సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
● రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన స్కీమ్ వర్కర్లు ● బైఠాయింపుతో నిలిచిన ట్రాఫిక్ ● సబ్ కలెక్టర్ కల్పశ్రీ హామీతో విరమణ
రంపచోడవరం: అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్కూల్ శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ ఎదుట కార్మికులు బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఐటీడీఏ వద్దకు వచ్చారు. వారి డిమాండ్లపై సంఘ ప్రతినిధులతో చర్చించారు. తమ సమస్యలపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, కార్యదర్శి వెంకట్ తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె.శాంతిరాజు, అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి నిర్మల, రామకృక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment