Wanaparthy District News
-
భవిష్యత్ ఆయిల్‌పాం సాగుదే..
వనపర్తి రూరల్: ఆయిల్‌పాం సాగుకు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో బోయిని వాసు సాగుచేసిన ఆయిల్‌పాం తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించామని చెప్పారు. దీర్ఘకాలం ఆదాయం పొందడంతో పాటు అంతర్గతంగా ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శారద, నాయకులు ఆవన్ననాయుడు, చిట్యాల రాము, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 18న చెస్ పోటీలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 11 బాలలకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోటీలు జరుగుతాయని.. మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాలలు పోటీలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు (సెల్‌నంబర్ 97034 62115), కోశాధికారి టీపీ కృష్ణయ్య (సెల్‌నంబర్ 99591 54743) సంప్రదించాలని సూచించారు. రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. మంగళవారం నాటికి జలాశయంలో సముద్ర మట్టానికిపైన 1,015 అడుగులు ఉందన్నారు. తాగునీటి అవసరాలకు జలాశయం నుంచి 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అఽధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 20న జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని.. కార్మికులు, రైతులు, కూలీలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వరాచారి, ఎండీ జబ్బార్, గోపి, లక్ష్మి, సాయిలీల, మదన్, బాలస్వామి, గంధం గట్టయ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగాబండలాగుడు పోటీలు వనపర్తి రూరల్: మండలంలోని చిమనగుంటపల్లిలో లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం గ్రామస్తులు అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. మొత్తం 5 జతల ఎద్దులు పోటీలో పాల్గొనగా చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఎం.గోపాలకృష్ణ ఎద్దులు మొదటి బహుమతి గెలువగా రూ.40 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. అలాగే తాడూరు మండలం యాదిరెడ్డిపల్లికి చెందిన డా. అఖిలేష్‌రెడ్డి ఎద్దులు రెండో స్థానంలో నిలువగా రూ.30 వేలు, జ్ఞాపిక, నల్గొండ జిల్లా కొప్పోలు ఐతరాజు సత్యనారాయణ ఎద్దులు మూడోస్థానంలో నిలువగా రూ.20 వేలు, జ్ఞాపిక అందించారు. -
కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తాం
పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరి ధాన్యం నిల్వలను వెంటనే లారీల్లో గోదాంకు తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గోదాంను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్తో కలిసి పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో యాసంగిలో అధిక దిగుబడి రావడం, సరిపడా మిల్లులు లేకపోవడం, లారీలు, హామీల కొరతతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, అమరచింత, ఖిల్లాఘనపూర్ మండలాల్లో 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని.. పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో ధాన్యం సేకరణ, తరలింపులో వేగం పెంచి రైతుల ఇబ్బందులు తొలగిస్తామని వివరించారు. కేంద్రాలకు తాలు, చెత్త లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయరని చెప్పారు. మిల్లులు, గోదాంల వద్ద ఆర్ఐ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తూ రోజు వారి నివేదిక తీసుకుంటామన్నారు. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. దీంతో చిన్న, చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్ ఉస్మాన్, కాంగ్రెస్‌పార్టీ మండల నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, తిరుపతయ్యసాగర్, రాముయాదవ్, విష్ణు, రామచంద్రయ్య, నరేందర్‌గౌడ్, దర్గయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచుతాం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు -
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
వనపర్తి/వనపర్తి రూరల్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ భావితరాలకు సారవంతమైన భూమిని అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం నాగవరం రైతువేదికలో జరిగిన రైతునేస్తం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూమిలో సారం తగ్గిందని ఏటా డీఏపీ, యూరియా తదితర రసాయన ఎరువులు అధికంగా వినియోగిస్తే అనతి కాలంలోనే భూమి సత్తువ కోల్పోయి చౌడు నేలగా మారుతుందన్నారు. భవిష్యత్ తరాలకు సైతం భూమి ఉపయోగపడి పంటలు పండాలంటే సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. పంట వేసే 45 రోజుల ముందు జీలుగ, పచ్చ రొట్ట, పెసర, జనుము వంటి పంటలు సాగు చేసి పూత దశలో ట్రాక్టర్‌తో తొక్కించడంతో సేంద్రియ ఎరువుగా మారుతుందని తెలిపారు. దీంతోపాటు పశువుల ఎరువు వాడటంతో అధిక దిగుబడి రావటమే కాకుండా భూమి సారవంతంగా మారుతుందన్నారు. జిల్లాకు జీలుగ విత్తనాలు 1,010 క్వింటాళ్లు సరఫరా అయ్యాయని, మరో రెండు వేల క్వింటాళ్ల విత్తనాలు పంపించాల్సిందిగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారని.. రైతులు సద్వినియోగం చేసుకొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. భారత్‌లో ఆయిల్‌పాంకు చాలా డిమాండ్ ఉందని, సాగు వైపు ఆలోచించాలని కోరారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్ మాట్లాడుతూ.. జీలుగ, పచ్చ రొట్ట విత్తనాలు పీఏసీఎస్ కేంద్రాల్లో విక్రయిస్తున్నారని, పొలాల్లో పండించి పూత దశలో రోటోవేటర్‌తో దున్నటంతో మట్టిలో కలిసి నేల సారవంతంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
ముగిసిన రెవెన్యూ సదస్సులు
గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలెట్ మండలంగా గోపాల్‌పేటను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 13 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం చివరిరోజు మండల కేంద్రంతో పాటు బుద్దారం గ్రామంలో సదస్సులు కొనసాగగా.. గోపాల్‌పేటలో 39, బుద్దారం గ్రా మంలో 67 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా మొత్తం 590 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ పాండు తెలిపారు. మంగళవారంతో దరఖాస్తుల స్వీకరణ ముగిసిందని.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డితదితరులు పాల్గొన్నారు. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో 5 రోజుల పాటు కొనసాగే జిల్లాస్థాయి ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణను మంగళవారం జిల్లా విద్యాధికారి ఘనీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి శిక్షణకు హాజరుకావాలన్నారు. 21 రకాల వైకల్యాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించి వందశాతం సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులను గుర్తించి యూడైస్‌లో నమోదు చేయించాలన్నారు. సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా తగిన బోధన అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్లు యుగంధర్, శేఖర్, శుభలక్ష్మి, మహానంది, డీఆర్పీ పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి కలెక్టర్ అర్జీదారులతో వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ద్వారా వచ్చిన వినతులతో పాటు జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి మొత్తం 66 వినతులు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ప్రజావాణిలో డీఆర్డీఓ ఉమాదేవి, అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు ప్రజావాణికి 7..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 7 వినతులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యయత్నం.. జిల్లాకేంద్రంలోని బుడగజంగాలకాలనీకి చెందిన ఎస్.శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు సంపాదించిన ప్లాట్లు, ఇల్లు పంపకంలో పెద్ద మనుషుల పేరుతో జోక్యం చేసుకున్న తాజా మాజీ కౌన్సిలర్ ధౌర్జన్యానికి పాల్పడుతున్నారని.. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని తెలిపారు. గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించారు. అనంతరం బాధితుడిని ఎస్పీ వద్దకు తీసుకెళ్లగా తనకు జరిగిన అన్యాయం, పంపకాల పేరుతో తన వద్ద తీసుకున్న డబ్బుల వివరాలతో ఫిర్యాదు అందించారు. -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
గోపాల్పేట: రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. సోమవారం మండలంలోని మున్ననూరులో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరి యా, పురుగు మందులను తగిన మోతాదులో వినియోగించాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు భూసార పరీక్షలతో కలిగే లాభాలు, పంట అవశేషాలను కాల్చడంతో కలిగే నష్టాలను వివరించారు. సాగు సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే పంటమార్పిడి చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో పంటల సాగు, ఆయిల్‌పాం సాగు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కరుణశ్రీ, హరీశ్‌నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. వనపర్తి టౌన్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సోమవారం జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో 68 మంది లబ్ధిదారులకు రూ.34.03 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు పొందిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా మత్స్యకార సెల్ అధ్యక్షుడు నందిమళ్ల యాదయ్య, పెద్దమందడి మండల అధ్యక్షుడు సి.పెంటన్న, నారాయణ, జిల్లా సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్, పట్టణ ప్రధానకార్యదర్శి అడ్వొకేట్ బాబా, నాయకులు ఎత్తం చరణ్, రాగి వేణు, కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్దుల్లా, జానంపేట నాగరాజు, అనీష్, గోవర్ధన్, గట్టు రాజు, సొప్పరి రమేష్ పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకుసాగాలి వనపర్తి: విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా ముందుకుసాగాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సాయి శరణ్య, శ్రీచరణ్, భార్గవి, అమూల్యశ్రీని ఎస్పీ శాలువాలతో సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని, పిల్లలు సంస్కారాన్ని పెంపొందించుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. విశ్వకర్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారోజు తిరుపతయ్య, యాదగిరి, గౌరవ అధ్యక్షులు బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, డా. బి.శ్యాంసుందర్, అరవింద్, ప్రకాష్, రామ్మోహన్, శ్రీనివాసాచారి, శ్రీశైలం పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
పాన్‌గల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా సహకార అధికారి (డీసీఓ) రాణి ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని, తేమశాతం, సన్న, దొడ్డురకం ధాన్యం గుర్తింపునకు యంత్రాలు, రైతుల వివరాల రికార్డు తప్పక ఉండాలన్నారు. అలాగే తాలు, చెత్త లేకుండా చూసి ధాన్యం తూకం చేయాలని, సేకరణలో జాప్యం చేయొద్దని.. ఆలస్యం జరిగితే కారణాలను రైతులకు వివరించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాలు పేరుతో తరుగు, ధాన్యం తరలింపునకు లారీలు రాక కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని పలువురు రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడీఏ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రమేష్‌బాబు, సీనియర్ అడిటర్ బీక్యానాయక్, మహబూబ్అలీ, కిరణ్, రాజునాయక్, ఏఓలు రాజవర్ధన్‌రెడ్డి, డాకేశ్వర్‌గౌడ్, మురళీధర్, సీఈఓ భాస్కర్‌గౌడ్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. రేపు జాబ్ మేళా వనపర్తి టౌన్: జిల్లాలోని నిరుద్యోగులకు వనపర్తి, హైదరాబాద్‌లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకుగాను జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని పీఎంకేకేలో జరిగే జాజ్ మేళాకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి పది, ఐటీఐ, ఏదైన డిగ్రీ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ చదివిన వారు అర్హులని.. ఎంపికై న వారికి శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు అన్ని ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 99485 68830, 77990 73053, 91753 05435 సంప్రదించాలన్నారు. 15, 16న విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్‌నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్‌లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
మత్తు రహిత జిల్లాగా మారుద్దాం
వనపర్తి: జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి నార్కోటిక్, నషా ముక్త్ భారత్ సమీక్షలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని, విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచి మత్తు పదార్థాల విక్రయం, రవాణాను అరికట్టాలని కోరారు. ఒకప్పుడు పట్టణాలకే పరితమైన గంజాయి వినియోగం రానురాను గ్రామీణ ప్రాంతాలకు పాకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ.. పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, నిఘా ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆస్పత్రులకు 100 మీటర్ల పరిధిలో పాన్, గుట్కా, సిగరెట్ వంటివి అమ్మకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ క్యాంపెయిన్లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఓ పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాచిన ఉదంతం వెలుగు చూసిందని తెలిపారు. అనంతరం మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, ఆబ్కారీ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని ఆదేశానుసారం ఆదివారం మండలంలోని అచ్యుతాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య గ్రామస్తులకు చట్టాలు, భూ భారతిపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి రైతులు తెలుసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా హెల్ప్‌లైన్ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలన్నారు. బాలలు, వృద్ధులు, మహిళలకు జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ తరఫున ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా న్యాయ సాయం పొందవచ్చతెలిపారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది తిరుపతయ్య, పారాలీగల్ వలంటీర్ రవి, దయాకర్, నవనీత్‌కుమార్, సాయికుమార్ పాల్గొన్నారు. -
యువత క్రీడల్లోనూ రాణించాలి
ఆత్మకూర్: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టిసారించి జాతీయస్థాయిలో రాణించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని మోట్లంపల్లిలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలకు కులం, మతం, వర్గ విభేదాలు ఉండవని, ప్రతిభ ఉన్నవారు అవలీలగా రాణిస్తారని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని.. లక్ష్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడగా మొదటి బహుమతి ఆరేపల్లి జట్టు, ద్వితీయ బహుమతి దేవరపల్లి జట్లు సాధించాయి. వీరికి నగదుతో పాటు జ్ఞాపికలు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో రహ్మతుల్లా, పరమేష్, తులసిరాజ్యాదవ్, నల్గొండ శ్రీను, చెన్నయ్యసాగర్, గంగాధర్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, రవికుమార్, గోవర్ధన్, నిర్వాహకులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ.. భవితకు నిచ్చెన
జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగుతున్న శిబిరం ● కోడింగ్ నేర్చుకుంటున్నా.. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులో చేరాను. రోజువారి చదువులను పక్కనబెట్టి నృత్యం, యోగా, ఆటపాటలు, కోడింగ్ నేర్పుతున్నారు. కోడింగ్‌ను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. – చందన, 9వ తరగతి, కేజీబీవీ, మదనపురం సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి.. నాకు నృత్యం అంటే ఎంతో ఆసక్తి. దీంతో సమ్మర్ క్యాంపునకు హాజరై రోజువారి అభ్యసనతో పాటు నృత్యం నేర్పిస్తున్నారు. – లక్ష్మి, 8వ తరగతి, కేజిబివీ, మదనాపురం నిత్యం పర్యవేక్షణ.. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో ఈ నెల 6 నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు విద్యార్థినులకు కోడింగ్‌తో పాటు నృత్యం, కరాటే, యోగా, డ్యాన్స్ తదితర వాటిలో శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేశాం. ప్రతి కేజీబీవీ నుంచి సిబ్బందిని రప్పించి తరగతులు నిర్వహిస్తుండటంతో పాటు ఇతర అంశాలపై శిక్షణనిచ్చేందుకు వలంటీర్లను నియమించాం. రోజు పర్యవేక్షిస్తూ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – శుభలక్ష్మి, జీసీడీఓ అమరచింత: వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా, ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా ప్రభుత్వం కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది. జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా.. ఒక్కో కేజీబీవీ నుంచి ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పదిమంది విద్యార్థినులను ఎంపికచేసి జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో 15 రోజుల పాటు శిక్షణనిస్తున్నారు. శిబిరంలో 100 మంది విద్యార్థులు ఉండాలనే నియమం ఉన్నా.. ఆసక్తిగల వారందరికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు జరిగే శిక్షణలో ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కోడింగ్, స్పోకెస్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. విద్యార్థులందరికీ అక్కడే వసతి కల్పించడంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తుండటంతో శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. నైపుణ్య శిక్షణ... కోడింగ్‌తో పాటు నృత్యం, కరాటే, యోగా, డ్యాన్స్, ఆటపాటలను నేర్పించేందుకు రోజువారి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం ఆయా రంగాల్లో శిక్షణ పొందిన వలంటీర్లను ఎంపిక చేసి వారికి 15 రోజులకుగాను రూ.2,500 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. రోజు తెల్లవారుజామున విద్యార్థులను నిద్ర లేపి మొదట యోగా చేయించి వాటితో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. అదేవిధంగా రోజు ఒక అంశంపై బోధన, నృత్యం తదితర అంశాలను నేర్పిస్తున్నారు. నేర్చుకున్న విషయాలను పునశ్ఛరణ చేయించడంతో విద్యార్థులు త్వరగా వాటిపై పట్టు సాధిస్తున్నారు. హాజరవుతున్న 15 కేజీబీవీల 115 విద్యార్థినులు ఈ నెల 6న ప్రారంభం.. 20 వరకు కొనసాగింపు కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు యోగా, నృత్యం తదితర అంశాల్లో.. ఒక్కో పాఠశాలకు ఒక రోజు.. జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో కొనసాగే వేసవి శిక్షణ శిబిరం నిర్వహణ బాధ్యతను ఆ పాఠశాల ఎస్ఓకు అప్పగించగా.. ఒక్కోరోజు ఒక్కో పాఠశాల సిబ్బందికి కేటాయించారు. కేటాయించిన రోజుల్లో ఎస్ఓతో పాటు సీఆర్టీలు హాజరై ఇచ్చిన టైంటేబుల్ ప్రకారం విద్యార్థినులకు వివిధ అంశాల గురించి బోధిస్తున్నారు. శిబిరం సవ్యంగా కొనసాగేలా జీసీడీఓ పర్యవేక్షణ చేస్తున్నారు. -
పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
వనపర్తి: ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లు, ఇతరత్రా టూర్లకు వెళ్తుంటారని, ఇదే అదునుగా చోరీలు పెరిగే ఆస్కారం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ రావుల గిరిధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసి ఆవరణలో ఉన్న వాహనాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పటిష్ట గస్తీ నిర్వహిస్తూ అరికట్టాలను సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ తప్పకుండా నవీకరిస్తూ ఉండాలని, ఎలాంటి పెండెన్సీ లేకుండా రికార్డుల నిర్వహణ చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి బాధితుల పట్ల వ్యవహరించే తీరు, ఫిర్యాదులు పరిష్కరించే విధానాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మమేకమై సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, ఎలాంటి రిమార్కులు లేకుండా, ప్రజలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలా విధులను నిర్వర్తించాలని చెప్పారు. డయల్ 100, బ్లూ కోర్టు సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ సమాచార సేకరణలో ముందుండాలన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు ఎస్ఐ యుగంధర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
వీపనగండ్ల: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు సిబ్బందికి సహకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కల్వరాల, వీపనగండ్ల, తూంకుంట గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు తరలించే ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యాన్ని సమకూర్చాల్సి ఉంటుందని తాలు, మట్టి పెల్లలు ఉండటం వల్ల రైస్ మిల్లు యజమానులు కూడా నష్టపోయే పరిస్థితులు నెలకొంటాయని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రైతులు నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కొర్రీలు పెట్టొద్దు.. చిన్నంబావి: ధాన్యం కొనుగోలులో రైస్‌మిల్లర్ల యజమానుల పేరుతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతున్నారని మండలంలోని వెలగొండ గ్రామంలో రైతులు పబ్బేరు ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ధాన్యంలో దుమ్ము ఉందని తరుగు పేరుతో బస్తాకు 4, 5 కిలోలు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ధర్నాకు మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, సీపీఎం జిల్లా నాయకులు ఆంజనేయులు మద్దతు ఇచ్చారు. దాదాపు అరగంటకుపైగా సాగిన ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ జగన్మోహన్ అక్కడికి చేరుకొని అదనపు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడించడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించి రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, తరుగు పేరుతో అధిక మొత్తంలో ధాన్యం తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అమ్మా.. నీకు వందనం
వనపర్తివాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. వేగంగా ‘టర్ఫ్’ పనులు పాలమూరు ఎండీసీఏ క్రికెట్ మైదానంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uసృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● అమ్మ మాట.. బంగారు బాట.. ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్‌లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్‌నగర్‌లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్‌కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్‌పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్‌కర్నూల్ నేడు మాతృ దినోత్సవం అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్‌గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్‌లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్‌లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్‌గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్‌కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి అమృత పదం అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – విజయేందిర, కలెక్టర్, మహబూబ్‌నగర్ తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి అమ్మ లేకుంటే నేను లేను సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. – సాక్షి, నాగర్‌కర్నూల్/పాలమూరు/ వనపర్తి/గద్వాల/జెడ్పీసెంటర్ తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. నా కెరీర్లో రోల్ మోడల్ -
పేరుకుపోతున్న ధాన్యం..
గట్టు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ వేయ్యికళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. సరిపడా గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపక పోవడంతో ధాన్యం కొనుగోలు నత్తనడకసాగుతున్నట్లు రైతులు ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబందించి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక గట్టు విషయానికి వస్తే.. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ధాన్యం కొనుగోళ్లు అప్పగించారు. గట్టు, మాచర్ల, పెంచికలపాడు, ఆలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర 292 మంది రైతులకు సంబంధించి 33,786 బస్తాలు(40కేజీలు), 13,514 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఇవి కాక మరిన్ని ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల దగ్గర అలాగే ఉండిపోయాయి. గట్టులో సుమారుగా 30 వేల బస్తాలు, మాచర్లలో సుమారుగా 25 వేల బస్తాలు, పెంచికలపాడులో 15వేల బస్తాలు, ఆలూరులో 12వేల బస్తాల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నట్లు అంచనా. బయటి మార్కెట్ కన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న చోట వడ్ల ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అకాల వర్షాల వలన వడ్లు తడిస్తే ఇబ్బంది అని రైతులు వాపోతున్నారు. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత గన్నీ బ్యాగులు లేక వడ్ల కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు రైతులు ఆరోపించారు. గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 4 కొనుగోలు కేంద్రాలకు కేవలం 33వేల గన్నీ బ్యాగులు మాత్రమే పంపారని, ఇంకా సుమారుగా 80 వేల బస్తాలు అవసరం ఉన్నట్లు అంచనా. ఇక కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీల సమస్య నెలకొంది. ఇప్పటిదాకా పంపిన గన్నీ బ్యాగులకు సంబందించి వడ్లను తూకం వేసిన అధికారులు వాటిని మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు అధికారులు తెలిపారు. తూకం పట్టిన వడ్ల బస్తాలు సుమారుగా 3వేల వరకు కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమిరెడ్డి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోలు ఆలస్యమవుతుందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేధిస్తున్న గన్నీ బ్యాగుల కొరత కొన్న ధాన్యం తరలింపునకు ఇబ్బందులు రైతులకు తప్పని పడిగాపులు -
సమీకృతం.. పిల్లర్లకే పరిమితం
మున్సిపల్ కేంద్రాల్లో ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం ఒకే దగ్గర విక్రయించాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసి సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో అమరచింతలో ఆగమేఘాల మీద చేపట్టిన ఈ పనులు.. ఆ తర్వాత బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అర్ధంతరంగా వదిలేశారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా.. పిల్లర్లకే పరిమితమైన సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – అమరచింత -
సజావుగా ధాన్యం సేకరణ
పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన ధాన్యం జాప్యం లేకుండా వెంటనే మిల్లులకు తరలిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం సేకరణ, నిల్వలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గత యాసంగిలో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని మరో రెండ్రోజుల్లో పూర్తిగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు కేంద్రాలకు తాలు, మట్టి, గడ్డి లేకుండా ధాన్యం తీసుకురావాలని, అలాంటి ధాన్యంలో తరుగు తీస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం చిరిగిన బస్తాల్లో కాకుండా కొత్త బస్తాల్లో నింపాలని సూచించారు. లారీలు సక్రమంగా రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని, దీంతోపాటు సేకరణ కూడా మందకొడిగా సాగుతుందని పలువురు రైతులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. మిల్లర్లతో మాట్లాడి లారీలను సమకూర్చాలని సూచించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో సింగిల్‌విండో, ఐకేపీ సిబ్బందితో సమావేశమై కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, సేకరణపై అధికారులతో ఆరా తీశారు. కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందుల గురించి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ జేసీకి వివరించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో సీఈఓ భాస్కర్‌గౌడ్, ఐకేపీ ఏపీఎం వెంకటేష్‌యాదవ్, ఆ యా కార్యాలయాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆ దివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్‌రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
కొనుగోళ్లకు కొర్రీలు?
లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం ●వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవస్థలు తప్పడం లేదు. తాలు, తేమశాతం, లారీలు, హమాలీల కొరత, మట్టిపెడ్డల శాతం పేరుతో ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెడుతుండటంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. ఇందుకు పలు గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఘటనలే ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లాలో సన్న, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా 481 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దొడ్డురకం కేంద్రాలు 226, సన్నాలు కొనేందుకు 255 కేంద్రాలు ఉన్నాయి. దొడ్డురకం కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని తరలించేందుకు లారీ డ్రైవర్లు సైతం విముఖత చూపుతున్నారు. మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోరనే భావన డ్రైవర్లలో నెలకొంది. మిల్లర్లు సన్నాలను మాత్రమే తీసుకోవడం, దొడ్డు రకాలను చాలావరకు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తుండటంతో గోదాముల వద్ద హమాలీలు లేక నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నదాతల ఆందోళన.. తాలు ఎక్కువగా ఉందని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వీపనగండ్ల మండలం తూంకుంట, గోవర్ధనగిరిలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఇటీవల వనపర్తి మండలం అంకూరు, గోపాల్పేట మండలం బుద్దారం గ్రామాల్లోనూ కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు చేశారు. ఈ విషయంపై అధికారులు నిత్యం క్షేత్ర పర్యటనలు చేస్తున్నా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు.. కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు సరిపోవడం లేదు. దీంతో రోజురోజు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ధాన్యం కేంద్రానికి తీసుకొచ్చినప్పటి నుంచి లారీల్లో తరలించే వరకు రైతుదే బాధ్యత కావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శుక్రవారం వరకు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. రూ.275 కోట్ల ధాన్యం కొనుగోలు.. జిల్లావ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు రూ.275 కోట్ల విలువైన 1,18,871 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. 65 శాతం మేర ట్యాబ్ ఎంట్రీలు పూర్తికావడంతో చెల్లింపులు సుమారు రూ.165 కోట్ల మేర చేసినట్లు తెలుస్తోంది. తాలు పేరుతో ఇబ్బందులు.. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ.. కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పెట్టారు. తాలును సాకుగా చూపి బస్తాకు మూడు కిలోల వరకు అధికంగా ఽతీసుకుంటున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేసేవారు. – జగన్‌రెడ్డి, రైతు, తూంకుంట (వీపనగండ్ల) హమాలీల కొరతతో జాప్యం.. ధాన్యం కొనుగోలులో సమస్యలు ఉత్పన్నం కాకుండా రెవెన్యూ అదనపు కలెక్టర్‌తో కలిసి పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సమస్య వస్తే అక్కడికి వెళ్లి పరిష్కరించి వెంటనే కొనుగోళ్లు చేయిస్తున్నాం. హమాలీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ తాలు పేరుతో అధికంగా తూకం ఆందోళన బాటలో అన్నదాతలు తరుగు పేరిట దోపిడీ.. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో 40 కిలోల బస్తాకు సుమారు 3 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం చేయాలని నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసనలు చేసినా.. తీరు మారడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆన్లైన్ వేదికలు.. టీనేజ్ ప్రేమలు
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ● మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు సాక్షి, నాగర్‌కర్నూల్: ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్‌గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కఠిన నిబంధనలు ఉన్నా.. మైనర్ వివాహాలు జరిపిస్తే కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మైనర్ పెళ్లిళ్లు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికలను వివాహం చేసుకుంటే యువకుడు, బంధులవులతో పాటు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. చాలాసందర్భాల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. మండలస్థాయిలో చైల్డ్ మ్యారేజీ ప్రొహిబిషన్ ఆఫీసర్లుగా సంబంధిత ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా, చాలావరకు వివాహాలు జరిగాక కేవలం కౌన్సిలింగ్లకే పరిమితమవుతున్నారు. చిన్నవయసులోనే ఆన్లైన్ ద్వారా పరిచయాలు ప్రేమ వ్యవహారాలకు దారి తీస్తుండటంతో తల్లిదండ్రులే మైనర్ బాలికలకు గుట్టుగా వివాహాలు జరిపిస్తున్నారు. మరికొంత మంది మైనర్ దశలోనే ఆన్లైన్ పరిచయస్తులను నమ్మి ఇల్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
కొత్తకోట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో నమూనా ఇందిరమ్మ ఇంటిని తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అన్ని మండల కేంద్రాల్లో రూ.5 లక్షలతో నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నామని.. వాటిని చూసి అదే బడ్జెట్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తహసీల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చన్నారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో పంచాయతీ కార్యదర్శి ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారని, ఇల్లు నిర్మించుకునే వారు స్థానిక నాయకులు, పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత దశల వారీగా నగదు బ్యాంకు ఖాతాలో జమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లినాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు
వనపర్తి: జిల్లాలోని అన్ని మండలాల్లో జూన్ 2 నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్టుగా గోపాల్పేట మండలంలో ఈ నెల 5 నుంచి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిబ్బంది, తీసుకెళ్లాల్సిన రికార్డులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే ఆర్డీఓ లాగిన్‌కు, అక్కడి నుంచి తన లాగిన్‌కు పంపించాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించే నాటికి ధరణి లాగిన్‌లో పెండింగ్ ఉండకూడదని చెప్పారు. భూ భారతి చట్టంలోని నిబంధనలు, ధరణిలో పరిష్కారం కాని వాటిని ఎలా పరిష్కరించాలి.. తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పైలెట్ మండలం గోపాల్‌పేటలో రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులు, పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఎదురైన సమస్యలను తహసీల్దార్ పాండు వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. అనుమతి లేని ఇళ్లకు నోటీసులివ్వాలి.. ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పుర కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ లే అవుట్ ఆమోదం పొంది ఫైనల్ లే అవుట్ ఆమోదానికి వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించిన రెండు లేఅవుట్లకు కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్న ఏడు దరఖాస్తులను పక్కనబెట్టారు. నిబంధనల ప్రకారం అన్ని మౌలిక వసతులు కల్పిస్తేనే కమిటీ ఆమోదం పొందుతుందన్నారు. అదనపు కలెక్టర్లు జి,వెంకటేశ్వర్లు, యాదయ్య, ఇరిగేషన్ ఇంజినీర్లు, ఆర్అండ్బీ డీఈ, టీపీఓలు, లే అవుట్ యజమానులు, ప్లానర్లు పాల్గొన్నారు. -
‘శ్రామికవర్గ పోరాటాలు ఉధృతం చేయాలి’
వనపర్తి రూరల్: శ్రామికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. కమ్యూనిజం విజయానికి 80 ఏళ్లు పూర్తయినందున శుక్రవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ఆయన హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని.. అందులో భాగంగా జిల్లాకేంద్రంలో సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వరాచారి, బాలస్వామి, గట్టయ్య, బీసయ్య, నందిమళ్ల రాములు, శ్రీనివాసులు, విజయ్‌కుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా సంక్షేమ పథకాల అమలు
వనపర్తి: మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పుర కమిషనర్లతో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ఉపాధిహామీ పథకం, వర్షాకాలంలో అంటురోగాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జనవరి 26న ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 1,300 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అందులో ఇప్పటి వరకు గ్రౌండింగ్ పూర్తయినవి.. మిగిలినవి పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలు మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదో వారితో ఇష్టం లేదని రాతపూర్వకంగా లేఖలు తీసుకోవాలని.. వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రెండోవిడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేక అధికారులు స్క్రూటినీ చేసిన జాబితాను తన లాగిన్‌కు త్వరగా పంపించాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను బ్యాంకులకు అందజేయాలని, ఈ ప్రక్రియ 15వ తేదీగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు 15 లక్షల పనిదినాలు కల్పించేందుకు లక్ష్యంగా నిర్ధేశించామని.. ఇప్పటి వరకు కేవలం 2.60 లక్షల పని దినాలు మాత్రమే కల్పించామని, ఇప్పుడు రోజుకు 40 వేల పని దినాలు కల్పిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేమని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి పనులు గుర్తించి అత్యధికంగా కార్మికుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు అవకాశం ఉంటుందని, వచ్చే వన మహోత్సవంలో ప్రతి గ్రామ రహదారికి ఇరువైపులా 6 అడుగుల ఎత్తుగల మొక్కలు నాటాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో దోమలతో డెంగీ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను ప్రతి నెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేసేలా చూడాలని, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం.. లైెసన్స్ సర్వేయర్ల శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) అంశంగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు, ఐటీఐలో డ్రాఫ్ట్ మెన్ సివిల్, డిప్లొమా ఇన్ సివిల్, బీటెక్ సివిల్, ఇతర సమానమైన విద్యార్హత కలిగి వారు అర్హులని.. మీ–సేవ కేంద్రాల్లో ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ ఫీజు ఓసీలు రూ. వేలు, బీసీలు రూ.ఐదు వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని.. ఎంపికై న వారికి జిల్లాకేంద్రంలో 50 పనిదినాల్లో తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 98490 81489, 94419 47339 సంప్రదించాలని సూచించారు. -
ప్రథమ చికిత్స.. ప్రశ్నార్థకం?
వనపర్తిటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. బస్సుల్లో గాయపడిన, వేసవి తాపానికి తట్టుకోలేక అస్వస్థతకు గురైన వారికి కనీస చికిత్స అందించేందుకు కూడా సౌకర్యాలు లేదు. చిన్నపాటి గాయమైన ప్రయాణికులు ఆస్పత్రులు, మందుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అత్యవసర సమయంలో అవసరమయ్యే మందులు, వేసవిలో కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం లేదు. వనపర్తి డిపో పరిధిలోని 108 బస్సులు రోజు వివిధ ప్రాంతాలకు 60 వేల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయి. దీంతో ఆర్టీసీకి రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా.. ప్రయాణికుల అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ప్రథమ చికిత్స కిట్లను కూడా అధికారులు సమకూర్చలేకపోతున్నారు. కొన్ని బస్సుల్లో పెట్టెలు కనిపిస్తున్నా వాటిలో మందులు లేవు. సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల స్థానంలో టీవీలు, టేప్‌రికార్డులు బిగించగా.. మరికొన్నింటిలో ఖాళీగా ఉంచారు. కొంతకాలం కింద జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌లో బస్సు చెట్టును ఢీకొట్టగా డ్రైవర్, ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పెట్టెలో ఉండాల్సినవి.. దూది, బ్యాండేజ్ క్లాథ్, అయింట్మెంట్, గాయం శుభ్రం చేసేందుకు హైడ్రోజన్ పెరాకై ్సడ్, నార్మల్ సైలెన్ తప్పనిసరిగా ఉండాలి. వీటికి అదనంగా పారాసిటమాల్ మాత్రలు, వేసవిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాల్సి ఉంటుంది. డిపోలో ఉన్న బస్సులో చాలా వరకు ప్రథమ చికిత్స పెట్టెలు లేవు. మరికొన్నింట్లో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. కొత్తగా బస్సులు వచ్చినప్పుడే ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఉంటాయని సిబ్బంది పేర్కొంటున్నారు. అద్దె బస్సుల్లో సైతం ఈ పెట్టెలు ఉండటం లేదు. శిక్షణ కరువు.. బస్‌డ్రైవర్లు, కండక్టర్లకు ప్రథమ చికిత్సపై కనీస అవగాహన కల్పిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రథమ చికిత్స పెట్టెలో మందులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తేగాని సమకూర్చరని సిబ్బంది చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధుల కేటాయింపు కూడా అవసరం. ఆర్టీసీ బస్సుల్లో కానరాని కిట్లు కనీస మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లుఅందుబాటులోని లేని వైనం పట్టించుకోని యంత్రాంగం -
సాగునీటి రంగం పటిష్టతకు కృషి
వనపర్తి: నియోజకవర్గంలోని గొల్లపల్లి, బుద్ధారం రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాములు, కాల్వల మరమ్మతుకు రూ.1,323 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని నీటిపారుదలశాఖ సీఈ కార్యాలయంలో ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. గొల్లపల్లి రిజర్వాయర్, బుద్ధారం ఆన్లైన్ రిజర్వాయర్, కేఎల్ఐ, డి–5, డి–8 కాల్వల పటిష్టత, విస్తరణ, స్ట్రక్చర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, బుద్ధారం కుడి, ఎడమ కాల్వల పటిష్టత, గణపురం బ్రాంచ్ కెనాల్, కర్నె తండా, ఖాసీంనగర్ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలోనే చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల నిర్మాణాలు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు కేశవరావు, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
అమరచింత: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుల కోసం నైపుణ్యం గల చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ ఏడీ గోవిందయ్య గురువారం కోరారు. చేనేత వృత్తిలో అత్యంత నైపుణ్యం కలిగి ఉండి 31.12.2024 నాటికి 30 ఏళ్లు నిండి పదేళ్లకు తగ్గకుండా అనుభవం ఉన్నవారు.. డిజైనింగ్ కేటగిరీలో 31.12.2024 నాటికి 25 ఏళ్లు నిండి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, డర్రీస్, జనరల్ వైరెటీస్లో చీరల తయారీపై నైపుణ్యం ఉన్నవారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న కార్మికులకు రూ.25 వేల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారని తెలిపారు. ఐకేపీ సీసీ శోభకు రాష్ట్రస్థాయి పురస్కారం ఖిల్లాఘనపురం: మండల కేంద్రం క్లస్టర్ సీసీగా పనిచేస్తున్న శోభకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పురస్కారం లభించిందని ఏపీఎం రాంబాబు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సీసీల్లో జిల్లా నుంచి శోభ ఒక్కరే ఎంపికై నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యారాజన్ అవార్డును అందజేసినట్లు వివరించారు. దీన్‌దయాళ్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంలో భాగంగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు అందించే రుణాల్లో శోభ తన క్లస్టర్ పరిధిలోని ఖిల్లాఘనపురం, వెంకటాంపల్లి, గట్టుకాడిపల్లి, ఆగారం, అంతాయపల్లి, షాపురం గ్రామాల్లోని మహిళా సంఘాలకు రూ.11.50 కోట్ల రుణాలు ఇప్పించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శోభను ఐకేపి సిబ్బంది, ఏపీఎంలు అభినందించారు. యూరియా తక్కువగా వినియోగించాలి వనపర్తి రూరల్: రైతులు తమ పంటలకు యూరియాను తక్కువగా వినియోగించాలని పాలెం వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరామ్ తెలిపారు. గురువారం మండలంలోని కిష్టగిరి గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని యూరియా వినియోగం, పంటమార్పిడి, సాగునీటి పొదుపు, నాణ్యమైన విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించారు. భూమిలో సారం ఉండాలంటే రైతులు పంటల సాగుకు 40 రోజులు ముందుగానే పచ్చిరొట్ట పైర్లు వేసుకొని పూత దశలో కలియ దున్నాలని, దీంతో భూ సారం దెబ్బ తినకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా వరి, ఇతర పంటల కోతల అనంతరం కొయ్యలను తగలబెట్టరాదని సూచించారు. ఉద్యాన అధికారి శివతేజ మాట్లాడుతూ.. ఆహార పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్‌పాం తోటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజారెడ్డి, ఉమా, మహేష్, మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, ఏఈఓ యుగంధర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. నిబంధనల మేరకేధాన్యం కొనుగోలు వనపర్తి రూరల్: తాలు, మట్టి లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వాహకులకు సూచించారు. గురువారం మండలంలోని రాజాపేట వరి కొనుగోలు కేంద్రం, కొత్తకోట మండలం అమడబాకుల లక్ష్మీనర్సింహ, పెబ్బేరు మండలం సప్తగిరి, లక్ష్మివారాసి రైస్‌మిల్, శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలోని రైస్‌మిల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మిల్లులో దొడ్డురకం వరి ధాన్యం 5 వేల బస్తాలు దించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చిన లారీలను త్వరగా అన్లోడ్ చేసేలా హమాలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీని అందుబాటులో ఉంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. -
అన్నదాతలపై ఆరి్థక భారం
పంచాయతీ కార్యదర్శుల శిక్షణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యఅచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు. అందించే పరికరాలు ఇవే.. రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్ల తర్వాత.. వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖర్చులు, సమయం ఆదా.. కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమోదం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒక రకంగా మంజూరు మరో రకంగా ఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు. ట్రాక్టర్‌తో కరిగెట దున్నుతున్న ఓ రైతు 2016లో తొలి విడత.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఈ పథకానికి రూ.5 కోట్లు కేటాయించి, రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేవారు. ఏళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యవసాయ యంత్రాలకు చేయూత కరువు మహిళా రైతులకు 50, ఇతరులకు 40 శాతం రాయితీ పరికరాలు ఆర్థిక సంవత్సరం ముగియడంతో లబ్ధిదారుల ఎంపికకు బ్రేక్ 2018 నుంచి నిధులుకేటాయించని వైనం వ్యవసాయ యాంత్రీకరణ పథకంపునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం -
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
వనపర్తి విద్యావిభాగం: పత్రికా స్వేచ్ఛను హరించేలా సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏపీ పోలీసులు అమానుషంగా దాడులు చేయడాన్ని జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. గురువారం సురవరం ప్రతాపరెడ్డి వనపర్తి ప్రెస్‌క్లబ్ (కమిటీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రెస్‌క్లబ్ నాయకులు తప్పుబట్టారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యపై న్యాయవ్యవస్థ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం హేయమైన చర్యగా నేతలు అభివర్ణించారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పే స్వేచ్ఛ పత్రికలకు ఉందని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు ఎదురుకావద్దని ఆకాంక్షించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న దురుద్దేశంతో ఏపీ పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయించడం, వారి వ్యక్తిగత వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ సభ్యులు బోలెమోని రమేష్, రాజు, కొండన్నయాదవ్, శ్రీనాథ్, తరుణ్, శ్రీనివాస్‌గౌడ్, పురుషోత్తం, గోపాలకృష్ణ యాదవ్, అంజి, యూసుఫ్, రాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. -
రెన్యువల్‌కు రాశాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్‌కర్నూల్ రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వాలి.. గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది. – కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల దున్నడానికే రూ.11 వేలు.. ఏటా సాగు ఖర్చు పె రుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో చేద్దా మంటే వాటిని మేపేందుక ు మేత లేదు. ఎక రా సాగుకు రూ.25 వేల పెట్టుబడి అయితే అ ందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది. – పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా -
నైపుణ్యాభివృద్ధి దిశగా..
అమరచింత: యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఒక్కొక్క క్యాంపులో 100 మంది విద్యార్థులు ఉండేలా ప్రణాళిక రూపొందించింది. నిబంధనలతో వీరికి ఆటపాటలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఒక్కొక్క పాఠశాలకు నలుగురి చొప్పున వలంటీర్లను నియమించింది. వీరికి రూ. 3వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లాలో 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఎంపిక కాగా.. ఇప్పటి వరకు 35 పాఠశాలల్లో శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో శిక్షణ శిబిరాలు కొనసాగేలా సంబంధిత అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్ఎంలకు ఉన్నతాధికారులు ఆదేశించడంతో.. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. సర్కార్ బడుల్లో వేసవి శిబిరాలు ● జిల్లాలో 50 ఉన్నత పాఠశాలల ఎంపిక ● ఒక్కో క్యాంపులో 100 మంది విద్యార్థులు ● అల్పాహారం కోసం రూ.15 చొప్పున చెల్లింపు ● శిక్షణకు నలుగురి చొప్పున వలంటీర్ల నియామకం సెలవులతో ఇబ్బందులు.. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో సమ్మర్ క్యాంపుల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది. విద్యార్థుల వివరాలతో వారి వారి ఇళ్లకు పాఠశాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. అత్యధికంగా విద్యార్థులు సెలవుల్లో తమ బంధువుల ఇళ్లకు వెళ్లడంతో చివరికి క్యాంపు నిర్వహణ కోసం కేజీబీవీ విద్యార్థినులను సైతం చేర్పించుకుంటున్నారు. 6నుంచి 9 తరగతులకు సంబంధించి 25 మంది చొప్పున విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఆయా పాఠశాలల్లోని క్యాంపుల్లో కేవలం 30 నుంచి 50 మందితోనే నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థులను క్యాంపులకు రప్పించే యత్నం చేస్తున్నారు. మొత్తానికి క్యాంపు నిర్వహణ ప్రారంభం నుంచి 15 రోజులపాటు యథావిధిగా నిర్వహించి ముగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన దొడ్డురకం ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలంలోని రాజపేట, అంకూర్ గ్రామాల్లో ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సన్ననకం, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరుగా కొంటున్నారని తెలిపారు. సన్నరకాలను కాంటా వేసిన వెంటనే లారీల్లో మిల్లులకు తరలిస్తుండగా.. దొడ్డురకం ధాన్యాన్ని మాత్రం 15 రోజులుగా తరలించడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు మాత్రం లారీలు రావడం లేదని చెబుతూ దాటవేత దోరణి అవలంబిస్తున్నారని వాపోయారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఆయా రహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగిల్‌విండో చైర్మన్లు వెంకట్రావు, రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రూరల్ ఎస్ఐ జలేందర్‌రెడ్డిలు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
● ఈనెల 16న రానున్న మిస్‌వరల్డ్ పోటీదారులు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని విదేశీ పర్యాటకుల బృందం సందర్శించనుంది. దీంతో ఈనెల 2 నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడా చెత్తాచెదారం లేకుండా సుమారు 25 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే 500 చదరపు గజాల విస్తీర్ణంలో లాన్ (కార్పెట్ గ్రాస్) ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాకర వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మరోవైపు మెట్టుగడ్డ (ఎన్‌హెచ్–167) నుంచి మొదలుకొని పిల్లలమర్రి వరకు గల విశాలమైన రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. వీటి మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగిస్తున్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను క్యాంపులకు పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం. వేసవి దృష్ట్యా ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు క్యాంపు నిర్వహణ ఉంటుంది. – భాస్కర్ సింగ్. ఎంఈఓ, అమరచింత నైపుణ్యాల పెంపు.. వేసవి సెలవుల్లో వి ద్యార్థులు ఇతర వ్యాపకాలకు గురికాకుండా పాఠశాల వాతావరణంలో ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో గడిపేందుకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 50 ఉన్నత పాఠశాలల్లో శిబిరాలను కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటి వరకు 35 శిక్షణ శిబిరాలను ప్రారంభించాం.వలంటీర్లను నియమించి శిక్షణకు హాజరవుతున్న వారికి రోజువారీ అల్పాహారం అందిస్తున్నాం. – అబ్దుల్ ఘని, డీఈఓ -
మిల్లర్లు ధాన్యం దించుకోవాల్సిందే..
వనపర్తి రూరల్: ప్రతి రైస్‌మిల్లులో 5వేల బస్తాల దొడ్డురకం వడ్లు కచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాముతో పాటు చిమనగుంటపల్లి, నాగవరం గ్రామాల్లోని రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లుకు దొడ్డురకం వడ్లు వస్తే దింపుకోమని పక్కన పెట్టడానికి వీలు లేదన్నారు. కచ్చితంగా ప్రతి మిల్లులో దించుకోవాలన్నారు. అదే విధంగా వచ్చిన లారీలను త్వరగా అన్లోడ్ చేసే విధంగా హమాలీల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీ పెట్టాలని టాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గోపాల్పేట: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గోపాల్పేట మండలం పొలికెపహాడ్, చాకల్‌పల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని.. కొత్త చట్టం అమలును పరిశీలించారు. రైతులు భూ సమస్యలపై సమర్పించిన అర్జీలను వీలైనంత వరకు స్థానికంగానే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు తమ సమస్యలను ఒక పద్ధతి ప్రకారం ప్రొఫార్మాలో పూరించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సక్సెషన్ దరఖాస్తులు వస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పొలికెపహాడ్లో 44, చాకల్‌పల్లిలో 29 దరఖాస్తులు వచ్చాయని.. వాటిని త్వరగా పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లోకలెక్టర్ ఆదర్శ్ సురభి -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. పటిష్ట చర్యలు నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్లపై రోడ్డుపై తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇలాంటి వాటికి ఆడ్డుకట్టు పడనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 6,01,677 వాహనాలు ఉండగా 2019 జనవరి 1 నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 3,68,574 వాహనాలతో మొత్తం 9,65,761 వాహనాలు ఉన్నాయి. ఐదు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు 4 లక్షలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నిరాధరణ పత్రాల వంటి తదితర సేవలను నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం లేదా వాహనాలు సీజ్ చేయడం చేస్తారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌కు చెల్లించే రుసుము ఇలా.. ద్విచక్రవాహనం 320-360 కార్లు 590-700కమర్షియల్ వాహనాలు 600-800 త్రిచక్రవాహనాలు 350-450 2018 డిసెంబర్ 31వ తేదీకి ముందు వాహనాల వివరాలిలా.. జిల్లా బైక్‌లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబూబ్‌నగర్ 2,70,491 26,069 14,585 9,872 19,493 433 వనపర్తి 37,407 6093 2,415 3,845 6,678 2,424 నాగర్‌కర్నూల్ 41,291 6,893 3,610 4,391 9,770 342 గద్వాల 58,956 4,856 1,648 3,267 6,811 218 నారాయణపేట 40,059 4,953 3,135 2,700 8,823 149 2019 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు కొనుగోలు చేసిన వాహనాలు జిల్లా బైక్‌లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబ్బ్నగర్ 84,061 13,548 5,873 4,310 7,917 163 వనపర్తి 36,767 4,376 1,968 2,114 7,373 01 నాగర్‌కర్నూల్ 47,797 6,225 1,947 3,416 15,093 78 గద్వాల 56,329 4,199 697 2,101 6,803 44 నారాయణపేట 42,405 3,719 2,409 1,423 5,404 44 పాత వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్పాత వాహనాలకు అమర్చుకోవాలి పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం వాహనాలకు ఫీజును నిర్ధారించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు మరో 5 ఏళ్లు గడువు పొడిగించాలంటే వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానికి బార్కోడ్ వస్తోంది. అప్పడు వాటికి హైసెక్యూరిటీ నంబర్ల ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తాం. – చిన్నబాలు, రీజినల్ ట్రాన్స్‌పోర్టు అధికారి, నాగర్‌కర్నూల్ మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఎస్ఐఏఎం.ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి వాహనం నంబర్, ఫోన్‌నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫొటోను తీసి మరోసారి వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సిన బాధత వాహనదారుడిపైనే ఉంటుంది. ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ 2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు నకిలీ నంబర్ ప్లేట్ల కట్టడి.. రహదారి భద్రతే లక్ష్యం -
సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గం
వనపర్తి రూరల్: సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని.. పెట్టుబడిదారి విధానానికి విసిగిపోయిన ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కారల్‌మార్క్స్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. కార్మికులు వందేళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి నిర్ణయించిన నేపథ్యంలో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేయాలని.. రైతు రుణమాఫీ అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలాలు లేని వారికి ప్రభుత్వమే కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కేరళ తరహాలో పౌరసరఫరాలశాఖ ద్వారా రేషన్ కార్డుకు ఉన్న ప్రతి లబ్ధిదారుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, పుట్టా ఆంజనేయులు, లక్ష్మి, జీఎస్ గోపి, పరమేశ్వరాచారి, నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
గోపాల్పేట: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని.. మండలంలో కొనసాగుతున్న సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం మండలంలోని తాడిపర్తి, మున్ననూరులో జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. అధికారులు అందుబాటులో ఉండి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు సదస్సుల్లోనే సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, సక్సేషన్ దరఖాస్తులు వస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు. తాడిపర్తిలో 36, మున్ననూరులో 35.. మొత్తం 71 దరఖాస్తులు వచ్చాయని, వెంటనే పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు జరిగే గ్రామాల్లో ఒకరోజు ముందుగానే చాటింపు వేయించాలన్నారు. కేంద్రాల నుంచి వెనువెంటనే ధాన్యం తరలింపు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చిన వెంటనే తేమశాతం పరిశీలించి కొనుగోలు చేసి గోదాములు, మిల్లులకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం మండలంలోని తాడిపర్తిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తాలు, గడ్డి లేకుండా శుభ్రంగా ఉంటే మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఒకటో నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి వచ్చిన బియ్యం, ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ నివేదికను పరిశీలించి ఎప్పటికప్పుడు రిజిస్టర్లో బియ్యం పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ పాండు తదితరులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు తప్పనిసరి
వనపర్తి రూరల్/మదనాపురం: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో నాణ్యత పరిశీలించి కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి, కడుకుంట్ల కొనుగోలు కేంద్రాలు, మదనాపురంలోని గోదాం, దంతనూరులోని లక్ష్మీనర్సింహ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతుల వద్ద ధాన్యం తీసుకునేటప్పుడు తాలు, గడ్డి లేకుండా చూసి వెంటనే తూకం చేసి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. పాత గన్నీ బ్యాగులను కాకుండా కొత్తవాటిని రైతులకు అందించాలని కోరారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తూకాలు సక్రమంగా ఉండాలన్నారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, నాయకులు శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్ తదితరులు ఉన్నారు. -
పని ప్రదేశాల్లోవసతులు కల్పించండి
ఆత్మకూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పిన్నంచర్లలో మంగళవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించాలని ఐకేపీ సిబ్బందిని డీఆర్డీఓ ఆదేశించారు. పిన్నంచర్లలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరామ్‌రెడ్డి, ఏపీఓ విజయభాస్కర్ పాల్గొన్నారు. కూలీలకు కనీస సౌకర్యాల కల్పన పాన్‌గల్: వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా పనుల వద్ద వసతులు కల్పించాలని ఏపీడీ సయ్యద్ సుల్తాన్ సూచించారు. మంగళవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి, రాయినిపల్లి, మాందాపూర్‌లో కొనసాగుతున్న ఉపాధి పనులు, ఆయా గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన రోజు వారి కూలి అందేలా పనులు కల్పించాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు చేపడుతూ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పెంచాలన్నారు. రైతులు పండ్ల తోటలను పెంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాల వారిగా ఉపాధి పనులు, నర్సరీలు, మొక్కల లక్ష్యం, కూలీల సంఖ్య అంశాలపై ఆరా తీశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఎంపీడీఓ గోవింద్రావు, ఏపీఓ కుర్మయ్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
మామిడి రైతు కుదేలు
అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రనష్టం ●300 టన్నులకు పైగా.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం, మామిడి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్, కొల్లాపూర్ నష్టంపై నివేదికలిచ్చాం.. అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్ కొల్లాపూర్: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. నామమాత్రపు దిగుబడులు ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి. సరైన ధరలు లేక.. మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్ మార్కెట్లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి. నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు వాతావరణం అనుకూలించకపంట దిగుబడిపై ప్రభావం ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
‘భూ భారతి’తో రైతులకు మేలు
గోపాల్పేట: భూ భారతి చట్టం అమలుతో రైతుల భూ సమస్యలు తొలగిపోతాయని.. ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని పైలట్ మండలం గోపాల్‌పేటలో ఉన్న చెన్నూరు, జయన్న తిర్మలాపూర్‌లో రెవెన్యూ సదస్సులు జరగగా.. జయన్న తిర్మలాపూర్‌లో జరిగిన సదస్సులో ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ చేస్తే పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూములు లాక్కుందని ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకంలో తప్పులుంటే సరి చేసుకునేందుకు అవకాశం ఉండేదని.. అధికారులు ఇష్టానుసారంగా పోర్టల్‌ను వినియోగించే వారన్నారు. ధరణితో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. భూ భారతిలో అధికారులు ఎటువంటి తప్పులు చేయకుండా, ఒకవేళ తప్పులు దొర్లినా సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, రైతులు ఫిర్యాదు చేసేందుకు రెండంచెల వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెన్నూరులో 36, జయన్న తిర్మలాపూర్‌లో 25 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సెక్సేషన్–18, మిస్సింగ్ సర్వేనంబర్–2, పెండింగ్ మ్యూటేషన్–1, డిజిటల్ సైన్–1, భూ విస్తీర్ణంలో సవరణలు 2, పేర్ల సవరణ–5, పార్ట్–బి–1, అసైన్డ్ పట్టా–3, తదితరాలు 28 దరఖాస్తులు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలని, సక్సేషన్‌కు సంబంధించి వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుటుంబసభ్యుల ధ్రువపత్రాలకు సంబంధించి మీసేవ సిబ్బందిని వెంట ఉంచుకొని త్వరగా అయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి రాజు, మండల రెవెన్యూ అధికారి పాండు తదితరులు పాల్గొన్నారు. గోపాల్పేట మండలంలో ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు మొదటిరోజు 61 దరఖాస్తులు.. స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి -
స్పందన అంతంతే..
ఈ నెల 3తో ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ● మూడుసార్లు గడువు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో రూ.67.33 కోట్ల ఆదాయం ● అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు రూ.18.08 కోట్లు.. ● అలంపూర్ మున్సిపాలిటీకి రూ.16 లక్షలు మాత్రమే.. ● వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 29,450 దరఖాస్తులు రాగా.. 25,827కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 5,214 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. 2,766 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. పెబ్బేరులో 7,432 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 6,484 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,561 మంది రూ.1.88 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 417 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కొత్తకోటలో 7,740 దరఖాస్తులు రాగా 7,318కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,355 మంది రూ.1.60 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ఆత్మకూరులో 3,827 దరఖాస్తులకు 3,150కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 822 మంది రూ.98 లక్షలు చెల్లించగా..623 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అమరచింతలో 619 దరఖాస్తుల్లో 333కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 164 మంది రూ.56 లక్షలు చెల్లించారు. ఇప్పటి వరకు 121 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు పెద్దగా స్పందన రాలేదు. అనధికార లేఔట్లలోని స్థలాను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. మూడుసార్లు గడువు పెంచినా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 21 పురపాలికల్లో కలిపి కేవలం రూ.67.33కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లించే వారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30 వరకు, మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు ఇలా మూడుసార్లు పెంచింది. పురపాలికల వారీగా ఆదాయం ఇలా.. ● మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో 32,005 దరఖాస్తులు రాగా.. వీటిలో ఎల్ఆర్ఎస్కు అర్హత కలిగిన 22,183కి ఫీజు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఇందులో 7,424 మంది దరఖాస్తుదారులు రూ.18.08 కోట్లు చెల్లించగా..ఇప్పటివరకు 2,910 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. జడ్చర్ల పరిధిలో 17,935 దరఖాస్తులు రాగా.. అర్హత కలిగిన 11,071కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,933 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 847కి మాత్రమే ప్రొసీడింగ్స్ అందాయి. భూత్పూర్లో 6,341 దరఖాస్తుల్లో 4,703కి ఫీజు చెల్లించాల్సి ఉంంది. 1,375 మంది దరఖాస్తుదారులు రూ.2.67 కోట్లు చెల్లించగా.. 651కి ప్రొసీడింగ్స్ అందాయి. దేవరకద్ర పరిధిలో 6,765 దరఖాస్తులకు 6,699కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 1,036 మంది రూ.1.69 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 16,266 దరఖాస్తులు రాగా 10,782 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 2,895 మంది రూ.4.78 కోట్లు చెల్లించగా..1,728 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కల్వకుర్తిలో 11,643 దరఖాస్తులు రాగా 9,491 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,160 మంది రూ.4.85 కోట్లు చెల్లించారు. 1,088 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. కొల్లాపూర్‌లో 4,654 దరఖాస్తులకు 3,718కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 713 మంది రూ.1.23 కోట్లు చెల్లించారు. 264 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అచ్చంపేటలో 12,291 దరఖాస్తులకు 10,765కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,871 మంది రూ.2.72 కోట్లు చెల్లించారు.106 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నారాయణపేట మున్సిపాలిటీలో 7,154 దరఖాస్తులలో 2,036కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,639 మంది రూ.4.19 కోట్లు చెల్లించారు. 772 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మక్తల్‌లో 10,616 దరఖాస్తులకు 9,063కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,288 మంది రూ.2.44 కోట్లు చెల్లించారు.599 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కోస్గి పరిధిలో 4,168 దరఖాస్తులు రాగా 1,987కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 965 మంది రూ.1.94 కోట్లు చెల్లించారు. 135 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మద్దూరులో 1,493 దరఖాస్తులు రాగా 1,232 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 322 మంది రూ.34 లక్షలు చెల్లించారు. 234 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ● గద్వాల పట్టణ పరిధిలో 14,607 దరఖాస్తులు రాగా 4,000కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,844 మంది రూ.2.96 కోట్లు చెల్లించారు. 927 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అయిజలో 10,166 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 5,244కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,155 మంది రూ.1.47 కోట్లు చెల్లించారు. 689 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అలంపూర్‌లో 431 దరఖాస్తులే రాగా 366కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 122 మంది కేవలం రూ.16 లక్షలే చెల్లించారు. 64 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. వడ్డేపల్లిలో 1,967 దరఖాస్తులు రాగా 1,787కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 378 మంది రూ.73 లక్షలు చెల్లించారు.304 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. -
ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు
గోపాల్పేట: ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తోందని.. పాడి రైతులు తమ పశువులకు వేయించి రోగాలబారిన పడకుండా చూసుకోవాలని స్టేట్ మానిటరింగ్ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండలంలోని జయన్న తిర్మలాపూర్‌లో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి టీకాలు ఎలా వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు రిజస్టర్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. 140 తెల్ల, 526 నల్ల పశువులకు టీకాలు వేసినట్లు సిబ్బంది చెప్పారు. వారి వెంట మండల పశువైద్యాధికారి డా. ఆంజనేయులు, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ శ్రీనివాసులు, మండల పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షలు వాయిదా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోరులకు సంబంధించి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలు బుధవారం (మే 6) నుంచి జరగాల్సి ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాలు.. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ చేసి, ఆందోళనకు దిగిన నేపథ్యంలో పీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వయం ఉపాధికి కార్పొరేషన్ల తోడ్పాటు స్టేషన్ మహబూబ్‌నగర్: స్వయం ఉపాధికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రం షాసాబ్‌గుట్ట ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే విధంగా కార్పొరేషన్లు చేయూత అందిస్తాయని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున స్కిల్‌డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహందీ, కంప్యూటర్ కోర్సులతో పాటు అనేక విభాగాల్లో శిక్షణ పొందిన వారికి రుణాలు, వాటిపై సబ్సిడీలు కూడా మంజూరవుతాయని అన్నారు. -
శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
వనపర్తి రూరల్: యంగ్ ఇండియా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి మహానంది కోరారు. సోమవారం పెబ్బేరు మండలం యాపర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో 40 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. చిన్నారులకు స్పోకెన్ ఇంగ్లీష్, గణితంలో బేసిక్స్, ఇతర సబ్జెక్టులతో పాటు చెస్, కార్యమ్స్, టెన్నీస్, గ్రామీణ ఆటల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించామన్నారు. శిబిరంలో 90 మంది విద్యార్థులు ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకర్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్‌రెడ్డి, స్వరాజ్యం, బాబురెడ్డి, ఉపాధ్యాయులు మైనుద్దీన్, ఈశ్వర్, స్వచ్ఛంద సేవకులు అనూష, కవిత, సరిత, శివాని గ్రామస్తులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్‌పై దృష్టి సారించాలి : కలెక్టర్
వనపర్తి: గ్రామాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెడ్కో, విద్యుత్ అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను అమలు చేస్తోందని.. ఐదు వేల కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్న రెవెన్యూ గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజెస్ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని దీర్ఘకాలం ఆదాయం సమకూర్చే సోలార్ ప్యానెల్ల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెడ్కో ఎండీ మనోహర్‌రెడ్డిని ఆదేశించారు. ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఇళ్లు సోలార్ ప్యానెల్‌తో విద్యుత్ ఆదా చేస్తాయో ఆ గ్రామానికి కేంద్రం సౌర విద్యుత్ ఉపకరణాలకుగా రూ.కోటి అందజేస్తుందని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ పొలంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని విద్యుత్‌శాఖకు విక్రయించడంతో ఒక యూనిట్‌కు రూ.3.13 సంపాదించవచ్చని వివరించారు. పీఎం సూర్యఘర్ పథకంలో గృహ సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, కుసుమ్ పథకం కింద బ్యాంకు ద్వారా 75 శాతం రుణం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇందులో 4 శాతం బ్యాంకు వడ్డీని కేంద్రమే భరిస్తుందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు సమన్వయంతో గ్రామాల్లో సౌర విద్యుత్‌పై అవగాహన సదస్సులు నిర్వహించాలి సూచించారు. దరఖాస్తు చేసే విధానంపై మీ–సేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పించాలని రెడ్కో డీఎంని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, విద్యుత్‌శాఖ ఎస్ఈ రాజశేఖర్, డీఎ ల్పీఓ రఘునాథ్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయితేజ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం.. ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరగగా 65 అర్జీలు వచ్చినట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారులు వెల్లడించారు. అర్జీలను పరిష్కరించాలంటూ ఆయా శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. -
కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
వనపర్తి రూరల్: మెప్మా ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో మెప్మా ఆర్పీల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్పీలకు పీఎఫ్, ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు, డ్రెస్‌కోడ్, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటి అమలుకు తీవ్రంగా యత్నిస్తోందని విమర్శించారు. దేశంలోని పరిస్థితిని సమీక్షించిన కేంద్ర కార్మిక సంఘాలు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని.. అన్నిరంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మెప్మా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, కార్యదర్శి లావణ్య, కురుమూర్తి, వేణుగోపాల్, గోపమ్మ, మంజుల, కళావతి, మాలతి తదితరులు పాల్గొన్నారు. -
పైలెట్ మండలంగా గోపాల్పేట ఎంపిక
వనపర్తి: భూ భారతి–2025 రెవెన్యూ సదస్సుల నిర్వహణకుగాను జిల్లాలో గోపాల్‌పేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి మండలంలో జరిగే రెవెన్యూ సదస్సులను మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రెండు రెవెన్యూ బృందాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించి మిగిలిన సమస్యలను మే 13 నుంచి 20వ తేదీలోపు పరిష్కరించేలా సూచనలు చేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలకు భూ సమస్యలకు సంబంధించిన నమూనా దరఖాస్తులు ముందుగానే పంపిణీ చేస్తారని, వాటిని సరిగా పూరించి రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఉష్ణోగ్రతలు పెరిగిన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12లోపే బయటి పనులు పూర్తి చేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళలో బయట తిరగకపోవడం మంచిదని, బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు వెంట తీసుకువెళ్లాలి, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందాలన్నారు. వడదెబ్బ తగలకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని.. చల్లటి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, పండ్ల రసాలు తీసుకోవడం, తేలికై న దుస్తులు ధరించడం ముఖ్యమని తెలిపారు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు -
2 వేల ఏళ్ల నాటి గ్రామం..
నందివడ్డెమాన్‌గా మారిన వర్ధమానపురం ● 400 ఏళ్లు పాలించిన కాకతీయ సామంత రాజులు ● నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు ● గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడు ● రాష్ట్రంలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. నాగర్‌కర్నూల్: కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్‌గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. -
హాకీ గుర్తింపును మరింత పెంచాలి
వనపర్తి టౌన్: హాకీలో జిల్లాకు ఉన్న పేరును మరింత పెంచాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండా విజయ్‌కుమార్ క్రీడాకారులకు సూచించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో హాకీ వేసవి శిక్షణ శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలను ఉపయోగించి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కుమార్, ప్రధానోపాధ్యాయుడు గురురాజ్, మన్యం యాదవ్, వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
పడకేసిన పల్లె పాలన
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువు ●పనిభారం.. నిధులు కరువు... పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీంతో గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు తప్పనిసరిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీటి బోర్ల మరమ్మతులకు పంచాయతీ ఖాతాల్లో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను ప్రత్యేక అధికారులకు విన్నవిస్తున్నా.. నిధులు లేక పరిష్కరించలేక పోతున్నాం. – రాజీక్, పంచాయతీ కార్యదర్శి. మోట్లంపల్లి (ఆత్మకూర్) నిధులు మంజూరైతేనే.. గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరాలి. ఇందుకుగాను పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరగాలి. ప్రభుత్వం త్వరలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 15 ఆర్థిక సంఘం నిధులు మంజూరుగాకపోవడంతో చిన్న పంచాయతీల్లో నిర్వహణ భారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. – సురేష్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి అమరచింత: సర్పంచ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటం.. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులపైనే పనిభారం పెరగడం.. 15 ఆర్థిక సంఘం నిధులు మంజూరుగాక కార్మికులకు ప్రతి నెలా వేతనాలు అందకపోవడం తదితర కారణాలతో గ్రామాల్లో పాలన పడకేసింది. గతేడాది జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియగా.. ప్రభుత్వం ఫిబ్రవరి 1న క్లస్టర్ గ్రామాలు ఎంపికచేసి జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో కనీసం వీధిదీపాలు, బోర్ల మరమ్మతులు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీల్లో విధులు నిర్వర్తించే మల్టీపర్పస్ వర్కర్స్కు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి తలెత్తింది. పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరణ వాహనాలకు డీజిల్, బోర్ల మరమ్మతుకు నిధుల లేమి జిల్లాలో 255 గ్రామపంచాయతీలు -
విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి
వనపర్తి టౌన్: విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు మెచ్చేలా విజయాలు సాధిస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయని అంబాత్రేయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం సమీపంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఆవరణలో వేప, రావి మొక్కలు నాటారు. అలాగే సామాజిక కార్యకర్త పోచ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాలుర, బాలికల, హరిజనవాడ, తెలుగువాడ ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఆశీర్వదించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు సర్వం ధారపోస్తున్నారని.. నైపుణ్యం కలిగిన చదువుకు సమాజంలో విలువ పెరుగుతుందని, విద్యార్థులు అక్షర, లోక జ్ఞానాన్ని తెలుసుకునేందుకు విద్యారంగంలో పురోగమించడమే ఏకై క మార్గమన్నారు. విద్యార్థులు కృషిని నమ్ముకొని దైవచింతన, సరైన ప్రణాళికతో ముందుకుసాగితే ప్రతి అడుగులోనూ విజయం తారసపడుతుందని చెప్పారు. యువతరం సన్మార్గం వైపు పయనించేందుకు పాఠ్య పుస్తకాల్లోనూ అధ్యాత్మిక భావన, సైన్స్ భావజాలాన్ని మేళవింపు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రోజురోజుకు పడిపోతున్న విలువల పునరుద్ధరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. సామాజిక కార్యకర్త పోచ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో అధ్యాత్మికత లోపించడంతోనే వ్యవస్థ భ్రష్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించి మిఠాయి బాక్స్‌లను అందించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, ఉపాధ్యాయులు తిరుపతి, రవికుమార్, రమాదేవి, గురురాజ్ప్రసాద్, నాయకులు దాడి యోగానందరెడ్డి, కంది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర పుస్తక రూపంలో పదిలం
వనపర్తి టౌన్: చరిత్రను పుస్తక రూపంలో భద్రపరిస్తే భవిష్యత్ తరాలు తెలుసుకొనే వెసులుబాటు ఉంటుందని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ అన్నారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జ్ఞానదర్శిని ఎల్లూరు చరిత్ర’ పేరున రూపొందించిన పుస్తకాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు, రచయితలు, చరిత్రకారులు, విద్యావంతులు గతంలోని అంశాలను శోధించి, ధ్రువీకరించుకొని పుస్తక రూపంలోకి తీసుకొస్తారని, ఒక పుస్తకం వెనుక ఎంతో ప్రయత్నం, పర్యవేక్షణ ఉండటంతో వాటిలోని విజ్ఞానం నేటి సమాజానికి అందుతుందని చెప్పారు. ఈ గ్రంఽథ రచనకు నిరంజనయ్య కృషిని ఆయన కొనియాడారు. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఎల్లూరు కొల్లాపూర్ సంస్థానానికి కొంతకాలం పాటు రాజధానిగా ఉందని.. చోళులు, కాకతీయుల కాలానికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు జనజ్వాల, ఓంకార్, బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, రాజారాంప్రకాశ్, కిరణ్‌కుమార్, గంధం నాగరాజు, డి.కృష్ణయ్య, ఆనంద్, దాసరి కృష్ణ, మోజర్ల కృష్ణ, సురేందర్, రంగస్వామి, వహీద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం : బీజేపీ ఖిల్లాఘనపురం: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మండల ఇన్చార్జ్ సీతారాములు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుడు శివ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని అన్ని కార్యవర్గ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేయాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి పార్టీ తరుఫున కృషి చేయాలని, అలాంటప్పుడే ప్రజల్లో పార్టీపై, నాయకులపై మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కేంద్ర పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిబాబుగౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవినాయక్, మండల ప్రధానకార్యదర్శులు దశరథం, గోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.రాజు, గోపి ముదిరాజ్, చక్రవర్తిగౌడ్, హేమంత్ నాయక్, ఎస్.సాయినాథ్, శివ, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం.. అన్నదాతల ఆందోళన
వనపర్తి: జిల్లాకేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం చాలావరకు తడిసిపోయింది. దీంతో శనివారం అన్నదాతలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, ధర తక్కువగా ఇస్తే.. ఒప్పుకునేది లేదంటూ సుమారు గంటన్నర పాటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా వాహనాలు చాలాదూరం వరకు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేష్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అకాల వర్షానికి సుమారు 5 వేల బస్తాల ధాన్యం తడిసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బందులు
పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం చేయకపోవడం, తూకం చేశాక మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తుండటంతో వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని వివరించారు. అలాగే తాలు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని.. ఇది సరికాదన్నారు. జిల్లా అధికారులు కలగజేసుకొని ధాన్యం తూకం త్వరగా పూర్తి చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లు లు, గోదాములకు తరలించేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కారంగాకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకటయ్య, ప్రజాసంఘాల నాయకులు ఆంజనేయులు, శేఖర్, మల్లేష్, భాస్కర్, కృష్ణయ్య, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. -
తాగుతూ.. ఊగుతూ...!
నిబంధనలు పాటించని మద్యం దుకాణాదారులు బార్లకు మించి పర్మిట్ రూములు.. మద్యం దుకాణాల నిర్వాహకులు ఎకై ్సజ్‌శాఖ ఇచ్చే టార్గెట్లను ఆసరాగా చేసుకొని పరిమిత కొలతలతో ఇచ్చే పర్మిట్ రూములను పెద్దగా నిర్మించుకొని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మద్యం విక్రయాల టార్గెట్‌ను చేరుకునేందుకు అక్రమ సిట్టింగ్‌లను సైతం ఎకై ్సజ్‌శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని శ్రీరామా టాకీస్ సమీపంలో ఉన్న బార్ పురాతన ఆలయం సమీపంలో ఉండటం.. ప్రతి సోమ, శనివారం ఆలయానికి వెళ్లే భక్తులు అటుగా రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు పలుమార్లు ఎకై ్సజ్‌శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. ● కొత్తకోటలో కర్నూలు రోడ్ వైపు ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద సాయంత్రం 7.30 దాటితే రోడ్డు పక్కన మూసి ఉన్న దుకాణాల ఎదుట మద్యం తాగేవారు అత్యధికంగా కనిపిస్తారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మున్సిపాలిటీల్లో శివారు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా మద్యం తాగేవారు కనిపించడం సర్వసాధారణమైంది. వనపర్తి: జిల్లాకేంద్రం శివారులోని దాబాలు, హోటళ్లతో పాటు ఇళ్ల నడుమ ఉన్న పలు హోటళ్లు సైతం బార్లను తలపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని కొత్తకోట రహదారిలో ఉన్న ఓ హోటల్లో అర్ధరాత్రి మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంలోని పలు హోటళ్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు మాత్రం జోక్యం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలుమార్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందినా ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో సిట్టింగ్‌ల పర్వం రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో ఉన్న ఓ మద్యం దుకాణం ఎదుట కనిపించిన చిత్రమిది. రోడ్డుపై వాహనాలు, రోడ్డు పక్కన పాదచారులు వెళ్తున్నా.. మందు బాబులు దుకాణం ముందే మద్యం తాగుతూ కనిపించారు. అనుమతికి మించి ఎక్కువ గదుల్లో సెట్టింగ్‌లు ఏర్పాటు చేసుకున్నా.. రోడ్లపై అందరూ చూస్తుండగానే మద్యం తాగుతున్నారు. వారాంతపు సంత రోజు పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం ఏదో ఒక ఘర్షణ చూడాల్సి వస్తోందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. దుకాణాల ఎదుట మద్యం తాగుతున్న మందుబాబులు ఇళ్ల మధ్య హోటళ్ల పేరుతో అనధికార సిట్టింగ్‌లు రోజుకో లొల్లి.. పట్టించుకోని అధికారులు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు -
పోలీసులంతా ఒకే కుటుంబం : ఎస్పీ
వనపర్తి: యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ ఒకే కుటుంబమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం సాయుద దళ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో అన్ని పోలీస్స్టేషన్ల సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి ఆర్మీ డ్రిల్, ఫూట్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు, హోంగార్డుల పరేడ్ నిర్వహించి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సిబ్బంది, అధికారులు సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, శక్తి సామరా్థ్య్లతో పాటు అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని.. మంచి జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్తర్తిస్తూ జిల్లాకు, తెలంగాణ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సిబ్బంది విధులు, చేయకూడని పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో మెదక్ స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీసీఎస్ ఎస్ఐ జయన్న, ఏహెచ్‌టీయూ ఎస్ఐ అంజద్, రిజర్వ్ ఎస్ఐ వినోద్, శిక్షణ ఎస్ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల ప్రక్షాళనకే ‘భూ భారతి’
పాన్‌గల్/చిన్నంబావి: నిజమైన హక్కుదారులకు భూ భారతి చట్టం అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పాన్‌గల్, చిన్నంబావిలోని ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల ప్రక్షాళనకు భూ భారతి చట్టం తీసుకొచ్చిందని, పాత చట్టంలోని లొసగులను సవరిస్తూ కొత్త చట్టం రూపొందించినట్లు చెప్పారు. గతంలో ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని అనేక భూ ఆక్రమణలు జరిగాయని.. వాటన్నింటిని భూ భారతి చట్టం ద్వారా సరిచేసి ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పారు. ధాన్యం కాంటా, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యంత పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సూచించారు. కమిటీ సభ్యులు, అధికారులు నిజాయతీగా వ్యవహరిస్తూ అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలని.. అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించి బలోపేతానికి సహకరించాలని కోరారు. పాన్గల్లో వివిధ గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.21,59,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి అందజేశారు. కొత్త చట్టం గురించి వివరించేందుకే అవగాహన సదస్సులు.. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి ప్రజలకు వివరించేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ధరణిలోని సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అఽధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకొని తప్పును సరిచేసే అవకాశం కొత్త చట్టంలో ఉందన్నారు. పాన్గల్లో జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ గోవింద్‌నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఆర్ఓ సీతారాంనాయక్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఏఓ రాజవర్ధన్‌రెడ్డి, మండల నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్‌యాదవ్, చిన్నంబావిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, డీటీ శ్రీనివాసులు, ఎంపీడీఓ రమణారావు, సింగిల్‌విండో చైర్మన్ బగ్గారి నర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కళ్యాణ్‌రావు, కృష్ణప్రసాద్ యాదవ్, బీచుపల్లి యాదవ్, చిదంబర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాతజంగమాయపల్లి–కనిమెట్ట మధ్య కొత్తగా నిర్మించిన వంతెనను, కనిమెట్టలో రూ.37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో ప్రతి రైతుకు మేలు చేకూరుతుందని.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరం ఉన్నచోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. సన్నాలకు రూ.500 బోనస్ సైతం చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, బోయేజ్, శ్రీనివాస్‌రెడ్డి, మేస్త్రి శ్రీను, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీటీ రోడ్డు ప్రారంభం.. మదనాపురం: మండలంలోని లక్ష్మీపురం గ్రామం నుంచి నెల్విడితండా వరకు వేసిన బీటీ రహదారిని శనివారం ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు తాగు, సాగునీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో నీటిమట్టం తగ్గింది. శనివారం జలాశయంలో సముద్ర మట్టానికి పైన 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్‌చాన్స్‌లర్‌తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్, ర్యాటిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్‌అక్తర్, ఫణిప్రసాద్, సత్యనారాయణగౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.వేరుశనగ క్వింటా రూ.6,169 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6169, కనిష్టం రూ. 2700, సరాసరి రూ. 5969 ధరలు పలికాయి. అలాగే, 60 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5839, కనిష్టం రూ. 5209, సరాసరి రూ. 57 59 ధరలు పలికాయి. 1980 క్వింటాళ్ల వరి (సో న) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 170 1, సరాసరి రూ.1729 ధరలు లభించాయి. -
దొడ్డురకం మాకొద్దు..!?
●సేకరణకు విముఖత చూపుతున్న మిల్లర్లు ● సన్నాల కోసం అధికారుల వద్ద పైరవీలు ● ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యంపై రైతుల ఆందోళనలు ● జిల్లాలో 10 వేల మె.ట. పైగానే ధాన్యం కేంద్రాల్లోనే.. హమాలీల కొరతతోనే ఇబ్బందులు.. హమాలీల కొరతతో మిల్లులు, గోదాముల వద్ద లారీల్లోని వరి ధాన్యం త్వరగా అన్లోడ్ కావడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని కేంద్రాల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్, వనపర్తి వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా కొన్ని మిల్లులకే ధాన్యం కేటాయించే అవకాశం ఉండటం.. వారు కూడా సన్నరకం ధాన్యం కేటాయించాలంటూ అధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. ఇటీవల గోపాల్పేట మండలం బుద్దారం, వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో తాలు, తేమ శాతం, లారీల కొరత తదితర కారణాలు చూపిస్తూ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. హామాలీల కొరతతో ధాన్యం తరలించిన లారీలు మిల్లులు, గోదాంల వద్ద నిలిచిపోవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నెల 29న 7,493.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండగా.. శనివారం వరకు అది 10,139 మె.ట.లకు చేరినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు సైతం.. యాసంగి సీజన్లో వరి ధాన్యం ఎక్కువగా బాయిల్డ్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకు కారణం బాయిల్డ్ మిల్లులో ధాన్యం మర ఆడిస్తే నూక శాతం తక్కువగా వస్తుంది. కానీ.. మార్కెట్లో దొడ్డు రకాలకు డిమాండ్ లేదనే కారణంతో ఆ మిల్లర్లు సైతం తమకు కూడా సన్న రకాలే కేటాయించాలంటూ అధికారులపై వత్తిడి తీసుకొస్తుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి మిల్లుకు 60:40 శాతంలో సన్నాలు, దొడ్డు రకం ధాన్యం కేటాయింపులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఎదుట సరేనంటూ తల ఊపిన మిల్లర్లు.. అధికారుల వద్ద వారికున్న చనువు, ఇతర బహుమతులను ఎరజూపి సన్నరకం ధాన్యం కేటాయింపునకు వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అధికసంఖ్యలో రైస్‌మిల్లులు ఉన్నా.. 85 శాతం మిల్లర్లు సీఎంఆర్ బకాయిలు ఇవ్వకపోవడం, మిల్లుల్లో కనీస ధాన్యపు నిల్వలు లేకపోవడంతో కలెక్టర్ వాటిని బ్లాక్ లిస్టులో ఉంచి ధాన్యం కేటాయింపులు నిలిపివేశారు. దీంతో మిగిలిన మిల్లులకు మాత్రమే అధికారులు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా యాసంగి వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం 3.40 లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 71 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా అందులో 50 శాతం దొడ్డురకం ఉంది. ఈ ధాన్యాన్ని మిల్లల్లు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చకపోవడంతో కేవలం నాలుగు వేల మె.ట. మాత్రమే మిల్లర్లకు కేటాయించి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములలో నిల్వ చేశారు. తాజాగా వచ్చిన నిబంధనల మేరకు ప్రతి మిల్లరు దొడ్డురకాలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. 3.40 లక్షల మె.ట. లక్ష్యం.. -
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
వనపర్తి: అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసింది. శనివారం ఉదయం ఆయన మార్కెట్‌యార్డ్‌ను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మార్కెట్, పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని.. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని మార్కెటింగ్‌శాఖ అధికారికి సూచించారు. -
బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి
వనపర్తి: జిల్లాలో బాధితులకు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అండగా ఉండాలని ఎస్పీ రావుల గిరధర్ అన్నారు. జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నేరస్థుడికి కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధించడంలోనే కాక వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్ష పడడంలో కృషిచేసిన పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.శ్రీనివాసచారి, కోర్టు లైజనింగ్ అధికారి హెడ్ కానిస్టేబుల్ సత్యంను శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిజాన్ని గెలిపించే బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులపై ఉందన్నారు. పోలీసు న్యాయ వ్యవస్థలో బాగా పనిచేసిన అధికారులను తప్పక గుర్తిస్తామన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా పోలీసులు ఇంకా బాగా పనిచేసి జిల్లా న్యాయస్థానానికి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి వనపర్తి రూరల్: ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. శుక్రవారం శ్రీరంగాపురం మండలంలోని కంభాళాపురంలో ‘గావ్ చలో– బస్తీ చలో’ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు పురుషోత్తంరెడ్డి, మండల ఇన్చార్జ్ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి ప్రతి ఇంటికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల దగ్గరకి వెళ్లి కూలీలతో మాట్లాడారు. సరైన సమయంలో కూలీ డబ్బులు అందడం లేదని వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లపై గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని, కానీ, కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా వారికి నచ్చిన మంజూరు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.2.61 లక్షలు ఇస్తుందని, అయితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఒక్క కార్యకర్తను కూడా చేర్చుకోలేదని మండిపడ్డారు. అనంతరం వివిద పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీజేపీలో చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు రాములు, జానీ, రాజేష్, శివ, నరేందర్‌రెడ్డి, కార్తీక్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి వనపర్తి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానానికి కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించడంతో శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోట్ల రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి దేవుజా నాయక్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు.. అడియాసలేనా?!
●నిబంధనల మేరకే.. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక చేపడుతున్నాం. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇచ్చిన విధంగానే విచారణ జరిపి నివేదిక తయారు చేసుకున్నాం. వార్డుకు 10 చొప్పున పట్టణానికి 100 ఇళ్లు మాత్రమే వచ్చాయి. కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపిక విధానం జరుగుతుంది. – రవిబాబు, మున్సిపల్ కమిషనర్, అమరచింత అమరచింత: ప్రజా పాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు ప్రజాపాలన సదస్సులలో తమకు ఇళ్లు కావాలంటూ వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే పాత మట్టి ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించుకుందామని ఆశపడిన లబ్ధిదారుల ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పట్టణాల్లో వార్డుల వారిగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారానే లబ్ధిదారులను గుర్తించే బాధ్యత అప్పగించడంతో కమిటీలో సభ్యులుగా ఉన్న అధికార పార్టీ నాయకులదే పైచేయి అన్నవిధంగా తయారైంది. పట్టణానికి సుమారు 500 మేర ఇళ్లు మంజూరవుతాయి అనుకుంటే కేవలం పట్టణానికి 100 నుంచి 150 మాత్రమే కేటాయించడంతో ఎంపిక ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో వార్డుల వారిగా ఎంపిక ఇందిరమ్మ కమిటీలకే వదిలేయడం, వారిచ్చిన జాబితానే అధికారులు పరిశీలించే కార్యక్రమం చేపట్టడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లోపాయికారిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కమిటీలో ఉన్న అధికార పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారి పేర్లను రాసుకుని అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం జనం బేజారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఇలా.. వేలల్లో దరఖాస్తులు.. పదుల్లో కేటాయింపు ఖాళీ స్థలం ఉంటేనే ఇల్లు మంజూరుకు సిఫార్సు నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన ఇందిరమ్మ కమిటీలదే తుది నిర్ణయమంటున్న అధికారులు -
మామిడిమాడలో ‘డబుల్’ ఇళ్ల పరిశీలన
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం పీఆర్డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏఈ రమేష్‌నాయుడు, తహసీల్దార్ సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ పరిశీలించారు. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసులు చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణానికి ఫిల్టర్ ఇసుక వాడుతున్నారని కొందరు గ్రామస్తులు వెల్లడించిన విషయం శుక్రవారం పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ ఫిల్టర్ ఇసుక మాత్రమే ఉండటంతో దీనినే ఇంటి నిర్మాణానికి ఉపయోగించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా డీఈ, తహసీల్దార్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి పరిశీలించామన్నారు. అయితే ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన వారు అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడామని, శనివారం మళ్లీ వచ్చి బాధితులతో వివరాలు తెలుసుకుంటామన్నారు. అలాగే ఇళ్ల ముందు ఉన్న ఫిల్టర్ ఇసుకను సీజ్ చేసి.. గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్‌కు అప్పగించామన్నారు. అయితే ఇన్నాళ్లు ఏఈ కనీసం ఇక్కడికి వచ్చి పరిశీలించకుండానే.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిరుపేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు కోరారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారానికి కృషి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని గోపాల్‌పేటను పైలెట్ మండలంగా గుర్తించామని, ఇక్కడి 9 గ్రామ పంచాయతీల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ద్వారా నిర్ణీత నమూనాలో దరఖాస్తులు గ్రామంలో ముందుగానే పంచుతామని, వాటిని సరిగా పూరించేందుకు ఇద్దరు ఉద్యోగులను సైతం నియమిస్తామని చెప్పారు. గ్రామానికి సంబంధించిన అన్ని భూ రికార్డులు, మ్యాప్‌లు వెంట తీసుకువెళ్లాలని, అప్పటికప్పుడు పరిష్కరించదగినవి అక్కడే పూర్తిచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ● మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల స్క్రూట్నీ అనంతరం జాబితా విడుదల చేయాలన్నారు. జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరు కాపీ అందిస్తామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రెండో విడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేకాధికారులు స్క్రూట్నీ చేసిన జాబితాను కలెక్టర్ లాగిన్‌కు పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన లే అవుట్లను దస్తావేజులు, గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ ద్వారా పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న వాటిని ఆమోదించాలని కలెక్టర్ చెప్పారు. ఇరిగేషన్ కెనాల్, ముంపు, నాలా సమస్యలు లేకుండా నిబంధనల ప్రకారం రోడ్లు, ఖాళీ స్థలం, పార్కింగ్ ఉన్న లే అవుట్లను మాత్రమే కమిటీ ద్వారా ఆమోదించడం జరుగుతుందన్నారు. రోడ్లు, 10 శాతం ఖాళీ స్థలం ప్రభుత్వం పేరిట రిజిష్టర్ చేయాలని, అలాగే రోడ్లు, డ్రెయిన్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. కాగా.. శుక్రవారం కమిటీ ముందు మొత్తం 6 లే అవుట్లు పరిశీలనకు రాగా ఇందులో నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉన్న నాలుగింటిని ఆమోదించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ పీడీ పర్వతాలు, డీఈ విటోబ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలోని 12 ప్రభుత్వ కళాశాలలో 1 నుంచి 3 సబ్జెక్ట్‌ల వరకు ఫెయిలైన విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 488 మంది, ద్వితీయ సంవత్సరంలో 237 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ కోరారు. -
త్వరలోనే వనపర్తికి ఈఎస్ఐ ఆస్పత్రి
వనపర్తి టౌన్: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పుర కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాది మందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి బెనిఫిట్‌ను అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు విజయ చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, లైట్, హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా.. అచేతనంగా!
గద్వాల: గద్వాల చేనేతకు దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు ఉన్నాయి.. అంతటి ప్రాశ్యస్తం ఉన్న చేనేతను గడచిన దశాబ్దంన్నర కాలంగా పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ గద్వాల చేనేత అంతరించిపోయేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. 2008లో చేనేత పార్కును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరీ చేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వ పెద్దలు దానిని గాలికొదిలేయడంతో 17ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా గద్వాలకు చేనేత పార్కు పరిస్థితి మారింది. 2009లో జీఐ గుర్తింపు సైతం సాధించుకున్న గద్వాల చేనేత కాలక్రమంలో మసకబారే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గద్వాల చీరల పేరిట బెంగుళూరు, పుణె వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున పవర్‌లూం యంత్రాలతో తయారు చేసిన నకిలీ గద్వాల చీరలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ఒరిజినల్ గద్వాల చేనేత చీరలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. చేనేతకు ఊతమిచ్చేందుకు.. గద్వాల చేనేతకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకున్న 2008లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గద్వాలకు చేనేత పార్కును మంజూరీ చేశారు. అంతేకాకుండా పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలం, నిధులు సైతం కేటాయించారు. పూడూరులోని సర్వే నంబర్ 368లో 50 ఎకరాల స్థలం, ఈ స్థలం అభివృద్ధి కోసం రూ.50లక్షల నిధులను మంజూరీ చేశారు. ఆ తర్వాత కాలంలో పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు విడుదల చేసిన రూ.50 లక్షల నిధులలో రూ.11లక్షలు ఖర్చు పెట్టినట్లు అధికారులు కాకిలెక్కలు చూపెడుతున్నారు. ఇందులో పార్కు స్థలం చుట్టూ హద్దులు పెడుతూ దిమ్మెలు కట్టినట్లు, స్థలరక్షణకు ఓ సెక్యూరిటీ గార్డును నియమించినట్లు ఇందుకోసం రూ.8.50లక్షలు ఖర్చు అయినట్లు చెబుతుండగా, ఫొటోగ్రఫీ సర్వే చేసేందుకు రూ.2.50లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు కాగితాలపై కాకిలెక్కలు చూపెట్టి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్వాల మండలం పూడూరు శివారులో చేనేత పార్కు స్థలం చేనేత పార్కు ఏర్పాటుపై ముందడుగు పడని వైనం నిధులున్నా పట్టించుకోని అధికారులు రూ.11లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల కాకిలెక్కలు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్న పార్కుకు కేటాయించిన స్థలం -
దొడ్డు వడ్లను విధిగా తీసుకోవాలి
ఎప్పటికప్పుడు ధాన్యం తరలించాలి గోపాల్పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని బుద్దారం, పొలికెపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేని సమయంలో స్థానికంగా ఉండే ట్రాక్టర్లను వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఆర్ఐ యాదయ్య తదితరులున్నారు. వనపర్తి: సన్నబియ్యంతోపాటు ప్రతి మిల్లరు 5 వేల బస్తాల దొడ్డు వడ్లు విధిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిల్లర్లు, మిల్లు అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్లో సన్నవడ్లతోపాటు కొంతమంది రైతులు దొడ్డు వడ్లు సైతం పండించారని, కాబట్టి సన్న వడ్లతో పాటు ప్రతి మిల్లు 5 వేల బస్తాల దొడ్డు రకం వడ్లు సేకరించాలని, ఎవరైనా నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాయిల్డ్ రైస్ మిల్లులకు 60 శాతం దొడ్డు రకం, 40 శాతం సన్న రకం వడ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత సీజన్ సంబంధించి సీఎంఆర్ రైస్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, నిర్వహించరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, రాజకీయ నాయకుల, కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా పోలీసులకు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని సూచించారు. -
డబ్బులిస్తేనే.. డబుల్ బెడ్రూం ఇళ్లు
లబ్ధిదారులకు ఓ పార్టీ నాయకుడి బెదిరింపు ● ఇప్పటికే ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు ● మళ్లీ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి ● ఇళ్ల నిర్మాణంలోనూ ఫిల్టర్ ఇసుక వాడుతున్నట్లు ఆరోపణ ● అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన బెదిరిస్తున్నాడు.. మీకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది మంచిగ కట్టిస్తామం అని మా ఊరి నాయకులు కొందరు వెంకటేశ్వరావు ఇంటికి పిలిచి రూ.లక్ష తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రూ.1.16 లక్షలు ఇవ్వమంటున్నారు. ఇవ్వకుంటే ఇల్లు ఇవ్వమని చెబుతున్నారు. ఎందుకు ఇవ్వాలని అడిగితే నీ ఇష్టం.. ఇస్తేనే ఇల్లు.. లేకుంటే లేదు అని బెదిరిస్తున్నారు. – గంగని చిన్న నాగయ్య, మామిడిమాడ చర్యలు తీసుకుంటాం.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం డబ్బులు ఎవరికి, ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి సంబంధిత అధికారులకు అప్పగించడం వరకు నా బాధ్యత. లబ్ధిదారుల ఎంపికతో నాకు సంబంధం లేదు. డబ్బులు తీసుకోవాలని ఎవరికీ చెప్పలేదు. ఫిల్టర్ ఇసుక వాడుతున్నట్లు ఆరోపించిన దానిపై శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – రమేష్‌నాయుడు, పీఆర్ఏఈ ఖిల్లాఘనపురం: గత ప్రభుత్వంలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి డబ్బులిస్తేనే ఇల్లు ఇస్తామని.. లేకుంటే లేదని.. ఓ నాయకుడు తమను బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కొంతమంది లబ్ధిదారులను ఆరోపించారు. మండలంలోని మామిడిమాడ గ్రామానికి గత ప్రభుత్వ హయాంలో 40 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నం.40, 41లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించగా.. నిర్మాణానికి సోళీపురం గ్రామానికి చెందిన బాలీశ్వర్‌రెడ్డి టెండర్ వేశారు. అప్పట్లో 24 ఇళ్ల నిర్మాణాలు చెత్తు వరకు నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన నిర్మాణాలను ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేలా తీర్మానించారు. అయితే మామిడిమాడలో నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఒక్కొక్కరి నుంచి గతంలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కాకుండా గ్రామానికి చెందిన ఓ నాయకుడు వసూలు చేశాడు. అది చాలదన్నట్లు ఇప్పుడు మళ్లీ మొత్తంగా ఒక్కో ఇంటికి రూ.2.16 లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని గ్రామానికి చెందిన కొందరు దళితులు ఆరోపించారు. తాము ఇవ్వలేమని ఇల్లు లేకున్నా సరే గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నాకు ఎప్పుడు ఇచ్చినవు అంటూ దబాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అడిగినన్ని డబ్బులు ఇచ్చిన వారి ఇళ్లే నిర్మిస్తున్నారని, మిగతా వారికి ఆపేశారని గురువారం స్థానిక విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఫిల్టర్ ఇసుకతో నిర్మాణాలు.. గ్రామంలో డబ్బులు ఇచ్చిన వారి ఇళ్ల నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుక వాడుతున్నారని, దీనిని గ్రామ శివారులోని నేరెడు చెరువులో తయారు చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇళ్ల ముందు పోసిన ఫిల్టర్ ఇసుకను చూపుతు దీంతో ఇళ్లు కడితే ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సదరు నాయకుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ● ఈ విషయమై సదరు గ్రామ నాయకుడు వెంకటేశ్వర్రావు స్పందిస్తూ డబ్బులు ఇచ్చిన దాంతో నాకు సంబంధం లేదని, కాంట్రాక్టర్‌కు ఇళ్లు మంచిగా కట్టాలని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. రూ.1.20 లక్షలు ఇచ్చా.. మాకు గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఇల్లు మంజూరైందని చెప్పారు. గవర్నమెంట్ వాల్లు ఇచ్చే డబ్బులతోపాటు మీరు కూడా ఇవ్వాలని చెబితే ఇప్పటికే రూ.1.20 లక్షలు మా గ్రామంలోని వెంకట్రావ్‌కు ఇచ్చినం. ఇప్పుడు మరో రూ.1.16 లక్షలు ఇస్తేనే ఇల్లు ఉంటది.. లేకుంటే లేదంటున్నారు. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. – గంగని చిన్ననాగమ్మ, మామిడిమాడ ఇల్లు లేదంటున్నాడు.. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని చెప్పి మా ఊరికి చెందిన నాయకుడు వెంకటేశ్వర్రావు డ బ్బులు అడిగితే రూ.1.50 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు మళ్లీ రూ.1.20 లక్షలు అడుగుతున్నాడు. లేవంటే ఇల్లు లేదంటున్నాడు. ఆ ఇంటిని కూడా ఫిల్టర్ ఇసుకతోనే కడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. – ప్రేమ్‌కుమార్, మామిడిమాడ -
జూన్ రెండు నాటికి భూ భారతి అమలు
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నాటికి భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణి చట్టంలో సమస్యలను కోర్టులో తేల్చుకోవాల్సి వచ్చేదని.. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో అధికారులే గ్రామాలకు వెళ్లి రైతులను సమస్యలు అడిగి పరిష్కరించేలా రూపొందించామన్నారు. ఆగష్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అన్ని భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పని చేస్తుందని హామీ ఇచ్చారు. అమలులో చోటుచేసుకున్న చిన్నపాటి పొరపాట్లను సరి చేసుకునేందుకు అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ, వెసులుబాటు కల్పించామని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను త్వరలో పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, షాట్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులు పరిష్కరించేందుకు సులువైన మార్గం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో లభించిందన్నారు. భూ భారతి 2025 చట్టం రూపకల్పనలో మంత్రి పొంగులేటి పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం.. బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో కలిసి జిల్లాలో రూ.193 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.8.50 కోట్లతో నిర్మించిన పీజీ విద్యార్థుల వసతిగృహం, రూ.4 కోట్లతో నిర్మించిన ప్రిన్సిపాల్, సిబ్బంది నివాస భవనాలను ప్రారంభించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అక్కడే రేవల్లి, శ్రీరంగాపూర్, ఏదుల తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎంపీ నిధులు రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహ భవనానికి శంకుస్థాపన చేశారు. కేఆర్డీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో రూ.69 లక్షలతో పునర్నిర్మించిన కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. రూ. 55 లక్షలతో డా. బీఆర్ అంబేడ్కర్ (నల్ల చెరువు) చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా మైనార్టీ మహిళలకు 200 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి , శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
‘పది’లో పెరిగిన ఉత్తీర్ణత
రాష్ట్రస్థాయిలో పడిపోయిన జిల్లా స్థానం వనపర్తిటౌన్/విద్యావిభాగం: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడగా.. జిల్లాకు రాష్ట్రస్థాయిలో 29వ స్థానం దక్కింది. ఉత్తీర్ణత మాత్రం గతేడాది కంటే 2.3 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 27వ స్థానం.. ఉత్తీర్ణత శాతం 86.9 శాతం ఉండగా.. ఈసారి 29వ స్థానానికి చేరడం నిరాశే మిగిల్చింది. కాగా ఉత్తీర్ణత శాతం మాత్రం 89.21కు చేరడం కొంత ఊరట కలిగించే విషయం. జిల్లావ్యాప్తంగా 6,842 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 6,104 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 738 మంది ఫెయిలయ్యారు. 3,415 మంది బాలురు పరీక్షలు రాయగా.. 2,982 మంది ఉత్తీర్ణత సాధించగా 87.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 3,427 మంది బాలికలకుగాను 3,122 మంది ఉత్తీర్ణులు కాగా.. 90.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా పది ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 30 పాఠశాలల్లో 100 శాతం.. జిల్లాలోని చిన్నంబావి. ఖిల్లాఘనపురం, రేవల్లి, శ్రీరంగాపూర్, వీపనగండ్ల కేజీబీవీలతో పాటు 25 జెడ్పీ ఉన్నత పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పదోతరగతి ఫలితాల్లో 2.3 శాతం పెరుగుదల గతేడాది ఉత్తీర్ణత శాతం 86.9.. ర్యాంకు 27 ఈ ఏడాది 89.2 శాతం ఉత్తీర్ణత.. 29వ ర్యాంకు బాలికలదే పైచేయి -
రిజర్వాయర్‌కు గ్రీన్‌సిగ్నల్.. అంతలోనే..
రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు. ● ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్‌కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్‌కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్‌టాపిక్‌గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
వనపర్తి: మహాత్మాగాంధీ అహింసావాదాన్ని, అంబేడ్కర్ ఆశయ సాధన, రాజ్యాంగ పీఠికను పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని భావించి కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా జై భీమ్ పదాన్ని అవమానపరుస్తూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడాలని భావించి కాంగ్రెస్‌పార్టీ అది నాయకత్వం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. సామాజిక మాధ్యమం వేదికగా కాంగ్రెస్‌పార్టీపై విష ప్రచారం చేసే వారికి బుద్ధి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరవేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఒకేరోజు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టామని.. మరికొద్ది రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు తీసుకురాబోతున్నామని చెప్పారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, జాన్, మహ్మద్ నసీర్, సంజీవ్, గౌరీ సతీష్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్, పీసీసీ సభ్యుడు శంకర్‌ప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పాం కష్టాలు తీరేనా!
నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో పంట విక్రయానికి వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.● 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది.పంట కోతలు ప్రారంభం..ఉమ్మడి జిల్లాలో పంట కోతలు ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లాలో 130 టన్నులు, వనపర్తిలో 600, గద్వాల జిల్లాలో 300, మహబూబ్‌నగర్ జిల్లాలో 260 టన్నుల దిగుబడి రాగా.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. ఈ ఏడాది ఆయిల్‌పాం ధర పెరిగింది. గతేడాది టన్ను రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ. 21 వేల వరకు ధర పలుకుతోంది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతులు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం..పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. కాగా.. ఇటీవల నారాయణపేట జిల్లాలో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. -
ధాన్యం కేటాయింపుపై టాస్క్‌ఫోర్స్ విచారణ
వనపర్తి: నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న రైస్‌మిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించారంటూ ఈ నెల 24న ‘సాక్షి’ దినపత్రికలో ‘అధికారుల లీలలు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పందించి సోమ, మంగళవారం జిల్లాకేంద్రంలోని డీఎస్ఓ కార్యాలయం, పెబ్బేరులో పర్యటించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పెబ్బేరు మండలం తోమాలపల్లి శివారులో ఉన్న ఓ బాయిల్ట్ మిల్కు ధాన్యం కేటాయింపు, కేటాయించిన ధాన్యాన్ని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి శివారులో ఉన్న ఓ గోదాంలో నిల్వ చేయడంపై సమగ్ర విచారణ చేపట్టారు. డీఎస్ఓ బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని సిఫారస్ చేసిన మిల్లర్‌కు డీఎం పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ ఏ అధికారంతో ధాన్యం కేటాయించేందుకు దస్త్రం సిద్ధం చేస్తారనే కోణంలో విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో అధికారి, మిల్లు యజమాని కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ అఽధికారుల విచారణలో తేలినట్లు చర్చ జరుగుతోంది. -
నిబద్ధతతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు
వనపర్తిటౌన్: నిబద్ధత, అంకిత భావంతో పని చేసే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డిపో ఆవరణలో మహబూబ్‌నగర్ రీజియన్ త్రైమాసిక ప్రగతి చక్రం అవార్డు (ఉత్తమ ఉద్యోగుల అభినందన) సభ నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రగతి చక్రం అవార్డులు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ చాటిన సిబ్బందిని సన్మానించడంతో మరింత ఉత్సాహంతో పని చేస్తారని, తోటి సిబ్బంది కూడా తాము కూడా గుర్తింపు పొందాలని కష్టపడి పని చేస్తారని, దీంతో సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు భవానీ ప్రసాద్, లక్ష్మీధర్మ, వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్, వివిధ డిపోల మేనేజర్లు, సూపర్వైజర్లు, ట్రాఫిక్, మెకానికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, వనపర్తి ఆధ్వర్యంలో ఎస్సీ యువతకు మూడు నెలల పాటు ఉచిత వృత్తి శిక్షణకు ఎస్సీ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ నిర్మాణ సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు మల్లికార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌కు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, ప్లంబింగ్, ఫాల్సీలింగ్కు 45 ఏళ్లలోపు వయసు ఉండి 5వ తరగతి చదివినవారు, టైలరింగ్ కొరకు 45 ఏళ్లలోపు వయసు ఉండి 5వ తరగతి చదివిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే నెల 14 వరకు దరఖాస్తులను జిల్లాకేంద్రంలోని పాత మున్సిపాలిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమీ నిర్మాణ సంస్థ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్ 99853 75692 సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత వనపర్తిటౌన్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ నియంత్రణకు పాటుపడాలని ఆర్డీఎస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని చింతల హనుమాన్ ఆలయం, రావూస్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న మసీదులో బాల్య వివాహాల నిర్మూలన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి.. అర్చకులు, పాస్టర్లు, ముల్లాలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో యాక్సిస్ టు జస్టిస్ వనపర్తి జిల్లా కో–ఆర్డినేటర్ ఎడ్విన్ థామస్, గద్వాల జిల్లా కో–ఆర్డినేటర్ కొమ్మ చంద్రశేఖర్, మహబూబ్‌నగర్ జిల్లా కో–ఆర్డినేటర్ విశ్వకాంత్, ఆర్డీఎస్ సీనియర్ సిబ్బంది శ్రీలక్ష్మి, హరికృష్ణ, కన్నన్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘చిన్నోనిపల్లి’ లింక్‌కు నో..
ఈ వివాదం నడుస్తున్న క్రమంలో ఆర్డీఎస్ కెనాల్‌కు చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు లింక్ చేసే ప్రతిపాదనలను ఎంపీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణానీటిపై ఆధారపడి గట్టు మండలంలో చిన్నోనిపల్లె రిజర్వాయర్ తెరపైకి వచ్చింది. తుంగభద్ర నీటి ఆధారంగా వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడే కాకుండా వర్షపు నీటితో కూడా ఆధారపడి నిర్మించే ఈ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకుంటే తమకు ప్రయోజనం ఉంటుందని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో నీరు లేని సమయంలోనూ ఆర్డీఎస్ కెనాల్ ద్వారా వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్,రాజోళి మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందే అవకాశం ఉంటుందని.. చిన్నోనిపల్లి ద్వారా ఇది సాధ్యం కాదని.. తాము ఒప్పుకునేది లేదని చెబుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్, రిజర్వాయర్ రద్దు మంచిది కాదు.. -
నేడు మంత్రి పొంగులేటి రాక
వనపర్తి: రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్నారని.. విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, మంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన అనంతరం తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్మించిన పీజీ విద్యార్థుల వసతి భవనం, అధ్యాపకుల భవనం, ఎంపీడీఓ కార్యాలయ సముదాయ ప్రాంగణంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడే రేవల్లి, ఏదుల, శ్రీరంగాపూర్ తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఆధునికీకరించిన బీసీ బాలుర కళాశాల వసతిగృహం, డా. బీఆర్ అంబేడ్కర్ చెరువు సుందరీకరణను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే భూ భారతి అవగాహన సదస్సు, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీని చేపడుతారని వెల్లడించారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రోడ్లు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, హౌసింగ్ పీడీ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
మదనాపురం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం మండలంలోని అజ్జకొలులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించాలన్నారు. తాలు, మట్టి తొలగింపు విధానాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. ధాన్యం రవాణాలో ఆలస్యం చేయవద్దని.. అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారన్నారు. అనంతరం మండల కేంద్రంలో ధాన్యం నిల్వకు ఏర్పాటు చేసిన మార్కెట్ గోదామును పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పాపయ్య గారి కృష్ణారెడ్డి, సాయిబాబా, ఏపీఎం తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి
వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్‌మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, కో–ఆపరేటివ్, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ధాన్యం తరలింపుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం ఎంత.. మిల్లులు, గోదాములకు తరలించింది ఎంత.. ఇంకా కేంద్రాల్లోనే తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం ఎంత అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని, అలసత్వం ప్రదర్శిస్తే అనుమతి రద్దుచేసి ఇతరులకు ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. గోపాల్పేట, పెద్దమందడి, పొల్కెపాడు కేంద్రాల్లో ధాన్యం తరలింపునకు సిద్ధంగా ఉందని.. వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మిల్లు, గోదాంకు సన్న, దొడ్డురకం ధాన్యం 60:40 నిష్పత్తిలో పంపించాలని.. ప్రతి కేంద్రంలో రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజావాణికి 80 వినతులు.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 80 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ రూపొందించిన యాంటీ డ్రగ్స్ అవగాహన వాల్‌పోస్టర్‌ను వైద్యసిబ్బందితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గోపాల్పేట పీఏసీఎస్ పేరు మార్పు
గోపాల్పేట: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఇక నుంచి రైతు ఉత్పత్తి కేంద్రంగా మారనుందని జిల్లా సహకార సంఘం ఆడిట్ అధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో 929 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. ఇప్పటి వరకు 310 సంఘాలను రైతు ఉత్పత్తి కేంద్రాలుగా మార్చామని, జిల్లాలో 15 ఉండగా ఆరింటి పేర్లు మార్చామని.. త్వరలో మిగతా వాటి పేర్లు మారుస్తామని చెప్పారు. రైతులకు సాంకేతికతను పరిచయం చేస్తూ మద్దతు ధరలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. క్లస్టర్ల వారీగా నిర్వహణ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగించిందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజస్ట్రార్ శ్రీనివాసులు, సీనియర్ ఇన్స్పెక్టర్లు మహబూబ్అలీ, బిక్యానాయక్, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజునాయక్, గోపాల్పేట సహకార సంఘం సీఈఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రూ.18.04 లక్షలు పలికిన తైబజార్ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని తైబజార్, వారాంతపు సంత, జంతు వధశాలకు సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను సోమవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. తైబజార్‌ను రూ.18.04 లక్షలకు డి.శ్యామ్, వారాంతపు సంతను రూ.1.82 లక్షలకు ఆర్.తిరుపతయ్య, జంతు వధశాల (స్లాటర్ హౌజ్)ను రూ.1.21 లక్షలకు గొర్ల జగన్నాథం దక్కించుకున్నట్లు పుర కమిషనర్ వెంకటేశ్వర్లు వివరించారు. వేలంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్‌లో చైర్మన్ సత్తు భూపాల్‌రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్‌లో సాఫ్ట్వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్‌తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ రూ.2,201 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,201, కనిష్టంగా రూ.1,862 ధరలు లభించాయి. అలాగే హంస ధాన్యం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,650, ఆముదాలు క్వింటాల్ రూ.5,969 ఒకే ధర వచ్చింది. -
రైతు ప్రయోజనాలకే ‘భూ భారతి’
అమరచింత/ఆత్మకూర్: రైతు ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం అమరచింత మండలం నాగల్‌కడ్మూర్, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామ రైతువేదికల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. ఒక చిన్న వ్యాపారి తన వ్యాపారంలో నష్టం వస్తే మానేస్తారని.. కాని భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతు మాత్రం పంట నష్టం కలిగినా తిరిగి అప్పు చేసి పంటలు సాగు చేస్తారని కొనియాడారు. రైతు తన భూమి భద్రత విషయంలో నిశ్చింతగా ఉంచడానికి తీసుకొచ్చిందే భూ భారతి చట్టమన్నారు. 2020లో తెచ్చిన ధరణి రైతులను గందరగోళానికి గురి చేసి అనేక సమస్యలకు కారణమైందని.. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు, భూ విస్తీర్ణంలో తేడాలుంటే ఏళ్ల తరబడి కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని చెప్పారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులు, కలెక్టర్లతో 14 నెలలు చర్చించి రైతులు సులువుగా తమ భూ వివరాలు తెలుసుకునేలా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని వివరించారు. భూ భారతితో రైతు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు సమస్య పరిష్కరించే అవకాశం ఉందని.. గడువు ముగిస్తే నేరుగా అర్జిదారునికే చెల్లుబాటు అయ్యేలా సాఫ్ట్వేర్ ధ్రువీకరిస్తుందని తెలిపారు. తప్పులకు పాల్పడితే తహసీల్దార్లపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అమ్మాపురం సంస్థానదీశులు రాజా శ్రీరాంభూపాల్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలన.. ఆత్మకూర్ శివారు పీజేపీ క్యాంపు వద్ద 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, కలెక్టర్ సోమవారం స్థల పరిశీలన చేశారు. త్వరలోనే ప్రతిపాదనలు పంపించి ఆస్పత్రి నిర్మాణానికి మార్గం సుమగం చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, కల్లు గీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, గంగాధర్‌గౌడ్, రహ్మతుల్లా, పరమేష్, తులసిరాజ్, శ్రీను, రామలక్ష్మారెడ్డి, రఫీక్, నాగేష్, రైతులు పాల్గొన్నారు. -
మత్తు నిర్మూలన అందరి బాధ్యత
వనపర్తి: జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యతని.. డ్రగ్స్, గంజాయి నియంత్రణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయితో సమాజంలో యువశక్తి విచ్ఛిన్నమవుతుందని, దాడులు, నేరాలు పెరుగుతున్నాయన్నారు. దేశ సంపద, దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని.. విద్యార్థులు, యువతలో మార్పు రావాలని కోరారు. డ్రగ్స్ వినియోగంతో శరీరంలో శక్తి తగ్గుతుందని, మంచి భవిష్యత్‌ను కోల్పోతారని, సమాజంలో చెడు పేరు వస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగం, రవాణా తీవ్రమైన నేరమని.. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి సమాచారమిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పునకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా వైద్యాధికారి, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డా. డా. శ్రీనివాసులు, సీఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ అమర్, పాలకవర్గ సభ్యులు, అహ్మద్, జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.రాజేందర్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సూపర్వైజర్ మహేష్, సభ్యుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 9 వినతులు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి వినియోగంతో జీవితం నాశనం ఎస్పీ రావుల గిరిధర్ -
మోత మోగితే.. వేటు!
శబ్ద కాలుష్యం కలిగించే వాహనాలపై పోలీసుల కొరడా ●సామాన్యులకు ఇబ్బందులు కలగొద్దని.. ద్విచక్ర వాహనాలకు అతి శబ్ధం వచ్చే సైలెన్సర్లు బిగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎస్పీకి అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. జిల్లాకేంద్రంలో 20 రోజుల్లో 66 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించాం. ఇతర ప్రాంతాల్లో మరో ఆరు తొలగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో శబ్ధ కాలుష్యంతో పాటు రాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు. – సురేందర్, ట్రాఫిక్ ఎస్ఐ, వనపర్తి వనపర్తి: జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా జిల్లా పోలీసుశాఖ శబ్ద కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. జిల్లాకేంద్రంలో రిజర్వ్ ఎస్ఐ సురేందర్ నేతత్వంలో ప్రారంభమైన శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తూ 66 ద్విచక్ర వాహనాలు, మిగతా ప్రాంతాల్లో మరో ఆరు బుల్లెట్లకు ప్రత్యేకంగా బిగించిన సైలెన్సర్లను గుర్తించి తొలగించారు. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను పక్కనబెట్టి బయట మార్కెట్లో అతి శబ్ధం వచ్చే ప్రత్యేక సైలెన్సర్లను బిగించి ప్రజలు, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎస్పీ రావుల గిరిధర్ స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశించారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర పోలీసులకు పంపడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు రిజర్వ్ ఎస్ఐతో ఆరుగురు సిబ్బందిని నియమించారు. వీరు నిత్యం రద్దీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనాల సైలెన్సర్లను తొలగించారు. ఎంత వత్తిడి వచ్చినా జిల్లా పోలీస్‌బాస్ ట్రాఫిక్ సిబ్బంది విధులకు అడ్డుతలగకుండా తాజాగా ద్విచక్ర వాహనాలకు సంబంధించిన 66 సైలెన్సర్లను జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట రోడ్డుపై రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. అలాగే ఆయా వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానాలు సైతం విధించడంతో పాటు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు బిగించాలని ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ వివరించారు. సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కిస్తున్న అధికారులు (ఫైల్) జిల్లాకేంద్రంలో 66.. వేర్వేరు ప్రాంతాల్లో ఆరు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగింపు.. ఒక్కో వాహనానికి రూ.వెయ్యి జరిమానా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా చర్యలు తిరిగి వినియోగించకుండా.. అతి శబ్దం వచ్చే వాహనాల సైలెన్సర్లు తొలగించిన పోలీసులు వాటిని యజమానులకు అప్పగించకుండా, మరోమారు వినియోగించకుండా, వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా బహిరంగంగా రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ ఘటనతో జిల్లాకేంద్రంలో శబ్ధ కాలుష్యం, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిలో భయం మొదలైందని చెప్పవచ్చు. ప్రధాన కూడళ్లలో నిఘా.. ట్రాఫిక్ నిబంధనకు విరుద్ధంగా ప్రధాన కూడళ్లలో వాహనాలను ఇష్టారీతిగా తిరుగుతుండటంతో ఎస్పీ ప్రత్యేక చొరవతో ఎక్కడి వాహనాలు అటువైపు వెళ్లేలా రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ స్తంభాలతో డివైడర్లను ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లు కూడళ్లలో ఇష్టానుసారంగా పర్యటించిన వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. -
క్రీడా శిక్షణకు వేళాయె..
30 రోజుల శిక్షణ.. జిల్లాలో మే నెల 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వివిధ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే శిక్షకులకు అన్నిరకాల సూచనలు చేశాం. 14 ఏళ్లలోపు బాలలు శిక్షణలో పాల్గొనే అవకాశం ఉంది. శిబిరంలో ఎంతమంది విద్యార్థులైనా పాల్గొనవచ్చు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు తర్ఫీదునిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. – సురేందర్‌రెడ్డి, డీవైఎస్ఓ అమరచింత: ప్రభుత్వం వేసవి సెలవుల్లో బడిఈడు పిల్లలు చెడుదారి పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ పెంచేందుకు నచ్చిన ఆటలను పరిచయం చేస్తూ వాటిలో తర్ఫీదునిచ్చేందుకు వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలు మే నెల 1 నుంచి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ తదితర క్రీడల్లో నైపుణ్యాలు గల శిక్షకుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి శిక్షణ కేంద్రాలు మంజూరు చేశారు. ఇప్పటికే కేంద్రాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని.. క్రీడా శిక్షకులకు ప్రతి నెల ప్రభుత్వం రూ.4 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆసక్తిగల 14 ఏళ్లలోపు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకొని శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. జిల్లాలో 10 కేంద్రాలు.. జిల్లాలోని మదనాపురం, గోపాల్పేట, ఏదుట్ల, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, పాన్‌గల్, కొత్తకోట, ఆత్మకూర్, మూలమళ్లతో పాటు జిల్లాకేంద్రంలో అధికంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మొత్తంగా 10 శిబిరాలు వేసవిలో కొనసాగిస్తున్నారు. క్రీడాసామగ్రి పంపిణీ.. వేసవి క్రీడా శిబిరాలకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామగ్రిని అందిస్తుందని జిల్లా క్రీడలు, యువజనశాఖ అధికారి తెలిపారు. వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ సామగ్రిని ఆయా కోచ్‌లకు జిల్లాకేంద్రంలో అందిస్తున్నట్లు చెప్పారు. శిక్షణకు వచ్చే విద్యార్థులు వీటిని వినియోగించుకొని కోచ్ వద్ద భద్రపర్చుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స కిట్ల కొనుగోలుకుగాను జిల్లాకు రూ.5 వేలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో మే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం జిల్లావ్యాప్తంగా 10 శిబిరాలు ఏర్పాటు శిక్షకులకు గౌరవ వేతనం చెల్లింపు 14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం శిక్షణతో ప్రయోజనం.. 30 రోజుల క్రీడా శిక్షణతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలతో పాటు డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. వేసవి సెలవులు వృథా కాకుండా రోజు ఉదయం ఎనిమిది వరకు, సాయంత్ర ఐదు నుంచి ఆరు వరకు శిక్షణ ఇవ్వనున్నారు. -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేట్ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు వాయిదా ● 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం ● అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ● ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు ● పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్‌లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. ర్యాటిఫికేషన్ కోసం.. పీయూ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ర్యాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఈ నెల 23 చివరి తేదీ కాగా.. 24 నుంచి 30 వరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను అధికారులకు సమర్పించాలని ఈ నెల 7న యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కళాశాలల్లో వసతులపై ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని సూచించింది. అయితే అధికారుల సూచనల ప్రకారం కొన్ని కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల అప్లియేషన్ చివరిసారిగా 2022లో నిర్వహించగా.. తర్వాత గత వీసీ హయాంలో ప్రైవేటు కళాశాలలు అప్లియేషన్, ర్యాటిఫికేషన్ వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త వీసీ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించినా.. గతంలో మాదిరిగానే వాటిని మూలకు పెట్టినట్లు తెలుస్తోంది.ఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్‌లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు -
అకాల వర్షం.. అపార నష్టం
ఆత్మకూర్: అకాల వర్షం అపార నష్టం తెచ్చిపెట్టింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొట్టింది, దీంతో కల్లాలు, మార్కెట్యార్డులోఆరబోసిన ధాన్యం తడిసి పోవడంతో పాటు వరద నీటిలో కొట్టుకుపోయింది. చెట్లు విరిగి రోడ్లు, తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమరచింత–ఆత్మకూర్ మధ్యలో 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయక, కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. మండల కేంద్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. గాంధీచౌక్‌లో వర్షపు నీరు నిలువడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంతలో కూరగాయలు కొట్టుకుపోయాయి. తడసిన ధాన్యం.. నిలిచిన విద్యుత్ సరఫరా -
‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వతిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఐదేళ్లుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళనలు చేస్తున్నా.. వాటిని అమలుచేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గంధం మదన్, నందిమళ్ల రాములు, రత్తయ్య, రవి, విజయ్‌కుమార్, రామచంద్రయ్య, చిన్ననాగన్న తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ పోరులో సత్తా చాటుదాం : బీజేపీ అమరచింత: గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కిష్టంపల్లిలో జరిగిన మండలస్థాయి బూత్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్న ఘనత కేంద్రానిదేనన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అమరచింత, ఆత్మకూర్, మక్తల్ పురపాలికలు బీజేపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షురాలు మంగ లావణ్య, నాయకులు మేర్వ రాజు, హరీశ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యవర్గం ఎన్నిక వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వనపర్తి డిపో ఎస్డౠ్ల్యఎఫ్ (సీఐటీయూ) కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు తెలిపారు. అధ్యక్షుడిగా ఏజీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా నర్సింహ, నారాయణ, కార్యదర్శిగా నాగేశ్వర్, సహాయ కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా కురుమయ్య, ప్రచార కార్యదర్శిగా గోవర్ధన్, మహిళా కన్వీనర్‌గా జానకి, సభ్యులుగా రాములు, శాంతన్న, శేఖరయ్య, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అంతకుముందు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లేకపోవడంతో యాజమాన్యం కార్మికుల హక్కులను హరిస్తోందని, పని గంటలు పెంచి, సింగిల్ క్రూ డ్యూటీ పెంచి నామమాత్రపు ఓవర్‌టైం ఇస్తూ కార్మికుల శ్రమ, శక్తిని హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని, కార్మికులంతా కలిసి ఐక్య పోరాటాలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ ప్రచారకార్యదర్శి క్రాంతికుమార్, సహాయ కార్యదర్శి ఎండీ ఖయ్యూం, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. ‘బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి’ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబ్‌నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ, రాజు యువశక్తి, ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. -
ఫ్రిజ్‌లకు గిరాకీ
వేసవిలో ఇంట్లో అడుగుపెట్టే చల్లని నేస్తం ఫ్రిజ్. కూల్‌వాటర్‌తో పాటు వేసవిలో తిండిపదార్థాలు చెడిపోకుండా ఉండడానికి ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో పలువురు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇన్వెర్టర్లపైనా నడిచే ఫ్రిజ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ.12,500 నుంచి రూ.30 వేల వరకు ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగిల్, డబుల్, త్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేసిక్ మోడళ్ల ఫ్రిజ్‌లు తీసుకుంటుండటంతో వ్యాపారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 వరకు ఫ్రిజ్‌ల షాపులు ఉండగా ఈ వేసవి సీజన్లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ● ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్లు, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ల హవా నడిచింది. ఇప్పుడు కూలర్లు, ఏసీల గాలి వీస్తోంది. ఒకప్పుడు ఉన్నత, మధ్య తరగతి ఇళ్లకే పరిమితమైన కూలర్లు ఇప్పుడు తక్కువ ధర, చిన్న సైజుల్లోనూ లభిస్తుండడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. లోకల్‌మేడ్ కాకుండా బ్రాండెడ్ కూలర్లు సైతంలో మార్కెట్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేసవిలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర వీటి వ్యాపారం నడుస్తుంది. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కొత్తకోట రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా.. కనీస మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని అల్వాల, జగత్పల్లి, చిన్నమందడి, పెద్దమందడి, మనిగిళ్ల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు సేదతీరేందుకు టెంట్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే సెంటర్‌ను మూసివేస్తామని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. అలాగే తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. లారీలు పెట్టడంలో ఆలస్యం చేయవద్దని, అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారన్నారు. అనంతరం వెల్టూరు, మదనాపూర్ గోదాంలు పరిశీలించారు. -
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
వనపర్తి: జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అలాంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లదండ్రులకు ప్రతి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్ ద్వారా వారి ప్రవర్తన మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మైనర్లు బైక్ నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు శిక్షలు కఠినంగా ఉంటాయని, లైసెన్స్ సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇక ముందు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మైనర్లు, తల్లిదండ్రులు లేదా యజమానిని మోటార్ వాహనాల చట్టం–2019 199ఏ ప్రకారం సంబంధిత కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వాహన యజమానికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వరకు విధిస్తారన్నారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేసవి కాలం.. చల్లని నేస్తం
ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజల పరుగులు స్టేషన్ మహబూబ్‌నగర్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీంతో భరించలేని ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఫ్యాన్లు ఉన్నోళ్లు కూలర్లు, కూలర్లు వాడుతున్న వారు ఏసీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురాగా కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిశాయి. ఇవే కాకుండా పళ్ల రసాలు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ● ఏసీలు, ఫ్రిజ్‌ల కొనుగోళ్లతో షాపుల్లో రద్దీ ● పండ్ల జ్యూస్‌లు, లస్సీ, ఐస్‌క్రీమ్‌లకు భలే గిరాకీ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో సీజనల్ వ్యాపారం -
‘వక్ఫ్ సవరణ చట్టంతో నష్టమేమి లేదు’
వనపర్తి టౌన్: వక్ఫ్ సవరణ చట్టంతో దర్గా, మసీదు, మదర్సా ఆస్తులకు నష్టమేమి లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌పాషా అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన వక్ఫ్ సవరణ వర్క్‌షాపులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో పూర్తిగా ముస్లింలు ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సౌదీఅరేబియా, ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వక్ఫ్ చట్టాలు లేవని, మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే బిల్లు ఏర్పడిందని ఆరోపించారు. రక్షణ, రైల్వే శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయని, 2013 ముందు వక్ఫ్ ఆధీనంలో వేల ఎకరాలు ఉంటే.. 2013 తర్వాత అధికారం కోల్పోతామని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం బిల్లు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను ధారాదత్తం చేసిందన్నారు. అక్రమాలను సరిచేయడానికి ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీపై ముస్లింలలో వ్యతిరేకత తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. నాయకుడు పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం మత పెద్దలు, వివిధ వర్గాల ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులతో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. ఈ బిల్లు ద్వారా దేశంలోని ముస్లింలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపుమేరకు త్వరలోనే జిల్లా, మండల స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, హేమారెడ్డి, రామన్‌గౌడ్, సీతారాములు, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్‌రెడ్డి, కల్పన, పెద్దిరాజు, మనివర్ధన్, ప్రవీణ్‌కుమార్, అశ్విని రాధ, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు కొత్తకోట/ మదనాపురం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం ఆయన కొత్తకోట, మదనాపురంలోని పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని రికార్డులు, గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ గది, అక్కడ ఉన్న పేషెంట్ వార్డులు, వ్యాక్సిన్లను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా ఆరా తీశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్‌రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పరిమళ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఝాన్సీ, ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు ఆసియాబేగం, భవాని, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చలో వరంగల్..
బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. సెగ్మెంట్‌కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్‌కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్‌తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పాలమాకుల లేదంటే శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్కు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి చేరుకుని.. నేరుగా ఘట్కేసర్ వద్ద వరంగల్ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోన్–2లో పార్కింగ్.. రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్–2లో పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్‌హెచ్–163 బైపాస్‌లో టోల్గేట్ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్ వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
ఆరోగ్యవంతులే అసలైన సంపన్నులు
వనపర్తి టౌన్: ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. వనపర్తి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సహకారంతో శనివారం జిల్లా న్యాయస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో తగిన జాగ్రత్తలు, సరైన చికిత్స సకాలంలో తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, తద్వారా జీవిత మనుగడపై, కుటుంబ పోషణకు భారం కావడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం లోపిస్తుందన్నారు. పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారే అసలైన సంపన్నులు అన్నారు. సేవా దృక్పథంతో ఆస్పత్రి యాజమాన్యం ఉచిత వైద్య సేవలకు ముందుకు రావడం శుభపరిణామమని ప్రశంసించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రజని, జానకి, రవికుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ తరహాలో తయారు..
18 ఏళ్ల నుంచి క్లాక్‌టవర్‌లో ‘హైదరాబాద్ ఫలుదా సెంటర్’ నడుపుతున్నాను. హైదరాబాద్‌లో తరహాలో ఫలుదా తయారు చేస్తున్న. దీంతో ఫలుదా తాగడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. లస్సీని కూడా ప్రత్యేకంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాం. జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఫలుదా ఇష్టంగా ఆరగిస్తున్నారు. – మహ్మద్ షబ్బీర్‌అలీ, ఫలుదా, లస్సీ సెంటర్, మహబూబ్‌నగర్ సొంత పొలం నుంచే.. 20 ఏళ్ల నుంచి జిల్లా కేంద్రంలో చెరుకు రసం కేంద్రాన్ని నడుపుతున్నాం. మా సొంత పొలంలో పండించిన చెరుకు గడలనే వాడుతున్నాం. విని యోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఆరోగ్యపరంగా లాభాలు ఉన్న చెరు కు రసాన్ని వేసవితో సంబంధం లేకుండా ఏ డాది పొడువునా సెంటర్‌ను నడుపుతున్నాం. – లక్ష్మణ్‌నాయక్, మహబూబ్‌నగర్ లస్సీ.. ఇష్టంగా తాగుతా.. లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్‌నగర్ ● -
లారీలు రావడం లేదు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 10 రోజులు దాటుతుంది. లారీలు కొరత ఉందని వడ్లు కాంటా చేయట్లేదు. దీంతో రోజుల తరబడి ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మేము ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు ఈదురు గాలులు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుంది. – పెంటయ్య, చిన్నమందడి ఈదురు గాలులతో ఆందోళన అకాల వర్షాలు, ఈదురు గాలులతో తేమ శాతం వచ్చిన వడ్లు కూడా తడిసిపోవడంతో తిరిగి ఎండబెట్టాల్సి వస్తోంది. దీంతో కూలీల ఖర్చు పెరుగుతుంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్పందించి వడ్లు కాంటా త్వరగా చేపట్టాలి. – రాంరెడ్డి, పాంరెడ్డిపల్లి కార్పొరేషన్ త్వరలోనే సమస్య పరిష్కారం.. జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో తూకం చేసి తరలింపునకు సిద్ధంగా ఉంది. లారీలు, హమాలీల కొరత కారణంగా తరలింపునకు బ్రేక్ పడింది. వెల్టూరు గోదాములో ధాన్యం నిల్వ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలింపును రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం. ట్యాబ్ ఎంట్రీల విషయంపై దృష్టి సారిస్తాం. కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయించి ట్రక్‌షీట్ తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, డీఎం, జిల్లా పౌరసరఫరాలశాఖ ● -
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అధ్యాపకులు ఉద్యమించడం ద్వారా ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెకు ఆయన శుక్రవారం మద్దతు తెలిపి, మాట్లాడారు. అధ్యాపకులు మరింత ఉత్సాహంగా ఉద్యమం చేయాలని, వారికి పౌర సమాజం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఉన్నతవిద్యలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని, అలాంటి వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పీయూ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తమవంతు సహకారం ఉంటుందన్నారు. -
సంగమేశ్వరా.. దారి చూపవా..
కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి దర్శనానికి సరిహద్దు పంచాయితీ ● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్న ఏపీ జాలర్లు ● స్వామి దర్శనానికి వ్యయప్రయాసలతో కష్టాలు పడుతున్న భక్తులు ● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడి దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సప్త నదుల సంగమం, ఏడాదిలో నాలుగు నెలలే దర్శనం.. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గాక ఆలయం కనిపిస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు రిజర్వాయర్‌లో నీరు లేని సమయంలోని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది. మిగతా ఏడాదంతా నీటిలోనే మునిగి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారథి, భవనాశిని నదులు ప్రవహించే ఏడు నదుల సంగమ క్షేత్రంగా సంగమేశ్వరాన్ని పేర్కొంటారు. ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకరైన భీముడు రాయితో కాకుండా వేపధారు(చెక్క)తో ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత. ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం.. సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో చోట రూ.వంద చొప్పున.. ఒక్కొక్కరికి మొత్తం రూ.300 ఖర్చు అవుతుంది. బోటు నుంచి ఆటో, ఆటో నుంచి మళ్లీ బోటుకు మారి ప్రయాణించేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.. కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా) సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రామాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. పర్యాటకులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్, సోమశిల -
మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దించుకోవాలి
ఖిల్లాఘనపురం: రైస్‌మిల్లర్లు కేంద్రాల నుంచి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే లారీల నుంచి దించుకొని ట్రక్‌షీట్లపై సంతకం చేసి తిప్పి పంపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని సోళీపురం గ్రామంలో ఉన్న సింధు ట్రేడర్స్ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి ధాన్యం బస్తాలతో ఉన్న వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని.. కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని, మిల్లర్లు వెంటనే దించుకొని పంపాలన్నారు. ఎక్కడైనా ఆలస్యమవుతుందని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మిల్లులో ధాన్యాన్ని మర ఆడించి సకాలంలో ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా మండలస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. -
ఉగ్రవాదాన్ని రూపుమాపాలి
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీపీఆర్ఓ సీతారాం కోరారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వనపర్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనతో ఆయన పాల్గొని దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో అన్ని మతాలు, కులాల వారు ఐక్యమత్యంతో జీవిస్తున్నారని, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుచేసి కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తోందని, కొన్నేళ్లుగా పర్యాటకరంగం ఊపందుకుందన్నారు. ఇది ఓర్వలేని వారు ఉగ్రవాదులను ప్రేరేపించి అలజడి సృష్టించేందుకు దాడి చేయించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం శాంతిని కోరుకుంటుందని అలా అని మన పౌరులపై దాడి చేసి చంపేస్తే ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉండాలన్నారు. మరో సీనియర్ జర్నలిస్ట్ కొండన్న మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా దాయది పాకిస్తాన్ హస్తం ఉందని తేటతెల్లమవుతుందని.. ఉగ్రవాదాన్ని తరాలుగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. -
అవగాహనతోనే మలేరియా నిర్మూలన
వనపర్తి విద్యావిభాగం: అవగాహనతోనే మలేరియాను నిర్మూలించవచ్చనని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దోమ కాటుతోనే మలేరియా వస్తుందని.. నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడంతో దోమల వృద్ధిని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో డా. పరిమళ, ఇమ్యునైజేషన్ అధికారి డా. మారుతి, క్షయ వ్యాధి వైద్యాధికారి డా. నందన్‌గౌడ్, జిల్లా మలేరియా నివారణ ఇన్చార్జ్ అధికారి డా. శ్రీనివాస్‌జీ, రవీంద్రగౌడ్, ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహారావు, ఆరోగ్య పర్యవేక్షకుడు రాము, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ శుక్రవారం జిల్లాకేంద్రంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు ఆందోళన చేపట్టారు. ముందుగా మర్రికుంట నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు రెండు నెలలు వేసవి సెలవులు ప్రకటించారని, తెలంగాణలోనూ వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, ఆర్యన్ రమేష్, మద్దిలేటి, రాములు, జ్యోతి, సుమతి, సంధ్య, రేణుక, లత, నిర్మల, కృష్ణవేణి, సరళ, నిర్మల, డీవైఎఫ్ఐ నాయకుడు కొప్పుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి
పాన్‌గల్: పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని జిల్లా మాత, శిశు సంరక్షణ అధికారి డా. ఝాన్సీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది తమ సబ్‌సెంటర్ల పరిధిలోని గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించాలన్నారు. గర్భిణులు 102, 108 వాహన సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. పీహెచ్సీలో జరిగిన ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్, సీహెచ్ఓ రామయ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం వంద శాతం గ్రౌండింగ్ చేసేలా బ్యాంకర్లు, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో 70 నుంచి 100 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని, మిగిలిన మొత్తం మాత్రమే బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,495 యూనిట్లు మంజూరు కాగా 6,085 దరఖాస్తులు వచ్చాయని, ఎస్టీ కార్పొరేషన్లో 1,328 యూనిట్లకు 2,677 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్లో 445 యూనిట్లకు 2,130 దరఖాస్తులు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లో 29 యూనిట్లకు 64 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు కేటాయించినందున యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, అసిస్టెంట్ ఎల్డీఎం సాయి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
వనపర్తి రూరల్: దేశంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి రమేష్ అన్నారు. కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద భారతీయ పర్యాటకులు 27 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడంపై సీపీఐ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలి.. మత సామరస్యం వెల్లివిరియాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి క్రూరంగా చంపడం పిరికి పంద చర్య అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నక్సలైట్లను చంపించే పనిపై ఉన్న దృష్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో లేదన్నారు. మా దేహం ముక్కలైనా.. దేశాన్ని ముక్కలు కానీయబోమన్నారు. పార్టీలు ఎన్ని ఉన్నా దేశం శాంతి సామరస్యాన్ని కాపాడటంలో ఏకమవుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కళావతమ్మ, ఎర్ర కుర్మయ్య, శిరీష, వెంకటమ్మ, జ్యోతి, చిన్నకుర్మయ్య పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ కొలతలు అడ్డుకున్న వ్యాపారులు
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని కర్నూలు రోడ్డును విస్తరించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం అధికారులు పాలిటెక్నిక్ రోడ్డుకు రెండు వైపుల ఎంత మేరకు విస్తరించాలో మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ మార్కింగ్ ప్రక్రియను చేపట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతో కలిపి మొత్తం 10 మంది కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పానగల్ రోడ్డును రెండు వైపులా సెంటర్ పాయింట్ నుంచి 35 అడుగుల మేర విస్తరించేందుకు సర్వే పూర్తి చేశామని వెల్లడించారు. కర్నూలు రోడ్డులో ప్రస్తుతం ఉన్న కొత్తకోట రోడ్డు మధ్య నుంచి 45 అడుగులు ఉండటంతో అదే రీతిలో పాలిటెక్నిక్ రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేసేందుకు గురువారం చర్యలు చేపట్టారు. అయితే సుమారు 30 దుకాణాలకు మార్కింగ్ ఇచ్చిన వెంటనే మిగతా దుకాణాలకు మార్కింగ్ ఇవ్వకుండా స్థానిక వ్యాపారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా మార్కింగ్ చేస్తారని కొందరు వ్యాపారులు అధికారులను అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల వైపు, రాజాగారు వదిలిన లాన్ మార్గంలో కొందరు దుకాణాలు నిర్మించారని, వాటిని తొలగించి అప్పుడు రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలని పట్టుబట్టారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును సెంటర్ పాయింట్‌గా తీసుకొని విస్తరించడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఆస్తులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి నుంచే మున్సిపల్ కమిషనర్‌తో వ్యాపారులు ఫోన్లో మాట్లాడారు. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ విషయమై శుక్రవారం సమావేశం నిర్వహిద్దామని చెప్పడంతో వ్యాపారులు అంగీకరించారు. దీంతో అధికారులు మార్కింగ్ ఇచ్చే ప్రక్రియను నిలిపివేసి వెనుదిరిగారు. -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్పర్సన్ వెన్నెల ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందుతుందా.. సకాలంలో ఇస్తున్నారా.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని, తేడా వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తూకాల్లో తేడాలు లేకుండా రెవెన్యూ అధికారులు చూడాలని సూచించారు. కార్యక్రమంలో గోవింద్‌గౌడ్, రామన్‌గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం వివరాలు తప్పక నమోదు చేయాలి
కొత్తకోట/ కొత్తకోట రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం మండలంలోని పాలెం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో టెంట్, వడ్లు తూర్పు పట్టే ఫ్యాన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెంట్ వేయించాలని, తాలు తొలగించేందుకు ఫ్యాన్ పెట్టించి ఉపయోగించాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన వడ్లు తేమ శాతం, నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించారు. సెంటర్ ఇన్చార్జ్ని పలు వివరాలు అడగగా.. ఆయన నీళ్లు నమలడంతో వెంటనే మార్చాల ని ఆదేశించారు. అలాగే ప్రతి సెంటర్లో శిక్షణ పొందిన వారిని మాత్రమే ఇన్చార్జ్గా నియమించాలన్నారు. వడ్లలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, పాడి క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని, దొడ్డు రకం, సన్న రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పట్టణంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించి.. ఏఎన్సీ, ఈడీడీ మందుల స్టాక్ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ప్రస్తుతం ఉన్న మందులు, వాటి తుది గడువు తదితర వివరాలు తెలుసుకున్నారు. గర్భిణుల ఏఎన్సీ సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. -
జూరాల.. భద్రమేనా?
జూరాల జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు జూరాల ప్రాజెక్టు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్‌లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. జూలై నాటికి పూర్తి.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – జుబేర్, ఈఈ, జూరాల డ్యాం62 రేడియల్ క్రస్ట్ గేట్లు.. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్‌లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు. భారీ వరద వస్తే.. 2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 చోట్ల రబ్బర్‌సీల్ దెబ్బతినడంతో లీకేజీలు మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి -
‘ఈత సరదా విషాదంగా మారకూడదు’
వనపర్తి: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో.. పిల్లలు, యువకులు సరదా కోసం, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాల్వలకు వెళ్తారని, ఈత సరదా విషాదం కారాదని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని, ఎవరి పర్యవేక్షణ లేకుండా చిన్నారులను ఈత కొట్టడానికి పంపించడం వల్ల ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నారు. అలాగే వేసవికాలంలో జిల్లాలో ఈత కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో అవగాహన కల్పించే విధంగా, ఈతకు వెళ్లినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని, ప్రజలంతా పోలీసు శాఖకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ● పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందిన ఖిల్లాఘనపూర్ ఏఎస్ఐ సుధాకర్ ఎస్ఐగా, వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పోలీసులకు ఎస్పీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యత పెంచుతాయన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఏఎస్పీ మహేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి తేమశాతం పెరగడంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని.. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కనిమెట్ట శివారులో తడిసిన ధాన్యాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జబ్బార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దొడ్డురకం ధాన్యానికి బోనస్ ప్రకటించాలని, కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. చాలామంది రైతులకు రైతు భరోసా రాలేదని, త్వరగా మంజూరు చేయాలని కోరారు. అకాల వర్షాలతో మామిడి తదితర పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్, చిరంజీవి, రైతులు వెంకటమ్మ, బాలమ్మ, సుశీల, సరోజ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడుఎండీ జబ్బార్ -
‘భూ భారతి’ చారిత్రాత్మకం
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదిక, శ్రీరంగాపురం కామన్ కమ్యూనిటీ భవనంలో భూ భారతి–2025 చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల ప్రత్యేక అధికారి సుధారాణి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూమిని మాయం చేసి తీసుకొచ్చిన మాయదారి ధరణిని ఎన్నికల హామీలో భాగంగా బంగాళాఖాతంలో వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భూమి, భూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా కొత్త చట్టం వచ్చినప్పుడు అందులోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంటుందని తెలిపారు. ధరణి చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి తీసుకొచ్చినట్లు చెప్పారు. భూ రిజిస్ట్రేషన్ సమయంలో క్షేత్రస్థాయిలో సర్వేచేసి నాలుగు దిక్కుల హద్దులు నిర్ణయించుకొని పట్టాదారు పాసు పుస్తకంలో భూమి వివరాలతో పాటు పటం ముద్రిస్తారని.. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సెషన్ సమయంలో తప్పు జరిగినట్లు భావిస్తే ఆర్డీఓకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీఓస్థాయిలో కూడా తప్పు జరిగితే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం శ్రీరంగాపురం మండల కేంద్రంలో పశువుల వెంకటయ్య, మంజుల ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యంతో వంటిన భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మి, మురళిగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓలు రవీందర్, రవినారాయణ, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్‌కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది. – డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్, జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్కర్నూల్కౌన్సెలింగ్ ద్వారా చికిత్స.. కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతు లు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్‌కు పంపుతున్నాం. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్‌కర్నూల్ ● -
‘ఉపాధి’ పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి
పాన్‌గల్: ప్రతి గ్రామపంచాయతీలో 150 మందికి తగ్గకుండా ఉపాధి కూలీలకు పని కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వేసవి దృష్ట్యా కూలీలతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పని చేయించాలని, రోజు కూలి రూ.307 వచ్చేలా మార్కింగ్ ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో అన్ని వసతులు కల్పించాలని.. ఇందిరమ్మ కమిటీలతో సమావేశాలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ రఘురాములు, ఏపీఓ కుర్మయ్య, ఈసీ అంజన్‌రెడ్డి, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పన వీపనగండ్ల: ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. బుధవారం గోవర్ధనగిరి, వీపనగండ్ల, కల్వరాల, సంగినేనిపల్లి, బొల్లారం, తూంకుంటలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక కాంగ్రెస్‌పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ, నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక అధికారి నర్సింహ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య పాల్గొన్నారు. -
వేసవి సెలవుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి
వనపర్తిటౌన్: విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్లతో సమయాన్ని వృథా చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, నాట్యం తదితర వాటిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, మోటారు వెహికిల్, సైబర్ క్రైమ్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని వృథా చేయొద్దు : ఎస్పీ వనపర్తి: యువత తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా కఠోర సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1967లో మొదటి సరస్వతి శిశుమందిరం నిర్మల్‌లో ప్రారంభమైందన్నారు. ఎస్ఎల్ఎన్ ఆచార్యులు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పాఠశాల ప్రారంభించగా.. పుర ప్రముఖులు, సంఘపెద్దలు పునాదిరాళ్లు వేశారని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికి ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యం ఉండాలని.. ఒడిదుడుకులు అధిగమించి ముందుకుసాగితే అనుకున్నది సాధించగలమన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని.. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య వక్త, వందేమాతరం ఫౌండేషన్ స్థాపకుడు రవీంద్ర, వనపర్తి సీఐ కృష్ణ, చైతన్యగౌడ్, కార్యదర్శి అరవింద్ ప్రకాష్, పాలమూరు విభాగ్ సహ కార్యదర్శి రాజమల్లేశ్, నాగిరెడ్డి, సూర్యనారాయణ, వనపర్తి జిల్లా విద్యా శాఖ ఏఎంఓ మహానంది, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, యుగేంధర్, శరత్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పీసీసీ అబ్జర్వర్ల నియామకం సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ అబ్జర్వర్ల జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు దొమ్మటి సాంబయ్య, గజ్జి భాస్కర్ యాదవ్, నాగర్‌కర్నూల్‌కు టి.బెల్లయ్య నాయక్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, వనపర్తికి ఎ.సంజీవ్ యాదవ్, గౌరి సతీశ్, జోగుళాంబ గద్వాలకు దీపక్ జైన్, బి.వెంకటేశ్ ముదిరాజ్, నారాయణపేటకు ఎం.వేణుగౌడ్, బొజ్జ సంధ్యారెడ్డి పార్టీ అబ్జర్వర్లుగా కొనసాగనున్నారు. వీరు పార్టీ తరఫున ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును అధిష్టానానికి నివేదించనున్నారు. నిబంధనలు పాటించాలి గోపాల్పేట: లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రాజెక్టు డైరెక్టర్ పర్వతాలు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణానికి ఎంత మేర సిమెంట్, కంకర, స్టీల్ వినియోగిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపించకుండా చూడాలని ఎంపీడీఓ శంకర్‌నాయక్‌ను ఆదేశించారు. మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. -
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది. ‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’ -
ఆరోగ్య సమస్యల నుంచి ఆత్మహత్యల దాకా..
ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధులు, మహిళలతో సహా కల్తీ కల్లుకు బానిస అవుతున్నారు. ఏళ్ల తరబడి కల్తీ కల్లు సేవిస్తుండటంతో ప్రధానం మెదడు, నాడీ వ్యవస్థ, లివర్ భాగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. చివరికి నోటి నుంచి మాటరాని పరిస్థితికి చేరుకుంటున్నారు. కల్తీకల్లులో వినియోగిస్తున్న మితిమీరిన మత్తు పదార్థాలతో పూర్తిగా బానిసై కల్లు మానేయలేని స్థితికి చేరుకుంటున్నారు. విపరీతమైన మత్తులో గొడవలు పడటం, కుటుంబ కలహాలు, మహిళలపై చేయి చేసుకోవడంతో పాటు క్షణికావేశంలో తమవారినే అంతమొందించేందుకు సిద్ధమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మత్తులో డిప్రెషన్‌కు గురికావడం, తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. -
జాతీయ స్థాయిలో సత్తాచాటాలి
వనపర్తి టౌన్: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ అండర్–14 జట్టు మంగళవారం జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు తరలివెళ్లినట్లు డీవైఎస్ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు క్రీడాకారులను అభినందించారు. ఫోన్లో క్రీడాకారులు ఎమ్మెల్యే మేఘారెడ్డి అభినందనలు తెలిపి, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, రాజేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రణీత్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ఫిజికల్ డైరెక్టర్ కుమార్ తెలిపారు. -
ఇంటర్లో నిరాశజనక ఫలితాలు
వనపర్తిబుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా వనపర్తి జిల్లాకు మరోసారి నిరాశజనక ఫలితాలే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌కు సంబంధించి 5,293 మంది పరీక్షకు హాజరు కాగా.. 58.62 శాతంతో 3,103 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,578 మంది విద్యార్థులు హాజరుకాగా.. 47.67శాతంతో 1,229 మంది, బాలికలు 2,715 మంది హాజరు కాగా.. 69.02 శాతంతో 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోలిస్తే బాలికలు 21.35 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 4,748 మంది విద్యార్థులు హాజరు కాగా.. 67.35 శాతంతో 3,198 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 2,236 మంది హాజరు కాదా.. 58.27 శాతంతో 1,303 మంది, బాలికలు 2,512 మంది హాజరు కాగా.. 75.44శాతంతో 1,895 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 17.17 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో 52.58 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానంలో ఉన్న జిల్లా.. ఈ ఏడాది 18వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో గతేడాది 64.75 శాతం ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 22వ స్థానంలో నిలిచింది. ● మే 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల23 నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటితోపాటు రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు 10లో u ఫస్టియర్‌లో 18, సెకండియర్‌లో 22వ స్థానం గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత మరోసారి బాలికలదే పైచేయి -
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్‌నగర్ ● -
పంట కోతల్లో ప్రమాణాలు తప్పనిసరి
వనపర్తి: కోత యంత్రాల నిర్వాహకులు వరి కోతల సమయంలో ప్రమాణాలు పాటిస్తే నాణ్యమైన ధాన్యం చేతికందుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో వరి కోతలు విస్తృతంగా కొనసాగుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం ఐడీఓసీ సమావేశ మందిరంలో కోత యంత్రాలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు చాలాచోట్ల ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపిస్తున్నాయని.. అందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పక్వానికి రాకముందే పంట కోతలు చేపడితే తాలు ఏర్పడుతుందని.. కోత యంత్రాల నిర్వాహకులు 19–20 ఆర్పీఎంతో బ్లోవర్ ప్రారంభించి గేర్ స్నాట్ ఏ2–బి1లో ఉంచి పంట కోతలు చేపట్టాలని ఆదేశించారు. నాసిరకం ధాన్యం కొనడం కష్టమని.. నాణ్యత పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే హార్వెస్టర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు, హార్వెస్టర్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని.. లేనిపక్షంలో డీటీఓకు ఫిర్యాదు చేస్తే యంత్రాలు సీజ్ చేస్తారన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీటీఓ మానస, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీఎం, వ్యవసాయ మండల, క్లస్టర్ అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
వనపర్తి రూరల్: తడిసిన ధాన్యం గురించి రైతులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని, కేంద్రాల్లో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భరోసానిచ్చారు. సోమవారం మండలంలోని అంకూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతుల వివరాలను నమోదు చేయాలని వారికి, తేమశాతం, తాలు పేరుతో రైతులను సతాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఆర్ఐ మధుసూదన్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.. గోపాల్పేట: మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయం వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం తూకం చేసిన వెంటనే మిల్లులకు తరలించడం, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం వెంటవెంటనే జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉమ్మడి మండలాల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, శివన్న, నాగశేషు, కొంకి వెంకటేష్, కొంకి రమేష్, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. బాధితుడికి పరామర్శ.. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుతో 25 గొర్రెలు మృతి చెందాయన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం ఉదయం గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం త్వరగా అందేలా చూడాలని తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి వెంకటేశ్వర్లుకు సూచించారు. సరోజ అనే మహిళ గాయపడిందని తెలుసుకుని వెంటనే జిల్లా ఆస్పత్రిలో చూపించాలని చెప్పారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.20 వేలు అందించారు. -
నాణ్యమైన ధాన్యమే సేకరించాలి
కొత్తకోట రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేసి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులదేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం సాయంత్రం కొత్తకోట, రాజపేటలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి వచ్చిన ధాన్యం, తేమ శాతం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ధాన్యంలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, ప్యాడీ క్లీనర్‌తో శుభ్రం చేసి కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. వచ్చిన ధాన్యం, తేమ శాతం తేదీల వారీగా నమోదు చేయాలని సూచించారు. వరి కోతలు సక్రమంగా జరిగేలా వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల నుంచి నాణ్యమైన బియ్యం అడుగుతున్నప్పుడు వారికి ధాన్యం కూడా అదేవిధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజపేట కొనుగోలు కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు, సన్నరకం కేంద్రాలు వేర్వేరుగా నిర్వహించాలని, శిక్షణ పొందిన వారే ఇన్‌చార్జ్‌లుగా ఉండాలని ఆదేశించారు. అమరచింత కేంద్రం నుంచి రాజనగరంలోని రాఘవేంద్ర ఇండస్ట్రీకి ధాన్యం తరలించగా కలెక్టర్ రైస్‌మిల్లును సందర్శించారు. వరి ధాన్యాన్ని మరాడిస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. క్వింటాకు ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
గాలి, వాన బీభత్సం..
ఆత్మకూర్: మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లో వరి పంటలు నేలవాలగా.. మామిడి కాయలు టన్నుల కొద్ది రాలిపోయాయి. ఆరేపల్లిలో రైతు దేవన్న మామిడితోటలో రెండు టన్నుల కాయలు రాలిపోవడంతో రూ.1.10 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే రామచంద్రయ్య తోటలో 4 టన్నులు, వెంకటన్న తోటలో 5 టన్నులు, రామకృష్ణారెడ్డి తోటలో టన్ను, అడవి నర్సింహులు తోటలో టన్ను మామిడి కాయలు రాలిపోయాయి. అలాగే వరిపంట నేలకొరిగి ధాన్యం రాలిపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు విరిగిపడటంతో గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
అస్తవ్యస్తం
వనపర్తిఆహార భద్రత..మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో u●పొరపాట్లు వాస్తవమే.. కొత్త రేషన్ కార్డుల జారీలో కొన్నిచోట్ల పొరపాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమే. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పొరపాట్లను సరి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది పాన్‌గల్‌కు చెందిన వీరస్వామి కుటుంబం. ఆయన ప్రజాపాలన గ్రామసభలో కొత్త రేషన్‌కార్డు కోసం భార్య, కుమారుడు, కుమార్తె నిత్యశ్రీ వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం తల్లి, తండ్రి, అన్న పేర్లను ఎగ్గొట్టి.. చిన్నారికి కార్డు మంజూరు చేశారు. తాజాగా ఏప్రిల్‌లో పాన్‌గల్‌లోని ఓ రేషన్ దుకాణానికి బియ్యం కోటా సైతం విడుదల చేశారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.’ వనపర్తి: ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయన్న ప్రజల ఆశలను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు అడియాశలు చేశారు. ప్రజాపాలన గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, పేర్ల తొలగింపు, చేర్పుల కోసం 5,700 దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త కార్డుల జారీ, పేర్ల తొలగింపు, చేర్పులకు కసరత్తు చేపట్టారు. ఏప్రిల్ మొదటి వరకు 1,980 కార్డులు మంజూరుకాగా.. జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. కుటుంబంలో కొందరికి ఒకచోట, మరికొందరికి మరో మండలం (వేరే ప్రాంతం)లో పేర్లు నమోదు చేస్తూ కార్డులు జారీ చేయడంతో ఒక్కసారిగా ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో పసిపిల్లల పేరుతో మంజూరైన ఘటనలూ చాలానే ఉన్నట్లు సమాచారం. అధికారులు గుట్టుచప్పుడు కా కుండా తప్పులను సరి చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 5,700 దరఖాస్తులు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా మరో 5,700 దరఖాస్తులు వచ్చాయి. కార్డుల జారీ, పేర్ల తొలగింపు, చేర్పులను సైతం చేపడుతున్నట్లు ప్రకటించినా.. పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఇందుకు పెద్దమొత్తంలో తప్పులు దొర్లడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏళ్ల తర్వాత కొత్త కార్డులు వస్తున్నాయన్న సంతోషం దరఖాస్తుదారుల్లో లేకుండా పోయింది. న్యూస్రీల్పోలీసు ప్రజావాణికి మూడు వినతులు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 3 వినతులు అందాయి. డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫోన్‌చేసి తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు న్యాయం అందుతుందనే భరోసా కల్పించేలా పోలీసు వ్యవస్థ పని చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ : డీఈఓ వనపర్తి విద్యావిభాగం: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాల్లో వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేల్లో బహిర్గతం కావడంతో ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఈ నెల 30 వరకు మండల, జిల్లాల పరిధిలో రిసోర్స్ పర్సనన్ల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఎన్సీఈఆర్టీకి జాబితా పంపుతామని.. రిసోర్స్ పర్సన్స్ ఎంపిక బాధ్యత కలెక్టర్, డీఈఓ, డైట్ అధ్యాపకులు, బీఎడ్ అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు చేపడతారని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతి సబ్జెక్టులో ఇద్దరు ఎస్జీటీలు, జిల్లాల పరిధిలో స్కూల్ అసిస్టెంట్లను రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెలలో శిక్షణ కొనసాగుతుందన్నారు. 27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలకు ఈ నెల 27న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉమాదేవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకు 5వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని.. సకాలంలో పరీక్షకు హాజరుకావాలని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 1,980 రేషన్‌కార్డులు మంజూరు కుటుంబసభ్యుల పేర్లు లేకుండానే మూడేళ్ల పాపకు కార్డు జారీ.. ఆందోళనలో లబ్ధిదారులు .. సరిచేస్తామంటున్న అధికారులు చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం కొత్త రేషన్‌కార్డు కోసం ఇదివరకు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకుంది. కుటుంబ యజమానికి అదే గ్రామంలో రేషన్‌కార్డు మంజూరు చేసి భార్య, ఇద్దరు పిల్లలకు అదే మండలంలోని అమ్మాయిపల్లిలో ఇతరుల రేషన్‌కార్డులో పేర్లు చేర్చారు. సదరు యజమాని తహసీల్దార్ కార్యాలయ అధికారులను సంప్రదించి సమస్యను వివరించగా.. సాంకేతిక సమస్యలతో పొరపాటుగా నమోదై ఉండవచ్చని, సరిచేస్తామని బదులిచ్చారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ బియ్యం కోటా విడుదలైంది. -
ఈదురు గాలుల వర్షం
వీపనగండ్ల: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన ఈదురు గాలుల వర్షానికి సుమారు వెయ్యి ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గోవర్ధనగిరిలో 100 ఎకరాలు, వీపనగండ్లలో 200, కల్వరాలలో 200, సంగినేనిపల్లిలో 150, తూంకుంటలో 100, రంగవరంలో 50 ఎకరాలతో పాటు వివిధ గ్రామాల్లో చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. ఈ విషయమై మండల ఉద్యాన అధికారి కృష్ణ మాట్లాడుతూ.. 560 ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని, 290 మంది రైతులు నష్టపోయారని 33 శాతం నష్టం వాటిల్లిన తోటలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. మామిడి రైతులకు నష్టం -
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్‌పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్‌సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ● టర్ఫ్ వికెట్ పిచ్‌పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్‌లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్‌పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్‌లో రాష్ట్రస్థాయి మ్యాచ్‌లతో పాటు రంజీ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. త్వరలో మూడు పిచ్‌లు అందుబాటులోకి.. మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లకు వేదిక కానున్న పాలమూరు -
సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొల్లాపూర్ రూరల్: జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలాని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశం మంత్రి పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది.. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుంది.. అప్రజాస్వామిక నిర్ణయాలు, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 కోట్ల నియోజకవర్గ నిధుల నుంచి రూ.2 కోట్లు గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి వెచ్చిస్తానని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రూ.లక్ష చొప్పున గ్రంథాలయాలకు కేటాయించామన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు తెలిపే పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించేందుకు ప్రయత్నంచిందని, ఇది సరికాదన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఈ లేబర్ కోడ్లు ఉపయోగపడతాయన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం విధానాన్ని ఎండగడతామన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అప్పగిస్తే సామాన్యుడికి రిజర్వేషన్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేవారు. దేశంలో ప్రజలను చైతన్యవంతులుగా చేసి మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే దాకా ప్రజా ఉద్యమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి పర్వతాలు, నాయకులు ఈశ్వర్, దశరథం, రామయ్య, సత్యం, బాలపీరు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
27న ప్రవేశ పరీక్ష
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 27న అర్హత పరీక్ష, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, అలాగే 7, 8, 9, 10 తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. సోమవారం నుంచి హాల్‌టికెట్లు ఆన్‌ౖలైన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభుత్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక వనపర్తి టౌన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలో ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్, ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కురుమూర్తిగౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు కె.జగదీశ్వర్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌రెడ్డి హాజరు కాగా.. ఎన్నికల అబ్జర్వర్‌గా నర్సింహులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా కుర్మయ్య, అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌గా పద్మజారెడ్డి, కోశాధికారిగా గోపాల్, ఉపాధ్యక్షులుగా దామోదర్, అశోక్, వెంకటయ్య, సురేష్, వెంకటేష్, సంయుక్త కార్యదర్శులుగా తిరుపతయ్య, చంద్రశేఖర్‌గౌడ్, కిషోర్, నాగరాజు, కమలాకర్, కార్య నిర్వాహక కార్యదర్శులుగా మద్దిలేటి, వెంకటరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని శాలువా, బొకేతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సభ్యుడు బాల రాజయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మె విరమణ అచ్చంపేట: అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట గత ఐదురోజులుగా అద్దె బస్సుల ప్రైవేట్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె ఆదివారం ముగిసింది. కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అద్దె బస్సుల యాజమాన్యం డ్రైవర్ల శ్రమ దోపిడీని అరికట్టాలని తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హయ్యర్ అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. సమ్మెతో దిగివచ్చిన యాజమాన్యాలు డ్రైవర్లకు గతం కంటే రూ.3 వేలు ఎక్కువ ఇచ్చేందుకు అంగీకరించారు. జీతాలు పెరగడంతో డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్‌నాయక్, అద్దె బస్సు ప్రైవేట్ డ్రైవర్ల నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అద్దె బస్సు యాజమాన్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించారని చెప్పారు. సమ్మె చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో ఆర్టీసీ డీఎం జోక్యం చేసుకొని యాజమాన్యాలతో చర్చలు జరపడం వల్ల వేతనాలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, శ్రీహరి, అనిల్, నాగరాజు, బాలయ్య, చంద్రయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
స్థాయికి మించి..
అన్నిరకాల వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలు ●అమరచింత: జిల్లాలో కొందరు అనుమతి లేని నర్సింగ్ హోంలు, ఇతరత్రా క్లినిక్‌లు కొనసాగిస్తున్నారు. బీఎంఎస్ చదివిన వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్‌గా అవతారం ఎత్తి స్థాయికి మించి వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. గైనిక్‌లు లేకున్నా ప్రసూతి కేంద్రాలు నిర్వహిస్తూ.. తల్లీబిడ్డల చావులకు కారణమవుతున్నారు. ఇటీవల ఆత్మకూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతిచెందిన సంఘటన తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే డీఎంహెచ్ఓ ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఓ నర్సింగ్‌హోంను సీజ్ చేశారు. అయితే జిల్లాలో ఈ చర్యలు పూర్తిస్థాయిలో అక్రమార్కులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అధునాతన వసతులతో.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వసతులతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మండల కేంద్రాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం ప్రభుత్వ ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో 156 రకాల మందులు సైతం అందుబాటులో ఉంచుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికంగానే అన్నిరకాల వైద్యం అందిస్తున్నారు. గ్రామాల్లోని ఆశా వర్కర్‌తోపాటు ఏఎన్ఎంలు సైతం తమ క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి వైద్యం అందించాలో అన్న విషయాలను ముందస్తుగానే గుర్తించి వారిని ఆస్పత్రులకు తీసుకెళ్తూ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలానికి.. మాతాశిశు సంరక్షణ్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. గర్భిణిగా ధ్రువీకరించినప్పటి నుంచి ప్రసూతి అయ్యే వరకు ఎప్పుడు ఎలాంటి వైద్య సేవలు అందించాలి అన్న విషయాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ.. స్కానింగ్ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లే సదుపాయం కల్పించారు. దీంతో అంగన్వాడీ టీచర్ నుంచి ఏరియా ఆశ వర్కర్, ఏఎన్ఎంలు గర్భిణికి అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నారు. కాన్పులకు ముందస్తుగా వైద్యుల సూచనలతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. నోటీసులు ఇచ్చాం.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే జిల్లాకేంద్రంతోపాటు పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింతలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాం. వీటిలో రెండు ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేశాం. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులకు సైతం సూచనలు చేశాం. – శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ జిల్లాలో యథేచ్ఛగా అనుమతి లేని ఆస్పత్రుల నిర్వహణ చదివింది బీఎంఎస్.. చేసేది ఎంబీబీఎస్ వైద్యం ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దందా పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్న అధికార యంత్రాంగం జిల్లాలోని 255 గ్రామాల్లో సుమారు 770 కిపైగా ఆర్ఎంపీ, పీఎంపీలు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరు కేవలం తమ వద్దకు వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి వైద్యం కావాలో గ్రహించి వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా వారే నేరుగా ఇంజెక్షన్లు, మాత్రలు ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో అంతకు మించి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ దందా సాగిస్తున్నారు. కొందరు ప్రభుత్వ వైద్యులు సైతం ప్రైవేట్‌గా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. -
చురుగ్గా సాగుతున్న పనులు..
ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతే డాది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు టర్ఫ్ వికెట్ కోసం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. మైదానంలో టర్ఫ్ వికెట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభిస్తుంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ● -
ఈదురుగాలుల బీభత్సం
గోపాల్పేట/ మదనాపురం: జిల్లాలో ఆదివారం ఈదురుగాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీచిన భారీ గాలి, అకాల వర్షానికి తీవ్రనష్టం వాటిల్లింది. గోపాల్‌పేటలోని కోదండరామస్వామి ఆలయం వద్ద ఆరబోసిన వడ్లు, వాటిపై కప్పిన కవర్లు గాల్లోకి ఎగిరిపోయాయి. చాకల్‌పల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల మధ్యలో పిడుగుపడి మండ్ల విశ్వనాథం, బోయ రాములుకు చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడగా.. ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. మృతిచెందిన గొర్రెల విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బుద్దారంలో చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడటంతో మూడు ముక్కలైంది. గోపాల్‌పేటలోని అంబేద్కర్ కాలనీలో హైమాస్ట్ లైట్ల పోల్ ఒరిగిపోయింది. మామిడి కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. మదనాపురం మండల కేంద్రంలోని కొత్తకోట రహదారిలో చెట్టు విరిగిపడి కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ముందు షెడ్డు కూలిపడింది. దుప్పల్లిలో సోలార్ విద్యుత్ లైట్ కిందపడింది. పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో అకాల వర్షానికి వరిధాన్యం తడిసిముద్దయ్యింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు గోపాల్పేట మండలంలో పిడుగుపడి 25 గొర్రెలు మృతి -
‘ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’
పాన్‌గల్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ అన్నారు. ఆదివారం మండలంలోని దావాజిపల్లి, మాందాపూర్, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్–ఏలో 156 మంది విద్యార్థులకు గాను 133 మంది హాజరవగా 23 మంది గైర్హాజరయ్యారు. అలాగే సెంటర్–బీలో 192కి గాను 170 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరు, జెడ్పీహెచ్ఎస్ బాలుర కేంద్రంలో 223 మందికి విద్యార్థులకు 205 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారని, జూనియర్ కళాశాలలో 229 మందికి గాను 203 మంది హాజరు కాగా 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. రంగనాథాలయంలో న్యాయమూర్తి పూజలు వనపర్తి రూరల్: జిల్లాలోని శ్రీరంగాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి రాజగోపాల్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాముఖ్యతను వివరించి ప్రత్యేక అర్చన చేశారు. తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు అందించారు. -
పంటలకు నీటిని విడుదల చేయలేం
వనపర్తి: జూరాల జలాశయంలో నీటిమట్టం పడిపోయినందున తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కొంత నీటిని జలాశయానికి వదిలేలా చూడాలని రాష్ట్ర మంత్రులను కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వరి ధాన్యం కొనుగోలు, సన్నరకం బియ్యం పంపిణీ, తాగునీటి సరఫరాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సీఎంఆర్ చెల్లింపుల్లో నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి మిల్లర్ల నుంచి 72 శాతం, ఈ ఏడాది వానాకాలం సీజన్లో సైతం 50 శాతం వసూలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 19 మిల్లులతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, పౌర సరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఇరిగేషన్ అధికారులు, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి తదితరులు పాల్గొన్నారు. -
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు శనివారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. 4,579 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.1,521 ధరలు లభించాయి. వేరుశ నగ గరిష్టంగా రూ.6, 100, కనిష్టంగా రూ.4,816, పెబ్బర్లు గరిష్టంగా రూ.4, 957, కనిష్టంగా రూ.4,617, రాగులు గరిష్టంగా రూ.2, 611, కనిష్టంగా రూ.2,511, జొన్నలు రూ.3,907, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,969, కనిష్టంగా రూ.1,806, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,80 6, ఆముదాలు గరిష్టంగా రూ.6,278, కనిష్టంగా రూ.5,62 9, పత్తి రూ.5,389, శనగలు రూ.5,250 ధరలు లభించాయి. దేవరకద్ర లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2, 209, కనిష్టంగా రూ.1,701, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,639గా, ఆముదాలు గరిష్టంగా రూ.5,981గా ఒకే ధర వచ్చింది. -
అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహ యోగానందస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా యాదిరెడ్డిపల్లికి చెందిన అఖిలేష్‌రెడ్డి వృషభాలు ప్రథమస్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూ.40 వేల నగదు నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు రెండో స్థానంలో నిలవగా రూ.30 వేలు, మూడోస్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా కొప్పోల్ సత్యనారాయణ ఎద్దులకు రూ.20 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన పెబ్బేరు ఎం.బాలరాజు ఎద్దులకు రూ.15 వేలు, ఐదోస్థానంలో నిలిచిన పాన్‌గల్ మండలం దావాజిపల్లికి చెందిన ఉనిద్యాల విష్ణు ఎద్దులకు రూ.10 వేలు, ఆరోస్థానంలోని పెబ్బేర్ మండలం గుమ్మడం గ్రామానికి చెందిన నీతుల నరసింహనాయుడు ఎద్దులకు రూ.5 వేల నగదు అందజేశారు. పోటీలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు రవీందర్‌రెడ్డి, క్యామ వెంకటయ్య, వెంకటేశ్వర్రావు, సాయిచరణ్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, క్యామ రాజు, శేఖర్‌రెడ్డి, ఆగారం ప్రకాష్, రవినాయక్, బాల్‌రెడ్డి, రమేష్‌గౌడ్, ఖలీల్, వివిధ గ్రామాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. రామన్‌పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 270 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 34 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
రేపటి ప్రజావాణి రద్దు
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి 26 వరకు జిల్లా అధికారులు భూ భారతి–2025 చట్టంపై మండలాల్లో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు ఎవరూ రావద్దని కోరారు. నర్సింగ్‌హోం సీజ్ ఆత్మకూర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్థాయికి మించిన వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని శ్రీసాయినర్సింగ్హోంను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అమరచింత మండలం చంద్రగఢ్‌కు చెందిన గర్భిణి ప్రసవానికి వస్తే అనెస్తేషియా వైద్యుడు లేకుండానే శస్త్రచికిత్స చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించినట్లు వివరించారు. దీంతో తల్లి క్షేమంగా ఉన్నప్పటికీ శిశువు మృతిచెందిందని, కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నర్సింగ్‌హోంను సీజ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్‌రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్‌కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
తాలు పేరిట తరుగు.. రోడ్డెక్కిన అన్నదాత
వనపర్తి రూరల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోగా.. చేతికందిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా తేమశాతం, తాలు పేరిట కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కోత విధిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 17న కిష్టగిరిలోని కేంద్రంలో 721 బస్తాల వరి ధాన్యం తూకం చేసి లారీలో శ్రీరంగాపురం మండలం శేరుపల్లి వద్ద ఉన్న సప్తగిరి రైస్‌మిల్లుకు తరలించారు. అక్కడ మిల్లర్లు ధాన్యంలో తాలు ఉందని.. బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే దించుకుంటామని రైతులకు చెప్పగా వారు అందుకు అంగీకరించలేదు. దీంతో లారీలోని ధాన్యాన్ని దించకుండా నిలిపివేశారు. తాలు పేరిట మోసం చేస్తున్నారంటూ శనివారం ఉదయం పెద్దగూడెంతండా, కిష్టగిరి రైతులు వనపర్తి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఎస్ఐ పౌరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌తో మాట్లాడి అక్కడికి పిలిపించారు. 10 రోజల కిందట ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు తాలు పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆయనకు వివరించారు. అలాగే కిష్టగిరి రైతులు సప్తగిరి రైస్‌మిల్లు యాజమాన్యం ధాన్యం దించుకోవడం లేదని తెలుపడంతో జిల్లా పౌరసరఫరాల అధికారి మిల్లరుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ● రైతులు తేమశాతం, తాలు చూసుకొని ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరుగు తీస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. కావాలని ఎవరైనా కోత విధిస్తే చర్యలు తీసుకుంటాం. – కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ● నేను 82 బస్తాల ధాన్యం విక్రయించగా.. తాలు పేరిట 4 బస్తాల తరుగు తీస్తామని మిల్లరు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమశాతం, తా లు చూసే కొనుగోలు చేశారు. ఇప్పుడు త రుగు విధిస్తామంటే ఎలా ఒప్పుకుంటాం. – కృష్ణా, రైతు, కిష్టగిరి ● నేను 215 బస్తాల ధాన్యాన్ని విక్రయించగా.. శ్రీరంగాపురం మండలం శేరుపల్లి వద్ద ఉన్న సప్తగిరి రైస్‌మిల్లుకు తరలించారు. అక్కడ తాలు పేరిట 14 బస్తాల ధాన్యం తరుగు ఇస్తే అన్లోడ్ చేసుకుంటామని చెప్పారు. అంత ధాన్యం పోతే మాకేం మిగులుతుంది. – కుర్మయ్య, రైతు, కిష్టగిరి ● రైతులతో మాట్లాడిన జిల్లా పౌరఫరాలశాఖ అధికారి, ఎస్ఐ అధికారుల హామీతో శాంతించిన రైతులు -
పేదవాడి చుట్టంలా ’భూ భారతి’
నాగర్‌కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయానికి హెలికాప్టర్లో చేరుకోగా ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు గుర్తించి పేదల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రూపొందించిన భూ భారతి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరకు పైరవీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పోర్టల్‌లో అన్ని ఆప్షన్లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ బదావత్ సంతోష్ భూ భారతి చట్టం గురించి వివరిస్తూ కొత్త ఆర్వోఆర్ చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతులు సమగ్ర వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, భూ సమస్యలు లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని వివరించారు. సదస్సుకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఆధార్‌లాగే త్వరలోనే భూధార్ నంబర్ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం
అమరచింత: ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి అనేక పథకాలు అమలు చేస్తోందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రూ.3.44 కోట్లతో చేపట్టే మండలంలోని ధర్మాపురం, నందిమళ్ల బీటీ రహదారి పనులకు శనివారం ఆయన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ పనులు త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిదంగా నందిమళ్ల క్రాస్‌రోడ్డు నుంచి మిట్టనందిమళ్ల వరకు ఉన్న రహదారిని బీటీగా మార్చేందుకు రూ.4.44 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహదారుల గురించి పట్టించుకోకపోవడంతో ఆధ్వానంగా మారాయని.. సీఎం రేవంత్‌రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని, రహదారులు, తాగునీటి వ్యవస్థ, వైద్యం, విద్యపై ప్రత్యే దృష్టి సారించి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఈర్లదిన్నెలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే తాను ఈరోజు ఎమ్మెల్యేగా మీముందు ఉన్నానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు రూపొందించారని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చుకుంటామని ప్రకటనలు చేస్తోందని.. భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని దేశ, విదేశాల ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. పీఆర్ ప్రవీణ్, ఏఈ నరేష్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ చెన్నమ్మ, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట అధ్య క్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, ఆశిరెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్‌నాల్, ఎర్గోల, మినాస్‌పూర్ బ్లాక్‌లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్‌పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ●