Movies
-
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్‌బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్‌బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్‌బాబు, శరత్‌కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025 -
'మహిళల భద్రతకు ఈ తీర్పే నిదర్శనం'.. జానీ మాస్టర్ కేసుపై ఝాన్సీ పోస్ట్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ ఓ టీవీ ఇంటర్వ్యూకు హాజరైంది. జానీ మాస్టర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.అయితే ఈ కేసుపై టాలీవుడ్ నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. జానీ భాష విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. పని ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులను సహించేది లేదని ఈ తీర్పు చూస్తే అర్థమవుతోందని.. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య పోరాటం చేసినందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!)ఝాన్సీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసును గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ జానీ బాషా జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ రోజు కోర్టు ఆయన మధ్యంతర పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని ప్రదేశంలో మహిళల భద్రత ముఖ్యమని ఈ తీర్పు చెబుతోంది. ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుని పోరాటం చేసినందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్ పూర్తయ్యాక మా ఫేస్‌లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
'పులి బిడ్డ' అంటూ అజిత్ కుమారుడి విజయంపై ప్రశంసలు
కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కుమారుడు ఆద్విక్ రన్నింగ్ రేసులో విజయం సాధించి ప్రథమ బహుమతి అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను అజిత్ ((Ajith Kumar)) సతీమణి షాలిని (Shalini) సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు రేసింగ్‌లో తండ్రి సత్తా చాటితే.. కుమారుడు రన్నింగ్ రేస్‌లో దుమ్మురేపుతున్నాడని, అదే రక్తం అంటూ..ఆద్విక్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అజిత్‌లాగే ఆయన కుమారుడు అద్విక్‌కి కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. తాజాగా అద్విక్ తమిళనాడు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటాడు. రన్నింగ్ రేస్, రిలే రేసులలో మొదటి స్థానంలో నిలిచి తండ్రికి తగిన కుమారుడని పేరు గడించాడు. ఏకంగా మూడు మెడల్స్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను షాలిని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పులికి పులినే పుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. తండ్రి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే.. కుమారుడు పాఠశాల నుంచి తన విజయాలను మొదలు పెట్టాడని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం గర్వపడేలా మంచి రన్నింగ్ రేసర్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తూ..శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను ప్రకటించిన అజిత్.. దుబాయ్ వేదికగా జరిగిన '24హెచ్ దుబాయ్' కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. పలు దేశాలకు చెందిన రేసర్లతో పోటీపడి హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడినప్పటికీ దానిని లెక్కచేయకుండా బరిలోకి దిగినందుకు గాను.. స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డుతో అజిత్‌ను గౌరవించారు. సినీ పరిశ్రమకు అజిత్ చేసిన సేవలకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో కేంద్రం గౌరవించింది. తాజాగా ఆయన్ను పద్మభూషణ్‌తో సత్కరించింది. తన విజయానికి, సంతోషానికి షాలినీ ప్రధాన కారణం అని అవార్డ్ వచ్చిన సందర్భంగా అజిత్ తెలిపారు. ఆయన నటించిన కొత్త సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న తెలుగు,తమిళ్లో విడుదల కానుంది. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
తమిళ్లో పెద్ద హిట్.. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది: అంజలి
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మద గజరాజా’(Madagada Raja ). ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుందర్. సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్ మూవీగా నిలిచి, రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ను అదే టైటిల్‌తో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తోంది.హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి(Anjali) మాట్లాడుతూ– ‘‘మంచి కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో వెస్ట్రన్ హీరోయిన్గా కనిపిస్తాను.ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి'నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్' అన్నారు. -
43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి.. ఈ స్టార్ సింగర్ గుర్తుందా?
చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో...విడాకులు అంతే త్వరగా తీసుకుంటున్నారు. కొందరు మాత్రం ఏళ్లుగా కలిసి ఉంటే..మరికొంత మంది ఇలా పెళ్లి చేసుకొని అలా విడాకులు తీసుకుంటున్నారు. ఇంకొంత మంది మాత్రం ఏళ్లుగా కలిసి ఉండి పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత విడిపోతున్నారు. అలా విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్ గురించి ఆసక్తికర విషయాలు..18 ఏళ్లకే పెళ్లిపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన మలుపు. వివాహ బంధం బలంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలానే తన వివాహ బంధం కూడా గట్టిగానే ఉండాలని కోరుకుంది ప్రముఖ సింగర్ కనికా కపూర్(Kanika Kapoor ). బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని వైవివాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం 43 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుంది.జీవితాన్నే మార్చేసిన పెళ్లిలక్నోలోని ఖత్రీ కుటుంబంలో జన్మించిన కనికా.. 12 ఏళ్ల వయసులోనే సంగీతం వైపు మొగ్గు చూపింది. ప్రముఖ సంగీతకారుడు పండిట్ గణేష్ ప్రసాద్ మిశ్రా శిక్షణ పొంది.. 15 ఏళ్ల వయసులోనే భజన విద్వాంసుడు అనుప్ జలోటాతో కలిసి అతని ప్రదర్శనలకు వెళ్ళింది. అయితే ఆమెకు 18 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేశారు. 1988 రాజ్ చందోక్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకొని లండన్ వెళ్లిపోయింది.వీరికి ముగ్గురు పిల్లలు అయానా, మారా, యువరాజ్ జన్మించారు. పెళ్లికి ముందే తాను పాటలు పాడుకుంటానని భర్తతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అత్త మామలు మాత్రం పాటలు పాడొద్దని కండీషన్ పెట్టారట. దీంతో కనికా సంగీతానికి దూరమైంది. కొన్నాళ్లకు రాజ్‌తో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.ఒంటరిగా పదేళ్లు..అయిష్టంగానే పెళ్లి చేసుకున్నపటికీ..భర్త, పిల్లలే ప్రపంచంగా బ్రతికింది కనికా. కొన్నేళ్ల తర్వాత భర్తతో మనస్పర్థలు వచ్చాయి. కొన్ని విషయాల్లో అతను చేసిన మోసాలు కనిక దృష్టికి వచ్చాయి. అవి భరించడం కనిక వల్ల కాలేదు. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుంది.‘మాది సాంప్రదాయ కుటుంబం. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా కూడా రాజ్‌తో కలిసి ఉండేందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కానీ నా పిల్లలు గుర్తొచ్చి అది విరమించుకున్నాను. ఏదేమైనా రాజ్‌తో కలిసి ఉండొద్దని భావించి విడాకులు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2012లో కనిక, రాజ్‌లు విడాకులు తీసుకున్నారు. దాదాపు పదేళ్లు ఒంటరిగా జీవితాన్ని గడిపి.. 2022లో రెండో పెళ్లి చేసుకుంది.43 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..విడాకుల అనంతరం ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగానే గడిపింది కనిక కపూర్. 2022లో వ్యాపారవేత్త గౌతం హథీరమణిని వివాహం చేసుకుంది. అప్పుటికీ కనిక వయసు 43 ఏళ్లు. ‘పెళ్లి విషయం పిల్లలకు చెప్పగానే చాలా బాధపడ్డారు. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందు నా చిన్న కూతురు వచ్చి ‘గౌతంకి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పగానే నేను షాకయ్యాను. వెంటనే గౌతంతో పెళ్లి తర్వాత మనమందరం ఒకే కుటుంబం అవుతామని చెప్పాను. పెళ్లి మండపానికి నాతో పాటు నా కొడుకు రావడం, పేరాస్లో నా కూతర్లు ఇద్దరూ పాల్గొనడంతో ఎంతో ఎమోషనల్ అయ్యాను’ అని కనికా చెప్పింది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేనితో పాలు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. గౌతంతో 15 ఏళ్లుగా పరిచయం ఉందని.. 2020లో ప్రపోజ్ చేశాడని.. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో కనిక చెప్పింది. View this post on Instagram A post shared by Kanika G Kapoor (@kanik4kapoor) -
బ్యాచిలర్స్ కోసం జోరు పెంచిన 'సందీప్ కిషన్'
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మజాకా' (Mazaka Movie) నుంచి బ్యాచిలర్స్ కోసం అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌ను మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు. (ఇదీ చదవండి: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ప్రియుడిని ప్రకటించిన 'అభినయ')ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. నాగార్జునతో మన్మథుడులో నటించిన అన్షు (Anshu Ambani) చాలా కాలం తర్వాత మజాకా సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ధనుంజయ్ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా ఉన్నారు.'మజాకా' సినిమా కోసం సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, జీ స్టూడియోస్ వారు కేవలం ఓటీటీ హక్కులను 20 కోట్లకు సొంతం చేసుకున్నారని ప్రచారం ఉంది. ఇదే నిజమైతే.. సందీప్ కిషన్ సినిమాకు భారీ డీల్ సెట్ అయినట్లే అని చెప్పవచ్చు. థియేటర్ రన్లో రూ. 10 కోట్లు రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు. -
15 ఏళ్లుగా ప్రేమ నిజమే.. విశాల్‌తో రూమర్స్‌పై 'అభినయ' కామెంట్
రవితేజ నటించిన 'నేనింతే' సినిమాతో నటి అభినయ (Abhinaya) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ‘శంభో శివ శంభో’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. విశాల్‌తో (Vishal ) పెళ్లి, ప్రేమ రూమర్స్‌పై ఆమె స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) అభినయ.. తన సైన్ లాంగ్వేజ్‌తో పలు విషయాలు పంచుకున్నారు. రీసెంట్గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'పని' (Pani). నటుడు జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఈ మూవీలో ఆమెపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం చాలా వివాదాస్పదమైంది. దీంతో జోజూ జార్జ్ మేకింగ్‌ను చాలామంది తప్పుపట్టారు. ఈ విషయంపై కూడా అభినయ స్పందించారు.విశాల్‌తో ప్రేమ.. అసలు ప్రియుడిని పరిచయం చేసిన అభినయవిశాల్తో పూజా చిత్రంలో మెప్పించిన అభినయ.. మార్క్ ఆంటోని మూవీలో ఆయనకు భార్యగా నటించారు. ఆమెలో నటన పరంగా చాలా టాలెంట్ దాగి ఉందని పలుమార్లు విశాలు కామెంట్ చేశారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. దీంతో పలు వేదికల మీద ఇప్పటికే వారిద్దరూ ఖండించారు. అయినా కూడా.. అభినయతో విశాల్ పెళ్లి అనే వార్తలు మాత్రం ప్రచారంలోనే ఉన్నాయి. త్వరలో పెళ్లి అంటూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. (ఇదీ చదవండి : ఓటీటీలో రొమాన్స్ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు)అయితే, ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని అభినయ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన సైన్ లాంగ్వేజ్‌లో పంచుకున్నారు. 33 ఏళ్ల అభినయకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదని ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. ఆపై మీరు ఒంటరిగా ఉన్నారా..? ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా..? అనే ప్రశ్నలు ఎదురుకావడంతో అభినయ కంగుతిన్నారు. అయితే, ఏమాత్రం తడబాటుపడకుండా తిరిగి సమాధానం ఇచ్చారు. తాను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నానని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన అభినయ అభిమానులను ఆశ్చర్యపరిచారు.మలయాళ సినిమా 'పని'లో బోల్డ్ సీన్లో అభినయతాజా మలయాళ చిత్రం 'పని' సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చాలా బాగుంది అంటూ మంచి టాక్ ఉంది. నటుడు జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు . ఇందులో అభినయపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది. దీంతో జోజూ మేకింగ్‌ను అందరూ ట్రోల్ చేశారు. దీనిపై కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. 'ఒక మూవీలో ఎలాంటి సీన్లు పెట్టాలి..? ఎలా తెరకెక్కించాలి..? వంటి అంశాలు పూర్తిగా దర్శకుడి నిర్ణయం. దానిని నటీనటులు తప్పకుండా గౌరవించాలి. దీంతో నేను ఈ అంశం గురించి పెద్దగా ఏం మాట్లడను. ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే అందులో దర్శకుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అతని మాటే తుది నిర్ణయంగా భావించాలి. సౌత్ ఇండియాలో జోజూ చాలా గొప్ప నటుడు. గొప్ప గొప్ప దర్శకులతో ఆయన పనిచేశారు. మంచి అనుభవం ఉన్న నటుడు మాత్రమే కాకుండా ఒక సినిమా మేకర్‌గా ఆయన రాణిస్తున్నారు.' అని ఆమె అన్నారు. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
ఓటీటీలో థ్రిల్లర్ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు
అమెరికన్ థ్రిల్లర్ సినిమా 'స్ట్రేంజ్ డార్లింగ్'(Strange Darling ) తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని ప్రచారంలో ఉంది. కానీ, ఆ విషయాన్ని దర్శకుడు జె.టి. మోల్నర్ ధృవీకరించలేదు ఆపై తిరస్కరించలేదు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో (Amazon Prime Video) పాటు బుక్‌మైషోలో కూడా తెలుగు వర్షన్ రన్ అవుతుంది. అయితే తాజాగా జియో సినిమా(JioCinema) ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ తాజాగా తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది.గతేడాది ఆగస్టు 23న విడుదలైన స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రానికి హాలీవుడ్లో మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎమ్బిడి రేంటిగ్ కూడా 7కు పైగా ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తి చూపారు. కానీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్స్‌ను అయితే రాబట్టలేకపోయింది. అయితే, థ్రిల్లింగ్‌తో పాటు బోల్డ్ సినిమాలను ఇష్టపడే వారిని మాత్రం నిరుత్సాహపరచలేదని చెప్పవచ్చు. జె.టి. మోల్నర్ తెరకెక్కించిన ఈ మూవీలో విల్లా ఫిజ్గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలలో మెప్పించారు.సినిమా నిడివి కేవలం 1:35 గంటలు మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్య వన్ నైట్ స్టాండ్‌తో ప్రారంభమైన ఈ కథ ఫైనల్‌గా అనేక మలుపులు తిరుగుతుంది. ఫ్యామిలీతో పాటుగా కూర్చొని చూసే సినిమా ఎంతమాత్రం కాదు. అలాంటి పొరపాటైతే చేయకండని రివ్యూవర్లు కూడా చెప్పారు. స్ట్రేంజ్ డార్లింగ్ మూవీలో ది లేడీ పాత్రలో విల్లా ఫిట్గెరాల్డ్ నటించగా.. డెమోన్ క్యారెక్టర్‌ను గాల్నెర్ పోషించారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో చిత్రం ఉంటుంది. థియేటర్స్‌లో చూసేంత సినిమా అయితే కాదని చెప్పవచ్చు. కానీ, ఓటీటీలో మాత్రం పక్క చూసేయవచ్చు. చివరి 40 నిమిషాలు మరీ వైలెంట్‌గా మూవీ మారిపోతుంది. ఓటీటీలో ఔట్‌స్టాండింగ్ మూవీ అని చెప్పవచ్చు. ఈ వీకెండ్లో అమెజాన్, జియో సినిమాలో మీరూ చూసేయండి. -
ఆయన నుంచి ఫోన్ వస్తే చాలు.. చేయి కోసుకోవడానికైనా రెడీ: హీరోయిన్
హీరోహీరోయిన్లుకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. పలానా పాత్ర చేయాలని.. అలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటారు. అంతేకాదు కొంతమంది దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలు.. చిన్న పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అవుతారు. అలా ఓ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అన్ని వదిలేసి ఆయన మూవీ కోసం ఎదురు చూస్తాను అంటోంది సీనియర్ నటి ప్రియమణి(Priyamani ). అంతేకాదు ఆయన సినిమాలో నటించేందుకు చేసు కూడా కోసుకుంటాను అని చెబుతోంది. ఇంతకీ ఆ గొప్ప దర్శకుడు ఎవరంటే..?ఫోన్ వస్తే చాలు.. దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే.. అందులో కచ్చితంగా మణిరత్నం(Mani Ratnam) పేరు ఉంటుంది. సౌత్ సినిమా దశాదిశను మార్చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన తెరకెక్కించిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్ మూవీస్. ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు మణిరత్నం ఫేవరేట్ డైరెక్టర్. వారిని తెరపై అందంగా, డిఫరెంట్‌గా చూపించే డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన సినిమాలో చాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోదు. కమిట్ అయిన సినిమాలను వదిలేసి మరీ.. మణిరత్నం సినిమాల్లో నటిస్తారు. ప్రియమణికి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం. తాజగా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. గతంలో మణిరత్నం తెరకెక్కించిన రావన్ సినిమాలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్లో బిజీ బిజీఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియమణి.. పెళ్లి తర్వాత చిత్రపరిశ్రమకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి..సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. -
నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే: నాగచైతన్య
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించింది చిత్రం యూనిట్. ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మన పుష్పకా బాప్ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే... వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు... నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’(Thandel) సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా... గుర్తెట్టుకో... ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథను సినిమాగా తీశాం. నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ కథను చందు మొండేటి అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవిగారు అద్భుతంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చించిపడేశాడు’’ అని తెలిపారు. తండేల్ ట్రైలర్ విషయానికొస్తే.. నాతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది. -
యాక్షన్... థ్రిల్
ఆకాశ్ మురళి(Akash Murali), అదితీ శంకర్ జంటగా ‘పంజా’ ఫేం విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ‘నేసిప్పాయా’ పేరుతో తమిళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ‘ప్రేమిస్తావా’(Premistava) పేరుతో ఈ నెల 30న విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మేకింగ్, ఆర్ఆర్ చాలా బాగున్నాయి’’ అని చెప్పారు.‘‘ప్రస్తుతం సమాజంలో బంధాలు ఎలా ఉన్నాయి? అనేది మా చిత్రం చూపిస్తుంది’’ అన్నారు విష్ణువర్ధన్. ‘‘ప్రేమిస్తావా’ని అందరూ సపోర్ట్ చేయాలి’’ అని సహ నిర్మాత స్నేహ బ్రిట్టో కోరారు. ‘‘నా తొలి సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నా అదృష్టం’’ అని చెప్పారు ఆకాశ్ మురళి. ‘‘ఈ చిత్రంలో ప్రేమ, యాక్షన్, రొమాన్స్ ఉన్నాయి’’ అని తెలిపారు అదితీ శంకర్. -
మోహన్‌లాల్ మూవీలో..?
మోహన్‌లాల్ హీరోగా సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో ‘హృదయపూర్వం’(Hridayapoorvam) అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆంటోనీ పెరుంబవుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మాళవికా మోహనన్(Malavika Mohanan)కు అవకాశం లభించిందని మాలీవుడ్ సమాచారం.కథ నచ్చడం, పైగా మోహన్‌లాల్(Mohanlal) మూవీ కూడా కావడంతో ఈ సినిమాకు మాళవికా మోహనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుందని, నాలుగు రోజుల తర్వాత ఈ మూవీ షెడ్యూల్లో మోహన్‌లాల్ జాయిన్ అవుతారని తెలిసింది. -
అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు
ప్రేమ కోసంప్రాణాలర్పించే ధైర్యం అమ్మాయిలకూ ఉంటుందని చెబుతున్నారు హీరోయిన్ కృతీ సనన్(kriti sanon). ‘రాంఝాణా (2013), అత్రంగి రే (2021)’ చిత్రాల తర్వాత హీరో ధనుష్(dhanush), దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘తేరే ఇష్క్ మే’(tere ishq mein). 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల ఇంకా చిత్రీకరణ ఆరంభించలేదు. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు.కాగా ఈ మూవీలో ధనుష్ సరసన హీరోయిన్గా ముక్తి అనే పాత్రలో కృతీ సనన్ నటించనున్నట్లు మంగళవారం వెల్లడించి, ఈ పాత్ర తాలుకూ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘శంకర్... (ధనుష్ పాత్రను ఉద్దేశించి కావొచ్చు) ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అని అర్థం వచ్చేలా కృతీ సనన్ హిందీలో డైలాగ్స్ చెబుతూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి రెడీ అవుతున్న విజువల్స్ కనిపిస్తాయి. నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
బాపులాంటి మూవీని సపోర్ట్ చేయాలి: విశ్వక్ సేన్
‘‘బాపు’ టీజర్(Bapu teaser) చాలా బాగుంది. నిజాయతీగా తీసిన సినిమా ఇది... మంచి విజయం సాధిస్తుంది. ఇలాంటి చిత్రం సక్సెస్ అయితేనే మేకర్స్‌కు ఉత్సాహం వస్తుంది. అలాగే ఇలాంటి సినిమాలు చేయాలనుకునే మిగతావాళ్లకు కూడా ధైర్యం వస్తుంది’’ అన్నారు హీరో విశ్వక్ సేన్(vishwaksen). బ్రహ్మాజీ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’. ‘ఎ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.దయ దర్శకత్వంలో రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధుర ఆడియో ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావడంలేదని చాలామంది అన్నారు.కానీ, ‘పెళ్లి చూపులు, కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాలకు ఎలా వచ్చారో... ‘బాపు’కి కూడా అలానే వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘టీజర్‌ని మించి సినిమా చాలా బాగుంటుంది’’ అని చెప్పారు దయ. ‘‘ఒక డిఫరెంట్ స్టోరీతో యూనిట్ అంతా మంచి సినిమా చేశాం’’ అన్నారు బ్రహ్మాజీ. -
'ప్రయాగ్ రాజ్‌లో ప్రకాశ్ రాజ్'.. సోషల్ మీడియాలో వైరల్
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళాలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్నానం చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. నదిలో ఆయన స్నానం చేస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇది నకిలీ వార్త. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి వారి పవిత్ర పూజలను కూడా కలుషితం చేయడమే వారి పని. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అసలు నిజమేంటో కోర్టులో తెలుస్తుంది. ఇలా చేయడం సిగ్గుచేటు' అని కన్నడలో పోస్ట్ చేశారు. మహాకుంభ్ మేళాలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారని తెలియగానే నెటిజన్స్ విభిన్నమైన కామెంట్స్ చేశారు. అయితే.. ప్రకాశ్ రాజ్ ఫోటోను డీప్ ఫేక్ టెక్నాలజీతోనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ಸುಳ್ಳು ಸುದ್ದಿ“ಸುಳ್ಳ ರಾಜ” ನ ಹೇಡಿಗಳ ಸೈನ್ಯಕ್ಕೆ .. ಅವರ ಪವಿತ್ರ ಪೂಜೆಯಲ್ಲೂ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಬ್ಬಿಸಿ ಹೊಲಸು ಮಾಡುವುದೇ ಕೆಲಸ .. police complaint ದಾಖಲಾಗಿದೆ .. ಕೋರ್ಟಿನ ಕಟಕಟೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ನೋಡೋಣ 😊 #justasking pic.twitter.com/S6ySeyFKmh— Prakash Raj (@prakashraaj) January 28, 2025 -
అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ నటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య అభిమానులతో మాట్లాడారు.నాగచైతన్య అభిమానులతో మాట్లాడుతూ.. 'వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. అభిమానులకు నా చిన్న రిక్వెస్ట్. వైజాగ్‌లో తండేల్ మూవీ కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుందని' సరదాగా మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.తండేల్ కథేంటంటే..శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటన్నదే తండేల్ మూవీ కథ. వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే పెళ్ళాం ముందు నా పరువు పోతుంది - Yuvasamrat #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/izN3MSaue2— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2025 -
అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం: రాశీ ఖన్నా
హీరోయిన్ రాశి ఖన్నా సినిమాల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే కెరీర్ ఎదుగుదలకు ఊపయోగపడతుందని తెలిపింది. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో నటించడంపై రాశీ ఖన్నా మాట్లాడింది.రాశీ ఖన్నా మాట్లాడుతూ.. 'నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా సమయం ఉంది. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్‌తో నడిచే చిత్రాలే మన ఎదుగుదలకు కారణం. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు.' అని పంచుకున్నారు.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా చేయనుంది. కాగా.. రాశి ఖన్నా చివరిసారిగా ది సబర్మతి రిపోర్ట్‌లో కనిపించింది. -
'మహిళల జీవితాల గురించి మీకేం తెలుసు?'.. హీరామండి హీరోయిన్ ఫైర్
బాలీవుడ్ భామ రిచా చద్దా చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించడం విశేషం.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, నైట్‌క్లబ్‌లకు వెళ్లే వారిని ప్రగతిశీల మహిళలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తెరపై చూపించే స్త్రీల నిజ జీవితం గురించి మీకు తెలుసా అని చిత్రనిర్మాతలను ఆమె ప్రశ్నించారు.రిచా మాట్లాడుతూ..' 2010-2012 కాలంలో బాలీవుడ్లో మహిళలు స్మోకింగ్ చేసేవారని కొందరు చెడుగా చూపించారు. అంటే సిగరెట్ తాగి.. నైట్ క్లబ్ వెళ్లేవారని కొందరు దర్శకులు బ్యాడ్‌గా రాశారు. అంతేకాదు క్లబ్‌ల్లో డ్యాన్స్ చేసేవారి పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించినట్లు గుర్తించా. నేను ఆ చిత్ర నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా.అసలు అలాంటి మహిళల గురించి మీకు తెలుసా?. మహిళల త్యాగం గురించి మీకేం తెలుసు. మా ఎముకల నుంచి ఒక బిడ్డను తయారు చేస్తాం. మా రక్తంతో వారికి పోషకాలు అందిస్తాం. పిల్లల కోసం మా జుట్టు, నిద్ర అన్ని దూరమవుతాయి. అంతకుమించిన త్యాగం ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? ' అని ఆమె ప్రశ్నించారు.కాగా.. రిచా చద్దా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, తాహా షా బాదుషా కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిచా ఇటీవల గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇది ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న యువతి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
లవ్, రిలేషన్ షిప్, గొడవలు..ఆసక్తికరంగా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.ట్రైలర్ విషయానికి వస్తే ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు ఇలా ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్‌కు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉందని చెప్పేలా ట్రైలర్ ఉంది. ఆకాష్ మురళి ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తొలి సినిమాతోనే అదరగొట్టాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అదితి శంకర్ విషయానికి ప్రేమికురాలిగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు. శరత్ కుమార్, ఖుష్బూ ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారని తెలుస్తోంది.ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..‘‘ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగువారిని కలుస్తున్నా. నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ సంతోషపడుతుంది. మా సినిమాను సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అదితి, ఆకాష్ చాలా చక్కగా నటించారు. కొన్ని సీన్స్‌లో వాళ్ల నటన చూసి ఎమోషనల్ అయ్యాను. లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ చేసిన శరత్ కుమార్, ఖుష్బూ, ప్రభుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్క్రిప్ట్‌ను నిర్మాతలు ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. యువన్ శంకర్ రాజా నా స్కూల్ మేట్. అప్పటి నుంచి అతని సంగీతం తెలుసు. నా సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం చేస్తారు. యువన్ సంగీతం కోసమే సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ నాకు, ఈ సినిమాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికీ అంతే ఎనర్జీతో ఉన్నారు. ఆయన చాలా ఎత్తుకు ఎదుగుతారని పంజా సినిమా టైమ్‌లోనే నాకు అర్థమైంది. ఆయన మనసు నిజంగా చాలా మంచిది. ఆప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పారు.హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం. ప్రేమిస్తావా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి. అదితి నిజంగా బెస్ట్ కోస్టార్. డైరెక్టర్ హర్ష వర్ధన్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశారు. అందరూ తప్పకుండా ప్రేమిస్తావా సినిమాను చూడండి’’ అని చెప్పారు.హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ..‘‘ప్రేమిస్తావా సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఇందులో లవ్ ఉంది.. యాక్షన్ ఉంది.. రొమాన్స్ ఉంది.. డైరెక్టర్ విష్ణు వర్ధన్ గారి స్టైలిష్ మేకింగ్ ఉంది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి. మా నాన్నగారికి ఇస్తున్న ప్రేమను నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. -
Thandel Trailer: ఓనరా..కాదు లీడర్.. అదిరిపోయిన తండేల్ ట్రైలర్
‘ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందుకు అడుగేసినోడే తండేల్’, ‘తండేల్ అంటే ఓనరా..?’, ‘ కాదు లీడర్’ లాంటి పవర్ఫుల్ డైలాగులతో తండేల్ ట్రైలర్ రిలీజైంది. యువ సామ్రాట్ నాగ చైతన్య , నేచులర్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel Trailer). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
‘తల’ కోసం రెండేళ్లు ఆలోచించా: అమ్మ రాజశేఖర్
అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను. దీంతో అంతా అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) పని అయిపోయిందని అన్నారు. కానీ నేను మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాను. ప్రస్తుతం ‘తల’ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే చెయ్యితో, కాలితో అన్నింటితోనూ వస్తా(నవ్వుతూ). మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అన్నాడు ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘తల’(thala Movie). ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. అంకిత నాన్సర్ హీరోన్. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సందర్భంలో స్టేజ్‌పై మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్‌బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి" అన్నారు.హీరో అశ్విన్ మాట్లాడుతూ. "తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి" అన్నాడు.నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి' అన్నాడు.హీరో అమ్మ రాగిణ్ రాజ్ మాట్లాడుతూ... మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న తప్పక చూడండి వైలెంట్ వాలెంటైన్స్ థాంక్యూ" అన్నారు. -
మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్ బ్యూటీ ..వరుడు ఎవరంటే..?
రాఖీ సావంత్(Rakhi Sawant).. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఈమె సుపరిచితమే. అప్పట్లో ప్రత్యేక పాటలకు కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అంద, అభినయంతో బాలీవుడ్‌లొ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాఖీ.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షో(Bigg Boss Show)లోకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమాల కంటే కాంట్రవర్సీ పోస్టులతోనే ఆమెకు వార్తల్లో నిలుస్తోంది. పిచ్చి చేష్టలు..వివాదస్పద ప్రకటనలు చేస్తూ నెట్టింట ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాఖీ సావంత్..తాజాగా తన మూడో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా డోడి వీడియోను షేర్ చేసింది. అయితే వీరిద్దరి పెళ్లి పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.రిసెప్షన్ మాత్రం ఇండియాలో ఉంటుందట. ఇక హనీమూన్ కోసం మూడో భర్తతో స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్‌కు వెల్లనున్నట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం రాఖీ సావంత్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఇక రాఖీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ బాలీవుడ్ బ్యూటీ మొదట వ్యాపారవేత్త అయిన రితేష్ సింగ్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ సోమి ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. -
'బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ'.. వెంకీమామ ఫుల్ సాంగ్ చూశారా?
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. జనవరి 14న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.276 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ మూవీలో ఓ సాంగ్ విక్టరీ వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ.. అంటూ సాగే పాట ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా వెంకటేశ్ పాడిన సాంగ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా.. భీమ్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.