Movies
-
దయచేసి సినిమాల్లోకి రాకండి.. విశాల్ కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితి బాగోలేదని..సినిమాలు నిర్మించి డబ్బును వృథా చేయకండి అని కోరారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన ఇలాంటి మాటలు చెబితే తనను విలన్‌గానే చూస్తారని.. అయినా కూడా తాను చెప్పేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల గురించి గతంలోనే నేను మాట్లాడాను. పరిస్థితి బాగోలేదని చెబితే అందరూ నన్ను విలన్లా చూశారు. కానీ నేను చెప్పిందే వాస్తవం. ఒక చిన్న సినిమా తెరకెక్కించాలన్న కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దయచేసి ఆ డబ్బుని మీ పిల్లల పేరుపై పిక్స్డ్ డిపాజిట్ చేయండి. లేదా భూములు కొనండి. అంతేకాని సినిమా రంగంలో పెట్టి నష్టపోకండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితుల ఏం బాగోలేవు. డబ్బులు ఉన్నవారు ఎవరైనా సినిమాలు చేయ్యొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వారి వద్ద అంత డబ్బు ఉంది. కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు’ అని విశాల్ అన్నారు. కాగా, గతేడాది కోలీవుడ్ భారీగా నష్టాలను చవి చూసింది. ఏడాది మొత్తంలో 240 వరకు సినిమాలు నిర్మిస్తే..వాటిల్లో కేవలం 18 మాత్రమే విజయం సాధించాయి. మొత్తంగా దాదాపు రూ. 1000 కోట్ల నష్టపోయినట్లు తెలుస్తోంది.మొక్కు చెల్లించిన విశాల్..12 ఏళ్ల క్రితం విశాల్ హీరోగా నటించిన ‘మదగజరాజా'(Madha Gaja Raja) చిత్రం తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత విశాల్ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. దీంతో బుధవారం విశాల్ చెన్నైలోని కపలీశ్వరర్ టెంపుల్ సందర్శించి మొక్కులు చెల్లించాడు. సినిమా విజయం సాధిస్తే టెంపుల్‌కి వస్తానని మొక్కుకున్నానని.. అనుకున్నట్లే మూవీ హిట్ కావడంతో మొక్కులు చెలించానని విశాల్ చెప్పారు.సుందర్ సి దర్శకతవం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. -
హీరోగా నటించనున్న తమన్? 22 ఏళ్ల తర్వాత..!
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఈయన తొలిసారి నటుడిగా యాక్ట్ చేసిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2003లో రిలీజై సక్సెస్ సాధించింది. ఈ మూవీలో తమన్.. మ్యూజికల్ బ్యాండ్‌లో ఒకరిగా నటించాడు. తర్వాత మాత్రం అతడు నటనపై కాకుండా సంగీతంపైనే దృష్టి పెట్టాడు. మిస్టర్ మజ్ను, బేబీ జాన్ సినిమాల్లో కేవలం ఏదో ఒక సీన్/పాటలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయాడు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడట! హీరో అధర్వతో కలిసి తమిళంలో ఓ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!(చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా)సంగీత దర్శకుడిగా..తమన్ తండ్రి అశోక్ డ్రమ్మర్, తల్లి సావిత్రి సింగర్. ఇంట్లో సంగీత నేపథ్యం వల్ల చిన్న వయసులోనే డ్రమ్స్ వాయించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడానికి ముందు దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పని చేశాడు. బాయ్స్ మూవీలోనూ డ్రమ్స్ వాయించే కుర్రాడిగా కనిపించాడు. మళ్లీ మళ్లీ చిత్రంతో టాలీవుడ్‌కు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు తమన్. కిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. హిందీలోనూ రెండు చిత్రాలకు పని చేశాడు. వివిధ భాషల్లో కలుపుకుని వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళంలో పలు పాటలు ఆలపించాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవల డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పని చేశాడు.చదవండి: చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు -
మోనాలిసా సరే.. వీళ్ల గ్లామర్ ఎందుకు నచ్చదు..?: కంగనా రనౌత్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వైరల్ అయిన 'మోనాలిసా'(16) గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేయంతో ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. చాలామంది ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని ఎగబడ్డారు కూడా.. అయితే తాజాగా మోనాలిసా గురించి కంగనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.'కుంభమేళాలో మోనాలిసాతో చాలామంది ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంతమాత్రం బాగాలేదు. అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏం చేయలేము. మన చిత్ర పరిశ్రమలో కూడా చాలామంది హీరోయిన్లు ఆమె రంగులోనే ఉన్నారు. వారందరిపై కూడా ఇలాంటి అభిమానమే చూపుతున్నారా..? బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన దీపికా పడుకోణె, కాజోల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్నే కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా..? మోనాలిసాను భారీగా వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోయిన్లపై కూడా మీ ప్రేమాభిమానాలు చూపించగలరా..? కొత్త వారిని కూడా కాస్త గుర్తించండి.' అని ఆమె పోస్ట్ చేశారు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీనే కంగనానే దర్శకత్వం వహించింది. మాధవన్‌తో కలిసి ఆమె మరో రెండు చిత్రాలలో నటిస్తుంది.సొంతూరు వెళ్లిపోయిన మోనాలిసామధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. -
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ.. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్కి కేరాఫ్ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Gopi Sundar Official (@gopisundar__official) -
చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు..
రంగావఝల రంగారావు. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. కానీ, సాక్షి రంగారావు అంటే అందరికీ సుపరిచితులే. సినిమాలలో విలన్ పాత్రలే వేసినప్పటికీ నిజ జీవితంలో సౌమ్యతత్త్వం ఉంటుంది. పాత్ర ఏదైనా సరే అద్భుతంగా ప్రజంట్ చేసి ప్రేక్షకులను మెప్పించే నిజమైన నటుడు సాక్షి రంగారావు. బాపురమణల కాంబినేషన్లో వచ్చిన సాక్షి సినిమాతో ఆయనకు మొదటి ఛాన్స్ రావడంతో తన పేరుకు ముందు సినిమా టైటిల్‌ను చేర్చుకున్నారు. ఆ సినిమాతో మొదలైన అదృష్ట ఘడియలు.. రంగారావు తుది శ్వాస వరకు ఆయనను వరిస్తూనే వచ్చాయి. అయితే, సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలలో నటించిన సాక్షి రంగారావు నటిస్తూనే స్టేజీ మీద కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. అలా తన జీవితమంతా నటనకే అంకితం చేశారని చెప్పవచ్చు.ప్రకాశం జిల్లా కలవకూరు (అద్దంకి – సింగర కొండ మధ్య)లో సాక్షి రంగారావు పుట్టారు. ఆయన తండ్రి చిన్నవయసులోనే మరణించడంతో బంధువల దగ్గర మచిలీపట్నంలోని పామర్రులో పెరిగారు. వైజాగ్‌లో చదవు పూర్తి అయ్యాక డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆపై పలు స్టేజీ నాటకాలలో పనిచేశారు. అలా మద్రాస్ వెళ్లి బాపురమణలను కలవడం వారు తెరకెక్కించే సాక్షి సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం జరిగిపోయింది. సినిమా అవకాశాలు రావడంతో ఆయన మద్రాస్‌లోనే సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా ఉన్నారు. వారిలో సాక్షి శివ పలు తెలుగు సీరియల్స్లలో నటిస్తున్నారు.చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేశారు‘కన్యాశుల్కం’ ఏడు గంటల పాటు సాగే ఆ నాటకంలో నటించాలని సాక్షి రంగారావు అనుకున్నారు. మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ... ఉన్నట్టుండి స్టేజీపైనే కుప్ప కూలిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిపించగా కొద్దిరోజులు ట్రీట్మెంట్కు సహకరించిన ఆయన తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. అక్కడ చికిత్స తీసుకుంటూనే జూన్ 2005లో ప్రాణాలు వదిలేశారు. అందరూ కోలుకుంటున్నారనుకుంటుండగా కన్నుమూసి అభిమానులను ఏడిపించారు. అలా ఆయన జీవితం చివరి వరకు కళా రంగంలో నటిస్తూనే ముగిసిపోయింది. ఆయన చివరి కోరిక కన్యాశుల్కంలో నటించడం. అది తీరకుండానే ఆయన దూరం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులను కూడా తీవ్రంగా బాధించింది. నటుడిగా జీవితాంతం కొనసాగాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు. నటనకే తన జీవితాన్ని అంకితం చేయాలని భావిస్తారు కూడా.. అయితే, ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. కానీ, సాక్షి రంగారావు విషయంలో అది జరిగింది.సాక్షి రంగారావు లేకుండా వారి సినిమాలు లేవుఇండియన్ టాప్ దర్శకులలో విశ్వనాథ్ పేరు తప్పకుండా ఉంటుంది. అయితే, సాక్షి రంగారావు లేకుండా ఆయన ఒక్క సినిమా కూడా తీయలేదు. దాదాపు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు కోసం ఒక పాత్ర తప్పకుండా ఉంటుంది. శంకరాభరణంలో శంకరశాస్త్రి ట్రూప్ లో మృదంగం వాయించే పాత్ర ఇప్పటి తరం వారికి కూడా గుర్తే.. అలాగే దర్శకులు వంశీ తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ సాక్షి రంగారావుకు తప్పనిసరిగా ప్లేస్ ఉండేది. ఆయన సినిమాల్లో ఏదో ఒక పాత్ర చేస్తూనే రంగారావు వచ్చారు. మంచు పల్లకి, సితార సినిమాలలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ మీద తన పాత్ర ఏదైనా సరే అద్భుతంగా నటించేస్తారు సాక్షి రంగారావు. విలన్‌గా చేసినా కూడా జనం మెచ్చుకున్నారు. కామెడీ చేసినా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తెరపై సెంటిమెంట్ పండించినా కళ్లు తుడుచుకోకుండా ప్రేక్షకులు ఉండలేకపోయారు. చిత్రపరిశ్రమలో ఇలాంటి క్యాటగిరీలో సాక్షి రంగారావు మాత్రమే ఉంటారని చెప్పవచ్చు. -
ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ 'అనూజ' చిత్రం
ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం. -
కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్న 'శ్రీతేజ్'
పుష్ప2(Pushpa 2: The Rule) సినిమా రేవతి(32) కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఎప్పటికీ మరిచిపోలేము. ఈ ఘటనలో రేవతి అక్కడికక్కడే మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్(9) తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన జరిగి 56 రోజులు పూర్తి అయినా బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ సికింద్రాబాద్ కిమ్స్ (Kims) ఆసుపత్రిలోనే బాలుడు చికిత్స పొందుతున్నాడు.శ్రీతేజ్‌కు వెంటిలేటర్ తొలగించి ప్రత్యేక గదికి వైద్యులు షిఫ్ట్ చేశారు. తానే సొంతంగా ఆక్సీజన్ తీసుకుంటున్నాడు. అయితే, కుటుంబ సభ్యులు పిలిచినా కళ్లు తెరిచి చూడలేకున్నాడు. వారిని గుర్తుపట్టలేనంతగా బాలుడు ఉన్నాడు. కనీసం నోరు విప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేకున్నాడు. తనకు ఆహారం కూడా ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన రానా)కానీ, అతని శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ తెలిపారు. అయితే బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. శ్రీతేజ త్వరగా కోలుకొని మళ్లీ గతంలో మాదిరి తన కళ్లముందు తిరుగుతే చూడాలని ఉందని తన తండ్రి కోరుకుంటున్నాడు.రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ రూ. కోటి సాయం ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు ప్రకటించగా.. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజుకు గతంలోనే అందించారు. అల్లు అర్జున్ కూడా శ్రీతేజను పరామర్శించారు. రేవతి కుటుంబానికి జరగరాని నష్టం జరిగిందని ఆ సమయంలో అన్నారు. ఆపై వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన వాపోయారు. బాబు పూర్తిగా కోలుకునే దాకా పూర్తి బాధ్యత తనదేనని బన్నీ ప్రకటించారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని కూడా శ్రీతేజ తండ్రి భాస్కర్‌తో అల్లు అర్జున్ గతంలో అన్నారు. -
కుటుంబంలో విషాదం.. పాడె మోసిన హీరో రానా
టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా అమ్మమ్మ రాజేశ్వరీదేవి మృతి చెందారు. తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రానాతో పాటు దగ్గుబాటి సురేష్ కూడా ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరీదేవి స్వయానా అమ్మమ్మ కావడంతో పాడె మోశారు. రానా దగ్గుబాటి తల్లి లక్ష్మీ పుట్టింటి ఫ్యామిలీ రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ప్రముఖంగా ఉన్నారనే విషయం తెలిసిందే. -
ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్.. ఫ్యాన్స్‌కు బోనస్
పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు పుష్ప2(Pushpa 2: The Rule) ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఓటీటీలో 'పుష్పగాడి' రూల్ మొదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను దాటేసింది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 1896 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.మరో నాలుగు నిమిషాలు అదనంగతేడాది డిసెంబరు 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప2 మొత్తం రన్‌టైమ్ 3 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. అప్పుడు పుష్ప రన్ టైమ్ 3:40 నిమిషాలు అయింది. ఫ్యాన్స్‌కు బోనస్‌గా ఇప్పుడు ఓటీటీ వర్షన్లో మరో 4 నిమిషాల సీన్లు అదనంగా మరోసారి జత చేశారు. దీంతో పుష్ప2 మొత్తం రన్ టైమ్ 3:44 గంటలు ఉంది. -
'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. → విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పల్లెటూరిలో నవ్వులు
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రం ‘బద్మాషులు’. ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుని, ఆ అనుభూతిని నలుగురూ పంచుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజ జీవితంలో మనకి తారసపడే వారిలాగే ఉంటూ నవ్విస్తుంటుంది. పూర్తి వినోదంతో పాటు గొప్ప సందేశం ఇచ్చే సినిమా ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తేజ కూనూరు, కెమేరా: వినీత్ పబ్బతి. -
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు, నటులు మోహన్‌బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరుల వద్ద వందకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా చేసిన ధర్మ ‘సంహారం’ చిత్రంతో డైరెక్టర్‌గా మారారు. ఆదిత్య, కవిత జంటగా ధర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సంహారం’ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో ధర్మ మాట్లాదుతూ– ‘‘తనకు, తన అక్కకు అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌తో ఓ అమ్మాయి దుష్టులను ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ సినిమా తీశాం. మహిళలు తమని తాము కాపాడుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఆవశ్యకమని ఈ చిత్రంలో చూపించాం’’ అని చెప్పారు. -
రాయలసీమ రమ్మంటోంది
రాయలసీమ నేపథ్యం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ కూడా రాయలసీమ నేపథ్యంలో రూపొందిన సినిమాయే. కాగా ప్రస్తుతం ‘రాయలసీమ రమ్మంటోంది’ అంటూ కొందరు తెలుగు హీరోలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే...అఖండ తాండవంబాలకృష్ణ కెరీర్లో రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇటీవలి కాలంలో ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’ (2021) మూవీ అనంతపురం నేపథ్యంలో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ సంయుక్త ఓ కీ రోల్ చేస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘అఖండ 2: తాండవం’ కూడా ‘అఖండ’ సినిమా మాదిరి అనంతపురం నేపథ్యంలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ్వించేకి వస్తుండా! ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అని ఇటీవల తన కొత్త సినిమా గురించి వరుణ్ తేజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వియత్నాంలో జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ మూవీ చిత్రీకరణ కోసం లొకేషన్లను కూడా వెతుకుతున్నారు మేకర్స్. ఈ పనుల కోసం హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం వియత్నాంలోనే ఉన్నారు. హారర్–కామెడీ జానర్లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం నేపథ్యంలో ఉంటుందని, ‘కొరియన్ కనక రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి.19వ శతాబ్దంలో...‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాలను ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూలను మేకర్స్ సంప్రదించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ లవ్‌స్టోరీ ‘ఏజెంట్’ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ తర్వాతిప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అఖిల్ తర్వాతి చిత్రం చిత్రీకరణ ఆల్రెడీ మొదలైందని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కి ‘లెనిన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ దర్శకుడు మురళీ కిశోర్ ‘లెనిన్’ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని సమాచారం. మాస్ సంబరాలు ‘ఏటి గట్టు సాచ్చిగా చెబ్తాండ ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాలొన్నించొచ్చాది!... ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ ΄్యాక్డ్ మూవీని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.రాజకీయం... ప్రతీకారం అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫిల్మ్ ఇది. లవ్, యాక్షన్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో మరికొందరు కుర్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు రాయలసీమ కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో విడుదల
తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television) కార్యవర్గం ఎన్నికల సందర్భంగా జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తాము గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీలు ఇచ్చారు. కాగా.. ఈనెల 31న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమలు చేశామని ఘనంగా చెప్పగలుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. తెలుగు ఆర్టిస్టులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులందరికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడతాం.' అని అన్నారు.జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి మాట్లాడుతూ.. 'నటుడుగా ఒక దశలో నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది టీవీ రంగం. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి , తలసాని శ్రీనివాస్ సహకారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్యత తీసుకున్నది మన అసోషియేషన్. నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గర్వంగా చెప్పగలను. విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంతరం ప్రయత్రిస్తానని ఈ సందర్బంగా హామీ ఇస్తున్నా.' అని అన్నారు. కాగా.. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ తమ జీఎస్ హరి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గొట్టికొండ, ట్రీజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాంజగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జీఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్‌పేయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్, దీప దుర్గంపూడి, మహిళ ఈసీ మెంబర్స్ అభ్యర్థులు రాగ మాధురి, లిరిష, మహతి రిజ్వాన, లక్ష్మిశ్రీ, ఈసీ మెంబర్స్ అభ్యర్థులు బాలాజీ, శివకుమార్ కముని, విజయ్ రెడ్డి, ద్వారకేష్, మురళికృష్ణ రెడ్డి, గోపికర్, మురళికృష్ణ, టీవీ నటీనటులు తదితరులు పాల్గొన్నారు.జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో హామీలు ఇవే :1. ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానెల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు4. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు5. నాగబాబు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి6. మహిళ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం.10. ఈఎస్ఐ స్కీం వర్తింప చేస్తాం11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమలు చేస్తాం12. ప్రతి మెంబర్‌కి వర్క్ కల్పిస్తాం -
ఎట్టకేలకు ఓటీటీకి పుష్ప-2.. అఫీషియల్‌గా డేట్ ప్రకటించిన నెట్‌ప్లిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్'పుష్ప 2 ది రూల్'( (Pushpa 2: The Rule)) మూవీ ఓటీటీ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు నెట్‌ఫ్లిక్స్ ఫుల్స్టాప్ పెట్టింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ట్రైలర్ వీడియోను పోస్ట్ చేసింది.రీ లోడెడ్ వర్షన్ కూడా..పుష్ప- 2 రీలోడెడ్ వర్షన్‌తో పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. అదనంగా 23 నిమిషాల రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్..సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప-2 ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. పుష్పరాజ్ దెబ్బకు పలు సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాల తర్వాత పుష్పరాజ్ ఓటీటీలో సందడి చేయనున్నాడు. Pushpa Bhau ne sun li aapki baat, ab Pushpa ka rule, Hindi mein bhi 🔥Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, on 30 January in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix pic.twitter.com/smPXn4IMD9— Netflix India (@NetflixIndia) January 29, 2025 -
విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్‌ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.Ithu eppa nadanthathu..🥹🙄..Enna @VijaySethuOffl sollave illa..🤭..But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025 -
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్‌స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'ఆ బాధేంటో నాకు మాత్రమే తెలుసు'.. అత్తారింటికి దారేది నటుడు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్లో అత్తారింటికి దారేది చిత్రంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు బోమన్ ఇరానీ. ఆ తర్వాత తెలుగులో బెంగాల్ టైగర్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. బోమన్ ఇరానీ చివరిసారిగా షారూఖ్ ఖాన్ మూవీ డుంకీలో కనిపించారు. ప్రస్తుతం ది మెహతా బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా బోమన్ ఇరానీ తన వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య జెనోబియా ఇరానీతో కలిసి 40వ పెళ్లి రోజును ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోమన్ ఇరానీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫరా ఖాన్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది.బోమన్ ఇరానీ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ ప్రపంచం మొత్తం నిన్ను దేవదూత అని పిలిచినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దీని వెనుక ఉన్న నిజమైన బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. మన 40 సంవత్సరాల బంధమే దీనికి నిదర్శనం. కానీ ఇప్పుడు ఆ దేవదూతనే నన్ను ఇంతలా తీర్చిదిద్దింది. అంతేకాదు మా కుటుంబాన్ని తీర్చిదిద్ది మాలో నవ్వులు పూయించి ముందుండి నడిపించింది. 40 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న నా పాత స్నేహితుడిని ఎప్పటికీ ప్రేమిస్తున్నా ఉంటా.' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు విషెస్ తెలిపారు.కాగా.. బోమన్ ఇరానీ టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్లో 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, ఖోస్లా కా ఘోస్లా లాంటి సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ది మెహతా బాయ్స్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్‌లో సలార్ హీరో.. క్లారిటీ ఇదే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు సైతం వెళ్లివచ్చారు మన డైరెక్టర్.అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేయనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. సలార్‌తో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుకుమారన్ మహేశ్‌బాబు చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ప్రస్తుతం మలయాళంలో ఎంపురాన్ మూవీలో నటిస్తోన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. మహేశ్ బాబు చిత్రంలో నటించే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను.. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. సలార్‌తో మరింత్ స్టార్డమ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. సలార్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సలార్ సమయంలో ప్రభాస్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాకం చోప్రాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్‌లోని చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. -
ది రాజాసాబ్ భామకు క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ నటుడితో తొలిసారి!
గతేడాది తంగలాన్‌తో సూపర్ కొట్టిన హీరోయిన్ మాళవిక మోహనన్. కొత్త ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉండాగానే మరో క్రీజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిత్రంలో మాళవిక నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ హృదయపూర్వం అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక మోహనన్‌ను ఎంచుకున్నట్లు మాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవిక తొలిసారి మోహన్ లాల్‌తో జతకట్టనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.మాళవిక విషయానికొస్తే పట్టం పోల్ (2013)సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, పెట్టా (2019), మాస్టర్ (2021) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది విక్రమ్ మూవీతో విభిన్నమైన పాత్రతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా యుధ్రా సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఇటీవల మాళవిక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. -
‘ఫీమేల్ యాక్టర్లకు.. క్రికెటర్లు మెసేజ్ చేస్తే తప్పేంటి?’
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan)కు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మహిళా అభిమాని నుంచి విచిత్ర ప్రశ్న ఎదురైంది. పాక్ క్రికెటర్లంతా నటీమణులకు పదే పదే ఫోన్లో సందేశాలు ఎందుకు పంపిస్తారని ఆమె అడిగింది. ఇందుకు షాదాబ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా గతంలో పలువురు నటీమణులు తమకు పాక్ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో టిక్‌టాకర్ షాతాజ్ ఖాన్(Shahtaj Khan).. షాదాబ్ ఖాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు తనతో వాట్సాప్‌లో కాంటాక్టులో ఉన్నాడని.. తనను పెళ్లి చేసుకోమంటూ ప్రతిపాదన(Marriage Proposal) కూడా తెచ్చాడని చెప్పింది.ఈ విషయం గురించి తాజాగా షాదాబ్ ఖాన్ స్పందించాడు. జియో న్యూస్ ‘షో’కు హాజరైన అతడు అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్.. ‘‘చాలా మంది ఫీమేల్ యాక్టర్లు తమకు క్రికెటర్లు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారని చెప్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారా?.. ఎవరికైనా ఎప్పుడైనా మీరు అలా మెసేజ్ చేశారా?’’ అని ప్రశ్నించింది.అందులో తప్పేముంది?ఇందుకు షాదాబ్ ఖాన్ బదులిస్తూ.. ‘‘ఒకవేళ క్రికెటర్లు వాళ్లకు మెసేజ్‌లు పంపినా.. అందులో తప్పేముంది?.. క్రికెటర్లు నిజంగానే ఓ నటికి మెసేజ్ పంపించారే అనుకోండి. వాళ్లకు అది నచ్చకపోతే బదులివ్వకుంటే సరిపోతుంది కదా!అలా చేస్తే ఇంకోసారి ఎవరూ మెసేజ్ చేసే సాహసం చేయరు. ఒకవేళ అలా కాకుండా.. వాళ్లు మెసేజ్‌లకు రెస్పాండ్ అవుతున్నారు అంటే.. వారికి కూడా ఎదుటి వ్యక్తి పట్ల ఆసక్తి ఉన్నట్లే అనుకోవాలా?..కొంతమంది నటీమణులు ఈ విషయం గురించి ఇటీవల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి వీడియోలు చూశాను. కానీ అందులో వారు చెప్పే ప్రతీ విషయం నిజం కావాలని లేదు. కొన్నిసార్లు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి.. అతిశయోక్తులతో వర్ణిస్తారు.ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోఅయితే, ఇలాంటి వాటి వల్ల జట్టుపై పెద్దగా ప్రభావం పడదు. కానీ టీమ్‌లోని ఏ సభ్యుడు మెసేజ్ పంపించాడన్న విషయంపై కాస్త చర్చ జరుగుతుంది. కొంతమంది యాక్టర్లు తాము ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో టైమ్ చూసి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వరల్డ్కప్లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నపుడు వీటి గురించి మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’’ అని షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా పాకిస్తాన్ తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు షాదాబ్ ఖాన్. అతడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇప్పటి వరకు ఆరు టెస్టులు, 70 వన్డేలు, 104 అంతర్జాతీయ టీ20లు ఆడిన 26 ఏళ్ల షాదాబ్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 300, 855, 679 పరుగులు చేశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 14, వన్డేల్లో 85, టీ20లలో 107 వికెట్లు తీశాడు. చివరగా 2023, నవంబరులో ఇంట్లండ్తో వన్డే సందర్భంగా పాకిస్తాన్‌కు చివరగా ప్రాతినిథ్యం వహించాడు.ఇక షాదాబ్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... దిగ్గజ స్పిన్నర్, తన కోచ్ సక్లెయిన్ ముస్తాక్ అలీ కుమార్తె మలైకాను అతడు వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల నడుమ 2023లో వీరి షాదాబ్- మలైకాల పెళ్లి జరిగింది.చదవండి: Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి.. -
తెలుగు ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్న మరో హాలీవుడ్ మూవీ
డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే వహిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఏజెంట్ గై 001. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందించగా డెన్నిస్ ఆండర్సన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. ఆంటోన్ కార్ల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పి శ్రీనివాస గౌడ్ నిర్మిస్తూ సహాయ నిర్మాతగా పి హేమంత్ వ్యవహరిస్తూ దీప ఆర్ట్స్ బ్యానర్ ద్వారా జనవరి 31వ తేదీన ఎంతో ఘనంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో వస్తున్న మరొక అద్భుతమైన యాక్షన్ అండ్ అడ్వెంచర్లు కలిగిన చిత్రంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. టీజర్ ను చూస్తే డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా కనిపిస్తుంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్ అలాగే కొన్ని అడ్వెంచర్లు ఉన్నట్లు తెలుస్తుంది. చిత్రం ఎంత నాణ్యంగా ఉండబోతుంది అనేది టీజర్ లోని నిర్మాణం విలువలు ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. -
వరలక్ష్మీ శరత్ కుమార్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ(Varalaxmi Sarathkumar ).. తనదైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు కీలక పాత్రలు పోషించి సౌత్ ఇండియాలో విలక్షణ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనూ ఈమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ చిత్రంలో వరలక్ష్మీ పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఆమెకు ఇక్కడ వరుస సినిమా చాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ విలక్షణ నటి చేతికి భారీ ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఆదిపర్వం' మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శత్వంలో వరలక్ష్మీ ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుంది.భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోబోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం. -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్‌కు మరో షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజైంది. పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాల రికార్డులను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్‌పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే రానుందని ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చేసింది. అయితే ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు పుష్ప-2 జనవరి 30న రానుందని నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించింది. దీంతో అందరూ ఆ తేదీనే ఫిక్సయిపోయారు. కానీ అది పొరపాటున అలా రివీల్ చేశారో తెలీదు.. కాసేపటికే కమింగ్ సూన్ అంటూ ఆడియన్స్‌కు షాకిచ్చింది.పుష్ప-2 ఫ్రీ కాదట..అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ పుష్ప అభిమానులకు మరో షాకిచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. పుష్ప-2 ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాలని ట్రైలర్ వీడియోను రిలీజ్ చేసింది. అంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ చెల్లించాల్సిందే. దీంతో ఓటీటీలో ఫ్రీగా చూసేద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్‌ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.Dabbante lekka ledhu… power ante bayam ledhu… adhey Pushpa 🔥 https://t.co/4qs7VtaTfQ— Netflix India South (@Netflix_INSouth) January 29, 2025 -
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్‌బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్‌బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్‌బాబు, శరత్‌కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025