Movies
-
సందడిగా ఊరే కలిసేనయ్యా...
అజిత్(Ajith Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’(Vidaamuyarchi). త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెజీనా, అర్జున్, ఆరవ్, నిఖిల్ నాయర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా ‘పట్టుదల’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ‘సవదీక...’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘సందడిగా ఊరే కలిసేనయ్యా... విడి విడిగా తిరిగే రెండు ఎదలు ఫ్యామిలీగా ఒక్కటయ్యాయయ్యా..’ అన్న లిరిక్స్‌తో ఈ పాట తెలుగు వెర్షన్ సాగుతుంది. ఈ పాటకు శ్రీ సాయికిరణ్ సంగీతం అందించారు. ఆంటోనీతో కలిసి ఈ చిత్రం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడారు. -
యాక్షన్ థ్రిల్లర్ కి సై
నెగటివ్ రోల్స్‌తో దూసుకెళుతూ, పాజిటివ్ క్యారెక్టర్స్‌లోనూ భేష్ అనిపించుకున్నారు వరలక్షీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). కథ నచ్చినప్పుడుల్లా కథానాయికప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా చేస్తుంటారామె. తాజాగా ఆ తరహా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకి ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి(Sanjeev Megoti) దర్శకత్వం వహించనున్నారు.‘‘సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథకి వరలక్ష్మి ఓకే చెప్పారు. ఈ మూవీలో ఆమె మెయిన్ లీడ్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోనున్నాం. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
గ్రీన్ సిగ్నల్?
రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’ మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ నెక్ట్స్ మూవీకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ‘మ్యాడ్’ చిత్రంతో దర్శకునిగా హిట్ సాధించి, ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ని డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించారట.స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. దీంతో స్క్రిప్ట్‌పై మరింత ఫోకస్ పెట్టారట కల్యాణ్ శంకర్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని, అన్నీ కుదిరితే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని రవితేజ అండ్ టీమ్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారని సమాచారం. -
'కార్తికేయుడి'గా అల్లు అర్జున్.. కొత్త సినిమా కథ ఇదే
‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. కాగా ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా ఇది. ఈప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటివరకు చేసిన పాత్రలకి పూర్తి వైవిధ్యంగా కార్తికేయ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
బీచ్‌లో అనన్య నాగళ్ల చిల్.. స్టన్నింగ్ లుక్‌లో సలార్ నటి!
బీచ్‌లో అనన్య నాగళ్ల చిల్..స్టన్నింగ్ లుక్‌లో సలార్ నటి శ్రియా రెడ్డి..పింక్ డ్రెస్‌లో సింగర్ మధు ప్రియ పోజులు..బ్లూ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ క్రేజీ అవుట్‌ఫిట్..లేటేస్ట్ పిక్ షేర్ చేసిన మిహికా బజాజ్.. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
ప్రాణాలతో చెలగాటమాడే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సీజన్-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరో సీజన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.Press ⭕ for the final round.Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f— Netflix India (@NetflixIndia) January 30, 2025 -
ప్రముఖ బుల్లితెర నటి ఇంటి కిచెన్ లో ప్రమాదం
బుల్లితెర జంట ఇంద్రనీల్ (Indraneil)-మేఘన (Meghana)కు పెద్ద ప్రమాదమే తప్పింది. వారి ఇంట్లో గ్యాస్‌స్టవ్ పేలింది. ఆ ఘటన జరిగిన సమయంలో కిచెన్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడు గురించి మేఘన మాట్లాడుతూ.. నేను స్టవ్‌పై ఒక ఆమ్లెట్ వేసుకుని హాల్లో కూర్చున్నాను. ఇంతలో సడన్‌గా కరెంట్ రావడంతో టప్మని ఏదో బ్లాస్ట్ అయినట్లు శబ్ధం వచ్చింది. నా కళ్ల ముందే..ఏసీ పేలిందేమోనని అన్ని గదుల్లోకి వెళ్లి చూశా.. ఎక్కడా ఏం కనిపించలేదు. కిచెన్‌కు వచ్చేసరికి గ్లాస్ స్టవ్ నా కళ్లముందే ఇంకా పగులుతోంది. మూడేళ్లకిందటే ఈ స్టవ్ తీసుకున్నాను. అంతలోనే ఇలా జరిగింది. నా ఒక్కరికే కాదు చాలామందికి ఇలాంటి సమస్య ఎదురైంది. ఒకరింట్లోనైతే వారి తల్లి వంట చేస్తుండగా ఆ స్టవ్ పేలి ఆ గాజుముక్కలు తన ముఖానికి గుచ్చుకున్నాయంట! ఇంద్రనీల్- మేఘన ఇంట్లో పేలిన గ్యాస్‌స్టవ్ ఫోటోలనా కెరీర్ ఏం కావాలి?నేను ఆర్టిస్ట్‌ను. స్టవ్ పేలేసమయంలో నేనూ అక్కడే ఉండుంటే ఆ ముక్కలు నా ముఖానికి గుచ్చుకుంటే నా పరిస్థితేంటి? నా కెరీర్ ఏం కావాలి? ఇది చిన్న ప్రమాదం కాదు. దీనిపై కచ్చితంగా కోర్టుకెళ్తాం. గ్లాస్ స్టవ్ వాడాలంటేనే భయంగా ఉంది. అందుకే ఇకపై స్టీల్ స్టవ్ వాడతాను. దయచేసి వంటింట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి అని మేఘన సూచించింది. కాగా వీరిద్దరూ చక్రవాకం సీరియల్లో నటించారు.చదవండి: ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్ -
మహేశ్ బాబు, నేను కలిసి క్వశ్చన్ పేపర్ కొనేవాళ్లం: టాలీవుడ్ డైరెక్టర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్‌మేట్ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్‌మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నేను, #MaheshBabu డబ్బులిచ్చి QUESTION PAPER కొనేవాళ్ళం 😂 - Director #VishnuVardhan#Premisthava #TeluguFilmNagar pic.twitter.com/cq5gNxJovt— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2025 -
బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ట్విటర్ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్‌లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్ ఈ ట్విటర్ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్ట్‌లపై ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా.. స్వర భాస్కర్ విషయానికొస్తే సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
దర్శకుడి ఆలోచనని దృశ్యరూపం అందించడమే లక్ష్యం
ఒక మనిషి ఆలోచనతో మొదలై ఎన్నో అద్భుతాలును సృష్టించేదే సినిమా. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో వైవిధ్యమయిన కథ కథనాలతో ప్రేక్షకుల మనసును మెప్పించడానికి దర్శకుల ప్రతిభతో పాటు ప్రతి సన్నివేషాన్ని కథకు అనుగుణంగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా చిత్రీకరించటంలో సినిమాటోగ్రఫర్ పాత్ర చాల ప్రధానమైనది. ప్రతి సన్నివేశాన్ని సగటు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా తనకంటూ వున్న శైలితో నవతరాన్ని ఆకట్టుకుంటున్న నేటితరం సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి( Kushendar Ramesh Reddy).హైదరాబాద్ లో పుట్టిపెరిగిన మన తెలుగోడే ఈ కుశేందర్ రమేష్ రెడ్డి. చిన్నతనం నుంచే ఫోటోగ్రఫీ పట్ల గొప్ప ఆసక్తి కలిగిన కుశేందర్ ఇప్పుడు బారీ సినిమాలకు డిఓపి గా పని చేస్తూ అటు ప్రేక్షకుల ఇటు విశ్లేషకుల మన్ననలు పొందుతున్నారు. స్కూల్ డేస్ నుండి తనకి ఫోటోగ్రఫీ పైన ఆసక్తి !ఒక కెమెరా కొనుక్కునేలా చేసింది, తన కెమెరాలో బంధించిన ఫోటోలకు పలువురి ప్రశంసలు కురిపించేలా చేసింది. ఆ ఆసక్తితో చిన్న కెమెరా పట్టుకున్న చేతులు ఇష్టంతో పెద్ద కెమెరా పట్టుకునే స్థాయికి వెళ్లి ఫోటోగ్రఫీ తన ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. కేకే సెంథిల్ దగ్గర 'ఈగ' ,'బాహుబలి 1','బాహుబలి 2' అలాగే 'ఆర్ఆర్ఆర్' కి చీఫ్ అసోసియేట్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ సెకండ్ కెమెరాకి ఆపరేటర్ గా కూడా పనిచేసే స్థాయికి ఎదిగి భారీ సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు.ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ఒక భారీ టీవీ సిరీస్ తో పాటు ఆడ్ ఫిలిమ్స్ కూడా చేశారు . 2022 లో కీరవాణి గారి అబ్బాయి శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన 'బాగ్ సాలే' మూవీతో తన కెరీర్ ని మొదలుపెట్టి ,రీసెంట్ గ వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' తో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.చరిత్ర చీకటిలో కప్పబడిన ఒక కన్నీటి గాధని 'రజాకార్'(Razakar) సినిమా గా మలిచిన దర్శకుడు యాటా గారి ఆలోచనని దృశ్యకావ్యంగా మలిచే క్రమంలో ప్రతి సన్నివేశం మన కళ్ళముందే జరుగుతున్నట్టుగా, అప్పటి చరిత్ర ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా తన సినిమాటోగ్రఫీతో అందరి కళ్ళు చెమర్చేలా తన విజువల్స్ మాట్లాడుతున్నాయని ప్రేక్షకులు చెప్పుకునే స్థాయికి ఎదిగారు.ప్రస్తుతం గ్లిమ్ప్స్ మరియు టీజర్ తో మంచి బజ్ అందుకున్న వానర సెల్యూలాయిడ్ , డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న 'బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా SSS ప్రొడక్షన్ హౌస్ చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రానికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుని తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని, తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని ఉందని మీడియాతో చెప్పుకొచ్చారు. -
మోనాలిసా బాలీవుడ్ ఎంట్రీ.. ఇంటికెళ్లి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్
యూపీలో జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళా ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె వీడియో పెద్దఎత్తున వైరల్ కావడంతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఇంకేముంది ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడా చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.మహాకుంభ్ మేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్‌లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసి ఫోటో కూడా బయటకొచ్చింది.అంతేకాదు.. మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది తేనేకళ్ల సుందరిని బిగ్ స్క్రీన్‌పై చూసే ఛాన్స్ కూడా త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఇవాళ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.ఊహించని విధంగా ఫేమ్..మహాకుంభ్ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌కు పంపించేశారు.దర్శకుడు సనోజ్ మిశ్రా మాటాడుతూ..' తన రాబోయే చిత్రం "ది డైరీ ఆఫ్ మణిపూర్" కోసం మోనాలిసాను ఎంచుకున్నా. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారు. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై నా సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్లి కలిశా. ఆమె నా సినిమాలో నటించేందుకు అంగీకరించారు. తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయం నాకు తెలుసు. అదే నేను సవాల్‌గా తీసుకున్నా. మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తా. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమా ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పని చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా' అని అన్నారు.సనోజ్ మిశ్రా ఎవరు?లక్నో నివాసి అయిన సనోజ్ మిశ్రా రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సనోజ్ ఇప్పటివరకు 15 సినిమాలు తీశారు. 2023లో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే చిత్రాన్ని రూపొందించి ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపించారు. -
ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సలార్ సినిమాతో తెలుగులోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాది ద గోట్ లైఫ్ (ఆడుజీవితం), గురువాయూర్ అంబలనడయిల్ చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. SSMB29 (మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో) సినిమాలోనూ పృథ్వీరాజ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్-రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్?తాజాగా దీనిపై పృథ్వీరాజ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి నాకంటే ఎక్కువ మీ అందరికే బాగా తెలిసినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇంకా ఏదీ ఫైనలవలేదు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అంతా ఫిక్సయ్యాక అప్పుడు చూద్దాం.. అన్నాడు. సలార్ 2 (Salaar 2 Movie) గురించి మాట్లాడుతూ.. సలార్ సీక్వెల్ ఉందని మాత్రమే నేను చెప్పగలను. ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. అది అయిపోయిన వెంటనే సలార్ 2 మొదలుపెడ్తాం.ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలిప్రభాస్ (Prabhas) గురించి చెప్పాలంటే తన స్టార్డమ్ తనకు తెలియదు. ఆయన సోషల్ మీడియాలో లేడనుకుంటాను. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని అతడు మాత్రం హ్యాండిల్ చేయడు. సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు. పబ్లిక్‌లో ఉండటానికి బదులు ప్రైవేట్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడు. అది నిజంగా గ్రేట్. ఇది ప్రభాస్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, సింగర్ కూడా! లూసిఫర్, బ్రో డాడీ చిత్రాలకు ఈయనే దర్శకత్వం వహించాడు. మలయాళంలో పలు పాటలు ఆలపించాడు.చదవండి: ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి -
అభిషేక్ బచ్చన్ మూవీతో ఏం చేయాలో దిక్కుతోచలేదు: డైరెక్టర్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గతేడాది ఐ వ్యాంట్ టూ టాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు సుజిత్ సిర్కార్ ఈ మూవీ పరాజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా ఫలితం తనకు దిక్కుతోచని పరిస్థితి తీసుకెళ్లిందని అన్నారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ థియేటర్లలో విఫలం కావడం తనను బాధించిందని సుజిత్ సిర్కార్ తెలిపారు.డైరెక్టర్ సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ.. "నా నిబంధనల ప్రకారం.. నాకు ఉన్న దృష్టితో నేను సినిమాలు తీయగలిగినంత కాలం తీస్తూనే ఉంటా. ఇలాంటి పరాజయాలు కొన్నిసార్లు మమ్మల్ని కలవరపెడుతూనే ఉంటాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఏం చేయాలో? ఏం చేయకూడదో? అనే విషయం తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. ఈ సినిమా ఫలితం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు నా సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలో చాలామంది ఆడియన్స్ స్పందించడం సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి చిత్రమనే నేను అనుకుంటున్నా.' అని అన్నారు.కాగా.. సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రోనీ లాహిరి, షీల్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ఓ ఎన్నారై పాత్రలో కనిపించారు. జీవితాన్ని మార్చే ఓ సర్జరీ చేయించుకోవడానికి తనను తాను సిద్ధం చేసుకునే ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం ఏకంగా బరువు కూడా పెరిగాడు. విభిన్నమైన పొట్టతో అభిషేక్ బచ్చన్ ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, జయంత్ క్రిప్లానీ, జానీ లీవర్, పెర్లే డే, క్రిస్టిన్ గొడ్దార్డ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఐ వాంట్ టూ టాక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్ రోషన్ తండ్రి
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు.. తర్వాత విడాకులు తీసుకున్నవారు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)- సుజానే (Sussanne Khan) దంపతులు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందే హృతిక్ సుహానేను ప్రేమించాడు. 2000వ సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఈ దంపతులకు హ్రెహాన్, హృదాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. విడాకుల తర్వాత స్నేహితులుగా..తర్వాత ఏమైందే ఏమో కానీ 2014లో హృతిక్- సుజానే విడిపోయారు. అలా అని శత్రువులుగా మిగిలిపోకుండా మంచి మిత్రులుగా తమ మధ్య అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉండగా సుజానే.. అర్స్‌లన్ గోనీతో లవ్‌లో ఉంది. ఈ రెండు ప్రేమ జంటలు తరచూ షికార్లకు, డిన్నర్ డేటింగ్‌కు వెళ్తూ మీడియాకు చిక్కుతూ ఉంటారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్- సుజానే విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నది చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. (చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా)విడిపోయినంత మాత్రాన..తాజాగా దీనిపై హృతిక్ తండ్రి, దర్శకనిర్మాత, నటుడు రాకేశ్ రోషన్ (Rakesh Roshan) స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. జరిగిందేదో జరిగిపోయింది. విడిపోయినంత మాత్రాన సుజానే మాకు ఏమీ కాకుండా పోదు. ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్లిద్దరు! అభిప్రాయభేదాలు వచ్చిందీ వారిమధ్యే! అప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సిందీ వారిద్దరే! ఏదేమైనా తను ఇప్పటికీ మా ఇంటికి వస్తూ ఉంటుంది. తనను మా కుటుంబసభ్యురాలిగానే భావిస్తాం అని చెప్పాడు.నేనంటే భయంకుమారుడు హృతిక్, కూతురు సునయన గురించి చెప్తూ.. వీళ్లిద్దరికీ నేనంటే భయం. అదెందుకో నాకు తెలియదు. ఎవరిమీద పడితే వాళ్లపై అరిచేవాడినీ కాదు, అనవసరంగా తిట్టేవాడినసలే కాదు. కాకపోతే క్రమశిక్షణగా ఉంటాను. చిన్నప్పుడు ఈ పిల్లలిద్దరూ నాతో నిర్భయంగా మాట్లాడేవారే కాదు. కానీ ఇప్పుడు సరదాగా ఉంటారు. అందరం ఫ్రెండ్స్‌లా కలిసిపోయి మాట్లాడుకుంటాం అని చెప్పుకొచ్చాడు. రాకేశ్ రోషన్ ఫ్యామిలీపై ఇటీవల ద రోషన్స్ అని డాక్యుమెంటరీ రిలీజైంది. ఇకపోతే రాకేశ్ గతంలో గొంతు క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు.చదవండి: 300 కోట్ల బడ్జెట్.. హీరోగా సూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు! -
‘తండేల్’ సెన్సార్ టాక్.. బొమ్మ అదిరిందట!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్‌కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ బస్టర్ పక్కా!సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.నిడివి ఎంతంటే.. తండేల్ సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్ చేసేలా సీన్స్ ఉంటాయట. యాడ్స్‌తో కలిసి 2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.తండేల్ కథేంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
'హాయ్ నాన్న' కాపీ సినిమా.. నాని ఇంత చీపా?: కన్నడ నిర్మాత
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా (Hi Nanna Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య (Pushkara Mallikarjunaiah) సంచలన ఆరోపణలు చేశాడు. తన సినిమా కథను దొంగిలించారని ఆరోపించాడు. తాను తెరకెక్కించిన భీమసేన నలమహారాజ మూవీ ఒరిజినల్ స్టోరీ అని.. తమ అనుమతి లేకుండా హాయ్ నాన్న పేరిట తెలుగులో రీమేక్ చేశారని మండిపడ్డాడు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావనుకోలేదంటూ హీరో నానిని ట్యాగ్ చేశాడు. దీంతో హాయ్ నాన్న సినిమా టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఒరిజినల్ కథ అని నమ్మించారు, తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేట్లు చేస్తున్నారు కదా.. తిట్టిపోస్తున్నారు.భీమసేన మూవీ ఎప్పుడొచ్చింది?భీమసేన నలమహారాజ సినిమా (Bheemasena Nalamaharaja Movie) విషయానికి వస్తే ఇది కన్నడ చిత్రం. కార్తీక్ సరగుర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణ్, ప్రియాంక, ఆద్య, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2020 అక్టోబర్‌లో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ మూవీని హీరో రక్షిత్ శెట్టితో పాటు పుష్కర మల్లికార్జునయ్య, హేమంత్ ఎమ్ రావు నిర్మించారు. మల్లికార్జునయ్య.. కిరిక్ పార్టీ, గోధీ బన్నా సాధారణ మైకట్టు, హంబుల్ పొలిటీషియన్ నోగరాజ్, జీరిజింబె, అవతార పురుష, 10 వంటి పలు చిత్రాలను నిర్మించాడు.చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా -
కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్‌ఫ్లవర్ సింబల్‌ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్)కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్‌హౌస్‌లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్‌స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌కు ఇన్‌స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా..
హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta-kulkarni) సన్యాసం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఇదే బాటలో హీరోయిన్ నిఖిలా విమల్ సోదరి అఖిలా విమల్ (Akhila Vimal) అడుగులు వేసింది. ప్రస్తుతం మహాకుంభమేళాలో ఉన్న ఆమె సన్యాసం (Sanyas) తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె గురువు అభినవ్ బాలనందభైరవ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జూనా పీఠాదీశ్వరులు, అచార్య మహా మండలేశ్వర్ స్వామి అవధేశానంద గిరి మహారాజ్ సమక్షంలో అఖిల సన్యాసం స్వీకరించింది. ఇక మీదట తన పేరు అవంతిక భారతి అని వెల్లడించారు.కొద్ది రోజుల క్రితమే హింట్..కొద్ది రోజుల క్రితం అఖిల కాషాయ వస్త్రాలు ధరించి భక్తిమైకంలో మునిగి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది చూసిన జనాలు.. తను ఏం చేయబోతుంది? సన్యాసం తీసుకుంటుందా? ఏంటి? అని అనుమానించారు. అందరూ ఊహించినట్లుగానే సాధ్విగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలోనే మిగిలిన జీవితం గడపనుంది. అఖిల.. హీరోయిన్ నిఖిలా విమల్‌కు స్వయానా అక్క. చిన్న వయసులోనే నిఖిల సినిమాల్లో ఎంట్రీ ఇవ్వగా.. అఖిల మాత్రం పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టింది. ఉన్నత చదువులు.. సడన్‌గా సన్యాసంఅమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో థియేటర్ అండ్ పర్ఫామెన్స్ సబ్జెక్ట్‌పై రీసెర్చ్ చేసింది. ఉన్నత విద్యనభ్యసించిన ఆమె సడన్‌గా భక్తి మార్గం పట్టడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. నిఖిల (Nikhila Vimal) విషయానికి వస్తే.. మలయాళంలో పొర్ తొళిల్, అంజూమ్ పాతిరా, తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి సినిమాలు చేసింది. రీసెంట్గా గురువాయూర్ అంబలనాడయిల్, నునక్కుళి చిత్రాల్లో మెప్పించింది.(చదవండి: హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!)సన్యాసం తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవలే సన్యాసం తీసుకుంది. ఈమె 1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్‌తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.డ్రగ్స్ కేసులో మమత పేరుఆ మధ్య రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో మమతా పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాక కెన్యాలోనూ ఓ డ్రగ్స్ కేసులో అరెస్టయింది. చాలాకాలంగా కెన్యాలోనే నివసిస్తున్న ఆమె దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. కారణం ఏమై ఉంటుందో?ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. అయితే ఆమె సాధ్విగా మారడంపై విమర్శలు కూడా వచ్చాయి. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన నటి సడన్‌గా సన్యాసిగా మారిపోవడం వెనుక కారణమేంటని ట్రాన్స్‌జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.చదవండి: మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్ -
దయచేసి సినిమాల్లోకి రాకండి.. విశాల్ కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితి బాగోలేదని..సినిమాలు నిర్మించి డబ్బును వృథా చేయకండి అని కోరారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన ఇలాంటి మాటలు చెబితే తనను విలన్‌గానే చూస్తారని.. అయినా కూడా తాను చెప్పేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల గురించి గతంలోనే నేను మాట్లాడాను. పరిస్థితి బాగోలేదని చెబితే అందరూ నన్ను విలన్లా చూశారు. కానీ నేను చెప్పిందే వాస్తవం. ఒక చిన్న సినిమా తెరకెక్కించాలన్న కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దయచేసి ఆ డబ్బుని మీ పిల్లల పేరుపై పిక్స్డ్ డిపాజిట్ చేయండి. లేదా భూములు కొనండి. అంతేకాని సినిమా రంగంలో పెట్టి నష్టపోకండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితుల ఏం బాగోలేవు. డబ్బులు ఉన్నవారు ఎవరైనా సినిమాలు చేయ్యొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వారి వద్ద అంత డబ్బు ఉంది. కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు’ అని విశాల్ అన్నారు. కాగా, గతేడాది కోలీవుడ్ భారీగా నష్టాలను చవి చూసింది. ఏడాది మొత్తంలో 240 వరకు సినిమాలు నిర్మిస్తే..వాటిల్లో కేవలం 18 మాత్రమే విజయం సాధించాయి. మొత్తంగా దాదాపు రూ. 1000 కోట్ల నష్టపోయినట్లు తెలుస్తోంది.మొక్కు చెల్లించిన విశాల్..12 ఏళ్ల క్రితం విశాల్ హీరోగా నటించిన ‘మదగజరాజా'(Madha Gaja Raja) చిత్రం తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత విశాల్ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. దీంతో బుధవారం విశాల్ చెన్నైలోని కపలీశ్వరర్ టెంపుల్ సందర్శించి మొక్కులు చెల్లించాడు. సినిమా విజయం సాధిస్తే టెంపుల్‌కి వస్తానని మొక్కుకున్నానని.. అనుకున్నట్లే మూవీ హిట్ కావడంతో మొక్కులు చెలించానని విశాల్ చెప్పారు.సుందర్ సి దర్శకతవం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. -
హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్ చేసిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్ సాధించింది. ఈ మూవీలో తమన్.. మ్యూజికల్ బ్యాండ్‌లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్ మజ్ను, బేబీ జాన్ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)సంగీత దర్శకుడిగా..తమన్ తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పని చేశాడు. బాయ్స్ మూవీలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్‌కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్. కిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేశాడు.చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు -
మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వైరల్ అయిన 'మోనాలిసా'(16) గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేయంతో ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. చాలామంది ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని ఎగబడ్డారు కూడా.. అయితే తాజాగా మోనాలిసా గురించి కంగనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.'కుంభమేళాలో మోనాలిసాతో చాలామంది ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంతమాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేము. మన చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపై కూడా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా..? బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన దీపికా పడుకోణె, కాజోల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా..? మోనాలిసాను భారీగా వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపై కూడా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా..? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి.' అని ఆమె పోస్ట్ చేశారు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీనే కంగనానే దర్శకత్వం వహించింది. మాధవన్‌తో కలిసి ఆమె మరో రెండు చిత్రాలలో నటిస్తుంది.సొంతూరు వెళ్లిపోయిన మోనాలిసామధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. -
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ.. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్కి కేరాఫ్ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Gopi Sundar Official (@gopisundar__official)