Movies
-
'ఈ వయసులో మీలా చేయలేను'.. సౌత్ హీరోలపై షారూఖ్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు. .@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025 -
‘తల’ కోసం రెండేళ్లు ఆలోచించా: అమ్మ రాజశేఖర్
అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నాను. దీంతో అంతా అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) పని అయిపోయిందని అన్నారు. కానీ నేను మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాను. ప్రస్తుతం ‘తల’ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. త్వరలోనే చెయ్యితో, కాలితో అన్నింటితోనూ వస్తా(నవ్వుతూ). మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’ అన్నాడు ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘తల’(thala Movie). ఈ చిత్రంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. అంకిత నాన్సర్ హీరోన్. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ..నా కొడుకుతో సినిమా చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కోరిక. ఓ సందర్భంలో స్టేజ్‌పై మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. అబ్బాయికి సంబంధించిన కథ కావాలి. మంచి కథ కావాలి. నాకంత ఓపిక లేదు. రియల్ లైఫ్ లో లవ్ ప్రపోజ్ చేసి నెక్స్ట్ డే పెళ్లి చేసుకున్న కథ కాకుండా ఏం చేయాలని ఆలోచించి మాస్ తీయాలనుకున్నా, అబ్బాయితో ఎలా చేయాలని రెండేళ్లు ఆలోచించి ఒక పాయింట్, దానికి ఒక కొత్త పాయింట్ తీసుకున్నా, కొత్తదనం కావాలనుకునే వాడు సినిమా ఆనందంగా చూడవచ్చు’ అన్నారు.నటుడు సోహైల్ మాట్లాదుతూ.. తల ఎవరిదో తెలియదు కానీ ముందు మోషన్ టీజర్ పంపారు. అమ్మ రాజశేఖర్ నాకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి తెలుసు. తరువాత బిగ్‌బాస్ తో కలిశాం నిజంగానే అమ్మ రాజశేఖర్ పేరుకు తగ్గట్టే అందరికీ వండి పెట్టేవాడు. తినకున్నా అడిగి మరీ పుడ్ వండి పెట్టేవారు. తను కింద కూర్చొని భోజనం చేస్తాడు. ఇప్పటికీ అదే మెయిన్టైన్ చేస్తారు. రణం సినిమా తర్వాత ఈ మూవీ కంబ్యాక్ గా అనిపిస్తోంది. తల టీజర్ చూడగానే అమ్మ రాజశేఖర్ బ్యాక్ అనిపించింది. రాగిన్ నెక్ట్స్ ధనుష్ అవుతాడు ఇండస్ట్రీకి" అన్నారు.హీరో అశ్విన్ మాట్లాడుతూ. "తల ట్రైలర్ చూశాను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. రాగిన్ అదృష్టవంతుడు. నాన్న దర్శకుడు, అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అక్క ఏడీ. ముగ్గురి చేతుల మీదుగా సినిమా లాంచ్ అవడం లక్కీ. విజువల్స్, కంటెంట్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ చాల బాగుంది. అస్లాం సౌండ్ వినిపిస్తోంది. దీపా ఆర్ట్స్ హ్యాండ్ పడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికీ బిగ్ కంగ్రాట్స్, తల మూవీని ఆదరించండి" అన్నాడు.నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలును. అమ్మ రాజశేఖర్ ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు నుంచి వేషం ఉందని చెప్పారు. ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. అదే అడిగితే నెక్స్ట్ సినిమా అన్నారు. రెండు సినిమాల తర్వాత అవకాశం ఇచ్చారు. ఒకసారి అనుకోకుండా మేం కలిశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై మొత్తం తిప్పి చూపించారు. రాగిన్ పుట్టినరోజుకి వెళ్లాను. ఆ తరువాత నాకు ఫోన్ చేసి మా అబ్బాయి హీరో అంటే నేను ముసలి అవుతున్నట్టు అనిపించింది. హీరోకి ఉండాల్సిన లక్షణాన్నీ ఉన్నాయి. తల వైలెంట్ వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుంది. అందరూ చూడండి' అన్నాడు.హీరో అమ్మ రాగిణ్ రాజ్ మాట్లాడుతూ... మూవీలో అంతా చాలా కష్టపడ్డారు. వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాను. క్లైమేట్ చేంజెస్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ, నాన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సహాయం చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సినిమాను నిర్మించినంచుకు ధన్యవాదాలు. మీ డబ్బులకు ఈ మూవీ న్యాయం చేస్తుంది. ఫిబ్రవరి 14న తప్పక చూడండి వైలెంట్ వాలెంటైన్స్ థాంక్యూ" అన్నారు. -
మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్ బ్యూటీ ..వరుడు ఎవరంటే..?
రాఖీ సావంత్(Rakhi Sawant).. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఈమె సుపరిచితమే. అప్పట్లో ప్రత్యేక పాటలకు కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అంద, అభినయంతో బాలీవుడ్‌లొ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రాఖీ.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షో(Bigg Boss Show)లోకి వెళ్లి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమాల కంటే కాంట్రవర్సీ పోస్టులతోనే ఆమెకు వార్తల్లో నిలుస్తోంది. పిచ్చి చేష్టలు..వివాదస్పద ప్రకటనలు చేస్తూ నెట్టింట ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాఖీ సావంత్..తాజాగా తన మూడో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏది ఏమైనా.. చివరకు నా జీవితంలో సరైన వ్యక్తి దొరికాడు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా డోడి వీడియోను షేర్ చేసింది. అయితే వీరిద్దరి పెళ్లి పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.రిసెప్షన్ మాత్రం ఇండియాలో ఉంటుందట. ఇక హనీమూన్ కోసం మూడో భర్తతో స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్‌కు వెల్లనున్నట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం రాఖీ సావంత్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఇక రాఖీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ బాలీవుడ్ బ్యూటీ మొదట వ్యాపారవేత్త అయిన రితేష్ సింగ్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన కార్త వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ సోమి ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. -
'బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ'.. వెంకీమామ ఫుల్ సాంగ్ చూశారా?
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. జనవరి 14న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.276 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ మూవీలో ఓ సాంగ్ విక్టరీ వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ.. అంటూ సాగే పాట ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా వెంకటేశ్ పాడిన సాంగ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా.. భీమ్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
'అలాంటి వ్యక్తి అంటే చాలా ఇష్టం'.. రిలేషన్‌షిప్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్
పుష్ప భామ రష్మిక మందన్నా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో బాలీవుడ్ చిత్రం ఛావాతో అభిమానులను పలకరించనుంది. ఇటీవల తన కాలికి గాయమైనప్పటికీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన రిలేషన్షిప్ గురించి తొలిసారి ఓపెన్ అయిపోయింది.రష్మిక మాట్లాడుతూ.. " నా ఇల్లే అత్యంత సంతోషకరమైన ప్రదేశం. అది నాకు ఎప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో గెలుపు అనేది వస్తూ, పోతూ ఉంటుంది. విజయమనేది మన లైఫ్‌లో శాశ్వతం కాదు. కానీ నా ఇల్లు ఎప్పటికీ శాశ్వతం. అందుకే అక్కడి నుంచే పనిచేస్తున్నా. అక్కడ నేను పొందిన ప్రేమ, కీర్తి ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ విషయానికొస్తే తన కళ్లే ప్రధానమని నేను నమ్ముతా. అంతే కాదు తాను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను.. అంటే ఎప్పుడు స్మైలీ ఫేస్‌తో పాటు తన చుట్టు ఉన్నవారిని గౌరవించే వాళ్లంటే నాకు ఇష్టం.' అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.రిలేషన్‌పై రూమర్స్..కాగా.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ కూడా రిలేషన్ షిప్లో ఉన్నట్లు బయటికి చెప్పారు. అయితే ఎవరనేది మాత్రం పేరును వెల్లడించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ వివరాలను పంచుకుంటానని కూడా స్పష్టం చేశాడు.అయితే రష్మిక మందన్నా చాలాసార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే పండుగ వేడుకల్లో మెరిసింది. గతేడాది విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. చాలాసార్లు తన ఫోటోలతో అభిమానులకు దొరికిపోయింది. విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూనే ఉంటుంది. దీంతో విజయ్, రష్మిక రిలేషన్లో ఉన్నట్లు ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు రిలేషన్‌పై క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. కాగా.. ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. -
హీరోయిన్‌తో ఆ సీన్ కోసం 37 టేకులు.. హీరోకే చిరాకు వచ్చిందట!
తెరమీద రొమాన్స్ పండిచడం అనేది అంత ఈజీ పని కాదు. హీరోహీరోయిన్లు మధ్య కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. అయితే ఇలాంటి సీన్స్ దాదాపు సింగిల్ టేక్‌లో క్లోజ్ చేస్తుంటారు. ఏదైనా తేడా ఉంటే ఒకటి, రెండు టేకులు తీసుకుంటారు. కానీ ఓ సినిమాలో ముద్దు సీన్ కోసం హీరోహీరోయిన్లు 37 టేకులు తీసుకున్నారు. దర్శకుడు అనుకున్న విధంగా సీన్ రాకపోడంతోనే లన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. (చదవండి: పేరుకే బుల్లితెర నటి.. కోట్ల సంపాదన.. ఆ యంగ్ బ్యూటీ ఎవరంటే?)అయితే ఆ లిప్ సీన్ అన్ని టేకులు తీసుకోవడానికి కారణం హీరోయినే అని చెబుతున్నాడు హీరో. ఇంతకీ ఎవరా హీరో ఏంటా కథ కామీషు అంటే.. 2014 లో వచ్చిన కాంచి సినిమాలో కార్తీక్ ఆర్యన్( Kartik Aaryan), మిస్తి చక్రవర్తి జంటగా నటించారు. సుభాష్ గయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఒక లిప్ లాక్ కోసం ఏకంగా 37 టేకులు చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో హీరో కార్తీక్ ఆర్యనే చెప్పాడు. ‘ముద్దు సీన్ కూడా తలనొప్పిగా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. కాంచి సినిమాలో ఓ కిస్ సీన్ ఉంటుంది. లవర్స్‌గా నటించిన మిస్తి, నేను ముద్దు పెట్టుకోవాలి. షూటింగ్ ప్రారంభమైంది. ఇద్దరం కలిసి కిస్ చేసుకున్నాం. కానీ దర్శకుడు సంతృప్తి చెందలేదు. కట్ చెప్పేసి మళ్లీ ముద్దు పెట్టుకోమన్నాడు. అలా మొత్తంగా 37 టేకులు తీసుకున్న తర్వాత ‘ఓకే’ చెప్పాడు.(చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ కమెడియన్ అలీ.. వీడియో వైరల్!)అయితే అన్ని టేకులు తీసుకోవడంతో నా తప్పేమి లేదు. కానీ మిస్తి ఎక్కన నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని కాస్త భయపడ్డాను. దర్శకుడు చెప్పినట్లుగానే ముద్దు పెట్టుకున్నాం. అయినా ఆయన కట్ చెప్పేశాడు. ఒకనొక దశలో నాకే చిరాకు వేసింది. ‘నాకు ముద్దు పెట్టుకోవడం రావట్లేదు. ఎలా పెట్టుకోవాలో మీరు చేసి చూపించండి సార్’ అని డైరెక్టర్ని అడగాలనిపించింది(నవ్వుతూ) అని కార్తిక్ చెప్పారు. అయితే ఈ ముద్దు సీన్ గురించి మిస్తి ఎక్కడ మాట్లాడలేదు. కానీ హీరో కార్తినే తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాంచి చిత్రం విషయానికొస్తే.. 2014లో ఈ చిత్రం విడుదలైంది. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, రిషి కపూర్, ఆదిల్ హుస్సేన్, ముఖేష్ భట్ కీలక పాత్రలు పోషించారు. -
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్‌గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
లపతా లేడీస్ అరుదైన ఘనత.. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ!
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్, జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్, సివిల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పోటీపడుతోంది. బెస్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపతా లేడీస్‌ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 14న జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు. కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు.ఓపెన్ హైమర్‌తో ఢీ..కాగా.. గతేడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు పైమాటే. -
అప్పుడే మంచి సినిమాలు వస్తాయి: సుమన్
చిత్ర పరిశ్రమలో కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. నూతన దర్శకులను, చిన్న చిత్రాలను ప్రొత్సహిస్తేనే మంచి సినిమాలు వస్తాయి’ అన్నారు సీనియర్ హీరో సుమన్. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాజా మార్కండేయ". "వేట మొదలైంది" అనేది ఉప శీర్షిక.చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ ఆశ్వంత్, నిర్మాతలు సామా శ్రీధర్, పంజల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రంలోని ఒక్కో పాటను విచ్చేసిన అతిధులు ఆవిష్కరించగా.. టీజర్ ను రాపోలు భాస్కర్ విడుదల చేశారు. సినిమా ట్రైలర్ ను హీరో సుమన్ రిలీజ్ చేశారు.అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. "రాజా మార్కండేయ" సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసినట్టు ఉంది. అందరూ కొత్తవాళ్ళైనా సినిమాలో మంచి కథ ఉందని అర్థం అవుతుంది. ఇలాంటి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. చిత్రంలో శివయ్య పాట చాలా అద్భుతంగా ఉంది. రాబోయే శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ పాట మార్మోగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి లాభాలు రావాలి" అన్నారు.సంగీత దర్శకులు యస్ కె. మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. "బన్నీ ఆధ్వర్యంలో ఫోర్ ఫౌండర్స్ టీం మమ్ములను తీసుకొచ్చి ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించారు. వారివల్లే మేము ఇండస్ట్రీకి రాగలిగాము. ఆడియోతోపాటు సినిమాని కూడా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాము అన్నారు.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. "చిత్ర దర్శకుడు బన్నీ మా సభ్యుడే. చాలా టాలెంట్ వున్న వ్యక్తి. నిర్మాతలు మా జిల్లాకు చెందినవారు. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సాంగ్స్ ట్రైలర్ అధ్బుతంగా వున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది" అన్నారు.దర్శకుడు బన్నీ ఆశ్వంత్ మాట్లాడుతూ.. "ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా తీయాలని నా కల. నాకు సహకరించి ప్రోత్సహించిన మా నిర్మాతలకు, స్నేహితులకి ధన్యవాదాలు. ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది కాన్సెప్ట్. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కోపరేట్ చేసి వర్క్ చేశారు.. లైఫ్ లాంగ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. మా సినిమా ప్రేక్షలందరికి నచ్చుతుంది" అన్నారు. ‘సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాత సామా శ్రీధర్ అన్నారు. -
సీఎం రేవంత్ కంటే నాకే ఎక్కువ నచ్చింది: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్‌కు తలమాణికంగా మారుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఇక్కడ ఏర్పాటు చేసిన చెట్లు తనను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయన్నారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాందేవ్ 2000వ సంవత్సరంలో ఈ పార్క్ మొదలు పెట్టారు. ఆయన చాలా రీసెర్చ్ చేసి విదేశాల నుంచి మొక్కలు తెచ్చి నాటారు. అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి ఈ పార్క్‌ను చూసి ముచ్చట పడ్డారు. అయితే ఈ పార్క్ మీకంటే ముందు నాకు చాలా బాగా నచ్చింది. ఈ పార్క్‌లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యానవనం వల్ల చాలామంది ఉపాధి దొరుకుతుంది అని ఆకాంక్షించారు.చదవండి: ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు! -
సఖి.. ఫస్ట్ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం
సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్ హిట్. పేరుకే డబ్బింగ్ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్ వర్షన్ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అయింది.మాధవన్‌కు బదులుగా..తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్ షారూఖ్, కాజోల్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్‌తో దిల్సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్‌ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్ సెల్వన్ 2 తెరకెక్కించాడు.చదవండి: సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్! -
23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా.. ఇది వాస్తవమే.షారుఖ్‌ని మించిన అభిమానం.. బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల ఫాలోవర్స్‌తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో షారుఖ్‌ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.ఎపిసోడ్‌కి 18 లక్షలుజన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్‌కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు!
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్‌ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్‌లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్‌పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.అసలేం జరిగింది?నయనతార జీవితకథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు. అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్‌ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్ -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్
హీరోయిన్ అన్నాక అందంగా కనిపించడమే కాదు, ఆ అందాన్ని కాపాడుకోవాలి కూడా! అదే సమయంలో అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు సర్జరీలను ఆశ్రయిస్తారు. లిప్ ఫిల్లర్స్, ప్లాస్టిక్ సర్జరీ.. ఇలా రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ఇది తప్పేం కాదంటోంది హీరోయిన్ ఖుషీ కపూర్ (Khushi Kapoor). కనుబొమ్మల మధ్య..'నా కనుబొమ్మ వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయి. కానీ వాటి మధ్య గ్యాప్ కనిపించింది. దాన్నలా వదిలేయలేకపోయాను. కనుబొమ్మలు సరిచేయించుకున్నాను. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయించుకున్నాను. అప్పుడు పది రోజులవరకు కళ్లపై నీళ్లు పడనివ్వొద్దన్నారు. స్నానం చేసేటప్పుడు ధరించమని ఓ షీల్డ్ ఇచ్చారు. అది నాకు సరదాగా అనిపించింది. వాటిని కళ్లపై పెట్టుకుని మా ఫ్రెండ్స్‌కు ఫోటో పంపించాను. ఎవరూ దాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇప్పుడిలాంటివన్నీ సర్వసాధారణం. అవమానంగా ఫీలవడానికి ఏముంది?ఇలాంటి పద్ధతులను అనుసరించడం నేరమేమీ కాదు. ప్లాస్టిక్.. అనగానే అదేదో అవమానంగా ఫీలవుతారు. దాని గురించి బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. కారణం జనాలు ఎక్కడ ద్వేషిస్తారోనని! నేనేమంటానంటే ద్వేషించాలనుకునేవారు ఏ సాకుతోనైనా అదే పని చేస్తారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు జనాలు కూడా నాగురించి ఏవేవో ఊహించుకున్నారు. నేనెలా ఉంటాను? ఏంటి? అంటూ ఎక్కువగా నెగెటివ్‌గానే చర్చించారు' అని చెప్పుకొచ్చింది. కాగా గతేడాది ఖుషి కపూర్.. తాను లిప్ ఫిల్లర్స్ వేయించుకున్న విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే.ఆర్చీస్తో తెరంగేట్రంఇకపోతే దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి.. ద ఆర్చీస్ (2023) సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో బెట్టీ కూపర్‌గా నటించింది. ప్రస్తుతం లవ్యాపా మూవీ చేస్తోంది. ఇది తమిళ లవ్‌టుడే సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది.చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
ఓటీటీలో నిహారిక కొత్త సినిమా.. వచ్చేవారమే స్ట్రీమింగ్
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన నిహారిక (Niharika Konidela) తర్వాత సడన్‌గా యాక్టింగ్‌ను పక్కనపెట్టేసింది. మధ్యలో యాంకరింగ్ ట్రై చేసింది. అలాగే నిర్మాతగా మారి చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసింది. ఈ క్రమంలో పలు హిట్స్ అందుకుంది. చాలాకాలం తర్వాత ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అదే మద్రాస్కారన్ (Madraskaaran Movie). షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిహారిక కథానాయిక. నెల రోజుల్లోనే ఓటీటీలోకి..వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.జగదీష్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. పొంగల్ రేసులో ఉన్న విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. కానీ మద్రాస్కారన్ మాత్రం వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది.వచ్చే వారంలో..ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. దీంతో నిహారిక సినిమా చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. Makkkale oru arumaiyana action block maatirku🤩#madraskaaran from Feb 7 only on #ahaTamil @SR_PRO_OFFL @SamCSmusic @vaali_mohandas@ShaneNigam1 @KalaiActor @IamNiharikaK @Aishwaryadutta6#Karunas @vaali_mohandas #actor_sharan @prasannadop @santhoshchoreo @DreamBig_film_s… pic.twitter.com/GovTbmKNoh— aha Tamil (@ahatamil) January 27, 2025 చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ..
గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) రిజల్ట్‌పై హీరోయిన్ అంజలి (Anjali) తొలిసారి స్పందించింది. కొన్ని ఫలితాలను చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ సంక్రాంతికి అంజలి నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి గేమ్ ఛేంజర్ కాగా మరొకటి మదగజరాజ. పన్నెండేళ్లక్రితం అంజలి హీరోయిన్గా నటించిన మదగజరాజ ఎట్టకేలకు తమిళనాట విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న రిలీజ్ చేస్తున్నారు.అంతవరకే నా పనిఈ సినిమా సమావేశంలో అంజలికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గేమ్ ఛేంజర్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చుంటే బాగుండేది కదా.. దానిపై మీ ఫీలింగ్ ఏంటి? అన్న ప్రశ్నకు.. ఒక నటిగా నా పాత్రకోసం నేను బాధ్యత తీసుకోగలను. నా పాత్రను ఎలా పోషించాలి? అందుకోసం వందశాతం ఎఫర్ట్స్ పెడుతున్నానా? లేదా? అన్నదే నా చేతిలో ఉంటుంది. అక్కడితోనే నా పనైపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్‌కు వెళ్తుంటాము. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాము.ఎవరూ సినిమా బాగోలేదని అనలేదుఅయినా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. కొన్ని సినిమాలపై నమ్మకం ఉంచి నటిస్తాము. నేను గేమ్ ఛేంజర్‌ను పూర్తిగా నమ్మాను. ఈ సినిమా చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ గేమ్ ఛేంజర్ బాగోలేదని చెప్పలేదు. మంచి సినిమా అని కితాబిచ్చారు. సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా వేరు. బాధగా ఉందిగేమ్ ఛేంజర్ మంచి సినిమా.. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని నాతో చాలామంది అన్నారు. అది నాకు చాలు. అయినా సరే.. కొంత బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. మదగజరాజ సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చుంటే ఒప్పుకునేవారా? అన్న ప్రశ్నకు.. అంజలి, వరలక్ష్మి (Varalaxmi Sarathkumar).. కథ ఎవరు చెప్తున్నారనేదాన్ని బట్టి తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.గేమ్ ఛేంజర్ఇదిలా ఉంటే రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయం రాబట్టలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. చరణ్ ద్విపాత్రాభినయం చేయగా అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి -
నేను నటినే!
కార్లా సోఫియా గాస్కాన్... ఆస్కార్ నామినేషన్స్‌లో మొట్టమొదటి ట్రాన్స్‌గా స్థానం దక్కించుకొని, చరిత్ర సృష్టించింది. మ్యూజికల్ క్రైమ్ ఫిల్మ్ ‘ఎమీలీయా పెరెజ్’ చిత్రంలో టైటిల్ క్యారెక్టర్ పోషించి, ఉత్తమ నటిగా కార్లా ఆస్కార్‌కు ఎన్నికైంది. మొత్తం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమనే తనవైపు తిప్పుకున్న, కార్లా పుట్టింది స్పెయిన్‌లోని ఆల్కోబెండాస్లో. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, లండన్‌లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని నటిగా మారింది. హాస్య చిత్రం ‘ది నోబుల్ ఫ్యామిలీ’ విజయంతో ఇక వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది. 2024లో విడుదలైన ‘ఎమిలియా పెరెజ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఉత్తమ నటిగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు’, ‘యూరోపియన్ ఫిల్మ్ అవార్డు’లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. అయితే, కాలం మారినా, సమాజం మారలేదు అన్నట్లు సోషల్ మీడియాలో ‘ఆమె ‘ఉత్తమ నటి’ లేదా ‘ఉత్తమ నటుడు’గా నామినేట్ చేశారో తెలియటం లేదు’ అని ప్రశ్నించిన ఒక అభిమానికి కార్లా ‘‘మేడమ్, నేను నటిని! సినిమాల్లో రాక్షసుడిగా, కుక్కగా ఇలా ఏ పాత్రలో నటించినా, నేను ‘నటి’గానే నామినేట్ అవుతాను’’ అని స్పందించింది. -
సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి
‘‘నాకు ఒకే రకమైన పాత్రలు వస్తుండటంతో సినిమాలు వదిలేయాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు ‘రాచరికం’(Racharikam) టీమ్‌ని నా వద్దకి పంపించాడని అనిపించింది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని అప్సరా రాణి(Apsara Rani) తెలిపారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో విజయ్ శంకర్ మాట్లాడుతూ–‘‘రాయలసీమ అంటే ఏంటో ‘రాచరికం’ చూపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేశాను’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘విజయ్‌గారు చాలా అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశారు’’ అని సురేశ్ లంకలపల్లి చెప్పారు. ‘‘ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతిసారి నా మిత్రులే నన్ను సపోర్ట్ చేశారు’’ అన్నారు ఈశ్వర్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, ‘ఆదిత్య మ్యూజిక్’ నిరంజన్, కెమేరామేన్ ఆర్య సాయి తదితరులు మాట్లాడారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
‘బిగ్ బాస్’ ఫేమ్ రోహిత్ సహాని(Rohit Sahani), అబిద్ భూషణ్(నటుడు నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్ టీరియస్’(Miss Terious). మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఉష, శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్(యూఎస్ఏ) నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మిస్ టీరియస్’.అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘మా సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గదు. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో ఈ చిత్రం నిర్మించడం సంతోషం. ఎమ్ఎల్ రాజా అద్భుతమైన సంగీతం అందించారు’’ అని జయ్ వల్లందాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా), ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: రామ్ ఉప్పు. -
అడ్డంగా నువ్వు బుక్కయ్యావా...
బ్రహ్మానందం(brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని రెండో సాంగ్‌ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విడుదల చేశారు.సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిరియాల పాడారు. ‘అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావా.. ఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యావా... గురిచూసి బాగా దెబ్బేశాడా నిన్నే తాతయ్యా...’ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: మితేష్ పర్వతనేని, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు. -
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
ది ఇండియా స్టోరీ ప్రారంభం
‘ది ఇండియా స్టోరీ’ని మొదలెట్టారు హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘ది ఇండియా స్టోరీ’(The India Story). చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పుణేలోప్రారంభమైంది. ‘‘ది ఇండియా స్టోరీ’ తొలి షెడ్యూల్‌ని పుణే(Pune)లోప్రారంభించాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, ఓ ప్రభావితమైన కథను చూపించబోతున్నాం. ఆగస్టు 15న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని ‘ఎక్స్’ వేదికగా కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ‘ది ఇండియా స్టోరీ’ లోని ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ కొల్హాపూర్‌లో జరగనుందని బాలీవుడ్ సమాచారం. రైతుల కష్టాలు, వ్యవసాయ రంగంలో కొన్ని పురుగులమందు వ్యాపార సంస్థలు చేసే మోసాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టాక్. -
జహాపన
‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ లాంటి చిత్రాల్లో బాలనటుడుగా చేసిన ఆనంద్ వర్ధన్(Anand Vardhan) హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిదురించు జహాపన’(Nidurinchu Jahapana). నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటించారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్పై సామ్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.ఈ మూవీ టీజర్‌ను రిలీజ్(Teaser released) చేశారు. ‘మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే.. నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ, సింపుల్‌గా చెప్పాలంటే నీ లైఫ్‌లో పదిహేడేళ్ల జీవితాన్ని మిస్ అయిపోయావు’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్. -
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామర్.. బుట్టబొమ్మ స్టన్నింగ్ పిక్స్
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామరస్ పిక్స్..మరింత బోల్డ్నెస్తో బుట్టబొమ్మ పూజా హెగ్డే..గుర్రంపై మృణాల్ ఠాకూర్ సవారీ..అదిరిపోయే లుక్‌తో లక్ష్మీ రాయ్ పోజులు..సముద్రంలో చిల్ అవుతోన్న శిల్పా శెట్టి.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)