Temba Bavuma
-
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
గతేడాది టెస్టుల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా తెంబా బవుమా (Temba Bavuma) రాణించడంతో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్-2025కి చేరుకుంది.డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పన్నెండు మ్యాచ్‌లకు గానూ ఎనిమిది గెలిచిన బవుమా బృందం.. మూడింట ఓడి.. ఒకటి డ్రా చేసుకుంది, ఫలితంగా 100 పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. విజయాల శాతం (69.440) పరంగా మాత్రం అన్ని జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచి అగ్రస్థానాన్ని సంపాదించింది.ఆస్ట్రేలియాతో మ్యాచ్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 11న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (SA vs AUS)తో తలపడనుంది. అయితే, ఈ మెగా మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ సౌతాఫ్రికా ఫోర్-డే సిరీస్ మ్యాచ్ సందర్భంగా తెంబా బవుమా గాయపడ్డాడు.దేశీ రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న బవుమా గాయపడ్డాడు. అతడి ఎడమ మోచేతికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. కాగా లయన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరుకుని.. టైటాన్స్ జట్టుతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.ఇక గురువారం నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. బవుమా గాయపడిన విషయం ఆఖరి నిమిషంలో లయన్స్ వర్గాలకు తెలిసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. లయన్స్ కెప్టెన్ డొమినిక్ హెండ్రిక్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. అయితే, గాయం తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.2022లో మూడు నెలలపాటుకాగా 2022లో బవుమా ఎడమ మోచేయి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అదే రీతిలో గతేడాది ఐర్లాండ్‌తో వన్డే సందర్భంగా గాయపడ్డాడు. దీంతో బంగ్లాదేశ్‌తో టెస్టులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఎడమ మోచేయికి గాయం కావడం సౌతాఫ్రికా బోర్డులో ఆందోళన రేకెత్తిస్తోంది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అయితే, బవుమా గనుక అప్పటికి కోలుకోలేకపోతే.. జట్టుకు ఎదురుదెబ్బ తప్పదు. ఏదేమైనా బవుమా గాయంతో.. తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికాకు నిరాశ ఎదురయ్యే పరిస్థితులు తలెత్తాయి.శతకాలతో అలరించికాగా బవుమా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికాను సెమీ ఫైనల్‌కు చేర్చాడు. ఎడమ మోచేయికి కట్టుతోనే అతడు ఈ మెగా వన్డే టోర్నమెంట్లో బ్యాటింగ్ చేశాడు. ఇక టెస్టు ఫార్మాట్ విషయానికొస్తే... గతేడాది బవుమా ఐదు మ్యాచ్‌లు ఆడి 503 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆడిన ఒకే ఒక్క టెస్టులోనూ శతక్కొట్టాడు.ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీని 2019లో ప్రవేశపెట్టగా.. తొలి సీజన్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక 2021-23 సీజన్లోనూ భారత్ ఫైనల్‌కు చేరింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక తాజాగా 2023-25 ఎడిషన్‌లో మరోసారి ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ సేనను 3-1తో ఓడించి మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చదవండి: పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త! -
ఆ నలుగురి వల్లే ఈ ఓటమి.. కానీ అతడు మాత్రం అద్బుతం: బవుమా
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరోసారి సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో లహోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. డేవిడ్ మిల్లర్ 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ విరోచిత సెంచరీతో పోరాడినా విజయం మాత్రం ప్రోటీస్‌కు దక్కలేదు. లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ టెంబా బవుమా (56), వాన్ డర్ డుసెన్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. అతడితో పాటు ఫిలిప్స్, హెన్రీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, బ్రెస్‌వెల్ ఓ వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(102) సెంచరీలతో మెరిశారు.ఇక సెమీస్‌లో ఓటమిపై మ్యాచ్ అనంతరం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా స్పందించాడు. భాగస్వామ్యాలు రాకపోవడంతోనే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైమని బావుమా తెలిపాడు."న్యూజిలాండ్ మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే వారు బ్యాటింగ్ చేసిన విధానం చూసి మేం సునాయసంగా 350 పైగా పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామని భావించాను. కానీ మేము అలా చేయలేకపోయాము. ముఖ్యంగా భాగస్వామ్యాలను సాధించలేకపోయాము.కేవలం రెండు భాగస్వామ్యాలు మాత్రమే వచ్చాయి. మిడిల్ ఓవర్లలో రాస్సీ లేదా నేను ఎవరో ఒకరు ఛాన్స్ తీసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే 360 పరుగుల లక్ష్యం చేధన అంత ఈజీ కాదు. ఈ ప్రయత్నంలోనే నా వికెట్ కోల్పోవల్సి వచ్చింది. ఆ తర్వాత రాస్సీ కూడా దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.అయితే మేము ఔటయ్యాక ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరున్నాము. మేము అనుకున్నట్లు డేవిడ్ మిల్లర్ ఆ బాధ్యత తీసుకున్నాడు. మిల్లర్ గత కొన్నేళ్లగా మా జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించాడు. ఈ రోజు కూడా అతడిపై ఆశలు పెట్టకున్నాము. కానీ అతడికి సహకరించే వారు లేకపోవడంతో ఓటమి పాలైము. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. గ్యాప్స్ రాబట్టి వారు బౌండరీల సాధించిన తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. మిడిల్ ఓవర్లలో మేము వికెట్లు తీయలేకపోయాము. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ రోజు వారిద్దరూ చాలా బాగా ఆడారు. ఆఖరిలో ఫిలిప్స్, మిచెల్ కూడా దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. ఏదేమైనప్పటికి వారు మా కంటే మెరుగైన క్రికెట్ ఆడారు" అని బవుమా పేర్కొన్నాడు.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ -
CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లోకి న్యూజిలాండ్.. సెమీస్‌లో సౌతాఫ్రికా చిత్తుఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (100 నాటౌట్) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 212 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. డేవిడ్ మిల్లర్ (25), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. సాంట్నర్ (7-0-29-3) సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ ఔట్189 పరుగుల వద్ద (32.6వ ఓవర్) సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (31) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. క్లాసెన్ ఔట్167 పరుగుల వద్ద (28.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో హెన్రీకి క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (3) ఔటయ్యాడు. మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. డసెన్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (26.5వ ఓవర్) మూడో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో డసెన్ (69) క్లీన్ బౌల్డయ్యాడు. మార్క్రమ్ (16), క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 202 పరుగులు చేయాలి.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా125 పరుగుల వద్ద (22.2వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (56) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సాంట్నర్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి బవుమా ఔటయ్యాడు. డసెన్‌కు (50) జతగా మార్క్రమ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆచితూచి ఆడుతున్న డసెన్, బవుమా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా (42), డసెన్ (34) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 94/1గా ఉంది. రికెల్టన్ 17 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు:టెంబా బవుమా 25, డసెన్ 14 పరుగులతో ఉన్నారు. 56-1తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా4.5: మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ర్యాన్ రెకెల్టన్ బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. రచిన్, విలియమ్సన్ శతకాలు.. న్యూజిలాండ్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 300 దాటిన న్యూజిలాండ్ స్కోర్45.3వ ఓవర్: మార్కో జన్సెన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ స్కోర్ 300 దాటింది. ఈ బౌండరీ అనంతరం ఫిలిప్స్ వరుసగా మరో మూడు బౌండరీలు బాదాడు. 47వ ఓవర్ తొలి బంతికి ఎంగిడి బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (49) ఔటయ్యాడు. 46.3 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 317/5గా ఉంది. ఫిలిప్స్‌తో పాటు బ్రేస్‌వెల్ క్రీజ్‌లో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్41.1 ఓవర్: 257 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో టామ్ లాథమ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డారిల్ మిచెల్‌కు (19) జతగా గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటైన విలియమ్సన్39.5వ ఓవర్: సెంచరీ పూర్తి చేసిన ఓవర్లోనే విలియమ్సన్ (102) ఔటయ్యాడు. ముల్దర్ బౌలింగ్‌లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి కేన్ మామ పెవిలియన్ బాట పట్టాడు. 40 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 252/3గా ఉంది. టామ్ లాథమ్ (1), డారిల్ మిచెల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్39.1 ఓవర్: ముల్దర్ బౌలింగ్‌లో బౌండరీ బాది కేన్ విలియమ్సన్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేన్‌కు ఇది 15వ సెంచరీ. కేన్ తన సెంచరీ మార్కును 91 బంతుల్లో చేరుకున్నాడు. రచిన్ అవుట్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో రచిన్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమమ్సన్ 80 పరుగులతో ఉండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 213/2 (33.5) శతక్కొట్టిన రచిన్.. విలియమ్సన్ ఫిఫ్టీసౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దంచికొడుతున్నారు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి రచిన్ 95 బంతుల్లో 105 పరుగులతో నిలవగా.. విలియమ్సన్ 74 బంతుల్లో 72 రన్స్ సాధించాడు. దీంతో న్యూజిలండ్ స్కోరు 201కి చేరింది.నిలకడగా ఆడుతున్న రచిన్, విలియమ్సన్అర్ధ శతకం పూర్తి చేసుకున్న రచిన్ రవీంద్ర, విలియమ్సన్తో కలిసి 76 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. 22 ఓవర్ల ఆట ముగిసే సరికి రచిన్ 67, విలియమ్సన్ 31 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు: 67-1విలియమ్సన్ 11, రచిన్ రవీంద్ర 34 పరుగులతో ఉన్నారు.7.5: తొలి వికెట్ కోల్పోయిన కివీస్విల్ యంగ్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింఘ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి యంగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు 48-1(8)టాస్ గెలిచిన కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికా- న్యూజిలాండ్(South Africa Vs New Zealand) మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్‌కు నగారా మోగింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. అందుకే మేము తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.పిచ్ కాస్త పొడిగానే ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్‌లో మేము దుబాయ్‌లో పిచ్ పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. అయితే, ఇక్కడ త్రైపాక్షిక సిరీస్ ఆడిన అనుభవం అక్కరకు వస్తుంది.గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే సౌతాఫ్రికాతోనూ ఆడబోతున్నాం. ధాటిగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం’’ అని సాంట్నర్ తెలిపాడు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాల అన్న అంశంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.నా ఆరోగ్యం బాగానే ఉందిమా బౌలర్లు ముందుగా వాళ్ల పని పూర్తి చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా తమ విధిని నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్‌లో మేము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. నేను జట్టులోకి వచ్చేశాను. ప్రసుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది సెమీ ఫైనల్ కాబట్టి మేము ఒత్తిడికి లోనుకాము. సాధారణ మ్యాచ్‌లాగే దీనిని చూస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తుదిదశకు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ల ఫలితం.. భారత్ ప్రత్యర్థి ఎవరన్న అంశాన్ని తేల్చనుంది.ట్రై సిరీస్‌లో కివీస్‌దే విజయంఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. ఆసీస్‌ను టీమిండియా నాకౌట్ చేసింది. ఇక గ్రూప్-‘బి’ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా కివీస్‌తో మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌తో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడగా.. కివీస్ పాక్, సౌతాఫ్రికాలను ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌లో ట్రోఫీ లీగ్ దశ చివరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించగా.. న్యూజిలాండ్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: రెండో సెమీ ఫైనల్- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుసౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.న్యూజిలాండ్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒ'రూర్కీ.చదవండి: రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు... -
కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెకెండ్ సెమీఫైనల్లో బుధవారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లహోర్ వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో గెలిచి ఫైనల్ దూసుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సౌతాఫ్రికా తమ గ్రూపు స్టేజిని ఆజేయంగా ముగించగా.. కివీస్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది.కాగా సెమీస్ పోరుకు ముందు సౌతాఫ్రికాను ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్య వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఇంకా పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఐడైన్ మార్క్రమ్ సైతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మార్క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫీల్డింగ్ మధ్యలోనే ఐడైన్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో హెన్రిచ్ క్లాసెన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే మార్క్రమ్కు మార్చి 4న ప్రోటీస్ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఒకవేళ ఈ ఫిట్నెస్ పరీక్షలో మార్క్రమ్ ఫెయిల్ అయితే కివీస్‌తో సెమీస్‌కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ జార్జ్ లిండేను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అతడు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా లిండేకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20లో కూడా అతడు అదరగొట్టాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు.చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్ -
SA vs ENG: హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్‌లో బవుమా లేకుండానే..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో మరో ఆసక్తికపోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్(South Africa vs England) తలపడనున్నాయి. కరాచీ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రొటిస్ జట్టు బౌలింగ్‌కు సిద్ధమైంది.కాగా ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. కాబట్టి ప్రొటిస్ జట్టుకు కూడా ఇంగ్లండ్‌తో పోరు కీలకంగా మారడంతో మ్యాచ్ మరింత రసవత్తరం కానుంది.హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్‌లో బవుమా లేకుండానే.. అయితే, ఈ మ్యాచ్‌కు సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) దూరమయ్యాడు. అతడితో పాటు టోనీ డి జోర్జ్ కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేడని తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రమ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. వీరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. బవుమా, టోనీ స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైందని.. అయితే, ఆ తర్వాత తాము నెట్స్‌లో తీవ్రంగా శ్రమించి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైనట్లు తెలిపాడు.సరైన సమయంలోనేమరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడుతున్న బట్లర్ మాట్లాడుతూ.. తాను సరైన సమయంలోనే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. గాయపడిన మార్క్‌వుడ్ స్థానంలో సకీబ్ మహబూబ్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా ఆసీస్, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లండ్ నిష్క్రమించగా... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. గ్రూప్-ఎ నుంచి టీమిండియా,న్యూజిలాండ్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.తుదిజట్లుసౌతాఫ్రికాట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: Champions Trophy: ఆసీస్‌తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్ -
CT 2025 Aus vs SA: టాస్ పడకుండానే కీలక మ్యాచ్ రద్దు.. ఆసీస్‌కు..
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య వన్డే మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఆట ముగిసిపోయింది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా గ్రూప్-‘బి’లో ఉన్న ఆసీస్- ప్రొటిస్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి(Rawalpindi) వేదికగా జరగాల్సిన ఈ కీలక మ్యాచ్‌కు ఆది నుంచే వరణుడు అడ్డు తగిలాడు. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాస్త తెరిపినిచ్చినా మ్యాచ్ మొదలుపెట్టేందుకు సిద్ధం కాగా వర్షం మాత్రం ఆగలేదు. కాసేపు వాన ఆగినా.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ చినుకులు పడ్డాయి.కటాఫ్ టైమ్ రాత్రి 7.32 నిమిషాల వరకుఇలా ఆగుతూ, సాగుతూ దోబూచులాడిన వరణుడి కారణంగా ఆఖరికి అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం తగ్గకపోవడంతో.. మ్యాచ్ మొదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కటాఫ్ టైమ్ రాత్రి 7.32 నిమిషాల వరకు ఉన్నప్పటికీ కనీసం ఇరవై ఓవర్ల మ్యాచ్ సాగేందుకు కూడా గ్రౌండ్ పరిస్థితి అనుకూలంగా లేదు. చెరో పాయింట్దీంతో మొదలుకాకుండానే మ్యాచ్ ముగిసిపోయినట్లు ప్రకటించిన అంపైర్లు.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఆధారంగా ఈ గ్రూప్ నుంచి టోర్నీ నుంచి వైదొలిగే తొలి జట్టు ఖరారు కానుంది.ఇక తాజాగా వచ్చిన ఒక్కో పాయింట్‌తో బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా, స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా చెరో మూడు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, నెట్ రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో ఉన్న ప్రొటిస్ జట్టు పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో, ఆస్ట్రేలియా అఫ్గనిస్తాన్‌తో తలపడతాయి. ఇందులో విజయం సాధిస్తే గనుక ప్రొటిస్, కంగారు జట్లు నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడతాయి.ఇక చాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో భాగంగా తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఆసీస్‌కు ఇది నాలుగోసారికాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో గత ఎనిమిది మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాలుగుసార్లు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం లేదంటే.. ఫలితం తేలకుండానే గేమ్ ముగిసిపోయింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 పాయింట్ల పట్టికగ్రూప్-‘ఎ’👉న్యూజిలాండ్- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు+0.863(సెమీస్‌కు అర్హత)👉ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు +0.647(సెమీస్‌కు అర్హత)👉బంగ్లాదేశ్- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు-0.443(ఎలిమినేటెడ్)👉పాకిస్తాన్- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు-1.087 (ఎలిమినేటెడ్)గ్రూప్-బి👉సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్‌రేటు +2.140👉ఆస్ట్రేలియా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్‌రేటు +0.475👉ఇంగ్లండ్- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు -0.475👉అఫ్గనిస్తాన్- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు-2.140.చదవండి: పదే పదే అవే తప్పులు.. పాక్‌పై గెలిచి విజయంతో ముగిస్తాం: బంగ్లాదేశ్ కెప్టెన్ -
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది. రావల్పిండి(Rawalpindi)లో వర్షం కురుస్తున్న కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.టాస్ సమయానికి(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు)మధ్యలో కాస్త తెరిపినివ్వగా కవర్లు తీయగా.. మళ్లీ కాసేపటికే చినుకులు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లనిమబ్బులు కమ్ముకుని ఉండటంతో ఆసీస్- ప్రొటిస్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.ఇంగ్లండ్‌కు తలపోటుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి.టాప్‌లో సౌతాఫ్రికాతమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్‌ను ఏకంగా 107 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఆసీస్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్కో విజయం ద్వారా ఈ రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు లభించినప్పటికీ.. నెట్ రన్‌రేటు(+2.140) పరంగా సౌతాఫ్రికా ప్రథమ స్థానం ఆక్రమించింది.ఒకవేళ మంగళవారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా ఖాతాలో మూడు, ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన బట్లర్ బృందం.. తదుపరి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో నెగ్గితే మాత్రం నేరుగా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్ మాదిరి ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తేలేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.నాడు సెమీ ఫైనల్లోఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా చివరగా 2023లో ఐసీసీ(వన్డే) ఈవెంట్లో తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో నాడు సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 212 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంసీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.Update: వర్షం వల్ల టాస్ పడకుండానే ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దుచదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
సౌతాఫ్రికా ప్లేయర్ల పట్ల పాక్ ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. మొట్టికాయలు వేసిన ఐసీసీ
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.ఆ మరుసటి ఓవర్లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్‌ల ఓవరాక్షన్‌ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షకీల్, గులామ్‌కు అక్షింతలు వేసింది.కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. -
పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగింట పాకిస్తాన్-న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. పాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే కివీస్ ఫైనల్‌కు ఆర్హత సాధించగా.. మరో స్ధానం కోసం పాక్, ప్రోటీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరాచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేశారు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma)పై తమ దూకుడును పాక్ ప్లేయర్లు ప్రదర్శించారు.అసలేం జరిగిందంటే?టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌కు ఓపెనర్లు టెంబా బావుమా, డీజోర్జీ తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి బావుమా ప్రోటీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్బుతమైన షాట్లతో సెంచరీ దిశగా బావుమా దూసుకెళ్లాడు.కానీ ప్రోటీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్లో బావుమాను దురదృష్టం వెంటాండింది. ఆ ఓవర్ చివరి బంతికి రనౌట్ రూపంలో టెంబా పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని మహ్మద్ హస్నైన్ గుడ్ లెంగ్త్ డెలివరీగా బావుమాకి సంధించాడు. ఆ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. వెంటనే సింగిల్ కోసం బావుమా ప్రయత్నించగా.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మాథ్యూ బ్రీట్జ్కే సైతం పరుగు కోసం ముందుకు వచ్చాడు. కానీ బ్రీట్జ్కే కొంచెం ముందుకు వచ్చి వెంటనే తన మనసును మార్చకుని నో అని కాల్ ఇచ్చాడు.అప్పటికే సగం దూరం పరిగెత్తిన బావుమా తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న సౌద్ షకీల్ స్ట్రయికర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేశాడు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. పాక్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులామ్.. బావుమా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు.ఆ తర్వాత సల్మాన్ అఘా, సౌద్ షకీల్ అదే రియాక్షన్ ఇచ్చాడు. బావుమా మాత్రం అలా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే ఇదే విషయంపై అంపైర్లు పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో చర్చించారు. అలా ప్రవర్తించడం సరికాదని రిజ్వాన్‌ను అంపైర్లు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్‌కు సఫారీలు బ్యాట్‌తో సమాధనమిచ్చారు.క్లాసెన్ విధ్వంసం.. బావుమా కెప్టెన్ ఇన్నింగ్స్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బావుమా 96 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. THE SEND-OFF BY KAMRAN GHULAM AND SAUD SHAKEEL. 🔥pic.twitter.com/zhv7iIgwvm— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) February 12, 2025 -
Pak vs SA: హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్
పాకిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టారు. త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ప్రొటిస్ జట్టు 352 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. నేషనల్ స్టేడియంలో నాలుగో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా అక్కడకు వెళ్లాయి. ఈ క్రమంలో ట్రై సిరీస్‌లో భాగంగా తొలుత పాక్- న్యూజిలాండ్ మధ్య లాహోర్‌లో శనివారం మ్యాచ్ జరిగింది. ఇందులో కివీస్ జట్టు పాక్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఫైనల్లో న్యూజిలాండ్అనంతరం సౌతాఫ్రికాతో సోమవారం తలపడ్డ న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో మరో ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికా- పాకిస్తాన్ కరాచీలో మంగళవారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. 96 బంతుల్లో పదమూడు ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు.మరో ఓపెనర్ టోనీ డి జోర్జి(22) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే( Matthew Breetzke) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్కేవలం 38 బంతుల్లోనే యాభై పరుగులు అందుకున్న ఈ విధ్వంసకర వీరుడు.. మొత్తంగా 56 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో పదకొండు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో వియాన్ ముల్దర్(2) విఫలం కాగా.. కైలే వెరెన్నె(32 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కార్బిన్ బోష్(9 బంతుల్లో 15 నాటౌట్) అతడికి సహకరించాడు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో సౌతాఫ్రికా కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు సాధించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆఖరి పది ఓవర్లలో పాకిస్తాన్ ఏకంగా 110 పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు బౌలర్ల చెత్త ప్రదర్శనకు నిదర్శనం. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డేలోనూ చివరి పది ఓవర్లలో పాక్ బౌలర్లు 123 పరుగులు ఇచ్చుకున్నారు.శుక్రవారం ఫైనల్ మ్యాచ్ కాగా.. పాకిస్తాన్- సౌతాఫ్రికా మధ్య కరాచీ మ్యాచ్‌లో గెలిచిన జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఈ ఈవెంట్లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్-‘ఎ’ నుంచి.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీపడనున్నాయి.కాగా ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టును 3-0తో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలనే పట్టుదలతో కరాచీలో చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు -
ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ సాధిస్తాం.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా
జొహన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఘనాపాఠి అయినా... ఐసీసీ ట్రోఫీల వెలతి మాత్రం ఆ జట్టును వేధిస్తోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తమ జట్టు తెరవేస్తుందని సఫారీ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో మొదలుకానుంది. జూన్‌లో ఆ్రస్టేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ఇదివరకే దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. ఈ రెండు టోర్నీలు జరుగనున్న నేపథ్యంలో స్మిత్ తమ జట్టు ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గెలుచుకున్న ‘ఎస్ఏటి20’ టోర్నీకి కమిషనర్‌గా వ్యవహరించిన స్మిత్ తమ జట్టు ప్రదర్శనపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ‘2027లో సఫారీ ఆతిథ్యమివ్వబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందే ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ లోటును భర్తీ చేసుకుంటాం. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలను గెలుచుకుంటే రెట్టించిన ఉత్సాహంతో సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడేందుకు ఊతమిస్తుంది’ అని అన్నాడు. తదుపరి రెండేళ్లలో తమ దేశంలో స్టేడియాల నవీకరణ, పిచ్‌ల స్థాయి పెంచే పనులు జరుగుతాయని, దీంతో తదుపరి వన్డే మెగా ఈవెంట్ (2027)లో సొంత ప్రేక్షకుల మధ్య హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతామని చెప్పాడు. గతేడాది జరిగిన పురుషుల, మహిళల టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా షరామామూలుగా ఫైనల్ మెట్టుపై చతికిలబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. విండీస్ గడ్డపై రోహిత్ బృందం సఫారీ జట్టును ఓడించే టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో తెలంగాణ యువతేజం గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షోతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాపై ‘చోకర్స్’ ముద్ర మరింత బలంగా పడింది. అయితే ముద్రను తమ జట్టు త్వరలోనే చెరిపేస్తుందని మాజీ కెప్టెన్ స్మిత్ అన్నాడు. ఇప్పుడు క్రికెట్లో ఏదీ అంత సులువుగా రాదని, దేనికైనా పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. టి20లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆలాగే సంప్రదాయ టెస్టు ప్రభ కోల్పోకూడదనుకుంటే... కనీసం 6, 7 జట్లు గట్టి ప్రత్యర్థులుగా ఎదగాల్సి ఉంటుందన్నాడు. అప్పుడే పోటీ పెరిగి టెస్టులూ ఆసక్తికరంగా సాగుతాయన్నాడు. -
CT 2025: సౌతాఫ్రికాకు భారీ షాక్!.. స్టార్ పేసర్ అవుట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ(ICC Chapions Trophy)లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో కార్బిన్ బాష్(Corbin Bosch) చోటు దక్కించుకున్నాడు. పేసర్ అన్రిచ్ నోర్జే(Anrich Nortje) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడంతో... అతడి స్థానంలో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) బాష్‌ను ఎంపిక చేసింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నోర్జే 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ బరిలోకి కూడా దిగలేదన్న విషయం తెలిసిందే.ఇక నోర్జే స్థానంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చిన 30 ఏళ్ల బాష్ గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో మూడో వన్డేలో బరిలోకి దిగి ఒక వికెట్ తీసిన ఈ రైటార్మ్ పేసర్.. లక్ష్య ఛేదనలో నలభై పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా.. ఒక్క మ్యాచ్ అనుభవంతోనే అతడు ఏంగా ఐసీసీ టోర్నీకి ఎంపికకావడం విశేషం. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చేశాడు! ఇక కార్బిన్ బాష్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేయడంతో పాటు యంగ్ పేసర్ క్వెనా మఫాకాను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్ఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్లో ముక్కోణపు టోర్నీ ఆడుతుండగా... తొలి మ్యాచ్ అనంతరం బాష్, మఫాకాతో పాటు టోనీ డీ జోర్జీ సఫారీ జట్టుతో కలవనున్నట్లు సీఎస్ఏ వెల్లడించింది. ఎనిమిది జట్లుకాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నీలో ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అడుగుపెట్టగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.షెడ్యూల్ ఇదేఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ ప్రాథమిక జట్లను ప్రకటించగా.. టీమ్‌లలో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీ పడుతున్నాయి.ఈ ఐసీసీ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఫిబ్రవరి 21నతమ తొలి మ్యాచ్ ఆడనుంది. కరాచీ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం రావల్పిండిలో ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ పూర్తి చేసుకుని.. మళ్లీ కరాచీ వేదికగానే లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడనుంది. మార్చి 1న ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టుతెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డసెన్, కార్బిన్ బాష్.ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
పాకిస్తాన్లో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ (Tri Series) (తొలి మ్యాచ్‌కు మాత్రమే) కోసం 12 మంది సభ్యుల సౌతాఫ్రికా (South Africa) జట్టును ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించారు. ఈ జట్టుకు ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. జట్టుకు సారధిగా టెంబా బవుమా (Temba Bavuma) వ్యవహరిస్తాడు. SA20-2025 నేపథ్యంలో ట్రై సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ లీగ్ ఫిబ్రవరి 8తో ముగుస్తుంది. ఆ లోపు చాలామంది సీనియర్ ఆటగాళ్లు జట్టుతో జాయిన్ అవుతారు. ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 10న ఆడుతుంది. లాహోర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.న్యూజిలాండ్‌తో వన్డే కోసం ఎంపికైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో మాథ్యూ బ్రీట్జ్కే, మీకా-ఈల్ ప్రిన్స్, గిడియన్ పీటర్స్, ఈతన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపోంగ్వానా ఉన్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ మొత్తానికి దూరమైన స్టార్ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. SA20-2025 నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్ సభ్యులు కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ కూడా న్యూజిలాండ్‌తో వన్డేకు అందుబాటులో లేరు. ఈ ఇద్దరు ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు, ఆతర్వాత జరిగే ఫైనల్ (ఒకవేళ క్వాలిఫై అయితే) కోసం సౌతాఫ్రికా జట్టును ఫిబ్రవరి 9న ప్రకటిస్తారు.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన మార్కో జన్సెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్ ఫిబ్రవరి 14న పాకిస్తాన్‌కు పయనిస్తారు. వీరు ట్రై సిరీస్‌లో పాల్గొనరని తెలుస్తుంది. ట్రై సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న జరుగుతుంది.ట్రై సిరీస్‌లోని తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కొయెట్జీ, జూనియర్ డాలా, వియాన్ ముల్డర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్ట్రై సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8-పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (లాహోర్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (లాహోర్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (కరాచీ)ఫిబ్రవరి 14- ఫైనల్ (కరాచీ)ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్, ర్యాన్ రికెల్టన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ)లో తొలిసారి ఫైనల్‌కు చేరింది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో తొలి టెస్టులో గెలుపొంది మెగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన ప్రొటిస్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి పర్యాటక జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఏడో గెలుపు కావడం విశేషం.కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తూ ఇలా జట్టును విజయపథంలో నడిపించి.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith ) బవుమా నాయకత్వ లక్షణాలను కొనియాడాడు.బవుమా అలాంటి వాడు కాదు‘‘సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం మా అందరికీ గర్వకారణం. కెప్టెన్‌గా బవుమాకు కూడా ఇది ఉద్వేగ సమయం. గత రెండు, మూడేళ్లుగా అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది అతడి బ్యాటింగ్ సగటు 50గా నమోదైంది.నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తూ ఈస్థాయికి చేర్చాడు. మైదానంలో ఆటగాళ్లపై అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తిత్వం బవుమాకు లేదు. అతడు అసలు అలాంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తి కానేకాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు.టెస్టుల్లో వరుసగా జట్టుకు ఏడు విజయాలు అందించిన కెప్టెన్. అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును నిలిపాడు. మేమంతా అతడికి అండగా ఉంటాం’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.గెలుపు మాదేనని భావిస్తున్నాఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అంశంపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో విజేత ఎవరన్నది అంచనా వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికైన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. కాబట్టి ఏ జట్టుకూ హోం అడ్వాంటేజీ ఉండదు.ఆస్ట్రేలియా మీడియాను చూస్తుంటే మాత్రం.. లార్డ్స్‌లో కంగారూలను ఓడించి మేము కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే సంకల్పం మరింత బలపడింది. ఫైనల్లో ఆసీస్‌ను ఓడిస్తే ఆ మజానే వేరు’’ అని గ్రేమ్ స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన ప్రొటిస్ కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్‌కు అరుదైన ఘనత ఉంది.ఆసీస్‌పై స్మిత్‌కు ఘనమైన రికార్డుస్మిత్ సారథ్యంలో 2006లో తొలుత ఆసీస్‌ను వన్డేలో ఓడించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత మూడేళ్ల అనంతరం అంటే 2009లో కంగారూ గడ్డపై పాంటింగ్ బృందాన్ని టెస్టుల్లో చిత్తు చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మొట్టమొదటి సారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాడు తన మణికట్టుకు దెబ్బతాకినా.. గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసిన తీరు.. సౌతాఫ్రికా ఆటగాళ్ల పట్టుదలకు అద్దంగా నిలిచింది.ఇక ఇప్పుడు పదహారేళ్ల తర్వాత గ్రేమ్ స్మిత్‌లాగే ఆస్ట్రేలియాను ఓడించే సువర్ణావకాశం ముంగిట బవుమా నిలిచాడు. కాగా సారథిగా బవుమా గత 14 టెస్టుల్లో సౌతాఫ్రికాకు 10 విజయాలు అందించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 63 టెస్టులు ఆడిన బవుమా నాలుగు శతకాల సాయంతో 3606 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 3-1తో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకువచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 11-15 వరకు ఈ మెగా టెస్టు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడు..!
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు సారథి టెంబా బవుమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బవుమా తన సారథ్యంలో సౌతాఫ్రికాను తొమ్మిదింట ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడంతో పాటు బవుమా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 809 పరుగులు (57.78 సగటున) చేశాడు. బవుమా తొలిసారి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సౌతాఫ్రికా చాలాకాలం తర్వాత సెకెండ్ ప్లేస్‌కు చేరింది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బవుమా కెప్టెన్సీ స్కిల్స్‌కు ముగ్దులవుతున్న అభిమానులు అతన్ని గొప్ప సారధిగా కొనియాడుతున్నారు. బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడని జేజేలు పలుకుతున్నారు. బ్యాటర్‌గానూ పోరాట యోధుడని కితాబునిస్తున్నారు. బవుమా కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.గత 10 మ్యాచ్‌ల్లో బవుమా ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..పాక్‌పై రెండో టెస్ట్‌లో 106 (179)పాక్‌పై తొలి టెస్ట్‌లో 31 (74), 40 (78)శ్రీలంకపై రెండో టెస్ట్‌లో 78 (109), 66 (116)శ్రీలంకపై తొలి టెస్ట్‌లో 70 (117), 113 (228)వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో 0 (2), 4 (18)వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో 86 (182), 15 (17)భారత్‌తో తొలి టెస్ట్‌లో 0 (0)వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 28 (64), 172 (280)వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 0 (2), 0 (1)ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో 35 (74), 17 (42)బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచింది. అలాగే వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. కెరీర్లో 63 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బవుమా 38 సగటున 3606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో (రెండో టెస్ట్) సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ పాక్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్‌తో రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ సౌతాఫ్రికా గడ్డపై రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయం బారి నుంచి తప్పించుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81), మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. -
రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్
దక్షిణాఫ్రికా(South Afrcia) గడ్డపై వన్డే సిరీస్ ‘క్లీన్‌స్వీప్’ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... టెస్టు సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాకిస్తాన్ ‘వైట్‌వాష్’కు గురైంది. కేప్‌టౌన్ వేదికగా సోమవారం(జనవరి 6) ముగిసిన రెండో టెస్టులో పాక్‌పై 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది.ఫాలో ఆన్‌లో అదుర్స్..కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన పాకిస్తాన్ ఫాలో ఆన్‌లో మాత్రం అద్భుతమైన పోరాటం పటమకనబరిచింది. ఓవర్‌నైట్ స్కోరు 213/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆఖరికి 122.1 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీల ముందు పాకిస్తాన్ కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచగల్గింది.పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (251 బంతుల్లో 145; 17 ఫోర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా... ఆఘా సల్మాన్ (95 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 41; 2 ఫోర్లు), ఆమేర్ జమాల్ (34; 7 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఊదిపడేసిన సౌతాఫ్రికా..ఇక 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలో ఊదిపడేసింది. డేవిడ్ బెడింగ్హమ్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్క్రమ్ (14 నాటౌట్) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగుల భారీ స్కోరు చేయగా... పాకిస్తాన్ మాత్రం తమ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలోనే పాక్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన రికెల్టన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.కాగా దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న తుది పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది.చదవండి: Jasprit Bumrah: భయం పుట్టించాడు! -
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 615 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓ భారీ డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ నమోదయ్యాయి. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు క్యాచ్‌లు పట్టిన రిజ్వాన్ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఓ పక్క సౌతాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడినప్పటికీ రిజ్వాన్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్కీపర్ల జాబితాలో రిజ్వాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.7 - వాసిం బారి vs NZ, ఆక్లాండ్, 19796 - రషీద్ లతీఫ్ vs ZIM, బులవాయో, 19986 - అద్నాన్ అక్మల్ vs NZ, వెల్లింగ్టన్, 20116 - మొహమ్మద్ రిజ్వాన్ vs SA, కేప్ టౌన్, 2025100 వికెట్ల క్లబ్లో మొహమ్మద్ అబ్బాస్ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ 100 వికెట్ల క్లబ్లో చేరాడు. క్వేనా మపాకా వికెట్ అబ్బాస్‌కు టెస్ట్‌ల్లో 100వది.తొలి ఓవర్లోనే పాక్‌కు షాక్సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి ఆలౌటైన అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ షాన్ మసూద్ (2) ఔటయ్యాడు. రబాడ బౌలింగ్‌లో బెడింగ్హమ్కు క్యాచ్ ఇచ్చి మసూద్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన సైమ్ అయూబ్ గాయపడటంతో అతని స్థానంలో బాబర్ ఆజమ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో సైమ్ అయూబ్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 3.4 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 10/1గా ఉంది. బాబర్ ఆజమ్ (2), కమ్రాన్ గులామ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 605 పరుగులు వెనుకపడి ఉంది. -
శతక్కొట్టిన బవుమా
కేప్‌టౌన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా సెంచరీతో కదంతొక్కాడు. బవుమా 166 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో బవుమాకు ఇది నాలుగో శతకం. సెంచరీ అనంతరం బవుమా (106) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ర్యాన్ రికెల్టన్ (219 బంతుల్లో 172; 21 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. 76.4 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 307/4గా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా ఔట్ కాగా.. రికెల్టన్, డేవిడ్ బెడింగ్హమ్ క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా 2, ఖుర్రమ్ షెహజాద్, మొహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ పడగొట్టారు.రికార్డు భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో టెంబా బవుమా, ర్యాన్ రికెల్టన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సౌతాఫ్రికా తరఫున నాలుగో వికెట్ ఇదే అత్యధిక భాగస్వామ్యం. సౌతాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని గ్రేమ్ స్మిత్, హెర్షల్ గిబ్స్ నమోదు చేశారు. 2002-03 కేప్‌టౌన్ టెస్ట్‌లో గిబ్స్-స్మిత్ జోడీ తొలి వికెట్‌కు 368 పరుగులు జోడించారు.భీకర ఫామ్‌లో బవుమాఇటీవలి కాలంలో బవుమా భీకర ఫామ్‌లో ఉన్నాడు. బవుమా గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.ఫైనల్ల్లో సౌతాఫ్రికాదక్షిణాఫ్రికా జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. 2023-25 ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టు సౌతాఫ్రికానే. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌పై విజయం అనంతరం సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్ పోటీపడుతున్నాయి.కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్ గులామ్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్ పీటర్సన్ 5, కార్బిన్ బాష్ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (89), కార్బిన్ బాష్ (81 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్ 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా తడబడింది. మార్క్రమ్ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. -
పాకిస్తాన్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
పాకిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం కారణంగా పాక్‌తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.వన్డే సిరీస్‌లో విఫలంకాగా సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.ఇక జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.మోకాలి నొప్పి వల్లరెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్మన్కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఆల్‌రౌండర్‌కు పిలుపుఇక పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్‌మన్ స్థానంలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్‌మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు.పాకిస్తాన్‌దే వన్డే సిరీస్కేప్టౌన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
పాక్‌తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు కూడా ప్రొటిస్ బోర్డు వెనుకాడటం లేదు.గాయం బారినపడ్డ కేశవ్ మహరాజ్, వియాన్ ముల్దర్లను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్ బోర్డు బుధవారం తమ జట్టును ప్రకటించింది.తొలి పిలుపుపదహారు మంది సభ్యులున్న ఈ టీమ్‌లో అన్క్యాప్డ్ ప్లేయర్‌కు చోటిచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్‌కు తొలిసారి పిలుపునిచ్చింది. అదే విధంగా.. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వేలి నొప్పి నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను కూడా ఈ జట్టులో చేర్చింది.కాగా తొలి వన్డే సందర్భంగా గాయపడ్డ కేశవ్ మహరాజ్ కోలుకోని పక్షంలో.. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుస్వామిని జట్టుకు ఎంపిక చేయనున్నారు. అదే విధంగా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ముల్దర్ ఫిట్నెస్ సాధిస్తే.. బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కు ఉద్వాసన పలుకనున్నారు.క్వెనా మఫాకా కూడాఇక తెంబా సారథ్యంలో పాక్‌తో టెస్టులు ఆడనున్న సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించిన బాష్.. ఇప్పటి వరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 40.46 సగటుతో పరుగులు రాబట్టడంతో పాటు.. 72 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. మరో పేసర్, పద్దెమినిదేళ్ల క్వెనా మఫాకా కూడా తొలిసారి టెస్టు జట్టులోకి వచ్చాడు.అయితే, పేస్ సూపర్స్టార్లు లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జిలతో పాటు నండ్రీ బర్గర్, లిజాడ్ విలియమ్స్ తదితరులు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. మరోవైపు.. కగిసో రబడ, మార్కో జాన్సెన్ పాక్‌తో తొలి వన్డే ఆడినా.. ఆ తర్వాత నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు. టెస్టుల నేపథ్యంలో బోర్డు వారికి రెస్ట్ ఇచ్చింది. కాగా పాక్‌తో ఒక్క టెస్టులో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో సౌతాఫ్రికా ముందు వరుసలో ఉంటుంది. ఇక పాక్‌తో సౌతాఫ్రికా టెస్టులకు సెంచూరియన్, కేప్‌టౌన్ వేదికలు. పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనురన్ ముత్తుస్వామి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్).చదవండి: WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? -
శ్రీలంకతో రెండో టెస్టు.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.ఎయిడెన్ మార్క్రమ్ (75 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవగా... కెప్టెన్ తెంబా బవుమా (48 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (36 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ అజేయమైన నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు.శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 99.2 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (44; 6 ఫోర్లు), కమిందు మెండిస్ (48; 4 ఫోర్లు) కాస్త పోరాడారు. కెపె్టన్ ధనంజయ డిసిల్వా (14), కుశాల్ మెండిస్ (16), ప్రభాత్ జయసూర్య (24) మరికొన్ని పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లలో ప్యాటర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. యాన్సెన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
WTC: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 233 పరుగుల తేడాతో శనివారం జయభేరి మోగించింది. కాగా రెండు టెస్టులు ఆడే క్రమంలో శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. నాలుగో రోజుల్లోనే ముగిసిపోయింది. కింగ్స్‌మేడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్టబ్స్, బవుమా శతకాలుఅనంతరం సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో శ్రీలంక 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జి రెండు, కగిసో రబడ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా దుమ్ములేపింది.ట్రిస్టన్ స్టబ్స్(122), కెప్టెన్ బవుమా(113) శతకాలతో విరుచుకుపడటంతో భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 515 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడేఈ క్రమంలో 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 282 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా సౌతాఫ్రికా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రబడ, కోయెట్జి, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పదకొండు వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.ఆస్ట్రేలియాకు భారీ షాక్ఇదిలా ఉంటే.. లంకపై భారీ గెలుపుతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకువచ్చింది. ఐదో స్థానం నుంచి ఏకంగా రెండోస్థానానికి ఎగబాకి.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టింది. మరోవైపు.. ఆస్ట్రేలియాను పెర్త్ టెస్టులో ఓడించిన టీమిండియా మాత్రం అగ్రస్థానం నిలబెట్టుకుంది.PC: ICCఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో ఒకటి, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడూ సొంతగడ్డపైనే జరుగనుండటం సౌతాఫ్రికాకు సానుకూలాంశం. వీటన్నింటిలోనూ ప్రొటిస్ జట్టు గెలిచిందంటే.. ఫైనల్ రేసులో తానూ ముందు వరుసలో ఉంటుంది.టీమిండియా పరిస్థితి ఏంటి?ఎటువంటి సమీకరణలతో పనిలేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆసీస్ గడ్డపై ఐదింటిలో కనీసం నాలుగు కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే ఒక విజయం సాధించింది కాబట్టి.. ఇంకో మూడు గెలిస్తే చాలు నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన తదుపరి ఆసీస్‌తో అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో తలపడనుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక పరాజయానికి చేరువైంది. 516 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 103 పరుగులే చేసింది.కరుణరత్నే (4), నిసాంక (23), మాథ్యూస్ (25), కమిందు (10), ప్రభాత్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. దినేశ్ చండీమల్ (29 బ్యాటింగ్), ధనంజయ డిసిల్వ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక గెలుపు కోసం మరో 413 పరుగులు చేయాల్సి ఉంది. రబడ, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 132/3తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 366 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (221 బంతుల్లో 122; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (228 బంతుల్లో 113; 9 ఫోర్లు) సెంచరీలు నమోదు చేయడం విశేషం. స్టబ్స్ కెరీర్లో ఇది రెండో శతకం కాగా...బవుమాకు మూడోది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు.చదవండి: ‘గులాబీ’ బంతితో సాధనకు సిద్ధం -
శతక్కొట్టిన తెంబా బవుమా.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత శతకంతో మెరిశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డర్బన్ వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ కుదేలైన వేళ బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.తొలి ఇన్నింగ్స్‌లో బవుమానే ఆదుకున్నాడుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(9), టోనీ డి జోర్జి(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతను భుజాన వేసుకున్న బవుమా 117 బంతులాడి 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో టెయిలండర్ కేశవ్ మహరాజ్(24) ఒక్కడే 20 పరుగుల మార్కు దాటాడు.లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార మూడేసి వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, సౌతాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎక్కువ సేపు ఉండలేదు.42 పరుగులకే లంక ఆలౌట్ఆతిథ్య జట్టు పేసర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కేవలం 42 పరుగులకే ధనంజయ డి సిల్వ బృందం కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ సాధించిన 13 పరుగులే టాప్ స్కోర్. ఐదుగురేమో డకౌట్.ఫలితంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ టోనీ 17 పరుగులకే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 47 రన్స్‌తో రాణించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 15 పరుగులకే అవుట్ కాగా.. స్టబ్స్, బవుమా మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.స్టబ్స్, బవుమా శతకాలు.. లంకకు భారీ టార్గెట్స్టబ్స్ 221 బంతుల్లో 122 పరుగులు సాధించగా.. బవుమా 228 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి శతకాల వల్ల సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో తెంబా బవుమాకు ఇది మూడో సెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం తద్వారా అతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సెంచరీ చేసిన సౌతాఫ్రికా మూడో కెప్టెన్‌గా నిలిచాడు. బవుమా కంటే ముందు షాన్ పొలాక్, హషీం ఆమ్లా మాత్రమే సారథి హోదాలో లంకపై శతకం సాధించారు.శ్రీలంకతో మ్యాచ్‌లో శతక్కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్లు👉షాన్ పొలాక్- సెంచూరియన్- 2001- 111 పరుగులు👉హషీం ఆమ్లా- కొలంబో- 2014- 139 పరుగులు(నాటౌట్)👉తెంబా బవుమా- డర్బన్- 113 పరుగులు.చదవండి: ‘అతడిని లారా, సచిన్ అంటూ ఆకాశానికెత్తారు.. ఇలాంటి షాక్ తగిలితేనైనా.. కాస్త’ -
దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపికయ్యాడు. బవుమా మోచేతి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 4 ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సందర్భంగా బవుమా గాయపడ్డాడు.రబాడ రీఎంట్రీలంకతో సిరీస్‌తో కగిసో రబాడ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రబాడ భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్, గెరాల్ట్ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా దర్శనమిచ్చారు. గాయాల కారణంగా ఈ సిరీస్‌కు లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ దూరమయ్యారు. ర్యాన్ రికెల్టన్, డేన్ పీటర్సన్, సెనూరన్ ముత్తుస్వామి 14 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే..?సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు తదుపరి (డిసెంబర్, జనవరి) స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, సెనూరన్ ముత్తుస్వామి, డేన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రిన్సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్ షెడ్యూల్తొలి టెస్ట్- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 (డర్బన్)రెండో టెస్ట్- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 (గెబెర్హా)కాగా, సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రీలంక జట్టును కూడా ఇవాళ్లే ప్రకటించారు. లంక జట్టుకు సారధిగా ధనంజయ డిసిల్వ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డిసిల్వ (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, ఒషాద ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, లసిత్ ఎంబుల్దెనయ, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార, కసున్ రజిత -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు గాయం.. తొలి టెస్ట్‌కు దూరం
అక్టోబర్ 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. బవుమా స్థానంలో యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తొలి టెస్ట్‌కు ఎంపికయ్యాడు. బ్రెవిస్‌కు టెస్ట్ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. తొలి టెస్ట్‌కు దూరమైనప్పటికీ బవుమా జట్టుతో పాటే ప్రయాణిస్తాడు. రెండో టెస్ట్ సమయానికి బవుమా కోలుకుంటాడని క్రికెట్ సౌతాఫ్రికా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బవుమా గైర్హాజరీలో ఎయిడెన్ మార్క్రమ్ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు ఇదే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపికైన నండ్రే బర్గర్ సైతం గాయపడ్డాడు. అతని స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. అప్డేట్ చేసిన జట్టు వివరాలను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (అక్టోబర్ 11) వెల్లడించింది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడు), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రేన్నేబంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్..తొలి టెస్ట్ (అక్టోబర్ 21-25, ఢాకా)రెండో టెస్ట్ (అక్టోబర్ 29-నవంబర్ 2, చట్టోగ్రామ్)చదవండి: పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో) -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్‌లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్‌ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్‌తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
వెస్టిండీస్‌పై తాజాగా టెస్ట్ సిరీస్ విజయం సాధించిన సౌతాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ప్రత్యర్ధిపై వరుసగా పది సిరీస్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. సౌతాఫ్రికా 1998/99 నుంచి వెస్టిండీస్‌పై వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. 1998/99లో 5-0 తేడాతో, 2001లో 2-1 తేడాతో, 2003-04లో 3-0తో, 2005లో 2-0తో, 2007-08లో 2-1తో, 2010లో 2-0తో, 2014-15లో 2-0తో, 2021లో 2-0తో, 2023లో 2-0తో తాజాగా 1-0 తేడాతో వెస్టిండీస్‌ను వరుస సిరీస్‌ల్లో ఓడించింది.కాగా, గయానా వేదికగా విండీస్‌తో తాజా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు కుప్పకూలింది. అనంతరం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా.. విండీస్ 222 పరుగులకే చాపచుట్టేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సౌతాఫ్రికా కొంపముంచిన వరుణుడు.. విండీస్‌తో తొలి టెస్టు డ్రా
ట్రినిడాడ్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా మాత్రం పూర్తి ఆధిపత్యం సాధించింది. కానీ దురదృష్టవశాత్తూ పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 357 పరుగులు చేయగా.. ఆతిథ్య విండీస్ 233 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 173/3 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టబ్స్ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. 298 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్.. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దీంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కరేబియన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథానాజ్(92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 15 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది. -
అరుదైన క్లబ్లో చేరిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కు తాకిన 17వ సౌతాఫ్రికా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బవుమా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన బవుమా 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద 3000 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. కెరీర్లో 57 టెస్ట్‌లు ఆడిన బవుమా 2 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 3083 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు జాక్ కల్లిస్ పేరిట ఉంది. కల్లిస్ 165 మ్యాచ్‌ల్లో 13206 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్‌కు దక్కుతుంది. సచిన్ సుదీర్ఘ ఫార్మాట్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ తర్వాతి స్థానంలో పాంటింగ్ (13378) ఉన్నాడు.కాగా, ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు సజావుగా సాగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బవుమా, ఓపెనర్ టోనీ డి జోర్జీ (78) అర్ద సెంచరీలతో రాణించగా.. ఎయిడెన్ మార్క్రమ్ 9, ట్రిస్టన్ స్టబ్స్ 20, డేవిడ్ బెడింగ్హమ్ 29, ర్యాన్ రికెల్టన్ 19, కైల్ వెర్రిన్ 39, కేశవ్ మహారాజ్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. వియాన్ ముల్దర్ (37), రబాడ (12) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్ 3, కీమర్ రోచ్, జేడన్ సీల్స్ తలో 2, జేసన్ హోల్డర్ ఓ వికెట్ పడగొట్టారు. -
SA vs WI 1st Test: చెలరేగిన కెప్టెన్.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.క్రీజులో ముల్డర్(37), రబాడ(12) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. ఇక విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్ రోచ్, సీల్స్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా వర్షం కారణంగా తొలి రోజు కేవలం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. -
సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.మరోవైపు వచ్చే ఏడాది సీజన్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్తగా ఒప్పందం కుదర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఇక తొలి రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టునే ఛాంపియన్స్‌గా నిలిచింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదేఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్. -
WI vs SA: విండీస్‌తో సిరీస్.. సంచలన ఆటగాడి ఎంట్రీ
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధం కానుంది. విండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది.తొలిసారి జాతీయ జట్టులోఈ క్రమంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన 25 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కేకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు.అదే విధంగా.. వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. కాగా తెంబా బవుమా కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడనున్న ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ దూరం కానున్నాడు.నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఈ పేసర్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కొన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో బిజీగా ఉన్న మేము.. తిరిగి టెస్టు క్రికెట్‌తో బిజీ కానున్నాము.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే కరేబియన్ జట్టుతో పోరుకు పటిష్ట జట్టును ఎంపిక చేశాం.డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టిదేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మాథ్యూకు ఈసారి చోటిచ్చాం. మార్కో జాన్సెన్కు విశ్రాంతి అవసరమని భావించాం’’ అని తెలిపాడు. సౌతాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్ గత సీజన్లో మాథ్యూ బ్రీట్జ్కే 322 పరుగులు సాధించాడు. ఇండియా-ఏ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ఆడాడు.కాగా ఆగష్టు 7 నుంచి వెస్టిండీస్- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్, టొబాగో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.ఇక ఇదే వెస్టిండీస్ గడ్డపై ఇటీవల సౌతాఫ్రికాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు:తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెరెన్నే. -
టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్
టీమిండియాతో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా సేవలను ప్రోటీస్ కోల్పోగా.. ఇప్పుడు యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది. కోయిట్జీ ప్రస్తుతం కటి వాపుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరిగే రెండు టెస్టుకు దూరమయ్యాడని సౌతాఫ్రికా క్రికెట్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. కాగా కోయిట్జీ తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్, వన్డే వరల్డ్‌కప్‌లోనూ కోయిట్జీ అదరగొట్టాడు. తనదైన రోజు ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించే సత్తా ఈ యువ పేసర్‌కు ఉంది. రెండో టెస్టుకు అతడి స్ధానంలో వియాన్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా సెంచూరియన్ వేదికగ జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. చదవండి: IND Vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!? -
భారత్‌తో రెండో టెస్టు.. కెరీర్లో ఇదే చివరి మ్యాచ్! కెప్టెన్‌గా బరిలోకి
కేప్‌టౌన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ సారథిగా వీడ్కోలు పలకనున్నాడు. భారత్‌తో సిరీస్‌కు ముందే మాజీ కెప్టెన్ ఎల్గర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. తొలి టెస్టులో అతని భారీ సెంచరీతోనే సఫారీ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. ఎల్గర్ 287 బంతుల్లో 28 ఫోర్లతో 185 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ మొదటి రోజునే గాయపడ్డ రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా జనవరి 3 నుంచి జరిగే రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా బోర్డు అతని కెరీర్లో ఆఖరి మ్యాచ్ కోసం కెప్టెన్‌గా బరిలోకి దింపుతోంది. చదవండి: IND Vs SA: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! -
IND Vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..
టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరమయ్యాడు. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా గాయపడ్డాడు. దీంతో అతడు తొలి టెస్టుల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే అతడి గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ దృవీకరించారు. ఇక రెండో టెస్టులో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ప్రోటీస్ జట్టును నడిపించనున్నాడు. అదే విధంగా బావుమా స్ధానంలో జైబుర్ హంజా జట్టులోకి వచ్చాడు. "బావుమా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో లేడు. కానీ తొలి టెస్టులో అవసరమైతే తాను బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. బావుమా గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. ఈ క్రమంలో టెంబా కేప్ టౌన్ టెస్టుకు దూరంగా ఉండనున్నాడు. యువ ఆటగాడు జుబేర్ హంజా అతడి స్ధానాన్ని భర్తీ చేయనున్నాడని" ఈఎస్పీఎన్తో షుక్రి పేర్కొన్నాడు. కాగా జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: #Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణాలు అవే! అతడు అద్భుతం -
'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు'
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా మరోసారి గాయం బారిన పడ్డాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బావుమా గాయపడ్డాడు. మొదటి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లావిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత అతడిని స్కానింగ్ తరలించారు. ఎడమ తొడ కండరాల్లో నరం పట్టేసినట్లు తేలింది. దీంతో ఈ మ్యాచ్‌తో పాటు రెండో టెస్టుకు అతడు అందుబాటుపై సందేహం నెలకొంది. బావుమా ఫీల్డ్ నుంచి వైదొలగడంతో వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో బావుమాపై ప్రోటీస్ మాజీ ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ విమర్శల వర్షం కురిపించాడు. అతడికి పూర్తి ఫిట్నెస్ లేకపోయినప్పటికీ అవకాశాలు ఎలా ఇస్తున్నారని గిబ్స్ మండిపడ్డాడు. అన్‌ఫిట్ ప్లేయరని, అధిక బరువతో బాధపడుతున్నాడని తీవ్ర స్ధాయిలో విరుచుపడ్డాడు. '2009లో సౌతాఫ్రికా ట్రైనర్‌గా ప్రారంభించి టీమ్ హెడ్ కోచ్‌గా మారిన వ్యక్తి.. అన్‌ఫిట్, అధిక బరువున్న ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి అనుమతించడం హాస్యాస్పదంగా ఉంది.'అని హెర్షల్ గిబ్స్ ట్వీట్ చేశాడు. కాగా ప్రస్తుతం ప్రోటీస్ హెడ్ కోచ్‌గా ఉన్న షుక్రి కాన్రాడ్ గతంలో దక్షిణాఫ్రికా ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేశారు. -
టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్
సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా తొలి రోజు ఆట సందర్భంగా గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో బావుమా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లావిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు. అయితే వెంటనే అతడిని స్కానింగ్ తరిలించినట్లు తెలుస్తోంది. అతడు బ్యాటింగ్‌కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు. ప్రస్తుతం ప్రోటీస్ స్టాండింగ్ కెప్టెన్ వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ వ్యవహరిస్తున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్లను ఎదుర్కొవడానికి భారత బ్యాటర్లు కష్టపడుతున్నారు. 50 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. -
IND vs SA: ప్రసిద్ కృష్ణ అరంగేట్రం.. జడేజా అవుట్.. తుదిజట్లు ఇవే
టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచూరియన్‌లో వర్షం కారణంగా టాస్ అరంగటకు పైగా ఆలస్యమైంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరోవైపు.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించాడు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో పాటు ప్రసిద్‌కు చోటిచ్చినట్లు వెల్లడించాడు. కాగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటను దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణకు మార్గం సుగమమైంది. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా అతడు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. సౌతాఫ్రికా- టీమిండియా తొలి టెస్టు.. తుదిజట్లు ఇవే: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సౌతాఫ్రికా డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్. -
Ind Vs SA: తొలి టెస్టుకు వర్షం ముప్పు..
South Africa vs India, 1st Test: Update: టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 1:00 PM: టాస్ ఆలస్యం ఊహించినట్లుగానే సౌతాఫ్రికా- టీమిండియా తొలి టెస్టుకు వర్షం ఆటంకిగా మారింది. సెంచూరియన్‌లో వాన కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తంగా తడిగా మారింది. దీంతో టాస్ ఆలస్యం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. గత రెండురోజులుగా వర్షాలు కాగా షెడ్యూల్ ప్రకారం భారత్- సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, మొదటి మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం(డిసెంబరు 26) నుంచి మొదలు కానున్న మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ నుంచి ముందుగానే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈసారైనా...? తొలి రెండు రోజులు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. సెంచూరియన్‌లో వర్షం కారణంగా సూపర్‌స్పోర్ట్ పార్క్ అవుట్ ఫీల్డ్ మొత్తం పచ్చిగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి టీమిండియా స్టార్లు ఈ సిరీస్‌తోనే మళ్లీ మైదానంలో దిగనున్నారు. ఇక సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. టీమిండియా- సౌతాఫ్రికా గత టెస్టు సిరీస్‌ల ఫలితాలు... ►1992 (4 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ సొంతం ►1996 (3 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 2–0తో సిరీస్ కైవసం ►2001 (2 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ హస్తగతం ►2006 (3 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 2–1తో సిరీస్ సొంతం ►2010 (3 టెస్టులు) ►ఫలితం: 1–1తో సిరీస్ ‘డ్రా’ ►2013 (2 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ కైవసం ►2018 (3 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 2–1తో సిరీస్ సొంతం ►2021 (3 టెస్టులు) ►ఫలితం: దక్షిణాఫ్రికా 2–1తో సిరీస్ కైవసం. చదవండి: AUS vs PAK: పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ క్రికెటర్లు ఫిదా.. వీడియో వైరల్ 📍Centurion The Boxing Day Test is here! Let's go #TeamIndia 💪#INDvSA pic.twitter.com/wj4P8lu1QC — BCCI (@BCCI) December 26, 2023 -
Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: బవుమా
Ind vs SA 2023 Test Series: పటిష్ట టీమిండియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. గత దశాబ్దకాలంగా భారత జట్టు టెస్టుల్లో మరింత ప్రమాదకారిగా మారిందని.. వారిని ఓడించడం అంత సులువేమీ కాదని పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారని కొనియాడాడు. సఫారీ గడ్డపై అందని ద్రాక్షగానే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ క్రమంలో.. సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది. ప్రొటిస్ జట్టుపై పైచేయి సాధించి చరిత్రాత్మక గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరు జట్ల మధ్య మంగళవారం (డిసెంబరు 26) నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మీడియాతో మాట్లాడాడు. టీమిండియాను తేలికగా తీసుకోం ఈ సందర్భంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గైర్హాజరీ గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర సమాధానమిచ్చాడు. షమీ జట్టుతో లేకపోయినా.. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఏ టీమిండియా బౌలర్ అయినా తమను ఒత్తిడిలోకి నెట్టగలడని బవుమా పేర్కొన్నాడు. భారత బౌలింగ్ విభాగం పటిష్టమైందని.. వారిని తేలికగా తీసుకోమని స్పష్టం చేశాడు. ‘‘ఒక క్రికెటర్‌గా.. ముఖ్యంగా బ్యాటర్‌గా అత్యుత్తమైన ప్రత్యర్థితో తలపడాలని భావించడం సహజం. మహ్మద్ షమీ అలాంటి కోవకే చెందుతాడు. అతడు అద్భుతమైన పేసర్. మాలో చాలా మంది అతడి బౌలింగ్‌లో ఆడాలని కోరుకుంటారు. షమీ లేకపోయినా.. టీమిండియా టీమిండియానే అయితే, అతడు లేకపోయినా టీమిండియా.. టీమిండియానే.. అతడి స్థానంలో ఎవరు వచ్చినా మాపై ఒత్తిడి పెంచగలడు. ఎందుకంటే భారత బౌలింగ్ లైనప్ ప్రస్తుతం అలా ఉంది. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలాంశమే అయినా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే. సిరీస్ గెలిచి తీరతాం గత ఐదు- పదేళ్ల కాలంలో వారు టెస్టుల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. భారత బౌలింగ్ అటాక్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు’’ అని తెంబా బవుమా టీమిండియా బౌలింగ్ విభాగంపై ప్రశంసలు కురిపించాడు. అయితే, భారత జట్టుపై స్వదేశంలో తమకు ఉన్న అజేయ రికార్డును తప్పకుండా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా బవుమా ధీమా వ్యక్తం చేశాడు. కాగా గాయం కారణంగా షమీ జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో ముకేశ్ కుమార్ లేదంటే ప్రసిద్ కృష్ణ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. చదవండి: WFI: సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే! మా దగ్గర సాక్ష్యాలున్నాయి! -
Ind vs SA Test: ‘సెంచూరియన్’ పేసర్లకు అనుకూలం!
సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్టు పేస్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఈ నెల 26నుంచి మ్యాచ్ జరిగే సూపర్ స్పోర్ట్ పార్క్ పిచ్ పేసర్లకు బాగా కలిసొస్తుందని పిచ్ క్యురేటర్ బ్రయాన్ బ్లాయ్ స్వయంగా వెల్లడించాడు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ టెస్టుకు వాన అంతరాయం కలిగించవచ్చు. మ్యాచ్ మొదటి రోజు పూర్తిగా వాన బారిన పడవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో పిచ్‌పై క్యురేటర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘మొదటి రోజు గనుక ఆట వాన బారినపడితే తర్వాతి రోజుల్లో పేసర్లకు మంచి అవకాశముంది. పిచ్‌పై కవర్లు ఎక్కువ సమయం ఉంచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా కఠినంగా మారిపోతుంది. దాదాపు 20 డిగ్రీలకు పడిపోయే చల్లటి వాతావరణంలో పేస్ బౌలర్లకే మేలు జరుగుతుంది. ఆపై కూడా మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర నామమాత్రంగా మారిపోతుంది. పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక ఉంది. మ్యాచ్ సమయానికి కూడా దీనిని కొనసాగిస్తాం. నాలుగు రోజుల్లోనే టెస్టు ముగిసినా ఆశ్చర్యం లేదు’ అని బ్లాయ్ వ్యాఖ్యానించాడు. 2021 సిరీస్‌లో సెంచూరియన్‌లోనే జరిగిన టెస్టులో భారత్ విజయం సాధించింది. -
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు షాక్!
South Africa vs India- Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబడ మడిమ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత్‌తో సిరీస్‌కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కెప్టెన్ తెంబా బవుమా కూడా ముందుగా అనుకున్నట్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా దేశవాళీ జట్టు లయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒక్కసారైనా గెలవాలని పరిమిత ఓవర్ల క్రికెట్‌ను మినహాయిస్తే భారత జట్టు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. వరల్డ్‌కప్-2023 ఫైనల్ ఓటమి బాధలో ఉన్న అభిమానులకు చారిత్రాత్మక గెలుపుతో ఊరటనివ్వాలని భావిస్తోంది. మరోవైపు.. ప్రొటిస్ జట్టు సైతం సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత్‌పై పైచేయి సాధించాలనే తలంపుతో ఉంది. దీంతో ఈసారి టీమిండియా- సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బవుమా అలా.. గాయంతో రబడ ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమా టీ20, వన్డే సిరీస్‌లకు దూరం అయ్యాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్న బవుమా.. అంతకంటే ముందు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని భావించాడు. కెప్టెన్‌తో పాటు పేసర్ రబడ కూడా డొమెస్టిక్ టీమ్ లయన్స్ తరఫున ఆడాలని నిశ్చయించుకున్నాడు. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా బవుమా తన నిర్ణయాన్ని మార్చుకోగా.. రబడ గాయం తాలుకు నొప్పి కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డాల్ఫిన్స్ జట్టుతో తాము ఆడాల్సిన మ్యాచ్‌కు వీరిద్దరు అందుబాటులో ఉండటం లేదని లయన్స్ టీమ్ గురువారం ప్రకటించింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. రబడ గాయపడ్డాడు. నాటి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులు ఇచ్చాడు రబడ. అయితే, అతడు ఇంతవరకు పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు.. అన్రిచ్ నోర్జే కూడా గాయం వల్ల చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్! ఆమెతో నాకేం పని అంటూ.. -
భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్‌కు షాక్
డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు భారత్‌తో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్ 4) జట్లను ప్రకటించింది. సౌతాఫ్రికా సెలెక్టర్లు పరిమిత ఓవర్ల జట్ల నుంచి రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ పేసర్ కగిసో రబాడను తప్పించారు. వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడిన ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో మూడు టీ20లు (కేఎఫ్‌సీ సిరీస్), మూడు వన్డేలు (బెట్‌వే సిరీస్), రెండు టెస్ట్ మ్యాచ్‌లు (బెట్‌వే సిరీస్) జరుగుతాయి. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్, ఆతర్వాత వన్డే, టెస్ట్ సిరీస్‌లు జరుగుతాయి. 🟢 SQUAD ANNOUNCEMENT 🟡 CSA has today named the Proteas squads for the all-format inbound tour against India from 10 Dec – 7 Jan 🇿🇦🇮🇳 Captain Temba Bavuma and Kagiso Rabada are amongst a group of players that have been omitted for the white-ball leg of the tour in order to… pic.twitter.com/myFE24QZaz — Proteas Men (@ProteasMenCSA) December 4, 2023 భారత్‌తో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మ్యాన్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, డొనొవన్ ఫెరియెరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మ్యాన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జీ, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలి పోంగ్వానా, వియాన్ ముల్దర్, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రిన్, లిజాడ్ విలియమ్స్ భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జీ, డీన్ ఎల్గర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్ -
ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్‌లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్‌తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్‌ను ఇచ్చారు. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే!
వన్డే వరల్డ్‌కప్-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో బావుమా డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్టార్క్ వేసిన ఓ అద్భుత బంతికి బావుమా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో డకౌటైన బావుమా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో డకౌట్‌గా వెనుదిరిగిన నాలుగో కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. 40 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో బావుమా కంటే ముందు ముగ్గురు కెప్టెన్లు సెమీఫైనల్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1996 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అజారుద్దీన్ డకౌటయ్యాడు. అజారుద్దీన్ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోంజే, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇక సెమీస్ ఫైనల్లో మాత్రం దక్షిణాఫ్రికా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: 'కోహ్లి, షమీ, అయ్యర్ హెడ్‌లైన్స్‌లో ఉంటారు.. కానీ అతడే రియల్ హీరో' -
CWC 2023: కెప్టెన్‌గా ఇప్పటివరకు హిట్టే! బ్యాటర్‌గా ఫట్టు.. ఇలా అయితే ఎలా?
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్-2023లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 145 పరుగులు చేశాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. తాజాగా కీలక సెమీ ఫైనల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టింది సౌతాఫ్రికా. శ్రీలంకపై భారీ విజయంతో ఈవెంట్‌ను ఆరంభించిన సఫారీ జట్టు.. లీగ్ దశలో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తుగా ఓడించిన సఫారీలు భారీగా రన్‌రేటు మెరుగపరుచుకున్నారు. లీగ్ దశలో ఏడు విజయాలతో సెమీస్‌కు పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కిన ప్రొటిస్ జట్టు.. అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఏంకగా 243 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఇక అఫ్గనిస్తాన్‌పై విజయంతో లీగ్ దశను ముగించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ వంటి కీలక ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించడంతో సౌతాఫ్రికా మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగలిగింది. కెప్టెన్‌గా ఇలా హిట్టయినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు తెంబా బవుమా. View this post on Instagram A post shared by ICC (@icc) ఆసీస్ పేసర్ల దెబ్బకు సఫారీల విలవిల ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో నెట్టింట అతడిపై ట్రోలింగ్ మొదలైంది. కాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన సఫారీలు తుదిజట్టులో అదనపు స్పిన్నర్‌ను చేర్చుకున్నారు. కేశవ్ మహరాజ్‌తో పాటు తబ్రేజ్ షంసీని ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్మెంట్. అయితే, పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటం ఆస్ట్రేలియాకు వరంగా మారింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి బవుమాను పెవిలియన్‌కు పంపిన మిచెల్ స్టార్క్.. హిట్టర్ ఎయిడెన్ మార్కరమ్(10) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ జోష్ హాజిల్‌వుడ్ క్వింటన్ డికాక్(3), రాస్సీ వాన్ డర్ డస్సెన్(6) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 14వ ఓవర్ వద్ద ఆట నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. Temba Bavuma contribution for South Africa throughout the ODI world cup 2023 😂#SAvsAUS #Bavuma #Chokers #Proteas pic.twitter.com/HEXXvqJNtr — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) November 16, 2023 Temba Bavuma gone for a duck in Semifinal 🔥 The man the myth the legend Brigadier Temba Bavuma 👏#SAvsAUS pic.twitter.com/uUhxYkbS67 — Radhika Chaudhary (@Radhika8057) November 16, 2023 -
CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఆక్టోబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇంగ్లీష్ ఔట్.. తిరిగి గేమ్‌లోకి దక్షిణాఫ్రికా 193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్‌ను కొయెట్జీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రోటీస్ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది. ఆసీస్ విజయానికి 19 పరుగులు కావాలి. విజయం దిశగా ఆసీస్.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(27), మిచెల్ స్టార్క్(6) ఉన్నారు. ఉత్కంఠగా సెమీఫైనల్-2 ఈడెన్‌గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్ స్మిత్‌ను కొయెట్జీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చారు. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(19), మిచెల్ స్టార్క్(1) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. డేంజరస్ మాక్స్‌వెల్‌ను తబ్రేజ్ షంషి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్, ఇంగ్లీష్ ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్.. షంస్సీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్ హెడ్‌ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ఆసీస్ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికాతో సెమీస్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 92/2 రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్‌బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 60/1 దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(11), హెడ్(9) పరుగులతో ఉన్నారు. మిల్లర్ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు డేవిడ్ మిల్లర్ సెంచరీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్ మిల్లర్ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 203/9 ఎనిమిదో వికెట్ డౌన్.. 191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 196/8 ఏడో వికెట్ డౌన్.. 172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్: 174/7 40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6 మిల్లర్ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6 మిల్లర్ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిల్లర్ హాఫ్ సెంచరీ 31.3: మాక్స్వెల్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 30.5: హెడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు. క్లాసెన్ బౌల్డ్ 30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ట్రవిస్ హెడ్ బ్రేక్ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దీంతో ప్రొటిస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. కాగా మిల్లర్‌తో కలిసి క్లాసెన్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4 ►26.4: మరో సిక్స్ కొట్టిన క్లాసెన్ ►26.3: జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన క్లాసెన్ సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి ప్రొటిస్ ఇలా క్లాసెన్, మిల్లర్ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్ 22, మిల్లర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4 నిలకడగా ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21) ►డేవిడ్ మిల్లర్ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 మళ్లీ మొదలైన ఆట వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4 వర్షం కారణంగా ఆగిన ఆట వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్ 10, మిల్లర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు 11.5:హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో డస్సెన్ అవుట్. డస్సెన్(6) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 10.5: స్టార్క్ బౌలింగ్‌లో మార్కరమ్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇప్పటికే బవుమా, డికాక్ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్.. మార్కరమ్ రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్, డస్సెన్(5) క్రీజులో ఉన్నారు. 10.1: ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన మార్కరమ్ పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 పవర్ ప్లేలో సౌతాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ►తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2 ►6, 7 ఓవర్లను మెయిడిన్ చేసిన హాజిల్‌వుడ్, స్టార్క్. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్ తీసి స్టార్క్ షాకివ్వగా.. కీలక వికెట్ పడగొట్టి హాజిల్‌వుడ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్, డస్సెన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6). కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్ బౌలింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన ప్రొటిస్ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2) ►రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌తో సెమీస్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. కెప్టెన్ తెంబా బవుమాను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ►టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. -
CWC 2023 2nd Semi Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్,సీన్ అబాట్‌ల స్థానాల్లో మ్యాక్స్‌వెల్, స్టార్క్ రీఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్!
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా సెమీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్‌లో కూడా తొడ కండరాలు పట్టేయడంతో పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడు సెమీస్‌కు దూరం కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌కు బావుమా దూరమైతే అతడి స్ధానంలో రెజా హెండ్రిక్స్ తుది జట్టులో వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి? -
మాకు ముందే తెలుసు.. వారిద్దరూ అద్బుతం! సెమీస్‌లో కూడా: దక్షిణాఫ్రికా కెప్టెన్
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దారుణ ఓటమి చవిచూసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో ప్రోటీస్ పరాజయం పాలైంది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా సఫారీలకు ఇదే అతి పెద్ద ఓటమి. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా టెంబా బావుమా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి చెందామని బావుమా తెలిపాడు. "టీమిండియాతో పోటీ మాకు ఒక పెద్ద సవాలు అని తెలుసు. బ్యాటింగ్‌లో మేము దారుణంగా విఫలమయ్యాం. మరోసారి ఛేజింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఛేజింగ్ ప్రారంభించే ముందు మా బ్యాటర్లతో కొన్ని విషయాలను చర్చించాను. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. తొలుత పవర్ ప్లేలో భారత్ దూకుడుగా ఆడింది. మొదటి 10 ఓవర్లలో 90 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మా బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా రన్‌రేట్‌ను తగ్గించారు. రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆతర్వాత కోహ్లీ, అయ్యర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వికెట్ బ్యాటింగ్‌కు బాగానే అనుకూలించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము బ్యాటింగ్ మెరుగ్గా చేయలేకపోయాం. సెమీస్‌లో కూడా ఇదే వేదికపై మేము ఆడే అవకాశముంది. అందుకు తగ్గ ప్రణాళికలను మేము సిద్దం చేసుకుంటామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బావుమా పేర్కొన్నాడు. చదవండి: మాకు ఎటువంటి స్పెషల్ ప్లాన్స్ లేవు.. అతడొక ఛాంపియన్! జడ్డూ కూడా: రోహిత్ శర్మ -
CWC 2023 IND VS SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్లు ఇవే
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా టీమిండియా 93 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. శుభ్‌మన్ గిల్(23) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మహరాజ్ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ(40) తొలి వికెట్‌గా అవుటయ్యారు. రబడా బౌలింగ్‌లో బావుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 5) భారత్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేయగా.. టీమిండియా గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పేసర్ గెరాల్డ్ కొయెట్జీ స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు.. సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ -
డికాక్, డస్సెన్ అద్భుతంగా ఆడారు.. ఇక మేం సెమీస్‌కు చేరినట్లే: బవుమా
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ప్రొటీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంతో పాటు సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్‌పై విజయానంతరం సఫారీ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ఈ గెలుపు మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఓవరాల్‌గా అదిరిపోయే ప్రదర్శన. డికాక్, డస్సెన్ అద్భుతంగా ఆడారు. మంచి భాగస్వామ్యాన్ని అందించారు. మా బౌలర్లు అనుకున్న ప్రకారం ప్లాన్ పక్కాగా అమలు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో నేను, క్విన్నీ (డికాక్) పరిస్థితులను అంచనా వేసేందుకు నిదానంగా ఆడాం. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించాం. క్విన్నీ 30వ ఓవర్ వరకు నిదానంగా ఆడి, ఆ తర్వాత మా బిగ్ హిట్టర్లతో కలిసి చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లు మాపై ఎదురుదాడికి దిగుతారని తెలుసు. అలా జరిగితేనే మాకు అవకాశాలు వస్తాయని అంచనా వేశాం. గత కొంతకాలంగా మేం ఆచరిస్తున్న వ్యూహాలే ఈ మ్యాచ్‌లోనూ అమలు చేశాం. ఈ విజయం మాకు సెమీస్ స్థానాన్ని ఖరారు చేసేలా కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాం. తదుపరి జరిగే మ్యాచ్‌లపై మరింత ఫోకస్ పెంచుతామని అన్నాడు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (60), విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
ఉత్కంఠను దాటి... పాకిస్తాన్‌పై ఒక వికెట్ తేడాతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా
చెన్నై: ఒక్కో బంతి, ఒక్కో పరుగుకు గుండెచప్పుడు పెరుగుతుంటే... మరోసారి ‘చోకర్స్’ అనిపించుకోరాదని దక్షిణాఫ్రికా ఒకవైపు... ఈ అవకాశం పోతే వన్డే వరల్డ్‌కప్‌లో తమ ఖేల్ ఖతమ్ అని తెలుసు కాబట్టి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాకిస్తాన్ మరోవైపు... వరల్డ్ కప్ 26వ మ్యాచ్ అభిమానులకు అత్యంత ఉత్కంఠను పెంచి ఆసక్తికరంగా ముగిసింది. విజయానికి చేరువైన దశలో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడం సఫారీ టీమ్‌లో ఆందోళన పెంచగా... ఆఖరి వికెట్ తీసేందుకు 11 బంతులు పోరాడిన పాక్ చివరకు తలవంచింది. 17 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా ఒత్తిడిని అధిగమించి కేశవ్ మహరాజ్ కొట్టిన బౌండరీతో ఆట ముగిసింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (52 బంతుల్లో 52; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ప్రదర్శన చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీకి 4 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (93 బంతుల్లో 91; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. కీలక భాగస్వామ్యం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అబ్దుల్లా (9), ఇమామ్ (12) సమష్టిగా విఫలమయ్యారు. తొలి బంతికే జాన్సెన్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రిజ్వాన్ (27 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే రిజ్వాన్, ఇఫ్తికార్ (21)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మరోవైపు తడబడుతూనే ఆడిన బాబర్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. 141/5 స్కోరుతో పాక్ కుప్పకూలడం ఖాయమనిపించింది. ఈ దశలో షాదాబ్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో పాటు వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆరో వికెట్‌కు షకీల్‌తో కలిసి 84 పరుగులు (71 బంతుల్లో) జోడించిన అనంతరం షాదాబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 50 బంతుల్లో షకీల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. కానీ అతను అవుటైన తర్వాత పరుగులు జోడించడంలో పాక్ విఫలమైంది. 30 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 4 వికెట్లు కోల్పోగా మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. రాణించిన మార్క్రమ్... ఛేదనను దక్షిణాఫ్రికా దూకుడుగా మొదలు పెట్టింది. షాహిన్ వేసిన రెండో ఓవర్లో డికాక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు) నాలుగు ఫోర్లు బాదగా, బవుమా (27 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరితో పాటు వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయానికి డసెన్ (21), ఫామ్‌లో ఉన్న క్లాసెన్ (12) కూడా వెనుదిరగడంతో పాక్ జట్టులో ఆశలు రేగాయి. అయితే మార్క్రమ్, మిల్లర్ (29) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ సహజశైలిలో వీరు ధాటిగా ఆడటంతో సఫారీ జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 పరుగులు జత చేశారు. అయితే లక్ష్యానికి చేరువవుతున్న దశలో పాక్ బౌలర్లు చెలరేగడంతో టీమ్ తక్కువ వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది. 59 బంతుల్లో కేవలం 21 పరుగులు చేయాల్సిన దశలో మార్క్రమ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరిత ముగింపు వైపు సాగింది. ఫీల్డింగ్‌లో తలకు గాయం కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పాక్ బౌలర్ షాదాబ్ మైదానం వీడగా... ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా ఉసామా మీర్ బరిలోకి దిగాడు. వరల్డ్ కప్‌లో ఇదే తొలి ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’ ఘటన కావడం విశేషం. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అబ్దుల్లా (సి) ఎన్గిడి (బి) జాన్సెన్ 9; ఇమామ్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 12; బాబర్ (సి) డికాక్ (బి) షమ్సీ 50; రిజ్వాన్ (సి) డికాక్ (బి) కొయెట్జి 31; ఇఫ్తికార్ (సి) క్లాసెన్ (బి) షమ్సీ 21; షకీల్ (సి) డికాక్ (బి) షమ్సీ 52; షాదాబ్ (సి) మహరాజ్ (బి) కోయెట్జి 43; నవాజ్ (సి) మిల్లర్ (బి) జాన్సెన్ 24; షాహిన్ (సి) మహరాజ్ (బి) షమ్సీ 2; వసీమ్ (సి) డికాక్ (బి) ఎన్గిడి 7; రవూఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–20, 2–38, 3–86, 4–129, 5–141, 6–225, 7–240, 8–259, 9–268, 10–270. బౌలింగ్: జాన్సెన్ 9–1–43–3, ఎన్గిడి 7.4–0–45–1, మార్క్ రమ్ 4–0–20–0, మహరాజ్ 9–0–56–0, కోయెట్జి 7–0–42–2, షమ్సీ 10–0–60–4. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) షకీల్ (బి) వసీమ్ 28; డికాక్ (సి) వసీమ్ (బి) షాహిన్ 24; డసెన్ (ఎల్బీ) (బి) ఉసామా 21; మార్క్రమ్ (సి) బాబర్ (బి) ఉసామా 91; క్లాసెన్ (సి) ఉసామా (బి) వసీమ్ 12; మిల్లర్ (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 29; జాన్సెన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 20; కోయెట్జి (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 10; మహరాజ్ (నాటౌట్) 7; ఎన్గిడి (సి) అండ్ (బి) రవూఫ్ 4; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (47.2 ఓవర్లలో 9 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–34, 2–67, 3–121, 4–136, 5–206, 6–235, 7–250, 8–250, 9–260. బౌలింగ్: ఇఫ్తికార్ 3–0–23–0, షాహిన్ అఫ్రిది 10–0–45–3, నవాజ్ 6.2–0–40–0, రవూఫ్ 10–0–62–2, వసీమ్ 10–1–50–2, ఉసామా 8–0–45–2. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X న్యూజిలాండ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి బంగ్లాదేశ్ X నెదర్లాండ్స్ వేదిక: కోల్‌కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్‌కు పరీక్ష! నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.. అలీ స్థానంలో అతడే!
ICC ODI WC 2023- Pak Vs SA: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సౌతాఫ్రికాను తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్ చేస్తాం. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యమైనదే. ప్రతీ విభాగంలోనూ మేము మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు సరిచేసుకోవాలి. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా ఈ విషయాలన్నిటి గురించి అంతా కూర్చుని చర్చించుకున్నాం. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రొటిస్ జట్టుతో మ్యాచ్‌కు హసన్ అలీ అనారోగ్యం కారణంగా దూరం కాగా.. వసీం జూనియర్ తుదిజట్టులోకి వచ్చినట్లు బాబర్ తెలిపాడు. మూడు మార్పులతో సౌతాఫ్రికా ఇక ఇప్పటి వరకు నెదర్లాండ్స్ చేతిలో తప్ప ఓటమన్నది ఎరుగని సౌతాఫ్రికా.. మరో భారీ విజయంపై కన్నేయగా.. హ్యాట్రిక్ ఓటములకు చెక పెట్టాలని పాక్ భావిస్తోంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి ప్రొటిస్ జట్టుపై తమకున్న ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పాక్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా.. తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి కూడా టీమ్‌తో చేరారు. రీజా హెండ్రిక్స్, కగిసో రబడ, లిజాద్ విలియమ్స్ దూరం కావడంతో ఈ ముగ్గురు రీఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లు పాకిస్తాన్ అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రవూఫ్. సౌతాఫ్రికా క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి . చదవండి: WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్‌గా నేనున్నాంటే: రోహిత్ శర్మ -
WC 2023: నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు మరో షాక్!
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా కెప్టెన్ తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎయిడెన్ మార్కరమ్ సౌతాఫ్రికా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కాగా పటిష్ట ప్రొటిస్ జట్టు గత మ్యాచ్‌లో అనూహ్య రీతిలో నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ధర్మశాలలో అక్టోబరు 17 వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో శనివారం నాటి మ్యాచ్‌కు ముందు తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. రీజా హెండ్రిక్స్ అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి తప్ప కెప్టెన్‌గా బవుమా మిగతా మ్యాచ్‌లలో విజయవంతమయ్యాడు. అయితే, బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్‌లలో వరుసగా 8, 35, 11 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన వన్‌డౌన్ బ్యాటర్ బవుమా స్థానంలో వచ్చిన హెండ్రిక్స్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! ఇక ఇంగ్లండ్‌తో ముంబై మ్యాచ్‌లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్ రాజా View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 SA VS NED: అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం: బవుమా
వన్డే ప్రపంచకప్-2023లో నిన్న మరో సంచలనం నమోదైంది. అక్టోబర్ 15న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. నిన్న (అక్టోబర్ 17) ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సౌతాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం తామెదుర్కొన్న ఘోర పరాభవంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్పందిస్తూ ఇలా అన్నాడు. మొదటిగా నెదర్లాండ్స్‌కు శుభాకాంక్షలు. ఇవాళ వారు అద్భుతంగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు. మా బౌలర్లు డచ్ బ్యాటర్లను 200 స్కోర్‌ను దాటనివ్వాల్సింది కాదు. డచ్ టీమ్ 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మేము మ్యాచ్‌పై పట్టు సాధించాల్సింది. అయితే అలా జరగలేదు. అప్పుడే సగం మ్యాచ్‌ను కోల్పోయాం. అయినా మేము నమ్మకాన్నికోల్పోలేదు. డచ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. అయితే అలా జరగలేదు. డచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మాపై ఒత్తిడి తీసుకొచ్చి వికెట్లు కోల్పోయేలా చేశారు. అంతకుముందు శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో మేం ప్రొఫెషనల్ గేమ్ ఆడాం. అది మా స్థాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మేము మా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అందుకే ఓడిపోయాం. మా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో లోపాలు ఉన్నాయి. అవి డచ్తో జరిగిన మ్యాచ్‌లో బయటపడ్డాయి. ఈ రెండు విషయాల్లో మా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. వీటిని అధిగమించి తదుపరి మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించేందుకు ప్రయత్నిస్తామని బవుమా అన్నాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో భారత్, న్యూజిలాండ్ తర్వాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా అక్టోబర్ 21న జరుగనుంది. -
ప్రపంచకప్ కెప్టెన్ల మీటింగ్.. స్టేజీపైనే నిద్రలోకి జారుకున్న బవుమా
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ రేపటి (అక్టోబర్ 5) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీకి ముందు నిర్వహకులు అన్ని జట్ల కెప్టెన్లతో ఇవాళ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ప్రోగ్రాంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా మిగతా 9 దేశాల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. గతేడాది ఇంగ్లండ్‌కు జగజ్జేతగా నిలిపిన ఇయాన్ మోర్గన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Temba Bavuma during the Captain's Round Table Event. pic.twitter.com/xaxRHTzg4V — Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023 కార్యక్రమంలో భాగంగా రవిశాస్త్రి అందరు కెప్టెన్లతో ఒక్కొక్కరిగా మాటలు కలుపుతూ వచ్చాడు. వరల్డ్‌కప్‌లో వారి ప్రణాళికలు, మెగా టోర్నీలో గత అనుభవాలు, భారత్‌లో వరల్డ్‌కప్ ఆడటం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది.. ఇలా శాస్త్రి ఒక్కొక్క కెప్టెన్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాడు. ఈ మధ్యలో కాస్త సమయం దొరకడంతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్టేజీపైనే నిద్రలోకి జారుకున్నాడు. ఇలా జరిగినందుకు బవుమాను కూడా నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే, అతను గడిచిన వారమంతా ప్రయాణంలో గడిపాడు. ప్రపంచకప్ కోసమని సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన బవుమా.. ఇక్కడికి వచ్చాక వ్యక్తిగత కారణాల చేత తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. సౌతాఫ్రికా నుంచి రెండు రోజుల కిందటే భారత్‌కు చేరుకున్న అతను తాజాగా కెప్టెన్ల మీటింగ్ కోసమని న్యూఢిల్లీ (వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌కు వేదిక) నుంచి అహ్మదాబాద్‌కు వచ్చాడు. ఏదిఏమైనప్పటికీ బవుమా స్టేజీపైనే కునుకు తీయడం మాత్రం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్ 5) వన్డే వరల్డ్‌కప్ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 14న భారత్.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. -
WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్‌గా మార్కరమ్
Temba Bavuma to travel back home: సౌతాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ తెంబా బవుమా స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తమ ఇంటికి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లకు బవుమా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ ధ్రువీకరించింది. కాగా అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్-2023 కోసం ఇప్పటికే ప్రొటిస్ జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కేరళలో వార్మప్ మ్యాచ్‌లు ఆడే క్రమంలో సోమవారం త్రివేండ్రంలో అడుగుపెట్టింది. అక్కడే అఫ్గనిస్తాన్‌తో సెప్టెంబరు 29న, న్యూజిలాండ్‌తో అక్టోబరు 2న తలపడనుంది. View this post on Instagram A post shared by Proteas Men (@proteasmencsa) ఆ రెండు మ్యాచ్‌లకు బవుమా దూరం: సౌతాఫ్రికా క్రికెట్ అయితే, జట్టుతో పాటే భారత్‌కు విచ్చేసిన తెంబా బవుమా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లనున్నాడు. ఈ మేరకు.. ‘‘ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023లో అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్‌లతో సెప్టెంబరు 29, అక్టోబరు 2న జరుగనున్న వార్మప్ మ్యాచ్‌లకు బవుమా దూరం కానున్నాడు. అతడి గైర్హాజరీలో ఎయిడెన్ మార్కరమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు’’ అని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా గురువారమే బవుమా తిరిగి వెళ్లిపోనున్నట్లు సమాచారం. అతడి స్థానంలో టీ20 కెప్టెన్ మార్కరమ్ వార్మప్ మ్యాచ్‌లలో వన్డే జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సూపర్‌ఫామ్‌లో బవుమా ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా వన్డే ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 104.08 స్ట్రైక్‌రేటుతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. మరో మ్యాచ్‌లో కేవలం పది పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. చదవండి: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు' హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యా: బాబర్ భావోద్వేగం View this post on Instagram A post shared by Proteas Men (@proteasmencsa) -
మార్క్రమ్ విధ్వంసకర శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (సెప్టెంబర్12) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకంతో (102 నాటౌట్) విరుచుకుపడ్డాడు. మార్క్రమ్కు జతగా క్వింటన్ డికాక్ (77 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (62 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. రీజా హెండ్రిక్స్ (39), మార్కో జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. ఈ నలుగురు సత్తా చాటడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (0), డేవిడ్ మిల్లర్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా కొనసాగుతుంది. -
భీకర ఫామ్‌లో బవుమా.. వ్యక్తిగత అవమానాలు దిగమింగి..!
ప్రపంచ క్రికెట్లో ఫామ్‌తో సంబంధం లేకుండా క్రికెటేతర విషయాలైన రూపం, వర్ణం, ఆహార్యం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారధి టెంబా బవుమానే అని చెప్పాలి. ఈ సఫారీ స్టార్ గతంలో అనేక సందర్భాల్లో క్రికెటేతర కారణాల చేత అవమానాలు ఎదుర్కొన్నాడు. సొంత జట్టు సభ్యులతో సహా తన చుట్టూ ఉన్నవారంతా తన ఆహార్యాన్ని గేలి చేసినప్పటికీ ఎంతమాత్రం చలించని ఈ సఫారీ బ్యాటింగ్ యోధుడు, తనకు అవమానం ఎదురైన ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం బవుమా అదే పనిలోనే ఉన్నాడు. వ్యక్తిగత విషయాలతో పాటు తన ఆటను కించపరిచే వారికి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ సమాధానం చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్ మినహాయించి మిగతా రెండు ఫార్మాట్లలో ఈ ఏడాది బవుమా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అతను టెస్ట్‌ల్లో (1), వన్డేల్లో (3) నాలుగు సెంచరీలు బాదాడు. ముఖ్యంగా వన్డేల్లో అతని ఫామ్ అసామాన్యమైనదిగా ఉంది. ఈ ఏడాది అతనాడిన 9 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సహా 637 పరుగులు చేశాడు. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన జట్టు నామమాత్రపు ప్రదర్శన చేస్తున్నప్పటికీ, అతనొక్కడు అద్భుతంగా రాణిస్తూ, తన జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కోకుండా కాపాడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మూడో వన్డేలో బవుమా 62 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సఫారీ టీమ్ 39 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బవుమాతో పాటు డికాక్ (82), రీజా హెండ్రిక్స్ (39), మార్క్రమ్ (43 నాటౌట్) రాణించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇంకా 11 ఓవర్లు ఆడాల్సి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
వన్డే వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. భారత సెలెక్టర్లు టీమిండియాను ప్రకటించిన నిమిషాల వ్యవధిలో సౌతాఫ్రికా సెలెక్టర్లు తమ స్క్వాడ్‌ను ప్రకటించారు. ఈ జట్టులో ఎలాంటి సంచలన ఎంపికలు జరగలేదు. విధ్వంసకర బ్యాటర్లు, టాప్ క్లాస్ పేసర్లు, మ్యాజిక్ చేయగల స్పిన్నర్లతో సౌతాఫ్రికా టీం సమతూకంగా ఉంది. రైట్ ఆర్మ్ పేసర్ గెరాల్డ్ కొయెట్జీ.. తన అదిరిపోయే ప్రదర్శనతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఒక్క ఎంపిక మినహాయించి, అంతా ఊహించనట్టుగానే జరిగింది. టెంబా బవుమా సఫారీలను ముందుండి నడిపించనుండగా.. బ్యాటింగ్ చిచ్చరపిడుగులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే అరివీర భయంకర పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ జట్టులో ఉన్నారు. వీరితో పాటు ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ సౌతాఫ్రికన్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. కాగా, అక్టోబర్ 7న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సౌతాఫ్రికా వరల్డ్‌కప్ జర్నీని ప్రారంభంకానుంది. అంతకుముందు వీరు సెప్టెంబర్ 27న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 2న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ -
ఆసీస్‌తో సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే..!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వేర్వేరు జట్లను ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. ఈ పర్యటనలోని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికన్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌కు తొలిసారి పిలుపునిచ్చారు. ఇతనితో పాటు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ డోనోవన్ ఫెర్రీరా, యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీలను కూడా తొలిసారి ఎంపిక చేశారు. ఆసీస్ పర్యటనలోని 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన యువ జట్టును ప్రకటించారు. సీనియర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేల గైర్హాజరీలో సెలెక్టర్లు యువకులకు అవకాశం ఇచ్చారు. పైపేర్కొన్న సీనియర్లంతా ఇదే పర్యటనలో జరిగే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తారు. టీ20 సిరీస్‌కు ఎయిడెన్ మార్క్రమ్, వన్డే సిరీస్‌కు టెంబా బవుమా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. గాయం కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు కేశవ్ మహారాజ్ సైతం రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పర్యటనలో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, మాథ్యూ బ్రీట్జ్కీ, డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, సిసంద మగాల, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి, వేన్ పార్నెల్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ షెడ్యూల్.. ఆగస్ట్ 30: తొలి టీ20 (డర్బన్) సెప్టెంబర్ 1: రెండో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 2: మూడో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 7: తొలి వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 9: రెండో వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 12: మూడో వన్డే (పోచెఫ్‌స్ట్రూమ్) సెప్టెంబర్ 15: నాలుగో వన్డే (సెంచూరియన్) సెప్టెంబర్ 17: ఐదో వన్డే (జోహనెస్బర్గ్) -
SA Vs NED: లంక అవుట్! పాపం.. వెస్టిండీస్! ‘ప్రపంచకప్’ రేసులో సౌతాఫ్రికా..
South Africa Beat Netherlands By 8 Wickets: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా సౌతాఫ్రికా మరో ముందుడుగు వేసింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించి.. వెస్టిండీస్ జట్టుకు నిద్రపట్టకుండా చేసింది. మరొక్క గెలుపు సాధిస్తే చాలు ప్రపంచకప్ రేసులో ప్రొటిస్ ముందుకు వెళ్తుంది. కాగా బెనొని వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డే(రీ షెడ్యూల్డ్)లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ప్రొటిస్‌కు సిసంద మగల శుభారంభం అందించాడు. డచ్ ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్(45), మాక్స్ ఒడౌడ్(18)లను అవుట్ చేసిన మగల.. తేజ నిడమనూరు(48) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లలో మార్కో జాన్సన్ ఒకటి, నోర్జే రెండు, షంసీ మూడు, మార్కరమ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో 46.1 ఓవర్లలో నెదర్లాండ్స్ 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 30 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ తెంబా బవుమా 90 పరుగులతో అజేయంగా నిలవగా.. ఎయిడెన్ మార్కరమ్ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయం అందించారు. పాపం విండీస్.. అయితే సౌతాఫ్రికా మాత్రం ఇక ఈ గెలుపుతో పది పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంకను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానానికి దూసుకువచ్చింది. నెదర్లాండ్స్‌తో మిగిలి ఉన్న ఆఖరి వన్డేలో ప్రొటిస్ విజయం సాధిస్తే వెస్టిండీస్‌ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకుతుంది. తద్వారా ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. అయితే, మూడో వన్డేలో గెలవడంతో పాటు.. బంగ్లాదేశ్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫలితం తేలిన తర్వాతే సౌతాఫ్రికాకు బెర్తు ఖరారు అవుతుందా? లేదోనన్న విషయంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ నెదర్లాండ్స్ ఓడి.. ఐర్లాండ్‌కు బంగ్లా చేతిలో ఓటమి ఎదురైతే.. విండీస్‌కు ఘోర పరాభవం తప్పదు. టీ20 ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్ ఆడిన వెస్టిండీస్ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ కూడా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2023 సూపర్‌లీగ్ పాయింట్ల పట్టిక: PC: ICC చదవండి: IPL 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్.. తొలి భారత క్రికెటర్‌గా! IPL 2023: గుజరాత్‌కు బిగ్ షాక్.. విలియమన్స్కు తీవ్ర గాయం! ఐపీఎల్ మొత్తానికి దూరం -
సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు
SA VS WI 2nd ODI: జాతి వివక్ష.. వర్ణ భేదం.. ఆహార్యంపై వెకిలి మాటలు..జాతీయ జట్టుకు సారధి అయినప్పటికీ, సొంతవారి నుంచే వ్యతిరేకత.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించరాని ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న సౌతాఫ్రికా టెస్ట్, వన్డే జట్టు సారధి టెంబా బవుమా.. అవకాశం దొరికిన ప్రతిసారి తనను విమర్శించిన వారికి తన ఆటతీరుతో బదులిస్తున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇటీవలే టీ20 కెప్టెన్సీని కోల్పోయిన బవుమా.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో (118 బంతుల్లో 144; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) విజృంభించిన బవుమా.. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా రెండో శతకాన్ని (విండీస్‌తో రెండో టెస్ట్‌లో 172) బాదాడు. బవుమాకు గత 3 వన్డేల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేసిన బవుమా అంతకుముందు జరిగిన రెండో వన్డేలో 109 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బవుమాను ఓ దశలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు జాత్యాహంకారులు డిమాండ్ చేశారు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్ కావడం ఇష్టం లేని కొందరు అతను ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా పని కట్టుకుని మరీ విమర్శలు చేసేవారు. అలాంటి వారికి బవుమా ప్రతిసారి తన బ్యాట్‌తో సమాధానం చెప్తూ వస్తున్నాడు. తాజా సెంచరీతో బవుమా తన జట్టును గెలిపించలేకపోయినా.. అద్భుతమైన పోరాటపటిమ, ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. విండీస్‌తో రెండో వన్డేలో శైలీకి భిన్నంగా 7 భారీ సిక్సర్లు బాదిన బవుమా విమర్శకులు ముక్కునవేళ్లేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ షాట్లతో పాటు మాస్టర్ క్లాస్ ఆటను ఆడిన బవుమా..సొగసైన బౌండరీలు కొట్టి, స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బెస్ట్ వన్డే నాక్ ఆడాడు. కెరీర్ ఆరంభం నుంచే జాత్యాహంకారులకు టార్గెట్‌గా మారిన బవుమా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఏమాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్పడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. క్లిష్ట సమయంలో ముళ్ల కిరీటం లాంటి సౌతాఫ్రికన్ కెప్టెన్సీని చేపట్టిన బవుమా.. సారధిగానూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సహచరుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌతాఫ్రికా కెప్టెన్‌గా నియమితుడైన మొట్టమొదటి బ్లాక్ అఫ్రికన్ అయిన బవుమా.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా, వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికన్‌గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాలో జాతి వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ మండేలా ఎందు కోసం పోరాడాడో యావత్ ప్రపంచం చూసింది. కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా కొంత మంది సౌతాఫ్రికన్లలో జాత్యాహంకారం బీజాలు పోలేదు. ఈ వరుస సౌతాఫ్రికా క్రికెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశించినా ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌తో పాటు కొందరు అలా చేసేందుకు నిరాకరించడం ఇందుకు నిదర్శనం. మున్ముందు ఇలా చేయాల్సి వస్తుందేమోనని డికాక్ ఏకంగా తన కెరీర్‌నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. గతంలో సౌతాఫ్రికా జట్టులో బ్లాక్స్‌ను వ్యతిరేస్తూ కొందరు స్టార్ ఆటగాళ్లు ఏకంగా దేశం వదలి ఇతర దేశాలకు వలస వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బవుమా లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్‌తో కెప్టెన్ స్థాయికి ఎదగడంతో కొందరు కడుపు మంటతో అనునిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. నేషనల్ టీమ్‌కు కెప్టెన్ అయినప్పటికీ స్వదేశంలో ఇటీవల జరిగిన ఎస్ఏ20 లీగ్‌లో బవుమాను ఏ ఫ్రాంచైజీ తీసుకోకుండా ఘోరంగా అవమానించింది. రేసిజమ్ కారణంగా ఇలా జరిగిందని క్రికెట్ సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. ఆతర్వాత రీప్లేస్‌మెంట్‌గా బవుమాను ఓ ఫ్రాంచైజీ అక్కును చేర్చుకున్నప్పటికీ ఇది క్రికెట్ సౌతాఫ్రికాకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. కెరీర్లో 56 టెస్ట్‌లు, 24 వన్డేలు, 33 టీ20లు ఆడిన బవుమా.. మొత్తంగా 4500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 2 టెస్ట్ శతకాలు, 20 అర్ధసెంచరీలు.. 4 వన్డే హండ్రెడ్స్, 2 ఫిఫ్టీలు.. ఓ టీ20 హాఫ్ సెంచరీ ఉన్నాయి. -
విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ షెయ్ హోప్ (115 బంతుల్లో 128 పరుగులు, 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. రోవ్‌మన్ పావెల్ 46, బ్రాండన్ కింగ్ 30, కైల్ మేయర్స్ 36 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో గెరాల్డ్ కొట్జే మూడు వికెట్లు పడగొట్టగా.. ఫొర్టున్, షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 41.4 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బవుమా(118 బంతుల్లో 144 పరుగులు) తన కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. డికాక్(48 పరుగులు) మినహా బవుమాకు సహకరించేవారు కరువయ్యారు. టోని డి జార్జీ 27 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హొసెన్, అల్జారీ జోసెఫ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. ఓడెన్ స్మిత్, యానిక్ కారియా, కైల్ మేయర్స్ తలా ఒక వికెట్ తీశారు. తొలి వన్డే వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన విండీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరిదైన మూడో వన్డే మార్చి 21న(మంగళవారం) జరగనుంది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న షెయ్ హోప్‌ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది. చదవండి: 36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో -
SA Vs WI 2nd Test: దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
జొహన్నెస్‌బర్గ్- South Africa vs West Indies, 2nd Test: వెస్టిండీస్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35.1 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. జోషువా డి సిల్వ (34)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ, సైమన్ హార్మర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... రబడ, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు 287/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. బవుమా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, ఎయిడెన్ మార్క్రమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కోహ్లి ముఖంపై చిరునవ్వు! ఫ్యాన్స్ ఖుషీ IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! -
దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు!
దక్షిణాఫ్రికా కొత్త టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. టెంబా బవుమా స్థానంలో తమ జట్టు కెప్టెన్‌గా మార్క్రమ్ను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. ఇక బవుమా కేవలం వన్డేలు,టెస్టుల్లో మాత్రమే ప్రోటీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా వైట్‌బాల్ క్రికెట్లో తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆటగాడు జేపీ డుమిని, బౌలింగ్ కోచ్‌గా రోరీ క్లీన్వెల్ట్ను దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా.. ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. మాజీ కెప్టెన్ బవుమాను ఇకపై టీ20లకు పరిగణించకూడదని ప్రోటీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ప్రోటీస్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. విండీస్ సిరీస్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించాయి. అయితే సెలక్టర్లు మాత్రం అతడి పునరాగమనంపై ఆసక్తి చూపకపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రోటీస్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ రాబ్ వాల్టర్‌తో డుప్లెసిస్ జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక జట్టు ఎంపిక విషయానికి వస్తే.. వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ క్రికెటర్లు గెరాల్డ్ కోయెట్జీ, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి,ట్రిస్టన్ స్టబ్స్ కు తొలి సారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు దక్కింది. తొలి రెండు వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ, ర్యాన్ రికెల్టన్, ఆండిలే స్టిల్బుబ్స్, ఫెహ్లుక్వేబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్. మూడో వన్డే కోసం జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ , లుంగి ఎం, ర్యాన్ రికెల్టన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్. టీ20లకు ప్రోటీస్ జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్టే, వేన్ పార్నెల్, కగిసో రబాడ, రిలీ రోసోవ్, , ట్రిస్టన్ స్టబ్స్. -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా బవుమా.. టీ20లకు గుడ్‌బై!
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌పై వేటు పడింది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న టెంబా బవుమాను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. అయితే దక్షిణాఫ్రికా కొత్త టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టనున్న బవుమా.. టీ20 కెప్టెన్సీ మాత్రం గుడ్‌బై చెప్పనున్నాడు. అతడు కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా టీ20ల్లో ప్రోటీస్ కెప్టెన్‌గా మార్క్రమ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో సఫారీ జట్టు కెప్టెన్ అయిన తొలి నల్ల జాతీయుడిగా బవుమా రికార్డు సృష్టించనున్నాడు. ఇక ఎల్గర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 17 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. 17 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 7 ఓటములు, ఒకడ్రా ఉన్నాయి. అయితే వరుసగా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా సిరీస్‌లలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవ్వడంతో ప్రోటీస్ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లలో మాత్రం ఎల్గర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకోలేదు. తన స్థాయికి తగ్గట్టు రాణించడం విఫలమయ్యాడు. కాగా స్వదేశంలో వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ.. ఈ కీలక మార్పు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. విండీస్‌తో టెస్టులకు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ,ర్యాన్ రికెల్టన్ చదవండి: IPL 2023: మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్లో.. ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ ఇదే Introducing the new #Proteas Test captain - Temba Bavuma 💪 He remains captain of the ODI side while he has opted to relinquish the captaincy of the T20I side. #BePartOfIt pic.twitter.com/WgsbHhEgss — Proteas Men (@ProteasMenCSA) February 17, 2023 -
సెంచరీ కొట్టాడు.. సన్‌రైజర్స్‌లో చోటు పట్టాడు
SA20, 2023: స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో ఘోరంగా అవమాన పడ్డ సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఊరట లభించింది. ఎట్టకేలకే బవుమాను ఓ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంలోని జట్టైన సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ బవుమాను తదుపరి లీగ్‌లో ఆడించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం గురువారం (ఫిబ్రవరి 2) ప్రకటన విడుదల చేసింది. బవుమాకు జాతీయ జట్టు కెప్టెన్సీ తెచ్చిపెట్టని స్థానాన్ని.. ఇటీవల ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ సాధించిపెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్వదేశంలో తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బవుమా వరుసగా 36, 109, 35 స్కోర్లు చేసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే సన్‌రైజర్స్ యాజమాన్యం అతన్ని మరో ఆటగాడికి రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంది. తదుపరి జరుగబోయే లీగ్‌లో బవుమాతో పాటు పలు ఫ్రాంచైజీలు రీప్లేస్మెంట్లు చేసుకునున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యంలోని జోబర్గ్ సూపర్‌కింగ్స్.. విండీస్ ఆటగాడు అల్జరీ జోసఫ్ స్థానంలో ఆసీస్ వెటరన్ వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌ను ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్ టీమ్ లియామ్ లివింగ్‌స్టోన్, ఓలీ స్టోన్ స్థానాలను టిమ్ డేవిడ్, హెన్రీ బ్రూక్స్లతో భర్తీ చేసింది. కాగా, అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు 8 రోజుల గ్యాప్ పడింది. తిరిగి మ్యాచ్‌లు ఇవాల్టి (ఫిబ్రవరి 2) నుంచే ప్రారంభమయ్యాయి. ఇవాళ డర్బన్ సూపర్ జెయింట్స్-ఎంఐ కేప్‌టౌన్ తలపడుతున్నాయి. ప్రస్తుతానికి లీగ్ పాయింట్ల పట్టికలో ప్రిటోరియా క్యాపిటల్స్ (23 పాయింట్లు), సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ (17), పార్ల్ రాయల్స్ (17), జోబర్గ్ సూపర్ కింగ్స్ (16), ఎంఐ కేప్‌టౌన్ (13), డర్బన్ సూపర్ జెయింట్స్ (8) వరుస స్థానాల్లో ఉన్నాయి. -
ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం
బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ప్రొటీస్ సొంతం చేసుకుంది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్రోటీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కీలక పాత్ర పోషించాడు. 102 బంతులు ఎదుర్కొన్న బావుమా 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. అదే విధంగా డెవిడ్ మిల్లర్ కూడా 58 పరుగులతో ఆజేయం నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్ ఒక్క వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(80), జోస్ బట్లర్(94 నాటౌట్), మొయిన్ అలీ(51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటిస్ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా.. పార్నెల్, ఎంగిడీ, మార్క్రమ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే కింబర్లీ వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది. చదవండి: Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు -
విజయానికి 13 వికెట్ల దూరంలో.. అసాధ్యం మాత్రం కాదు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. ఆఖరి రోజు లంచ్ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఖాయా జోండో (39), తెంబా బవుమా (35) ఓ మోస్తరుగా రాణించగా.. సిమోన్ హార్మర్ (45 నాటౌట్), కేశవ్ మహారాజ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 231 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్ ఆధిపత్యం కనిపిస్తున్నా.. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు సెషన్ల ఆటలో ఆసీస్ బౌలర్లు మరో 13 వికెట్లు నేలకూల్చగలిగితే.. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువు కాదు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్ 475/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం, వెలుతురు లేమి సమస్యల కారణంగా తొలి రోజు 47 ఓవర్ల ఆటకు కోత పడగా, రెండో రోజు 14 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో రోజు కూడా వర్షం కారణంగా తొలి సెషన్ మొత్తం రద్దైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఆసీస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ క్రమంతో ఉస్మాన్ ఖ్వాజా (195 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆసీస్ కెప్టెన్ సాహసోపేత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజాతో పాటు స్టీవ్ స్మిత్ (104) సెంచరీలు చేయగా.. లబూషేన్ (79), ట్రవిస్ హెడ్ (70) అర్ధసెంచరీలు సాధించారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Bavuma-Marco Jansen: 'వీడేంట్రా బాబు ఇంత పొడుగున్నాడు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ ఓటమిపాలైన సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రొటీస్ భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. సౌతాఫ్రికా మాత్రం నాలుగో స్థానానికి పడిపోయి అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. సోషల్ మీడియలో ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది కేవలం సరదా కోసం మాత్రమే రాసుకొచ్చాం. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ బవూమా, మార్కో జాన్సెన్లు క్రీజులో ఉన్నారు. సాధారణంగా బవుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సెన్ చాలా పొడగరి.. దాదాపు ఆరున్నర అడుగులు ఉంటాడు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ బవుమా.. మార్కో జాన్సెన్ వైపు అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదెలా ఉందంటే.. ''వీడేంటి ఇంత పొడుగున్నాడు అనేలా''.. ఫోటో చూడగానే మీకు కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. మాములుగానే తమకంటే హైట్ ఎక్కువుంటేనే తెగ బాధపడిపోయే పొట్టోళ్లు.. తమకు సాధ్యం కాని ఎత్తులో ఉన్న వ్యక్తులను చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పాపం బవుమా పరిస్థితి కూడా అదే. అందుకే అతని వైపు చూస్తూ బవుమా కచ్చితంగా అదే అనుకొని ఉంటాడు. ఇక వాస్తవానికి వస్తే.. బవుమా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిజానికి మార్కో జాన్సెన్‌తో రివ్యూ విషయమై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్‌మనిపించాడు. ఒక్క ఫోటోతో మనం ఇంకో విధంగా ఊహించుకునేలా చేసిన ఫోటోగ్రాఫర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్ మాకు కొత్తేమీ కాదు!
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: దక్షిణాఫ్రికాకు ఇది కొత్త కాదు... ఆ జట్టును అభిమానించే వారికీ ఇది కొత్త కాదు... ఐసీసీ టోర్నీల్లో ఒకదశలో అద్భుత విజయాలు సాధిస్తూ ఒక్కసారిగా ఫేవరెట్‌గా మారిపోవడం, ఆ తర్వాత కీలక సమయంలో అనూహ్య ఓటమిని ఆహ్వానించి నిష్క్రమించడాన్ని ఆ జట్టు అలవాటుగా మార్చుకుంది. నిజం... ఈసారి వర్షం దక్షిణాఫ్రికా అదృష్టాన్ని దెబ్బ తీయలేదు. ఇదంతా స్వయంకృతమే. ఫామ్‌లో ఉన్న భారత్‌పై గెలుపొందిన తర్వాత సఫారీలకు తిరుగు లేదనిపించింది. కానీ పాకిస్తాన్ చేతిలో ఓటమితో పరిస్థితి కొంత మారింది. అయితే చివరి లీగ్ మ్యాచ్ బలహీనమైన నెదర్లాండ్స్‌తో కావడంతో ఇబ్బంది అనిపించలేదు. కానీ పేలవ ఆటతో జట్టు చిత్తయింది. నెదర్లాండ్స్ స్ఫూర్తిదాయక ప్రదర్శన ముందు నిలవలేక సెమీస్ అవకాశాలను కాలదన్నుకుంది. కెప్లర్ వెసెల్స్ కాలం నుంచి క్రానే, కిర్‌స్టెన్, పొలాక్, కలిస్, డివిలియర్స్, స్టెయిన్‌లాంటి దిగ్గజాలు తలవంచినట్లుగానే మరోసారి ‘చోకర్స్’ పదానికి సార్థక నామధేయంగా తమ పేరును నిలబెట్టుకుంది బవుమా బృందం. ఆ ట్యాగ్ భారంగా ఉంది.. అయినా దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రొటిస్ జట్టుపై కొంతమంది సానుభూతి చూపిస్తుండగా.. అంచనాలు పెంచుకున్న వాళ్లు మాత్రం.. ‘‘సౌతాఫ్రికాకు, మాకూ ఇది షరా మామూలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చోకర్స్ ట్యాగ్‌పై స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఆ ట్యాగ్ మాకు ఎప్పటి నుంచో ఉంది. మేము మేజర్ టోర్నీల్లో ఫైనల్ చేరే దాకా కూడా అలాగే ఉంటుంది. అయితే, టోర్నీలో మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఈ మెగా ఈవెంట్లో ఆడటం గొప్ప అనుభవాన్నిచ్చింది. ట్రిస్టన్ స్టబ్స్.. మార్కోలకు తమ ఆటలోని లోపాలు గమనించి సరిదిద్దుకునే అవకాశం దొరికింది. ఏదేమైనా ఆ ట్యాగ్ మోయడం మాత్రం చాలా భారంగా ఉంది. దీనిని నుంచి విముక్తి లభిస్తుందో’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక తన కెప్టెన్సీ విషయంలో యాజమాన్యంతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. భావోద్వేగాలకు తావు ఇవ్వకుండా పూర్తిగా ఆలోచించిన తర్వాతే ఈ విషయం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిచ్చిందిలా.. టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరగలిగే స్థితిలో బరిలోకి దిగిన సఫారీ టీమ్ సమష్టి వైఫల్యంతో దెబ్బ తింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అకర్మన్ (26 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మైబర్గ్ (30 బంతుల్లో 37; 7 ఫోర్లు), టామ్ కూపర్ (19 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్ ఓ డౌడ్ (31 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. రిలీ రోసో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, బ్రెండన్ గ్లోవర్ (3/9) సఫారీలను పడగొట్టాడు. తొలి వికెట్‌కు 51 బంతుల్లో 58 పరుగులు జోడించి మైబర్గ్, డౌడ్ నెదర్లాండ్స్‌కు శుభారంభం అందించగా, ఆపై తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి డచ్ జోరును సఫారీ జట్టు నియంత్రించింది. అయితే చివరి 2 ఓవర్లలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు రాబట్టి నెదర్లాండ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఛేదనలో మొదటి నుంచీ దక్షిణాఫ్రికా తడబడింది. ఒకదశలో 112/4తో దక్షిణాఫ్రికా నిలవగా, మిల్లర్ క్రీజ్‌లో ఉండటంతో గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే మిల్లర్ అవుట్‌తో అంతా తలకిందులైంది. చదవండి: T20 WC 2022: నెదర్లాండ్స్ సంచలనం.. బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి మేటి జట్లతో పాటు నేరుగా Virat Kohli: కోహ్లికి మాత్రమే ఇలాంటివి సాధ్యం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022: ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: ‘‘నిరాశకు లోనయ్యాం. ఈ మ్యాచ్ కంటే ముందు మేము చాలా బాగా ఆడాము. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని తెలుసు. ఈ ఓటమిని అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. నాకౌట్ దశకు చేరుకుంటామనే నమ్మకంతో ఉన్నాం. కానీ ఇలా జరిగిపోయింది’’ అంటూ దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా విచారం వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 13 పరుగుల తేడాతో పరాజయం చెంది ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రొటిస్.. ఇలా పసికూన చేతిలో ఓడిపోవడం గమనార్హం. స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ బవుమా ఓటమిపై స్పందిస్తూ.. ‘‘ఓడిపోవడానికి కారణాలు అనేకం. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం.. ఆపై ప్రత్యర్థి జట్టును 158 పరుగుల దాకా స్కోర్ చేయనివ్వడం మా తప్పే. ఇక బ్యాటింగ్‌లోనూ పాకిస్తాన్‌తో మ్యాచ్ మాదిరే కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్ సాగే కొద్దీ వికెట్ మరింత కఠినంగా మారింది. అయితే వాళ్లు మైదానాన్ని ఉపయోగించుకున్నట్లుగా మేము వాడుకోలేకపోయాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం’’ అని పేర్కొన్నాడు. మాటల్లో వర్ణించలేం ఇక నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ సౌతాఫ్రికా వంటి మేటి జట్టుపై గెలుపొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘నెదర్లాండ్స్‌లో కూడా ఇలాంటి పిచ్ పరిస్థితులే ఉంటాయి. 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలుగుతామనే విశ్వాసంతో ఉన్నాం. అదే నిజమైంది. ప్రపంచకప్ టోర్నీలో మాకో గొప్ప అనుభవం ఇది. పెద్ద జట్టును నెదర్లాండ్స్ ఓడించగలిగింది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ! T20 WC 2022: సెమీస్‌కు టీమిండియా.. ఆశల పల్లకీలో పాకిస్తాన్, అనూహ్యంగా రేసులోకి బంగ్లా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా సౌతాఫ్రికా.. అయితే వర్షం.. లేకపోతే ఒత్తిడి..!
క్రికెట్లో దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే అర్హత ఉన్న జట్టు ఏదైనా ఉందంటే, అది సౌతాఫ్రికా జట్టేనని చెప్పాలి. నిత్యం దురదృష్టాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే ఈ జట్టును మరోసారి అదృష్టం వెక్కిరించింది. టీ20 వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ప్రొటీస్ టీమ్.. ఇవాళ (నవంబర్ 6) పసికూన నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడి సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఒక్క ఓటమితో కప్ గెలిచే స్థాయి నుంచి అమాంతం పడిపోయి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసరంగా ఒత్తిడికి లోనై ప్రత్యర్ధికి మ్యాచ్‌ను అప్పగించింది. తొలుత బౌలింగ్‌లో తడబడ్డ సఫారీలు.. ప్రత్యర్ధికి భారీ స్కోర్ చేసే అవకాశం ఇచ్చారు. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ తడబడి మ్యాచ్‌ను బంగారు పల్లెం పెట్టి ప్రత్యర్ధికి అప్పగించారు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది అనే దానికంటే, సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై ఓడిందనడం సమంజసమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒత్తిడికి లేకపోతే వరుణుడి శాపానికి బలి కావడం దక్షిణాఫ్రికాకు ఇదేమీ కొత్త కాదు. ప్రొటీస్ జట్టు కీలక టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఈ రెండు కారణాల చేత గెలిచే మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇదే ప్రపంచకప్‌లోనే జింబాబ్వేపై గెలవాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడి చావుదెబ్బ కొట్టాడు. నోటి కాడికి వచ్చిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంతో.. దాని ప్రభావం ఇప్పుడు ఆ జట్టు సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. అలా తొలుత వర్షం, ఇప్పుడు ఒత్తిడి దెబ్బకొట్టడంతో దక్షిణాఫ్రికా పెట్టా బేడా సర్దుకుని ఇంటికి పయనమైంది. సౌతాఫ్రికా విషయంలో గతంలో ఇలాంటి సందర్భాలు కోకొల్లలుగా జరిగాయి. వాటిలో 1992 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ అతి ముఖ్యమైనది. నాడు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన సౌతాఫ్రికా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అసాధ్యకరమైన రీతిలో ఒక్క బంతిలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. అలాగే 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. అలెన్ డొనాల్డ్ ఒత్తిడిలో చేసిన తప్పు కారణంగా సౌతాఫ్రికా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ 350కిపైగా టార్గెట్‌ను ఛేదించే క్రమంలో జోరుమీదున్న ఆ జట్టుకు వర్షం అడ్డుకట్ట వేసింది. అప్పటిదాకా లక్ష్యం దిశగా సాగిన సౌతాఫ్రికా.. వరుణుడి ఆటంకంతో లయ తప్పి ఓటమిపాలైంది. ఇలా.. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాను చాలా సందర్భాల్లో బ్యాడ్‌లక్ వెంటాడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమణతో ఆ జట్టుపై సోషల్‌మీడియలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. సఫారీలకు దురదృష్టం అదృష్టం పట్టినట్లు పట్టిందని కొందరు, దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా దక్షిణాఫ్రికా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. -
సౌతాఫ్రికాపై ఘన విజయం.. సెమీస్ రేసులో పాకిస్తాన్ (ఫొటోలు)
-
Pak Vs SA: పరిగెత్తడంలో బద్దకం; రెండుసార్లు తప్పించుకొని చివరకు
టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలిసారి బ్యాటింగ్‌లో కాస్త మెరిశాడు. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చాలా రోజుల క్రితమే ఫామ్ కోల్పోయిన బవుమా గురువారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు. బవుమా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బవుమా ఇబ్బందిగానే కనిపించాడు. ముఖ్యంగా పరుగులు తీయడంలో బద్దకించాడు. ఫలితంగా రెండుసార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న బవుమా మరో రెండు బౌండరీలు బాదాడు. అయితే చివరకు షాదాబ్ ఖాన్‌కు దొరికిపోయాడు. 19 బంతుల్లోనే 36 పరుగులు చేసిన బవుమా రిజ్వాన్‌కు క్యాచ్‌కు ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమాయానికి సౌతాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా 9 ఓవర్లు ముగిసేసరికి 84 పరుగులు చేయాలి. కానీ 15 పరుగులు ప్రొటిస్ వెనుకబడి ఉంది. వర్షం పాకిస్తాన్‌కు మేలు చేయనుంది. మ్యాచ్ రద్దు అయితే మాత్రం సౌతాఫ్రికా ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు. చదవండి: మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా? పాక్ తరపున రెండో బ్యాటర్‌గా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఉత్కంఠపోరులో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం (ఫోటోలు)
-
సౌతాఫ్రికాను గెలిపించిన 'కిల్లర్' మిల్లర్
టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. మిల్లర్(59 పరుగులు నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించగా.. అంతకముందు మార్క్రమ్(52 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా ఫీల్డర్ల తప్పిదం కలిసొచ్చి ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రొటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బ్యాటర్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 15, కోహ్లి 12 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎన్గిడి 4 వికెట్లు తీయగా.. పార్నెల్ 3, అన్రిచ్ నోర్ట్జే ఒక వికెట్ తీశాడు. నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ► టీమిండియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా మార్క్రమ్(52) రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. టీమిండియా ఫీల్డర్ల తప్పిదంతో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్క్రమ్ ఫిప్టీతో మెరిశాడు. మిల్లర్ 31, స్టబ్స్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్ విజయానికి 27 బంతుల్లో 34 పరుగులు అవసరం ఉంది. 9 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 35/3 ► 9 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. మార్ర్కమ్ 20, డేవిడ్ మిల్లర్ 3 పరుగులతో ఆడుతున్నారు. 25 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో సౌతాఫ్రికా ► సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(10) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బ్యాక్షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ కార్తిక్ క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రొసౌ డకౌట్.. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ► అర్ష్‌దీప్ సింగ్ సౌతాఫ్రికాను మరోసారి దెబ్బ తీశాడు. లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రొసౌ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ ► 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ డికాక్ ఔటయ్యాడు. అర్షదీప్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డికాక్ పెవిలియన్ బాట పట్టాడు. సూర్యకుమార్ ఒక్కడే.. టీమిండియా 133/9; సౌతాఫ్రికా టార్గెట్ 134 ► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రొటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బ్యాటర్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 15, కోహ్లి 12 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎన్గిడి 4 వికెట్లు తీయగా.. పార్నెల్ 3, అన్రిచ్ నోర్ట్జే ఒక వికెట్ తీశాడు. ► దినేశ్ కార్తిక్(6) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన కార్తిక్ 14 బంతులాడి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి వేన్ పార్నెల్ బౌలింగ్‌లో రొసౌకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అర్థశతకంతో చెలరేగిన సూర్య.. ► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సూర్యకుమార్ కీలక సమయంలో అర్థసెంచరీతో మెరిశాడు. టీమిండియా బ్యాటర్లంతా విఫలమైన వేళ తాను ఒంటరిపోరాటం చేసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో సూర్యకు ఇది రెండోహాఫ్ సెంచరీ. ఇక టీమిండియా ప్రస్తుతం 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్.. 13 ఓవర్లలో 84/5 ► టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి దినేశ్ కార్తిక్ నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ప్రస్తుతం టీమిండియా 13 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. సూర్యకుమార్ 37, కార్తిక్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లలో టీమిండియా 67/5 ► 11 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 67 పరగులు చేసింది. సూర్యకుమార్ 23, దినేశ్ కార్తిక్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 49 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా ► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. 2 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా ఎన్గిడి బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో రబాడ స్టన్నింగ్ క్యాచ్ తీసుకోవడంతో పెవిలియన్ చేరాడు. ► టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. ఎన్గిడి బౌలింగ్‌లో విరాట్ కోహ్లి థర్డ్‌మన్ దిశగా సిక్సర్ బాదే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న రబాడ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా మూడో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. తీరు మారని రాహుల్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ► టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఫేలవ్ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎన్గిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్ మీద వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్నాడు. ఫలితంగా మార్క్రమ్ క్యాచ్ తీసుకోవడంతో రాహుల్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(15) ఔట్.. తొలి వికెట్ డౌన్ ► రోహిత్ శర్మ(15) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఎన్గిడి బౌలింగ్‌లో రోహిత్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 23 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. 3 ఓవరల్లో టీమిండియా 14/0 ► 3 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. వేన్ పార్నెల్ వేసిన తొలి ఓవర్లో కేఎల్ రాహుల్ చాలా ఇబ్బందిగా కనిపించాడు. ఆ ఓవర్ మెయిడెన్‌గా ముగిసింది. ఇక రబాడ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతిని రోహిత్ భారీ సిక్సర్ బాదాడు. ఇక మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సర్ కొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ► టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మూడో ‘సూపర్ 12’ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఆసక్తికరంగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోవడంతోపాటు గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చాడు. అటు సౌతాఫ్రికా కూడా తబ్రెయిజ్ షంసీ స్థానంలో ఎన్గిడిని తుది జట్టులోకి తీసుకుంది. భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే కేఎల్ రాహుల్ మినహా ప్రతీ ఆటగాడు తమదైన రీతిలో గత రెండు విజయాల్లో తగిన పాత్ర పోషించారు. దాంతో రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా పంత్ ఆడవచ్చని వినిపించింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేశాడు. ఈ మ్యాచ్‌లో అసలు సవాల్ భారత టాపార్డర్‌కు ఎదురు కానుంది. 140–150 కిలోమీటర్ల వేగంతో పాటు బంతిని స్వింగ్ చేస్తున్న రబడ, నోర్జేలను సమర్థంగా ఎదుర్కోవడంపైనే టీమిండియా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయంటే తప్పు లేదు. బౌన్సీ పిచ్‌పై ఆరంభంలోనే కోహ్లి, రోహిత్, సూర్యకుమార్ ఎదురు దాడి చేస్తారా లేక సగం ఇన్నింగ్స్ వరకు జాగ్రత్తగా నిలబడి ఆపై దూకుడు ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికా ప్రధాన బ్యాటర్లంతా దూకుడుగా ఆడగల సమర్థులే. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన రెండో ఆటగాడైన రిలీ రోసో సమరోత్సాహంతో ఉన్నాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి టి20లోనే అతను శతకం బాదాడు. డికాక్, మిల్లర్ రూపంలో ఇద్దరు మెరుపు బ్యాటర్లు ఉండగా, మార్క్రమ్ మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముక. యువ ఆటగాడు స్టబ్స్ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. -
మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు!
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh- Sidney: టీ20 ఫార్మాట్లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం కొనసాగుతోంది. ప్రపంచకప్-2022లో భాగంగా సిడ్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కాగా గత కొంతకాలంగా పొట్టి క్రికెట్లో బవుమా పూర్తిగా తేలిపోతున్న సంగతి తెలిసిందే. దారుణ ప్రదర్శన గత ఏడు ఇన్నింగ్స్‌లో టీ20 ఫార్మాట్లో బవుమా చేసిన పరుగులు వరుసగా... 8, 8*, 0, 0, 3, 2*, 2. అంతేకాదు మొత్తంగా ఇప్పటి వరకు 31 అంతర్జాతీయ టీ20లు ఆడిన బవుమా సాధించిన పరుగులు 571. అత్యధిక స్కోరు 72. హాఫ్ సెంచరీ ఒకటి. ఇక వన్డేల్లోనూ 20 మ్యాచ్‌లలో అతడు సాధించిన పరుగులు 730. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో బవుమా అత్యధిక స్కోరు 113. టెస్టుల విషయానికొస్తే 51 మ్యాచ్‌లలో 2612 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నువ్వు కెప్టెన్ కదా! కాగా బంగ్లాతో మ్యాచ్‌లో బవుమా మరోసారి నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘బవుమా అద్భుత ఫామ్ కొనసాగుతోంది. సూపర్‌గా ఆడుతున్నాడు. 31 అంతర్జాతీయ టీ20లలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లు.. సారథిగా భేష్.. అయినా పాపం ఇంత ఘోరంగా ఆడే ఓ క్రికెటర్ ఈ భూమ్మీద కెప్టెన్‌గా ఉండగలడా?’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, బ్యాటర్‌గా విఫలమవుతున్నా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు 20 మ్యాచ్‌లకు టీ20లకు సారథిగా వ్యవహరించిన బవుమా.. 13 గెలిచాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అతడి అభిమానులు ట్రోల్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బంగ్లాతో మ్యాచ్‌లో రిలీ రోసో, క్వింటన్ డికాక్ రాణించడంతో సహా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనరచడంతో బవుమా బృందం 104 పరుగుల భారీ తేడాతో గెలిచింది. కాగా గతేడాది కెప్టెన్సీ చేపట్టిన బవుమా.. ఈ ఘనత సాధించిన తొలి బ్లాక్ ఆఫ్రికన్‌గా చరిత్రకెక్కాడు. చదవండి: Rilee Rossouw: అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించిన రోసో.. అరుదైన ఘనతలు టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ హీరోలు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు The curious case of Temba Bavuma.. 51 Tests - 1 Hundred... 30 T20Is - 1 Fifty, 115 SR.. How on the earth he is in Team, even T20I Captain 🤷🏻♂️ #tembabavuma #SAvsBAN #BANvSA #ICCT20WorldCup #ICCT20WorldCup2022 pic.twitter.com/UmhNosRXVG — Anil R Pradhan (@anilrpradhan) October 27, 2022 Temba Bavuma in the last 7 innings in T20I: 8(10), 8*(11), 0(4), 0(7), 3(8), 2*(2) & 2(6). — Johns. (@CricCrazyJohns) October 27, 2022 Excellent Form for Temba Bavuma Continues. Dismissed for 2 runs on 6 balls. I will Delete my Twitter if he ever scores a 35 or less balls Half Century against any team in T20s. — Afsha (@AfshaCricket) October 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
దక్షిణాఫ్రికా వర్సెస్ జింబాబ్వే.. తుది జట్టులో ఎవరెవరంటే!
టీ20 ప్రపంచకప్ సూపర్-12 (గ్రూప్-2)లో భాగంగా హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జింబాబ్వే తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నలుగురు పేస్ బౌలర్లు, ఏకైక స్విన్నర్తో బరిలోకి దిగింది. అదే విధంగా జింబాబ్వే కూడా నలుగురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడనుంది. తుది జట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి జింబాబ్వే: రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ షుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, టెండై చతారా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ చదవండి: T20 WC 2022: 'ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే' -
శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్) శతకంలో, ఇషాన్ కిషన్ (93) భారీ అర్ధశతకంతో చెలరేగడంతో 45.5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. శతక్కొట్టిన అయ్యర్ 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. సహచరుడు ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ శ్రేయస్ మాత్రం ఆ తప్పు చేయకుండా నిలకడగా ఆడి కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. అయ్యర్ 103 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 43 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 263/3. అయ్యర్‌కు జతగా శాంసన్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీ చేజార్చుకున్న ఇషాన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు. హాఫ్ సెంచరీ చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్.. ఫోర్టున్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇషాన్ తన ఇన్నింగ్స్‌లో 84 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 210/3. క్రీజ్‌లో శ్రేయస్ (71)కు జతగా సంజూ శాంసన్ వచ్చాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఇషాన్, శ్రేయస్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయాక టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 50; 7 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 144/2. 100 దాటిన టీమిండియా స్కోర్ 48 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ 100 పరుగుల మార్కును దాటింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఇషాన్ కిషన్ 100 పరుగుల స్కోర్‌ను దాటించాడు. అదే ఓవర్లో ఇషాన్ మరో సిక్సర్ కూడా బాది గేర్ మార్చాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/2. క్రీజ్‌లో ఇషాన్ (42), శ్రేయస్ అయ్యర్ (26) ఉన్నారు. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔట్ భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే తడబడుతుంది. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. ధవన్ 13 పరుగులు చేసి ఔట్ కాగా.. 9వ ఓవర్లో రబాడ బౌలింగ్‌లో గిల్ (28) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/2 కాగా.. క్రీజ్‌లో ఇషాన్ (5), శ్రేయస్ (1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధవన్ (13)ను వేన్ పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో గిల్ (13), ఇషాన్ కిషన్ ఉన్నారు. రాణించిన మార్క్రమ్, హెండ్రిక్స్.. టీమిండియా టార్గెట్ 279 టీమిండియా బౌలర్లు ఇన్నింగ్స్‌లో మధ్యలో వరుస వికెట్లు తీసి ప్రెషర్ పెట్టడంతో భారీ స్కోర్ దిశగా సాగిన దక్షిణాఫ్రికా 278 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమతమైంది. రీజా హెండ్రిక్స్ (74), ఎయిడెన్ మార్క్రమ్ (79) అర్ధసెంచరీలతో రాణించగా.. క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 300 స్కోర్ చేరుకోలేకపోయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ (3/38) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సుందర్, షాబాజ్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 256 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన పార్నెల్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా వరుస క్రమంలో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. 79 పరుగులు చేసిన మార్క్రమ్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 40 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 221/5 నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 215 పరుగుల వద్ద ప్రోటీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన క్లాసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 36 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 197/3 36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(76), క్లాసన్(15) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాప్రికా 169 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన హెండ్రిక్స్.. సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 122/2 25 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లు హెండ్రిక్స్(49), మార్క్రమ్(41) పరుగులతో ఉన్నారు. 18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 77/2 18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(18), హెండ్రిక్స్(29) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 40 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మలాన్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో షబాజ్కు ఇది తొలి వికెట్. 6 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 24/1 6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో మలాన్(13), హెండ్రిక్స్(3) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 7 పరుగుల వద్ద దక్షిణాప్రికా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డికాక్.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హెండ్రిక్స్ వచ్చాడు. రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుత్‌రాజ్ గైక్వాడ్, బిష్ణోయ్ స్థానంలో సుందర్, షాబాజ్ ఆహ్మద్ జట్టులోకి వచ్చారు. మరో వైపు ఈ మ్యాచ్‌కు ప్రోటీస్ రెగ్యూలర్ కెప్టెన్ టెంబా బావుమా, స్పిన్నర్ షమ్సీ దూరమయ్యారు. వారి స్థానంలో హెండ్రిక్స్, బెజార్న్ ఫోర్టుయిన్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్(కెప్టెన్), జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ -
మిల్లర్ సెంచరీ వృధా.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో 16 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే.. 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇక 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అద్భుతమైన సెంచరీ సాధించినప్పటికి.. జట్టును గెలిపించలేక పోయాడు. ప్రోటీస్ బ్యాటర్లలో మిల్లర్(47 బంతుల్లో 106), డికాక్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(28 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 61) అర్ధసెంచరీలతో చెలరేగారు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(43), విరాట్ కోహ్లి(49), కార్తీక్( 7 బంతుల్లో 17) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్కే రెండు వికెట్లు దక్కాయి 18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 175/3 18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(49), మిల్లర్(51) పరుగులతో ఉన్నారు. 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 143/3 15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(49), మిల్లర్(51) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 70/3 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(21), మిల్లర్(10) పరుగులతో ఉన్నారు. 6 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 45/2 6 ఓవర్లు ముగిసే సరికి ప్రోటీస్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో మారక్రమ్(31), డికాక్(9) పరుగులతో ఉన్నారు. రెండు వికెట్లు కోల్పోయిన ప్రోటీస్ 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రోటీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఆర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో టెంబా బావుమా, రుసో డకౌట్‌గా వెనుదిరిగారు. భారత బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికా టార్గెట్ 238 పరుగులు దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(28 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 61) అర్ధసెంచరీలతో చెలరేగారు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(43), విరాట్ కోహ్లి(49), కార్తీక్( 7 బంతుల్లో 17) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్కే రెండు వికెట్లు దక్కాయి మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 209 పరుగులు వద్ద టీమిండియా మూడు వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్ 209/2 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 194/2 సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్: 194/2 15 ఓవర్లకు భారత్ స్కోర్: 155/2 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(35), విరాట్ కోహ్లి(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 107 పరుగులు వద్ద కేఎల్ రాహుల్ (57) వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యాడు. 13 ఓవర్లకు భారత్ స్కోర్: 125/2. క్రీజులో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 96 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. దూకుడుగా ఆడుతున్న టీమిండియా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(21), కేఎల్ రాహుల్(25) పరుగులతో ఉన్నారు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్: 49/0 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(21), కేఎల్ రాహుల్(25) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 15/0 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(4), కేఎల్ రాహుల్(9) పరుగులతో ఉన్నారు. గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టు ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా మాత్రం జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు: దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్గిడి టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ -
చాహర్ అద్భుతమైన ఇన్ స్వింగర్.. ప్రోటీస్ కెప్టెన్‌కు ప్యూజ్‌లు ఔట్
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఘనమైన పునరాగమనం చేశాడు. తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమాను చాహర్ ఔట్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. చాహర్ ఓ సంచలన బంతితో టెంబా బావుమాను పెవిలియన్‌కు పంపాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన చాహర్.. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో బావుమాను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బావుమా కూడా ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా ఆక్టోబర్2న జరగనుంది. Wat a delivery #INDvSA Take a bow @deepak_chahar9 👏🔥 pic.twitter.com/x6h5wTWJXR — Trending Killer (@Trending_007) September 28, 2022 చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
కేఎల్ రాహుల్, సూర్య అర్థ శతకాలు.. తొలి టి20లో భారత్ ఘన విజయం
కేఎల్ రాహుల్, సూర్య అర్థ శతకాలు.. తొలి టి20లో టీమిండియా ఘన విజయం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా శుభారంభం చేసింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులతో రాణించారు. అంతకముందు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో వేన్ పార్నెల్(19), మార్క్రమ్(25) పరుగులు చేసి ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 41 పరుగులు) చేయడంతో సౌతాఫ్రికా స్కోరు వంద దాటింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, దీపక్ చహర్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. రోహిత్ శర్మ ఔట్.. తొలి వికెట్ డౌన్ ►107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ రబడా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 6, కోహ్లి 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా 106/8.. టీమిండియా టార్గెట్ 107 ►టీమిండియాతో తొలి టి20లో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో వేన్ పార్నెల్(19), మార్క్రమ్(25) పరుగులు చేసి ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 41 పరుగులు) చేయడంతో సౌతాఫ్రికా స్కోరు వంద దాటింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, దీపక్ చహర్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరెంతంటే? ►15 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. వేన్ పార్నెల్ 20, కేశవ్ మహరాజ్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు దీపక్ చహర్, అర్ష్‌దీప్‌లు విజృంభించడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ►మార్ర్కమ్ రూపంలో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. పార్నెల్ 13, మహరాజ్ 4 పరుగులతో ఆడుతున్నారు. 5 wickets summed up in 11 seconds. Watch it here 👇👇 Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia pic.twitter.com/jYeogZoqfD — BCCI (@BCCI) September 28, 2022 9 పరుగులకే ఐదు వికెట్లు డౌన్.. ►సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. దీపక్ చహర్, అర్ష్‌దీప్ బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తాజాగా ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయగా... ఆ తర్వాత దీపక్ చహర్ మరో వికెట్ తీశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు షాక్.. ఒక్క పరుగుకే రెండు వికెట్లు డౌన్ ►టీమిండియాతో తొలి టి20లో సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో దీపక్ చహర్ బవుమాను డకౌట్ చేయగా.. రెండో ఓవర్లో అర్ష్‌దీప్ క్వింటన్ డికాక్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ►స్వదేశంలో మరో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీ ఆరంభానికి ముందు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతోంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి టి20లో టీమిండియా టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది. ఇక తొలి టి20 బుమ్రా, చహల్‌కు రెస్ట్ ఇవ్వగా.. వారి స్థానంలో దీపక్ చహర్, అర్ష్‌దీప్‌లు తుది జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికాతో ఇప్పటివరకు భారత్ 20 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో దక్షిణా ఫ్రికా గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ 2006లో డిసెంబర్ 1న జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ఒక్కడే తాజా సిరీస్ లోనూ ఆడుతున్నాడు. భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ 🚨 Team News 🚨 A look at #TeamIndia's Playing XI for the first #INDvSA T20I 🔽 Follow the match ▶️ https://t.co/L93S9jMHcv pic.twitter.com/Uay6kuQJbE — BCCI (@BCCI) September 28, 2022 -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్: సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! ఈసారైనా..
South Africa tour of India, 2022- India vs South Africa, 1st T20I: స్వదేశంలో మరో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీ ఆరంభానికి ముందు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో పోటీకి సై అంటోంది. వరల్డ్‌కప్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన రీతిలోనే ప్రొటిస్‌ను మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై కూడా సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవలేకపోతోందన్న అపవాదును చెరిపేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం జరుగనున్న మొదటి టీ20లో శుభారంభం చేసేందుకు సన్నద్ధమవుతోంది రోహిత్ సేన. ఇక బవుమా బృందం సైతం గత రికార్డును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పిచ్, వాతావరణం, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్షప్రసారం, పొట్టి ఫార్మాట్లో భారత్- దక్షిణాఫ్రికా ముఖాముఖి రికార్డులు పరిశీలిద్దాం. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టీ20(సెప్టెంబరు 28) వేదిక: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం- తిరువనంతపురం- కేరళ మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి ఏడు గంటలకు ఆరంభం ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ పిచ్, వాతావరణం ఈ గ్రీన్‌ఫీల్డ్ మైదానం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ రెండు టి20 మ్యాచ్‌లు జరిగాయి. 2017లో న్యూజిలాండ్‌తో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. 2019లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్లతో ఓడింది. బుధవారం వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశముంది. సొంతగడ్డపై ఒక్కసారి కూడా! స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లు ఆడినా భారత్ ఒక్క సిరీస్‌నూ గెలవలేకపోయింది. 2015లో దక్షిణాఫ్రికా 2–0తో సిరీస్‌ను దక్కించుకోగా... 2019లో, 2022లో సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ముఖాముఖి రికార్డులు.. డీకే ఒక్కడే! దక్షిణాఫ్రికాతో ఇప్పటివరకు భారత్ 20 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌ల్లో భారత్, 8 మ్యాచ్‌ల్లో దక్షిణా ఫ్రికా గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ 2006లో డిసెంబర్ 1న జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ఒక్కడే తాజా సిరీస్ లోనూ ఆడుతున్నాడు. చదవండి: T20 World Cup 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు.. Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై Hello Thiruvananthapuram 👋 Time for the #INDvSA T20I series. 👍#TeamIndia | @mastercardindia pic.twitter.com/qU5hGSR3Io — BCCI (@BCCI) September 27, 2022 -
టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై అడుగు పెట్టింది. భారత పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. బుధవారం( సెప్టెంబర్ 28) తిరువనంతపురం వేదికగా తొలి టీ20తో దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆదివారం తిరువనంతపురంకు చేరుకున్న ప్రోటీస్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సౌతాఫ్రికా క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. ఇక తిరువనంతపురంకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు సోమవారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. సోమవారం తిరువనంతపురంకు చేరుకునే అవకాశం ఉంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగానే ఈ సిరీస్‌ను ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ప్లాన్ చేశాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. Touchdown India 🇮🇳#INDvSA #BePartOfIt pic.twitter.com/17duazX1CP — Proteas Men (@ProteasMenCSA) September 25, 2022 చదవండి: Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు -
Ind Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు
South Africa tour of India, 2022- September- T20, ODI Series: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం(సెప్టెంబరు 28) నుంచి ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం ప్రొటిస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇక ఈ ఏడాది భారత్- సౌతాఫ్రికా మధ్య ఇది మూడో సిరీస్. జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లగా.. జూన్‌లో ప్రొటిస్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సిరీస్(వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దు)ను సమం చేసింది. ఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్, వేదికలు, జట్ల వివరాలు, లైవ్ స్ట్రీమింగ్ తదితర అంశాలు పరిశీలిద్దాం. భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా పూర్తి షెడ్యూల్ టీ20 సిరీస్ ►మొదటి టీ20: సెప్టెంబరు 28- బుధవారం- గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం- తిరువనంతపురం- కేరళ ►రెండో టీ20: అక్టోబరు 2- ఆదివారం- బర్సపర క్రికెట్ స్టేడియం- గువాహటి- అసోం ►మూడో టీ20: అక్టోబరు 4- మంగళవారం-హోల్కర్ క్రికెట్ స్టేడియం- ఇండోర్- మధ్యప్రదేశ్ మ్యాచ్ ఆరంభం సమయం: అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభం వన్డే సిరీస్ ►తొలి వన్డే: అక్టోబరు 6- గురువారం- భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం- లక్నో- ఉత్తరప్రదేశ్ ►రెండో వన్డే: అక్టోబరు 9- ఆదివారం- జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్- రాంచి- జార్ఖండ్ ►మూడో వన్డే: అక్టోబరు 11- మంగళవారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ మ్యాచ్ సమయం: అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. వన్డే సిరీస్‌కు ఇంకా జట్టు(వార్తా కథనం రాసే సమయానికి)ను ప్రకటించలేదు. అయితే, టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న కారణంగా ప్రపంచకప్ ఈవెంట్‌కు సెలక్ట్ అయిన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నారు. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెన్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెన్నిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. చదవండి: Ind Vs Aus: జడ్డూ లేకుంటే టీమిండియా బలహీనపడుతుందనుకుంటే.. అతడేమో ఇలా: ఆసీస్ కోచ్ -
దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్
CSA T20 League- సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ప్రొటిస్ యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ చరిత్ర సృష్టించాడు. కేప్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు (9.2 మిలియన్ సౌతాఫ్రికన్ ర్యాండ్స్) చేసి 22 ఏళ్ల ఈ వపర్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ వేలంలో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమాకు చేదు అనుభవం ఎదురైంది. అతడి పేరు రెండుసార్లు వేలంలోకి వచ్చినా ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. కనీస ధర( 850,000 సౌతాఫ్రికన్ ర్యాండ్స్)కు కూడా కొనుగోలు చేయలేదు. బవుమాకు ఘోర అవమానం! ఈ విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, డర్బన్ సూపర్‌జెయింట్స్ కోచ్ లాన్స్ క్లూస్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి టీ20 లీగ్‌లలో ఆడాలంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ ట్యాగ్ సరిపోదని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు ఉంటేనే ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ఐఓఎల్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి లీగ్‌లలో ఆడాలంటే తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశం తరఫున కీలక ఆటగాడు అయినంత మాత్రాన సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. అప్పుడే ఫ్రాంఛైజీలు సదరు ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని క్లూస్నర్ చెప్పుకొచ్చాడు. మరేం పర్లేదు! ఇక మరో మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాంఛైజీ ఓనర్లు ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయో మనకు తెలియదు కదా! అయినా.. ఇప్పుడే అంతా ముగిసిపోలేదు. టోర్నీ ఆరంభమయ్యే లోపు కొంతమంది గాయాల బారిన పడొచ్చు. లేదంటే మరో రూపంలో కూడా అవకాశం రావచ్చు’’ అంటూ బవుమాలా చేదు అనుభవం ఎదుర్కొన్న వారు నిరాశలో కూరుకుపోకూడదని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన బవుమా 120.6 స్ట్రైక్‌రేటుతో 562 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్ -
T20 WC 2022: జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. గాయంతో స్టార్ బ్యాటర్ దూరం
అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టును టెంబా బవుమా నడిపించనుండగా.. గాయంతో స్టార్ ఆటగాడు వాండర్ డుసెన్ దూరమయ్యాడు. డుసెన్ దూరమయినప్పటికి పించ్ హిట్టర్ ట్రిస్టన్ స్టబర్న్ జట్టులోకి రాగా.. క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రూపంలో నాణ్యమైన బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కగిసో రబడా,అన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి, కేశవ్ మహరాజ్, తబ్రెయిజ్ షంసీ ఉండగా.. వీరితో పాటు డ్వేన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, రిలీ రోసౌలు కూడా ఎంపికయ్యారు. ఇక రిజర్వ్ ప్లేయర్స్‌గా మార్కో జాన్సెన్, జోర్న్ ఫోర్టున్, పెక్యుల్వాయోలు ఉన్నారను. కాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తర్వాత టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన మూడో జట్టుగా ప్రొటిస్ నిలిచింది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఇక సూపర్ 12కు క్వాలిఫై అయిన ఎనిమిది జట్లలో సౌతాఫ్రికా కూడా ఉంది. ఇక గ్రూఫ్-2లో ఉన్న సౌతాఫ్రికా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో లీగ్ దశలో మ్యాచ్‌లు ఆడనుంది. టి20 ప్రపంచకప్‌కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఎ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడా, లుంగి ఎన్గిడి, రిలీ రోసౌ, డి ప్రిటోరియస్, డబ్ల్యు పార్నెల్, తబ్రెయిజ్ షమ్సీ, కేశవ్ మహారాజ్ రిజర్వ్: బ్జోర్న్ ఫార్టుయిన్, మార్కో జాన్సెన్ మరియు ఆండిలే ఫెహ్లుక్వాయో PROTEAS WORLD CUP SQUAD 🇿🇦 1⃣5⃣ players 🧢 World Cup debut for Tristan Stubbs 🤕 Rassie van der Dussen misses out due to injury#BePartOfIt #T20WorldCup pic.twitter.com/0Pzxm4uDQJ — Cricket South Africa (@OfficialCSA) September 6, 2022 -
IND VS SA 5th T20: సిరీస్ డిసైడర్.. కెప్టెన్ ఔట్..!
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20కి ముందు దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. నాలుగో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో గాయపడ్డ ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా ఇంకా కోలుకోలేదని సమాచారం. సిరీస్ డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ అందుబాటులో ఉండకపోతే ఆ జట్టు జయాపజాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. మ్యాచ్ సమయానికి బవుమా అందుబాటులో ఉండకపోతే కేశవ్ మహారాజ్ లేదా క్వింటన్ డికాక్‌లలో ఒకరు ప్రోటీస్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇక నేటి మ్యాచ్ తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు నాలుగో టీ20లో బరిలోకి దిగిన జట్లనే యధాతథంగా కొనసాగించవచ్చు. మ్యాచ్ సమయానికి బవుమా ఫిట్‌గా లేకపోతే అతని స్థానంలో రీజా హెండ్రిక్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. నాలుగో టీ20 ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగడం ఖాయంగా తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో టీమిండియా ప్రయోగాలు చేసే సాహసం చేయకపోవచ్చు. కాగా, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనుకపడి ఆ తర్వాత ఆనూహ్యంగా పుంజుకుని 2-2తో సిరీస్‌ను సమం చేసిన విషయం తెలిసిందే. తుది జట్లు (అంచనా).. భారత్: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్/టెంబా బావుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, తబ్రేజ్ షంషి. చదవండి: టి20 చరిత్రలో ప్రొటీస్‌పై టీమిండియాకు అతి పెద్ద విజయం -
IND vs SA: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సమం
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సమం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్ రెండు, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. అంతుకుమందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్ధిక్ పాండ్యా(46) పరుగులతో రాణించాడు. కాగా కెప్టెన్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మరో సారి నిరాశపరిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడీ రెండు వికెట్లు,జాన్సెన్, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, నోర్ట్జే తలా వికెట్ పడగొట్టారు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా నాలుగో టీ20లో విజయం దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఆవేష్ ఖాన్ వేసిన 14 ఓవర్లలో దక్షిణాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. వాన్ డెర్ డస్సెన్(20), జాన్సెన్(12),మహారాజ్ పెవిలియన్‌కు చేరారు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మిల్లర్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 70/4 మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన క్లాసన్.. చాహల్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులో డుస్సెన్(14), మిల్లర్(7) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 53/23 రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 26 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో ప్రిటోరియస్ డకౌటయ్యాడు. 6 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 35/2 తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 24 పరుగులు వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన డికాక్ రనౌట్ రూపంలో ఔటయ్యాడు. 4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 22/0 నాలుగు ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 22 పరుగుగులు చేసింది. అయితే కెప్టెన్ బావుమా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో డికాక్(13) , ప్రిటోరియస్ ఉన్నారు. చెలరేగిన కార్తీక్, హార్ధిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికా టార్గెట్ 170 పరుగులు దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్(55) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్ధిక్ పాండ్యా(46) పరుగులతో రాణించాడు. కాగా కెప్టెన్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మరో సారి నిరాశపరిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడీ రెండు వికెట్లు,జాన్సెన్, కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, నోర్ట్జే తలా వికెట్ పడగొట్టారు 18 ఓవర్లకు భారత్ స్కోర్: 140/4 కార్తీక్(43),హార్ధిక్ పాండ్యా(40) పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 140/4 15 ఓవర్లకు భారత్ స్కోర్: 96/4 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో హార్ధిక్ పాండ్యా(23),కార్తీక్(6) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 81 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పంత్..కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు భారత్ స్కోర్: 78/3 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. క్రీజులో పంత్(16),హార్ధిక్ పాండ్యా(23) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఇషాన్ కిషన్(27) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కిషన్ ఔటయ్యాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 40/2 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(27) పంత్(1) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ 24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లకు భారత్ స్కోర్: 24/2 తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గైక్వాడ్.. ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20లో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. టీమిండియా ఎటువంటి మార్పులు చేయలేదు. తుదిజట్లు భారత్ : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే -
Ind Vs SA: అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే: పంత్
India Vs South Africa 2nd T20- Rishabh Pant Comments : టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రెండో అర్ధ భాగంలో ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేస్తే బాగుండేదన్నాడు. తదుపరి మ్యాచ్‌లోనైనా తప్పులు దిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలోని భారత యువ జట్టుపై వరుస విజయాలు సాధిస్తోంది. ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన తెంబా బవుమా బృందం.. కటక్‌లో ఆదివారం(జూన్ 12) జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించింది. సఫారీ బౌలర్లు విజృంభించడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన భారత్.. ప్రొటిస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడంతో పరాజయం పాలైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 2-0తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘మేము మరో 10-15 పరుగులు చేయాల్సింది. ఇక మొదటి 7-8 ఓవర్లలో భువీ, ఇతర ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, ఆ తర్వాత మేము రాణించలేకపోయాం. సెకండాఫ్‌లో వికెట్లు తీయాల్సిన ఆవశ్యకత ఉన్న తరుణంలో తేలిపోయాం. క్లాసెన్, బవుమా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో! ఇక ఇప్పుడు మేము మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా రెండో టీ20: టాస్: దక్షిణాఫ్రికా- తొలుత బౌలింగ్ భారత్ స్కోరు: 148/6 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 149/6 (18.2) విజేత: 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెన్రిచ్ క్లాసెన్(46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు) ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ చేసిన స్కోరు: 7 బంతుల్లో 5 పరుగులు భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్: శ్రేయస్ అయ్యర్(35 బంతుల్లో 40 పరుగులు) చదవండి: Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు Shreyas Iyer is the Top Performer from the first innings for his knock of 40 off 35 deliveries. A look at his batting summary here 👇👇@Paytm #INDvSA pic.twitter.com/tVHVLiKIlF — BCCI (@BCCI) June 12, 2022 A look at the Playing XI for the 2nd T20I. Live - https://t.co/fLWTMjhyKo #INDvSA @Paytm https://t.co/CHnUIyzxlS pic.twitter.com/WGoEuX8X2m — BCCI (@BCCI) June 12, 2022 -
టీమిండియాకు రెండో టి20లోనూ పరాజయం (ఫోటోలు)
-
క్లాసెన్ విధ్వంసం.. టీమిండియాకు రెండో టి20లోనూ పరాజయం
టీమిండియాకు వరుసగా రెండో పరాజయం ►టీమిండియాతో జరిగిన రెండో టి20లో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81 పరుగులు, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఆరంభం నుంచి ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆఖర్లో దినేశ్ కార్తిక్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు బాదడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అంతకముందు శ్రేయాస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. రబాడ, పార్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికట్ తీశారు. బవుమా(35) ఔట్.. నాలుగో వికెట్ డౌన్ ►సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా(35) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న బవుమాను చహల్ తెలివైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 11 ఓవర్లలో సౌతాఫ్రికా 70/3 ►11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా 31, క్లాసెన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. డేంజరస్ డుసెన్ ఔట్.. సాతాఫ్రికా 30/3 ►టీమిండియాతో రెండో టి20లో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. గత మ్యాచ్ హీరో డేంజరస్ డుసెన్ ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రిటోరియస్(4) ఔట్.. రెండో వికెట్ డౌన్ ►డ్వేన్ ప్రిటోరియస్(4) రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ప్రిటోరియస్ ఆవేశ్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెండ్రిక్స్ భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం వికెట్ నష్టానికి 5 పరుగులు చేసింది. విఫలమైన టీమిండియా బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ 149 ►సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఆరంభం నుంచి ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆఖర్లో దినేశ్ కార్తిక్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు బాదడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అంతకముందు శ్రేయాస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. రబాడ, పార్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. 17 ఓవర్లు.. ఆరో వికెట్ డౌన్ ► 17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. పది పరుగులు చేసిన అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం స్కోర్ 17 ఓవర్లకు 112/6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 15 ఓవర్లకు.. ►15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 103/5. దినేష్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా ► శ్రేయస్ అయ్యర్ కీపర్ క్యాచ్. 35 బంతుల్లో 40 పరుగులు చేసి కీపర్ క్యాచ్ ద్వారా అవుట్. టీమిండియా స్కోర్ 13.5 ఓవర్లకు 98/5. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా ►12.4 వద్ద హార్దిక్ పాండ్యా అవుట్. టీమిండియా బ్యాట్స్‌మన్ హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 9 పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్. 11 ఓవర్లకు.. ► టీమిండియా 11 ఓవర్లకు 78 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. రిషబ్ పంత్(5) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ►టీమిండియా స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 5 పరుగులు మాత్రమే చేసిన పంత్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో డుసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34) ఔట్.. రెండో వికెట్ డౌన్ ►దాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్(21 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) నోర్ట్జే బౌలింగ్‌లో డుసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. 6 ఓవర్లలో టీమిండియా 42/1 ►6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులతో ఆడుతున్నారు. రుతురాజ్(1) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ►సౌతాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. రబాడ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్(1) కేశవ్ మహరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ఆదివారం కటక్ వేదికగా రెండో టీ20లో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. తొలి టి20లో బౌలింగ్ ఫెయిల్యూర్‌తో ఓటమి చవిచూసినప్పటికి టీమిండియా జట్టు ఎలాంటి మార్పులేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం రెండు మార్పులతో ఆడుతుంది. డికాక్, స్టబ్స్ స్థానంలో క్లాసెన్, హెండ్రిక్స్ తుది జట్టులోకి వచ్చారు. భారత్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా తుదిజట్టు: టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే South Africa have won the toss and will bowl first against #TeamIndia in the 2nd T20I.@Paytm #INDvSA pic.twitter.com/tXHUu1MyXJ — BCCI (@BCCI) June 12, 2022 -
దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. రెండో మ్యాచ్‌కు కూడా..!
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కరోనా బారిన పడ్డాడు. గురువారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో మార్క్రమ్ కు పాజిటివ్‌గా నిర్థరాణైంది. దీంతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు మార్క్రమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టియన్ స్టబ్స్ ప్రోటిస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా తొలి టీ20 టాస్ సమయంలో ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వెల్లడించాడు. "మార్క్రామ్ తొలి టీ20కు అందుబాటులో లేడు. అతడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అతడు స్థానంలో స్టబ్స్ డెబ్యూ చేయనున్నాడు" అని బావుమా పేర్కొన్నాడు. ఇక కోవిడ్ బారిన పడిన మార్క్రామ్ ఐదు రోజుల పాటే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కటక్ వేదికగా జరగనున్న రెండో టీ20కు కూడా మార్క్రమ్ దూరమమ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా జరగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మొదటి టీ20: టాస్- దక్షిణాఫ్రికా- బౌలింగ్ భారత్ స్కోరు: 211/4 (20) దక్షిణాఫ్రికా స్కోరు: 212/3 (19.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64 పరుగులు) ఈ మ్యాచ్‌లో డసెన్ స్కోరు: 46 బంతుల్లో 75 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్ చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి' -
మిల్లర్, డుసెన్ మెరుపులు.. తొలి టి20లో దక్షిణాఫ్రికా ఘన విజయం
మిల్లర్, డుసెన్ మెరుపులు.. దక్షిణాఫ్రికా ఘన విజయం ►టీమిండియాతో జరిగిన తొలి టి20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేవిడ్ మిల్లర్ 64*, వాండర్ డుసెన్ 75* పరుగులు చేసి జట్టును గెలిపించారు. అంతకముందు ప్రిటోరియస్ 29, డికాక్ 22 పరుగులు చేశారు. కాగా ఈ ఓటమితో టీమిండియా 12 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ పడింది. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. మిల్లర్ దూకుడు.. లక్ష్యం దిశగా సౌతాఫ్రికా ►212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా చేధనలో దూకుడు కనబరుస్తుంది. ముఖ్యంగా ఇన్ఫామ్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. అతనికి వాండర్ డుసెన్ సహకరిస్తున్నాడు. ప్రస్తుతం మిల్లర్ 50, డుసెన్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 12 ఓవర్లలో సౌతాఫ్రికా 106/3 ►12 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. డుసెన్ 20, డేవిడ్ మిల్లర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 22 పరుగులు చేసిన డికాక్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రిటోరియస్ క్లీన్‌బౌల్డ్.. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►61 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రెండో బంతికి 29 పరుగులు చేసిన ప్రిటోరియస్ క్లీన్బౌల్డ్అయ్యాడు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ►212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా(10) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. టీమిండియా భారీ స్కోరు.. సౌతాఫ్రికా టార్గెట్ 212 ►సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శ్రేయాస్ అయ్యర్ 36, రిషబ్ పంత్ 29 పరుగులు చేశారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్ట్జే, పార్నెల్, ప్రిటోరియస్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్ కిషన్(76) ఔట్.. రెండో వికెట్ డౌన్ ►ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిషన్(76) కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో త్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అంతకముందు అదే ఓవర్లో వరుసగా 6,6,4,4తో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఫిప్టీ.. టీమిండియా 112/1 ►టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్థసెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దాటిగా ఆడుతూ వచ్చిన ఇషాన్ 37 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. చెలరేగుతున్న ఇషాన్, శ్రేయాస్ అయ్యర్ ►టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేస్తున్నారు. ఇషాన్ 45 పరుగులతో, శ్రేయాస్ 24 పరుగులతో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రుతురాజ్(23) ఔట్ ►రుతురాజ్ గైక్వాడ్(23) రూపంలో టీమిండియా తొలి వికెట కోల్పోయింది. వేన్ పార్నెల్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి బవుమాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు.. 6 ఓవర్లలో 51/0 ►ప్రొటీస్‌తో మ్యాచ్ టీమిండియా ఓపెనర్లు శుభారంభం చేశారు. ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తున్న రుతురాజ్, ఇషాన్ కిషన్ దాటికి టీమిండియా ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఇషాన్ 26, రుతురాజ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లలో టీమిండియా 24/0 ► మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 9, రుతురాజ్ గైక్వాడ్ 9 పరుగులతో ఆడుతున్నారు. ►టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీమిండియా సౌతాఫ్రికాతో టి20 సిరీస్ రూపంలో తొలి ద్వైపాక్షిక సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టి20 ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. రాబోయే టి20 ప్రపంచకప్ కోసం కాబోయే టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు భారత బోర్డు ఈ సీజన్లో ఎక్కువగా పొట్టి మ్యాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టు గట్టి ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టి20 క్రికెట్లో టీమిండియా గత 12 మ్యాచ్‌ల్లో విజయాలతో అజేయంగా ఉంది. ఈ వరుసలో అఫ్గానిస్తాన్, రొమేనియాలు 12 విజయాలతో ఉన్నాయి. తొలి టి20లో సఫారీని ఓడిస్తే 13 వరుస విజయాల జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది. దక్షిణాఫ్రికా తుది జట్టు: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే భారత్ తుది జట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ -
టీమిండియాకు వరం.. ఉమ్రాన్ మాలిక్‌పై సౌతాఫ్రికా కెప్టెన్ ప్రశంసలు!
India vs South Africa 2022 T20 Series: ‘‘సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు. అయినాగానీ, ఏ బ్యాటర్ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు కదా! అయినప్పటికీ, అందుకు కచ్చితంగా సన్నద్ధమవుతారు. మా జట్టులో కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసరగల బౌలర్లు ఉన్నారు. మా అమ్ములపొదిలోనూ అస్త్రాలు ఉన్నాయి. అయితే, ఉమ్రాన్ మాలిక్ రూపంలో టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు. ఐపీఎల్‌లోని తన ప్రదర్శనను అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నా’’ అని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ప్రతిభ ఉన్న ఆటగాడని ప్రశంసలు కురిపించాడు. అయితే, అతడిని ఎదుర్కొనేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రొటిస్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో జూన్ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా మాట్లాడుతూ.. భారత్‌తో సిరీస్‌కు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అదే విధంగా ఈ సిరీస్‌తో తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. అతడిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన ఈ కశ్మీరీ ఆటగాడు ప్రొటిస్‌తో సిరీస్‌లో భారత తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఎదురైన పరాభవానికి బదుల తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. చదవండి: IND Vs SA: యార్కర్లతో అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. పాపం ఉమ్రాన్ మాలిక్..! Back in Blue - Prep mode 🔛#TeamIndia begin training in Delhi ahead of the 1st T20I against South Africa.@Paytm #INDvSA pic.twitter.com/kOr8jsGJwL — BCCI (@BCCI) June 6, 2022 -
Ind Vs SA: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు!
South Africa tour of India, 2022: ఐపీఎల్-2022 సమరం ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. తెంబా బవుమా కెప్టెన్సీలోని ప్రొటిస్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో సత్తా చాటిన సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌తో తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో అదరగొట్టిన టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం చేయనుండగా.. తొలి సీజన్లోనే తన జట్టును విజేతగా నిలిపిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా కాలం తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించనున్నాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఈ సిరీస్‌ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది. ఆసక్తిరేపుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్, వేదికలు, ఇరు జట్ల వివరాలు మీకోసం.. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు నోట్: అన్ని మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభమవుతాయి. ప్రొటిస్‌తో సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్. చదవండి: MS Dhoni: 'ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా' Back in Blue - Prep mode 🔛#TeamIndia begin training in Delhi ahead of the 1st T20I against South Africa.@Paytm #INDvSA pic.twitter.com/kOr8jsGJwL — BCCI (@BCCI) June 6, 2022 -
Ind Vs SA: ప్రొటిస్‌తో టీ20 సిరీస్.. ప్రాక్టీసులో తలమునకలైన టీమిండియా
India Vs South Africa 2022 T20 Series: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ టీమిండియా సన్నద్ధమవుతోంది. ప్రొటిస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఇక ఈ సిరీస్‌తో భారత జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ మెలకువలు నేర్చుకుంటున్నారు. First practice session ✅ Snapshots from #TeamIndia's training at the Arun Jaitley Stadium, Delhi. 👍 👍 #INDvSA | @Paytm pic.twitter.com/6v0Ik5nydJ — BCCI (@BCCI) June 6, 2022 అదే విధంగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను ఉద్దేశించి దిశానిర్దేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో చాన్నాళ్ల తర్వాత దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. Back in Blue - Prep mode 🔛#TeamIndia begin training in Delhi ahead of the 1st T20I against South Africa.@Paytm #INDvSA pic.twitter.com/kOr8jsGJwL — BCCI (@BCCI) June 6, 2022 కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే నిమిత్తం ప్రొటిస్ జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. జూన్ 9 నుంచి ఆరంభం కానున్న సిరీస్‌కై తెంబా బవుమా బృందం ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. చదవండి: అందుకే నేను వికెట్ కీపర్ అయ్యాను: రిషబ్ పంత్ pic.twitter.com/PxR49tiKSc — BCCI (@BCCI) June 6, 2022 -
'రోహిత్ శర్మ, కోహ్లి లేక పోయినా భారత్ గట్టి పోటీ ఇస్తుంది'
స్వదేశంలో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్, ఆర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్ కోసం ప్రోటిస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుంది. ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9 జరగనుంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన సీనియర్ త్రయం జట్టులో లేనప్పటికీ.. టీమిండియా గట్టి పోటీ ఇస్తుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా చెప్పాడు. ప్రోటీస్ కెప్టెన్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. సీనియర్ ఆటగాళ్ళు లేని ఈ భారత జట్టుపై తన అభిప్రాయాలు గురించి ప్రశ్నించనప్పడు.. "నిజంగా భారత జట్టు కొత్త లూక్‌తో కన్పిస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన చాలా మంది యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. అయితే మేము మాత్రం భారత్‌ను తేలికగా తీసుకోము. ఈ జట్టును భారత జూనియర్ జట్టుగా పరిగణించము. మేము ఎప్పటిలాగే పోటీతత్వంతోనే బరిలోకి దిగుతాము" అని బావుమా పేర్కొన్నాడు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..! -
IPL: ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా.. కెప్టెన్ అవుతా!
IND Vs SA T20 Series: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. ఏదో ఒకరోజు క్యాష్ రిచ్ లీగ్‌లో తప్పకుండా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాలం కలిసి వస్తే కెప్టెన్‌గా కూడా వ్యవహరించే అవకాశం రావాలని ఆశిస్తున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే, అంతకంటే ముందు ఏదో ఒక జట్టులో ఆడే ఛాన్స్ రావాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటికే చాలా మంది ప్రొటిస్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ల నుంచి బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ వరకు ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ తదితరులు తాము ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో వీరందరిపై ప్రశంసలు కురిపించిన బవుమా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేశారని పేర్కొన్నాడు. రబడ వంద వికెట్లు తీయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తానూ ఏదో ఒకరోజు ఐపీఎల్లో ఆడతానని ఈ 32 ఏళ్ల బ్యాటర్ పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘నేను కూడా అక్కడ ఆడతాను. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నిజానికి అక్కడ ఓ జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలని ఉంది. ఇది నా ఫాంటసీ. అయితే, ముందు ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి అనుభవం గడించాలి కదా’’ అని క్రికెట్మంత్లీతో బవుమా చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో 33 మంది ప్రొటిస్ ప్లేయర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో బవుమా లేకపోవడం గమనార్హం. ఇక జూన్ 9 నుంచి టీమిండియాతో టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. చదవండి 👇 అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా Welcome to the #Proteas, Tristan Stubbs 🇿🇦💚#INDvSA #BePartOfIt pic.twitter.com/EJWx8agZKV — Cricket South Africa (@OfficialCSA) June 1, 2022 -
Ind Vs SA: భారత్‌ను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే!
South Africa Tour of India- 2022: టీమిండియాతో టీ20 సిరీస్‌లో విజయం సాధిస్తామని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా విశ్వాసం వ్యక్తం చేశాడు. సీనియర్లకు విశ్రాంతినిచ్చినప్పటికీ కేఎల్ రాహుల్ సేనను తక్కువగా అంచనా వేయలేమని.. ఇరు జట్ల మధ్య హోరాహోరీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా భారత్‌తో సిరీస్ తమకు ఉపకరిస్తుందని పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జూన్‌లో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా తదితరులకు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీమిండియా సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తెంబా బవుమా.. ‘‘ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేంత లగ్జరీ మాకు లేదు. కానీ ఇండియా అలా కాదు. వాళ్లకు చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఒక్కరు ఫామ్‌లో ఉన్నారు. వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యే క్రమంలో ఇలాంటి జట్టుతో పోటీపడటం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియాతో సిరీస్ మాకు మేలు చేస్తుంది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు ఇక్కడి పరిస్థితులకు భిన్నంగా ఉన్నా.. టీమిండియా లాంటి బలమైన జట్టుతో పోటీ ఇప్పుడు మాకు చాలా అవసరం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 9 నుంచి భారత్- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. టీ20 సిరీస్: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్. చదవండి 👇 French Open: వరల్డ్ నంబర్ 1తో పోరులో ఓటమి.. నేను అబ్బాయినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల! -
జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ బౌలర్ దూరం
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా నాయకత్వం వహించనున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే దూరమయ్యాడు. ఇక సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే మార్చి 18న ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బంగ్లా జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇక ఏడాది జనవరిలో టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 ప్రోటీస్ జట్టు క్లీన్ స్వీప్‌చేసింది. ఈ సిరీస్‌లో క్వింటన్ డి కాక్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన డికాక్ 229 పరుగులు సాదించాడు. ఇప్పడు బంగ్లాదేశ్‌పై కూడా ఆదే జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా జట్టు భావిస్తోంది. కాగా దాదాపు భారత్‌తో తలపడిన జట్టునే బంగ్లాదేశ్ సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేయడం గమనార్హం. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జుబేర్ హంజా, మార్కో జాన్సెన్, జానెమన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ద్వాహ్లుక్వాయో, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కైల్ వెర్రెయిన్ చదవండి: IPL 2022: పాపం రైనా.. మరోసారి బిగ్ షాక్... కనీసం ఆ అవకాశం కూడా లేదుగా! -
కోహ్లి ఇది మంచి పద్దతి కాదేమో!
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా విషయంలో టీమిండియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కోహ్లి బవుమాపై అసభ్యరీతిలో కామెంట్స్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కేఎల్ రాహుల్ డైరెక్ట్ త్రోకు టెంబా బవుమా రనౌట్ అయ్యాడు. పెవిలియన్ వెళ్తున్న బవుమాను ఉద్దేశించి కోహ్లి.. ''బాగ్ రహా తా మద్..'' అంటూ బూతు మాటలు పలికాడు. కోహ్లి పక్కనే ఉన్న సహచర ఆటగాళ్లు కూడా ఏం పట్టనట్లే ఉన్నారు. అయితే ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఇక తొలి వన్డేలో బవుమా, కోహ్లి మధ్య చిన్నపాటి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. పంత్‌కు త్రో వేయబోయిన బంతి బవుమాకు తగలడం.. ఆ తర్వాత బవుమా ఆగ్రహం వ్యక్తం చేయడం.. బదులుగా కోహ్లి అతనిపై కోపం చూపించడంతో రచ్చగా మారింది. అదే గొడవ ఇప్పటికి ఇద్దరి మధ్య వైరం నడిపిస్తూనే ఉంది. తాజా అంశంలో అందరూ కోహ్లినే తప్పుబడుతున్నారు. ఇప్పటికే జాతీయ గీతాలపన సమయంలో చూయింగ్ గమ్ నమిలి అనుచితంగా ప్రవర్తించిన కోహ్లిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా చర్యతో కోహ్లిపై మరింత ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చదవండి: 70 బంతుల్లో 236 పరుగులతో విధ్వంసం; బౌలర్ బూతుపురాణం #SAvsIND Bavuma run-out pic.twitter.com/8EvTTKYVFL — Amanpreet Singh (@AmanPreet0207) January 23, 2022 -
కేఎల్ రాహుల్ సూపర్ త్రో.. బవుమా రనౌట్
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ త్రోతో మెరిశాడు. రాహుల్ త్రో దెబ్బకు బవుమా రనౌట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 8 పరుగులతో బవుమా మంచి టచ్‌లో కనిపించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతిని బవుమా మిడాఫ్ దిశగా ఆడాడు. క్విక్ సింగిల్ తీయాలని భావించిన బవుమా చేతులు కాల్చుకున్నాడు. రిస్క్ అని తెలిసినప్పటికి పరిగెత్తాడు.. అప్పటికే బంతిని అందుకున్న రాహుల్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో విసిరాడు. డైరెక్ట్ హిట్‌తో బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం బవుమా రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా.. డుసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. pic.twitter.com/6hgPJzK4Pd — Bleh (@rishabh2209420) January 23, 2022 -
తొలి వన్డేలో టీమిండియా ఓటమి... నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ..
దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్‌కు వన్డే సిరీస్‌లోనూ ఊరట లభించలేదు. దానికి కొనసాగింపుగానా అన్నట్లు తొలి మ్యాచ్‌లో ఓటమితో సిరీస్‌ను మొదలు పెట్టింది. పెద్దగా ప్రభావం చూపని బౌలింగ్‌తో సఫారీకి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన టీమిండియా... ఆ తర్వాత బ్యాటర్ల వైఫల్యంతో సునాయాసంగా పరాజయాన్ని ఆహ్వానించింది. IND vs SA, 1st ODI: భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇదే మైదానంలో రేపు రెండో వన్డే జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో ఆరంభంలోనే జేన్‌మన్ మలాన్ (6) వికెట్ తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. తొలి పది ఓవర్లు ముగిసేసరికి సఫారీ స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత డి కాక్ (27), మార్క్రమ్ (4)లను పది పరుగుల వ్యవధిలో అవుట్ చేసి భారత్ మళ్లీ దెబ్బ కొట్టింది. అయితే ఈ దశలో బవుమా, డసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. బవుమా నెమ్మదిగా ఆడినా, డసెన్ తన దూకుడుతో లెక్క సరి చేశాడు. ఆపై భారత బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న వీరు భారీ స్కోరుకు బాటలు వేశారు. శార్దుల్ ఓవర్లో సింగిల్ తీసి 133 బంతుల్లో బవుమా కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 83 బంతుల్లో డసెన్ కూడా తన రెండో శతకాన్ని అందుకున్నాడు. ఎట్టకేలకు 49వ ఓవర్లో బవుమాను అవుట్ చేసి బుమ్రా ఈ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. మిడిలార్డర్ విఫలం... కెప్టెన్ రాహుల్ (12) పార్ట్‌టైమర్ మార్క్రమ్కు వికెట్ అప్పగించినా... ధావన్, కోహ్లి భాగస్వామ్యంలో జట్టు ఇన్నింగ్స్ చక్కగా సాగింది. ముఖ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లో కోహ్లి ఎప్పటిలాగే తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 17 ఓవర్లలో 92 పరుగులు జత చేశారు. అయితే ధావన్ అవుట్‌తో ఒక్కసారిగా జట్టు పతనం ప్రారంభమైంది. 50 పరుగుల వ్యవధిలో 5 ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి దిశగా సాగింది. రిషభ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17), వెంకటేశ్ అయ్యర్ (2) విఫలం కావడంతో లక్ష్య ఛేదన అసాధ్యంగా మారిపోయింది. చివర్లో శార్దుల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్‌తో పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. వెంకటేశ్ @242 మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ రాజశేఖరన్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 242వ ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు. సచిన్‌ను దాటిన కోహ్లి... ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు తొమ్మిది పరుగుల వద్ద విరాట్ కోహ్లి (5,108) విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా సచిన్ టెండూల్కర్ (5,065) పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు -
ఐదేళ్ల తర్వాత సెంచరీతో మెరిశాడు... జట్టును గెలిపించాడు
South Africa vs India, !st ODI: పార్ల్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 2016 తర్వాత తొలి సెంచరీను బావుమా నమోదు చేశాడు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. బావుమా(110), వండెర్ డస్సెన్ (129) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ధావన్(79),కోహ్లి(51),ఠాకూర్(50) పరుగులుతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో,షమ్సీ, ఎన్గిడి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ సాధించారు. చదవండి: IND VS SA: డికాక్ మెరుపువేగంతో.. పంత్ తేరుకునేలోపే -
కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 36వ ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ బవుమా షార్ట్ కవర్ రీజియన్ దిశగా ఆడాడు. అది నేరుగా కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే పంత్ వైపు వేసే ఉద్దేశంతో కోహ్లి బంతిని బలంగా విసిరాడు. పొరపాటున బంతి బవుమాకు తగిలినప్పటికి పెద్దగా గాయం కాలేదు. చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం.. ఇక్కడితో ఇది ముగిసిదనుకుంటే.. బవుమా కోహ్లివైపు కోపంగా చూస్తూ.. ''నేను క్రీజులోనే ఉన్నా అలాంటి త్రోలు వేయనవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు. దీంతో కోపం పట్టలేకపోయిన మెషిన్‌గన్ బవుమాతో.. ''నేనేం కావాలని నిన్ను కొట్టాలనుకోలేదు.. వికెట్ కీపర్‌కు త్రో వేసే క్రమంలో పొరపాటున తగిలిఉంటుంది.. ఒక బ్యాట్స్‌మన్‌గా ఇది నువ్వు అర్థం చేసుకోవాలి'' అంటూ ధీటుగా బదులిచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సాతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు, వాన్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు నాటౌట్‌గా రాణించారు. వీరిద్దరు చెలరేగి ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఏకంగా ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. నాలుగో వికెట్‌కి రికార్డ్ పార్ట్నర్ షిప్ 204 పరుగులను సాధించారు. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి భారత్‌కి భారీ టార్గెట్‌ని విధించారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. చదవండి: 'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్ pic.twitter.com/fypjtfqCUf — Sunaina Gosh (@Sunainagosh7) January 19, 2022 -
ఎనిమిదేళ్ల తర్వాత అరుదైన రికార్డు సాధించిన సౌతాఫ్రికా..
టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు బావుమా, వండర్ డుస్సేన్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతకు ముందు సెంచూరియన్‌లో 2013లో డికాక్, డివిలియర్స్ నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతే కాకుండా ఇది ఓవరాల్‌గా రెండో అత్యధిక భాగస్వామ్యం కూడా. అంతకుముందు 2000లో కోచి వేదికగా తొలి వికెట్‌కు కిర్ట్సెన్ - గిబ్స్ 235 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బావుమా(110), వండర్ డుస్సేన్(129) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు! -
సరిపోని ధావన్, కోహ్లి, శార్దూల్ మెరుపులు.. తొలి వన్డేలో ఓటమి
IND vs SA 1st ODI: సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు. ఇక రెండో వన్డే శుక్రవారం జరగనుంది. అంతకముందు టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తర్వాత వచ్చిన డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాండర్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో నాలుగో వికెట్‌కి 204 రికార్డు పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరి మెరుపులతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. 8: 57 PM: ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కేవలం 7 పరుగుల వ్యవధిలో ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. 181 పరుగుల వద్ద అయ్యర్, పంత్ ఔట్ కాగా, 188 పరుగుల స్కోర్ వద్ద అరంగేట్రం ఆటగాడు వెంకటేశ్ అయ్యర్(7 బంతుల్లో 2) ఔటయ్యాడు. దీంతో అప్పటి దాకా విజయం దిశగా సాగిన టీమిండియా ఓటమి బాట పట్టింది. 36 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 188/6. క్రీజ్‌లో అశ్విన్(4), శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. 8: 46 PM: తడబడుతున్న భారత్.. 181 పరుగులకే సగం వికెట్లు డౌన్ నిలకడగా ఆడుతూ విజయం దిశగా సాగుతున్న టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి. మూడు బంతుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(17), పంత్(16)లు ఔటయ్యారు. తొలుత 33.5వ ఓవర్లో 181 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరగా... అదే స్కోర్ వద్ద మరుసటి ఓవర్ తొలి బంతికే పంత్.. ఫెలుక్వాయో బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి స్టంప్ అవుటయ్యాడు. దీంతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. 8:16 PM: టీమిండియా మూడో వికెట్ డౌన్.. కోహ్లి(51) ఔట్ రెండేళ్లకుపైగా ఉన్న శతక దాహాన్ని ఈ మ్యాచ్‌లో ఎలాగైనా తీర్చుకుంటాడని భావించిన కోహ్లి(51).. హాఫ్ సెంచరీ మార్కు దాటగానే ఔటయ్యాడు. షంషి బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 152 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పంత్(4), అయ్యర్ ఉన్నారు. 8:02 PM: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా సెట్ బ్యాటర్ శిఖర్ ధవన్ ఔటయ్యాడు. 84 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసిన గబ్బర్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా 138 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 140/2గా ఉంది. క్రీజ్‌లో కోహ్లి(44), పంత్(1) ఉన్నారు. 7:15 PM: గబ్బర్ హాఫ్ సెంచరీ.. నిలకడగా టీమిండియా చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధవన్(55 బంతుల్లో 54; 8 ఫోర్లు).. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. సమయోచితంగా ఆడుతూ అర్ధ శతకం సాధించాడు. ఫలితంగా టీమిండియా 15 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్‌లో గబ్బర్‌కు తోడుగా విరాట్ కోహ్లి(18 బంతుల్లో 13; ఫోర్) ఉన్నాడు. 07:02 PM: 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ఓపెనర్ రాహుల్ మార్క్రమ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 46 పరుగులతో ఆడుతుంది. 06:02 PM: టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్, జానెమన్ మలన్‌లు నిరాశపరిచారు. తర్వాత వచ్చిన డికాక్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒక దశలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాని కెప్టెన్ బావుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో సహాయంతో 110 పరుగులు చేశాడు. వాండర్ డస్సెన్ 96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు సెంచరీలతో చెలరేగడంతో నాలుగో వికెట్‌కి 204 రికార్డు పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరి మెరుపులతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ సాధించారు. 5: 43 PM: IND vs SA 1st ODI: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బవుమా ఔటయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48.1 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 272/4గా ఉంది. క్రీజ్‌లో డస్సెన్(86 బంతుల్లో 109), మిల్లర్ ఉన్నారు. 5: 21 PM: బవుమా శతకం, డస్సెన్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(133 బంతుల్లో 100; 7 ఫోర్లు) కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో డస్సెన్(77 బంతుల్లో 93; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టిస్తూ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 45 ఓవర్ల తర్వాత 3 నష్టానికి 245 పరుగులు చేసింది. బవుమా- డస్సెన్ జోడీ నాలుగో వికెట్‌కు 177 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసి, జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తుంది. 4: 42 PM: బవుమా, డస్సెన్ అర్ధ శతకాలు.. దక్షిణాఫ్రికా స్కోర్ 175/3 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను కెప్టెన్ బవుమా(101 బంతుల్లో 78; 7 ఫోర్లు), డస్సెన్(49 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 100 పరుగులకు పైగా జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. 35 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 181/3గా ఉంది. 3: 24 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 68 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ కళ్లు చెదిరే త్రోతో మార్క్రమ్(11 బంతుల్లో 4)ను రనౌట్ చేశాడు. క్రీజ్‌లో బవుమా(23), డస్సెన్ ఉన్నారు. డికాక్ క్లీన్ బౌల్డ్ డ్రింక్స్ అనంతరం తొలి బంతికి సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుంటున్న స్టార్ ప్లేయర్ డికాక్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో బవుమా(17), మార్క్రమ్ ఉన్నారు. 2: 21 PM: తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ►బుమ్రా బౌలింగ్‌లో మలన్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. టీమిండియా పేసు గుర్రం అద్భుత అవుట్స్వింగర్కు బలైపోయి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు: 19/1 (4.2). 2: 01 PM: దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డికాక్, జానేమన్ మలన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. 1: 35 PM: టీమిండియాతో స్వదేశంలో జరుగుతున్న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుని రాహుల్ సేనను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఇక టీమిండియా యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కేఎల్ రాహుల్ ధ్రువీకరించాడు. కాగా కేఎల్ రాహుల్‌కు వన్డే కెప్టెన్‌గా ఇదే తొలి అవకాశం. తుది జట్లు: టీమిండియా: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంషీ, లుంగి ఎంగిడి. చదవండి: Ind Vs Sa ODIs: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం -
సిరాజ్ అలా చేయకుండా ఉండాల్సింది.. టీమిండియా దిగ్గజం అసహనం!
Siraj- Bavuma: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో భాగంగా ప్రొటీస్ ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యవహరించిన తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటర్‌తో మాట్లాడితే సరిపోతుందని, మరీ దూకుడుగా ప్రవర్తించడం సరికాదన్నాడు. సిరాజ్ పట్ల ప్రొటిస్ ఆటగాడు తెంబా బవుమా హుందాగా ప్రవర్తించిన తీరు ఆదర్శనీయమని కొనియాడాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భాగంగా ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ 61వ ఓవర్ బౌల్ చేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న బవుమా డిఫెన్స్ ఆడాడు. ఇంతలో బంతిని అందుకున్న సిరాజ్ స్టంప్స్‌ను పడగొట్టే క్రమంలో దూకుడుగా వ్యవహరించాడు. కోపంగా బవుమా వైపు బంతిని విసిరాడు. అది కాస్తా బవుమా పాదానికి గట్టిగా తగలడంతో అతడి నొప్పితో విలవిల్లాడాడు. అనూహ్య పరిణామానికి కంగుతిన్న సిరాజ్ వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సారీ చెప్పాడు. ఇందుకు స్పందించిన బవుమా.. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ పర్వాలేదని చెప్పాడు. ఈ ఘటన గురించి సునిల్ గావస్కర్ మాట్లాడుతూ... ‘‘అక్కడ పరుగు తీసే ప్రయత్నం కనిపించలేదు. కానీ సిరాజ్ కాస్త దూకుడుగా ముందుకువెళ్లాడు. ఒకవేళ పరుగు తీయాలని ప్రయత్నించినా అలా చేయడం సరికాదు. నిజానికి బ్యాటర్ అక్కడే ఉన్నాడు. తను పరుగు తీయలేదు. అలాంటప్పుడు మరి అలా వ్యవహరించడం దేనికి. సిరాజ్ బవుమాతో మాట్లాడాల్సింది. ఏదేమైనా తెంబా బవుమా సిరాజ్‌తో ప్రవర్తించిన తీరు అమోఘం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి టీమిండియా సెంచూరియన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. బవుమా తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... ఇప్పటికే రాయుడు, అశ్విన్... -
సిరాజ్ మ్యాచ్ గెలవబోతున్నాం.. ఇలాంటివి అవసరమా!
టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య తొలి టెస్టు ప్రొటీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సిరాజ్ చేసిన ఒక పని ఆశ్చర్యానికి గురి చేసింది. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 61వ ఓవర్‌ను సిరాజ్ వేశాడు. తొలి బంతిని సిరాజ్ గుడ్‌లెంగ్త్‌తో వేయడంతో బవూమా డిఫెన్స్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న సిరాజ్ స్టంప్స్‌ను ఎగురగొడుదామన్న ఉద్దేశంతో బవుమా వైపు కోపంగా విసిరాడు. అయితే బంతి వెళ్లి అనూహ్యంగా బవూమా పాదానికి గట్టిగా తగిలింది. చదవండి: Ind Vs Ban Semi Final-2: గుంటూరు కుర్రాడు సూపర్.. 90 పరుగుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ దీంతో బవూమా నొప్పితో విలవిల్లాలాడగా.. వెంటనే సిరాజ్ అతని వద్దకు వెళ్లి క్షమాపణ కోరాడు. అయితే సిరాజ్ ఇది కావాలని మాత్రం చేయలేదని అతని క్షమాపణ ద్వారా తేలింది. బవూమా నొప్పితో బాధపడడంతో వెంటనే ఫిజియో వచ్చి కాలుకు మర్దన చేశాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే సిరాజ్ చర్యపై ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగూ మనం మ్యాచ్ గెలవబోతున్నాం.. ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్స్ చేశారు. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. లంచ్ విరామం సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బవుమా 34 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. మార్కో జాన్సెన్ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు. టీమిండియా విజయానికి కేవలం మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. చదవండి: IND Vs SA: బుమ్రా సూపర్ డెలివరీ.. డసెన్‌కు బొమ్మ కనబడింది UFF..!! I rather like Mohammed Siraj's alpha-competitiveness & the crazed look in his eyes when bowling, but chucking the ball AT Bavuma post-bowl when he wasn't even CONTEMPLATING a run and, potentially, injuring the South African batter's heel is just NOT cricket..!!#SAvIND pic.twitter.com/zA4UuMGLTm — Chintan Nanavati (@LightHealing) December 30, 2021 -
Ind Vs Sa Test Seires: భారత్‌తో సిరీస్.. ప్రొటిస్ జట్టు ఇదే.. అతడు వచ్చేశాడు!
Ind Vs Sa: South Africa Announce 21 Man Squad For India Tests Duanne Olivier Returns: టీమిండియాతో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. స్వదేశంలో డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానున్న సిరీస్ కోసం 21 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా 2019లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన డువాన్ ఒలివర్‌కు పిలుపు రావడం గమనార్హం. కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జేలతో పాటు ఒలివర్ కూడా చేరడంతో బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారనుంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ సారథ్యంలో సాగనున్న ఈ సిరీస్‌కు తెంబా బవుమా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ప్రొటిస్ జట్టు: డీన్ ఎల్గర్(కెప్టెన్), తెంబా బవుమా(వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), కగిసొ రబడ, సరేల్ ఎర్వీ, బ్యూరన్ హెన్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, ఎడెన్ మార్కరమ్, వియాన్ మల్డర్, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసేన్, కైలీ వెరెన్, మార్కో జాన్సన్, గ్లెంటన్ స్టరమ్మాన్, ప్రెనెలన్ సుబ్రయేన్, సిసాండ మగల, రియాన్ రికెల్టన్, డువాన్ ఒలివర్. PC: ICC అప్పుడు పాకిస్తాన్‌ను చుక్కలు చూపించాడు 10 టెస్టు మ్యాచ్‌లలో 43 వికెట్లు తీసిన ఘనత డువాన్ ఒలివర్ది. ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఈ ఫాస్ట్ బౌలర్. 2018-19లో పాక్‌తో సిరీస్‌లో భాగంగా.. 3 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఒలివర్.. కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్ కోసం అతడిని ఎంపిక చేయడం విశేషం. ఈ నేపథ్యంలో డువాన్ గనుక తుది జట్టులో చోటు దక్కించుకున్నట్లయితే.. టీమిండియా బౌలర్లకు తిప్పలు తప్పవు మరి! చదవండి: India Tour of South Africa- Revised Schedule: టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. కొత్త షెడ్యూల్ ఇదే #Proteas SQUAD ANNOUNCEMENT 🚨 2️⃣ 1️⃣ players Maiden Test call ups for Sisanda Magala and Ryan Rickelton 👍 Duanne Olivier returns 🇿🇦 Read more here ➡️ https://t.co/ZxBpXXvQy1#SAvIND #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/6rIDzt1PuO — Cricket South Africa (@OfficialCSA) December 7, 2021 -
Quinton De Kock: నేను అలా చేయలేను; అతడేం చిన్నపిల్లాడు కాదు: కెప్టెన్
Temba Bavuma On Quinton De Kock Refusal To Take Knee: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు జట్టు నుంచి తప్పుకొన్న క్వింటన్ డికాక్ నిర్ణయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. ‘‘మ్యాచ్‌కు కొన్ని గంటలముందు సీఎస్ఏ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. డికాక్ నిర్ణయం మాకూ ఆశ్చర్యం కలిగించింది. అతను చిన్నపిల్లాడు కాదు. తన నిర్ణయం తాను తీసుకోగలడు. దానికే కట్టుబడే ఉంటాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. అతనిపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఒక కెప్టెన్‌గా నేను ఇప్పుడే చెప్పలేను. దానిని నేను నిర్ణయించలేను. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లపై కూడా మేం దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం. డికాక్ మాలో ఒకడు. అతనికి మా వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం. ఏదైనా అతను మాతో చర్చించవచ్చు. నాకు తెలిసి మేం సహచరులం దీనిపై మాట్లాడుకోగలం’’ అని బవుమా స్పష్టం చేశాడు. అసలేం జరిగిందంటే... జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (బీఎల్ఎమ్) కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికల్లో సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) సైతం తమ ఆటగాళ్లకు ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాను ఈ ఆదేశాలను పాటించలేనంటూ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. శ్వేత జాతీయుడైన డికాక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవసరమైతే మ్యాచ్ ఆడను కానీ అలా మాత్రం చేయనంటూ అతను తన మాటపైనే నిలబడ్డాడు. టాస్ సమయంలో కెప్టెన్ బవుమా ‘వ్యక్తిగత కారణాలతో డికాక్ దూరమయ్యాడు’ అని ప్రకటించడంతో ఈ విషయం గురించి అందరికీ తెలిసింది. డికాక్ తన శ్వేత జాతి అహంకారాన్ని ప్రదర్శించాడని ఒకవైపు నుంచి విమర్శలు వస్తుండగా... అతడి ఇష్టానికి వదిలేయడమే సరైందని మరికొందరు డికాక్‌కు మద్దతుగా నిలిచారు. ఇక క్రికెట్ ప్రపంచంలో ఊహించని ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటతో సంబంధం లేని అంశంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లో ఒక ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యేందుకు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ .. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SA Vs WI: రెండుసార్లు విజేత.. 8 వికెట్ల తేడాతో చిత్తు.. అరె ఏంట్రా ఇది?
T20 World Cup 2021: రెండుసార్లు టి20 ప్రపంచకప్ విశ్వవిజేత, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఈసారి మెగా టోర్నీలో అందరికంటే ముందే నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో 55కే కుప్పకూలిన విండీస్ ఈసారి అంతకంటే మెరుగ్గా ఆడినా అదీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది. వరుసగా రెండు ఓటముల తర్వాత పేలవ రన్‌రేట్‌తో నిలిచిన పొలార్డ్ బృందం ముందుకెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. మరోవైపు గత ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న దక్షిణాఫ్రికా పదునైన ఆటతో ప్రత్యరి్థని పడగొట్టి కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. నోర్జే, ప్రిటోరియస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో మార్క్రమ్ మెరుపులు సఫారీలను గెలిపించాయి. South Africa Beat West Indies By 8 Wickets: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు తొలి విజయం దక్కింది. దుబాయ్‌లో మంగళవారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ (35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే (1/14), ప్రిటోరియస్ (3/17) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (26 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వాన్ డర్ డసెన్ (51 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు), రీజా హెన్డ్రిక్స్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); గేల్ విఫలం... ఓపెనర్ లూయిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోగా... మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ముఖ్యంగా రెండో ఓపెనర్ లెండిల్ సిమన్స్ (35 బంతుల్లో 16;) అనూహ్యంగా బంతులను వృథా చేయడం కూడా జట్టును దెబ్బ తీసింది. ఒక ఎండ్‌లో లూయిస్ మెరుపు బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 73 పరుగుల పార్ట్నర్షిప్ నమోదైనా, ఇందులో లూయిస్ ఒక్కడే 56 పరుగులు సాధించాడు. రబడ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను... మార్క్రమ్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 4 బాదాడు. షమ్సీ బౌలింగ్‌లో కొట్టిన మరో భారీ సిక్స్‌తో 32 బంతుల్లోనే లూయిస్ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మహరాజ్ బౌలింగ్‌లో లూయిస్ వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. పూరన్ (12) విఫలం కాగా, తన 75 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నడూ మూడో స్థానంకంటే దిగువన ఆడని క్రిస్ గేల్ (12) ఈ మ్యాచ్‌లోనే తొలిసారి నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగి ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత విండీస్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. చివర్లో పొలార్డ్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆఖరి 3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ 22 పరుగులే జోడించింది. కీలక భాగస్వామ్యాలు... సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా రనౌట్ రూపంలో కెప్టెన్ బవుమా (2) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతి రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సఫారీలను గెలిపించాయి. ముందుగా హెన్డ్రిక్స్, డసెన్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు (50 బంతుల్లో) జోడించారు. ఎక్కడా తొందరపాటు ప్రదర్శించకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. హెట్‌మైర్ అద్భుత క్యాచ్‌తో హెన్డ్రిక్స్ ఆట ముగిసినా ...ఆ తర్వాత వచ్చిన మార్క్రమ్ చూడచక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 4 భారీ సిక్సర్లు సహా 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన అతను, తర్వాతి బంతికే సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు (54 బంతుల్లో) జత చేశారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) రబడ 16; లూయిస్ (సి) రబడ (బి) మహరాజ్ 56; పూరన్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 12; గేల్ (సి) క్లాసెన్ (బి) ప్రిటోరియస్ 12; పొలార్డ్ (సి) డసెన్ (బి) ప్రిటోరియస్ 26; రసెల్ (బి) నోర్జే 5; హైట్‌మైర్ (రనౌట్) 1; బ్రావో (నాటౌట్) 8; వాల్‡్ష (సి) హెన్డ్రిక్స్ (బి) ప్రిటోరియస్ 0; హొసీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–73, 2–87, 3–89, 4–121, 5–132, 6–133, 7–137, 8–137. బౌలింగ్: మార్క్రమ్ 3–1–22–0, రబడ 4–0–27–1, నోర్జే 4–0–14–1, మహరాజ్ 4–0–24–2, షమ్సీ 3–0–37–0, ప్రిటోరియస్ 2–0–17–3. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (రనౌట్) 2; హెన్డ్రిక్స్ (సి) హెట్‌మైర్ (బి) హొసీన్ 39; వాన్ డర్ డసెన్ (నాటౌట్) 43; మార్క్రమ్ (నాటౌట్) 51; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–4, 2–61. బౌలింగ్: హొసీన్ 4–0–27–1, రవి రాంపాల్ 3–0–22–0, రసెల్ 3.2–0–36–0, హేడెన్ వాల్‡్ష 3–0–26–0, బ్రావో 4–0–23–0, పొలార్డ్ 1–0–9–0. చదవండి: T20 WC 2021: వారెవ్వా హసన్ అలీ.. అయ్యో విలియమ్సన్ T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ .. South Africa got their #T20WorldCup 2021 campaign back on track after a commanding victory against West Indies 💪 https://t.co/YriZdtyUev — T20 World Cup (@T20WorldCup) October 26, 2021 -
WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
Andre Russel Bullet Throw.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆండీ రసెల్ సూపర్ త్రోతో మెరిశాడు. దాదాపు 100 కిమీ వేగంతో విసిరిన డైరెక్ట్ త్రోకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇది చోటుచేసుకోవడం విశేషం. చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా తొలి ఓవర్‌ను ఎకిల్ హొస్సేన్ వేయగా.. చివరి బంతిని బవుమా మిడాన్ దిశగా ప్లిక్ చేశాడు. ఫీల్డర్ దూరంగా ఉండడంతో ఈజీ సింగిల్ అనుకున్నారు.. కానీ రసెల్ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చిన రసెల్ బంతిని అందుకొని వేగంగా త్రో విసిరాడు. దీంతో బంతి డైరెక్టుగా వికెట్లను గిరాటేయడం.. బవుమా రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..! A bullet of a throw from Russell gets the wicket of Bavuma via @t20worldcup https://t.co/87kxjf0Ysb — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం
Quinton De Kock Pulled Out Vs WI Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్డీండీస్తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా సిద్ధమైన వేళ మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ రూపంలో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు అతను దూరంగా ఉండనున్నాడని.. అతని స్థానంలో రీజా హెండ్రిక్స్ ఆడుతాడంటూ జట్టుకు కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. అయితే డికాక్ వ్యక్తిగత కారణాల రిత్యా విండీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని బవుమా పేర్కొన్నప్పటికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. చదవండి: T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్ వీసా మీద ఉన్నారా? బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టి20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్నాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇకపై తాము ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో మొకాళ్లపై నిలబడి బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపాలంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు(సీఎస్ఏ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో విండీస్‌తో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు సీఎస్ఏతో డికాక్ గొడవకు దిగినట్లు సమాచారం. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి తాను వ్యతిరేకి కాదని.. కానీ మొకాళ్లపై కూర్చొని మద్దతు పలకలేనని తెలిపినట్లు సమాచారం. కేవలం ఈ కారణంతోనే డికాక్ కీలకమ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే డికాక్ మాత్రం అలాంటిదేం లేదని.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నానని.. అనవసరంగా దీన్ని పెద్ద విషయం చేయొద్దంటూ మీడియాను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్ 🚨 TEAM ANNOUNCEMENT 🇿🇦 There's one change as Reeza Hendricks comes in for Quinton de Kock 📝 Ball by Ball https://t.co/c1ztvrT95P#SAvWI #T20WorldCup #BePartOfIt pic.twitter.com/0blL4GviNO — Cricket South Africa (@OfficialCSA) October 26, 2021 -
T20 World Cup 2021: ఆసీస్ శ్రమించి... దక్షిణాఫ్రికాను చిత్తు చేసి..
T20 World Cup 2021 Aus Vs SA: టి20 ప్రపంచకప్ సూపర్–12 ఆరంభ పోరులో ఆస్ట్రేలియా అతికష్టమ్మీద గెలిచింది. లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో కిందా మీదా పడిన ఆసీస్... స్టొయినిస్ (16 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు), మాథ్యూ వేడ్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఈ మెగా ఈవెంట్లో శుభారంభం చేసింది. గ్రూప్–1లో భాగంగా శనివారం అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. మార్క్రమ్ (36 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాటర్స్ విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హేజల్‌వుడ్, మిషెల్ స్టార్క్, ఆడమ్ జంపా తలా రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఆ్రస్టేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసి గెలిచింది. స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు) రాణించాడు. నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. రాణించిన బౌలర్లు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన కెప్టెన్ బవూమ (7 బంతుల్లో 12; 2 ఫోర్లు) దూకుడు మీద కనిపించాడు. అయితే మరుసటి ఓవర్లోనే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హేజల్‌వుడ్ తన వరుస ఓవర్లలో వాన్ డెర్ డసెన్ (3 బంతుల్లో 2), క్వింటన్ డికాక్ (12 బంతుల్లో 7; ఫోర్)లను అవుట్ చేశాడు. మరికాసేపటికే క్లాసెన్ (13 బంతుల్లో 13; 2 ఫోర్లు) కూడా పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 16)తో కలిసి మార్క్రమ్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. 14వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఆడమ్ జంపా ఒకే ఓవర్లో మిల్లర్, ప్రిటోరియస్ (1)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మార్క్రమ్ కూడా అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా 120 మార్కును కూడా అందుకోలేకపోయింది. గెలిపించిన స్టొయినిస్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఆ్రస్టేలియా ఛేదన సాఫీగా సాగలేదు. ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్స్ వార్నర్ (15 బంతుల్లో 14, 3 ఫోర్లు), కెపె్టన్ ఫించ్ (0), మిషెల్ మార్‡్ష (17 బంతుల్లో 11; 1 ఫోర్) విఫలమయ్యారు. స్మిత్, మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 18; 1 ఫోర్) నిలబడటంతో కంగారూ జట్టు లక్ష్యం వైపు కదిలింది. అయితే మార్క్రమ్ సూపర్ క్యాచ్‌తో స్మిత్‌ను అవుట్ పెవిలియన్‌కు చేర్చాడు. కేశవ్ మహరాజ్ వేసిన 15వ ఓవర్ ఐదో బంతిని స్మిత్ మిడ్ వికెట్ దిశలో గాల్లోకి ఆడగా... లాంగాన్‌లో ఉన్న మార్క్రమ్ తన కుడివైపునకు పరుగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. రెండు బంతుల అనంతరం షమ్సీ బౌలింగ్‌లో స్విచ్ హిట్‌కు ప్రయతి్నంచిన మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఛేదనలో ఆసీస్ మరోసారి దారి తప్పింది. చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా విజయ సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులుగా మారింది. క్రీజులో ఉన్న స్టొయినిస్ 19వ ఓవర్లో ఒక ఫోర్... 20వ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాది రెండు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్‌ను గట్టెక్కించాడు. వేడ్‌తో కలిసి స్టొయినిస్ అజేయమైన ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. స్కోర్లు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవూమ (బి) మ్యాక్‌వెల్ 12; డికాక్ (బి) హేజల్‌వుడ్ 7; డసెన్ (సి) వేడ్ (బి) హేజల్‌వుడ్ 2; మార్క్రమ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 40; క్లాసెన్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 13; మిల్లర్ (ఎల్బీ) (బి) జంపా 16; ప్రిటోరియస్ (సి) వేడ్ (బి) జంపా 1; కేశవ్ మహరాజ్ (రనౌట్) 0; రబడ (నాటౌట్) 19; నోర్జే (సి) ఫించ్ (బి) స్టార్క్ 2; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–23, 4–46, 5–80, 6–82, 7–83, 8–98, 9–115. బౌలింగ్: స్టార్క్ 4–0–32–2, మ్యాక్స్‌వెల్ 4–0–24–1, హేజల్‌వుడ్ 4–1–19–2, కమిన్స్ 4–0–17–1, జంపా 4–0–21–2. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (సి) రబడ (బి) నోర్జే 0; వార్నర్ (సి) క్లాసెన్ (బి) రబడ 14; మార్‡్ష (సి) డసెన్ (బి) కేశవ్ మహరాజ్ 11; స్మిత్ (సి) మార్క్రమ్ (బి) నోర్జే 35; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 18; స్టొయినిస్ (నాటౌట్) 24; వేడ్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–4, 2–20, 3–38, 4–80, 5–81. బౌలింగ్: రబడ 4–0–28–1, నోర్జే 4–0–21–2, కేశవ్ మహరాజ్ 4–0–23–1, షమ్సీ 4–0–22–1, ప్రిటోరియస్ 3.4–0–26–0. చదవండి: T20 World Cup Ind Vs Pak: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం: విరాట్ కోహ్లి -
T20 WC Aus Vs SA: ఆసీస్ ఏం చేస్తుందో... దక్షిణాఫ్రికాకు అదే సానుకూలాంశం..
T20 World Cup 2021: ధనాధన్ పోరులో రెండో అంకానికి రంగం సిద్ధం. 16 జట్ల సమరం 12 జట్లకు మారింది. వినోదం మాత్రం అంతకంటే రెట్టింపు కానుంది. టాప్ టీమ్‌ల మధ్య హోరాహోరీకి నేటితో తెర లేవనుండగా, మెగా టోర్నీని గెలుచుకునే లక్ష్యం దిశగా తొలి మ్యాచ్ నుంచే సత్తా చాటాలని జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఒక్కసారి కూడా పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడని రెండు అగ్రశ్రేణి జట్లు ఈ సారైనా కల నెరవేర్చుకునేందుకు శుభారంభంపై దృష్టి పెట్టాయి. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తేల్చుకునేందుకు పదునైన అస్త్రాలతో భారత్ రేపు రంగంలోకి దిగనుంది. నవంబర్ 14న జరిగే ఫైనల్ వరకు మెరుపు ప్రదర్శనలు, విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో ఈ 23 రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే! అబుదాబి: సరిగ్గా ఏడాది క్రితం ఆస్ట్రేలియా గడ్డపై ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా మా వల్ల కాదంటూ ఆ్రస్టేలియా చేతులెత్తేసింది... అక్కడ ఏం జరిగినా మేం మాత్రం షెడ్యూల్ ప్రకారం 2021లో మా దేశంలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ 2021 ఏప్రిల్‌కు వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కోవిడ్ ఉధృత దశకు చేరుతున్న వేళ క్రికెట్ గురించి మాట్లాడే స్థితి లేకపోయింది. పైగా ఐపీఎల్‌కు కరోనా కాటు తగలడంతో రాబోయే ప్రమాదాన్ని ఊహించిన భారత బోర్డు మన దేశంలో మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసింది. చివరకు ఆతిథ్యం మనదే కానీ ఆట మాత్రం విదేశాల్లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 తొలి దశ పోటీలు శుక్రవారంతో ముగియగా, ముందంజ వేసే జట్లేవో ఖరారైపోయింది. ఇప్పుడు ఈ ‘సూపర్–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం. ఆసీస్ ఏం చేస్తుందో! సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టి20 ప్రపంచకప్ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్‌లో ఓపెనర్లు వార్నర్, ఫించ్ పేలవ ఫామ్‌లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్లో మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టొయినిస్‌లను జట్టు నమ్ముకుంది. ఆ జట్టు పేస్ దళం మెరుగ్గానే ఉన్నా... స్పిన్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌లపై జంపా, అగర్ స్థాయి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం. చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు -
వైరల్: ఏంటా వేగం.. బ్యాట్ రెండు ముక్కలైంది
జొహన్నెస్‌బర్గ్: పాకిస్తాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ రనౌట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ అంశంపై చర్చ నడుస్తున్న సమయంలోనే ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే ఈసారి జరగింది వివాదాస్పద అంశం మాత్రం కాదు.. కాసేపు ఫన్నీగా నవ్వుకునే అంశం జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన బంతి దాటికి ప్రొటీస్ బ్యాట్స్‌మన్ బవుమా బ్యాట్ రెండు ముక్కలైంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అష్రఫ్ వేసిన మూడో బంతిని బవుమా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అష్రఫ్ వేసిన బంతి131 కిమీ వేగంతో వచ్చి బ్యాట్‌కు తగలడంతో బ్యాట్ పైభాగం ఊడి కిందపడిపోయింది. దీంతో షాక్‌కు గురవ్వడం బవుమా వంతైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటన చోటుచేసుకున్నప్పుడు బవుమా 31 పరుగుల వద్ద ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. బవుమా 92, డికాక్ 80, వాండర్ డసెన్ 60, మిల్లర్ 50 నాటౌట్ రాణించారు. అనంతరం 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 193 పరుగులు అసాధారణ ఇన్నింగ్స్‌తో పాక్ మ్యాచ్‌ను గెలిచేలా కనిపించింది. అయితే వివాదాస్సద రనౌట్‌తో జమాన్ వెనుదిరగడంతో పాక్ ఓటమి ఖరారైంది. చదవండి: అతను మీ గన్‌డెత్ బౌలర్ కాకపోవచ్చు.. కానీ Just wao Faheem breaking bat of temba bavuma#PakvRSA pic.twitter.com/wxveHTnphX — Haseeb ur rehman (Advocate) (@Haseebu67038988) April 4, 2021 -
నవ్వు ఆపుకోలేక పోయిన కోహ్లి
రాంచి : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టుకు ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటికే పేవలమైన ఆటతీరుతో రెండు టెస్టుల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకున్న సఫారీ జట్టుకు టాస్ కూడా కలిసి రావడం లేదు. రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా భారీ విజయాలు సొంతం చేసుకుంది. మరోవైపు డుప్లెసిస్ వరుసగా ఆరుసార్లు టాస్ ఓడి పోయాడు. దీంతో టాస్ గెలిస్తే మూడో టెస్టులో బ్యాటింగ్ చేపడతామని డుప్లెసిస్ గురువారమే స్పష్టం చేశాడు. అయితే, ప్రోక్సీ కెప్టెన్‌గా సఫారీ జట్టులోని మరొక ఆటగాడు టాస్ చెబుతాడని వెల్లడించాడు. కానీ, అతని ఆశలు ఆవిరయ్యాయి. మూడో టెస్టులో భాగంగా కోహ్లియే మరోసారి టాస్ నెగ్గాడు. ప్రోక్సీ కెప్టెన్‌గా వచ్చిన టెంబె బవుమా కూడా టాస్ విషయంలో తమ జట్టు అదృష్టాన్ని మార్చలేక పోయాడు. కోహ్లి టాస్ వేయగా.. బవుమా టేల్స్ ఎంచుకున్నాడు. దీంతో కాయిన్ కాస్తా హెడ్స్ పడటంతో టీమిండియా టాస్ గెలిచింది. ఇక అక్కడ నుంచి వెళ్లిపోతున్న బవుమా భుజం తట్టిన కోహ్లి ఓ చిరునవ్వు నవ్వాడు. కామెంటేటర్ మురళీ కార్తీక్‌తో మాట్లాడుతూ.. సౌతాఫ్రికా ఈసారైనా టాస్ గెలవాలనే ప్రయత్నం గుర్తుకు వచ్చి.. ‘హో మ్యాన్’ అంటూ కోహ్లి నవ్వు ఆపుకోలేక పోయాడు. టీమిండియా బ్యాటింగ్ చేపడుతున్నట్టు ప్రకటించాడు. ‘మరో మాట లేకుండా విరాట్ బ్యాటింగ్ ఎంచుకుంటాడు కదా..!’ అని బీసీసీఐ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. Virat Kohli called it a no-brainer to bat first at the Toss #TeamIndia #INDvSA @Paytm 🇮🇳🇮🇳 pic.twitter.com/3V4fKvcVWr — BCCI (@BCCI) October 19, 2019 -
ఈ రనౌట్.. మ్యాచ్‌కే హైలెట్!
-
ఈ రనౌట్.. మ్యాచ్‌కే హైలైట్!
పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ వాకా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు బావుమా అద్భుతమైన డైవ్‌తో చేసిన రనౌట్ మ్యాచ్ కే హైలైట్. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగు కోసం యత్నించిన సమయంలో బావుమా బౌలర్ ఎండ్ నుంచి పరుగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. అంతే వేగంగా బంతిని సూటిగా వికెట్లవైపు విసిరాడు. దాంతో బెయిల్స్ కిందపడటం, వార్నర్ అవుట్ కావడం చకచకా జరిగిపోయాయి. తొలుత వార్నర్ సులువుగా క్రీజ్‌లోకి వెళతాడని భావించినా.. రెప్పపాటులో బావుమా చేసిన రనౌట్ తో వార్నర్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే ఆ రనౌట్ చేయడానికి పట్టిన సమయం 0.264 సెకండ్లుగా నమోదు కావడంతో, కాసేపు తమ దేశ మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ను బావుమా జ్ఞప్తికి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 177 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా విఫలమై ఓటమి పాలైంది. ఉస్మాన్ ఖవాజా(97), నేవిల్(60 నాటౌట్)రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.