదం, మహమ్మారి వ్యాధి పరిచయమై ఏడాది దాటుతోంది. 2019 నవంబర్‌లో చైనాలోని వూహాన్లో తొలిసారి గుర్తించిన కరోనా వ్యాధి ఆ తర్వాత ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. వ్యాధి తాలూకు కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో 2020 జనవరి 23న వూహాన్ నగరం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. జనవరి 30న కేరళలో తొలి కోవిడ్–19 కేసు నమోదైంది. మొదట్లో కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా రోజులు గడుస్తున్న కొద్దీ మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో వందల మంది వైరస్‌బారిన పడటం మొదలైంది. తొలి కేసు నమోదైన తరువాత సుమారు రెండు నెలలకు అంటే మార్చి నాలుగవ వారంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలయ్యే సమయానికి వ్యాధి అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. వ్యాధి గురించి తెలిసిన తొలినాళ్లలో దీని వ్యాప్తిపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం ఒక దశలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షల వరకూ చేరుకోవచ్చునని, మరణాలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయని ఈ పరిశోధనలు తెలిపాయి. అదృష్టమో.. మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు కానీ అంతటి విపత్తు మాత్రం రాలేదు. 2020 సెప్టెంబర్ నాటికి రోజువారీ కేసులు 99 వేల స్థాయికి చేరి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. చాలామంది ఊహించినట్లు అమెరికా, ఐరోపా దేశాల్లోలాగా సెకెండ్ వేవ్ మన దగ్గర కన్పించట్లేదు. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కట్లే.. అమెరికా, ఐరోపా దేశాలు ప్రస్తుతం మూడు, నాలుగో సారి కోవిడ్ బారిన పడి కష్టాలు అనుభవిస్తున్నాయి. భారత్‌లో మాత్రం అందుకు విభిన్న పరిస్థితి ఉండటం శాస్త్రవేత్తలకూ అంతుచిక్కట్లేదు. సెప్టెంబర్‌లో కేసుల సంఖ్య రోజుకు లక్ష వరకు చేరిన దాంతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం వరకూ కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా అంతే. సెప్టెంబర్‌లో రోజువారీ మరణాల సంఖ్య వెయ్యికిపైగా ఉంటే.. ఇప్పుడది వంద కంటే తక్కువ. ఇందుకు కారణం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామని కొందరు చెబుతున్నారు. భారత వైద్య పరిశోధన సమాఖ్య తాజా సీరో సర్వే ప్రకారం మాత్రం దేశవ్యాప్తంగా కోవిడ్–19 యాంటీబాడీలు 20 శాతం జనాభాలో ఉన్నాయి. అయితే 60 శాతం కంటే ఎక్కువ మంది జనాభాలో యాంటీబాడీస్ ఉన్నప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమనేది నిపుణుల మాట. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం కూడా దేశ జనాభాలో 25 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు లెక్కగట్టింది. యువత ఎక్కువగా ఉండటం వల్లే? భారత్‌లో ఎక్కువ శాతం మంది యువత కావడం సెకెండ్ వేవ్‌ను అడ్డుకుందన్న వాదన వినిపిస్తున్నారు. వేర్వేరు వ్యాధులకు ఇప్పటికే నిరోధకత సాధించడం కూడా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతా బాగుందనుకునేందుకు వీల్లేదని, మరికొన్ని నెలల పాటు జాగ్రత్తలు పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యూకేలో బయటపడ్డ కొత్త రకం కోవిడ్–19 కారక వైరస్ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా దక్షిణాఫ్రికా రకం వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కావడం, రెండో డోసు ఇస్తున్న నేపథ్యంలో సెకెండ్, థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని, కాకపోతే శాస్త్రీయంగా ఈ అంశాలను నిర్ధారించుకునేంత వరకు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు. -
10 రూపాయల కోసం కక్కుర్తి..15వేలు కట్టించారు
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ మాల్‌కు అధికారులు షాకిచ్చారు. 10 రూపాయల కోసం కక్కుర్తి పడిన మాల్ యాజమాన్యానికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన వి. బెజ్జం అనే వ్యక్తి ఇటీవలె సెంట్రల్ మాల్లో 1400 రూపాయలు చెల్లించి ఓ షర్ట్‌ను కొనుగోలు చేశాడు. ప్యాకింగ్ అనంతరం షర్ట్‌ను మాల్ లోగో ముద్రించిన పేపర్ బ్యాగ్ ఇచ్చి పది రూపాయలు వసూలు చేశారు. దీనిపై కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదుదారునికి పరిహారంగా మాల్ యాజమాన్యం 15వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
నీళ్లు తాగాలంటే భయం
షాపింగ్ మాల్స్ రంగురంగుల లైట్ల వెలుగు లో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ మాల్స్‌లో ఉద్యోగం చేసే సేల్స్‌గాళ్స్ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగకూడదు. ఇది ఆ ఉద్యోగ నియమం. దేహం ఎంత బాధిస్తున్నా సరే, నవ్వు మాయం కాకూడదు. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. కొనుగోలుదారుల సేవ కోసం ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే కూర్చోకూడదు... ఇది ఎక్కడా రాయరు, కానీ ఇది కూడా ఒక నియమం. ఇంకా ఘోరం ఏమిటంటే... బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్తున్నారనేది కూడా లెక్కలోకి వస్తుంటుంది. ఉదయం ఏడు గంటలకు ఇల్లు వదిలిన వాళ్లు రాత్రి ఎనిమిది వరకు షాపులోనే ఉండాలి. తిరిగి ఇల్లు చేరేటప్పటికి తొమ్మిదవుతుంది. దాదాపుగా సేల్స్గాళ్స్గా పని చేసే యువతులందరూ నీళ్లు తాగడం తగ్గిచేశారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి తరచూ వెళ్లాల్సి ఉన్న ఓ మహిళ ఉద్యోగం పోతుందనే భయంతో ట్యూబ్ అమర్చుకుని ఉద్యోగం చేసింది. ఇది కేరళ రాష్ట్రం, కోళికోద్ జిల్లాలో చోటుచేసుకున్న దయనీయ స్థితి. ఈ దుస్థితికి మంగళం పాడిందో మహిళ. పేరు విజి పెన్‌కూట్టు. చైతన్యవంతమైన కేరళ రాష్ట్రంలో కూడా ఉద్యమిస్తే తప్ప శ్రామిక చట్టాలు అమలు కాలేదంటే ఆశ్చర్యమే. అయినా ఇది నిజం. యాభై రెండేళ్ల సామాజిక కార్యకర్త విజి పెన్‌కూట్టు మహిళల కోసం పోరాడింది. న్యాయం కోసం గళం విప్పింది. బాధిత మహిళలతోపాటు సానుభూతిపరులైన మహిళలు కూడా ఆమెతో కలిసి నడిచారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిదేళ్ల పోరాటం. ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (అమెండ్మెంట్) యాక్ట్, 2018 చట్టాన్ని అమలులోకి తెచ్చింది. విజి పోరాటంతో అక్కడి ఉద్యోగినులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని ప్రదేశంలో కనీస సౌకర్యాల ఏర్పాటు సాధ్యమైంది. మన సమాజం ఆధునిక సమాజంగా మారింది. కానీ మెరుగైన సమాజంగా మారలేదింకా. అందుకే చట్టం కోసం కొన్ని పోరాటాలు, వాటి అమలు కోసం మరికొన్ని పోరాటాలు... తప్పడం లేదు. విజి పెన్‌కూట్టు వంటి సామాజిక కార్యకర్తలు తమ గళాలను వినిపించకా తప్పడం లేదు. -
షాపింగ్ బ్యాగులతో వినూత్నంగా డ్రెస్సులు
షాపింగ్‌కు నుంచి వచ్చేటప్పుడు వెంట అక్కడి బ్యాగ్ కూడా మనతో పాటు వచ్చేస్తుంది. అలా ఒక్కోటిగా పేరుకుపోయిన బ్యాగులను మూలన పడేయడం లేదా చెత్తబుట్ట పాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 22 ఏళ్ల టీచా ఏరియల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. రకరకాల షాపింగ్ బ్యాగులతో డిజైనర్ డ్రెస్సులను రూపొందిస్తుంది. ఆ డ్రెస్సులను ధరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆమె ఆలోచనను యూజర్స్ తెగ ప్రశంసిస్తున్నారు. వేస్టేజ్‌ను ఎలా తిరిగి వాడుకోవచ్చో ఈ విధానం భేషుగ్గా తెలియజేస్తుందని లైక్‌ల మీద లైకులు ఇస్తున్నారు. ఏరియల్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థి. తను చేసిన ఆలోచన మాత్రం ప్రపంచమంతా ఆకట్టుకునేలా ఉంది. షాపింగ్ బ్యాగుల నుండి అధిక మొత్తంలో ఫ్యాషన్ దుస్తులను సృష్టించిన ఘనత ఏరియల్ సొంతం. ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా వచ్చిన ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేసింది. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు చేసే ఆలోచనల్లో షాపింగ్ బ్యాగ్ డ్రెస్సులు క్లిక్ అయ్యాయి. ఒక్కో బ్యాగ్ కట్ చేసి.. వినూత్నంగా డ్రెస్సులు తయారు చేయడానికి ఇంట్లో స్టోర్ రూమ్‌లో ఉంచిన బ్యాగ్‌లను బయటకు తీసుకువచ్చింది. లాక్డౌన్ టైమ్ ఈ సృజనకు కొంత ఊతమిచ్చింది. ‘మొదట్లో ఖాళీ సమయం బాగా విసుగ్గా అనిపించేది. ఎప్పుడైతే షాపింగ్ బ్యాగుల నుండి ఫ్యాషన్ డ్రెస్సులను తయారుచేయాలనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి సమయమే తెలియలేదంటుంది’ ఏరియల్. డ్రెస్సుల కోసం వాల్‌మార్ట్, టార్గెట్, వేన్స్, ట్రేడర్ జో బ్రాండ్ బ్యాగ్‌లను ఉపయోగించింది. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి ప్రతి సంచిని జాగ్రత్తగా కట్ చేసి, అమరిక ప్రకారం కుట్టింది. మిగిలిన సంచుల మెటీరియల్ నుండి అందమైన ఉపకరణాలనూ తయారు చేసింది. మనం ఉపయోగించి, పడేసే వస్తువులను తిరిగి ఎన్నిసార్లు వాడదగినవి రూపొందించుకోవచ్చో తన ప్రయత్నంతో తెలియజేస్తుంది. ఏరియల్ డ్రెస్ డిజైన్స్ చూసినవారు తాము కూడా అలాంటి దుస్తులు డిజైన్ చేస్తామని తెలిపారు. ఈ షాపింగ్ సంచుల నుండి కర్టెన్లు, రగ్గులు, ఇతర వాడదగిన వస్తువులను ఎలా ఉపయోగించాలో ప్రజలు నేర్చుకోవాలని ఈ అమ్మాయి కోరుతుంది. -
మాల్లో ప్రముఖ నటికి లైంగిక వేధింపులు
ఆడవారిని చూస్తే చాలు కొందరు మగాళ్ల బుర్రలోకి పురుగు దూరుతుంది. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెట్టి.. బాధపడుతుంటే ఆనదించడం వీరికి మహా సరదాగా ఉంటుంది. చుట్టూ ఎందరు ఉన్నా సరే వీరు ఏ మాత్రం భయపడరు. పైగా చూడటానికి ఎంతో మర్యాదస్తులుగా బిల్డప్ ఇస్తూ.. చండాలపు పనులు చేస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీలను చూస్తే.. వీరి సైకోయిజం పీక్స్‌కు చేరుతుంది. ఎలాగోలా వారిని వేధింపులకు గురి చేసి.. సంబరపడుతుంటారు. తాజాగా ఓ మలయాళ నటికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. కుటుంబంతో కలిసి షాపింగ్ కోసం మాల్కి వెళ్లిన సదరు నటిని ఇద్దరు వ్యక్తులు అసభ్యకర రీతిలో తాకి.. వేధింపులకు గురి చేశారు. ఈ ఊహించని ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నటి.. కుటుంబ సభ్యులు వచ్చి పలకరించే వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయినట్లు తెలిపారు. అనంతరం వారికి బుద్ది చెప్పాలని భావించి చూడగా అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఇక తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నటి. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: 'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు') ఇక దానిలో సదరు నటి ‘సోషల్ మీడియాలో నాటకీయంగా మాట్లాడటం నాకు చేతకాదు. కానీ ఈ రోజు నేను ఎదుర్కొన్న భయానక అనుభవం నా చేత ఈ పని చేయిస్తుంది. అమ్మ, చెల్లి, అన్న, నాన్నతో కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న లూలు హైపర్మార్కెట్కి వెళ్లాను. అక్కడ నన్ను గమనించిన ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకి వచ్చి.. మాట్లాడేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాల వివరాలు అడిగారు. ఇంతలో ఓ వ్యక్తి నా భుజం మీద చేయి వేశాడు. వెంటనే నేను మీ హద్దుల్లో ఉంటే మంచిది అని హెచ్చరించే సరికి చేయి తీశాడు. నేను ఇబ్బంది పడటం గమనించి మా అమ్మ నావైపు రాసాగింది. ఇది గమనించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్తున్నవారిద్దరిలో ఓ వ్యక్తి నా వెనక భాగంలో అసభ్యకరంగా తాకి వెళ్లాడు. ఒక్క నిమిషం పాటు నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. నా పరిస్థితి గమనించి మా చెల్లి నా దగ్గరకి వచ్చి.. ‘నేను బాగానే ఉన్నానా’ అని ప్రశ్నించిది. అప్పుడు నేను ఈ లోకంలోకి వచ్చాను. జరిగిన అవమానం గుర్తుకు వచ్చి ఏడుపొచ్చింది. నాకు ఇంత అవమానం చేసిన వారి చెంప పగలగొడదామని భావించి వారి కోసం చూశాను. కానీ అప్పటికే అక్కడి నుంచి జారుకున్నారు’ అని తెలిపారు. (చదవండి: బాలిక శీలానికి వెలకట్టారు! ) ‘ఇక ఇంటికి వచ్చాక కూడా నా మీద నాకే కోపంగా ఉంది. నాకు అవమానం జరిగినప్పుడు వెంటనే స్పందించలేకపోయాను. వెధవల చెంప పగలగొట్టలేకపోయాననే బాధ వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే స్పందించి.. ధైర్యంగా ఎదురుతిరగాలనే ఉద్దేశంతో దీని గురించి వెల్లడిస్తున్నాను’ అంటూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నటికి మద్దతుగా నిలుస్తూ.. ఇలాంటి శాడిస్టులను ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఈ పోస్ట్‌ని సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ కేసు రిజిస్టర్ చేసింది. -
సినిమా చూపించలేం మావా!
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి. హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం. కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్లు తన శోభ కోల్పోకూడదు. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు. -
శుభ ఘడియలు షురూ..
పెళ్లంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు. ఎందరికో చేతినిండా పని. కానీ కరోనా కారణంగా దాదాపు ఆరునెలలుగా పనిలేక పస్తులున్న వివిధ వృత్తుల వారికి ఇప్పుడిప్పుడే కాస్త ఊరట లభిస్తుంది. ముందున్నవి శుభముహూర్తాల రోజులు కావడంతో చేతినిండా పని దొరకనుంది. కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడుకల్లో జాగ్రత్తలు చాలా అవసరం అని తెలుపుతున్నారు. సాక్షి, నిర్మల్ చైన్‌గేట్: కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పండుగలకు తోడు వరుసగా శుభముహూర్తాలు ఉండటంతో వ్యాపార సంస్థలు కళకళలాడుతున్నాయి. గత నెల 29 నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్న వ్యాపార వాణిజ్య సంస్థలకు బతుకమ్మ పండుగలతో గిరాకీ పెరిగింది. రానున్న పెళ్లి ముహూర్తాలతో మరింత జోరందుకుంది. జనతా కర్ఫ్యూతో మొదలై మూడు నెలల పాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేశారు. ఆ మూడు నెలల్లో ముహూర్తాలు ఉన్నప్పటికీ పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత కొన్ని ముహూర్తాలు వచ్చినా తక్కువ మందితో వివాహాలు జరిపించారు. ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కన్నవారు వాయిదా వేసుకోలేక, కా నిచ్చేద్దామనుకున్న వారు ఇంటి ముందర పాత పద్ధతుల్లో పచ్చని పందిళ్లు వేసి మమ అనిపించేశారు. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ మూడు నెలలు సందడే సందడి శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజ ఆశ్వీయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల్లోనూ శుభముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. గత నెల 18 నుంచి ఎంగేజ్మెంట్ పత్రిక రాసుకోవడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. మంచి రోజులు కావడంతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభ ముహూర్తాలతో దాదాపు మూడు నెలల పాటు పెళ్లిల సందడి ఉండే అవకాశాలున్నాయి. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలలపాటు ముహూర్తాలకు బ్రేక్ పడనుండటంతో ఈ సీజన్లోనే శుభకార్యాలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 4 నుంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు. జనవరి 16నుంచి నాలుగు నెలల పాటు ఈ శుభ ముహూర్తాలకు విరామం రానుంది. మార్కెట్‌కు కొత్త శోభ.. మార్కెట్లలో దసరా బతుకమ్మ పండుగలతో మొదలైన సందడి వచ్చే రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడెనిమిది నెలలుగా కరోనాతో ప్రజలు రాక బోసిపోయిన వ్యాపారాలన్నీ ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. దీంతో వ్యాపార కూడళ్ల దగ్గర రద్దీ పెరిగింది. వస్త్రాలు, బంగారం దు కాణాలు, లేడీస్ ఎంపోరియాలు, ఫర్నీచర్, స్టీల్ పాత్రల దుకాణాలు ఇలా పెళ్లిళ్లకు అవసరమైన అన్ని రకాల వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లికి కావలసిన సామగ్రి కొనడానికి వస్తున్న ప్రజలతో దుకాణాలన్నీ మునుపటి కళను సంతరించుకున్నాయి. దసరాకు మొదలైన షాపింగ్ కళ నేటికీ కొనసాగుతోంది. కరో నాతో కొట్టుమిట్టాడిన వ్యాపారస్తులు ప్రస్తుతం కాస్త ఊపిరితీసుకుంటున్నారు. వృత్తులకు ఊరట ఇన్నాళ్లు ఉపాధి కోల్పోయిన వేలాది మంది వివిధ వృత్తుల వాళ్లకు ఇ ప్పు డు కొంత ఊరట కలుగుతోంది. ప్రధానంగా వంటవారు, క్యాటరింగ్ , డె కరేటర్స్ , టెంట్‌హౌస్, ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఫంక్షన్ హాల్స్, స్వర్ణకారులు, ఫర్నీచర్ తయారీదారులు, దర్జీలు, కార్లు, జీపులు, బస్సుల యజమానులు, డ్రైవర్లు, సన్నాయివాయిద్య కళాకారులకు పని దొరకనుంది. ఇక పెళ్లి వేడుకల్లో పాల్గొనే కులవృత్తుల వారైన చాకలి, మంగలి వారికి కూడా ఉపాధి లభించనుంది. ఇంతకాలం చేతిలో పని లేక ఇబ్బందిపడ్డ వే లాది కుటుంబాలకు ప్రస్తుతం పని లభిస్తుండటంతో వారు బిజీ అ య్యా రు. నెలల తరబడిగా చేయడానికి పనులు లేక చాలా మంది ఇతర పనుల కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే రెడీమేడ్ వస్త్రాల రాకతో ఉపాధి కో ల్పోయి న దర్జీలు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా సీ జన్తోపాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో వారికి కొంత ఉపశమనం కలిగింది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సుమా.. కరోనా కంగారు కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది.. కానీ జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా పూర్తిగా మాయం కాలేదని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. వేడుకలు చేస్తూ.. పెద్ద సంఖ్యలో జనం ఒక దగ్గర గుమిగూడటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని తెలుపుతున్నారు. సానిటైజర్ల వాడకం తప్పనిసరి అని తెలుపుతున్నారు. సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని అజాగ్రత్తగా ఉండకూడదని సూచిస్తున్నారు. -
దుకాణాల్లో పండుగ సందడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్లో పండుగ జోష్ కనపడుతోంది. ప్రధానంగా వస్త్రాలు, మొబైల్స్, గృహోపకరణాలు, వాహనాల విక్రయశాలలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. కోవిడ్-19 ప్రభావంతో ఏప్రిల్–జూలై కాలంలో రిటైల్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆగస్టు, సెప్టెంబరు నుంచి కస్టమర్ల తాకిడి మొదలైంది. ఇప్పుడు పండుగల సీజన్‌తో దుకాణాలు సందడిగా మారాయి. ఆన్‌లైన్‌కు ధీటుగా రిటైల్ సంస్థలు కోట్లాది రూపాయల విలువైన బహుమతుల ప్రకటించాయి. కోవిడ్ నుంచి మార్కెట్ కోలుకుంటోందని, ఇది శుభపరిణామమని విక్రేతలు అంటున్నారు. మరోవైపు రుణ మార్కెట్లో తిరిగి చెల్లింపులు పెరగడంతో కస్టమర్లకు విరివిరిగా లోన్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. జీరో డౌన్‌పేమెంట్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌కు ధీటుగా ఆఫర్లు.. డిస్కౌంట్లతో ఆన్లైన్ సంస్థలు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఈ కంపెనీలకు ధీటుగా సంప్రదాయ విక్రయ సంస్థలు కోట్లాది రూపాయల విలువ చేసే బహుమతులు, డిస్కౌంట్లు, ఆఫర్లతో ముందుకు వచ్చాయి. అటు వినియోగదార్లు సైతం పండుగల సీజన్ కోసం వేచిచూస్తుంటారు. ఏడాది కాలంలో జరిగే అమ్మకాల్లో ఫెస్టివల్ సీజన్ వాటా 30-40 శాతం దాకా ఉంటోంది. ‘విపత్కర పరిస్థితి నుంచి మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందో అన్న బెంగ అందరిలో ఉంది. అయితే గతేడాది ఈ సీజన్లో జరిగిన వ్యాపారంతో పోలిస్తే ఇప్పుడు 60 శాతం నమోదవుతోంది. మొత్తంగా చూస్తే కోవిడ్ నుంచి మార్కెట్ కోలుకుంటుండడం ఆనందించే విషయం’ అని క్లాసిక్ పోలో సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గుండుబోయిన శ్రీకాంత్ తెలిపారు. 2019తో పోలిస్తే సేల్స్ తక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్ తిరిగి గాడిలో పడుతోందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ వివరించారు. స్కోర్ తక్కువగా ఉన్నా.. రుణాల విషయంలో ఇటీవలి కాలం వరకు ఆచితూచి వ్యవహరించిన ఆర్థిక సంస్థలు.. మార్కెట్ తిరిగి పుంజుకోవడంతో ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నాయి. వాయిదాల్లో మొబైల్స్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, వాహనాల కొనుగోలుకు 35 శాతం దాకా డౌన్ పేమెంట్‌తోపాటు సిబిల్ స్కోర్ కనీసం 775 ఉంటేగానీ రుణం ఇవ్వని ఈ కంపెనీలు.. స్కోర్ తక్కువగా ఉన్నా రుణం ఇచ్చేందుకు నేడు ముందుకు వస్తున్నాయి. అంతేగాక జీరో డౌన్ పేమెంట్‌తో ఈఎంఐలను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు, రిటైలర్ల భాగస్వామ్యంతో క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తుండడం విశేషం. బజాజ్ ఫైనాన్స్, తదితర సంస్థలు వినియోగదార్ల సౌకర్యార్థం 24 నెలల వరకు ఈఎంఐ అందిస్తున్నాయి. ట్రెండ్‌నుబట్టి చూస్తే గతేడాది కంటే ఈ పండుగల సీజన్లో అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. మొదలైన చెల్లింపులు.. లాక్డౌన్ సమయంలో రుణ పరిశ్రమ 40% తిరోగమనం చెందింది. ‘చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. ఇప్పుడు పూర్తిగా చెల్లిస్తుండడంతో కస్టమర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపి స్తున్నారు. పరిశ్రమలో 25 శాతం దాకా కస్టమర్లు మారటోరియంను వినియోగించుకున్నారు. వీరిలో 70-80 శాతం దాకా తిరిగి రుణాలను చెల్లిస్తున్నారు. దీంతో జీరో డౌన్ పేమెంట్‌తో కొత్త రుణాలను జారీ చేస్తున్నాం. మారటోరియం వినియోగించుకున్న వారు 2–3 ఈఎంఐలు చెల్లిస్తే వారికి కొత్త రుణాలను కొంత పరిమితితో ఇస్తున్నాం’ అని ఓ ప్రముఖ కంపెనీ ఉన్నతాధికా రి అన్నారు. మొబైల్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విషయంలో సెప్టెంబరు ముందు వరకు సగటు రుణం రూ.10-15 వేలు ఉండేది. ఇప్పుడు ఇది రూ.18-20 వేల మధ్య నమోదవుతోంది. -
ముంబైలో అగ్ని ప్రమాదం
ముంబై: సెంట్రల్ ముంబైలోని మూ డంతస్తుల సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి 8.50 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. తీవ్రంగా శ్రమించిన అగ్ని మాపక సిబ్బంది శుక్రవారం సాయంత్రానికి మంటలను అదుపులోకి తేగలిగారు. ప్రమాద సమయంలో మాల్లో 300 మంది వినియోగదారులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల ఆర్కిడ్ ఎన్క్లేవ్ టవర్‌లో నివసించే 3,500 మందినీ బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నామనీ, మొత్తం 3,800 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు అధికారులు చెప్పారు. మంటలను ఆర్పుతుండగా ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. బేస్‌మెంట్‌తో కలిపి నాలుగు ఫ్లోర్లున్న ఈ మాల్ రెండో అంతస్తులోని మొబైల్ షాప్‌లో మొదటగా మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈ తల్లీపిల్లలు ఏమయ్యారో..?
సాక్షి, తిరుపతి: షాపింగ్‌కంటూ ముగ్గురు పిల్లలతో వెళ్లిన తల్లి అదృశ్యమైన సంఘటన తిరుపతిలో కలకలం రేపింది. వివరాలు.. స్థానిక కెనడీనగర్‌కు చెందిన శివకుమార్, శ్రీలేఖ దంపతులకు దీక్షితశ్రీ, తేజస్విశ్రీ, కార్తీక్ సంతానం. శ్రీలేఖ ముగ్గురు పిల్లలతో ఆదివారం మధ్యాహ్నం రిలయన్స్ మార్ట్‌కు వెళ్లింది. షాపింగ్ అనంతరం భర్తకు కాల్ చేసి మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. భార్యాపిల్లల కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో శివకుమార్ ఫిర్యాదు చేశారు. (రాళ్లతో దాడికి తెగబడి.. కాల్పులు జరిపేందుకు..) రిలయన్స్ మార్ట్ నుంచి తన ముగ్గురు పిల్లలతో శ్రీలేఖ రోడ్డుపై వెళుతున్నట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. దీంతోపాటు బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరంలోని కొన్ని ప్రముఖ కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, తన భార్యతో ఎలాంటి గొడవలూ లేవని, ఎవరితో కూడా తమ కుటుంబానికి శత్రుత్వం లేదని శివకుమార్ పేర్కొన్నారు. శ్రీలేఖ తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఇదే మాట స్పష్టం చేశారు. బహుశా తన భార్యాపిల్లలను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని శివకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ మిస్సింగ్ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
నిజామాబాద్‌లో హెబ్బా, పాయల్ సందడి ఫొటోలు
-
ఫోన్ నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..
సాక్షి హైదరాబాద్: సుభాష్ అర్జంట్ పనిమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్ రావడంతో ఎవరో అని లిఫ్ట్ చేశాడు. సార్.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తారా అని అంటోంది. అసలే చీకాకులో ఉన్న అతను ఫోన్ కట్ చేశాడు. ఇలాంటి ఫోన్లు ఒక్క సుభాష్‌కే కాదు.. నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పలకరిస్తాయి. ఎందుకంటే షాపింగ్ చేసినపుడు ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి.. నగర జీవితం ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు బిజీగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్ కూడా మనతోపాటు బిజీ అయిపోయింది. ఎప్పుడు.. ఎక్కడ ఉన్నా మొబైల్ ఉండాల్సిందే. కాల్స్ వస్తూనే ఉంటాయి. మనం మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇటీవల టెలీకాలర్ల నుంచి ఫోన్లు ఎక్కువగా రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. సార్.. అంటూ తీయటి గొంతుతో మాట్లాడటం.. సమయం వృథాచేయడం.. లోన్..క్రెడిట్‌కార్డ్ అంటూ మాట్లాడుతున్నారు. ఎక్కువగా యువతులే ఫోన్లు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీ, వివిధ బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు.. మార్కెటింగ్ సంస్థల నుంచి కాల్స్ వస్తున్నాయి. వ్యక్తిగత రుణం కావాలా? క్రెడిట్ కార్డు కావాలా..సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ ఫోన్ కంపెనీల వారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్స్కు టిప్స్ చెబుతామంటూ కొందరు, నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెంచర్ ఉందని, ప్లాట్ బుక్ చేసుకోమని ఇంకొందరు నిత్యం ఫోన్ చేస్తూనే ఉంటారు. కొత్త సిమ్ తీసుకున్నా... మార్కెటింగ్ కాల్స్‌కు తోడు నకిలీలు కూడా పుట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్, సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వ్యక్తిగత రుణాల పేరిట జరుగుతున్న మోసాల గురించి తెలియని విషయం కాదు. ఇలాంటి వారి వేధింపులు భరించ లేక చాలామంది ఫోన్ నంబర్లు మార్చుతున్నారు. ఆ నంబర్లను కూడా టెలీకాలర్స్ సేకరంచి ఫోన్ చేస్తున్నారు. వారు అందరి ఫోన్ నంబర్లు ఎలా సేకరిస్తున్నారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సెల్‌ఫోన్ కంపెనీలతోపాటు పలు మార్గాల ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లను సైతం సేకరించి కాల్ చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ముందే కరోనా కాలం జనం ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. దీనికి తోడు అ వస్తువు కొనండి మంచి ఆఫర్ ఉంది. మీరు మా సంస్థలో పెట్టుబడి పెడితే అత్యధికంగా వడ్డీ లభిస్తుంది. అని కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. నిరంతరం కాల్స్ రావడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకట్ట ఎలా? ఇలా అడ్డూ అదుపు లేకుండా కాల్స్ వస్తుంటే.. ఏం చేయాలో దిక్కుతోచక మొబైల్ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక..ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి కాల్స్‌పై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని యూజర్లు కోరుతున్నారు. బ్లాక్ చేసినా... ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు మార్కెటింగ్ కాల్స్ వద్దనుకునే వారు డీఎన్డీ (డూనాట్ డిస్టర్బ్) ఆప్షన్ ఎంచుకునే వారు. అప్పట్లో మార్కెటింగ్ నంబర్లు వేరుగా కనిపించేవి. డీఎన్డీ ఎంచుకున్న తర్వాత కూడా టెలీకాలర్స్ మార్కెటింగ్ నంబర్స్ నుంచి కాకుండా వేరే ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నారు. తరచూ ఫోన్లు వస్తున్నాయని ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి కాల్ చేస్తున్నారు. బ్లాక్ అయిన ఫోన్ నెంబర్లు స్పామ్ (రెడ్ కలర్)లో కనిపిస్తాయి. నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే.. మనం రోజుల వారి షాపింగ్, ఆసుపత్రులకు, మెడికల్ షాపుల్లో కొనుగోలుచేస్తుంటాం. అప్పుడు బిల్లింగ్ సమయంలో మీ ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటారు. ఇలా మనం తెలుసో తెలియకో మన నంబర్ చెబుతాం.ఫోన్ నంబర్ ఇవ్వలేమని చెబితే మీ వస్తువులు బిల్ చేయాలంటే సిస్టమ్‌లో నంబర్ ఎంటర్ చేయాలని, లేకపోతే బిల్ వీలుకాదని సమాధానం ఇస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీ నంబర్ ఇతరులకు వెళ్లిపోతుంది. పలు వ్యాపార సంస్థలు నెంబర్లు ఆయా మాల్స్,వ్యాపార సంస్థల నుంచి సేకరిస్తాయి. పలు సందర్భాల్లో మీకు ఫోన్ చేస్తున్న వ్యక్తి మీ వృత్తి, ఉద్యోగం గురించి కూడా చెబుతాడు. అంటే మీరు షాపింగ్ సమయంలో ఆ వివరాలు రాసిచ్చారన్నమాట. -
‘వాసన రావడం లేదా.. అయితే కరోనానే’
బెంగళూరు: మాల్స్‌కు వెళ్లి షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఒకసారి మీ ముక్కు సరిగా పని చేస్తుంది లేనిది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట బెంగళూరులో షాపింగ్ మాల్స్‌లోకి వచ్చే వారికి టెంపరేచర్‌తో పాటు స్మెల్ టెస్ట్ కూడా చేయాలని నగర మేయర్ గౌతమ్ కుమార్ సూచించారు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే.. వారికి కరోనా సోకినట్లే అంటున్నారు గౌతమ్ కుమార్. ఈ క్రమంలో మంగళవారం మేయర్ మాట్లాడుతూ.. ‘మాల్స్‌లోకి వచ్చే వారు ఎవరైనా స్మెల్ టెస్ట్‌లో ఫెయిలయితే.. వారిని లోనికి అనుమతించకండి. ఎందుకంటే కరోనా సోకిన వారు రుచి, వాసన గుర్తించలేరు. దీని గురించి కర్ణాటక ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాస్తాను. మాల్స్‌లో స్మెల్ టెస్ట్‌లు చేయడం తప్పని సరి చేస్తూ ఆదేశించాల్సిందిగా లేఖలో కోరతాను’ అన్నారు గౌతమ్ కుమార్. (వైద్యుడి కుటుంబాన్ని వెంటాడిన కరోనా) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన దాని ప్రకారం కరోనా రోగుల్లో జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం వంటి వాటితో కూడా బాధపడుతున్నట్లు వెల్లడించింది. కానీ ఇంతవరకు ఒక్క కరోనా రోగిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించలేదని సమాచారం. అయితే రుచి, వాసన కోల్పోటం అనే లక్షణాలు కరోనాలో మాత్రమే కాక ఫ్లూ, ఇన్ఫ్లూఎంజా ఉన్నప్పుడు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. వ్యాధి ప్రారంభ దశలో ఈ లక్షణాలు కన్పిస్తాయని వీటిని గుర్తించిన వెంటనే చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.ఆకస్మికంగా రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కరోనా పరీక్షకు ప్రామాణికంగా గత నెలలో ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ముంబై షాపింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
-
షాపింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
ముంబై (మహారాష్ట్ర): షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగిన ఘటన ముంబైలోని పశ్చిమ బోరివాలిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో 14 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం ఏమైనా జరిగాయా అన్నదానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. గత నెలలోనూ దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కువైట్ కార్యకలాపాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రాఫోర్డ్ మార్కెట్లోని పలు దుకాణాల్లో కూడా మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. Maharashtra: A level 4 fire broke out at a shopping centre in Borivali West of Mumbai earlier this morning; 14 fire engines and Police are at the spot. Fire fighting operations are still underway. pic.twitter.com/tRAXr8guSt — ANI (@ANI) July 11, 2020 -
లాకులెత్తారు!
న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ‘లాక్డౌన్’ నుంచి వ్యూహాత్మక ‘అన్‌లాక్’ దిశగా దేశం మరో అడుగు వేసింది. మార్చి 25 తరువాత తొలిసారి దేశవ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనల మధ్య ఆయా ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనాలయాలు, మాల్స్‌లో ప్రవేశానికి సంబంధించి.. పరిమిత సంఖ్యలో వ్యక్తులను లోనికి అనుమతించడం, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి చేయడం, ఆ ప్రదేశమంతా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, ప్రవేశ ప్రాంతాలు సహా ఇతర ముఖ్య ప్రదేశాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.. తదితర నిబంధనలను పాటించారు. అయోధ్యలోని రామజన్మభూమి, ఉడిపిలోని మూకాంబికా దేవాలయం, ఢిల్లీలోని జామామసీదు, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం మొదలైనవి తెరుచుకున్నాయి. షాపింగ్ మాల్స్‌కి ఊహించిన స్థాయిలో వినియోగదారులు రాలేదు. కరోనా భయం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు అందుకు కారణంగా భావిస్తున్నారు. రెస్టారెంట్లలోనూ అరకొరగానే ఆహార ప్రియులు కనిపించారు. వెయిటర్లు ఫేస్ షీల్డ్‌లు ధరించి సర్వీస్ చేశారు. టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లలో డిజిటల్ మెన్యూస్, డిజిటల్ పేమెంట్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ప్రార్థనాలయాలు, మాల్స్‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. -
రండి.. రండి..
-
జన సందోహంపై కఠిన నిషేధం
సాక్షి, హైదరాబాద్: దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించడంలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలను అనుమతించనున్నారు. ఈ క్రమంలో ఆయా సంస్థల నిర్వాహకులు పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ల నిర్వాహక కమిటీలు/ట్రస్టులు/సొసైటీలే బాధ్యులని స్పష్టం చేసింది. వీటిని అమలు చేయడంలో విఫలమైతే ఆయా స్థలాలను మూసివేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఇవీ సాధారణ మార్గదర్శకాలు.. ► ప్రవేశద్వారం వద్ద హ్యాండ్‌వాష్/శానిటైజర్, థర్మల్ స్కానింగ్ సదుపాయం ఏర్పాటు చేసి, కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ► భక్తులు, వినియోగదారులు, సిబ్బంది మాస్కు ధరించడం తప్పనిసరి. ► భారీ సమూహాలు/జన సందోహాలపై కఠిన నిషేధం.. ఏసీల టెంపరేచర్‌ను 24–30 సెంటీ గ్రేడ్ల మధ్య సెట్ చేయాలి. గాలిలో తేమశాతం 40–70 నిడివిలో ఉండేలా చూడాలి. ఆయా ప్రాంతాలను క్రమం తప్పకుండా పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారకాలు పిచికారీ చేస్తుండాలి. ► డోర్నాబ్స్, లిఫ్టుల బటన్లు, హ్యాండ్ రెయిల్స్, బెంచీలు, వాష్రూంలలోని పరికరాలు, తరచుగా జనం ముట్టుకునే వస్తువులను క్రమం తప్పకుండా 1 శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి ► వరుసల్లో ప్రజల మధ్య భౌతిక దూరం ఉండేలా మార్కింగ్ చేయాలి. ► వ్యాలెట్ పార్కింగ్ కోసం తీసుకునే వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, తాళం చెవులు తదితరాలను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ► లిఫ్టుల్లో నియంత్రిత సంఖ్యలో మాత్రమే వ్యక్తులను అనుమతించాలి. ► షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలోని గేమింగ్, క్రీడా సదుపాయాలపై నిషేధం కొనసాగుతుంది. మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌పై అనుమతి లేదు. మత/ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన నిబంధనలు ► ప్రాంగణంలో ప్రవేశించే ముందు అందరూ తమ చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి ► స్థల పరిమాణంతో పోల్చితే అధిక సంఖ్యలో భక్తులను అనుమతించరాదు. ► వరుసల్లో నిలబడిన వ్యక్తులను నియంత్రించడానికి అవసరమైతే డిస్పోజబుల్ పేపర్ కూపన్లను జారీ చేయాలి. ► విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను, మజార్లను ముట్టుకోవడానికి అనుమతి లేదు. ► ప్రార్థన కోసం సామూహికంగా ఒకే చాప (జానిమాజ్/మ్యాట్) వాడరాదు. ఎవరి చాప వారు తెచ్చుకోవాలి. ► ప్రసాదం, పవిత్ర జలాలు, తదితర పదార్థాల పంపిణీకి అనుమతి లేదు. ► సామూహిక వంటలు, లంగర్లు, అన్నదానాలు వంటి కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తయారు చేసి పంపిణీ చేయాలి.