Unemployed
-
ఆరు కేటగిరీల్లో యువ వికాసం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడింటికి బ్యాంకు రుణాన్ని అనుసంధానం చేస్తారు. cఈ పథకం పూర్తిస్థాయి మార్గదర్శకాలను మంగళవారం ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఈ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హతలివే.. – గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ(మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ) ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు అర్హులు. – దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్‌కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి. – వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. – వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. – ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత (ఐదేళ్ల సమయంలో స్వయం ఉపాధి పథకాలకు) ప్రాధాన్యతలు: మొదటిసారి ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్ఎస్)కు దరఖాస్తు చేసుకునేవారికి, మహిళలకు 25 శాతం (ఒంటరి మహిళ, వితంతువులకు ప్రాధాన్యం), వికలాంగులకు 5 శాతం, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు, నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం. కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా సంబంధిత యూనిట్లైతే), పట్టాదారు పాసుపుస్తకం (వ్యవసాయ అనుబంధ పథకాలకు), సదెరమ్ సర్టిఫికెట్ (వికలాంగ కేటగిరీ), పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్, అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ (మండల స్థాయి కమిటీ). దరఖాస్తు విధానం.. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (ఓబీఎంఎంఎస్) వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ఫారం భర్తీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్తో పాటు అప్లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి. మండల స్థాయిలో.. వచ్చిన దరఖాస్తులను మండలస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేకాధికారి, మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో... జిల్లా స్థాయిలో ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్డీఏ పీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనార్టీ సంక్షేమాధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఉంటారు. – నిర్దేశించిన తేదీల్లో మండల, జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. అర్హులను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రికి కలెక్టర్ సమర్పించాలి. – ఎంపికైన లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాయితీ నిధులు లబ్ధిదారుకు కాకుండా సదరు సంస్థ, ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకు ఇస్తారు. – స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలి. – యూనిట్లు గ్రౌడింగ్ అయిన తర్వాత కూడా వాటిని విధిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకుని తనిఖీలు చేపట్టాలి.ఎంపిక ప్రక్రియ ఇలా.. – ఆన్లైన్ రిజి్రస్టేషన్ ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. – ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీ లించి అర్హులను ఎంపిక చేసి, ఆయా జాబితాలను జిల్లా కమిటీలకు సమర్పించాలి. – మే 21 – 31 తేదీల మధ్యలో జిల్లా కమిటీలు ఆయా జాబితాలను పరిశీలించి మంజూరీలు చేపట్టాలి – జూన్ 2 నుంచి 9 తేదీల మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించాలి. -
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో కూటమి సర్కారు డ్రామాలు
-
ఖాళీలు 2.. దరఖాస్తులు 1,200..
ఢిల్లీ: యువ భారత శక్తి సామర్థ్యాలు ఆధునిక పారిశ్రామిక, సేవారంగాల వాస్తవిక అవసరాలను అనుగుణంగా లేవన్న చేదు నిజం మరోసారి నిరూపితమైన ఘటన ఇది. సరైన విద్యార్హతలున్నాసరే ఖాళీలకు మించి నిరుద్యోగులు భారత్‌లో పోగుబడుతున్నారని టెక్నాలజీ సంస్థ అయిన ఆన్మ్యాన్డ్ డైనమిక్స్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, సీఈఓ శ్రీనాథ్ మల్లికార్జునన్ వ్యాఖ్యానించారు. అందుకు తన సంస్థకు వెల్లువెత్తిన ఉద్యోగ దరఖాస్తులను ఆయన సాక్ష్యంగా చూపారు.తాజాగా శ్రీనాథ్..‘భారత్‌లోని మా కార్యాలయంలో ఇంటర్న్‌షిప్‌ల కోసం కేవలం రెండు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేసేందుకు తగు అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరాం. ఊహించనంతగా ఏకంగా 1,200 దరఖాస్తులు వచ్చాయి. రెండు ఉద్యోగాలకు 1,200 అప్లికేషన్లు అందుకోవడమంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తిష్టవేసిందో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. ఈ 1,200 దరఖాస్తులను పూర్తిగా వడబోసి మేం చివరకు అత్యంత నైపుణ్యవంతులైన అభ్యర్థులకు చెందిన కేవలం 20 దరఖాస్తులను మాత్రమే ఉద్యోగాల కోసం పరిశీలిస్తాం’ అని తన లింక్డ్ఇన్ ఖాతాలో శ్రీనాథ్ రాసుకొచ్చారు. ఉద్యోగ విపణిలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిలో చేరేంత సత్తాను సాధించడంతో నేటి యువత వెనకబడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగ వేటలో యువ భారతం ఎందుకు విఫలమవుతోందో ఆయన కొన్ని కారణాలను విశ్లేషించారు.కారణాలు ఇవే..జేఈఈ పరీక్ష రాసి ఐఐటీల్లో చదువులు పూర్తిచేసుకున్న చాలా మంది తర్వాతి ఉన్నత విద్య చదివేందుకు ఆసక్తి చూపట్లేదు.ఐఐటీల్లో చదివినా వీరిలోనూ నేటి పరిశ్రమలు, సేవారంగాల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు కొరవడుతున్నాయి.ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో సమర్థవంతమైన విద్య లభించట్లేదు.నాలుగేళ్ల డిగ్రీలు పూర్తిచేస్తున్నా వారిలో అభ్యసన సామర్థ్యం వంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ పాళ్లు తగ్గుతున్నాయి.కాలం చెల్లిన సిలబస్, కఠిన స్థాయి తగ్గిన పరీక్షలు, పూర్తి సమర్థత లేని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది మరో కారణం.ఎక్కువ మంది విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి కేవలం కాల్ సెంటర్లు, క్లర్క్ వంటి బ్యాక్ ఆఫీస్ క్లరికల్ ఉద్యోగాలకే పరిమితం అవుతోంది.కృత్రిమ మేథ(ఏఐ) విజృంభిస్తుండటంతో ఇలాంటి ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో కనుమరుగు అవుతాయి.శ్రీనాథ్ ఇస్తున్న సూచనలు..కాలేజీ విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ సిలబస్‌ను క్షుణ్ణంగా చదవండి.మీ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెరి్నంగ్(ఎన్పీటీఈఎల్) కోర్సులనూ చదవండిసొంతంగా చిన్నపాటి ప్రాజెక్టులను మీరే ప్రయత్నించండి. ఇందుకోసం ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోండి. సమయం వృథా చేయకండి.స్పందించిన నిపుణులు..శ్రీనాథ్ పోస్ట్‌పై పలు రంగాల నిపుణులు స్పందించారు. సర్టిఫికెట్లను సాధించడం కంటే నైపుణ్యాలను సాధించడంపై యువత దృష్టిపెట్టాలని వాళ్లు వ్యాఖ్యానించారు. వృత్తివిద్యా కోర్సులను విస్తృత స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడుల వరద మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు ఆధునిక కోర్సులను నేర్చుకుంటూ సన్నద్ధం కావాలని మరో నిపుణుడు అన్నారు. అంకుర సంస్థల వంటివి తాత్కాలికంగా ఉపాధి కల్పించినా అది శాశ్వత పరిష్కారం చూపలేవని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. -
రోడ్డెక్కిన డీఎస్సీ అభ్యర్థులు
-
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్‌కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్‌కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పార్ట్ టైమ్ చీటింగ్!
పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని లక్ష్యంగా చేసుకుంటూ నిండాముంచుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు.. పార్ట్‌టైమ్ జాబ్ అయినా మంచి జీతం వస్తుందని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నారు.రామగిరి మండలం గరిమేకపల్లికి చెందిన 29 ఏళ్ల నిరుద్యోగి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘పార్ట్‌టైమ్ ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం పదే పదే నగదు చెల్లింపులు చేస్తూ మొత్తం రూ.80 వేలు కోల్పోయాడు. నెల రోజులుగా ఈ తతంగం జరుగుతూనే ఉంది. అప్రూవల్ వస్తుందని.. రిజి్రస్టేషన్, వెరిఫికేషన్.. ఇలా పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఉద్యోగం మాత్రం రాలేదు. తర్వాత అంతకు ముందు టచ్‌లోకి వచ్చిన సెల్‌ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ వచ్చాయి. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.ధర్మవరం మండలం రేగాటిపల్లికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఇంటి వద్దనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగం వెతుకుతూ.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం రెండు నెలల పాటు నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని మరో రూ.50 వేలు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు.సాక్షి, పుట్టపర్తి: కష్టపడకుండా డబ్బులు రావు. అలా వచ్చినా నిలబడవు.. ఈ విషయం తెలియక చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని గూగుల్ లింక్ క్లిక్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నమ్మిస్తూ వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో లెక్క లేనన్ని లింక్‌లు నిత్యం వస్తుంటాయి. ఏ ఒక్క లింక్ క్లిక్ చేసినా.. ఆ తర్వాత ఫోన్ మన చేతిలో ఉన్నా.. ఆపరేటింగ్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు, ఫోన్ పే, గూగుల్ పే తదితర నగదు లావాదేవీల యాప్‌ల ద్వారా నగదు కాజేస్తున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో చోట సైబర్ నేరం బయట పడుతున్నా.. బలి అవుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాలను వినియోగించడం తెలీక కొందరు బలి అవుతుండగా.. డబ్బుపై అత్యాశతో ఇంకొందరు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ఆఖరికి కేటుగాళ్ల బారిన పడిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారిలో కూడా కొందరు బయటికి చెప్పకుండా నష్టపోయినట్లు తెలుసుకుని మౌనంగా ఉండిపోతున్నారు. అప్రమత్తత అవసరం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ లింక్‌లను క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జ్ ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – వి.రత్న, ఎస్పీ, సత్యసాయి జిల్లా -
‘డీట్’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్ పోర్టల్/ యాప్ ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది. ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్’లో లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్ ద్వారా జరుగుతుంది.రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా.. ⇒ నిరుద్యోగులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డీట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.⇒ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.⇒ యాప్‌లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. -
ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలకు మొండిచేయి. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులకు కేటాయింపులు నిల్
-
నిస్తేజంలో ఏపీపీఎస్సీ.. నైరాశ్యంలో అభ్యర్థులు!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. సీఎం చంద్రబాబు తన రాజయకీయాలకు నిరుద్యోగ యువతను బలిచేస్తున్నారు. బాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరర్ధకంగా మారిపోయింది. కమిషన్‌కు చైర్మన్ కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణ, ఎంపికలు గందరగోళంలో పడ్డాయి. గతంలోనే ప్రకటించిన నోటిఫికేషన్లకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో తెలియక నిరుద్యోగులు అందోళనకు గురవుతున్నారు.మరోపక్క ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా.. అదీ చేయడం లేదు. లక్షల్లో ఉద్యోగాలిస్తాం, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని సీఎం, మంత్రుల ప్రకటనలే తప్ప ఒక్క ఉద్యోగమూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలపైనా స్పష్టత ఇవ్వడంలేదు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న శిక్షణ సంస్థలు ‘వచ్చే నెలలో పరీక్షలు.. స్పెషల్ బ్యాచ్ శిక్షణ’ పేరుతో నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా చైర్మన్ పదవి ఖాళీసర్విస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షల తేదీల ప్రకటన, పోస్టింగ్స్.. ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే, ఈ ఏడాది జూన్‌లో అధికారంలోకి వచి్చన వెంటనే కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సర్విస్ కమిషన్ చైర్మన్‌పై కుట్రకు తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్‌పైన, సభ్యులపైన వేధింపులకు దిగి, చివరికి తొలగించింది. నిబంధనల ప్రకారం సర్విస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా, లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి.కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలలుగా చైర్మన్‌ను నియమించకుండా కమిషన్‌ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికారవర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచి్చన 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్–1, 2 పోస్టులకు నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేశారు. దీంతో 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి బాబు సర్కారుకేదీ? వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీపీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆ చిత్తశుద్ధి ప్రస్తుత చంద్రబాబు సర్కారులో కనిపించడంలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్విస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి, ఉద్యోగాల భర్తీ పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లోను 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. బాబు ప్రభుత్వం వచ్చాక ఉన్న చైర్మన్‌ను కుట్రపూరితంగా తొలగించడమే కాకుండా, కొత్త చైర్మన్‌ను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలతో అభ్యర్థుల భవిష్యత్‌తో ఆటలుగతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఇందులో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా, వాయిదా వేశారు.ఈ నెలలో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ కూడా వాయిదా వేశారు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అంతే. ఈ మూడు పరీక్షల మెయిన్స్‌కు అర్హత సాధించిన దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయాయి. వీటితోపాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ఆయుష్ విభాగంలో హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు జూలైలనే సరి్టఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినా, చైర్మన్ లేకపోవడంతో ఇప్పటికీ నియామకపత్రాలు ఇవ్వలేదు. -
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి‘‘ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు సీఎం రేవంత్ కీలక సందేశం
-
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగులపై లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ లైబ్రరీలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లాఠీ చార్జ్ ప్రయోగించారు.కాగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, గ్రూప్-2, డీఎస్సీ డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు యత్నించగా.. పోలీసులు లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. లైబ్రరీలోనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలి
గజ్వేల్: మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 40 వేల క్యుసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ప్రభుత్వం పంతాలను మానుకొని నీటిని ఎత్తి పోయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బోనాల పండుగలో పాల్గొని కౌన్సిలర్ గుంటుకు శిరీష తెచ్చిన బోనమెత్తుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమయంలో రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగు అవసరాలకు గోదావరి జలాలను అందించాల్సిన అవసరముందని అన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా కూడా నదిలో ఉన్న ప్రవాహానికి అనుగుణంగా దాదాపుగా నాలుగు పంపులను నడిపి నీటిని ఎత్తిపోసే అవకాశముందని చెప్పారు. మేడిగడ్డ నుంచి సుందిల్ల, అన్నారం, మిడ్‌మానేరు, అనంతగిరి రిజర్వాయర్ల మీదుగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీటిని నింపాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలను మానుకోవాలన్నారు.నిరుద్యోగులను రెచ్చగొడతారా?వారి సమస్యలను పట్టించుకోరా? సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్ రావు విమర్శించారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చమని గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తీనోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదని, నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరని హరీశ్ అభిప్రాయపడ్డారు. కంచెలు, ఆంక్షలు విధించి నిరుద్యోగుల గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో హరీశ్ స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహా్వనించాలని కోరారు. నాడు వైఎస్ చేసినట్టుగా చేయండి.. హరీశ్ ఏడు ప్రధాన డిమాండ్లను ఆ లేఖలో ప్రస్తావించారు. గ్రూప్1లో 1:100 నిష్పత్తితో అభ్యర్థులను అనుమతించాలని, గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్2 నోటిఫికేషన్‌ను సవరించి 1:100కు మార్చారని తెలిపారు. గ్రూప్2 ,గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, 25వేలతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. -
త్వరలో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం ‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు. -
TGPSC వద్ద హైటెన్షన్
-
నిరుద్యోగ భారత్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగిత శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. గత మే నెలలో 6.3 శాతం ఉండగా, జూన్ నాటికి 9.2 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత శాతంగా అధికంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో డిమాండ్ తగ్గడంతో అక్కడ పనులు చేసుకునేవారిలో నిరుద్యోగం పెరిగింది.అదే సమయంలో ఆర్థిక రంగం దిగజారడం, ఇతర అంశాల కారణంగా పట్టణాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గడంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగశాతం 6.3 ఉండగా, జూన్‌లో 9.3కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూస్తే...మే నెలలో 8.6 ఉండగా, జూన్ నాటికి 8.9 శాతానికి పెరిగింది. ⇒ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా రెండుచోట్లా మహిళల్లోనే నిరుద్యోగమనేది ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ⇒ దేశవ్యాప్తంగా మహిళల విషయానికొస్తే... పట్టణ ప్రాంతాల్లో 21.36, గ్రామీణ ప్రాంతాల్లో 17.1 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ⇒ పురుషుల విషయంలో నిరుద్యోగిత శాతం పట్టణ ప్రాంతాల్లో 8.9, గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతంగా ఉంది. ⇒ 2023 జూన్‌లో నిరుగ్యోగ శాతం 8.5 ఉండగా, ఈ ఏడాది ఇదే సమయానికి 9.2 శాతానికి పెరిగింది. ⇒ కన్జూమర్ పిరమిడ్స్ హోస్‌హోల్డ్ సర్వేలోని గణాంకాల ప్రాతిపదికగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఆయా వివరాలు వెల్లడించింది.జనవరి–మార్చి మధ్యలో 6.7 శాతం... పీఎల్ఎఫ్ఎస్ సర్వేదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యలో 6.7గా నిరుద్యోగశాతం ఉన్నట్టుగా పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) పేర్కొంది. 2013లో 5.42 శాతమున్న నిరుద్యోగ శాతం, కరోనా పరిస్థితుల కారణంగా 2020లో 8 శాతానికి, ఆ తర్వాత 2021లో 5.98 శాతానికి తగ్గి, 2022లో 7.33 శాతానికి, 2023లో 8.4 శాతానికి, 2024లో తొలి ఆరునెలల్లో 6.7 శాతానికి (జూన్‌లో 9.2 శాతానికి) చేరుకున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.15–29 ఏజ్ గ్రూప్ నిరుద్యోగంలో మూడోప్లేస్ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక నిరుద్యోగ శాతమున్న రాష్ట్రంగా కేరళ నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఈ ఏజ్ గ్రూప్ నిరుద్యోగుల్లో టాప్‌ఫైవ్ రాష్ట్రాలు కేరళ 31.8 శాతం, జమ్మూ,కశ్మీర్ 28.2, తెలంగాణ 26.1, రాజస్థాన్న్ 24, ఒడిశాలో 23.3 శాతం ఉన్నట్టు వెల్లడైంది.దేశవ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌లో మొత్తంగా నిరుద్యోగిత శాతం జనవరి–మార్చి మధ్యలో 17 శాతంగా (అంతకు ముందు అక్టోబర్–డిసెంబర్ల మధ్యలో పోల్చితే 16.5 శాతం నుంచి) ఉంది. ఇక ఏజ్ గ్రూపుల వారీగా చూస్తే (అన్ని వయసుల వారిలో నిరుద్యోగ శాతం) నిరుద్యోగిత శాతం 6.7 శాతంగా ఉంది.నిరుద్యోగానికి ప్రధాన కారణాలు...⇒ అధిక జనాభా⇒ తక్కువ స్థాయిలో చదువు, నైపుణ్యాల కొరత (ఒకేషనల్ స్కిల్స్)⇒ప్రైవేట్‌రంగ పెట్టుబడులు తగ్గిపోవడం⇒వ్యవసాయరంగంలో తక్కువ ఉత్పాదకత ⇒చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం కొరవడటం⇒మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిరంగాల్లో పురోగతి సరిగ్గా లేకపోవడం⇒అనియత రంగం (ఇన్ఫార్మల్ సెక్టార్) ఆధిపత్యం⇒ కాలేజీల్లో చదివే చదువు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరం పెరగడంమహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ఈ ఏడాది జనవరి–మార్చి నెలల మధ్యలో వివిధ వయసుల వారీగా నిరుద్యోగిత శాతంపై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేçషన్ (ఎంఎస్‌పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఇవి వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళల్లో అత్యధిక నిరుద్యోగుల శాతంలో తెలంగాణ 38.4 శాతంతో నాలుగో స్థానంలో నిలిచినట్టు ఈ సర్వే వెల్లడించింది. మహిళల్లో అత్యధికంగా నిరుద్యోగులు అంటే 48.6 శాతంతో జమ్మూ కశ్మీర్ మొదటిస్థానంలో నిలవగా...కేరళ 46.6 శాతంతో రెండోస్థానంలో, ఉత్తరాఖండ్ 39.4 శాతంతో మూడోస్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 35.9 శాతంతో ఐదో స్థానంలో నిలిచాయి. ⇒ పురుషుల్లో అత్యధిక నిరుద్యోగిత శాతమున్న రాష్ట్రంగా 24.3 శాతంతో కేరళ మొదటి స్థానంలో, బిహార్ 21.2 శాతంతో రెండోస్థానం, ఒడిశా, రాజస్తాన్‌లు 20.6 శాతంతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 19.6 శాతంతో నాలుగోస్థానంలో నిలిచాయి.ఏ అంశాల ప్రాతిపదికన...⇒16 ఏళ్లు పైబడినవారు పరిగణనలోకి⇒ నెలలో నాలుగువారాలపాటు పనిచేసేందుకు అందుబాటులో ఉండేవారు⇒ఈ కాలంలో ఉపాధి కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారు⇒ ఉపాధి కోల్పోయి మళ్లీ పనికోసం చురుగ్గా వెతుకుతున్నవారు.నిరుద్యోగుల శాతం లెక్కింపు ఇలా...నిరుద్యోగిత శాతం = నిరుద్యోగుల సంఖ్య/ఉద్యోగులు, ఉపాధి పొందిన సంఖ్య + నిరుద్యోగుల సంఖ్య -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
జాబ్ కేలండర్ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి, గెలిచిన తరువాత వారిని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. గురువారం ఆయనను పలువురు నిరుద్యోగులు కలిసి తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వారి పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు జాబ్ కేలెండర్ పేరుతో పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, దాదాపు 10 పరీక్షలకు సంబంధించి తేదీలతో సహా నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. అయి తే వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. జాబ్ కేలెండర్ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. గ్రూప్–1కు సంబంధించి తమ ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్‌కు కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే కలిపారని పేర్కొన్నారు. ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదని, అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. గ్రూప్– 1 మెయిన్స్‌కు సంబంధించి 1:100 ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రస్తుత డిప్యూటీ సీఎం గతంలో డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయడంలేదని ప్రశ్నించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాబ్ కేలెండర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో.. వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
కాళ్ల మీద పడినా కనికరించడం లేదు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రజా దర్బార్‌లో కాంగ్రెస్ నేతల కాళ్ల మీద పడుతున్నా కనికరించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పుతోందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో సోమవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు కొత్త హామీలు కోరుకోవడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ముందు తాము పెడుతున్న ఐదు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి మరో ఐదు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. టీజీపీఎస్సీతో పాటు డీఎస్సీ పరీక్షలకు నడుమ కనీసం రెండు నెలల వ్యవధి ఉండేలా చూడాలన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామనే హామీ నిలబెట్టుకోవాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘నీట్’పై కేంద్ర మంత్రులు స్పందించాలి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, నీట్ పరీక్ష విధానం, గ్రేస్ మార్కులు ఇవ్వడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని హరీశ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను.. పార్టీ మారను తాను పార్టీ మారుతున్నట్లు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. వ్యూస్ పెంచుకునేందుకు ఒక నాయకుడి నిబద్ధత, నిజాయతీ దెబ్బతీయొద్దు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను, పార్టీలోనే కొనసాగుతాను. ఇలాంటి వార్తలు మానుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తా అని హరీశ్‌రావు హెచ్చరించారు. -
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల
సాక్షి, అమరావతి: ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’.. ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ చీల్చిచెండాడారు. ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్ జగన్ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది. ⇒ టెన్త్, ఇంటర్ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది. ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని షరతులు విధించింది. ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది. ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది. ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది. ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు. -
ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్‌గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్‌రావు తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు -
అంతా సిద్ధమే.. అయినా ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ దిశగా ముందడుగు పడటం లేదని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని, వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ వేసినా.. టీచర్ల పదోన్నతులు, బదిలీలు, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తుచేస్తున్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించడం సంతోషకరమని.. కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, ఆటంకాలను తొలగించడంపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని, ఆలోగానే భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. నాలుగు లక్షల మందికిపైగా.. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తి చేసి, టెట్ కూడా పాసైన వారు సుమారు 4 లక్షల మందికిపైగా ఉన్నారు. వారంతా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఏళ్లకేళ్లుగా డీఎస్సీ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామనడం, ఇటీవల సీఎం రెండుసార్లు టీచర్ పోస్టుల భర్తీపై సమీక్షించినా.. నోటిఫికేషన్ జారీ దిశగా ప్రక్రియ ఏదీ మొదలవకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరిగిందని, ఖాళీల గుర్తింపు, ఇతర అంశాలపై కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వేసినా ఆగిపోయి.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించారు. తర్వాత ఆ ఊసే లేదు. గత ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా.. 5,089 పోస్టులే ఉన్నాయి. ఆరేళ్ల తర్వాత డీఎస్సీ వేశారని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. కొత్త రోస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకుండాపోయాయని నిరాశ వ్యక్తం చేశారు. దీనికితోడు పదోన్నతులు, బదిలీల సమస్యలతో డీఎస్సీ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రులు, అధికారులకు అభ్యర్థులు వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. సీఎం కూడా టీచర్ పోస్టుల భర్తీపై రెండు సార్లు అధికారులతో సమీక్షించి.. సమగ్ర నివేదిక కోరారు. అధికారులు లెక్కలన్నీ తేల్చి.. పదోన్నతుల ద్వారా కొన్ని, నేరుగా జరిగే నియామకాల మరికొన్ని.. కలిసి 21వేల టీచర్ పోస్టుల భర్తీ అవసరమని నివేదించారు. సీఎం రేవంత్ కూడా మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు మానుకుని మరీ డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుకున్నస్థాయిలో వేగం కనిపించడం లేదని.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్లీ మొదటికి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం డీఎస్సీ కోసం రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం, సీఎం రివ్యూ చేయడంతో ఆశలు నెరవేరుతున్నాయన్న ఆనందం కనిపించింది. కానీ నోటిఫికేషన్ దిశగా అడుగు ముందుకు పడకపోతుండటంపై నిరుద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. – రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్. బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బదిలీలు, పదోన్నతులతో లింకు పూర్తిస్థాయిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడితే తప్ప వాస్తవ ఖాళీలను నిర్థారించలేమని విద్యాశాఖ అధికారులే చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు 13వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతుల ద్వారా మరో 8 వేల వరకు పోస్టులు ఖాళీ అవుతాయని అంటున్నారు. మరోవైపు పదోన్నతుల విషయంలో పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలంటూ.. 2012 తర్వాత నియమితులైన టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేంద్ర నిబంధనలను పరిశీలించి.. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని తేల్చింది. గత ఏడాది చేపట్టిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 80వేల మంది టీచర్లు ‘టెట్’రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మారిన సిలబస్ నేపథ్యంలో కొత్త అభ్యర్థులతో సమానంగా పాత టీచర్లు టెట్ రాయడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ‘టెట్’నిర్వహణ, టీచర్ల బదిలీల విషయంలో ఇది చిక్కుముడిగా మారింది. మరోవైపు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అవసరం. వీటన్నింటితో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అన్ని అడ్డంకులను ఛేదించుకుని లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ రావడం కష్టమేనని అంటున్నాయి. టీచర్లకు టెట్ నిర్వహించాలి టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి. ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న టీచర్లకు ఈ పరీక్షను అంతర్గత పరీక్షలా నిర్వహించాలి. ఇది ఎంత త్వరగా చేపడితే అంత మంచిది. ఇప్పటికే స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. నిర్వహణ పోస్టులైన డీఈవో, ఎంఈవోల పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ప్రతి గెలుపులో పాఠాలుంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని.. ఆ గుణపాఠాలు నేర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చామని, నిరుద్యోగులకు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. కానీ సరైన విధంగా ప్రచారం చేసుకోలేకపోయామని పేర్కొన్నారు. ‘నిజం గడప దాటే లోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంద’న్న సామెత నిజమైందని.. కాంగ్రెస్ అబద్ధాలు, అలవి గాని హామీలను ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే నివారించలేకపోయామని, దానితోనూ కొంత నష్టం జరిగిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ‘స్వేద పత్రం’ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేవలం 1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయామని.. ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల తేడాతో కోల్పోయామని చెప్పారు. ఇది ఘోర పరాజయం కాదని, ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. మీరు విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. వందరోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మొన్ననే నాలుక మడతేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా.. ఉప ముఖ్యమంత్రి తాము ఆమాటే అనలేద న్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆరు గ్యారంటీలు కాదు. 142 హామీలున్నాయి. వాటిని లెక్కతీశాం. మా పార్టీ తరఫున శాఖల వారీగా షాడో టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో వాటిని షాడో కేబినెట్ అంటారు. అలాంటిదే మా లెజి స్లేచర్లో ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతిరంగంలో సర్కారు పనితీరు.. వారు ఏం చేస్తున్నారు? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? తదితర అంశాలన్నింటినీ నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం..’’ అని కేటీఆర్ చెప్పారు. దీప స్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వబోమని, పడిపోనివ్వబోమని పేర్కొన్నారు. ఏ విచారణకైనా మేం సిద్ధం రాజకీయాల్లో పోటీకి వెళ్లిన ప్రతిసారీ గెలుస్తామనే ఆశిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడుతామని, ప్రతి అంశంపై రివ్యూ చేస్తామని చెప్పారు. ‘‘అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా? కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా? అనేది వారి విజ్ఞత. ఏ విచారణ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కావాలంటే విచారణ చేయాలని మేమే సభలో డిమాండ్ చేశాం. అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువత విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని.. అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా ఉందని చెప్పారు. తమ తరఫున చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగాయని.. సవరించుకొని ముందుకెళ్తామని వివరించారు. ఉద్యోగుల జీతాల విషయంలో కరోనా ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతే కొంత ఇబ్బంది వచ్చిందని.. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఊహించని వాళ్లు ఓడిపోయారు! మీడియాతో లంచ్ సందర్భంగా కూడా కేటీఆర్ పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు. ‘‘ప్రజల తీర్పును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత చేసినా ఎలా ఓడిపోయాం? ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోవాలి, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉండాలని ప్రజలు ఓట్లేసినట్టు చెపుతున్నారు. కోనేరు కోనప్ప, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, సింగిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటారా? వారికి రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా.. ఓసారి వీళ్లకు ఇద్దామని ప్రజలు భావించారని అనిపిస్తోంది..’’ అని పేర్కొన్నారు. -
2023 సామాన్యునికి ఏమిచ్చింది?
గడచిన 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్, కరోనా ఆంక్షలు సామాన్యుల వెన్ను విరిచాయి. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే 2022లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. వ్యాపారాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయి. ఆ దశ దాటాక వచ్చిన 2023 సామాన్యులకు ఉపశమనం కలిగించింది. మాల్స్‌లో జనం బారులు దేశంలో జీడీపీ వృద్ధి కూడా ఊహించిన దాని కంటే అధికంగానే ఉంది. 2023లో మార్కెట్లలో మంచి ఆర్థికవృద్ధి కనిపించింది. రెస్టారెంట్లు జనాలతో నిండిపోయాయి. మార్కెట్లు, మాల్స్‌లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఇది జీడీపీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.6 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల అద్భుతమైన పనితీరు కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా ఉంది ఉంది. రూ. 200 దాటిన టమాటా వ్యవసాయం పరంగా కూడా ఈ ఏడాది బాగానే ఫలితాలు వచ్చాయి. బియ్యం, ఇతర ధాన్యాల ఉత్పత్తి వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. జూలై-ఆగస్టులో టమాటా ధరలు కిలో రూ.200 దాటాయి. దీంతో ప్రభుత్వం టమాటాను రాయితీ ధరలకు విక్రయించాల్సి వచ్చింది. టమోటా తర్వాత ఉల్లి ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. తగ్గిన నిరుద్యోగిత రేటు 2023 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై-సెప్టెంబర్ 2023లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.6 శాతంగా ఉంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా నమోదైంది. అదే సమయంలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం ఉపాధి రంగంలో మిశ్రమ సంవత్సరంగా నిలిచింది. ఇది కూడా చదవండి: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
AP: భారీగా పెరిగిన ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఏటా పెరుగుతున్న కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలే ఇందుకు నిదర్శనం. 2018–19తో పోలిస్తే 2022–23లో రాష్ట్రంలో ఈపీఎఫ్ ఖాతాలు 35 శాతం మేర పెరిగినట్టు ఇటీవల రాజ్యసభలో కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వం ఉండగా 2018–19లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలు ఉండేవి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరోపక్క ప్రైవేటు రంగంలోనూ ఉపాధి పెరిగేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. దీంతో 2020–21లో రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాల సంఖ్య 52.39 లక్షలకు పెరిగింది. అంతే సుమారు 5.5 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. 2021–22లో వీటి సంఖ్య 56.34 లక్షలకు పెరిగాయి. 2022–23లో 60.73 లక్షలకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో 2018–19లో 22.91 కోట్లుగా ఉన్న పీఎఫ్ ఖాతాలు 2022–23 నాటికి 29.88 కోట్లకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో ఐదేళ్లలో 30.38 శాతం ఖాతాలు పెరిగాయి. ఈ లెక్కన జాతీయ స్థాయి కన్నా రాష్ట్రంలోనే పీఎఫ్ ఖాతాల పెరుగుదల ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో 31 శాతం, కర్ణాటకలో 32 శాతం, తమిళనాడు, పుదుచ్చేరిలో 27 శాతం మేర ఖాతాలు పెరిగాయి. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే, మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో యువతకు ఉద్యోగాలిచ్చారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏకంగా 1,25,110 మంది యువతకు శాశ్వత ఉద్యోగాలిచ్చారు. మరోపక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చారు. ఇలా వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనూ శాశ్వత, కాంట్రాక్టు పద్ధతుల్లో నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదికల్లోనూ వెల్లడైంది. 2018–19లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో 45 మంది, పట్టణాల్లో 73 మంది నిరుద్యోగులు ఉండగా 2022–23లో గ్రామాల్లో 33, పట్టణాల్లో 65కు నిరుద్యోగిత తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. -
లోక్‌సభలో దాడి ఘటన.. పట్టుబడ్డ ఆగంతకుల నేపథ్యం ఇదే..!
లోకసభలోకి ఆరుగురు ఆగంతకులు చొరబడి సృష్టించిన అలజడి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా సరిగ్గా అదే రోజు (2001 డిసెంబర్ 13)22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి యత్నించిన ఉదంతం కళ్లముందు మెదిలింది. అలాంటి ఉగ్రదాడేనా! అని అనుమానాలు లేవెనెత్తాయి. రెండు దశాబ్దాల కిందట జరిగిన దాడే మాయని మచ్చలా చాన్నాళ్లు వెంటాడింది. అది మరువక మునుపే కొత్తగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంటు వద్ద మళ్లీ అలాంటి కల్లోలం అందర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు ప్రాంగణం లేదా బయట వైపు కాకుండా ఏకంగా దిగువసభలోకే ఆగంతకులు చొరబడటం పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యం గురించి అనుమానాలు లేవనెత్తింది . అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్ తీర్చిదిద్దిన విధానం గురించి ఎంతలా ప్రచారం చేశారో కూడా తెలిసిందే. ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది కూడా ఈ ఏడాది మేలోనే, ఇంతలోనే ఈ దాడి అందర్నీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ పార్లమెంట్‌లోకి చొరబడ్డ ఆ ఆగంతకుల్లో కొందరీ బ్యాగ్రౌండ్ మాములగా లేదు. వారి నేపథ్యం విని అధికారులే ఆశ్చర్యపోయారు. ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇలాంటి దారుణానికి ఎందుకు దిగారంటే.. కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవాలని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చిన పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లెవరంటే..? పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విక్కీ శర్మను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో విక్కీ శర్మ ఇంట్లో నే ఉంటున్నట్టు విచారణలో తెలిసింది. ఆగంతకుల బ్యాగ్రౌండ్... పట్టుబడ్డ నిందుతుల్లో నీలమ్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎం.ఫిల్ పూర్తి చేసింది. అలాగే టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించే సెంట్రల్ ఎగ్జామినేషన్‌లో కూడా పాసయ్యింది. కానీ ఉద్యోగం లేదు. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో నీలమ్ తీవ్ర డిప్రెషన్‌కి లోనయ్యినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చదువుకున్నా.. సరైన ఉద్యోగం లేదు రోజుకు రెండుపూట్ల తిండి కూడా తినలేకపోతున్నానని ఆవేదన చెందేదని, తరుచుగా చనిపోతానని ఏడ్చేదని నీలమ్ తల్లి చెబుతోంది. ఆమె సోదరుడు రామ్నివాస్ నీలమ్‌కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె ఎందుకిలా చేసిందనేది కూడా మాకు తెలియదు. తమ బంధువులు ఫోన్ చేసి టీవి చూడమని చెప్పేంత వరకు తమకు దీని గురించి తెలియదని అన్నాడు. నీలమ్ పోటీపరీక్షలకు ప్రీపేర్ అయ్యేందకు హర్యానాలో జింద్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఆమె బీఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. పైగా నెట్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాసయ్యింది. ప్రస్తుతం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు కూడా ప్రిపరవ్వుతుందని ఆమె కుటుంబసభ్యలు చెబుతున్నారు. కాగా నీలమ్ తరచూ నిరసనల్లో నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుండేదని, పైగా మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సమీపంలో ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక మరో నిందితుడు మనోరంజన్(34) మైసూర్‌కి చెందినవాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్. అతడి తండ్రి దేవరాజేగౌడ మాట్లాడుతూ.. తన కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరి తీయాలని అన్నారు. పార్లమెంటు మాది... మహాత్మా గాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకు చాలా మంది ఆ ఆలయాన్ని నిర్మించారు.. నా కొడుకు అయినా ఆ గుడి విషయంలో ఎవరైనా ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదు అని నిందుతుడి తండ్రి పేర్కొనడం గమనార్హం. నీలం అజాద్‌తో కలసి పార్లమెంట్ వెలుపల పొగ గొట్టలు విసిరిన అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ గ్రామానికి చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. పోలీసు, ఆర్మీ రిక్రూట్మెంట్ వంటి పోటీ పరీక్షల్లో చాలా సార్లు విఫలమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అతను పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే లక్నో నివాసి, సాగర్ శర్మ, అతనితో సహా అతని కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. శర్మ జీవనోపాధి కోసం ఇ-రిక్షా కూడా నడుపుతున్నాడు. నిరసనలో పాల్గొనేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీకి వెళతానని చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిగా ఆ నిందితులకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ అతడి భార్య రేఖను కూడా అదుపులో తీసుకున్నారు. విక్కీ ఎగుమతుల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారందరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్ట కింద కేసులు నమోదు చేశారు. ఆ ఆగంతుకులు ఒక్కొకరిది ఒక్కో నేపథ్యం. కానీ వారంతా ఎంతోకొంత చదువుకున్న వారు. సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ఏదీ మంచి ఏదీ చెడు తెలిసిన వివేకవంతులే. కానీ ఇలా తాము ఎదుర్కొన్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో తప్పుడు దోవ ఎంచుకున్నారో లేక మరేవరి ప్రమేయం లేదా ప్రభావం ఉందో తెలియదు గానీ చాలామంది యువత ఇలానే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అన్యాయమైపోయిన వాడు తనలా మరెవరు కాకుడదన్న మనస్తత్వంతో ఉండాలి. తనను నమ్ముకున్నవాళ్లు లేదా తనపై ఆధారపడిన వాళ్ల గురించి అయినా ఆలోచించాలి. ఇలాంటి మార్గంలో మాత్రం పయనించడు. దీన్ని యువత గుర్తించుకోవాలి. మన చుట్టు ఉన్నవాళ్లలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో పెరిగి నెగ్గుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అంతెందుకు మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఎంతటి దారిద్యాన్ని అనుభవించాడో తెలిసిందే. ఆ రోజుల్లోనే అతను అందరికంటే ఉన్నత విద్యాను అభ్యసించాడు అయినా వెనుకబడి కులం వాడన్న ఒక్క కారణంతో హేళనలకు గురిచేశారు. అంటరానివాడని అవమానించారు. కనీసం సాటి మనిషిలా కూడా గౌరవం ఇవ్వకపోయినా తట్టుకుని నిలబడి ఛీత్కారంతో చూసిన వారిచేత శభాష్ అని సలాం కొట్టించుకున్నాడు. ఇలాంటి ఎందరో మహనీయుల మన మాతృభూమికి మంచి పేరుతెచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశానికి యువత ఓ ఆయుధం. వారు దేశాన్ని అభివృద్ధిపథంలోకి నడిపించేలా ఉండాలి కానీ కానీ కళంకంలా ఉండకూడదు. కఠిన పరిస్థితులను తట్టుకుని రాటుదేలి.. మహనీయుడిలా మారాలే కానీ అలజడులు సృష్టించే ఉగ్రవాదులు లేదా నేరస్తులుగా మారకూడదు. (చదవండి: లోక్‌సభకు పొగ) -
యువత కోసమే తొలి అడుగు
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని యువతను ఆదుకోవడమే లక్ష్యంగా తొలిఅడుగు వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహు ల్‌గాంధీ వెల్లడించారు. అక్కడి నిరుద్యోగులు, యువతతో ముచ్చటించిన సందర్భంలో తాను చూసిన, విన్న విషయాలు తీవ్రంగా కలచివేశాయ ని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ అయిన వీడియో ను సోమవారం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ‘నేను ఒకసారి తెలంగాణ యువతతో సమావేశమయ్యాను. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవడం, ఈ లీకేజీల్లో కేసీఆర్ బంధువుల పాత్ర ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులతో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించే దిశలో మేం మొదటి అడుగు వేస్తాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా జాబ్ కేలండర్ ఇప్పటికే విడుదల చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యువ వికాసంలో భాగంగా విద్యాభరోసా కార్డుల ద్వారా విద్యార్థులు.. కళాశాల, యూనివర్సిటీ, కోచింగ్ ఫీజులు కట్టుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తాం. అది తెలంగాణ యువత కోసం మేం వేయబోయే ముందడుగు..’అని ఆ వీడియోలో రాహుల్ చెప్పారు. దొరల సర్కారులో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్‌నగర్‌లో తన తాజా భేటీతో స్పష్టమైందని, తమ పార్టీ ఇచ్చిన జాబ్ కేలండర్ వారికి ఉపశమనం కలిగిస్తుందని, త్వరలో కాంగ్రెస్ నేతృత్వంలో రాబోయే ప్రజల సర్కారులో తెలంగాణ యువత భవితవ్యం పదిలంగా ఉంటుందని, ఇది తన గ్యారంటీ అని పేర్కొన్నారు. నేడు కార్మిక సంఘాలతో భేటీ: చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30–11 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆటో వర్కర్లు, జీహెచ్ఎంసీ, జిగ్ కార్మికుల సంఘాలతో సమావేశమవుతారని, మధ్యాహ్నం 11:30–12:30 గంటల వరకు నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ జహీరాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. -
ఇది కేసీఆర్ సర్కార్ కుట్రపూరిత హత్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత దీనావస్థకు రాష్ట్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలే కారణమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నందున, కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని దుయ్యబట్టారు. ప్రవల్లిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన హత్య అని ధ్వజమెత్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులారా ఆత్మహత్యలొద్దు.. దయచేసి 60 రోజులు ఓపిక పట్టండని కోరారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. ‘అహంకారపూరిత ప్రభుత్వాన్ని గద్దెదించుదాం.. మీరు కలలు కంటున్న తెలంగాణను సాధించుకుందాం’ అని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పరామర్శకు వెళ్లిన ఎంపీ లక్ష్మణ్‌తోపాటు యువతపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. పోటీపరీక్షలు వాయిదా పడటంతో మనస్తాపానికి గురైందని ప్రవల్లిక కుటుంబసభ్యులే చెప్తుంటే...ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కార ణమంటున్న పోలీసులు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదంలోని ‘నియామకాల’ విషయంలో ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ యువత దగాపడిందన్నారు. ఇప్పుడు పోటీ పరీక్షలు, డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపిస్తున్న కల్వకుంట్ల ప్రభుత్వం.. కోడ్ రాకముందు ఏం చేసిందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్–1 పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ తర్వాతే.. ఉద్యోగ నియామకాల్లో కల్వకుంట్ల కుటుంబం చిత్తశుద్ధి ఏపాటితో బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. -
వాస్తవాలపై ‘ఉక్కుపాదం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్ కెరీర్ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అసత్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్సీఎస్ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ సమన్వయంతో 516 జాబ్ మేళాలు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు. -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలను దిగజార్చిన కేసీఆర్
చుంచుపల్లి: ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లా డారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభా లకు గురిచేసి తమ వైపు తిప్పుకునే సంస్కృతి బీఆర్ఎస్లో కొనసాగుతోందని, ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘ఎవడిపాలైందిరో తెలంగాణ’ అనే పాటతో రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిన సోమన్న.. గతంలో ఈ ప్రభుత్వంతో కొట్లాడారని, అలాంటి వ్యక్తి నేడు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాడని, నాయకులను, ప్రజాగాయకుల ను ఎలా లొంగదీసుకుంటున్నారో దీన్ని బట్టే అర్థం అవుతోందని ఈటల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ హయాంలో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి 17 పేపర్లు లీక్ అయ్యాయని, ఫలితంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయని, అవి కూడా అత్యంత కీలకమైన శాఖలని గుర్తుచే శారు. కాగా, బీజేపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్ని కల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దరఖాస్తుల పరిశీ లన జరుగుతోందని ఆయన చెప్పారు. -
నిరుద్యోగులకు వెన్నుపోటు
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. ఇదే ధర్నా చౌక్‌లో ఏళ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే వారికి ఎదురుచూపులే మిగిలాయి. సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగభృతి ఏమైందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వస్తుందేమోనని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే కేసీఆర్ వారికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసుల పేరిట నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. కొన్ని పరీక్షలు నిర్వహించినా ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదో కేసీఆర్ చెప్పాలన్నారు. 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే వారిని గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని, వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తోందని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షను కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీ ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తూ బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన యువకులు నేడు కళ్లు తెరిచారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతరేస్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అన్యాయం జరిగిందనేది. కాబట్టి ఈ రెండు పార్టీలను యువత క్షమించదు. కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఈ ధర్నా చౌక్ నుంచి తెలంగాణ ప్రజలకు చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులు, యువత బీజేపీకి మద్దతు తెలిపాలి..’ అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జమిలి అంటే జంకెందుకు?: బండి జమిలి ఎన్నికలంటే కేసీఆర్ కుటుంబానికి అంత జంకెందుకని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకు పోవడం ఖాయమన్నారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. శ్రీకాంతాచారి, ఇషాంత్ రెడ్డి, సుమన్, పోలీస్ కిష్టయ్యవంటి యువకుల బలిదానాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేదాకా పోరాడుదామని యువతకు సంజయ్ పిలుపునిచ్చారు. నవంబర్‌తో తెలంగాణకు పట్టిన మకిలి వీడుతుంది: తరుణ్‌ఛుగ్ ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువతను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి 1200 మంది యువత ప్రాణాలు కల్వకుంట్ల కుటుంబం బలిగొన్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆంధ్రా పాలకులే ఉద్యోగాలు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్.. తాను అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈ నవంబర్‌తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్..నువ్వు ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి? దళిత బంధు ఏది? ఎందరికి ఇచ్చావు?’ అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు మురళీధర్‌రావు, జి.విజయరామారావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రారెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, డా.జి.మనోహర్‌రెడ్డి, శాంతికుమార్, గీతామూర్తి, గూడూరు నారాయణరెడ్డి, నాగూరావు నామాజీ, బండ కార్తీకరెడ్డి, డా.గౌతంరావు, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రలో మరో భారీ మోసం.. విదేశీ ఉద్యోగాల పేరుతో..
విశాఖపట్నం: స్వీడన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమృత్ ఎంటర్ప్రైజెస్ నిరుద్యోగులకు టోకరా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా కడప తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు సోమవారం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దొండపర్తిలోని టీఎస్ఎన్ కాలనీలో అమృత్ ఎంటర్‌ప్రైజస్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది నమ్మి కార్యాలయానికి ఫోన్ చేసిన వారికి అర్హత గల ఉద్యోగాలు ఇప్పిస్తామని.. అందుకు డబ్బు లు చెల్లించాలని మేనేజర్లు శాంతి, లలిత నమ్మించారు. అలాగే నీరజ్, సౌరభ్ తెరవెనుక ఉండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, కడప, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున రూ.కోటి వరకు ఆన్లైన్లో వసూలు చేశారు. డబ్బులు చెల్లించినట్లు మేనేజర్లు నిరుద్యోగులకు రసీదులతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో కొంతమంది దొండపర్తిలోని అమృత్ ఎంటర్‌ప్రైజెస్‌కు వెళ్లారు. కార్యాలయం మూసివేసి ఉండడంతో.. సంస్థ బోర్డు తిప్పేసినట్లు గ్రహించి ఆందోళనకు గురయ్యారు. దీనిపై బాధితులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఒక్కో పోస్టుకు 61 మంది..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. ప్రభుత్వ టీచర్ పోస్టు దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం 6612 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వాళ్ళున్నారు. డీఎస్సీలో టెట్ అర్హులకు వెయిటేజ్ ఉంటుంది. ఇక కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మొత్తంగా భర్తీ చేసే 6,612 పోస్టులకు దాదాపు 4 లక్షలకుపైగా పోటీ పడే పరిస్థితి కన్పిస్తోంది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకూ 61 మంది పోటీ పడే వీలుందని అంచనా వేస్తున్నారు. మళ్లీ కోచింగ్ హడావుడి.. డీఎస్సీ పరీక్షకు సంబంధించి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రశ్నావళి రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిలబస్ ఏ విధంగా ఉండాలి? ఏ స్థాయిలో పరీక్ష విధానం ఉండాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే... ఇప్పటికే పుట్టగొడుగుల్లా కోచింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు తక్కువ సమయంలో డీఎస్సీ పరీక్షకు శిక్షణ ఇవ్వగల అధ్యాపకులను అన్వేషిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డీఎస్సీ పరీక్ష కోసమే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, వాటికి అనుబంధంగా హాస్టళ్ళూ వెలుస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. స్వల్పకాలిక శిక్షణ కోసం రూ.25వేల నుంచి 1.50 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కేవలం డీఎస్సీ కోసమే నిర్వహించే హాస్టళ్ళు కూడా నెలకు రూ.15వేల నుంచి రూ.30 వేల వరకూ తీసుకుంటున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ ప్రకటన తర్వాత హైదరాబాద్‌లోనే కొత్తగా 178 కోచింగ్ కేంద్రాలు వెలిశాయని టీచర్ పరీక్షల తర్ఫీదు ఇచ్చే అధ్యాపకుడు కృపాకర్ తెలిపారు. నెల రోజుల బోధనకు రూ.2 లక్షల వరకూ టీచర్లకు ఇచ్చేందుకు కోచింగ్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున స్టడీ మెటీరియల్స్ నియామక పరీక్ష విధానం రూపురేఖలు తెలియకపోయినా స్టడీ మెటీరియల్ మాత్రం సిద్ధమవుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షలను కొలమానంగా తీసుకుని స్టడీ మెటీరియల్ రూపొందిస్తున్నారు. ప్రచురణా సంస్థలు ఏకంగా అధ్యాపకులను నియమించుకుని మెటీరియల్స్ రూపొందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పరీక్షలు, బోధన విధానాలు, సైకాలజీతో పాటు సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్స్ రూపొందిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెటీరియల్ ధరలు కూడా ఈసారి ఎక్కువగానే ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 2017లో ఇదే తరహాలో స్టడీ మెటీరియల్స్ వచ్చినా, చాలా వరకూ నాణ్యత లోపం కన్పించిందని సైన్స్ అధ్యాపకుడు నవీన్ చంద్ర తెలిపారు. సీబీఎస్ఈ పుస్తకాలను 1–10 వరకూ క్షుణ్ణంగా చదివితే మంచి మార్కులు సాధించే వీలుందని, అనవరసంగా స్టడీ మెటీరియల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్ల కొరత ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని యువత లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు ప్రత్యేక శిక్షణపై దృష్టి పెట్టారు. దీంతో స్కూళ్ళకు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. ఇది తమకు మంచి అవకాశమని, సెలవు ఇవ్వకపోతే రాజీనామాకు సిద్ధమని యాజమాన్యాలకు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రైవేటు టీచర్లకు వేతనాలు కూడా అరకొరగా ఉంటున్నాయి. ఈ కారణంగా ఉన్నపళంగా ప్రైవేటు టీచర్లు వెళ్ళిపోతున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. ఇక హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లకు యాజమాన్యాలు కొన్ని క్లాసులు తగ్గించి, పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం కల్పిస్తున్నాయి. -
హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..
న్యూఢిల్లీ: మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి కంపెనీ యాజమాన్యం నోరెళ్లబెట్టింది. కంపెనీ హెచ్ఆర్ కావడంతో ఎటువంటి ఉద్యోగం లేని తన భార్యకు తాను పనిచేస్తోన్న కంపెనీ నుండి జీతం వచ్చేలా చేసి పదేళ్లలో నాలుగు కోట్ల కంపెనీ సొమ్మును కొల్లగొట్టారు. ఢిల్లీకి చెందిన మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో మోసం బయటపడటానికి చాలా సమయం పట్టింది. కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నిరుద్యోగియైన తన భార్య పేరును ఎలాగోలా తన కంపెనీ పే రోల్ లో చేర్చాడు. దీంతో ఆమెకు కూడా కంపెనీలోని మిగతా ఉద్యోగుల్లాగానే నెలవారీ జీతం అకౌంట్లో జమయ్యేది. కంపెనీకి వెండర్ కు మధ్య వారధిలా ఉండే హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ పాత్రలో రాధా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ తంతు మొత్తాన్ని జాగ్రత్తగా నడిపించాడు. మొదటగా ఉద్యోగుల జీతభత్యాల వివరాల్లో తన భార్య పేరును ఎక్సెల్ షీటులో చేర్చి వెండర్ కు పంపేవాడు. వెండర్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను పైపైన చూసి సంతకం చేసి తిరిగి పంపేవాడు. అటుపై ఈ ఫైలును రాధా తన డైరెక్టర్ కు, ఆయన ఆమోదించిన తర్వాత చివరిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారికి పంపి ఆఖర్లో తాను సంతకం చేసి అకౌంట్స్ కు పంపేవాడు. అకౌంట్స్ వారు యధాప్రకారమే జీతాలు చెల్లించేవారు. ఇలా పదేళ్ల పాటు సాగిన దందాలో కంపెనీకి సుమారు రూ.4 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడటంతో కంపెనీ యాజమాన్య నివ్వెరపోయింది. రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి విస్తుపోయిన కంపెనీ వెంటనే పోలీసు కంప్లైంటు ఇచ్చి అతడిని కటకటాల వెనక్కు పంపించారు. ఇది కూడా చదవండి: కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్ పాటలు, వీడియోలు -
సెల్యూట్ సీఎం సార్
సాక్షి, అమరావతి/లబ్బీపేట/రామచంద్రపురం/గుంటూరు మెడికల్/గాంధీనగర్: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చి ఎన్నో వేల కుటుంబాలకు మేలు చేకూర్చారని పేర్కొంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 13,000 మంది ఉద్యోగులకు మేలు ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వ శాఖగా మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో 13,000 ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు చేపడతారని వెల్లడించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఊరట ఏపీలోని నిరుద్యోగులకు ఊరట కలిగించేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు 10,000 పోస్టులను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. టెట్ కమ్ డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్, ఎస్ఐ, ఫైర్, జైల్ వార్డెన్స్, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, వర్సిటీల్లో ఉన్న బోధన,బోధనేతర సిబ్బంది భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామమన్నారు. జీపీఎస్ అమలుపై కృతజ్ఞతలు ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా జీపీఎస్ అమలుతో పెన్షన్ భరోసా కల్పించినందుకు ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌కు తాము మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, రామకృష్ణా రెడ్డి, హరీంద్ర, కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుభాని, పుల్లారావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం వైఎస్ జగన్‌కు పీటీడీ(ఆర్టీసీ) వైఎస్సార్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 50 శాతం కనీస పింఛన్‌తో పాటు డీఏలు వర్తించే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా లబ్ధి చేకూరుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేఎం నాయుడు, ఉపాధ్యక్షురాలు లత తెలిపారు. జీపీఎస్‌తో ఎంతో మేలు కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించి 5 అంశాలకు ఆమోదం లభించింది. డీఏ కోసం ఇచ్చిన జీవోను ర్యాటిఫై చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు సమానంగా 16% హెచ్ఆర్ఏ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కొత్త పీఆర్సీ కమిషన్ వేయడం అభినందనీయం. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్ తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కిందకు వచ్చే వారికి చివరి పే స్కేల్లో 50% ఇస్తూ, దానికి అదనంగా డీఏ ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పాత పెన్షన్ స్కీమ్‌కు, జీపీఎస్‌కు మధ్య ఒకటే తేడా ఉంది. పీఆర్సీ ఒక్కటే లేదు. డీఏ కూడా ఫిక్స్ చేశారు. ప్రతీ ఆర్నెల్లకు 2% డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. హౌస్‌సైట్స్ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. జగనన్న లేఅవుట్లలో 10% కేటాయించారు. 20% డి స్కౌంట్ ఇచ్చారు. ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకూ సుముఖంగా ఉన్నారు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన అవుట్సోర్సింగ్ ఉ ద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం జగన్‌ది సంక్షేమ సంతకం ఇచ్చిన హామీల అమల్లో పేటెంట్ రైట్ ఏదైనా ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌దే. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం జగన్ సంతకమే సంక్షేమ సంతకం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో వారంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు. – పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ దశాబ్దాల కలను నెరవేర్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ఈ మేలును ఎన్నటికీ మరువలేము. కేబినెట్లో క్రమబద్ధీకరణ తీసుకున్న క్షణం మా ఇళ్లలో పండుగ వాతావరణం కనిపించింది. సుధీర్ఘ నిరీక్షణకు సీఎం జగన్ చరమగీతం పలికారు. – రవికుమార్, కొలకలూరి రత్నాకర్‌బాబు, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉన్నాం సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం ఎంతో సంతోషానిచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తోన్న వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడు 1,500 మందిని క్రమబద్ధీకరిస్తారు. వీరితోపాటే మిగిలిన వారినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. – గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రుణపడి ఉంటాము చంద్రబాబు సీఎంగా ఉండి 1994లో పోస్టుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మా కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. – ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త డీఏ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. –డీ శ్రీను, రాష్ట్ర అధ్యక్షుడు, డీపీఆర్టీయూ 10వేల కుటుంబాల్లో వెలుగులు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాము. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. – అరవ పాల్, అధ్యక్షుడు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పీఆర్సీ ఏర్పాటు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన 12వ పేరివిజన్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. – వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 7 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 నాటికి సర్వీస్‌లో ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించినట్లయితే మరో 4 వేల మందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 110 మంది రెగ్యులర్ అవుతున్నారు. – బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ -
వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మనకు ఉద్యోగాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లక్షలామంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టాలని, 100 మీటర్ల గోయ్యితీసి పాతిపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడబీకితే మన ఉద్యోగాలు మనకు వస్తాయని, అందుకు నల్లగొండ బిడ్డలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇకపై కేసీఆర్‌ను ఉద్యోగాలు అడిగేదే లేదని చెప్పారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి. అందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలి. నిరుద్యోగులను తల్లిదండ్రులు కూలీ పనిచేస్తూ కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఉద్యోగాలు ఇవ్వలేదు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఇంటికి వెళ్లలేక అడ్డా మీద కూలీల్లా బతుకుతున్నారు. పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నాడు..’ అని రేవంత్ విమర్శించారు. తాగుబోతుల సమ్మేళనాలు.. ‘బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జనతా బార్లో పర్మిట్ రూమ్ అడ్డాల్లా మారాయి. పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే బీఆర్ఎస్ నేతలు తాగుబోతుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తొలి తెలంగాణ ఉద్యమంలో పదవులు త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే, మలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డే. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. రాష్ట్రం కావాలంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున హోంమంత్రి చిదంబరానికి వినతిపత్రం సమర్పించింది ఉత్తమ్కుమార్రెడ్డేననేది చరిత్ర పుటల్లో ఉంది. దేవరకొండలో చదువుకున్న జైపాల్‌రెడ్డి తన రాజకీయ చతురతతో అందరినీ ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయించారు. అలాంటి గొప్ప నేతలు ఉన్న నల్లగొండలో ఇప్పుడు ఎలాంటి నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారనేది గ్రహించాలి. నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఉన్న ఈ జిల్లాలో ఈ రోజు చెప్పుకోవడానికి నాయకుడు లేరు..’ అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ ఎవరికి? ‘బంగారు తెలంగాణ ఎవరికి అయ్యింది. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీని, కొడుకును టాటాను చేశారు. కేసీఆర్ చార్లెస్ శోభరాజ్ అయ్యారు. పేదోళ్లకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి? మొదటి శాసనసభలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అడిగితే 1.07 లక్షలు ఉన్నాయని చెప్పారు. ఏడాదిలో భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు 9 ఏళ్ల తరువాత 1,91,792 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ కమిషనే చెప్పింది. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగ సమస్య పెరిగిందా? అనేది ఆలోచన చేయాలి. పదో తరగతి పరీక్షలు పెట్టమంటే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో కనిపించాయి. ఇంటర్ జవాబు పత్రాలు సరిగ్గా దిద్దకుండా 25 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్–1 ఉద్యోగాలు భర్తీ చేయమంటే ప్రశ్నపత్రాలు బస్టాండ్లు, జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటున్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలను వందల కోట్ల రూపాయలకు కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ అమ్ముకుంటున్నారు..’ అని రేవంత్ ఆరోపించారు. మేం చెబితే ఖండించారు.. ‘దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని మేం చెబితే ఖండించారు. నిన్న సీఎం కేసీఆర్ లంచాలు తీసుకున్న వారి చిట్టా తన దగ్గర ఉందన్నారు. రూ.10 లక్షల దళిత బంధు ఇవ్వడానికి రూ.3 లక్షలు అంటే 30 శాతం కమీషన్లు తీసుకునే సర్కారు మనకు అవసరమా? యాదవులు గొర్రెలు కాసేందుకు, ముదిరాజ్‌లు..గంగపుత్రులు చేపలు పట్టేందుకు, గౌడ్లు కల్లు గీసేందుకు, మాదిగలు చెప్పులు కుట్టుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా? పేదల బిడ్డలు కుల వృత్తులే చేసుకుని బతకాలా? అనేది ఆలోచించాలి..’ అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ మే 8న వస్తున్నారని, సరూర్‌నగర్ సభకు వేలాదిగా తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకుందామని అన్నారు. మోసపోతే బతకలేం: కోమటిరెడ్డి కేసీఆర్ మాటలు రెండుసార్లు విని మోసపోయామని, మూడోసారి మోసపోతే బతకలేమని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ మాటలు నమ్మి టీఆర్ఎస్కు రెండుసార్లు ఓట్లు వేస్తే నిధులు, నీళ్లు, నియామకాలు ఏవీ లేకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, నోటిఫికేషన్లు ఇచ్చి లీకేజీలకు పాల్పడిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ హయాంలో తెచ్చిన శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తిగా ఎండగట్టారన్నారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని తెలిసినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సాండ్..ల్యాండ్..మైన్..వైన్ టీఆర్ఎస్ నాయకులంతా ఇసుక, భూ కబ్జాలు, మైనింగ్, వైన్ వ్యాపారాలు చేస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. యువకులు బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే కేసీఆర్ ప్రభుత్వం వారి త్యాగాలకు అర్ధం లేకుండా చేస్తోందని అన్నారు. 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రెట్టింపైందన్నారు. పోటీ చేయను.. కోరితే సీఎం అవుతా: జానారెడ్డి ‘నేను వచ్చే ఎన్నికలో పోటీ చేయడం లేదు.. అధిష్టానానికి కోరిక ఉంటే పోటీ చేయకుండానే సీఎంను అవుతా..’ అని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఉత్తమ్‌కుమార్ గెస్ట్ హౌస్‌లో ఆయనతో జరిగిన సరదా సంభాషణ నేపథ్యంలో జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ ఎంజీయూ విద్యార్థులతో రేవంత్‌రెడ్డి ఎంజీయూ (నల్లగొండ రూరల్): నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వెంటనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరుద్యోగులతో ఆయన మాట్లాడారు. ఎంజీయూ వద్ద విద్యార్థులు ప్రవళిక, మధు, శ్వేత తదితరులతో ముచ్చటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ మొండి వైఖరిపై నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాతుందని హామీ ఇచ్చారు. యువకులంతా ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ పారీ్టకి అండగా ఉండాలని కోరారు. -
తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసమే.. నిరుద్యోగ దీక్ష: వైఎస్ షర్మిల
కవాడిగూడ (హైదరాబాద్): నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1,200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సీఎం గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అందుకే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. బుధవా రం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద టీ–సేవ్ ఆధ్వర్యంలో ష ర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడాలంటే కూడా కోర్టుల నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. అయినా దీక్ష అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ అందించిన పాలన రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు నోరు మూసుకుని కూర్చుంటే, తాను వారిపక్షాన నిలబడి కొట్లాడుతున్నానని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణిని అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ–సేవ్ తరఫున కేసీఆర్‌కు పది ప్రశ్నలు పంపుతున్నామని, దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలని ష ర్మిల సవాల్ విసిరారు. విద్యార్థులు రాజకీయ శక్తిగా ఎదిగి పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని గద్దర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద ఉద్యమం ఉంది తప్ప డబ్బులు లేవని, ఇప్పుడు మాత్రం డబ్బులే మిగిలాయని పేర్కొన్నారు. దీక్షలో ప్రొఫెసర్ కాశీం, వైఎస్ఆర్టీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ సభ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ఉద్యమకార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఖమ్మంలో భారీసభ నిర్వహించనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు టెన్త్ పరీక్షల లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో ప్రభు త్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిరసనసభలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఖమ్మ ంలో తొలిసభ జరగనుంది. ఈ సభ సందర్భంగా సోమవా రం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి మయూరి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని టీపీసీసీ తెలిపింది. సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు పాల్గొంటారని, కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఈ సభకు భారీగా తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. 27న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించినందుకు నిరసనగా ఈనెల 27న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. దీక్షలో సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు దీక్షలో పాల్గొంటారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరుబాటు
-
మా నౌకరీలు మాగ్గావాలే
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. -
నిరుద్యోగ భారతం! దేశంలో 5.10 కోట్లకు చేరుకున్న నిరుద్యోగులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 5.10 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత శ్రామికశక్తి 2022లో ఇంకా కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందున్న స్థాయికి చేరుకోలేదు. 2019లో శ్రామికశక్తి 44.2 కోట్లుగా ఉండగా దేశంలో కరోనా వ్యాప్తి సందర్భంగా 2020లో అది 42.4 కోట్లకు తగ్గింది. తిరిగి 2021లో 43.5 కోట్లకు పెరగ్గా తాజాగా ఈ ఏడాది నవంబర్ నాటికి 43.7 కోట్లకు శ్రామికశక్తి చేరుకుంది. 2019లో కరోనా వ్యాప్తికి ముందు 4.5 కోట్లుగా ఉన్న నిరుద్యోగులు, 2020లో 5.3 కోట్లకు, 2021లో 4.8 కోట్లకు 2022 నవంబర్‌లో 5.1 కోట్లకు చేరుకున్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 11 శాతం దాకా నిరుద్యోగులు ఉన్నారనే విషయం వెల్లడైంది. అదే సమయంలో డిసెంబర్లో నిరుద్యోగిత శాతం 8.7 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా 9.9 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.1 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆర్థికరంగ విశ్లేషకుడు డి. పాపారావు తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. నిరుద్యోగితకు కారణాలు ఇవే... ►ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు. ►కేంద్రంఅవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు దేశానికి నష్టం చేస్తున్నాయి. ►ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడానికి బదులు కార్పొరేట్లకు డబ్బులిస్తోంది. ►ప్రస్తుతమున్న పరిశ్రమలే 70 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగాలనే తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేస్తే మేలు... ►ప్రభుత్వ ఆర్థిక విధానాల మార్పుతోనే పరిస్థితులు మారతాయి. ►సాగులో డిమాండ్‌ను సృష్టించాలి. ►కనీస మద్దతు ధర పెంచాలి. చౌకగా విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. ►ఒక్క వ్యవసాయ సీజన్లో గుణాత్మక మార్పు తీసుకురాగలిగితే ఉపాధి కల్పనలో మార్పు దానంతట అదే వస్తుంది. -
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
‘డైల్ ఇనిస్టిట్యూషన్స్’ ఘరానా మోసం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజమండ్రికి చెందిన ఓ యువకుడికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంది. తండ్రి రోజువారీ కూలీ. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే ఆపేశాడు. తండ్రితో పాటే కూలికి వెళ్తూ తన కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన డైల్ ఇనిస్టిట్యూషన్స్ పోస్టుకు ఆకర్షితుడయ్యాడు. వెంటనే విజయవాడ చేరుకుని ఆ సంస్థ నిర్వాహకులను సంప్రదించాడు.కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి 6 నెలల క్రితం రూ.2.39 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సోమవారం విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌కు వచ్చాడు. బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, ఎన్నికల కమిషన్, కార్గో తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కెనడా, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడ కేంద్రంగా నిరుద్యోగులకు వల వేసిన డయల్ ఇనిస్టిట్యూషన్స్ నిర్వాహకులు అందినకాడికి దండుకున్నారు. రెండేళ్లపాటు సాగించిన ఈ దందాకు రాష్ట్రవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగులు మోసపోయారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.12 లక్షల వరకు కాజేసినట్టు సమాచారం. పోలీస్ కమిషనరేట్‌ను ఆశ్రయించిన బాధితులు సూర్యారావుపేట పోలీసుల తీరుతో బాధితులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. డైల్ ఇన్స్టిట్యూషన్స్ యజమాని దండుబోయిన సిద్ధార్థ్వర్మకు పోలీసులు రాచమర్యాదలు చేస్తూ తమను దూషిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు పెడితే ఏమొస్తుంది, సెటిల్ చేసుకుని ఎంతోకొంత తీసుకెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేయకుండా పోలీసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కేసు ఎలా ముందుకు వెళ్తుందో చూస్తానంటూ ఓ పోలీసు అధికారి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన బాధితులు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌ను సోమవారం ఆశ్రయించారు. సుమారు 50 మంది బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు కమిషనరేట్‌కు వచ్చారు. డెప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీప్రశాంతికి ఫిర్యాదులు అందజేశారు. స్టేషన్లోనే వంచించే యత్నం డైల్ ఇనిస్టిట్యూషన్స్ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 18వ తేదీన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చాడు. ‘నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? పది రోజుల్లో మలేషియా వెళ్లాల్సిన వాడివి. కంప్లైంట్ ఇచ్చి ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావ్. డబ్బులు కట్టి వారం రోజుల్లో బయటకు వచ్చేస్తా. నిన్ను మలేషియా పంపిస్తా. నా మాట విని కంప్లైంట్ ఇవ్వకు..’ అంటూ సిద్ధార్థ్‌వర్మ పోలీసుల సమక్షంలోనే మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరిని పోలీసులు ముందుగా సిద్ధార్థ్ వద్దకు తీసుకెళ్తున్నారని, ఆ తరువాతే ఫిర్యాదు తీసుకుంటున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలతో వెలుగులోకి.. డైల్ ఇనిస్టిట్యూషన్స్ సంస్థ మోసాలను ‘విజయవాడలో ఉద్యోగాల వల’ శీర్షికన ఈ నెల 15న వెలుగులోకి తెచ్చింది. దీంతో కడప, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ఏలూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. 15వ తేదీన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో 12 మంది బాధితులు ఫిర్యాదు చేయగా.. సోమవారం నాటికి ఫిర్యాదు చేసిన బాధితుల సంఖ్య 200కు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి అరెస్ట్ కాగా, కేసులో ప్రధాన నిందితుడైన దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను అరెస్ట్ చేసినట్టు సూర్యారావుపేట సీఐ జానకిరామయ్య తెలిపారు. గుంటూరుకు చెందిన నిందితుడు విజయవాడలో డైల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 200 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, నిందితుడిపై 409, 406, 420 కేసులు నమోదు చేశామన్నారు. అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన వారి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నిందితుడు గతంలోనూ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. -
మోసగాడు సిద్ధార్థ్‌పై కేసు నమోదు
విజయవాడ స్పోర్ట్స్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన డయల్ ఇన్స్టిట్యూట్ యజమాని సిద్ధార్థ్‌పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదయింది. విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అందులో యువతులను నియమించి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేసి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు సిద్ధార్థ్‌పై 409 (బ్యాంక్ చెక్కులను మోసానికి వినియోగించడం, అగ్రిమెంట్లను ఆర్థిక మోసాలకు వినియోగించడం), 406 (ఉద్దేశపూర్వకంగా నేరపూరిత కుట్రకు పాల్పడటం), 406 (నమ్మించి మోసం చేయడం) సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ వి.జానకిరామయ్య తెలిపారు. ఈ మోసంపై 14వ తేదీ అర్ధరాత్రి వరకు 25 మంది బాధితులు తమను ఆశ్రయించారని, గురువారం మరో పది మంది ఆశ్రయించినట్లు చెప్పారు. పకడ్బందీగా మోసం నిందితుడు సిద్ధార్థ్ పక్కా ప్రణాళికతో అత్యంత పకడ్బందీగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. నిరుద్యోగులను ఆకర్షించేందుకు అతను ఏర్పాటు చేసిన డయల్ ఇన్స్టిట్యూట్లో యువతులను మాత్రమే నియమించడం, వారిని గరిష్టంగా రెండు నెలల్లో ఉద్యోగం నుంచి తొలగించేవాడు. నిరుద్యోగులు అతని బ్యాంక్ అకౌంట్‌కు చెల్లించిన నగదును వెంటనే విత్‌డ్రా చేసి బ్యాంక్ ఖాతాలను నిత్యం ఖాళీగానే ఉంచే వాడు. అతని రేషన్‌కార్డ్, ఇంటి అడ్రస్, ఆధార్ వివరాలు ఆన్లైన్లో లేకుండా ముందస్తుగానే వ్యూహ రచన చేసుకున్నాడు. అయితే డయల్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న మోసంపై ఆరు నెలల క్రితమే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పోలీసులు సెటిల్మెంట్ చేసి కేసు నమోదు చేయకుండా మిన్నకుండిపోవడంతో ఇటీవల కాలంలో నిందితుడు సిద్ధార్థ్ వలలో మరికొంత మంది బాధితులు బలి అయ్యారు. -
విజయవాడలో ఉద్యోగాల వల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలుచేసిన వైనం బయటకొచ్చింది. 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగించిన సంస్థ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. సిద్ధార్థ్‌వర్మ విజయవాడ బందరు రోడ్డులో డైల్ ఇన్స్టిట్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోను, విదేశాల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు వల వేశారు. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, మలేషియా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దేశంలో బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, ఎలక్షన్ కమిషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ సంస్థల్లోను, పేరొందిన ప్రైవేటు కంపెనీల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికారు. కార్యాలయంలో యువతులను నియమించి వారి మాటలతో బురిడీ కొట్టించి ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. రసీదులు కూడా ఇచ్చారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారికి డబ్బు వాపసు చేస్తూ చెక్కులిచ్చారు. ఆ చెక్కులు చెల్లకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మోసపోయినవారు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, గుంటూరు, వైఎస్సార్, ప్రకాశంజిల్లాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు సిద్ధార్థ్‌వర్మను, కార్యాలయంలో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండేళ్లుగా దందా కాల్ సెంటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులను నేర్పుతామని రెండేళ్ల కిందట ఈ ఇన్స్టిట్యూషన్ను సిద్ధార్థ్‌వర్మ ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్కు వైష్ణవి అనే మహిళ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు ఎక్కువగా సంస్థ కార్యాలయంలో కనిపించేవారు కాదని, అక్కడి ఉద్యోగినులే వివరాలు చెప్పి డబ్బు వసూలు చేసేవారని బాధితులు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు వెయ్యిమంది నిరుద్యోగులు వీరి మాటలు నమ్మి మోసపోయారని పేర్కొన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గుప్పించి తమను ఆకర్షించారని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన బాధితుడు మణికంఠ వాపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో డబ్బు చెల్లించి నెలల తరబడి ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరిగానని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద డబ్బు వసూలు చేశారని విజయవాడకు చెందిన ప్రవీణ్ తెలిపారు. ఉద్యోగం రాలేదని డబ్బులు అడిగితే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులచే ఎదురుదాడి చేయిస్తున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తాం.. ఉద్యోగాల పేరుతో మోసపోయామని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైల్ ఇన్స్టిట్యూషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంస్థ యజమానిని, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల పేరుతో మోసం చేసే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సంస్థల యజమానుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. – టి.కె.రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
‘సాల్ట్’ పేరిట ఉద్యోగాల వల
సాక్షి, విజయవాడ ప్రతినిధి/సాక్షి, అమరావతి: ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలుచేసి బోర్డు తిప్పేసిన బాగోతమిది. కేంద్ర ప్రభుత్వం ‘సాల్ట్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతోందనీ, దీనిపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నామంటూ బురిడీ కొట్టించి వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకుని మోసం చేసిన ఓ బోగస్ సంస్థ నిర్వాకమిది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఇద్దరు బాధితులు విజయవాడలోని సంస్థ నిర్వాహకులను నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. ‘ఆల్ఫాబెట్ వెంచర్’ పేరుతో.. విజయవాడ సూర్యారావుపేటలోని వేమూరి వారి వీధిలో ‘ఆల్ఫాబెట్ వెంచర్’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థ వెలిసింది. ఎడ్యుకేషనల్ బుక్స్ పబ్లికేషన్, డిజిటల్ అండ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ లెర్నింగ్, పేపర్ అండ్ పేపర్ ప్రోడక్ట్స్, ప్రింటింగ్ అండ్ రీ ప్రొడక్షన్, మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, రేడియో అండ్ టెలివిజన్, స్టాఫింగ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్, సీసీఎంఎస్–ఐఓటీ–కంప్యూటర్స్ అండ్ రిలేటెడ్ సేవల పేరుతో సంస్థను ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సర్వీసులను ఏజెన్సీలకు అప్పగిస్తాయని, ప్రభుత్వ కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని ఈ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మబలికారు. సంస్థ నెలకొల్పిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలుచేసే ‘సాల్ట్’ పథకానికి ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నామని మధ్యవర్తుల ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. దీంతో విస్సన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి మానేసిన చిన్నం మృత్యుంజయ అనే వ్యక్తి ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులను ఆకర్షించాడు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు సాల్ట్ పథకంపై శిక్షణనిచ్చే కాంట్రాక్టును ‘ఆల్ఫాబెట్ వెంచర్’కు కేంద్ర ప్రభుత్వం అప్పగించిందనీ, ఇందుకుగానూ ఫీల్డ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లను ఆ సంస్థ నియమిస్తుందని, 20 రోజుల శిక్షణ తరువాత నెలకు రూ.40 వేలు జీతం వస్తుందని అతను అందరినీ నమ్మించాడు. ఉద్యోగానికి రూ.4 నుంచి రూ.6 లక్షలు వసూలు.. ఇక ఫీల్డ్ ఆఫీసర్, సూపర్వైజర్ ఉద్యోగానికి ఒకొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలుచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇలా విజయవాడలోని ఆల్ఫాబెట్ సంస్థ ప్రతినిధులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. చిన్నం మృత్యుంజయ ద్వారానే తమ నుంచి రూ. 8.20 లక్షలు వసూలు చేశారని ఇద్దరు బాధితులు చెబుతున్నారు. వీరిరువురూ ఎంఏ, పీహెచ్డీ చేసి విస్సన్నపేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. తాము గత ఏడాది సెప్టెంబర్‌లో డబ్బులు చెల్లించి 20 రోజులు శిక్షణ తీసుకున్నామని, ఆ తరువాత సంస్థ నిర్వాహకులు జీతం ఇవ్వకుండా మొహం చాటేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలా బోగస్ సంస్థలు వెలిశాయని బాధితులు చెబుతున్నారు. జిల్లాకు ఓ పేరుతో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ఏర్పాటుచేసి వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలుచేసినట్లు తెలుస్తోంది. ఏలూరులో ఆదిత్య మ్యాన్‌పవర్ సొల్యూషన్స్, కాకినాడలో మ్యాట్రిక్స్ మాన్పవర్ సొల్యూషన్, విశాఖపట్నంలో మరో పేరుతో సంస్థలను నెలకొల్పినట్లు బాధితుల కథనం. దీనిపై ఐసీడీఎస్ ఉద్యోగులను ఆరా తీస్తే.. తమ వద్ద అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పజెప్పలేదని స్పష్టంచేశారు. ఉద్యోగాల పేరిట మోసపోవద్దు సమగ్రశిక్ష వొకేషనల్ ట్రైనర్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దు. పాఠశాలల్లో వృత్తివిద్య కోర్సులు బోధించడానికి వొకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్, వొకేషనల్ ట్రైనర్లను నియమించుకుని పాఠశాలల్లో బోధిస్తారు. ఈ పోస్టులు పరిమిత కాలానికి మాత్రమే. కాబట్టి వీరి నియామకానికి సంబంధించి సమగ్రశిక్ష ఎటువంటి బాధ్యత వహించదు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులను "vocational. apsamagra@gmail. com' కు మెయిల్ చేయాలి. – ఎస్. సురేష్‌కుమార్, సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు -
స్కిల్ మస్తు.. జాబ్ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ
మార్కాపురం(ప్రకాశం జిల్లా): డిగ్రీ పట్టా ఉంటే చాలదు.. ఉద్యోగం సాధించాలంటే టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యం అవసరం.. ఆ దిశగా రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నియోజకవర్గానికో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ద్వారా స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. నిరంతరం జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో 7,147 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఐదేళ్లపాటు ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను పటిష్టపరచడం, సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా పెద్ద పెద్ద నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అధికారులు జిల్లాలో 10 స్కిల్ హబ్‌లు, ఒంగోలు నగరంలో 2 శిక్షణ కేంద్రాలతో పాటు స్కిల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అదనపు అర్హత లేకపోయినా డిగ్రీ పాసై ఉంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో మొత్తం 23,853 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 7,147 మంది నెల్లూరు, చిత్తూరు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మెగా జాబ్‌మేళా, మూడో మంగళవారం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్నారు. ఒంగోలు నగరంలో బాలురు, బాలికల ఐటీఐల్లో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బాలికల ఐటీఐలో ప్రత్యేకంగా మహిళల కోసం హౌసింగ్, ఎల్రక్టీషియన్ కోర్సులు నిర్వహిస్తున్నారు. మరో కేంద్రంలో ఇండ్రస్టియల్, పిట్టర్ ఎరోకేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. గిద్దలూరులో సెక్యూరిటీ గార్డు, టెలీకాలర్స్, కొండపిలో రిటైల్ అసిస్టెంట్, అసిస్టెంట్ బ్యూటీషియన్, దర్శి, మార్కాపురంలో ఇండ్రస్టియల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. సంతనూతలపాడులో సీయింగ్ వెకేషన్, బ్యూటీథెరపిస్టులో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో 90 మందితో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెండుగా ఉపాధి అవకాశాలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి యువతకు శిక్షణ ఇస్తున్నాం. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలను అమలు చేస్తున్నాం. ప్రతి నెలా 15 నుంచి 25 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. 8 నియోజకవర్గాల్లో 10 స్కిల్ హబ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇండ్రస్టియల్ ఎల్రక్టీ షియన్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. త్వరలో ఒంగోలులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. – లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా నా పేరు శేషుకుమారి. మాది రామసముద్రం. పీజీ చదివాను, జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నా. నెలకు రూ.14 వేల జీతం. హ్యాపీగా ఉన్నాను. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించిన జాబ్‌మేళాలో ఈ అవకాశం దక్కింది. – జే శేషుకుమారి ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా నా పేరు జీ రమేష్. మాది పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామం. గుంటూరులో బీటెక్ చేశా. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరై బైజూస్ సంస్థలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్‌గా ఎంపికయ్యా. ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీ. – జీ రమేష్ -
‘స్మార్ట్ విలేజ్’ సుధాకర్‌కు రిమాండ్
ఆరిలోవ(విశాఖ తూర్పు): స్మార్ట్ విలేజ్ అనే సంస్థ ఏర్పాటు చేసి.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేసిన ఇందుపూడి సుధాకర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ వివరాలను సీఐడీ డీఎస్పీ చక్రవర్తి సోమవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లికి చెందిన ఇందుపూడి సుధాకర్ 2018లో స్మార్ట్ విలేజ్ సంస్థ ఏర్పాటు చేసి క్రమంగా రాష్ట్రంలో సుమారు 7,000 మందిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు. ఇందుకుగాను కేడర్‌ను బట్టి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు తీసుకున్నాడు. ఇలా రూ.300 కోట్ల వరకు వసూలుచేశాడు. అయితే డబ్బులిచ్చిన చాలా మందికి సుధాకర్ ఉద్యోగాలివ్వలేదు. ఉద్యోగాలిచ్చిన కొంతమందికేమో జీతాలు ఇవ్వట్లేదు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన బాధితులంతా కొంతకాలం కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఆదివారం సుధాకర్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐడీ డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. బాధితులు విశాఖ సీఐడీ కార్యాలయంలోని సీఐ బుచ్చిరాజు 9441379913ను సంప్రదించి.. తమ వివరాలు చెప్పాలని సూచించారు. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. కాగా, సుధాకర్‌ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు సోమవారం విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సుధాకర్ బీజేపీ నాయకుల పేర్లు చెప్పి మోసం చేశాడని.. తమకు న్యాయం చేయాలంటూ కోరారు. -
కొలువుల కోసం ప్రత్యేక శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నియామక సంస్థల చర్యలు వేగవంతమవడంతో అభ్యర్థులు సైతం అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒకదఫా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు మరోసారి స్వల్పకాలిక శిక్షణ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల బీసీ స్టడీ సర్కిల్ అధికారులతో ఉచిత కోచింగ్‌పై పలు రకాల సూచనలు చేశారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. జిల్లాలవారీగా స్టడీ సెంటర్లు బీసీ అభ్యర్థులకు స్వల్పకాలిక శిక్షణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. బీసీ సంక్షేమ వసతిగృహాలు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలిక పద్ధతిలో తక్షణమే ఈ స్టడీ సెంటర్లను ప్రారంభించాలని మంత్రి గంగుల ఆదేశించారు. దీంతో అనువైన భవనాల లభ్యతపై ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. త్వరలో గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4తోపాటు గురుకుల కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే ఆ యా కేటగిరీల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపడంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు వారి జిల్లా కేంద్రాల్లోనే శిక్షణలు ఇచ్చేవిధంగా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో కూడా స్వల్పకాలిక శిక్షణ తరగతులను అతిత్వరలో నిర్వహించాలని బీసీ స్టడీ సర్కిల్ భావిస్తోంది. వారంరోజుల్లోగా కోచింగ్‌కు సంబంధించి ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. -
టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్ ఏవీఎస్వో పద్మనాభన్ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
నిరుద్యోగులకు 'స్మార్ట్'గా టోకరా.. కాల్ లెటర్లు, పథకాలపై సర్వేలంటూ డ్రామా
‘కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఫీల్డ్ ఆపీసర్.. రైల్వేలో జూనియర్ అసిస్టెంట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్.. నేషనల్ హైవేస్ అథారిటీలో సూపర్వైజర్ జాబ్.. ఏది కోరుకుంటే అది.. మీరు అలా లక్షలు ఇస్తే.. మేము ఇలా జాబ్ ఇస్తాం.. ఇదిగో జాయినింగ్ లెటర్..’ స్మార్ట్‌గా ఎరవేసి వేలాది నిరోద్యోగులను బురిడీ కొట్టించి, కోట్లు కొల్లగొట్టిన స్మార్ట్ యోజన వేల్ఫేర్ సొసైటీ ఘరానా మోసం ఇది. – సాక్షి, అమరావతి అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్లా ఈ సంస్థ వేలాది నిరుద్యోగులను మోసం చేసింది. బండారం బయటపడటంతో సొసైటీ స్థాపించిన ఇండిపూడి సుధాకర్ పత్తా లేకుండా పోయారు. దాంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం వివరాలు.. 2018లో అప్పటి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా)లోని అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ అదే జిల్లాలోని నర్సీపట్నం కేంద్రంగా ‘స్మార్ట్ యోజన వెల్పేర్ సొసైటీ’ని స్థాపించాడు. తాను చైర్మన్‌గా ఉన్న ఆ సొసైటీ పేరుతో నర్సీపట్నంలో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. కొన్నేళ్లు కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన ప్రాజెక్టులు చేస్తున్నట్లు చెప్పాడు. ఢిల్లీ పెద్దలకు సన్నిహితులైన స్థానిక నేతలతో ఉన్న పరిచయాలను అనుకూలంగా మలచుకొని, తనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందర్నీ నమ్మించాడు. 2021లో అసలు దందాకు తెరతీశాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు, రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఎయిర్పోర్ట్ అథారిటీ మొదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో థర్ట్ పార్టీ ద్వారా ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టు వచ్చినట్లు చెప్పాడు. ఈ సంస్థల్లో తాము ఉద్యోగులను నియమిస్తామని, కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని కూడా చెప్పాడు. సొసైటీ తరపున జిల్లాకు ఓ ఇన్చార్జిని నియమించాడు. అప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు కాల్ లెటర్లు కూడా చూపించాడు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రూ.10లక్షలు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రూ.5 లక్షలు చెల్లించాలని రేటు పెట్టాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఆశతో సుధాకర్ మాటలను చాలా మంది నిరుద్యోగులు నమ్మి డబ్బు ముట్టజెప్పారు. వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాల్ లెటర్లు ఇచ్చారు. కొందరితో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వేలు చేయించినట్టుగా డ్రామా నడిపించారు. దాంతో ఆ సంస్థను చాలామంది నమ్మారు. అప్పులు చేసి మరీ అడిగినంత చెల్లించారు. ఇలా శ్రీకాకుళం జిల్లాతో మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు 6,500 మంది నుంచి రూ.50 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు అంచనా. డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సుధాకర్‌ను నిలదీశారు. కేసు పెడతామని బెదిరించారు. వారిని సుధాకర్ మరోసారి మాయ మాటలతో బురిడీ కొట్టించాడు. ప్రస్తుతం ఉద్యోగానికి రానవసరం లేదని, జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పాడు. రెండు నెలల జీతాలు కూడా చెల్లించాడు. ఆ తరువాత నుంచి జీతాలు రాలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు నర్సీపట్నంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనలు కూడా చేశారు. దాంతో సొసైటీ చైర్మన్ సుధాకర్ మెల్లగా జారుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం కేసులు నమోదు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ, సంస్థ చైర్మన్ ఇండిపూడి సుధాకర్‌పై అనేకమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన అనంతరం నర్సీపట్నం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 506 ఆర్/డబ్లూ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుధాకర్‌పై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కూడా తాజాగా కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసులూ దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసును సత్వరం దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించింది. పరారీలో ఉన్న సుధాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఏడాదికి కోటి ఉద్యోగాలేవీ?
ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కారు 8 ఏళ్ల కాలంలో 8 కోట్లు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చామనీ, మరో 60 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామనీ చేసిన ప్రకటన యువతకు ఆశ్చర్యం కలిగించింది. మోదీ గద్దెనెక్కిన తర్వాత 8.1 శాతం నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. దేశంలో 18 నుంచి 25 ఏండ్ల వయసున్న యువత 50 శాతం ఉన్నారు. కోవిడ్‌కు ముందు 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... కోవిడ్ తర్వాత ఆ సంఖ్య 45 కోట్లకు చేరింది. కొత్తగా ఉద్యోగాలను సృష్టించి ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇచ్చే మాట అటుంచి... ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలూ, శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. 245 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 19.15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 72 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ (2.27 లక్షలు), పోస్టల్ (90 వేలు), హోం (1.28 వేలు), రెవెన్యూ (76,327), సైన్సు– టెక్నాలజీ (8,227) గనులు (6,925), జలవనురులు (4,557), కుటుంబ– ఆరోగ్యం (21,003) వంటి ఎన్నో శాఖల్లో ఖాళీలు నింపవలసి ఉంది. అలాగే 1,672 ఐఏఎస్ పోస్టులు, 1,452 ఐపీఎస్ పోస్టులు, మరో 3 వేల వరకు ఇతర సివిల్ సర్వీసెస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాయుధ బలగాల్లో 1,22,555, గ్రామీణ డాక్‌లలో 73,452, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 10,368, ఐఐటీల్లో 3,876 ఖాళీలు నింపవలసి ఉంది. (చదవండి: ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?) నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న ప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు యువతకు ఉద్యోగాల పేరుతో గాలమేసి ఓట్లు పొంది అధికార పీఠాన్ని ఎక్కుతున్నాయి. ఆ తర్వాత వారిని పూర్తిగా విస్మరించడం శోచనీయం! (చదవండి: కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?) – గుర్రం రాంమోహన్ రెడ్డి, హైదరాబాద్ -
నిరుద్యోగుల్ని వేధిస్తున్న అకాడమీ పుస్తకాల కొరత
-
నిరుద్యోగ భృతి ఏమైంది?: షర్మిల
తుంగతుర్తి: నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమైందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చేరుకుంది. గ్రామంలో పాదయాత్ర చేస్తూ రైతులు, వ్యవసాయ కూలీలు, వృద్ధులను పలకరించారు. అనంతరం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ఆమె రోజంతా కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేస్తే గానీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదన్నారు. రాష్ట్రంలో 3లక్షల 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పీఆర్సీ నివేదిక చెబుతున్నా..బిస్వాల్ కమిటీ చెప్పినా ప్రభుత్వం 89వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటించిందని, ఈ లెక్క ఎవరిచ్చారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి రూ.3,116 ఇస్తామని చెప్పి 40 నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. -
ఏం జరిగింది.. ఉద్యోగం కోసమని వచ్చి.. లాడ్జిలో ఆత్మహత్య
సాక్షి,రాంగోపాల్ పేట్(హైదరాబాద్): ఉద్యోగాన్వేషణలో ఉన్న ఓ యువకుడు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట శ్రీనగర్ కాలనీ వాసి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి (26) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం చూసుకునేందుకు ఈ నెల 26న నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని గోకుల్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా అతడు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది వెళ్లి గది తలుపులు కొట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వెళ్లి కిటికీలో నుంచి లోపల చూడగా టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో తలుపు గడియను తొలిగించి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా అతన్ని సిద్దిపేట వాసిగా గుర్తించారు. అయితే అదే సమయంలో అతడి సెల్‌ఫోన్‌కు కుటుంబసభ్యుల నుంచి ఫోన్ రావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలియజేశారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: Extramarital affair: పెళ్లికాకుండానే తల్లయిన యువతి -
ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది.. కానీ
సాక్షి, గుడిహత్నూర్(ములుగు): తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ ఆమెను ఉన్నత చదువు చదివించారు. డయాలసిస్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసింది. ఇటీవల ఆర్మీలో నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది. పరీక్ష కోసం కష్టపడి చదివింది. రెండు నెలల క్రితం పరీక్ష రాసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఇంకా ఫలితాలు వెలువడలేదు. ఫలితాలు వస్తే తనకు జాబ్ వస్తుందో రాదో అని మనస్తాపం చెందింది. (చదవండి: వారసుడొచ్చాడని ఆనందపడ్డారు.. కానీ వారం రోజుల తర్వాత.. ) ఒత్తిడి భరించలేక సోమవారం ఉరేసుకుంది. ఈ ఘటన గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీకి జరిగింది. ఏఎస్సై రెహమాన్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన ముస్కాన్(21) తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముస్కాన్‌కు చదువుపై ఆసక్తి ఉండడంతో ఇంటర్ పూర్తయిన వెంటనే డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు చదివించారు. ఇటీవల ఆర్మీలో నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుని పరీక్ష కూడా రాసింది. ఫలితాలు రావడం ఆలస్యం అవుతుండడంతో కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటోంది. సోమవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బంధువులు వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తండ్రి షేక్ హరూన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హరూన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
నిరుద్యోగులకు టెక్ మహీంద్రా బంపరాఫర్...!
ప్రముఖ ఐటీ సంస్ధ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కొత్త ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్రోగ్రాంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగ్గా వస్తాయని కంపెనీ అభిప్రాయపడింది. సంయుక్తంగా.. టెక్ మహీంద్రాకు చెందిన సీఏస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉచిత క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణను అందించనుంది. AWS రీ/స్టార్ట్ ప్రోగ్రాంను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా కలిసి నేర్పించానున్నయి. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ఫౌండేషన్ సీఈఓ రాకేష్ సోని మాట్లాడుతూ..."క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 21వ శతాబ్దపు అద్భుత సాంకేతిక ఆవిష్కరణ. ఇది డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేస్తోంది. కరోనా మహమ్మారి అనేక వ్యాపారాల క్లౌడ్ మైగ్రేషన్‌ను వేగవంతం చేసింది. ఈ ప్రోగ్రాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. 39 దేశాల్లో... AWS రీ/స్టార్ట్ అనే ప్రోగ్రాం 39 దేశాలలో అందించబడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో 90 శాతం కంటే ఎక్కువ గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలతో అనుసంధానించనుంది. ఇది 12-వారాల జరిగే ప్రోగ్రాం. వ్యక్తిగతంగా, నైపుణ్యం-ఆధారిత శిక్షణను నిరుద్యోగులకు అందిస్తారు. దీనిలో ప్రాథమిక AWS క్లౌడ్ నైపుణ్యాలను, అలాగే ఇంటర్వ్యూ, రెస్యూమ్ రైటింగ్ వంటి ప్రాక్టికల్ కెరీర్ నైపుణ్యాలను కవర్ చేయనుంది. ఎంట్రీ-లెవల్ క్లౌడ్ పొజిషన్‌కు సిద్ధం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా హైదరాబాద్, మొహాలి, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణేలలోని టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా సినారియో-బేస్డ్ ఎక్సర్సైజులు, హ్యాండ్-ఆన్ ల్యాబ్‌లు, కోర్స్‌వర్క్‌ల ద్వారా, విద్యార్థులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (లైనక్స్, పైథాన్), నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ రిలేషనల్ డేటాబేస్ స్కిల్స్ మొదలైనవాటిని కోర్సు ముగింపులో నేర్చుకుంటారని కంపెనీ తెలిపింది. కాగా కోర్సులో భాగంగా ఇప్పటికే మొదటి రెండు కోహోర్ట్‌లు ఫిబ్రవరి 9, 2022న ప్రారంభమయ్యాయని టెక్ మహీంద్రా తెలిపింది. -
గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 11 ఏళ్లుగా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఈ విషయం గమనిస్తేనే ఎంతమంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోల జనార్దన్, జయంతి పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి రెడీ.. ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా గ్రూప్–1, గ్రూప్–2 పోస్టులను సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారు. మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకూ ఏపీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది. 6 లక్షలకుపైగా పోస్టుల భర్తీతో సరికొత్త చరిత్ర దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో సీఎం జగన్ నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేకూరుస్తున్నారు. రెగ్యులర్ పోస్టులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తదితర మార్గాల్లో యువతకు ప్రయోజనం కల్పిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6,03,756 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264 ఉండగా కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. నాడు నోటిఫికేషన్లతో సరి.. నేడు పోస్టులన్నీ భర్తీ గత సర్కారు హయాంలో ఎన్నికల ముందు వరకు పట్టించుకోకుండా ఆరు నెలల ముందు 2018 చివరిలో హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. కేవలం యువతను మభ్యపెట్టేలా నోటిఫికేషన్లు ఇవ్వడమే కానీ పోస్టులు భర్తీ చేయలేదు. కొన్ని న్యాయవివాదాలతో నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం 3,946 పోస్టులకు సంబంధించిన న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. రెండున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు ఎదురైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం పోస్టులు భర్తీ చేసింది. కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడంతో పాటు పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా త్వరలో మరో 458 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాటి సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు గ్రూప్ 1లో 31, గ్రూప్ 2 సర్వీస్‌లో 30 పోస్టులను గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది. వైద్యశాఖలో 39 వేల పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇప్పటికే 27 వేల మంది నియామకాలు పూర్తి కాగా మొత్తం 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా బోధనాసుపత్రినుంచి విలేజ్ క్లినిక్ వరకు అన్ని చోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించినా న్యాయవివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది. రేషనలైజేషన్ పేరుతో పోస్టులను టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మార్చేశారు. వీటన్నిటినీ సరిదిద్దడంతో పాటు పోస్టుల సంఖ్యను 2 వేలకు పెంచి న్యాయవివాదాలకు తావులేని విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా చర్యలు చేపట్టింది. న్యాయవివాదాలను పరిష్కరించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు. 10,143 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అయితే నిరుద్యోగులకు మేలు చేస్తూ పోస్టుల సంఖ్య మరింత పెరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పోలీసు విభాగంలో ఏటా 6,500 పోస్టుల భర్తీకి ఇటీవల పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం ఎన్నికలకు ముందు గత సర్కారు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్న 2018 డీఎస్సీకి సంబంధించి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసి వారందరికీ ఉద్యోగాలు కల్పించింది. మొత్తం 7,902 మందికి ఇలా ఉద్యోగాలు వచ్చాయి. ఇదే కాకుండా దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు సీఎం జగన్మోహన్రెడ్డి న్యాయం చేశారు. ఆ డీఎస్సీలో 2,192 మందికి ఉద్యోగాలు కల్పించి మినిమం టైమ్‌స్కేలును అమలు చేస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో 958 పోస్టులను, మోడల్ స్కూళ్లలో 164 టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. -
రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
చిత్తూరు అర్బన్: రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.1.27 కోట్లు వసూలు చేసి.. ఇళ్లు, పొలాలు కొనుగోలు చేసి దర్జాగా జీవిస్తున్న ఘరానా మోసగాడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. తవణంపల్లె మండలం అరగొండ పైపాకంకు చెందిన ముట్టుకూరు హేమంత్‌కుమార్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని తండ్రి రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగం చేసే సమయంలో కొందరు అధికారులతో హేమంత్ పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చిత్తూరుకు చెందిన జ్ఞానరాజ్ నుంచి రూ.4.50 లక్షలు, ప్రొటోకాల్ అటెండర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి సత్యనారాయణపురానికి చెందిన నేతాజీ నుంచి రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రిక జనవరి 29న హేమంత్ మోసాలపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై డీఎస్పీ సుధాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాసరావు, పద్మావతి దర్యాప్తు చేశారు. విచారణలో హేమంత్ మొత్తంగా రూ.1.27 కోట్లు నిరుద్యోగులను మోసగించి వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు గురువారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో తిరుగుతుండగా పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం సార్‌ను సాగనంపే టైం వచ్చింది
సాక్షి, మహబూబాబాద్: ‘ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి.. విద్యార్థులు, రైతుల ఓట్లతో గద్దెనెక్కి న కేసీఆర్.. ఏడేళ్లుగా ప్రజలను గోస పెడుతున్నారు. ఇప్పుడు సీఎం సార్‌ను సాగనంపే సమయం వచ్చింది. ఓటు ద్వారా బుద్ధి చెప్పి గద్దె దింపాలి’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న నెల్లికుదురు మండలం సంధ్యా తండాకు చెందిన ఉపాధ్యాయుడు జేత్రాంనాయక్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన మిర్చిరైతు నారమళ్ల సంపత్, బయ్యారం మండల కేంద్రానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాలను పరామర్శించారు. అధైర్య పడవద్దని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు మీకష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఆర్డీఓ, తహసీల్దార్లతో మాట్లాడి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో రేవంత్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు తీరిపోతాయని ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులకు కేసీఆర్ మొండిచేయి చూపించారన్నారు. రైతులను ఆదుకోవడంలోనూ విఫలమయ్యారన్నారు. దీంతో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవోను ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ కుట్రలో బీజేపీ పాత్ర కూడా ఉందన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయడం చేతకాని ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న వారిని చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీ చేసిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ మాటే ఎత్తడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ప్రజల కష్టాలు, బాధలు పట్టకుండా పాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలను తరిమికొట్టే ఆయుధమైన ఓటు మీచేతుల్లోనే ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఇంతకాలం ఓపిక పట్టారు.. ఇంకో 18 నెలలు ఆగండి. అప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది’అని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ను జైలుకు పంపడం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బలరాం నాయక్, వేం నరేందర్‌రెడ్డి, అయోధ్యరెడ్డి, బెల్లయ్యనాయక్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ‘మిలియన్ మార్చ్’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి బీజేపీ సిద్ధమవుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగాల సాధన కోసం యువమోర్చా ఆధ్వర్యంలో ‘మిలియన్ మార్చ్’నిర్వహించాలని నిర్ణయించింది. ఈలోగా నిరుద్యోగులు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ‘కోటి సంతకాల సేకరణ’చేపట్టాలని సూచించింది. దీంతోపాటు రౌండ్ టేబుల్ మీటింగ్‌లు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రిదాకా రాష్ట్రస్థాయి మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో సంజయ్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి మోర్చాలు చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ‘తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం భావిస్తున్నారు. ఇటీవల వెల్లడైన అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇదే చెబుతున్నయ్. ఈ విషయం తెలిసే సీఎం కేసీఆర్ భయపడి మనపై దాడులు చేయిస్తున్నారు. ఇంకా దాడులు పెరిగే ప్రమాదముంది. అయినా భయపడే ప్రసక్త లేదు. రాబోయే రెండేళ్లు జనంలోనే ఉందాం. అంతిమంగా బీజేపీ సారథ్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం’అని సంజయ్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో పార్టీ నేతలకు ఏ ఆపదొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉంది. కరీంనగర్లో నాపై, నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిన వెంటనే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నరేంద్రమోదీ స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం’అని సంజయ్ గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు, డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్.కుమార్ పాల్గొన్నారు. -
నిరుద్యోగి దారుణం.. ‘ఉద్యోగం లేకపోతేనే, మేం సాద్దుము కొడుకా.. ’
ఖమ్మం క్రైం: ‘తల్లిదండ్రులు కూలికి వెళ్లి సంపాదించిన డబ్బులతో కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఇంకా ఎంతకాలం పోషిస్తారు. తెలంగాణలో ఇగ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావేమో... పిచ్చిలేస్తోంది’అని ఆందోళన చెందిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్(23) ఖమ్మం మామిళ్లగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఏ పూర్తిచేశాడు. అక్కడే ఎన్సీసీలో చేరి ‘సీ’సర్టిఫికెట్ సాధించాడు. తల్లిదండ్రులు భద్రయ్య, కళమ్మ దినసరి కూలీలు. ఇటీవలే సాగర్ సోదరికి వివాహమైంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో సాగర్ ఎస్సై, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ స్నేహితులతో కలసి అద్దెగదిలో ఉంటున్నాడు. సంక్రాంతి తర్వాత స్వగ్రామం నుంచి ఖమ్మం వచ్చిన సాగర్ సోమవారం అర్ధరాత్రి దాటాక తన గది సమీపాన రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన సెల్‌ఫోన్ వాట్సాప్ స్టేటస్‌లో ‘ఇగ నోటిఫికేషన్లు రావు... పిచ్చి లేస్తోంది’అని పెట్టాడు. మంగళవారం ఉదయం స్థానికులు సాగర్ మృతదేహాన్ని గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద లభించిన పాన్ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రవికుమార్ సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు, సభ్యుల సాయంతో మార్చురీకి తరలించారు. సాగర్ మృతదేహాన్ని భద్రపరిచిన జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద పలు పార్టీలు ఆందోళన చేశాయి. ఆత్మహత్యకు కేంద్రప్రభుత్వం కూడా కారణమేనంటూ న్యూడెమోక్రసీ నేతలు ఆరోపించడంతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని బయ్యారం తరలించారు. కాగా, సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బయ్యారంలోని ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై న్యూడెమోక్రసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతోపాటు పలు కులసంఘాలు రాస్తారోకో చేశాయి. దీంతో దహనస్కారాలు పూర్తి అయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉద్యోగం లేకపోతేనే, మేం సాద్దుము కొడుకా.. బయ్యారం: ‘మా కడుపున పుట్టిన నీవు మమ్ముల్ని సాదుతావు అనుకున్నాం కొడుకా... ఉద్యోగం లేకున్నా.. నాన్న, నేను రెక్కల కష్టంతో చెల్లిని, నిన్ను పెంచి పెద్ద చేశాం. ఉద్యోగం చేయమని మేం అడిగామా... నీకు ఉద్యోగం లేకున్నా మేం సాద్దుము.. మేం ఎవరి కోసం బతకాలి కొడుకా.. మమ్ముల్ని ఎందుకు అన్యాయం చేశావు నాయనా’అంటూ సాగర్ తల్లి కళమ్మ విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. -
ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు
దుబ్బాక రూరల్: ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బీర్ల ఎల్లం, యాదవ్వ దంపతుల రెండో కుమారుడు శ్రీకాంత్ (24) డిగ్రీ పూర్తి చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్ష రాశాడు. పరీక్షలో సరైన ఫలితం రాలేదు. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సోదరి ఫోన్‌కు వాట్సాప్ పందేశం పంపాడు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. -
నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు
సాక్షి, ఒంగోలు: ప్రజలకు రక్షణగా నిలిచి అన్యాయాలను అడ్డుకోవాల్సిన ఓ మహిళా హోంగార్డు.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. డీజీపీ పేరుతో స్టాంపులు తయారుచేసి ఒకే కుటుంబంలో ముగ్గురికి నకిలీ నియామకపత్రాలిచ్చింది. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగులను ముంచేసింది. ఓ నిరుద్యోగి చేసిన ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన చెట్ల వాణి తండ్రి పోలీస్ శాఖలో పనిచేసేవారు. పెళ్లయిన తర్వాత ఆమె భర్త నిరాదరణకు గురయ్యింది. తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి డీజీపీ ఈమెను హోంగార్డుగా నియమించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె అడ్డదారులు తొక్కింది. సింగరాయకొండకు చెందిన షేక్ ఖాజాహుస్సేన్, కృష్ణలతో చేతులు కలిపింది. వీరు ముగ్గురూ కలిసి హోంగార్డు పోస్టులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేసి మోసం చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలో వాణికి ఒంగోలు బలరాం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. హోంగార్డు పోస్టులు ఇప్పిస్తున్నానని చెప్పడంతో నమ్మిన వెంకటేశ్వర్లు.. డిగ్రీ చదువుతున్న తన అల్లుడు శివకుమార్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. ఇందుకోసం ఆమె అడిగిన రూ.60 వేలను రెండు దఫాల్లో చెల్లించారు. అయితే ఆమె ఇచ్చిన నియామకపత్రం నకిలీదని తెలియడంతో బాధితుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెట్ల వాణి, హుస్సేన్, కృష్ణ చేసిన మరికొన్ని మోసాలు కూడా బయటపడ్డాయి. ఒక కేసులో తండ్రి, కుమారుడు, కుమార్తెకు నకిలీ నియామక పత్రాలిచ్చినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు ఐదుగురి వద్ద నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేశారని ఎస్పీ తెలిపారు. నిందితులకు ఇందిరమ్మ కాలనీకి చెందిన జిరాక్స్ షాపు నిర్వహించే అరుణ, కొల్లు జయలక్ష్మి సహకరించారని వెల్లడించారు. ఐదుగురిని అరెస్టు చేసి డీజీపీ పేరుతో తయారు చేసిన స్టాంపులు, నకిలీ నియామకపత్రాలను సీజ్ చేశామన్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుభాషిణి, ఎస్సై ముక్కంటి, ఏఎస్సై గుర్రం ప్రసాద్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
50 వేల మంది ఆశలు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దాదాపు 50 వేల మంది అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకు ముందే ఆయా పోస్టులను భర్తీచేసి ఉంటే వారంతా అర్హులయ్యేవారని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పీహెచ్డీ చేసి ఉండాలన్న యూజీసీ నిర్ణయం అనేకమంది నిరుద్యోగులకు నష్టం చేకూర్చుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రానికి లేఖ రాయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దశాబ్దంగా వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరగలేదు. 2017లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఈ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. గతంలో ఈ పోస్టులకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) అర్హతగా నిర్ధారించారు. ఇవి లేనివారికి ఎంఫిల్, పీహెచ్డీ చేసినా సరిపోయేది. కానీ తాజాగా నెట్, స్లెట్ ఉన్నా వాటికి వెయిటేజీ మార్కులు మాత్రమే ఉం టాయని, పీహెచ్డీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. పైగా ఈ నిర్ణయాన్ని గత నెల ఒకటో తేదీ నుంచే అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఉన్నత విద్యా మండలి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంతో కష్టపడి నెట్ లేదా స్లెట్‌లలో అర్హత సాధించిన వారంతా నష్టపోతారని అంటున్నారు. వారికి పీహెచ్డీ చేసే అవకాశం ఉన్నా అసిస్టెంట్ ప్రొఫె సర్ పోస్టులకు నెట్, స్లెట్ సరిపోతుందని భావించి చాలామంది ఊరుకున్నారు. కానీ యూజీసీ నిర్ణ యం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని అం టున్నారు. యూజీసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కేవలం ఆరు వేల మంది పీహెచ్డీ పూర్తి చేసిన వారే అర్హులవుతారని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే పోస్టుల భర్తీ జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పరిశోధన అంశంపై నిర్ణయం యూజీసీదే.. ప్రస్తుతం పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారు ఏ అంశంపై పరిశోధన చేయాలన్నది వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. ఆ మేరకు అభ్యర్థి తాను ఎంచుకున్న అంశంలో పరిశోధన తీరును వివరిస్తూ క్లుప్తంగా నివేదిక తయారు చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించాలి. అయితే వారి సొంతానికి పరిశోధన అంశాన్ని వదిలేయడం వల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని, సులువైన అంశాలు తీసుకొని చాలామంది తూతూమంత్రంగా పీహెచ్డీ పూర్తి చేస్తున్నారన్నది నిపుణుల ఆరోపణ. అంతేకాక ఇతరులు పూర్తి చేసిన పీహెచ్డీ థీసిస్‌లను దగ్గర పెట్టుకొని కొందరు కాపీ కొడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పరిశోధన అంటే అది సమాజానికి ఉపయోగపడాలన్నది యూజీసీ భావన. కాబట్టి ఏ అంశంపై పీహెచ్డీ చేయాలన్నది కూడా యూజీసీనే నిర్ణయిస్తుందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. -
దారుణం.. ఉద్యోగం కోసం తండ్రినే చంపాడు
రాంచీ : మానవత్వం మంటగలిసింది. ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కిరాతకపు కొడుకు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌గర్ జిల్లాలోని బర్కకనాలో కృష్ణారామ్ (55) అనే వ్యక్తి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత గరువారం రాత్రి అనుమానాస్పదరీతిలో కృష్ణారామ్ మృతి చెందాడు. గుర్తు తెలియన వ్యక్తి గొంతు కోసి చంపినట్లుగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకిని దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో కృష్ణారామ్ పెద్ద కొడుకు రామ్(35) హత్యచేసినట్లుగా కనుగొన్నారు. చిన్న కత్తితో క్వార్టర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపినట్లుగా తెలిపారు. (చదవండి : వివాహేతర సంబంధం, మటన్ వ్యాపారి హత్య) హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎల్ లీగల్ విభాగం ప్రకారం ఓ ఉద్యోగి తన సర్వీసు కాలంలో మరణిస్తే.. కారుణ్య కోటా కింద అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు.నిరుద్యోగి అయిన కృష్ణారామ్ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హతమార్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. -
బతికుండగానే చంపేశారు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ‘అర్జున్ సురవరం’ సినిమా వచ్చింది. నిరుద్యోగుల డిగ్రీ సర్టిఫికెట్లను వారికి తెలియకుండా సేకరించి, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈలోగా లోన్ కట్టలేదంటూ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులొచ్చి అరెస్టు చేస్తారు. బాధితుడైన హీరో.. ఆ స్కాంను బయటపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. సరిగ్గా హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. తమ తోటి వ్యాపార భాగస్వామి తండ్రిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వారి ఆస్తినే తాకట్టు పెట్టి రూ.16 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు నేర స్వభావం ఉన్నవారి చేతిలో పడితే చిక్కులు ఎదురవుతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. సీన్ కట్ చేస్తే..: బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 5లో రెన్‌లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రక్తం నుంచి తీసిన సీరమ్, అల్బుమిన్ తదితరాలను సేకరించి విక్రయిస్తుంది. 2017లో ఈ కంపెనీని ఆరుల్ ప్రకాశ్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్‌లు స్థాపించారు. వీరిద్దరూ కూడా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్.. మైసూర్ రాఘవేంద్ర మూడో డైరెక్టర్‌గా చేరాడు. రాఘవేంద్ర కుటుంబం పేరు మీద దక్షిణ బెంగళూరులోని కెంగెరి గ్రామంలో 3.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఆరుల్, అజీజ్‌లు కన్నేశారు. రాఘవేంద్రకు తెలియకుండా ఈ భూమి నకిలీ సేల్ డీడ్ సంపాదించారు. జానకీ రమాశర్మ అనే ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సాయంతో సదరు భూమిని తనఖాగా ఉంచి రుణం కోసం తొలుత ఎస్బీఐ సైఫాబాద్ శాఖలో రుణం కోసం యత్నించారు. అక్కడ యత్నం బెడిసికొట్టింది. ఈసారి మరింత పకడ్బందీగా మహబూబ్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రాఘవేంద్ర పేరిట రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్.. డైరెక్టర్ రాఘవేంద్ర తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, నకిలీ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఫొటోలు, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సంపాదించారు. రుణం కోసం దరఖాస్తు పత్రాలకు జతచేసిన వివరాలు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లోని వివరాలతో పొంతనలేదు. అయినా వాటిని అలాగే సమర్పించారు. ఈ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే.. మహబూబ్‌గంజ్ బ్రాంచ్ ఆర్ఎంఎంఈ పవన్‌కుమార్, చీఫ్ మేనేజర్ జే.నాగేశ్వరశర్మ, బ్యాంకు మేనేజర్ శశిశంకర్లు రూ.16 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర అవాక్కయ్యాడు. తన తండ్రి చనిపోయాడంటూ పత్రాలు సృష్టించారని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ విషయంపైతానే స్వయంగా దర్యాప్తు చేశాడు. బ్యాంకుకు వచ్చి లోను మంజూరు చేసినఫైళ్లలో ఫొటో, సంతకం తనవి కావని నిరూపించాడు. దీంతో నాలుక్కరుచుకున్న ఎస్బీఐ ఉన్నతాధికారులు లోను ఖాతాను నిరర్ధక ఆస్తి (నాన్‌పెర్ఫామింగ్ అసెట్)గా గతేడాది మార్చి 8న ప్రకటించారు. బ్యాంకు అంతర్గత విచారణలో విభాగాధిపతి ధనార్జనరావు సహా పలువురు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అనంతరం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తమ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురువారం రాత్రి నిందితులుగా ఉన్న ఎస్బీఐ అధికారులు, రెన్‌లైఫ్ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. -
22న నిరుద్యోగులకు జాబ్‌మేళా
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కే.రవికుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని హరిహర కళాభవన్ ఆడిటోరియంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చుని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఉచితంగా శిక్షణలు ఇచ్చిన మీదట ఉద్యోగ అవకాశాలు చూపించనున్నట్టు చెప్పారు. కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు, యానిమేటర్లు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, డొమెస్టిక్వాయిస్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఎలక్ట్రీషిన్ తదితర కోర్సుల్లో శిక్షణలు ఇవ్వనున్నట్టు డీసీ చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 22న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహరకళాభవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీ కోరారు. మరిన్ని వివరాలకు 9705092502, 9010650188. -
బాన్సువాడ ఆర్టీసీ డిపో ముందు నిరుద్యోగుల పడిగాపులు
-
అసత్య కథనాలపై భగ్గుమన్న యువత
సాక్షి, గుంటూరు: గ్రామ సచివాలయ పరీక్షలపై అవాస్తవాలు ప్రచారం పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శనివారం గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలను ఖండించారు. తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక కాపీలను తగలబెట్టారు. వంద రోజుల్లో 4 లక్షల ఉద్యోగాల కల్పనపై యువత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, రమేష్ గాంధీ, విద్యార్థి నేతలు సలాం, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రామ, వార్డు సచివాలయ’ పరీక్షలు అభ్యర్థులకు అనుకూలంగా..
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అర్హులైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనేకమంది అభ్యర్ధులు తమ విద్యార్హతలకు తగ్గట్టుగా నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పరీక్షలన్నిటికీ హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అనుకూలంగా వేర్వేరు తేదీలను నిర్ణయిస్తోంది. అలాగే, ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కూడా వీలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వారికి వేర్వేరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే, మధ్యాహ్నం పరీక్షకు సకాలంలో చేరుకోడానికి అభ్యర్థులు అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం ఉన్నందున అలాంటి వారు రెండు పరీక్షలను ఒకే కేంద్రంలో రాసేలా చర్యలు తీసుకుంటోంది. రెండు మూడ్రోజుల్లో పరీక్షల షెడ్యూలు కాగా, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు నిరుద్యోగులు అనూహ్యంగా స్పందించారు. శనివారం నాటికి 21,96,171 దరఖాస్తులు రావడంతో పరీక్షల నిర్వహణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ జె.విజయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు ఇదిలా ఉంటే.. అభ్యర్థులు అరగంటకు ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేదిలేదని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. దరఖాస్తుల గడువు పొడిగింపు రాష్ట్రంలో వరదల కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 10వ తేదీ శనివారం అర్ధరాత్రి 11.59 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించారు. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ముంపు ప్రాంతాలలో యువత విద్యుత్ అంతరాయాల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వలంటీర్ పోస్టులకు 26న రెండో నోటిఫికేషన్ ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి ఈ నెల 26న రెండో నోటిఫికేషన్ జారీచేసే ఆలోచనలో ఉన్నామని విజయకుమార్ తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే కేంద్రస్థాయిలో నియామక ప్రక్రియ జరుగుతుందని, ఆ తరువాత నుంచి ఏర్పడే ఖాళీలను జిల్లా కలెక్టర్లు, పురపాలక శాఖలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులు భర్తీచేస్తారని చెప్పారు. -
ఔరంగజేబును చంపి పుట్టాడట!
బాపు దర్శకత్వంలో కృష్ణ–జయప్రద జంటగా నటించిన సినిమా ఇది. ‘నా పేరు బికారి నా దారి ఎడారి’ పాట ఉన్న ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... బాగా ఆకలితో ఉన్న ఆ నిరుద్యోగి హోటల్లో కూర్చున్నాడు. అతని వాలకం చూస్తే ఎంతపెడితే అంత తినేలా ఉన్నాడు. కానీ జేబులో డబ్బులు అంతంతమాత్రంగానే ఉన్నాయి...అందుకే ఆచితూచి తినాలి...ఆకలి తీర్చుకోవాలి. సర్వర్ పోయాల వద్దా అన్నట్లు ఇడ్లీలో సాంబారు పోస్తున్నాడు.‘‘ఏమయ్యా...కనీసం తడవనన్నా లేదు. ఇంకొంచెం పొయ్యవయ్యా...ఏంటయ్యా నీ తాతగారి సొమ్ము పోయినంతంగా ముఖం పెడుతున్నావు... ఇంకాస్త పొయ్యి. ముక్కలేయవయ్యా’’ అరుస్తూనే ఉన్నాడు నిరుద్యోగి.‘‘సాంబార్లో ముక్కలెక్కడ వస్తాయి! ఆరోజులు ఎప్పుడో పోయాయి’’ అన్నాడు సర్వర్.ఆ తరువాత ‘‘కాఫీయా టీయా’’ అని అడిగాడు.‘‘కాఫీలో పాలెమన్నా ఉన్నాయా? అవి కూడా నీళ్లా?’’ సందేహంగా అడిగాడు నిరుద్యోగి.‘‘కాఫీలో పాలా! పోసేవాడే నీళ్లు పోస్తుంటే ఇక పాలెక్కడివి!!’’ అని గొప్ప సత్యం చెప్పి కాఫీ తీసుకురావడానికి కిచెన్ రూమ్‌లోకి వెళ్లాడు సర్వర్. కాఫీ తాగి బిల్లు కట్టి వెళుతున్నప్పుడు ఒక పెద్దాయనను చూశాడు. అతడి వాలకంబట్టి చూస్తే అతడే ఈ హోటల్‌కి ఓనర్ అనిపిస్తుంది. అతడు గట్టిగా అరిచాడు...‘‘ఒరే రంగయ్యా...నరసింహం ఏడిరా?’’‘‘అదిగోనండి...’’‘‘ఒరేయ్ నరసింహం....వెంకాయమ్మ ఈ సరుకులేవో కావాలంటుంది. ఇదిగో చూడు...’’నరసింహాన్ని చూడగానే నిరుద్యోగి కళ్లు సంతోషంతో మెరిశాయి.ఈలోపు బయటికి వెళ్లాడు నరసింహం.అతడిని అనుసరిస్తూ వెళ్లాడు నిరుద్యోగి.కొబ్బరిచెట్ల దగ్గర ‘‘ఒరేయ్ సింహం...నరసింహం’’ అని గట్టిగా పిలిచాడు.నరసింహం వెనక్కి తిరిగిచూశాడు.‘‘అరే మ్యాచూ...నువ్వా!’’ అన్నాడు ఆశ్చర్యంగా నరసింహం.‘‘నిన్ను చూడగానే నా ప్రాణం లేచివచ్చినట్లుయిందిరా. హోటలంతా నీ చేతుల మీదే నడుస్తున్నట్లుగా ఉందే’’ అన్నాడు మ్యాచూ.‘‘ఇప్పుడు నేను ఆ హోటల్‌కి మేనేజర్ని’’ కాస్త గర్వంగా అన్నాడు నరసింహం.‘‘అమ్మానాన్నా బాగున్నారా? ఏంపని మీద ఊరికి వచ్చావు?’’ అని అడిగాడు. ‘‘ఉద్యోగం కోసం వచ్చాను. ఆ సంగతే నీతో మాట్లాడుదామని...’’ గొణికాడు మ్యాచూ.‘‘ఇప్పుడు అర్జంటుగా పనిమీద వెళుతున్నాను. సాయంత్రం నెహ్రూపార్క్లో కలుసుకుందాం.అక్కడ మాట్లాడుకుందాం’’ అని అర్జంటుగా వెళ్లాడు నరసింహం.∙∙ పార్క్‌లో...‘‘నెల అయిందా వచ్చి! అది సరే 50 రూపాయలతో నెల రోజులు ఎలా లాక్కొచ్చావు!’’ ఆశ్చర్యంగా స్నేహితుడిని అడిగాడు నరసింహం.‘‘ఏముందీ..భోజనం మానేశాను. టిఫిన్ మాత్రమే తింటున్నాను. జేబులో ఇంకా పది రూపాయలు ఉన్నాయి. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. సిఫారసు లేనిదే ఉద్యోగం దొరికేట్లు లేదు. ఇదీ నా కథ. నిరుద్యోగి కథ’’ ఉన్నదంతా చెప్పాడు మ్యాచూ.‘‘ఇదా సంగతి. నువ్వేదో పే..ద్ద ఉద్యోగం చేస్తున్నావని మమ్మల్ని మించిపోయావని అనుకున్నాను’’ అన్నాడు నరసింహం.‘‘కాలేజీలో ఉండగా చదువుకోని వాళ్లు నాకు మనుషులుగానే కనిపించేవారు కాదు. ఇక డిగ్రీ వచ్చిన రోజు సరేసరి. ఈ డిగ్రీ చేతబట్టుకొని ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నట్లుగా కలకన్నాను. నా చూపులు పైనే ఉండేవి కాని కిందకు దిగేవి కావు. నాఅంత లేడనుకునేవాడిని. ఇప్పుడు నేను ఉద్యోగం కోసం తిరుగుతున్నప్పుడు తెలిసింది నేనెంత అల్పుడినో! ఆఖరికి ఆఫీసు బంట్రోతు కూడా నన్ను పురుగులా చూస్తున్నాడు’’ మనసులోని ఆవేదనంతా స్నేహితుడితో చెప్పుకున్నాడు మ్యాచూ.‘‘నీ కథ వింటుంటే బాధగానే ఉంది. కానీ ఇప్పుడు ఉద్యోగాలేమీ లేవు కదా’’ బాధపడుతూనే చేతులెత్తేశాడు నరసింహం.‘‘లేకేం! ముందు నాకో సర్వర్ ఉద్యోగం పారేయ్. తింటానికి ఉంటానికి ఒక చోటు దొరుకుతుంది’’ అడిగాడు మ్యాచూ.‘‘రేయ్...నీకేమైనా మతిపోయిందా! బీయే పాసై సర్వర్ ఉద్యోగం చేస్తావా?’’ ఆగ్రహించాడు నరసింహం.‘‘మహారాజులా చేస్తాను. అదిమాత్రం ఉద్యోగం కాదా’’ అన్నాడు మ్యాచూ.నరసింహానికి మళ్లీ కోపం వచ్చింది.‘‘చేయడానికి నీకు అభ్యంతరం లేకపోయినా...ఇవ్వడానికి నాకు సిగ్గుగా ఉంది’’ తప్పించుకోవాలని చూశాడు నరసింహం.అంతమాత్రాన మ్యాచూ ఊరుకుంటాడా ఏమిటి?‘‘నీకెందుకురా సిగ్గు! మేడ మీద ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. దొరకలేదు. ఇప్పుడు కింది నుంచి మొదలుపెట్టాను. ఇది మొదటి మెట్టు. ఎవరూ నిచ్చెన ఒక్కసారి ఎక్కలేరు కదా!’’ అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు మ్యాచూ. కొద్దిసేపు వాదోపవాదాల తరువాత ఎట్టకేలకు నరసింహం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.∙∙ మొత్తానికైతే మ్యాచూకు సర్వర్ ఉద్యోగం దొరికింది.‘‘ఏయ్ అబ్బాయ్, ఇదేమిటి? ఇడ్లి తెమ్మంటే దోశ తీసుకొచ్చావు’’ విసుక్కున్నాడు కస్టమరుడు.‘‘ఇడ్లి చల్లారిపోయిందండీ. మసాల దోశ వేడివేడిగా ఉంది....బాగుంది’’ అన్నాడు సర్వర్ మ్యాచూ.నిజానికి ఇడ్లి చల్లగా లేదు. అతనొకటి ఆర్డర్ ఇస్తే ఇతనొకటి విన్నాడు! తప్పును కవర్ చేసుకునేందుకు ‘వేడి వేడి దోశండీ. ప్రొప్రైటర్గారి కోసం స్పెషల్‌గా చేయించామండీ’’ అని కస్టమర్‌ను బుట్టలో వేశాడు మ్యాచూ.హోటల్లో పనిచేసే వాళ్లు ఆ రాత్రి డాబాపై సంగీత కచేరి పెట్టారు. వాళ్లదగ్గరికి వెళ్లారు మ్యాచూ, నరసింహం.‘‘ఆపండ్రా మీ కాకిగోల’’ అరిచాడు నరసింహం.‘‘కాకిగోలా ఇది? కోకిలగానం’’ అని ఆత్మవిశ్వాసం ప్రకటించాడు ఆ సంగీతకారుడు.‘‘మీ పాటకు కింద గాడిదలు చేరుతున్నాయి’’ అని కూడా అన్నాడు నరసింహం.‘‘ఔరంగజేబును చంపి పుట్టావయ్యా. సంగీతం చచ్చిపోయింది అని ఆయనకు ఎవరో చెబితే లోతుగా పూడ్చిపెట్టమని చెప్పాడట’’ వ్యంగ్యంగా అన్నాడు సంగీతకారుడు.అందరూ పెద్దగా నవ్వారు! -
ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన నిరుద్యోగుల పాట్లు
-
శిక్షణ... ఉపాధి కల్పన...!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగుల అభ్యున్నతికి వెనుకబడిన తరగతులు ఆర్థిక సహకార సంస్థ(బీసీ కార్పొరేషన్) కొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. శిక్షణ, ఉపాధి కల్పనకు కార్యాచరణ సిద్ధపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఈ తరహా శిక్షణ, ఉపాధి కార్యక్రమాల అమలుతో మంచి ఫలితా లు సాధిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2019–20 వార్షిక సంవత్సరంలో కనిష్టంగా 10వేల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును సైతం క్రమంగా పెంచుతోంది. గత రెండేళ్లుగా ఎంబీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించింది. రూ.50 వేల మొత్తంలో ఏర్పాటు చేసే అన్ని స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన బీసీ కార్పొరేషన్ ఆ మేరకు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చింది. 2018–19 సంవత్సరంలో దాదాపు రూ.300 కోట్లకుగాను చెక్కులు ఇచ్చారు. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు చెబుతు న్నారు. ఉపాధి కల్పన వైపు దృష్టి సారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగం గా 2019–20 సంవత్సరంలో రూ.220 కోట్లతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కులవృత్తుల్లో మెళకువల కోసం.. గతేడాది నాయీబ్రాహ్మణ ఫెడరేషన్, కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ల ద్వారా వారి కులవృత్తుల్లో యువతకు మెళకువలు నేర్పి మినీ బ్యూటీపార్లర్ల, మట్టి విగ్రహాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. శిక్షణ పొందిన మెజార్టీ యువతకు ఉపాధి దక్క డంతో కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకుని ఆ మేరకు శిక్షణ చేప ట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనాన్ని ఇస్తారు. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఆతిథ్య రంగం, హోటల్ నిర్వహణ, నిర్మాణ రంగాలను శిక్షణకు ఎంచుకున్నారు. -
ఉద్యోగార్థుల కోసం గూగుల్ అప్డేట్
శాన్ఫ్రాన్సిస్కో: ఉద్యోగాల కోసం వెతికే నిరుద్యోగులకు తనవంతు సాయం అందించేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ముందుకొచ్చింది. దీనికోసం ఓ నూతన అప్డేట్ను తీసుకురానుంది. దీనిలో భాగంగా ఫలానా ఉద్యోగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయి, ఆ ఉద్యోగాన్ని పొందడానికి చేయాల్సిన విధులపై పూర్తిస్థాయి సమాచారాన్ని నిరుద్యోగులకు అందించేలా ఇది ఉండనుంది. అలాగే గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌కు సరికొత్త హంగులు అద్దేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా సెర్చ్ ఇంజిన్‌కు ఊహా శక్తిని అందించాలని నిర్ణయించినట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. గూగుల్ యూజర్ ఇంటర్ఫేస్ను మరింత అందంగా తీర్చిదిద్దనుంది. దీనికోసం కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్‌లను ఉపయోగించనున్నట్లు సెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బెన్ గోమ్స్ శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. -
నిరుద్యోగి ఆత్మహత్య
అనంతపురం టౌన్: అనంతపురంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బారెడ్డి (24) డిగ్రీ వరకు చదువుకున్నాడు. మూడు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కలేదని మనోవేదనకు లోనయ్యాడు. ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చిన సుబ్బారెడ్డి బుధవారం అనంతపురం రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వద్ద లభించిన బ్యాగును రైల్వే పోలీసులు పరిశీలించగా.. నైలాన్ వైరు కనిపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. సెల్‌నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోలీసులు కేసు నమోదు చేశారు. -
గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగుల ధర్నా
-
చంద్రబాబు మోసం వల్లే త్రినాథ్ ఆత్మహత్య
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వంమాట తప్పడం.. సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. ప్రత్యేకహోదా తీసుకురావడంలో చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి మనస్తాపం చెంది దొడ్డి త్రినాథ్(28) అనే నిరుద్యోగి సెల్‌టవర్‌కు ఉరి వేసుకుని బహిరంగంగా ఆత్మహత్య చేసుకోవడంజిల్లాలో సంచలనం సృష్టించింది. విశాఖపట్నం, నక్కపల్లి (పాయకరావుపేట): రాజమండ్రి సమీపంలోని లాలా చెరువు బర్మాకాలనీకి చెందిన దొడ్డి త్రినాథ్ (28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో ఆరేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. నక్కపల్లి మండలం వేంపాడు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తన బావ వనం నర్సింగరావు, అక్క ఉమాదేవి వద్దకు ఏడాది క్రితం వచ్చాడు. బావకు చేదోడో వాదోడుగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డాడు. ఉద్యోగం రాలేదు సరికదా, కనీసం నిరుద్యోగభృతి కూడా ఇవ్వకపోవడంతో తరచూ మనస్తాపం చెందేవాడు. ప్రత్యేక హోదా వచ్చినా పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరగుపడేవని భావించేవాడు. హోదా విషయంలో చంద్రబాబునాయుడు రోజుకో విధంగా మాట్లాడటం చూసి ఇక హోదా వచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేశాడు. ఎంతకీ అతను ఇంటికి రాకపోవడం.. ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కంగారు పడ్డారు. చివరకు సాయంత్రం 8297293561 నెంబరు నుంచి నర్సింగరావుకు ఫోన్ వచ్చింది. కాగిత సెల్ టవర్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని అతను కొన్ని కాగితాలు జెరాక్స్ తీసి కిందపడేశాడని ఇందులో మీ నెంబరు ఉండటంతో ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. వెంటనే కాగిత వద్దకు వచ్చి చూడగా అప్పటికే త్రినాథ్ టవర్‌పై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. త్రినాథ్ తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి నూకరత్నం, అన్న వీర వెంకట సత్యనారాయణతో కలిసి రాజమండ్రిలో ఉండేవాడు. అన్న రాజమండ్రిలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అక్క ఉమాదేవిని నక్కపల్లి మండల పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావుకు ఇచ్చి వివాహం చేయడంతో వారి కుటుంబం నామవరం వద్ద ఉంటోంది. అక్కా బావల వద్దకు ఏడాది క్రితం వచ్చిన త్రినాథ్ ఇక్కడే ఉంటున్నాడు. నర్సింగరావు కుటుంబం శనివారం తిరుపతి వెళ్లడానికి సన్నద్ధులవుతున్నారు. త్రినాథ్ సోదరుడు వీర వెంకట సత్యనారాయణ అన్నవరం దర్శనానికి వచ్చాడు. తిరుగుప్రయాణంలో ఉండగా తమ్ముడి మరణ వార్త విని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన ప్రాంతానికి స్థానికులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎస్ఐ సింహాచలం మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్సెట్) మృతుడు త్రినాథ్ (ఫైల్) హోదా వస్తేనే తన మరణానికి అర్థం ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే తన మరణానికి ఒక అర్థం ఉంటుందని, మా అమ్మ నన్ను కన్నందుకు ఒక ప్రయోజనం ఉంటుందని’ పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన లేఖను జేబులో పెట్టుకుని ప్రాణాలు వదిలాడు. తన మరణానికి ప్రత్యేకహోదా రాకపోవడమే కారణమంటూ లేఖలో పేర్కొన్నాడు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదేపదే గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావడంలో ఎందుకు శ్రద్ధ చూపించండం లేదంటూ నోట్లో ప్రశ్నించాడు. కేరళ వరద బాధితులపై అందరూ ప్రేమ చూపిస్తున్నారని, ఏపీ బాధితులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ఫిర్యాదులో ప్రస్తావనకు రానిప్రత్యేక హోదా అంశం త్రినాథ్ ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించలేదు. తల్లి నూకరత్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శుక్రవారం రాత్రి మంచి ఉద్యోగం చూసుకో, అన్నయ్యకు మంచి ఉద్యోగంలేదు. నువ్వయినా మంచి ఉద్యోగం చేసుకో అని హితబోధ చేశానని ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదులో ప్రత్యేక హోదా రాలేదని, హోదా తీసుకురావడానికి చంద్రబాబునాయుడు కృషి చేయాలని, అప్పుడే తన మరణానికి అర్థం ఉంటుందని పేర్కొంటూ రాసిన సూసైడ్ లేఖ విషయాన్ని ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకహోదా కోసమే ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ప్రధానంగా ప్రచారం జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావనతో కొంతమంది టీడీపీ పెద్దలు తెరవెనుక రాజకీయం చేసి సూసైడ్‌నోట్, ప్రత్యేకహోదా ప్రస్తావన లేకుండా ఫిర్యాదు చేయించారన్న ప్రచారం జరుగుతోంది. మృతుడు బావ నర్సింగరావు పంచాయతీ కార్యదర్శిగా ఉండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భయపడినట్లు తెలిసింది. దీనిపై ఎస్ఐ సింహాచలాన్ని వివరణ కోరగా సెల్‌టవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కేసు నమోదు చేశామన్నారు. మృతుడు వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. చంద్రబాబు మోసం వల్లే త్రినాథ్ ఆత్మహత్య ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు సర్కారు చేసిన మోసం వల్లే త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణపేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ సర్కారు హత్యేనన్నారు. త్రినాథ్ మృతికి చంద్రబాబు సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
నిరుద్యోగ గర్జన సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం కరీంనగర్లో నిర్వహించాల్సిన నిరుద్యోగ గర్జన సభను వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ మార్పును అంతా అర్థంచేసుకోవాలని కోరారు. ఈ నెల 24న జరగనున్న సభకు నిరుద్యోగులు, పార్టీ రాష్ట్ర, అన్ని జిల్లాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఉద్యోగాల భర్తీకి పోరాడండి: కృష్ణయ్య
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హాల్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు, ఏపీలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. ఖాళీల భర్తీలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలు, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో 12 లక్షల ఉద్యోగాలు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. రిటైర్ అయిన వారిని వోఎస్‌డీలు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగులుగా ఇప్పటివరకు 2 వేల మందిని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది రోడ్డు మీద తిరుగుతుంటే.. రిటైర్ అయిన వారిని కొనసాగించడం న్యాయం కాదన్నారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, అంజి, రామలింగం, రామకృష్ణ, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 సిలబస్‌తో గుండె గుభేల్!
సాక్షి, అమరావతి: గ్రూప్–1 సిలబస్‌ను మార్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చినవీ సకాలంలో పూర్తి చేయకుండా ఇప్పటికే తమ తలరాతలు మార్చేస్తున్న ఏపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ మార్పుతో మరింత గందరగోళానికి గురి చేస్తోందని పేర్కొంటున్నారు. కొత్త సిలబస్ ప్రకటనతో రూ.లక్షలు ధారపోసి తాము పొందిన అంతా శిక్షణ అంతా వృథా కానుందని వాపోతున్నారు. మెయిన్స్‌లో ఏడు పేపర్లు.. గ్రూప్–1 సిలబస్‌లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్‌ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు పేపర్‌ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు.. ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. మార్పులతో కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్‌ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. సిలబస్ రెట్టింపు.. –గతంలో మెయిన్స్‌లో ఇంగ్లీషుతో కలిపి ఆరు పేపర్లుండగా కొత్తగా తెలుగు చేర్చారు. ఇంగ్లిషు, తెలుగు రెండూ క్వాలిఫయింగ్ పేపర్లే. ఇంగ్లీషు సిలబస్‌ను కఠినం చేశారు. గతంలో మెయిన్స్‌లో ఒక్కో పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించగా ఇప్పడు 2.30 గంటలకు తగ్గించారు. –మెయిన్స్ పేపర్–2 లో కొత్తగా ఇండియన్, ఏపీ జాగ్రఫీని 50 మార్కులకు చేర్చారు. పేపర్–3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ బేసిస్ నాలెడ్జి ఆఫ్ లా’ అంశాలను అదనంగా 120 మార్కులకు చేర్చారు. సివిల్స్‌లో ప్రధాన పేపర్‌గా ఉన్న ఎథిక్స్లోని అంశాలను ఇక్కడ కేవలం ఒక సెక్షన్లో పెట్టారు. హిస్టరీ, ఎకనామిక్స్‌లు పాత సబ్జెక్టులే అయినా వాటి అంశాలను మరింత ఎక్కువ చేశారు. దాదాపు రెట్టింపు అయిన సిలబస్‌కు సన్నద్ధం కావడానికి ఏడాది సమయం పడుతుందంటున్నారు. ఇప్పటికే పాత సిలబస్‌లో గ్రూప్–1 కోసం రూ.లక్షలు వెచ్చించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగుపాటులా మారింది. ఏడాదిన్నరగా తీసుకున్న కోచింగ్ అంతా వృథా అని వాపోతున్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద చెల్లించిందంతా వృథా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఇదంతా పాత సిలబస్‌లోనే కొనసాగింది. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రవేశపెట్టడంతో ఈ శిక్షణ అంతా వృథా కానుంది. సిలబస్ పెరగడంతో కోచింగ్ సెంటర్లు కూడా ఫీజు మూడు రెట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కొత్త సిలబస్‌ను ప్రస్తుతం ఇవ్వనున్న నోటిఫికేషన్లకు కాకుండా తరువాత వెలువడే వాటికి వర్తింపచేయాలని కోరుతున్నారు. దీనివల్ల సివిల్స్ అభ్యర్ధులకూ ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. మెయిన్స్‌లో ఏడు పేపర్లు గ్రూప్–1 సిలబస్‌లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్‌ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు పేపర్‌ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్‌లో 2 పేపర్లు ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్‌ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. -
నిరుద్యోగులకు కఠినంగా మారనున్న ఏపీపీఎస్పీ తాజా నిర్ణయం
-
నిరుద్యోగులపై ఉక్కుపాదం
విజయవాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై మరోసారి ఉక్కుపాదం మోపింది. నిరుద్యోగుల డిమాండ్లను కూడా వినకుండానే వారి గొంతును నొక్కేసింది. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను డిమాండ్ చేయడానికి వెళ్తున్న వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలను, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అణచివేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.12 లక్షల పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయం వద్ద శుక్రవారం నిరుద్యోగ యువతతో కలసి ధర్నా చేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బందరురోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నుంచి బయటకు రాకుండా నిలువరించారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి నగరానికి 40 కి.మీ దూరంలోని ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ప్రభుత్వంపై నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘నిరుద్యోగులను నట్టేట ముంచిన చంద్రబాబు డౌన్ డౌన్. నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి ఇవ్వని సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సలాంబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అప్పటి ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తొలిగించిన ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. గ్రూపు–2ని గ్రూపు–1లోకి విలీనం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. జిల్లా అ«ధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కమల్‌నాథన్ కమిషన్ నివేదిక మేరకు 1.42 లక్షల పోస్టులు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం వాటిని 77,737కి కుదించడం దారుణమన్నారు. అందులోనూ కేవలం 20 వేల పోస్టులు మాత్రమే రెగ్యులర్, మిగిలినవన్నీ ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వంచించిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన విద్యార్థులను రాత్రి ఎనిమిది గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు తాళ్లూరి రాజేష్, ప్రధాన కార్యదర్శులు అర్జున్, శ్యామ్, నాగిరెడ్డి, పవన్, ప్రతాప్, అశోక్, సాయి, గణేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వసూళ్ల కేంద్రంగా సీఎంవో!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దలు, ఉన్నత వ్యక్తులే యధేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా అదేబాటలో నడుస్తున్నారు. పెద్దల స్థాయి పెద్దలది, మా స్థాయి మాది అన్నట్టుగా సీఎం కార్యాలయం సిబ్బంది వసూళ్లపై మాట్లాడుకోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి వేదికైన సీఎం కార్యాలయమే లంచాలు, వసూళ్లకు వేదిక కావడం, దీనిపై చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడం అధికార వర్గాలతోపాటు సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. టీచర్ ఉద్యోగాల పేరుతో సీఎం చంద్రబాబు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు నిరుద్యోగుల నుంచి రూ.కోట్లలో వసూలు చేయడం కలకలం రేపుతోంది. పాలనా కేంద్రంలో జోరుగా బేరసారాలు పాలనకు ఆయువుపట్టుగా ఉండే సీఎంవోలో వసూళ్లు, లంచాలకు సంబంధించి లావాదేవీలు జరుగుతున్నట్టు వెల్లడి కావడం అధికార వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. రాష్ట్రానికి ప్రధాన పరిపాలనా కేంద్రమైన ఇక్కడే ఇలా బేరసారాలు జరగడంపై ఉన్నతాధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎంవోలోనే ఇలా ఉంటే ఇక జిల్లా కేంద్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీచర్ ఉద్యోగాల పేరుతో దాదాపు 73 మందిని మోసగించినట్లు భావిస్తున్నారు. సీఎంవో ఉద్యోగి కావడంతో విశ్వసించిన బాధితులు నిత్యం నలుగురైదుగురు ఐఏఎస్‌లు, అదనపు కార్యదర్శులు, డిప్యూటీ సెక్రటరీలు, సహాయ కార్యదర్శులు పనిచేసే ముఖ్యమంత్రి కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాంగోపాల్ ఎయిడెడ్ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా వసూలు చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు తెలిసింది. సీఎం కార్యాలయం ఉద్యోగి కావడంతో అభ్యర్థులు పూర్తిగా విశ్వసించి లంచాలు చెల్లించారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగటంతో విషయం బయటకు వచ్చింది. సీఎంకు దగ్గరగా ఉంటారని.. ఏపనైనా ఇట్టే చేస్తారని! సీఎంవో కార్యాలయం ఉద్యోగి రాంగోపాల్(ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు) బాధితుడైన సురేష్‌బాబుకు ఇబ్రహీంపట్నంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగనాయకమ్మ ద్వారా పరిచయమయ్యాడు. సీఎంకు దగ్గరగా ఉంటారని, ఏపనైనా ఇట్టే చేసి పెడతారని చెప్పడంతో సురేష్‌బాబుకు గురి కుదిరింది. అలా కుదిరిన పరిచయంతో టీచర్ పోస్టు కోసం సురేష్‌బాబు డబ్బులు చెల్లించాడు. మరికొంత మంది నిరుద్యోగులను తీసుకొస్తే వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని రాంగోపాల్ చెప్పాడు. ఒక్కో ఎయిడెడ్ పోస్టుకు రూ.16 లక్షలు చెల్లించేలా బేరం కుదిరింది. తన ఖాతాలో డబ్బులు వేస్తే ఇబ్బందులొస్తాయని రాంగోపాల్ చెప్పడంతో దాసరి సురేష్ అనే వ్యక్తి ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలిదశలో రూ.22 లక్షలు బ్యాంకులో వేశారు. రాంగోపాల్ ఆ తర్వాత గుంటూరు కోస్టల్ బ్యాంకులోని తన భార్య ఖాతాకు రూ.10 లక్షలు మళ్లించుకున్నట్లు బాధితుడు తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనుమానంతో నిలదీసిన నిరుద్యోగులు ఓవైపు లావాదేవీలు జరుగుతున్నా ఎవరికీ ఉద్యోగాలు రాకపోవడం, ఆర్నెళ్లకుపైగా గడిచిపోవడంతో బాధితులు రాంగోపాల్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో తాను ఉన్నతాధికారులకు డబ్బులిచ్చానని, తొందర పెట్టొద్దని చెప్పాడు. అయితే డబ్బులు చెల్లించిన నిరుద్యోగులకు అనుమానం వచ్చి మరింత ఒత్తిడి చేయడంతో విషయం బట్టబయలైంది. డబ్బుల వసూలు వెనుక ఉన్నత స్థాయి వ్యక్తులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాంగోపాల్‌కు కీలక నేత అండదండలు... నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన రాంగోపాల్ సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. దీంతోపాటు ఉద్యోగుల సంఘంలో కీలక నేత అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సీఎంవోలో ఓ కీలకౖ∙వ్యక్తితో దగ్గర సంబంధం ఉండటంతో యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రాంగోపాల్‌కు ట్రావెల్ ఏజన్సీలతోపాటు చిట్టీల వ్యాపారం ఉన్నట్లు సమాచారం. కాగా, బాధితులు కొందరు ఫిర్యాదు చేయడానికి నేరుగా సీఎంవోకి రావడంతో పరువు పోతుందని ఆందోళన చెందిన అధికారులు రాంగోపాల్‌ను సీఎంవో నుంచి జీఏడీకి మార్చారు. తర్వాత అక్కడ నుంచి యువజన సర్వీసులకు మార్చారు. కేసు నమోదుకు ఆదేశించాం నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. రూ.22 లక్షల వరకూ వసూలు చేసినట్టు మాకు ఫిర్యాదులందాయి. కేసు నమోదు చేయాలని డీఎస్పీని ఆదేశించాం. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరాం. –నాగులాపల్లి శ్రీకాంత్, సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి (రాజకీయ) చావే శరణ్యం వ్యవసాయం చేసుకునే తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగనాయకమ్మ ద్వారా రాంగోపాల్ పరిచయమైనట్లు బాధితుడు వి.సురేష్‌బాబు ఈనెల 2న తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగమొస్తుందంటే ఆశపడి తనతోపాటు 73 మంది బాధితులు డబ్బులు కట్టారని తెలిపాడు. డబ్బు తిరిగి ఇప్పించకుంటే తన కుటుంబానికి చావే శరణ్యమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఎంవోలో తనకు తెలిసిన వారున్నారని రాంగోపాల్ బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. -
ఉద్యోగం దొరకలేదని చోరీ
సాక్షి,అన్నానగర్ : ఉద్యోగం దొరకలేదని విరక్తితో ఎంబీఏ పట్టభద్రుడు 12 సవర్ల నగలను చోరీ చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై తిరువికనగర్ ప్రభు వీధికి చెందిన అరివళగన్. ఇతను కుటుంబంతో మంగళవారం బయటికి వెళ్లి ఇంటికి వచ్చాడు. అప్పుడు తలుపులు తెరచి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 12 సవర్ల నగలు చోరీ అయినట్టు తెలిసింది. అరివళగన్ తిరువికనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహాయ కమిషనర్ హరికుమార్ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అప్పుడు బీరువాలో ఉన్న రూ. 70వేలు నగదు చోరీకి గురికాలేదు. దీంతో అరివళగన్‌కి తెలిసిన వారు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. బాడుగకు ఉన్నవారి వద్ద పోలీసులు విచారణ చేశారు. అప్పుడు తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడికి చెందిన ఇళమదిని పోలీసులు విచారణ చేశారు. విచారణలో అతను నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసుల విచారణలో ఇళమది ఎంబీఏ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఇతను అరిశలగన్ ఇంట్లో మూడు నెలల ముందు బాడుగకు చేరాడు. అరివళగన్ లగ్జరీ జీవితం చూసిన ఇళమది అతని ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు. దీని ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసిన ఇళమది వాటిని తన భార్యకు ఇచ్చాడు. భార్య మందలిచ్చి తీసిన స్థలంలో నగలను పెట్టాలని బుద్ధి చెప్పింది. నగలను బీరువాలో పెట్టడానికి ఇళమది వెళ్లేలోపు అరివళగన్ వచ్చాడు. దీంతో నగలను ఓ బంధువు వద్ద ఇచ్చి ఇళమది ఇంటికి వచ్చాడు. ఫిర్యాదు ఇచ్చిన ఆరుగంటల సమయంలోనే ఇళమదిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారా?
సాక్షి, విజయవాడ: యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతిపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తామని చెప్పి, వెయ్యి రూపాయలకు తగ్గించారని తెలిపారు. ఇది న్యాయమా.. రాష్ట్రంలో అనేక మంది విద్యార్ధులు ఉద్యోగ, ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేస్తే నవనిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. చంద్రబాబుది నవనిర్మాణ దీక్ష కాదు.. శవ నిర్మాణదీక్ష. ‘తాను మారానంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కానీ ఆయనలో మార్పు లేదు. చంద్రబాబు పాలన అత్యంత పేలవంగా వుంది. తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌లో ఎప్పుడు కలుపుతున్నారు బాబూ..? ఇప్పటికే పరోక్షంగా మీ వైఖరి ప్రజల్లోకి పంపించారు. గతంలో మీరన్న ఇటలీ దెయ్యం.. ఇండియా దేవతగా మీకు కనిపిస్తోందా? కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిపి అభయహస్తం చూపించలేదా? ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబును అనధికారికంగా కర్ణాటకలో మీ ప్రచార దూతగా పంపించారు. అశోక్‌బాబు టీడీపీ కోవర్ట్. ఆయనను ప్రత్యేకంగా టీడీపీలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీ ప్రజలను ముంచేశాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి. నా రక్తంలో ముప్పైశాతం కాంగ్రెస్ రక్తం వుందని చంద్రబాబు చెప్పారు. రోజురోజుకు కాంగ్రెస్ రక్తం చంద్రబాబులో పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీని ఎప్పుడు అమ్మకానికి పెట్టబోతున్నారు? తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారా? చంద్రబాబు దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు సామాన్యులకు న్యాయం జరగదని ఎన్టీఆర్ టీడీపీనీ స్థాపించారు. చంద్రబాబు కాంగ్రెస్‌కు కోవర్ట్‌గా వున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ చిదంబరంతో కోవర్ట్ మంతనాలు చేశారు. టీడీపీ నేతలు కళ్లు తెరవాలి. చంద్రబాబును అధ్యక్షస్థానం నుంచి పక్కకు తప్పించండి. ఎన్టీఆర్ ఆశయాల కోసం కట్టబడిన వారు బయటకు రావాలి. చంద్రబాబుకు కట్టబానిసలుగా వుండకండి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని ఫ్రంట్లు పెట్టారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, మహాకూటమిలను ఏర్పాటు చేశార’ని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. -
యువతను నిర్వీర్యం చేస్తే నవనిర్మాణం సాధ్యమా?
-
సర్కారీ కొలువుల పేరుతో ‘సైబర్’ వల!
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రభుత్వ రంగ సంస్థ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. భారీ నియామక ప్రకటన జారీ చేసి నిరుద్యోగులను బురిడీ కొట్టించేందుకు యత్నించారు. తెలంగాణ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించి.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకటనను తలదన్నే రీతిలో 4,027 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు, వయో పరిమితి సడలింపులను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు సైతం ప్రకటించారు. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణను సైతం ప్రారంభించిన ఈ వెబ్సైట్ దరఖాస్తుదారుల వ్యక్తిగత, విద్యార్హతల వివరాల సేకరణతో పాటు పరీక్షల ఫీజు పేరుతో ఆన్లైన్ చెల్లింపుల విధానం ద్వారా రూ.98లను వసూలు చేస్తోంది. ఇది రాష్ట్ర ఐటీ శాఖ దృష్టికి రావడంతో అధికారులు పరిశీలించి నకిలీ వెబ్‌సైట్‌గా నిర్ధారించారు. ఆ శాఖ ఫిర్యాదుతో సైబర్ సెక్యూరిటీ విభాగం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్.. తాము ఎలాంటి నియామకాలు జరపడం లేదని, నిరుద్యోగులు మోసపోరాదని ప్రకటించింది. -
దగాపడ్డ నిరుద్యోగి బలవన్మరణం
అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం. లేదంటే రూ. 2వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తా’ అంటూ 2014లో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఉద్యోగాల కల్పన ఊసే లేకుండా పోయింది. తమ చదువులకు తగ్గ ఉద్యోగాలు దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతోంది. నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారింది. ఇదిగో.. అదిగో అంటూ ఇంత కాలం మాటల గారడీతో నెట్టుకొచ్చిన చంద్రబాబు వైఖరితో విసుగు చెందిన ఓ నిరుద్యోగి.. చివరకు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. చిలమత్తూరు: తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదంటూ మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లికి చెందిన ఆదిమూర్తి, అంజనమ్మ దంపతులకు బి.ఆనంద్(24) ఏకైక కుమారుడు. ఎంబీఏ చేస్తుండగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగుళూరుకు చేరుకుని సెక్యూరిటీ గార్డ్‌గా కొన్ని రోజులు పనిచేశాడు. వస్తున్న సంపాదన మహానగరంలో తన జీవనానికే సరిపోక ఇబ్బందులు పడ్డాడు. కష్టమో.. నష్టమో.. ఉన్న ఊళ్లోనే పని చేసుకుంటూ తల్లిదండ్రుల బాగోగులు దగ్గరుండి చూసుకోవాలని భావించిన అతను బెంగళూరును విడిచి తిరిగి గొల్లపల్లికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బతుకు తెరువు కోసం అతను చేయని పని అంటూ లేదు. అయినా అరకొర సంపాదన అతన్ని కుంగదీస్తూ వచ్చింది. తన చదువుకు తగ్గ ఉద్యోగం లేదని పలువురితో అతను వాపోయేవాడు. ఈ నాలుగేళ్లుగా ఉద్యోగాల వేటలో అతను అలసిపోయాడు. తనకు ఉద్యోగం లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా పోషించాలి అంటూ తనలోతానే మదనపడుతూ వచ్చిన ఆనంద్.. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెరువు గట్ట వద్దకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన పశువుల కాపరులు.. అక్కడ పడి ఉన్న ఆనంద్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున చెరువు గట్టు వద్దకు చేరుకుని ఆనంద్ మృతదేహాన్ని పరిశీలించారు. వృద్ధాప్యంతో తమకు దిక్కెవరు అంటూ తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేసింది. ఘటనపై ఎస్ఐ ప్రదీప్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. -
డీఎస్సీ నోటిఫికేషన్లు లేనేలేవు
సాక్షి, అమరావతి: ఏటా టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం తుంగలోతొక్కింది. 2014లో ఓ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకొంది. ప్రభుత్వం ఆమోదంలేకపోవడంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేకపోతున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించినా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ఉద్యోగ వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచినా నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఎండమావులే అయ్యాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు రిటైర్మెంట్ అయిన పోస్టులతో కలుపుకుంటే 19,468 ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. పోస్టుల్లో కోత పెట్టేలా నివేదికను తెప్పించింది. ఇటీవల జిల్లాల నుంచి విద్యాశాఖ తెప్పించిన సమాచారంలో కేవలం 10,603 పోస్టులు ఉన్నట్లుగా చూపారు. 2014లో డీఎస్సీ ప్రకటించినప్పుడు 10,313 పోస్టులు భర్తీచేశారు. ఆతరువాత సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులకోసం కేంద్రానికి పంపిన నివేదికల్లో రాష్ట్రంలో తొలుత 19,468 అని, ఆ తరువాత 14,194 ఖాళీలు ఉన్నట్లు చూపించారు. టీచర్ పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లోనూ ఇదే సంఖ్యను చూపారు. ఈ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5,655, స్కూల్ అసిస్టెంట్లు 3,119, ఎల్పీలు 260, పీఈటీలు 1,115, మ్యూజిక్ 77, మోడల్ స్కూలు 938, ఐఈడీఎస్‌ఎస్ 860, మున్సిపల్ 1,147, కంప్యూటర్ టీచర్లు 1,023 పోస్టులు ఉన్నట్లు చూపించారు. 2014 డీఎస్సీ తరువాత మళ్లీ నోటిఫికేషన్ రానందున రిటైరయిన వారి పోస్టులను కూడా కలుపుకుంటే పోస్టుల సంఖ్య పెరగాలి కానీ తగ్గినట్లు చూపడం విడ్డూరం. రాష్ట్రంలో 22,814 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని గత ఏడాది చివర్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. తరువాత ఆ సంఖ్యను ప్రభుత్వం తగ్గిస్తూ 14,300 భర్తీ చేయాలని పేర్కొంది. ఈ పోస్టుల్లో మోడల్ స్కూల్ టీచర్లు 988, మున్సిపల్ టీచర్ పోస్టులు 1,447, పాఠశాల విద్యాశాఖ పరిధిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5,900, స్కూల్ అసిస్టెంటు టీచర్లు 3,419, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 1,100, ఐటీ టీచర్లు 1,020, మ్యూజిక్ టీచర్లు 77, ఇతర టీచర్ పోస్టులు 349 గుర్తించారు. ఈ పోస్టుల్లో ఆర్థిక పరమైన మంజూరు ఉన్నవి 10,603 మాత్రమేనని, తక్కిన వాటికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉందని తేల్చారు. ఆర్థిక అనుమతులు లేని పోస్టుల విషయంలో నాలుగు నెలల క్రితం ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతులు వస్తేనే కానీ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒకేసారి పోస్టులన్నీ భర్తీ చేసే బదులు రెండు విడతలుగా భర్తీ చేస్తే.. రెండు ఏళ్లు వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లు భ్రమింపచేయవచ్చు అన్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పోస్టులను తగ్గించి ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. అదే అయితే పోస్టుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతాయని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
తప్పుల తడకగా టీఆర్టీ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) హాల్‌టికెట్ల జారీ గందరగోళంగా మారింది. అభ్యర్థుల హాల్టికెట్లలో తప్పులు దొర్లడంతోపాటు పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ భారీ తప్పిదం జరిగింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక తప్పిదంతో పరీక్ష కేంద్రాల కేటాయింపు తారుమారైంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన మూడు ప్రాధాన్య జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న ఇతర జిల్లాల్లో కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం అనేక మంది టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిపై టీఎస్పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీజీజీలో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన టీఎస్పీఎస్సీ.. హాల్‌టికెట్ల డౌన్లోడ్ లింకును వెబ్సైట్ నుంచి తొలగించింది. అభ్యర్థులు ఆందోళన చెందొద్దని.. కొత్త హాల్‌టికెట్లను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఇప్పటికే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారితోపాటు మిగిలిన వారు కూడా కొత్త హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. వీలైతే ఈ నెల 21న (బుధవారం) హాల్‌టికెట్ల లింకు అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. సీజీజీ వరుస తప్పిదాలు.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వరుస తప్పిదాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. గతంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కేటాయింపులో తప్పులు జరిగిన తర్వాత కూడా సీజీజీ జాగ్రత్త వహించిన దాఖలాలు లేవు. ఇటీవల గ్రూప్–1 పోస్టులకు పోస్టుల కేటాయింపే అందుకు ఉదాహరణ. సీజీజీ సాంకేతిక తప్పిదంతో అభ్యర్థుల పోస్టింగులు మారిపోయాయి. దీనిపై ఫిర్యాదులందడంతో ఎంపిక జాబితాను మళ్లీ రూపొందించారు. లెక్చరర్ పోస్టులకు సంబంధించి మెయిన్ పరీక్షకు 1.15 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలోనూ మళ్లీ అదే తప్పు చేసింది. మెయిన్ జాబితాలో పేర్లు లేవని ఫిర్యాదులు అందడంతో.. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు దొర్లినట్లు టీఎస్పీఎస్సీ గుర్తించింది. దీంతో ఈ నెల 19న జరగాల్సిన గురుకుల పోస్టుల మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయినా జాగ్రత్త వహించకుండా టీఆర్టీ హాల్టికెట్లలో పొరపాట్లకు సీజీజీ కారణమైంది. హాల్టికెట్లలో తప్పులు తరువాత సరిచేసుకోవచ్చనుకున్నా.. అభ్యర్థి పరీక్ష కేంద్రం కోసం ఇచ్చిన మూడు జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించింది. నల్లగొండ జిల్లా అభ్యర్థులకు ఆదిలాబాద్‌లో, మహబూబ్‌నగర్ అభ్యర్థులకు కరీంనగర్లో.. ఇలా అన్ని జిల్లాల అభ్యర్థుల పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లోనూ పొరపాట్లు చేసింది. -
దండుకున్నాడు..! దండించారు..!!
సత్తుపల్లి : కొన్ని నెలల కిందటి వరకు అతడొక నిరుద్యోగి. ఆరు నెలల క్రితమే దినసరి కూలీగా సింగరేణిలో చేరాడు. ఈ ఆరు నెలల్లోనే అతడు బోల్డన్ని ‘అతి’ తెలివితేటలు సంపాదించాడు..! నమ్మకమనే పునాదులపై, మాయమాటలనే భవనాన్ని కట్టి చూపించాడు..!! ప్చ్.. ఏం లాభం..?! ఆ ‘పునాదులు’ కదిలాయి, ‘భవనం’ కుప్పకూలింది, పోలీస్ స్టేషన్‌కు చేరాడు. సత్తుపల్లి పట్టణ సీఐ మేడిశెట్టి వెంకటనర్సయ్య తెలిపిన ప్రకారం.. ఏం చేశాడంటే... ఆ దినసరి కూలీ పేరు గరిటపల్లి సత్యనారాయణ. వి.ఎం.బంజర్ ఎంప్లాయిస్ కాలనీలో ఉంటున్నాడు. ‘‘జేవీఆర్ ఓసీలో సూపర్వైజర్, కంప్యూటర్ ఆపరేటర్ కాంట్రాక్ట్ పోస్టులు ఇప్పిస్తా’’నని ఎనిమిదిమందికి గాలం వేశాడు. ఇతగాడిని వారు పూర్తిగా నమ్మారు. 20వేల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందన్నాడు. ముందుగా పదివేలు ఇవ్వాలన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా పదివేలు ఇవ్వొచ్చన్నాడు. ఆ ఎనిమిది నుంచి మొత్తం 80వేల రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగాలు వచ్చాయా..? ఎలా వస్తాయ్..? దుకాణానికి వెళ్లి వస్తువులు కొనుక్కున్నంత తేలిగ్గా ఉద్యోగాలను కొనుక్కోగలమా...? అలాగైతే, 20వేలేం ఖర్మ.. లక్షల రూపాయలు పట్టుకుని క్యూ కట్టే నిరుద్యోగులు చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం ఎప్పుడొస్తుందో’నని ఆ ఎనిమిదిమంది కలలు కంటూ, కళ్లు కాయలుకాచేలా ఎదురుచూశారు. సత్యనారాయణపై ఒత్తిడి పెంచారు. అతగాడు ఇంకా నమ్మించేందుకని, వారిని సింగరేణి కార్యాలయ పరిసర ప్రాంతాల్లో తిప్పసాగాడు. ‘‘డబ్బు ఇవ్వగానే ఉద్యోగం రాదు. రోజూ ఇలా తిరగాల్సుంటుంది’’ అని, ఏదేదో చెప్పాడు. ఇతని తీరుపై వారికి అనుమానం వచ్చింది. ఒక రోజున గట్టిగా నిలదీశారు. రేపోమాపో ఉద్యోగంలో చేరినట్టే. ఐడీ (గుర్తింపు) కార్డులు తీసుకొచ్చి ఇస్తా’’ అన్నాడు. ఆ ఎనిమిదిమంది సరేనన్నారు. ఇవిగో ‘ఐడీ’లు..! ‘అర్రె... ఉద్యోగాలొచ్చాయా..? ఐడీ కార్డులు కూడా ఇచ్చేశారా..?’.. ఇదిగో, అచ్చం మీలాగానే ఆ ఎనిమిదిమంది కూడా ఎగిరి గంతేశారు. అతగాడు ఇచ్చిన కార్డులను మురిపెంగా చూసుకుని, భద్రంగా జేబులో పెట్టుకున్నారు. నేరుగా సింగరేణి సంస్థ కార్యాలయానికి వెళ్లారు. వారిని లోపలికి సెక్యూరిటీ సిబ్బంది రానివ్వలేదు. వీరు అమాయకంగా, తమ జేబుల్లోని ఐడీ కార్డులు చూపించారు. ‘‘మీరెవరు? ఇవి ఎవరిచ్చారు? పోండి.. పోండి..’’ అని, గెంటేయడంతో నీరసంగా వెనుదిరిగారు. తాము పచ్చిగా మోసపోయామన్న బాధ ఒకవైపు, నమ్మించి మోసగించాడన్న కోపం మరోవైపు.. వారిని నిలకడగా ఉండనివ్వలేదు. నేరుగా సత్యనారాయణ వద్దకు వెళ్లారు. ఏం చేశారు..?! చేయాల్సిందే చేశారు. ‘మనోడని నమ్మితే.. మమ్మల్నే మోసగిస్తావా..?’ అంటూ, పట్టుకుని కసితీరా తన్నారు. ఆ తరువాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. అతడు తమను ఎలా మోసగించిందీ పూసగుచ్చినట్టుగా వివరించారు. ఆ బాధితుల్లో ఒకరైన సుతారి కుమారస్వామి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గరిటపల్లి సత్యనారాయణపై కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతోంది. ఆ కార్డులెక్కడివి..? ఈ ఆరు నెలల్లో అతగాడు తెలివి మీరాడని పైన చెప్పుకున్నాం కదా..! సింగరేణి సంస్థ పేరుతో సత్తుపల్లిలో ఐడీ (ఐడెంటిటీ) కార్డులు తయారుచేయించాడు. వాటిని తీసుకొచ్చి వీరికి ఇచ్చాడు. అంతటితో తాను బయటపడినట్టేనని నమ్మినట్టున్నాడు. మోసం వెలుగులోకి వస్తే ఏమవుతుందో ఊహించినట్టు లేదు. ఆరు నెలల క్రితం అలా దండుకున్నాడు..! ఇప్పుడు, అతడిని ఆ బాధితులు ఇలా దండించారు..!! తస్మాత్ జాగ్రత్త... నిరుద్యోగులారా..! తస్మాత్ జాగ్రత్త..!! ఇలాంటి, మోసగాళ్లు ఇంకా అనేకమంది ఉన్నారు. ఇలాగే మోసగిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనగానే గుడ్డిగా నమ్మేయకండి.. వారి వలలో చిక్కుకోకండి.. మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోకండి.. ముందస్తుగా పోలీసులకు సమాచారమివ్వండి..!!! -
ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ కార్డు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎంప్లాయిమెంట్ కార్డు కావాలంటే నిరుద్యోగులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. కూర్చున్న చోటు నుంచే ఎంప్లాయిమెంట్ కార్డు పొందవచ్చు. అది కూడా ఒకటి, రెండు రోజుల్లోనే. ఆన్లైన్ విధానంలో నమోదు చేసుకునేలా ఉపాధి, శిక్షణ శాఖ తాజాగా www. employment.telangana.gov.in వెబ్‌సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ వెబ్‌పోర్టల్ ద్వారా ఎంప్లాయిమెంట్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలంటే ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలు ఉండాలి. కొత్తగా నమోదు చేసుకునే నిరుద్యోగి ఫొటో, నివాస, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు కాగితంపై సంతకాన్ని సిద్ధం చేసుకోవాలి. ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్, అదనపు విద్యార్హత వివరాల నమోదు కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఇప్పటికే కార్డున్న వారి వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. వీళ్లు గడువులోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పోర్టల్ ద్వారా రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కార్డు పొందితే అది మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సకాలంలో రెన్యువల్ చేసుకోలేకపోయిన వారికి ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అదనంగా ఇస్తారు. ఈ సమయంలోనూ రెన్యువల్ చేసుకోకపోతే ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్ జాబితా నుంచి అతడిని శాశ్వతంగా తొలగిస్తారు. ఎంప్లాయిమెంట్ కార్డు నమోదుకు ఒకరికి ఒకేసారి అవకాశం కల్పిస్తారు. నిరుద్యోగి స్థానిక జిల్లా తరఫునే దరఖాస్తు చేసుకోవాలి. 45 ఏళ్ల లోపున్న నిరుద్యోగులే అర్హులు. ఇప్పటికే ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు మరింత ఉత్తమ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అతను పని చేస్తున్న సంస్థ నుంచి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించాలి. -
టీఎన్పీఎస్సీ టైంటేబుల్ విడుదల
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే పట్టభద్రులైన నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) 2018 సంవత్సరానికి టైంటేబుల్‌ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వశాఖల్లోని 23 విభాగాల్లో 3,235 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను మే నుంచి అక్టోబర్‌లోగా పోటీపరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు తమకు ప్రభుత్వం ఉద్యోగానికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా టీఎన్పీఎస్సీ ప్రతి ఏడాది ఖాళీల సంఖ్యను విడుదల చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం తాజాగా విడుదల చేసిన టైంటేబుల్లో 23 విభాగాల్లో 3,235 ఖాళీలున్నట్లు తెలియజేసింది. అయితే ఈ సంఖ్య పూర్తిగా తాత్కాలికమైనదని, దీనిలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో కొన్ని స్థానాలకు అనివార్యమైన ఇబ్బందులు ఎదురైన పక్షంలో వచ్చే ఏడాది భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అంతేగాక అవసరమైన పక్షంలో టైంటేబుల్లో చూపని విభాగాలు, ఖాళీలను సైతం కొత్తగా చేర్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని స్పష్టం చేసింది. కొత్తగా చేర్చే అవకాశం ఉన్న ఖాళీలను పోటీ పరీక్షలకు ముందు లేదా తరువాత కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది 12,218 ఖాళీ స్థానాలను చూపుతూ టైంటేబుల్ విడుదల చేశారు. అన్ని స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంతేగాక టైంటేబుల్లో చూపని 24 ఖాళీలను ప్రకటించారు. వీటిల్లో 18 ఖాళీలకు పరీక్షలు నిర్వహించగా మిగిలిన ఆరు ఖాళీల భర్తీకి ఈనెల లేదా వచ్చేనెల పోటీ పరీక్షలు జరిపే అవకాశం ఉంది. అనేక పోటీ పరీక్షల కోసం 99 పాఠ్యాంశాలను విద్యావేత్తలు రెండేళ్ల కాలంలో సవరించి ఉన్నారు. ఐదేళ్ల కాలంలో పోటీ పరీక్షలు నిర్వహించినా కొన్ని పోస్టులకు అనివార్య కారణాల వల్ల ఫలితాలు వెల్లడి జాప్యం చేశారు. ఆ తరువాత మరలా ఫలితాలు వెల్లడించి నియామక ఉత్తర్వులు సైతం జారీచేశారు. అయితే ఈ ఏడాది అలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అన్ని ఖాళీలకు పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి, నియామక ఉత్తర్వులు అందజేయగలమని టీఎన్పీఎస్సీ ధీమా వ్యక్తం చేస్తోంది.అదేవిధంగా గ్రూప్–2 లో 1547 పోస్టులకు ఇంటర్వూ్యలను ఆగస్టు 19వ తేదీ నిర్వహిస్తున్నట్టుగాను, గ్రూప్–1 లో 57 పోస్టులకు అక్టోబర్ 14వ తేదీ రాత పరీక్షలు జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదికిగాను పట్టికను టీఎన్పీఎస్సీ వెబ్సైట్ www.tnpsc.gov.in లో విడుదల చేశారు. -
ఉద్యోగం రాలేదని మరో యువకుడి ఆత్మహత్య
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాండూరు మండలం వీర్సెట్టిపల్లిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చంద్రమోహన్ ఉన్నాడని... అయితే ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపం చెంది బలవన్మరణం చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా తెలంగాణలో పోస్టులు భర్తీ కావడం లేదంటూ మనస్థాపం చెందిన ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
నిరుద్యోగికి నిరాశే
సాక్షి, అమరావతి: పట్టా చేతికొచ్చినా ప్రయోజనంలేదు. ఇంట్లో వాళ్లకి భారం కాకుండా ఏమి చేయాలో తెలియదు. ఉద్యోగం కోసం ఎటు పోవాలో అర్థంకాదు. వయసు పెరిగిపోతోందని బాధ ఓ వైపు. ఉద్యోగం వస్తుందో రాదో అనే ఆవేదన మరో వైపు. ఈ పరిస్థితులతో రాష్ట్రంలో నిరుద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వ నేతల హామీలు నీటి మూటలుగా మిగిలిపోవడంతో రాష్ట్రంలో ఏటేటా లక్షల సంఖ్యలో పెరిగిపోతున్న నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. బాబొస్తే జాబొస్తుందని చెప్పిన పాలకులు ఇంతవరకూ ఖాళీగా ఉన్న పోస్టులనే భర్తీ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు మాటలు నమ్మిన వారు ఇప్పటి వరకూ తమకు రావాల్సిన రూ. 82 వేల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిపోయింది. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో కమలనాథన్ కమిటీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 2014 తరువాత రిటైరయిన వారితో కలుపుకుంటే ఆ పోస్టుల సంఖ్య ఇపుడు 1.80 లక్షలకు పైగా చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీచేయడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోంది. వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొట్టింది. మరోపక్క ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు వయోపరిమితి దాటిపోయింది. మరోపక్క ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షలాది మంది వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పదివేల పోస్టులను కూడా భర్తీచేయలేదు. 1.80 లక్షల ఖాళీల్లోనూ కేవలం 20 వేల ఖాళీలు మాత్రమే నింపుతామని, తక్కిన వాటిలో కొన్నింటిని ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ 20 వేలలోనూ కేవలం 10 వేలకు మాత్రమే ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు వాటి నియామకాలు పూర్తికాలేదు. నాలుగు, ఐదేళ్ల నుంచి చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 35 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. గతంలో ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు రాని వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీరంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగం రాదని, ఉన్నత విద్య ఎందుకని రాష్ట్రంలో ఏటా 10వ తరగతి 5 లక్షల మంది, ఇంటర్మీడియెట్ 4 లక్షల మంది, డిగ్రీ 1.80 లక్షల మంది, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సుల్లో 1.50 లక్షల మంది, పీజీ కోర్సుల్లో లక్ష మందికి పైగా పూర్తి చేస్తున్నారు. వీరిలో లక్షలాది మంది ఉన్నత విద్యకు వెళ్లడంలేదు. ఉద్యోగం రాదనే ఉద్దేశంతో వారు మధ్యలోనే చదువు విరమించుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించే ప్రత్యేక హోదా హామీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడటంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, అటు ప్రైవేట్ ఉద్యోగాలు రాక ఉద్యోగం అనే మాటనే నిరుద్యోగులు మర్చిపోతున్నారు. రూ. 82 వేలు బకాయి ఎప్పుడిస్తారో? ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు తమ ప్రచారంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులందరికీ ప్రతినెల రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 41 నెలలు అయినా ప్రభుత్వం నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోలేదు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నిరుద్యోగులకు బాసటగా పోరాటం చేసినా ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రం నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగభృతి కల్పించే ముసాయిదా ప్రతిపాదనను వెంటనే తయారు చేయాలని శుక్రవారం మంత్రివర్గం ఆదేశించినట్లు తెలిసింది. అయితే 41 నెలలుగా ప్రభుత్వం భృతి ఇవ్వాల్సి ఉందని, ఒక్కొక్కరికీ రూ. 82 వేలు చొప్పున బకాయి పడిందని నిరుద్యోగులు చెబుతున్నారు. అయితే భృతిపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను ప్రభుత్వ వమ్ము చేయనుంది. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు చూస్తే అది స్పష్టమవుతుంది. రుణమాఫీ హామీ మాదిరిగానే నిరుద్యోగ భృతి హామీని కూడా మమ అనిపించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిరుద్యోగ భృతికి సవాలక్ష షరతులు నిరుద్యోగ భృతికి మంత్రుల కమిటీ పలు షరతులు పెట్టింది. రూ. 2 వేలు భృతి అని హామీ ఇచ్చి దాన్ని రూ. 1,500కు కుదిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్యను కూడా భారీగా తగ్గించేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 లక్షలకు పైగా నిరుద్యోగులుండగా ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 7 నుంచి 8 లక్షలకు తగ్గించాలని చూస్తోంది. 18 నుంచి 35 సంవత్సరాల వారు మాత్రమే భృతికి అర్హులను చేస్తోంది. ఇంటర్మీడియెట్‌ను కనీస అర్హతగా పరిగణిస్తున్నారు. ఇక భృతికి నైపుణ్య శిక్షణతో ముడిపెట్టారు. నిరుద్యోగ భృతి లేదా నైపుణ్యశిక్షణలో ఏదో ఒకదాన్ని అర్హులైన నిరుద్యోగులు ఎంచుకోవలసి ఉంటుంది. ప్రతి నిరుద్యోగికీ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు మాత్రం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించారు. నాలుగు చక్రాల వాహనం ఉంటే ఇవ్వరాదని నిబంధనల్లో చేర్చారు. తెల్లకార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకే దీన్ని పరిమితం చేయనున్నారు. అలాగే వ్యవసాయ భూమి మెట్ట అయిదెకరాలు, పల్లం 2.5 ఎకరాల లోపు ఉన్న వారికే భృతి వర్తిస్తుంది. గతంలో స్వయం ఉపాధి కింద రుణాలు పొందినా, శిక్షణ తీసుకున్నా వారినీ దీని నుంచి మినహాయించనున్నారు. ఉన్నత చదువులు చదివే వారిని భృతి నుంచి మినహాయిస్తారు. ఇక నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు. పథకం ప్రారంభించడానికి ముందు... ఇప్పటి వరకు ఎక్కడా నిరుద్యోగులుగా పేరు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తారు. బేషరతుగా భృతి ఇవ్వాలి నిరుద్యోగ భృతిపై నాలుగేళ్లు నాన్చిన ప్రభుత్వ ఇపుడు షరతులతో కొద్దిమందికే భృతిని పరిమితి చేయాలనుకోవడం సరికాదు. చిన్న చిన్న ఐటీ కంపెనీలకే కోట్లాది రూపాయల రాయితీలను మంత్రి లోకేశ్ ప్రకటించారు. కానీ నిరుద్యోగులకు భృతి ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయడంలేదు. ఉద్గోగాలు వస్తాయని గత నాలుగు సంవత్సరాలుగా శిక్షణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో అందరికీ బేషరుతుగా భృతి చెల్లించాలి. – నూర్ మహమ్మద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల ముందు భృతి ప్రకటిస్తారా? గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే ముందు ఇస్తామని ప్రకటించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. కేవలం ఎన్నికల దృష్టితో ఈ ప్రకటన చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఆదుకునేందుకు మాత్రం కాదు. బేషరుతుగా నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలి. వయో పరిమితి దాటిన అభ్యర్థులకూ భృతి కల్పించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.80 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. – సలాంబాబు, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
కొత్త కొలువుల జూమ్
సాక్షి, హైదరాబాద్: హైటెక్ నగరంలో కొత్త కొలువుల ‘జూమ్’ అంటున్నాయి. యువత ఆ కొలువుల వైపు పరిగెడుతోంది. ఆశించిన స్థాయిలో ఐటీ జాబ్స్ పెరగకపోయినా... సేవా, నిర్మాణ, ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవా రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోన్న గ్రేటర్ నగరంలో కొత్త కొలువులు నిరుద్యోగులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పలు మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడవడం విశేషం. ప్రముఖ కొలువుల వెబ్సైట్ నౌకరిడాట్కామ్ తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో పలు రంగాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఆయా సిటీల్లో ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక, ఇన్సూరెన్స్ తదితర సంస్థల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల వృద్ధిరేటు 21 శాతం మేర నమోదవగా.. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో 4 శాతం వృద్ధిరేటు తగ్గినట్లు తేలింది. ఇక ఐటీ అనుబంధ రంగాలు, బీపీఓ విభాగంలో 8 శాతం వృద్ధిరేటు తగ్గడం గమనార్హం. గ్రేటర్ స్థానం 4 విశ్వనగరం బాటలో దూసుకుపోతున్న గ్రేటర్ నగరంలో సేవారంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, భారీ యంత్ర పరికరాలు, నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇక ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, సేల్స్, మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలు(అడ్వర్టైజింగ్) రంగాలు కూడా ఇటీవలి కాలంలో ఇతోధికంగా పురోగమిస్తున్నాయి. గ్రేటర్లో మొత్తంగా ఈ రంగాల్లో సగటున ఏటా 6 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో బెంగళూరు నగరం 16 శాతం వృద్ధిరేటుతో తొలిస్థానంలో ఉంది. ఇక రెండోస్థానంలో నిలిచిన ముంబై, కోల్‌కతా మహానగరాల్లో 15 శాతం వృద్ధి నమోదైంది. మూడో స్థానంలో నిలిచిన చెన్నైలో 9 శాతం.. నాలుగోస్థానంలో నిలిచిన హైదరాబాద్‌లో 6 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆయా రంగాల్లో సగటున 9 శాతం తరుగుదల నమోదైనట్లు తేలింది. గ్రేటర్లో ఆయా రంగాల పరిస్థితి ఇదీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు: గ్రేటర్ కేంద్రంగా దేశ, విదేశాలకు చెందిన పలు ఆర్థిక, వాణిజ్య, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్, పెట్టుబడుల రంగం పురోగమిస్తోంది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. భారీ యంత్ర పరికరాలు: గ్రేటర్లో పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో భారీ యంత్ర పరికరాల పరిశ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయి. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతులు మంజూరు చేస్తుండటంతో పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. ఆటోమొబైల్స్: గ్రేటర్ జనాభా కోటి కాగా... వాహనాల సంఖ్య సుమారు 50 లక్షలు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో నూతన వాహనాల కొనుగోలు, వాటి నిర్వహణ, మరమ్మతులకు సంబంధించిన ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందడమే కాదు.. పలువురికి ఉపాధి బాట చూపుతోంది. ఇంజనీరింగ్: మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత పరిశ్రమలు, ఇన్ఫ్రా కంపెనీలకు నగరం చిరునామాగా మారడంతో ఈ రంగాల్లో ఇటీవలికాలంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. నిర్మాణ రంగం: గ్రేటర్ శివార్లలో విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తరించడంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు నగరానికి వలసవస్తున్నారు. వీరికి గృహ వసతి అత్యవసరంగా మారింది. శివార్లలో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతన జీవులు స్వతంత్ర గృహాల కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తుండటంతో నిర్మాణ రంగం పుంజుకుంటోంది. సేల్స్: కాదేది అమ్మకానికి అనర్హం.. పిజ్జా, బర్గర్ మొదలు.. కాళ్లకు వేసుకునే షూజ్, సాక్సులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇంటి వద్దకే కావాల్సిన వస్తువులు అందించే సేల్స్ రిప్రజెంటేటివ్‌లకు పలు సంస్థలు భారీగా కొలువులు, వేతనాలు, కమీషన్లు ఆఫర్ చేస్తుండటం విశేషం. మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలు: ఇక వివిధ వస్తువులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణ రంగ సంస్థల్లో మార్కెటింగ్ చేసేవారికి కొత్త కొలువులు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. ఇక దేశ, విదేశాలకు చెందిన మల్టీబ్రాండెడ్ వస్తువులకు వాణిజ్య ప్రకటనలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రకటనల రంగం శరవేగంగా విస్తరిస్తోంది. -
ప్రభుత్వ ఉద్యోగమా అదెక్కడ!
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, అటు ప్రైవేటు ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సాక్షి, అమరావతి :రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథ్ కమిటీకి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం.. ఏపీలోని 13 జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య 1,42,825గా పేర్కొన్నారు. 2014, జూన్ 2 తర్వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంతో ఇప్పటివరకు దాదాపు 45 వేల మంది పదవీ విరమణ చేశారు. ఈ లెక్కన ఖాళీల సంఖ్య మొత్తం 1,87,825 అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ఖాళీలు లేవంటోంది. భర్తీ చేసినవి నామమాత్రమే.. ప్రభుత్వ శాఖల్లో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఎన్నికైన రెండేళ్ల తర్వాత కేవలం 6 వేల పోస్టులకు మాత్రమే ఏపీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటిల్లో గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు ఇంతవరకు భర్తీ కాలేదు. వీటి సంగతి దేవుడెరుగు 1999 నాటి గ్రూప్–2 అభ్యర్థులే ఇంకా భర్తీకి నోచుకోలేదు. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ 32 నోటిఫికేషన్ల ద్వారా 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినా అందులో పూర్తిచేసినవి అతి తక్కువ మాత్రమే. యూనివర్సిటీ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు? రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో దాదాపు 4 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం వాటిని రేషనలైజేషన్ పేరిట 1385కి కుదించేసింది. వాటిని 2016–17లో 1104, 2017–18లో 281 చొప్పున రెండు విడతల్లో భర్తీ చేయాలని సూచించింది. అయితే ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో అనేక లోపాల కారణంగా న్యాయస్థానం జీవోను కొట్టేయడంతో పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఏటా డీఎస్సీని ప్రకటించి టీచర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఈ మూడేళ్లలో ఒక్కటే నోటిఫికేషన్ వెలువరించింది. దాదాపు 23 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 10,313 పోస్టులను భర్తీ చేసింది. రేషనలైజేషన్ పేరిట స్కూళ్లను మూసేయడంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య కూడా కుదించుకుపోయింది. డీఎస్సీలో ఎంపికైనవారిలోనూ కొంతమందికి మాత్రమే పోస్టింగులు ఇచ్చి మిగతా వారిని డీఈవో పూల్ కోటాలో పెట్టారు. ఇంకా దాదాపు 13 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా డీఎస్సీని ప్రకటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కళాశాల అధ్యాపకుల భర్తీలోనూ కళ్లకు గంతలు రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా తూతూమంత్రంగా కొన్నిటికి మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో 146 డిగ్రీ కాలేజీల్లో 3,300 వరకు అధ్యాపక పోస్టులున్నాయి. ఇందులో 1500 మంది మాత్రమే పనిచేస్తుండగా తక్కిన 1800 పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టుల్లో 740 మంది అర్హులైన కాంట్రాక్టు అధ్యాపకులున్నారు. 16 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని వారు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక ఇంటర్మీడియెట్ కళాశాలల్లో ప్రభుత్వ కాలేజీలు 442, ఎయిడెడ్ కాలేజీలు 202 ఉన్నాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ, గురుకుల జూనియర్ కాలేజీలను కలుపుకుంటే మొత్తం 1032 జూనియర్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో 1400 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులున్నారు. దాదాపు 4 వేల మంది అర్హులైన అభ్యర్థులు కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడూ ఊడతాయో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వీరితో ఏడాదిలో ప్రతి ఆరునెలలకోసారి మాత్రమే పనిచేసే ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంటోంది. ఒప్పందం గడువు పూర్తయ్యాక ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీదనే వీరు బతకాల్సి వస్తోంది. కమల్‌నాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏపీలో ఖాళీలు.. స్టేట్ లెవల్ (గ్రూప్–1, గెజిటెడ్, ఎన్జీవో, తదితర)– 4078, మల్టీజోనల్ (గ్రూప్–1, గెజిటెడ్, ఎన్జీవో)–1184, జోనల్ (గెజిటెడ్, ఎన్జీవో, తదితర) – 22462, జిల్లా స్థాయిలో (గ్రూప్–1, గెజిటెడ్, ఎన్జీవో, ఎయిడెడ్, తదితర) – 1,15,101. మొత్తం పోస్టులు 1,42,825. కాగా మంజూరైన పోస్టులు మాత్రం.. 6,97,621 ఉండగా ప్రభుత్వం చూపుతోంది.. లక్షా 42, 825 పోస్టులే. ఏపీపీఎస్సీ ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లు ఇవే.. లక్షలో సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉంటే ఇప్పటివరకు ఏపీపీఎస్సీ జారీ చేసింది కేవలం 4,275 పోస్టులకే మాత్రమే. అవి.. పంచాయతీ కార్యదర్శులు (1055), గ్రూప్–2 (982), ఏఈఈ (748), డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు (504), డిప్యూటీ సర్వేయర్లు (259), అసిస్టెంట్ ఇంజనీర్స్ (199), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (95), గ్రూప్–1 (78), టెక్నికల్ అసిస్టెంట్లు (67), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు (పురుషులు) (51), మహిళలు (49), వ్యవసాయాధికారులు (30), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (24), అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ (21), టౌన్‌ప్లానింగ్ సబార్డినేట్ (13), అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (13), అసిస్టెంట్ డైరక్టర్ ఫిషరీస్ (10), అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (10), అసిస్టెంట్ డైరక్టర్ ఎకనమిక్, స్టాటిస్టికల్ (8), జిల్లా సైనిక్ వెల్ఫేర్ (7), అసిస్టెంట్ ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్స్‌మెన్ (7), వెల్ఫేర్ ఆర్గనైజర్ (6), అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (6), మైనింగ్ రాయల్టీ ఆఫీసర్ (5), టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (5), టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ (5), ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (5), ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ 4, లేబొరేటరీ అసిస్టెంట్ (3), డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (2), క్లినికల్ పాథాలజిస్ట్ (2), అసిస్టెంట్ కెమిస్ట్ (2). ఏటా లక్షల్లో పెరుగుతున్న నిరుద్యోగులు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతున్నా వారికి సరైన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియెట్, టీచర్ ట్రైనింగ్, బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, బీఈడీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీలు పూర్తిచేసి బయటకు వస్తున్న వారి సంఖ్య ఏటా 10 లక్షల మందికి పైగా ఉంటోంది. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఖాళీ పోస్టులున్నా భర్తీ చేయడం లేదు. విభజన తర్వాత రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమా లేకపోవడంతో ప్రైవేటులోనూ ఉద్యోగాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు కూడా కరవయ్యాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఊతంగా ఉండే ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబునాయుడు విస్మరించడంతో ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ప్రముఖ పరిశ్రమ ఒక్కటీ ఏర్పాటుకాలేదు. ఫలితంగా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. అవుట్సోర్సింగ్కూ కోత రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ఎలాగూ చేయలేదు. కనీసం అవుట్సోర్సింగ్ నియామకాలన్నా చేసిందా అంటే అవీ కనిపించడం లేదు. పైగా గత కొన్నేళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్వాసన పలికింది. ఆరోగ్యమిత్ర,, గోపాలమిత్రలను తొలగించింది. గత మూడేళ్లలో ప్రభుత్వం వివిధ విభాగాల్లోని దాదాపు 30 వేల మంది వరకు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇళ్లకు సాగనంపింది. -
ఘరానా మోసగాడు
-
19 ఏళ్లు.. అదే నిరీక్షణ!
- న్యాయం కోసం 1998 డీఎస్సీ అభ్యర్థుల పోరాటం - చివరకు సీఎం హామీ ఇచ్చినా ముందుకు పడని అడుగులు - న్యాయ శాఖ, జీఏడీ పరిశీలన అంటూ తిప్పుతున్న అధికారులు - పోస్టింగుల కోసం వేల మంది ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. 2015 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారికే కాకుండా 2012 వరకు నిర్వహించిన మిగతా డీఎస్సీల్లో నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎన్నో అక్రమాలు 1998 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ దాదాపు 40 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అయితే ఇందులో ఎన్నో అక్రమాలకు తెరతీశారు. బీఎడ్ లేని వారికీ పోస్టింగులు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో పండిట్లకు పోస్టింగులు ఇచ్చారు. రాత పరీక్షలో 4 మార్కులు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి పోస్టింగులు ఇచ్చారు. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి అన్యాయం చేశారు. తమ అనుయాయుల కోసం రాత పరీక్ష కటాఫ్ మార్కులను తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించినా.. 1998 డీఎస్సీలో మొత్తం 100 మార్కుల్లో 15 మార్కులు ఇంటర్వ్యూలకు పోగా 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. అయితే పోస్టుల సంఖ్య కంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను 45, 40, 35కు విద్యా శాఖ కుదించింది. దీంతో నియామకాల సందర్భంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన తమకు తక్కువ మార్కులు వేసి పోస్టులకు ఎంపిక కాకుండా చేశారని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై 1999లో విచారణ జరిపిన ట్రిబ్యునల్.. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ 2000 సంవత్సరంలో విద్యా శాఖ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా దాన్ని అమలు చేయని విద్యా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కూడా కింది కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును మాత్రం అమలు చేయలేదు. అప్పటి నుంచి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. చివరకు 2011 నవంబరు 8న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ తదితర ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించినా.. అమలు చేయలేదు. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో చీవాట్లు తిన్న విద్యా శాఖ.. చివరకు ఆ పోస్టులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అందరికీ పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చినా.. పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. -
అనుచరుల పచ్చం!
స్వయం ఉపాధితో జీవితాన్ని చక్కబెట్టుకోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. పార్టీ వర్గీయులు, అనుచరులకే పెద్దపీట వేయడం.. అధికారులను పక్కనపెట్టి స్వయంగా నాయకులే రుణమేళా నిర్వహించడంతో అర్హులకు నిరాశ మిగిలింది. గుత్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ, కాపు సబ్సిడీ రుణాలకు సంబంధించి 470 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభమైన పది నిముషాలకే టీడీపీ నేతలు బ్యాంకు, మండల పరిషత్ అధికారుల స్థానంలో కూర్చొని పెత్తనం చెలాయించారు. ఆ పార్టీ కార్యకర్తల దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ముగించేశారు. - గుత్తి: -
అమెరికాలో కోలుకున్న జాబ్ మార్కెట్
వాషింగ్టన్: ఆర్థిక మందగమనంతో నిరుద్యోగం తాండవిస్తున్న అగ్రరాజ్యంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే ఆశలు చిగురిస్తున్నాయి. నిరుద్యోగిత రేటు దిగిరావడం, కొత్త కొలువులు పెరుగుతుండటం సానుకూల పరిణామాలుగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు 16 ఏళ్ల కనిష్టస్థాయిలో తగ్గింది. జులైలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2,09,000 ఉద్యోగాలు పెరిగాయని ఇది మార్కెట్ అంచనాల కంటే అత్యధికమని కార్మిక శాఖ వెల్లడించింది. మే, జూన్ నెలల్లో కూడా ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగిందని సవరించిన అంచనాల్లో పేర్కొంది. జూన్ లో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జులైలో 4.3 శాతానికి దిగివచ్చింది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనేందుకు ఇది మెరుగైన సంకేతమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. -
ఉద్రిక్తంగా మారిన ఇంటర్వ్యూలు
జగిత్యాల క్రైం: గల్ఫ్‌లో ఉద్యోగాల కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలు ఉద్రిక్తంగా మారాయి. అనుమతి పత్రాలు ఉన్నాయని ఏజెంట్లు చూపించినా... డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఇంటర్వ్యూను అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ఫర్నీచర్ ధ్వంసం చేసేందుకు యత్నించగా ఉత్కంఠకు దారితీసింది. షార్జా బల్దియాలో 170 ఉద్యోగాలు ఉన్నాయని ఏజెంట్లు స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందు కోసం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఏజెంట్ జగిత్యాల పట్టణం సమీపంలో ధరూర్ శివారులోని రెడ్డి కల్యాణ మండపంలో శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది నిరుద్యోగులు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్ఫ్ ఏజెంట్‌ను పిలిపించి అనుమతులు కోరగా.. సంబంధిత పత్రాలు చూపించడంతో సమస్య సద్దుమణిగింది. ప్రక్రియ సజావుగా సాగుతుం డగా, ఇంటర్వ్యూల పేరిట ఒక్కో వ్యక్తి నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని ఎస్పీ అనంత శర్మకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటర్వ్యూలు నిలిపివేయాలని సీఐ ప్రకాశ్‌ను ఆదేశించారు. సీఐతోపాటు రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి వారి అనుమతి పత్రాలను, ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల వివరాలు సేకరించారు. పోలీసులు సూచన మేరకు నిర్వాహ కులు ఇంటర్వ్యూలు నిలిపివేస్తున్నట్లు ప్రకటిం చారు. దీంతో నిరుద్యోగులు ఒక్కసారిగా కల్యాణ మండపంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని నిరుద్యోగులను శాంతింపజే శారు. త్వరలో మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. -
ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు
గాజువాక: ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవెంకటేశ్వర సెక్యూరిటీస్ అండ్ ప్లేస్ మెంట్స్ పేరుతో రైల్వేలో, సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. నిందితులు బాధితుల దగ్గర సుమారు రూ.3.3 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. సంస్థ నిర్వాహకులు నంబాల ఆనందకుమార్, మొదలవలస నాగరాజు, ఈశ్వరప్రసాద్ లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
నిరుద్యోగుల్లో వయోపరిమితి గుబులు
ఈ నెల 26తో ముగియనున్న వయోపరిమితి ఉత్తర్వుల గడువు సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల్లో మళ్లీ వయోపరి మితి గుబులు మొదలైంది. ముఖ్యంగా డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈనెల 23న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తుండగా, టెట్ ఫలితాలు వెల్లడయ్యాక విద్యా శాఖ వివరాలిస్తే వెంటనే ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇదివరకే టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 27తో ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల వయోపరిమితి పెంపు ఉత్తర్వుల గడువు తీరిపోతోం ది. దీంతో మళ్లీ వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వం కూడా పదేళ్ల పాటు వయో పరిమితిని పెంచుతూ 2015 జూలై 27న ఉత్తర్వులు (జీవో 329) జారీ చేసింది. ఆ తర్వాత ఏడాది గడిచి న నేపథ్యంలో 2016 జూలై 26న మరోసారి గరిష్ట వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు అత్యధికంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ రాలేదు. ప్రస్తుతం టెట్‌కు హాజరు కానున్న 3.5 లక్షల మందిలో సాధారణ గరిష్ట వయోపరిమితి దాటిన అభ్యర్థులు వేలల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గరిష్ట వయోపరిమితిని మరోసారి పెంచాలని, లేకపోతే తమకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. 2012 నుంచి ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పెంచాలని కోరుతున్నారు. -
‘గురుకుల’ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు
షెడ్యూలులో మార్పులు చేసిన టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్ పరీక్షల తేదీల్లో టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీ టీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో, వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వచ్చే నెల 18 నుంచి నిర్వహిం చనున్నట్లు ప్రకటించింది. గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫైనల్ కీలను ఇటీవల ప్రకటించి మెయిన్ పరీక్ష తేదీల ను కూడా ప్రకటించింది. అయితే ఇంత త్వరగా మెయిన్ పరీక్షలకు సిద్ధం కావడం కష్టమని, కొంత గడువు ఇవ్వాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేశాయి. దీంతో మరో 15 రోజులు గడువు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. పీజీటీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18, 19 తేదీల్లో, టీజీటీ మెయిన్ పరీక్షలను 20 నుంచి 22 వరకు, పీడీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18న నిర్వహిస్తామని ప్రకటించింది. (ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్–1 పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు–2 పరీక్షలు ఉంటాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు పేపరు–1 ఒకటే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది). -
నిరుద్యోగులకు సీఎం బకాయి 1.22 లక్షల కోట్లు
వెంటనే చెల్లించాలని సీఎంకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ - ఎన్నికల్లో వారికిచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి - ఇంటికో ఉద్యోగం.. నెలకు రూ.2వేల భృతి ఎక్కడ? - ఇప్పటికే ఒక్కో నిరుద్యోగికీ రూ.70 వేలు ఇవ్వాలి - నిరుద్యోగుల గోడు వినే తీరిక చేసుకోండి - ప్రభుత్వోద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోండి - గ్రూప్–2 అభ్యర్థులు ఏం చెబుతున్నదీ వినిపించుకోండి - ఉపాధి లేక వలసలు పోతున్నా కనిపించడం లేదా? - నిరుద్యోగులలో అసంతృప్తి సమాజానికి మంచిది కాదు - ఉద్యోగాలివ్వకపోగా ఉన్నవి తీసేస్తారా.. - మీ నుంచి స్పందన లేకే మరో లేఖ రాస్తున్నా.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు రూ. 1.22 లక్షల కోట్లు బకాయి ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్రంలోని నిరుద్యోగుల గోడు వినేందుకు తీరిక చేసుకోవాలని, ఎన్నికల్లో వారికి చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని, బకాయిలు చెల్లించడంతో పాటు నెల నెలా రూ.2000 నిరుద్యోగ భృతిని చెల్లించాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభు త్వోద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకో వాలని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖను రాశారు. శనివారం రాత్రి ఈ లేఖను వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం పత్రికలకు విడుదల చేసింది. లేఖలో ఏమున్నదంటే.. నిరుద్యోగుల గోడు వినే తీరిక లేదా? ‘‘ఎన్నికల సమయంలో మీరు ఇంటికో ఉద్యోగం/ఉపాధి కల్పిస్తానని, అది దొరికేంత వరకూ ప్రతి ఇంటికీ రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేశారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలం టూ మీరే ఊరూరా ఊదరగొట్టారు. నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్‌లు మీ వాగ్దానాలను బలపర్చినట్లుగా స్వయంగా మీరు సంతకం చేసి ఇంటింటికీ కరపత్రాన్ని పంచారు. 2014 జూన్‌లో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మే 2017 వరకూ 35 నెలలు గడిచి పోయాయి. అయినా ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇవే విషయాలను ప్రస్తావి స్తూ ఈ ఫిబ్రవరి 22న మీకు బహిరంగ లేఖ రాశాను. అయినా మీ ప్రభుత్వంలో చలనం లేదు. నిరుద్యోగభృతి అంటూ ఈ మార్చిలో ప్రవేశ పెట్టిన 2017–18 బడ్జెట్లో ప్రకటించి కూడా నిరుద్యోగులకు ఈ రోజు వరకూ ఇంటి కి రూ 2000లు ఇచ్చే బాధ్యతను నెరవేర్చ లేదు. మొక్కుబడిగా మీరు గ్రూప్ పరీక్షలు జరుపుతున్నారు కాబట్టే నిరుద్యోగుల్లో భరోసా గాని, ఆశ గానీ కనిపించడం లేదు. మీరు గానీ, మీ ఆధ్వర్యంలోని ఏపీపీఎస్సీ అధికారులు గానీ నిరుద్యోగుల గోడును, వారి అభిప్రాయాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. తీవ్ర ఆందోళనలో ఉన్న గ్రూప్–2 అభ్యర్థులు ఏం చెబుతున్నారన్నది వినిపించుకునేందుకు కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా లేక పోవటం నన్నెంతగానో బాధించింది. ఈ నేపథ్యంలో , నిరుద్యోగుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని కోరుతున్నాను. ప్రభుత్వోద్యోగాలన్నింటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోండి. వారికి ఇప్పటి వరకు చెల్లించాల్సిన నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించండి అని మరోసారి అడుగుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. మీ నిర్లక్ష్యం..నిరుద్యోగులకు ప్రాణ సంకటం.. ఈ 35 నెలల కాలంలో నిరుద్యోగులకు మీరు పడిన బకాయి ఇంటింటికీ ఇప్పటికే రూ 70 వేల మేరకు ఉంది. ఆ బకాయిని వెంటనే చెల్లించడంతో పాటుగా రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 75 లక్షల ఇళ్ల వారికి కుల, మత , ప్రాంత, పార్టీ భేదాలకు అతీతంగా నిరుద్యోగ భృతి చెల్లించండి. 35 నెలలుగా 1 కోటి 75 లక్షల ఇళ్లకు రూ.2000 మేరకు మీరు చెల్లించాల్సిన బకాయీ రూ.1 లక్షా 22 వేల కోట్ల మేరకు ఉంది. మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతిలో గాని, ఇళ్ల సంఖ్యలో గాని కోతలు పెట్టకుండా భృతి ఇవ్వండి. ఎన్ని ఉద్యోగాలున్నాయి అనే విషయం మీద సమాచారం మీ వద్ద ఉన్నా దానిని ఎందుకు మరుగు పరుస్తున్నారు? రాష్ట్ర విభజన జరిగేనాటికి ఏపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయిల్లో మొత్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 1,42,828. ఈ పోస్టుల భర్తీ మీద మీ ప్రభుత్వ విధానం ఏమిటన్న ప్రశ్నకు మూడేళ్లు గడిచిపోయినా నిరుద్యోగులకు సమాధానం రావడం లేదు. గత ఏడాది 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగినా ఇంకా 17 వేలకు పైగా పోస్టుల భర్తీ జరగాల్సి ఉంది. ఈ పోస్టులన్నింటితో పాటు ఖాళీగా ఉన్న పోలీసు తదితర ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదన్నది మీకే బాగా తెలుసు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కటంలో మీకు ఉన్న అనుభవం నిరుద్యోగులకు ప్రాణ సంకటంగా మారుతోందన్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని కోరుతున్నాను. ఉన్నవి ఊడబెరికారు..మానవత్వం ఉందా..? పైగా... మీరు అధికారంలోకి రాగానే 6000 మంది ఆదర్శ రైతులను, 1500 మంది గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్లను, గ్రామీణా భివృద్ధి శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 2106 మందిని, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 4000 మందిని, ఆయుష్‌లో 800 మందిని, ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న 1900 మందిని తొలగించారు. బాబు వచ్చాడు జాబు పోయిందని ఈ కుటుంబాల వారంతా విలవిలలాడుతున్నా మీకు కనీస కనికరం, మానవత్వం లేదు. తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఏ సమాజానికీ మంచిది కాదు. ఉపాధి లభించక ప్రజలు భారీ సంఖ్యలో వేరే రాష్ట్రాలకు వలస పోతున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఈ లేఖలో గొంతెమ్మ కోర్కెలు లేవు. మీరు ఇచ్చిన మాటనే మీరు మూడేళ్లుగా మరిచి పోవటం వల్ల మరోసారి ఈ ఉత్తరం రాస్తున్నాను.’’ అని ఆ లేఖలో జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని హామీలో.. ఒక్కటన్నా నెరవేర్చారా? మీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు మీరు ఇచ్చిన వాగ్దానాల్లో మరి కొన్నింటి గతి ఏమయిందో గమనించడానికి వీలుగా వాటిని ఉదహరిస్తున్నాను. ► ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర, కేంద్ర సర్వీ సులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకుల పోటీ పరీక్షలకు, శిక్షణ ఇప్పిం చేందుకు, స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తాం. ► ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నత చదువులు చదివిన వారిని, నీతి నిజాయితీ కలిగిన వారిని సమర్థులను నియమించి ఉద్యోగ నియామకాలు, పారదర్శకంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటాం. ► ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ క్యాలండర్‌ను ప్రకటింపజేసి నిర్ణీత సమయాల్లో ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ► ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు ఫారాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష, మౌఖిక పరీక్షలకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తాం. ► నిరుద్యోగులకు స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయల లోపు రుణాలను వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేయిస్తాం. ► నిరుద్యోగులకు రూ.లక్షకు పైగా రూ.50 లక్షల వరకూ మూడు శాతం వడ్డీ రాయితీతో బ్యాంకు రుణాలు ఏర్పాటు చేస్తాం. ► ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రతి సంవత్సరం డీఎస్సీని నిర్వహిస్తాం’ ఈ వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి అమలయితే ఒట్టు. -
రాష్ట్రంలో 1.2 కోట్ల మంది నిరుద్యోగులు
- ఆరేళ్లుగా ఎదురుచూపులే: టీజేఏసీ చైర్మన్ కోదండరాం - మేం అధికారంలోకి వస్తే భృతి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత గత ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘మన కొలువుల సాధనకై విద్యార్థి నిరుద్యోగ ధర్మ యుద్ధం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు కోటి 20 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో సుమారు 25 లక్షల మంది వరకు సాంకేతిక విద్యను అభ్యసించారన్నారు. దిక్కులేక నిరుద్యోగులు ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగాన్ని సామాజిక సమస్యగా గుర్తించి ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేవారు. ఇందుకు మండల స్థాయి నుంచి జేఏసీలుగా ఏర్పడి ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగం లభించే వరకు ప్రతి నిరుద్యోగికి భృతి కల్పిస్తామన్నారు. -
రైల్వేజోన్ కోసం ఆత్మార్పణ
- ఆవేదనతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణత్యాగం - జోన్ కోసం పోరాడాలని సీఎంకు లేఖ సాక్షి, విశాఖపట్నం/ పెదగంట్యాడ: విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని, వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన చెందుతూ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం చంద్రబాబు పేరిట లేఖ రాసి తనువు చాలించాడు. ఈనెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెదగంట్యాడ యాతపాలేనికి చెందిన పీఎస్డీ ప్రసాద్ (32) 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. విశాఖకు రైల్వే జోన్ వస్తే తనలాంటి వారికిఉద్యోగావకాశాలు లభిస్తాయని తరచూ స్నేహితులతో చెబుతూ ఉండేవాడు. ప్రసాద్‌కు ఉద్యోగం లేదన్న కారణంతో భార్య కూడా అతనికి దూరమైంది. ఈ నేపథ్యం లోనే విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ ఇంజినీరింగ్‌లో తన క్లాస్మేట్, అనకాపల్లి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇటీవల చేపట్టిన పాదయాత్రలోనూ ప్రసాద్ పాల్గొన్నాడు. జోన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేదన్న భావనతో విరక్తి తో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నెల 7న నగరంలోని మర్రిపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి మరణించాడు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న లేఖను రైల్వే పోలీసులు మాయం చేసారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. -
ఉద్యోగాల పేరిట టోకరా ..
చిత్తూరు: ప్రైవేటు ఎగుమతుల కంపెనీల్లో ఉద్యోగాలిపిస్తామంటూ 57 మందికి ఓ వ్యక్తి టోకరాపెట్టాడు. బాధితులంతా జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌కు మొరపెట్టుకోవడంతో వన్ టౌన్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. బాధితుల కథనం మేరకు చిత్తూరు నగరంలోని షుగర్ ఫ్యాక్టరికీ సమీపంలో ఓ ఎగుమతుల కంపెనీకి సంబంధించిన కార్యాలయముంది. పదోతరగతి నుంచి డిగ్రీ చదివిన యువకులకు ప్రైవేటు ఉద్యోగాలిపిస్తామంటూ నిర్వాహకుడు ఒక్కొక్కరి నుంచి రూ.17 వేలు వసూళ్లు చేశాడు. ఇలా 57 మంది నుంచి రూ. 9.69 లక్షలు వసూళ్లు చేశాడు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు విచారించగా బోర్డు తిప్పేసి ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకున్నారు. దీంతో బాధితులంతా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాబ్ లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంతమందా?
న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత ఏ ఏడాదికాఏడాది పెరిగిపోతుంది. గ్రాడ్యుయేట్ పట్టా పొంది కాలేజీ నుంచి బయటికి వచ్చే వారిలో అరకొరమందికే ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి. మిగతా వారందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే విషయంపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గణాంకాలు విడుదల చేసింది. ఈ వివరాల్లో దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో 60 శాతం మందికి పైగా అంటే ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారని పేర్కొంది. కేవలం 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని వెల్లడైంది. ఈ పరిస్థితిని మార్చడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖా టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తోంది. 2018 జనవరి నుంచి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంహెచ్ఆర్డీ సీనియర్ అధికారుల ప్రకారం పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ కు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మాదిరిగా.. మెడికల్ కోర్సులకు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
యనమల పద్దు
-
నిరుద్యోగులకు టోకరా!
మంచి ఉద్యోగాలంటూ విస్తృత ప్రచారం ⇒ ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కాలేజీకి వేలాదిగా వచ్చిన నిరుద్యోగులు ⇒ కనిపించని ప్రముఖ కంపెనీలు.. ఆగ్రహించిన అభ్యర్థులు ⇒ రహదారిపై రాస్తారోకో.. నిర్వాహకులపై కేసులు సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు ఓ సంస్థ భారీ కుచ్చుటోపీ పెట్టింది. టెన్ ప్లస్ టూ అర్హతతో ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి భారీ మోసానికి పాల్పడింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది. తీరా మేళా ప్రారంభమైన తర్వాత అందులో ముందస్తు చెప్పినట్లు ప్రముఖ కంపెనీలు కనిపించక పోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. నిర్వహకులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం... అద్వితీయ సేవా ఫౌండేషన్ (ఏఎస్ఎఫ్) ఆదివారం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల ప్రాంగణంలో ‘గెట్ మై జాబ్’పేరుతో ఉద్యోగ మేళాను ఏర్పాటు చేసింది. టెక్ మహీంద్ర, విప్రో, జెన్‌ప్యాక్ట్, హెచ్ఎస్బీసీ, హెచ్జీఎస్, ఏజీఎస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, సింక్రోనిక్స్‌ఫైనాన్స్, టీసీఎస్, అమేజాన్, పేటీఎం, కార్వీ, రిలయన్స్, ఐకే ఎస్, హెచ్డీ ఎఫ్‌సీ వంటి 25 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కోసం వారం రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది. రిజిస్టర్ చేసుకున్న వేలాది మంది నిరుద్యోగులు ఆశతో ఉదయం ఏడు గంటలకే మేళాకు వెళ్లారు. ఆ కంపెనీలెక్కడ..! ముందస్తుగా ప్రకటించిన మల్టీనేషనల్ కంపెనీలేవీ ఈ మేళాలో కనిపించలేదు. సెక్యూరిటీ, కాల్‌సెంటర్, వెబ్‌డిజైనింగ్ వంటి చిన్నచిన్న సంస్థలు మాత్రమే హాజరు కావడంతో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో పోలీసులు సైతం నిరుద్యోగులను అదుపు చేయలేకపోయారు. చివరకు అదనపు బలగాలు రప్పించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరుద్యోగుల ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు నిర్వాహకుడు నెమలి కుమార్‌తో పాటు అతనికి సహకరించిన మరికొంత మందిపై చీటింగ్ తదితర కేసులు నమోదు చేశారు. నిర్వాహకులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిర్వాహకులు గానీ, కళాశాల యాజమాన్యం గానీ పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండా జాబ్ మేళా నిర్వహించినట్టు డీసీపీ రమేష్‌నాయుడు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మల్లాపూర్‌కు చెందిన జాబ్‌మేళా నిర్వాహకుడు నెమలి కుమార్ కూడా నిరుద్యోగి. జాబ్‌మేళాతో డబ్బు రాబట్టాలని నిర్ణయించాడు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు. స్నేహితులు సహకారంతో పెద్దఎత్తున వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా పెద్ద పెద్ద కంపెనీల పేర్లను కోడ్ చేస్తూ సమాచారం నిరుద్యోగులకు చేరేలా పదిహేను రోజులుగా ప్రచారం చేశాడు. కుమార్‌కు ఎంఎన్సీ కంపెనీలతో సంబంధాలు లేకపోవడంతో పెద్ద కంపెనీలేవీ మేళాకు స్పందించలేదు. -
కోదండరాంను విమర్శించే అర్హత లేదు
హన్మకొండ: తెలంగాణ అభివృద్ధి, నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే అర్హత ప్రజాసంఘాలకు లేదని తెలంగాణ విద్యార్థి సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు తిరునహరి శేషు అన్నా రు. ఈమేరకు శనివారం హన్మకొండ నక్కలగుట్టలో తెలంగాణ విద్యార్థి సేనా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన లక్ష్యం కోసం కోదండరాం పోరాటం చేస్తుంటే కలిసి రావాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నా రు. సమావేశంలో నాయకులు ఎర్రబొజ్జ రమేశ్, పాలడుగుల సురేందర్, కల్లూరి పవన్, తంగెళ్లపల్లి పూర్ణేందర్, కి రణ్, క్రాంతి, రాకేష్, విజయ్ పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో కదలాలి
యువతకు మంత్రి హరీశ్‌రావు పిలుపు సిద్దిపేటలో జాబ్‌మేళా.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు సాక్షి, సిద్దిపేట: యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ఆయన హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన 51 కంపెనీలను ఒకేవేదిక మీదకు తీసుకొచ్చి 4,391 పోస్టులను సృష్టించారు. ఈ కార్యక్ర మానికి దాదాపు ఐదు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ అన్వే షణ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావా ల్సిందేనని, అలాంటి దానికి ఈ జాబ్ మేళాను తొలిమెట్టుగా వినియోగించు కోవా లని సూచించారు. ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా రాణించాలంటే ఉన్న గ్రామాన్ని వదిలి బయటికి రావాలని, అలా వచ్చిన వాళ్లే ఉద్యోగంలో రాణిస్తారని చెబుతూ హెటిరోడ్రగ్స్ చైర్మన్ పార్థసారథిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి పేరును మం త్రి ప్రస్తావించారు. రాష్ట్రంలో పశువుల డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని, 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఖాళీలు భర్తీ చేద్దామంటే ఆ కోర్సులో పోస్టు గ్రాడ్యు యేష న్ పూర్తి చేసిన అభ్యర్థులు దొరకడంలేదని చెప్పారు. సర్వేయర్ పోస్టులకు కూడా డిమాండ్ ఉందని, యువత ఇలాంటి కోర్సు లను ఎంచుకోవాలని మంత్రి సూచించారు. -
డీఎస్సీ–98 అభ్యర్థులకు ఉద్యోగాలేవి?
⇒ 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేల మంది నిరుద్యోగులు ⇒ అమలుకు నోచుకోని సుప్రీంకోర్టు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–1998లో నష్టపోయిన వారికి ఉద్యోగాలు ఎప్పుడు అందుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వారికి న్యాయం చేయాలని, ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. అసలు ఆ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండేళ్ల కింద హామీ ఇచ్చినా అధికారులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు.1998లో జరిగిన 40 వేల టీచర్ పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఆ డీఎస్సీలో 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించగా.. 15 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయించారు. తొలుత ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి 40 మార్కు లను కనీస అర్హతగా నిర్ణయించారు. కానీ పోస్టుల సంఖ్య కంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో.. కనీస అర్హత మార్కులను 45, 40, 35కు కుదించారు. నియామకాల సందర్భంగా అవకతవకలకు పాల్పడ్డారు. రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వూ్యల్లో ఎక్కువ మార్కులు వేసి ఎంపిక చేశారు. దీంతో నష్టపోయిన వేలాది మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని సుప్రీం కూడా ఆదేశించింది. సీఎం హామీ కూడా అమలుకాదా?: 2015 జనవరిలో సీఎం కేసీఆర్ 1998 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు త్వరలోనే ఉద్యోగాలు ఇచ్చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత ఒకసారి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారే కాక.. 2012 వరకు నిర్వహించిన మరో ఐదు డీఎస్సీల్లోనూ నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఉద్యోగాల కోసం దాదాపు 7 వేల మంది బాధితులు మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. -
సమస్యల‘కుప్ప’ం
⇒శంకుస్థాపనలు సరే.. నిధులేవీ? ⇒నత్తనడకన హంద్రీ–నీవా ⇒ విస్తరణకు నోచని రోడ్లు ⇒ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వే అండర్ బ్రిడ్జి ⇒కలగా పారిశ్రామిక వాడ ⇒వలసబాట పడుతున్న యువత ⇒కుప్పంలో ఇదీ పరిస్థితి ⇒నేడు సీఎం రాక అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారుగాజులు చేయిస్తానన్నట్టు ఉంది కుప్పంలో అభివృద్ధి పనుల పరిస్థితి. అంతర్జాతీయ హంగులతో అమరావతి నిర్మాణం అంటూ గొప్పలు చెబుతూ.. మహిళా సాధికారిత పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని గాలికొదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనుల్లేక నిరుద్యోగులు వలసలు వెళ్తున్నా.. గుక్కెడు నీళ్లులేక జనం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ మూడేళ్లలో ఏడు సార్లు పర్యటించి రూ.1451 కోట్లమేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోవడం తప్ప చేసిందేమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. కుప్పం : కుప్పం నియోజకవర్గం సమస్యలతో సతమతమవుతోంది. నిధులు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. స్పెషల్ గ్రాంట్లు వచ్చి నా ముందుకు సాగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలు నీటిమూటలేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శంకుస్థాపనలతో సరి గత ఏడాది ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబురూ.480 కోట్లతో హంద్రీ–నీవా కుప్పం కెనా ల్ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరత లేకుండా.. పనులకు ఆటంకం కలగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చా రు. కానీ చాలినన్ని నిధులు విడుదల చేయలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి.రూ.278 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉరవకొండ –కృష్ణగిరి వరకు 45వ జాతీయ రహదారి విస్తరణకు నిధులు కేటాయించినా పనులు నామమాత్రంగా సాగుతున్నాయి. కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వాయిదాలకే పరిమితమయ్యాయి. బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం నెలకొంది.కుప్పం పట్టణంలోని రోడ్ల విస్తరణ కోసం రూ.7 కోట్లు విడుదలై ఆరు నెలలు దాటినా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు.కుప్పం పట్టణం మధ్యలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.15 కోట్ల వ్యయంతో అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. రూ.8 కోట్లతో హార్టికల్చర్ హబ్ నిర్మాణానికి గత ఏడాది శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు.గుడుపల్లె మండలం, మల్లప్పకొండపై పవన విద్యుత్ ఏర్పాటుకు ఏడాదికి మునుపు శ్రీకారం చుట్టారు. కొండపై పవన విద్యుత్ పరీక్షించడానికి గాలిమరలు నిర్మించి గాలికొదిలేశారు. కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక వాడ నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఊదరగొడుతున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగాలు లేక పలువురు బెంగళూరుకు వలసబాట పడుతున్నారు. రూ.25 కోట్లతో బాలుర, బాలికల వసతి గృహాలు నిర్మిస్తున్నారు. కానీ ఏడాదిగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కుప్పం డిగ్రీ కళాశాల పనులూ పునాదులకే పరిమితమయ్యాయి.ప్రతి పంచాయతీ కేంద్రాన్ని కంప్యూటరీకరణ చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. అక్కడక్కడా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తుప్పుపడుతున్నాయి.ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తామంటూ హామీలిచ్చి మిన్నకుండిపోయారు. కుప్పం పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. మొదటి దశగా రూ.12 కోట్లు నిధులు విడుదలైనా ఫలితం లేకపోతోంది. -
ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపు గోదావరిఖని: ఓపెన్‌కాస్ట్‌లతో ప్రజలు ఉన్న ఊరును, వ్యవసాయ భూములను వదిలిపెట్టి పట్టణాలకు వలసవెళ్లి నిరుద్యోగులుగా బతకా ల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ గని కార్మిక మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జా తీయ గని కార్మికుల 2వ మహాసభ రెండోరోజు శుక్రవారం ఎన్టీపీసీలో ప్రతినిధుల సభ జరగ్గా కోదండరాం ప్రసంగించారు. సింగరేణిలో పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఓపెన్‌కాస్ట్‌ల తవ్వకం ఎక్కువగా జరుగుతోందని, ఇందుకు మందమర్రిలోని ఎర్రగుంటపల్లివాసులు ఏడా దిన్నరగా ఆందోళన చేస్తుండడం నిదర్శనమన్నారు. అందుకే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే ప్రత్యామ్నాయ విధానాల్ని ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, కార్మికు ల భద్రతకు అనుకూలంగా మైనింగ్ పాలసీని అమలుచేయాలని కోరారు. ఓపెన్‌కాస్టుల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, దీంతో పర్మినెంట్ కార్మికుల ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభు త్వాలు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడుతున్నాయన్నారు. తక్కువ డబ్బులిచ్చి కాంట్రాక్ట్ కార్మికులతో ఎక్కువ పనులు చేయించుకుంటున్నారన్నారు. సింగరేణిలో ఏడాదిలోపు సర్వీసు ఉన్న కార్మికుల వారసులకు, వీఆర్ఎస్ డిపెండెంట్లకు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకం ద్వారా పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ కో–ఆర్డినేషన్ గ్రూప్ (ఐసీజీ) నేతృత్వంలో జాతీయ సన్నాహక కమిటీ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య సమన్వయకర్త ఆండ్రియాస్ (జర్మనీ), సమన్వయకర్త బి.ప్రదీప్, చైర్మన్ పీకే మూర్తి, వివిధ దేశాలు, భారతదేశంలోని పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోషలిజమే శరణ్యం: సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాలగౌడ దేశ ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో సోషలిజ మే శరణ్యమని, ఈ క్రమంలో సమాజ నిర్మాణ బాధ్యతలను భారత కార్మికవర్గం చేపట్టాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాలగౌడ కోరారు. గోదావరిఖనిలో మహాసభల రెండో రోజు కార్యక్రమానికి వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వాలు, ఆయా సంస్థల యాజమాన్యాలు విశాల దృక్పథంతో ఆలోచించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన కార్మికోద్యమాలు, పోరాటాలు అవసరమని, ఇందుకోసం కార్మిక సంఘాలన్నీ ముందుకు సాగాలని సూచించారు. -
కదం తొక్కిన కాంట్రాక్ట్ అధ్యాపకులు
భారీ ర్యాలీ చేపట్టిన నిరుద్యోగులు దద్దరిల్లిన గాంధీభవన్.. ఓయూ హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు కదం తొక్కారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. క్రమబద్ధీకరణపై కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గాంధీభవన్‌ను ముట్టడించారు. మరోవైపు తమని కాదని ఇచ్చిన క్రమబద్ధీకరణ జీవో అశాస్త్రీయమంటూ నిరుద్యోగులు ఉస్మానియాలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరు ప్రాంతాలూ ఆందోళనలతో అట్టుడికి... ఉద్రిక్తలకు దారితీశాయి. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీవో నం.16 ఇచ్చింది. ఈ జీవోపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. బినామీల పేరుతో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు వేయించిందంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ (టీజీసీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో వందలాదిమంది గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి తాము గాంధీభవన్‌కు వస్తే పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారని టీజీసీసీఎల్‌ఏ అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం ఆరోపించారు. కాంగ్రెస్ వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. జర్నలిస్ట్‌పై దాడి చేసిన ఎస్సై బదిలీ గాంధీభవన్ వద్ద శుక్రవారం కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నా కవర్ చేయడానికి వెళ్లిన టీన్యూస్ జర్నలిస్ట్ యుగంధర్‌పై సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై జి.తిమ్మప్ప దాడి చేశారు. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన ఆయన తిమ్మప్పను టాస్క్‌ఫోర్స్ నుంచి కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఓయూలో భారీ ర్యాలీ... కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించవద్దంటూ నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీతో ఓయూ దద్దరిల్లింది. కేసులు ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘం నేతలు దేవిప్రసాద్, మధుసూదన్‌రెడ్డి తమను బెదిరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశా రు. రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కె.మానవతారాయ్ ఆధ్వర్యంలో ఆందోళనకారు లు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. -
నిరుద్యోగుల‘చలో టీఆర్ఎస్ భవన్’
- అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్: జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామాకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ‘చలో టీఆర్ఎస్ భవన్’ పేరిట ర్యాలీగా టీఆర్ఎస్ భవన్‌కు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన ఓయూ పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. -
ఇంకెన్నాళ్లు.. ఎదురుచూపులు?
చేతికందని బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అప్పు చేసి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన నిరుద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోతున్న అర్హులు కథలాపూర్ (వేములవాడ) : వారంతా ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్న నిరుద్యోగులు. సొంత కాళ్లపై నిలబడాలనేది వారి లక్ష్యం...కిరాణ దుకాణం.. గేదెలు, ఆవుల పెంపకం, వాహనాల కొనుగోలు.. ఇలా ఏదో ఒక దానిని ఏర్పాటు చేసుకోవాలనేది ఉపాధి పొందాలని వారి అభిమతం. ఈ క్రమంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అందించే రుణాల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వూ్యలు సైతం పూర్తయి లబ్ధిదారుల జాబితాను సైతం అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అర్హులైన వారంతా నెలల తరబడి మండల పరిషత్, కార్పొరేషన్ల కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా రుణం చేతికందని పరిస్థితి. ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్వయం ఉపాధి రుణాలకు 405 దరఖాస్తులు.. కథలాపూర్ మండలంలో 18 గ్రామాలుండగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరైనట్లు డిసెంబర్ 2015లో అధికారులు ప్రకటించారు. సుమారు 405మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు 197, ఎస్సీ కార్పొరేషన్‌కు 159 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలన చేసి నిరుద్యోగులకు గతేడాది మార్చిలో బ్యాంకు అధికారులు, మండల పరిషత్ అధికారులు సమష్టిగా ఇంటర్వూ్యలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక జాబితాను రూపొందించారు. ఇంటర్వూ్యలు నిర్వహించిన అధికారుల బృందం బీసీ కార్పొరేషన్ యూనిట్లు 30, ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లు 50 మంజూరుతో జాబితాను ప్రకటించారు. ఇదంతా బాగానే ఉన్నా.. నేటికి నిరుద్యోగులకు రుణాలు అందకపోవడం గమనార్హం. పది నెలలుగా కాలయాపన బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపికైన వారు బ్యాంకుల్లో ష్యూరిటీ పేరిట వేలాది రూపాయలు డిపాజిట్లు చేశారు. బ్యాంకు అధికారులు డిపాజిట్ చేయాల్సిందేనని ఒత్తిడి చేయడంతో అప్పు చేసి చెల్లించామని పలువురు వాపోతున్నారు. ఎప్పుడు అడిగిన ఇదిగో.. అదిగో అంటూ 10 నెలలుగా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. -
తర‘గని’ సంపద
బెల్లంపల్లి : నల్ల బంగారు నేలలో మరో శతాబ్దానికి సరిపడా బొగ్గు సంపద నిక్షిప్తమై ఉంది. ఇప్పటికే నూట ఇరవై ఎనిమిదేళ్లుగా బొగ్గు వెలికితీతలో సింగరేణి చరిత్ర సృష్టిస్తుండగా.. మరో వందేళ్లూ తవ్వకాలు జరిపినా తర‘గని’ నిల్వ నిక్షిప్తమై ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల కాలంలో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సొంతమైన బొగ్గు నిల్వలు కొత్తగా మరో రెండు జిల్లాలకు విస్తరించాయి. జిల్లాలో పునర్విభజనతో ఏర్పడిన పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకూ సింగరేణి వారసత్వం సంక్రమించింది. అపారమైన నల్ల బంగారు ఖనిజం తెలంగాణ రాష్ట్రానికి మకుటాయమానంగా భాసిల్లబోతోంది. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 26 బొగ్గు గనులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల శాసనసభలో ప్రకటించి నిరుద్యోగులు, కార్మికుల వారసులకు ఆశలు కల్పించారు. నూతనంగా ప్రారంభించే గనుల్లో 16 ఓపెన్‌కాస్టు గనులు, మరో 10 భూగర్భ గనులు ప్రతిపాదనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. స్వరాష్టం ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే అంత సంఖ్యలో కొత్త గనులు ఏర్పడనుండడం గమనార్హం. కొత్త బ్లాక్‌లు రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలకు ఏమాత్రం కొదువ లేదు. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం ప్రతి యేటా సర్వే చేసి కొత్త ప్రాంతాల్లో బొగ్గు సంపదను కనుగొంటోంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ బ్లాక్, బెల్లంపల్లి ఓసీపీ–2(ఎక్స్టెన్షన్) – మిగతా 2లోu నుంచి డోర్లి బ్లాక్, మంచిర్యాల జిల్లాలో తాండూర్ నుంచి శ్రావణ్‌పల్లి బ్లాక్, కాసిపేట నుంచి ఇందారం బ్లాక్, చెన్నూర్ బ్లాక్‌లలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ములుగు బ్లాక్, చంద్రపల్లి నుంచి మహదేవపూర్ బ్లాక్, పెద్దపల్లి జిల్లాలో రామగుండం బ్లాక్, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి బ్లాక్, భద్రద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు బ్లాక్, ఎల్లెందు, కొత్తగూడెం, లింగాల–కోయగూడెం, అనిశెట్టిపల్లి–మనుబోతుల గూడెం బ్లాక్‌లలో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో బయటపడిన బొగ్గు నిక్షేపాలలో భూగర్భ భౌగోళిక పరిస్థితులను బట్టి భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనులను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కనుగొన్న ప్రాంతాలలో కొన్ని మూసివేతకు గురైన బొగ్గు గనులు ఉండడం, వీటి పరిధిలో ఇంకా బొగ్గు నిక్షేపాలు ఉండడం గమనార్హం. మూతపడ్డ గనుల స్థానంలో కొత్తగా ఓపెన్‌కాస్ట్ గనులను ప్రతిపాదించనున్నారు. కొత్త ప్రాంతాల్లో భూగర్భ గనుల తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. మంచిర్యాల జిల్లా టాప్ బొగ్గు సంపద అపారంగా ఉన్న జిల్లాల్లో మంచిర్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుంది. మంచిర్యాల జిల్లాలో 3547.36 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు బయటపడగా వీటిలో నుంచి ఇప్పటి వరకు 254.49 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికి తీశారు. ఇంకా భూగర్భంలో 3297.87 మిలియన్ టన్నులు ఉన్నట్లు తేల్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,172.41 మిలియన్ టన్నుల బొగ్గు వనరులను గుర్తించగా ఇప్పటివరకు 447.02 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేశారు. ఇంకా 2725.39 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉత్పత్తి చేయాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో 2185 మిలియన్ టన్నులు బొగ్గు సంపద బయట పడగా ఇంతవరకు 438.08 మిలియన్ టన్నులు వెలికితీశారు. మరో 1746.54 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మిగిలి ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 550.55 మిలియన్‌టన్నులు గుర్తించగా.. 35.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్తత్తి జరిగింది. ఇంకా 515.01 మిలియన్ టన్నుల బొగ్గు వనరులు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1741.53 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలకు గాను ఇంతవరకు 26.35 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీశారు. మరో 1715.18 మిలియన్ టన్నుల బొగ్గు వనరులు మిగిలి ఉన్నాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 592.77 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలకు 47.55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఇంకా 545.22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బొగ్గు వెలికితీతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, పెద్దపల్లి జిల్లా ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఈ తీరుగా సింగరేణి భవిష్యత్తు ప్రధానంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
1999 గ్రూప్ 2 పోస్టులను దారి మళ్లించారు
-
కోడి పందేల నిర్వహణకు హైకోర్టు బ్రేక్
-
1999–గ్రూప్ 2 పోస్టులను దారి మళ్లించారు
- అనుమానం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు - రూల్ 7 వర్తింపచేయకపోవడంపై అనుమానాలు - పాత పోస్టులను కొత్త నోటిఫికేషన్లో కలిపేశారని ఆరోపణ - టీడీపీ హయాంలోని తప్పిదాలే ఈ పరిస్థితికి కారణమని ఆవేదన సాక్షి, హైదరాబాద్: గ్రూప్2–1999 నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టుల్లో కొన్నిటిని ప్రభుత్వం దారిమళ్లించిందా? 17 ఏళ్లుగా ఆ పోస్టులకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఇప్పుడివే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనల్లోని రూల్ 7 కింద (క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ మెరిట్) మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు దక్కాల్సిన పోస్టులను వారికి ఇవ్వకుండా ఇటీవల జారీచేసిన కొత్త నోటిఫికేషన్లోకి ప్రభుత్వందారి మళ్లించినట్లుగా కనిపిస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులను పాత వారితో భర్తీచేసే కన్నా కొత్తగా భర్తీ చేస్తే ప్రస్తుతం తమ హయాంలో భర్తీ అయినట్లు చెప్పుకోవడానికే అలా దారి మళ్లించినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇప్పటివరకు అధ్వానంగా మారిన ఈ 1999 గ్రూప్2 పోస్టుల భర్తీ వ్యవహారానికి అప్పుడు... ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 1999లో, ఇప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే ఉందని గుర్తు చేస్తున్నారు. రూల్ 7 తకరారు పోస్టుల మళ్లింపునకే! రూల్ 7 ప్రకారం ఎవరైనా పోస్టుల్లో జాయిన్ కాకపోయినా, రాజీనామా చేసినా, కొత్తగా పోస్టులు వచ్చినా ఆయా పోస్టులకు మెరిట్ జాబితాలో తదుపరి ఉన్న వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. కానీ 1999 గ్రూప్2లోని మొదటి రెండు విడతలకు రూల్ 7ను వర్తింపచేయకుండా మూడో విడతకు మాత్రమే పరిమితం చేయడం వల్ల 17 ఏళ్లుగా పరీక్ష ఫలితాలకోసం ఎదురుచూస్తున్న వారికి పోస్టులు దక్కకుండా పోతున్నాయని పేర్కొంటున్నారు. ఆనాడు పరీక్షలు రాసి జాబితాలో తదుపరి దశల్లో ఉన్నవారికి పోస్టులు దక్కనీయకుండా తాజా నోటిఫికేషన్లోకి మళ్లించడం ద్వారా కొత్తవారికి తాము పోస్టులు ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న పన్నాగమని విమర్శిస్తున్నారు. ఇటీవల 982 పోస్టులకు ఏపీపీఎస్సీ కొత్తగా జారీచేసిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల్లో అప్పటి మిగిలిన పోస్టులు కలిపేసి ఉంటారంటున్నారు. వయోపరిమితి దాటిపోయింది.. ఇన్నేళ్ల ఎదురుచూపులో తమ వయోపరిమితి కూడా దాటిపోయిందని, కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అవకాశమూ కోల్పోయామని కొంతమంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఉండగా ప్రస్తుతం 17 ఏళ్ల నాటి నోటిఫికేషన్‌కు చెందిన మెరిట్ జాబితాను తిరిగి రూపొందించడంతో దాదాపు అందరి జాతకాలు తారుమారు అవుతున్నాయి. గతంలో పైస్థానాల్లో ఉన్నవారు ఇప్పుడు కింది స్థానాల్లోకి, కింది స్థానాల్లో ఉన్న వారు పైస్థానాల్లోకి మారుతున్నారు. -
జోనల్ వ్యవస్థ రద్దుతో యువతకు నష్టం
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దుచేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదముందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన టీటీడీపీ న్యాయవిభాగం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితోనే జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పేద, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాలోని ప్రాంతాలన్నీ మరొక జిల్లాలోకి విలీనం చేయడం ద్వారా జోనల్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను కొనసాగిస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థను రద్దుచేశారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ఇ.పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడిగా గంధం గురుమూర్తి, మరో 67 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. -
నిరుద్యోగులకు ‘ఆన్లైన్’ కష్టాలు
29, 30 తేదీల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి పరీక్ష ఇచ్చిన ఆప్షన్లు కాకుండా గుంటూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈ నెల 29, 30 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని వందలాది మంది అభ్యర్థులకు గుంటూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఇక్కడి నుంచి 400 కిలోమీటర్ల దూరమున్న గుంటూరుకు వెళ్లాలంటే అధిక ఖర్చు భరించాల్సి వస్తోంది. దీనికి తోడు రెండు రోజులు అక్కడే ఉండాల్సి ఉంది. ముఖ్య మహిళా అభ్యర్థులు కుటుంబ సభ్యులను వెంట తీసుకొని పోవాల్సి ఉంటోంది. దీంతో ఈ ఖర్చు రెండింతలు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరెన్సీ కష్టాల నేపథ్యంలో అంతదూరం వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు కూడుకున్నదంటూ అభ్యర్థులు వాపోతున్నారు. అప్షన్ ఇచ్చినది ఒకటి... కేటాయింపు మరొకటి.. జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌కడప ఆప్షన్ ఇచ్చుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా గుంటూరు జిల్లాలో కేంద్రాలు కేటాయించడం గమనార్హం. అనంత జిల్లాలో ఎస్ఆర్ఐటీ కళాశాల, వీ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాలకు 350 మంది అభ్యర్థులను కేటాయించారు. వీటితో పాటు జిల్లాలో పీవీకేకే, శ్రీసాయి, ఎస్వీఐటీ, ఇంటెల్, మౌలాలి, అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఎస్ఎస్బీఎన్ కళాశాలలోనూ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వసతులున్నాయి. కానీ మిగిలిన అభ్యర్థులను గుంటూరు కేంద్రాలకు కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యం... అధికారులు చేసిన నిర్లక్ష్యానికి తాము బలవుతున్నామంటూ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల రీజనల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) ద్వారా క్లరికల్, పీఓ పోçస్టులకు నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష అనంతపురం జిల్లాలోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2015 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. జిల్లాలో వసతులు ఉన్నాయి.. వెయ్యిమంది ఒకే సారి ఆన్లైన్ పరీక్ష రాసేందుకు జిల్లాలో వసతులు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. జిల్లా అధికారులను ఏమాత్రం సంప్రదించకుండా ఏఈఈ పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు అర్థమవుతోందని ఆయన చెప్పారు. ఏదిఏమైనా గుంటూరు జిల్లాకు వెళ్లే కష్టాల నుంచి తప్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
గల్ఫ్ తరిమినా.. ఎడారి బాటే!
సాక్షి, జగిత్యాల: ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా ఈ నెల 25న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ కన్సల్టెన్సీ నిర్వహించిన గల్ఫ్ ఉద్యోగాల ఇంట ర్వ్యూకు వచ్చిన నిరుద్యోగులు. అబుదాబీలోని నేషనల్ హోటల్స్‌లో 500 పోస్టుల భర్తీ కోసం సదరు కంపెనీ నిర్వహించిన జాబ్‌మేళాలో ఏడొం దలకుపైగా మంది హాజరయ్యారు. ఏ ప్రకటన లేకుండానే కన్సల్టెన్సీ నిర్వహించిన జాబ్‌మేళా ఇది. ఒకవేళ పత్రిక ప్రకటన ఇస్తే.. వెరుు్య మందికిపైనే ఇంటర్వ్యూకు హాజరయ్యేవారని నిరుద్యోగులు చెప్పారు. ఇందులో మరో విశేష మేమిటంటే..! ఈ పోస్టులన్నీ హోటళ్లలో క్లీనింగ్ సెక్షన్లో మాత్రమే. ఎడారి దేశంలో.. క్లీనింగ్ ఉద్యోగం కోసం ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు సైతం సిద్ధం కావడం విశేషం. ఇంతకు ఈ ఉద్యో గాలకు అక్కడి యాజమాన్యం నిర్ణరుుంచిన వేతనం.. 950 దినార్లు (ఇక్కడి రూ.17,100) మాత్రమే. సంబంధిత హోటల్ ప్రతినిధులూ ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇక్కడ పనుల్లేక... పరారుుదేశంలో పనుల్లేక.. వందలాది మంది స్వదేశానికి తిరిగి వస్తున్నా గల్ఫ్ దేశంలో పని చేసేందుకు యువత సిద్ధమ వుతోంది. ఇప్పటికే సౌదీలోని జెడ్డా, రియాద్, దమామ్లలో ఉన్న బిన్‌లాడెన్ వంటి పెద్ద కంపెనీలు మూతబడ్డారుు. అబుదాబీ, ఒమన్, ఖతర్, మస్కట్, షార్జా ల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు మూతబడే దిశలో ఉన్నారుు. దీంతో యాజమాన్యాలు కార్మికులను పనిలోంచి తొలగిస్తున్నారుు. గల్ఫ్ నుంచి మూడు నెలల వ్యవధిలో 60వేలకు పైగా మంది తిరిగొచ్చేశారు. -
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
-
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
- 982 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరిన ఏపీపీఎస్సీ - 11 నుంచి కమిషన్ వెబ్సైట్లో దరఖాస్తు నమూనాలు - డిసెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ - దరఖాస్తులు 25 వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష - ఆ మేరకు ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ పరీక్ష - మే 20, 21న మెరుున్ పరీక్ష - దరఖాస్తులు 25 వేలు దాటకుంటే నేరుగా మెరుున్ పరీక్షే సాక్షి, అమరావతి: నిరుద్యోగులు వేరుుకళ్లతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మంగళవారం అర్థరాత్రి 34 కేటగిరీల్లో 982 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, 540 పోస్టులు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు. దరఖాస్తు నమూనాలు ఈ నెల 11నుంచి కమిషన్ వెబ్సైట్ (ఠీఠీఠీ.ఞటఛి.్చఞ.జౌఠి.జీ)లో అందుబాటులో ఉంటారుు. ఆరోజు నుంచి డిసెంబర్ పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అదేరోజు రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు గడువు విధించారు. దరఖాస్తులు 25వేలు దాటితే ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆ మేరకు ఫిబ్రవరి 26వ తేదీన ఈ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 20, 21 తేదీల్లో ఆన్లైన్లో మెరుున్ పరీక్ష నిర్వహిస్తారు. అరుుతే దరఖాస్తులు 25 వేలు దాటనట్లరుుతే స్క్రీనింగ్ పరీక్ష ఉండదు. నేరుగా మెరుున్ పరీక్షను(మే 20, 21 తేదీల్లో) నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా దరఖాస్తు చేయాలనుకునేవారు ముందుగా కమిషన్ వెబ్సైట్లో ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్టేషన్ర్) చేసుకోవాలి. ఈ ఓటీపీఆర్ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ద్వారానే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. పరీక్ష తేదీలకు వారం ముందు నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం జూలై ఒకటి నాటికి 42 సంవత్సరాలు దాటనివారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణరుుంచారు.దరఖాస్తుదారులు రూ.250 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు, రూ.80 పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహారుుంపునిచ్చారు. స్క్రీనింగ్, మెరుున్ పరీక్షలను రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు, మెరుున్ పరీక్ష 450 మార్కులకు నిర్వహిస్తారు. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 12, ఏసీటీఓ 96, గ్రేడ్-2 సబ్‌రిజిష్ట్రార్ 27, డిప్యూటీ తహశీల్దార్ 253, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 8, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 23, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 8, ఎకై ్సజ్ ఎస్ఐ పోస్టులు 15 ఉన్నారుు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సచివాలయం జీఏడీ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 67, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 16, న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 18, అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్లు 23, స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్‌లో సీనియర్ ఆడిటర్ పోస్టులు 45, ఖజానా శాఖలో(హెచ్ఓడీ) సీనియర్ అకౌంటెంట్లు 82, ఖజానా శాఖలో(డిస్ట్రిక్ట్ సబ్ సర్వీస్) సీనియర్ అకౌంటెంట్లు 158, ఖజానా శాఖలో జూనియర్ అకౌంటెంట్లు 39, గవర్నమెంట్ ఎగ్జామినేషన్సలో జూనియర్ అసిస్టెంట్లు 10, లేబర్ డిపార్టుమెంట్లో జూనియర్ అసిస్టెంట్లు 10, పీహెచ్ అండ్ ఎంఈ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 6, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ 1, డ్రగ్స అండ్ కాపీరైట్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 2, వ్యవసాయ శాఖలో జూనియర్ అసిసెంట్లు 10, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో జూనియర్ అసిస్టెంట్లు 2, ఎకై ్సజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంటు 4, షుగర్‌కేన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 1, ఆర్ అండ్ బీలో జూనియర్ అసిస్టెంట్లు 14, సర్వే సెటిల్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు 4, పౌరసరఫరాల శాఖలో జూనియర్ అసిస్టెంట్లు 7, బీసీ సంక్షేమశాఖలో జూనియర్ అసిస్టెంట్లు 3, ఏసీబీలో జూనియర్ అసిస్టెంట్ 1, ఏపీ ఇన్సూరెన్సలో సీనియర్ అసిస్టెంట్ 1, ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్సలో సీనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్
కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు పొందలేని వారిలో నైపుణ్యతను పెంచి వారికి ఉపాధి కల్పించేందుకు ‘వికాస్’ సంస్థ కృషి చేస్తుందని కలెక్టర్‌హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లో బుధవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నన్నయవర్సిటీతోపాటు వికాస్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేష¯ŒS మిషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఏడాదికి 10 వేల చోప్పున మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనేది లక్ష్యమన్నారు. నన్నయ వర్సిటీ పరిధిలోని 450కిపైగా గల అనుబంధ కళాశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికి ఉపాధి కల్పించడమే తమ థ్యేయమని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు అన్నారు. 5 వరకు శిక్షణ : ఉభయ గోదావరి జిల్లాల్లోని 12 హెచ్ఆర్డీ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 5 వరకు ఉంటుందని ఏపీఎస్ఎస్టీసీ ప్రాజెక్టు డైరెక్టర్ వీఎ¯ŒSరావు తెలిపారు. అనంతరం వారు ఉభయ గోదావరి జిల్లాల్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్లి నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. బ్యాచ్‌కి 60 మందికి శిక్షణ ఇస్తారని, 30 రోజుల శిక్షణ అయిన వెంటనే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ ఎస్‌ఎస్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. రంగయ్య, మేనేజర్ విజయ్‌కుమార్, డీఆర్డీఏ జేడీఎం ఎం.సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ!
నిరుద్యోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అరకొరగా ఉన్న పరిశ్రమలు మూతపడుతుండడంతో చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. దీంత యువత ఆందోళన చెందుతోంది. కొంతమంది చిన్నచిన్న దుకాణాలను పెట్టుకొని బతుకుబండిని నడపాలని చూస్తున్నారు. సబ్సిడీ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉండడం.. ఒక్క యూనిట్ కోసం పది మందికి పైగా పోటీపడుతున్నారు. మరో వైపు టీడీపీ కార్యకర్తల పెత్తనం అధికమైందనే విమర్శలు వస్తున్నాయి. సాదాసీదా పని నుంచి సబ్సిడీ రుణాల వరకూ అన్నీ జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే జరుగుతుండడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. రాజాం(సంతకవిటి): వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఎక్కడ తమకు రుణం మంజూరు కాదేమోనని లబ్ధిదారులు దిగులు చెందుతున్నారు. సబ్సిడీ రుణాల మంజూరు విషయంలో కూడా జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం ఉండడంతో అర్హులైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బినామీ లబ్ధిదారులతో దరఖాస్తులు చేయించడంతో వీటి సంఖ్య ఎక్కువగా ఉండనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఒక యూనిట్‌కు పది నుంచి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ రుణాలకు ఇలా.. ఎస్టీ సబ్సిడీ రుణాల కోసం ఇటీవల దరఖాస్తులను అధికారులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 252 యూనిట్లు కేటాయించగా ఈ నెల 24వ తేదీ వరకూ 5,511 దరఖాస్తులు అన్ని మండల కార్యాలయూలకు చేరాయి. వీటిలో 508 మంది నేరుగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా, మిగిలిన 428 ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. బీసీ రుణాలకు తీవ్ర పోటీ బీసీ రుణాల కోసం కూడా దరఖాస్తులు అధికంగానే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 1800 యూనిట్లు మంజూరవ్వగా.. వీటి కోసం 21,432 మంది పోటీ పడుతున్నారు. వీటిలో 21,405 మందిదరఖాస్తు చేసుకోగా, మిగిలినవి ఎంపీడీఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఎస్సీ రుణాల కోసం ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరయ్యే సబ్సిడీ రుణాల కోసం కూడా పోటీ తీవ్రంగానే ఉంది. 1027 యూనిట్లు జిల్లాకు మంజూరవ్వగా వీటి నిమిత్తం సోమవారం నాటికి 7,874 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7,859 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోగా, ఎంపీడీఓ కార్యాలయాల నుంచి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు... కాపు సబ్సిడీ రుణాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 1147 వ్యక్తిగత యూనిట్లు మాత్రమే కాపు కార్పోరేషన్ మంజూరు చేయగా వెలమ, బలిజ తదితర కాపు జాతులకు చెందిన నిరుద్యోగులు 7002 మంది చేసుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జన్మభూమి కమిటీల ప్రభావం గతంలో సబ్సిడీ రుణాలు బ్యాంకు మేనేజర్ల విల్లింగ్తో అధికారులు లబ్ధిదారులుకు ఇచ్చేవారు. రుణాలు కూడా సకాలంలో మంజూరయ్యేవి. ప్రస్తుతం వీటి పరిస్థితి మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి కూడా మండల స్థాయిలో జన్మభూమి కమిటీల ఆమోదం అవసమైంది. బ్యాంకు మేనేజర్లు సైతం కమిటీల కనుసన్నల్లోనే ఉన్నారు. ఫలితంగా చాలాచోట్ల కమిటీలు పలువురు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను తెరపైకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి దరఖాస్తు చేసినప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం మంజూరయ్యే వరకూ మొత్తం బాధ్యత కమిటీ సభ్యులు బినాబీలుగా వ్యవహరించి తీసుకుంటారనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రుణం మాత్రమే బ్యాంకు నుంచి లబ్దిదారునికి చెక్ రూపంలో అందుతుంది. అనంతరం ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ రుణాలను కమిటీసభ్యులు, లబ్ధిదారులు పంచుకుంటారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగి ఉండవచ్చునని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కాపు జాబ్‌మేళాలో తిరుగుబాటు
-
కాపు జాబ్‌మేళాలో తిరుగుబాటు
- సీఎం మీటింగ్ కోసం ఇంటర్వ్యూలు నిలిపివేసిన కంపెనీలు - నిరుద్యోగుల నినాదాలు.. లాఠీలతో తరిమికొట్టిన పోలీసులు సాక్షి, అమరావతి: కాపు విద్యార్థుల జాబ్‌మేళాలో విద్యార్థులు, నిరుద్యోగులు తిరగబడ్డారు. కాపు విద్యార్థులకు ఇబ్రహీంపట్నంలోని నోవా కాలేజీలో నిర్వహిస్తున్న కాపు జాబ్‌మేళాలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరి గింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విద్యార్థులను, నిరుద్యోగులను కాపు కార్పొరేషన్.. కాలేజీకి పిలిపించింది. ఆ తర్వాత సీఎం సభ ఉందంటూ ఇంటర్వ్యూలను ఆపేసింది. దీంతో సాయంత్రం మూడున్నర గంటలకు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాలేజీ లోపలి నుంచి ముఖ్యమంత్రి వేదిక వద్దకు వచ్చారు. ‘ఉయ్‌వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం సభ ముగిసిన తరువాత మళ్ళీ ఇంటర్వ్యూలు జరుపుతామని కంపెనీల వారు హామీ ఇచ్చినా నిరుద్యోగులు ఆందోళన విరమించలేదు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు నిరుద్యోగులను చొక్కాలు పట్టుకొని పోలీసులు ఈడ్చుకుపోయారు. మరికొందరిపై లాఠీ ఝుళిపించారు. ఈ సమయంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ నిరుద్యోగుల మధ్యలోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మీ పార్టీ కోసం ఉద్యోగాల పేరుతో మమ్మల్ని ఇక్కడకు రప్పించి ఇంటర్వ్యూలు కూడా చేయకుండా ఇబ్బం దులు పెడతారా? అంటూ రామానుజయను నిలదీసేందుకు నిరుద్యోగులు చుట్టుముట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, కాపు విద్యార్థినీవిద్యార్థుల జాబ్‌మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 1300 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటించగా.. 500 మందికి మాత్రమే వచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. మరోవైపు కానూరులో అన్నే కల్యాణమండపంలో బూరగడ్డ వేదవ్యాస్‌తోపాటు పలువురు టీడీపీలో చేరారు. -
వెయ్యి మంది నిరుద్యోగులకు క్యాబ్‌లు: ఈటల
గచ్చిబౌలి: వెయ్యిమంది నిరుద్యోగులకు క్యాబ్‌లు ఇప్పిస్తామని, ప్రతి ఒక్కరు వృత్తిని ప్రేమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ క్యాబ్ డ్రైవర్లకు సూచించారు. గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో ఉబెర్ అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. చదువుకున్న వెయ్యిమంది నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద క్యాబ్‌లు ఇప్పిస్తామని చెప్పారు. వాహనం కొనుగోలుకు రూ.5 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే 60 శాతం సబ్సిడీ, ఐదు లక్షలకు పైగా లోన్ ఇస్తే 50 శాతం సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు. రూ.2 లక్షల లోన్ ఇస్తే 70 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. క్యాబ్ డ్రైవర్ వృత్తి నామోషీగా భావించవద్దని సూచించారు. అనేక మంది చదువుకున్నవారు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు ప్రైవేట్ ఉగ్యోగాలలో సెటిల్ అవుతున్నారని పేర్కొన్నారు. ఉబెర్ క్యాబ్ సహకారంతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృత్తిని సామాజిక సేవగా భావించాలని అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఉబెర్ క్యాబ్ ప్రయాణికులకు చేరువగా ఉందన్నారు. ఖాళీ సమయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఉబెర్‌లో పనిచేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నిరుద్యోగల కోసం ప్రత్యేక కార్యలయం
-
ప్రకాశం జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య
-
ప్రాణం మీదికి తెచ్చిన ఉద్యోగ ‘పరీక్ష’
• విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు • జారిపడిన అభ్యర్థి.. తీవ్ర గాయాలు జోగిపేట: సబ్‌స్టేషన్ ఆపరేటర్ల కోసం నిర్వహించిన పరీక్షలు ఓ నిరుద్యోగి ప్రాణాల మీదకు వచ్చారుు. నారాయణఖేడ్ ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లలో పనిచేసేందుకు సోమవారం అందోలు మండలం అల్మారుుపేట సబ్‌స్టేషన్ లో అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. దాదాపు 30 మందిలో నారాయణఖేడ్‌కి చెందిన పుండరీకం.. పరీక్షల్లో భాగంగా విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు పట్టుతప్పి కిందకు పడిపోయాడు. దీంతో నడుముకు తీవ్ర గాయాలయ్యారుు. బాధితుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుుతే, విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగిన వారినే సెలెక్ట్ చేయాలని ఎస్ఈ ఆదేశించారని జోగిపేట ట్రాన్ ్సకో డీఈ శ్రీనివాస్, ఏడీ నాగరాజు తెలిపారు. -
కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకు వసూలు చేసింది. సుమారు 70 మంది వద్ద వసూలు చేసిన కన్సల్టన్సీ నిర్వాహకులు మొదటి రెండు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
-
ఉపాధి కల్పన ఉత్తిదే..?
గతమెంతో ఘనం.. ప్రస్తుతం శూన్యం.. ఒక్కరికీ ఉపాధి కల్పించని వైనం.. ఆశతో కార్యాలయానికి వస్తున్న నిరుద్యోగులు బెల్లంపల్లి : నిరుద్యోగులకు ఉపాధికల్పన లక్ష్యంగా జిల్లాలోని బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఉప ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఉత్తుత్తిగా మారింది. పేరు నమోదు(ఎన్రోల్), రెన్యూవల్ చేయడానికి మాత్రమే పరిమితమైంది. ఇక్కడ నుంచి కాల్ లెటర్లు జారీ అయ్యేది లేదు.. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్లి ఉద్యోగం సాధించేది అంతకన్న లేకుండా పోయింది. ఎంతో ఆశతో ఎంప్లాయ్మెంట్ కార్డు తీసి, కాల్ లెటర్ రాక ఏళ్ల తరబడి నుంచి నిరీక్షించడం నిరుద్యోగులకు సర్వసాధారణమైంది. నాలుగు దశాబ్దాల క్రితం.. తూర్పు ప్రాంతంలో ప్రధాన పట్టణంగా ఉన్న బెల్లంపల్లిలో 1975లో ఉప ఉపాధి కల్పనాధికారి (సబ్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్) కార్యాలయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. బొగ్గు గనుల క్షేత్రంగా విలసిల్లిన ఆ కాలంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఎంప్లాయ్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపి, వేలాది మందికి బొగ్గు గనుల్లో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు కల్పించిన సబ్ ఎంప్లాయ్మెంట్ అప్పట్లో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. ఎవరెవరికి అంటే..! సబ్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్‌లో 1నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు, పదో తరగతితో ఐటీఐ , పాలిటెక్నిక్ చదివి సాంకేతిక విద్యను పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడానికి వీలుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ తదితర కోర్సులు చదివిన వారు, నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ కార్డు తీయడానికి బెల్లంపల్లిలోని ఈ సబ్ కార్యాలయం ఆధారం. రోజువారీగా వచ్చిపోయే నిరుద్యోగులు, విద్యార్థులతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ ప్రాంగణం ఎంతో సందడిగా కనిపించినా కాల్ లెటర్ల జారీ మాత్రం లేకుండా పోయింది. పదిహేనేళ్ల నుంచి.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి కాల్ లెటర్లు పంపి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశం కల్పించడం ఆ రోజుల్లో జరిగేది. ఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా కాల్ లెటర్ అప్పట్లో అనివార్యమయ్యేది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు వస్తే సీనియార్టీ ప్రాతిపాదికన సంబంధిత శాఖకు ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి జాబితాను, అర్హత కలిగిన నిరుద్యోగులకు కాల్ లెటర్లు పంపించేవారు. ఆ తీరుగా ఇంటర్వ్యూకి వెళ్లి నిరుద్యోగులు ఉద్యోగం పొందేవారు. ఈ కారణంగానే నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌లో పేరు ఎన్రోల్ చేసుకోవడానికి ఎగబడేవారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ అంటే ఉద్యోగం కల్పించే సంస్థగా భావించేవారు. కానీ.. ఆ పరిస్థితులు ప్రస్తుతం కానరాకుండా పోయాయి. ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌ల నుంచి కాల్ లెటర్లు పంపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి ప్రభావం పూర్తిగా తగ్గింది. పదిహేనేళ్ల నుంచి కాల్ లెటర్లు జారీ కాకపోవడం ఇందుకు తార్కాణంగా చెప్పొచ్చు. అయినా.. ఇంకా ఆశ చావని నిరుద్యోగులు కార్డు తీయడానికి వచ్చి వెళ్తున్నారు. నేరుగా ఇంటర్వ్యూలు జిల్లాలో కిందిస్థాయి పోస్టులు అనేకం ఏళ్ల తరబడి నుంచి ఖాళీగా ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి నిరుద్యోగుల జాబితాను అడగటం లేదు. దీంతో ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ నుంచి స్పాన్సరింగ్ (కాల్ లెటర్లు పంపడం) నిలిచిపోయాయి. అటెండ ర్, వాచ్మెన్ కొలువులు, కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ శాఖలు రిక్విజేషన్ (ఖాళీ పోస్టుల వివరాల జాబితా )ను పంపించడం మానేశాయి .మరోపక్క ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. ఆ ప్రకారంగా ఉద్యోగానికి ఎంపికైన నిరుద్యోగుల పేర్లను ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ అధికారులు సీనియార్టీ జాబితా నుంచి క్రమంగా తొలగిస్తున్నారు. ఎన్రోల్ చేసుకున్న నిరుద్యోగులు బెల్లంపల్లి సబ్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్‌లో ప్రస్తుతం 11,014 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా పదో తరగతితో ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన 8,472 మంది డిప్లొమా విద్యార్థులు ఉన్నారు. మిగిలిన 2,542 మంది వివిధ కేటగిరీలకు చెందిన నిరుద్యోగులు ఎన్రోల్ చేసుకున్నారు. చాలా వరకు కిందిస్థాయి ఉద్యోగాలు పొందే అర్హతలు కలిగిన నిరుద్యోగులు పేరు నమోదు చేసుకుని ఏళ్ల తరబడి నుంచి కాల్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. -
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి, వెలుగు, కడప ఎంప్లాయ్మెంట్ జనరేషన్మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కడపలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనిడీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిట్టర్ ఉద్యోగానికి సంబంధించి 50 ఖాళీలు ఉన్నాయని, ఇందుకు ఐటీఐ/ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 18–34 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలని, వేతనం నెలకు రూ. 5 వేలు ఉంటుందన్నారు. అలాగే ఫీల్డ్ కో–ఆర్డినేటర్స్ 50 ఖాళీలు ఉన్నాయన్నారు. దీనికి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ఉద్యోగానికి 18–34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. నెలకు రూ. 7 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అర్హతలు గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్‌కార్డులు జిరాక్స్ కాపీలను తీసుకుని కడప నగర శివార్లలోని టీటీడీసీలో ఈనెల 23వ తేది ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 96420 72966, 88858 65038 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కన్సల్టెన్సీ
తార్నాకలో ఎస్కే గ్లోబల్ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. సుమారు 200 మంది నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.2 కోట్ల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే దుకాణం సర్దేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి లక్షన్నర వరకు నిర్వాహకుడు పవన్ కుమార్ వసూలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితులు ఓయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పోస్టుమెన్ నిర్లక్ష్యంతో ఇంటర్వ్యూ కోల్పోయిన నిరుద్యోగి
మనూరు: పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ఇంటర్వ్యూను కోల్పోయాడు. బాధితుడు భూతపిల్లి తుకారాం శుక్రవారం స్థానిక విలేకరుల ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. మండలంలోని మాయికోడ్ గ్రామానికి చెందిన యువకుడు బి.తుకారామ్‌కు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి భారత్ పెట్రోలియంలో ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని 6న ఇంటర్వ్యూకు హాజరవ్వాలని జూన్ 4 న నారాయణఖేడ్ ఫోస్టాఫీస్‌కు రిజిస్టర్ పోస్టు వచ్చింది. ఈ క్రమంలో సంబంధిత పోస్టును ఖేడ్ పోస్టు కార్యాలయ సిబ్బంది మాయికోడ్ పోస్టుమెన్‌కు అదే రోజు అందచేశారు. అయితే గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ సుధాకర్ సంబంధిత రిజష్టర్ పోస్టును యువకుడికి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వచ్చిన రోజు కాకుండా 18న సదరు రిజిష్టర్ పోస్టును కుటుంబీకులకు ఇచ్చి సంతకం తీసుకోకుండానే వెళ్లిపోయాడు. కాల్‌లెటర్ చూసిన యువకుడు పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా తాను ఉపాధి కోల్పోయానని మనోవేదనకు గురయ్యాడు. కాగా పోస్టుమెన్ పుండ్లిక్‌పై చర్యలు తీసుకోవాలని తాను జిల్లా పోస్టాఫీసులో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. ఇక ముందు పోస్టుమెన్లు నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు తాను సంబంధిత పోస్టుమెన్‌పై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఖేడ్ పరిధిలోని పోస్టుమెన్లు నిర్లక్ష్యంగా, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పోస్టుమెన్లు నిర్లక్ష్యం వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. -
బాబు వచ్చారు.... జాబే రాలేదు - టీడీపీ ఎమ్మెల్యే
నాంపల్లి: ఏపీలో ‘బాబు వస్తే..జాబు వస్తుందని’ ప్రచారం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటించనున్న గ్రూపు-1 సర్వీసుల్లో గ్రూపు-2 సర్వీస్‌లను విలీనం చేయరాదని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కృష్ణయ్య మట్లాడుతూ గ్రూపు-1 సర్వీస్‌లో గ్రూపు-2 సర్వీసులను విలీనం చేయడం అశాస్త్రీయమన్నారు. ఇంటర్వూల పేరుతో లక్షలు దండుకునేందుకే అధికారులు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాల ప్రశ్నాపత్ర ం ఇంగ్లీషుతో పాటుగా తెలుగులో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... నిరుద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, చంద్రబాబైనా... చంద్రశేఖరైనా నిలదీస్తామన్నారు. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్‌తో కృష్ణయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. సమస్యపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ైచైర్మన్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, పులకచర్ల శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీలో సమాచార బ్యాంకు
* నిరుద్యోగుల సమాచారం నిక్షిప్తం * ఆనందం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు * ఒక్కసారి నమోదు చేస్తే చాలు విజయనగరం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దరఖాస్తుల సమయంలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సాంకేతికత సాయం తీసుకుంది. పరీక్ష ఏదైనా విద్యార్థి లేదా నిరుద్యోగి ఒక్కసారి డేటా నమోదు చేసుకుంటే వాటిని ప్రతి సారీ వాడే వెసులుబాటును తీసుకువచ్చింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అన్నీ ఏపీపీఎస్సీ ద్వారానే వస్తుంటాయి. వీటికి తరచూ దరఖాస్తులు చేయడం అభ్యర్థులకు కాసింత కష్టం గానే ఉంటోంది. తాజాగా అమలు చేస్తున్న కొత్త విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఒక్కసారి దరఖాస్తు చేస్తే చాలు వాటిని ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తుంది. మధ్యలో మన అర్హతలు పెరిగితే వాటిని మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది. అర్హతల నమోదుకు అవకాశం.. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న ప్రతీ విద్యార్థి విద్యార్హత వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో, సంతకం, సహా ఆన్లైన్లోని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన సెల్‌ఫోన్, ఈ మెయిల్ అడ్రస్‌లకు ఓ మెసేజ్ వస్తుంది. దీనిలో వచ్చిన కోడ్ నంబర్‌ను ఆన్లైన్లో పొందుపరి చి సబ్మిట్ చేయాలి. దీంతో నమోదు ప్రక్రి య పూర్తి అవుతుంది. అనంతరం ఆ వ్యక్తికి ఒక శాశ్వత నంబరు ఇస్తారు. ఏటా కొత్తగా వచ్చే విద్యార్హతలు ఎప్పటికప్పుడు నిరుద్యోగికి సంబంధించిన ప్రొఫైల్‌లో అప్లోడ్ చేయవచ్చు. ప్రయోజనాలు.. ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే ముం దుగా మనకు కేటాయించిన శాశ్వత నంబరు ఆధారంగా కేవలం నిర్ణీత రుసుం చెల్లిస్తే చాలు. మనం దరఖాస్తు చేసినట్లే. దీనివల్ల ఉద్యోగ ప్రకటన వచ్చే ప్రతి సారీ నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డేటా బ్యాంకులో అప్పటికే విద్యార్థి లేదా నిరుద్యోగి విద్యార్హతలు నమోదై ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఏ పరీక్షకు అర్హత ఉందో తెలుసుకొని దానికి మనం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. మున్ముందు పరీక్షలన్నీ ఆన్లైన్లోనే... విద్యార్థి లేదా నిరుద్యోగులకు సంబంధించిన ప్రొఫైల్ పొందు పరుచుకొనే విధానాన్ని మొదటిసారిగా అందుబాటులోనికి తెచ్చిన ఏపీపీఎస్సీ ఇకపై ప్రతి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన శాఖా పరమైన పరీక్షలు (డిపార్టుమెంట్ టెస్టులు) ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన పరీక్షలు రాసే వారు ఇబ్బంది పడకుండా మాక్ టెస్టులను అందుబాటులో ఉంచారు. దీని వల్ల ఆన్లైన్ పరీక్ష అంటే భయపడాల్సిన పని లేదు. ఇలా నమోదు చేసుకోవాలి... ప్రతీ విద్యార్థి ‘పీఎస్ఈ.ఏపీ.జీఓటీ.ఐన్’ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ సూచనలకు అనుగుణంగా విద్యార్హతలు, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో ఏమైనా ఇబ్బం దులు వస్తే ఏపీ ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఈ నెల నుంచే అందుబాటులోనికి తీసుకువచ్చారు. నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరం ఈ కొత్త సమాచార నిక్షిప్త కార్యక్రమం నిరుద్యోగులకు ఎంతో ఉపయోకరం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు తమ ధ్రువపత్రాలను ఒకేచోట ఉంచడం, కొత్త విద్యార్హతలు పొందిన సందర్భంలో వాటిని అదనంగా నమోదు చేయడం మంచి విధానం. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. అన్ని రంగాల్లోనూ సాంకేతిక విప్లవం వచ్చాక ఉద్యోగార్ధులకు కూడా ప్రాధాన్యం ప్రకారం ఉద్యోగాల కల్పన, దరఖాస్తులకు కొత్త విధానం రావడం అభినందనీయం. - తూముల నాగ కార్తీక్, కరస్పాండెంట్ తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాల, కోమటిపల్లి -
ఉద్యోగాల భర్తీకి పునర్విభజన చిక్కు
కొత్త జిల్లాల ప్రకారం పోస్టుల విభజనకు మరింత సమయం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు నిరుద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన గ్రూపు-2 పోస్టుల భర్తీ, కొత్త నోటిఫికేషన్లు... అంతా అస్తవ్యస్తమవుతుందనే ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాల పునర్విభజనలో హద్దులు చెదిరిపోతే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సైతం నిలిచిపోయే ప్రమాదం ఉందని, న్యాయపరమైన చిక్కులు తప్పవనే సంకేతాలు లక్షలాది మంది అభ్యర్థులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 439 పోస్టులు, త్వరలో రాబోయే మరో 460 గ్రూపు-2 పోస్టుల భర్తీ పరిస్థితి ఏంటన్న అంశంపై గందరగోళం నెలకొంది. వీటి కి జోనల్ సమస్యలుండగా, 15,628 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జిల్లా సమస్యలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. జిల్లాల ఏర్పాటుకు ముందే చేపట్టాలి... గ్రూపు-2కు దరఖాస్తు చేసిన 5,64,434 మంది నిరుద్యోగులు, ఇప్పటికే టెట్ అర్హత పొందిన లక్షన్నర మంది, కొత్తగా టెట్ రాసిన 3.72 లక్షల మంది ఉద్యోగాల భర్తీకి ఎదురు చూస్తున్నారు. పాఠశాలల హేతుబద్దీకరణ పూర్తి కాగానే ఉపాధ్యాయ ఖాళీలు, సీఎం ఆమోదం రాగానే అదనపు గ్రూపు పోస్టులతో ఉద్యోగాల భర్తీని టీఎస్పీఎస్సీ చేపడుతుందని భావించినా కొత్త జిల్లాల కసరత్తుతో ఆ ప్రక్రియకు బ్రేక్ వేసినట్లయింది. ఈ కసరత్తుతో ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో సాధ్యం కాదని, జిల్లాల ఏర్పాటు కంటే ముందే ఉద్యోగాల భర్తీ చేపడితేనే న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నెలా వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు.. ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం అయితే తీవ్ర అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. రెండు కొత్త జిల్లాలతో జోనల్ సమస్య! ఇప్పటివరకు ఐదో జోన్లో ఉన్న వరంగల్‌లోని మూడు మండలాలు, ఆరో జోన్ పరిధిలోని నల్గొండలో 11 మండలాలను కలిపి కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో గ్రూపు-2 పోస్టుల భర్తీలో జోనల్ సమస్య తలెత్తనుంది. ఆరో జోన్లో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్‌లోని కరీంనగర్ జిల్లాలో ఉన్న 5 మండలాలు, అలాగే ఐదో జోన్లోనే ఉన్న వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. గ్రూపు-2కు తమ జోన్ పరిధిలో ఉన్న పోస్టులకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ జోన్లు మారితే ఈ పోస్టుల భర్తీ గందరగోళమవనుంది. టీచర్ పోస్టుల భర్తీలో ఎన్నో సమస్యలు... టీచర్ తదితర జిల్లా స్థాయి పోస్టుల భర్తీ విషయంలో అనేక సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖాళీలు భర్తీ చేయకపోతే అందుకు మరింత సమయం పడుతుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలను చూస్తే ఒక జిల్లాలోని మండలాలన్నీ అదే జిల్లా పరిధిలో లేవు. ఉదాహరణకు వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లోని వివిధ మండలాలతో ఆచార్య జయశంకర్ జిల్లా ప్రతిపాదన ఉంది. ఇప్పటివరకు ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లా యూనిట్‌గానే భర్తీ చేశారు. కానీ కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాల్లోని ఖాళీలను మాత్రమే తీసుకొని నోటిఫై చేయాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది. పైగా జిల్లాలు ఏర్పడితేనే పోస్టుల విభజన చేయాల్సి ఉంటుంది. అంతవరకు పోస్టులను విభజించి భర్తీ చేయడానికి వీల్లేదు. ఈ లెక్కన పోస్టుల భర్తీలో కూడా ఆలస్యం తప్పేలా లేదు. ఏజెన్సీ ప్రాంతాలున్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో మరో సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు 66 ఖాళీగా ఉన్నాయి. అందులో మైదాన ప్రాంతంలో 60 పోస్టులు ఖాళీగా ఉంటే ఏజెన్సీ మండలాల్లోని పాఠశాలల్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం అనుకున్నట్లుగా భద్రాద్రిని జిల్లా చేస్తే అక్కడున్న ఆరు పోస్టులకే ఆయా మండలాలకు చెందిన అభ్యర్థులంతా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.