గుంటూరు : రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. కారులో 50 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా గణపవరం వద్ద గురువారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కేరళ వెళ్తున్న కారు గణపవరం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.
లారీ - కారు ఢీ: వ్యక్తి మృతి... గంజాయి స్వాధీనం
Published Thu, Feb 11 2016 6:23 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement