వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో భాస్కర్‌నాయుడు
గుంటూరు రూరల్ : గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో రైతుల నుంచి ఆధార్ నంబర్ల సేకరణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని గుంటూరు ఆర్డీవో భాస్కర్‌నాయుడు అన్నారు. గుంటూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాల తహశీల్దార్లు, వీఆర్వోలకు వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి పాస్‌పుస్తకాల దరఖాస్తులకు సంబంధించి ఆధార్ నంబర్ కచ్చితంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
ప్రతి రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్, సెట్ కాన్ఫరెన్స్‌లో మండలాల వారీగా ఆధార్ నంబర్ల నమోదు వివరాలను క్షుణ్ణంగా తెలియజేయాలన్నారు. గ్రామాల్లో రైతులకు పాస్ పుస్తకాల మంజూరు ఈ పాస్‌పుస్తకాల దరఖాస్తు గురించి వివరంగా తెలియజేసి దరఖాస్తులు చేసిన వాటిని త్వరితగతిన పరిశీలించాల్సిందిగా తెలియజేశారు. ప్రభుత్వ స్థలాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాల్సిన ప్రక్రియ కూడా వేగవంతం చేయ్యాల్సిందిగా సూచించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతులకు ఆధాన్ నంబర్లు అనుసంధానం చేయ్యాల్సిందిగా ఆదేశించారు.
పాస్‌పుస్తకాలకు సంబంధించిన ఖాతా నంబర్లను కూడా ఆన్‌లైన్ పద్ధతి ద్వారా నమోదు చెయ్యాల్సిందిగా తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్, అడంగళ్ కాపీలను కూడా ఆన్‌లైన్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది ప్రజలకు తెలియని వాటిపై అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో గుంటూరు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్‌వోలు, డిప్యూటీ తహశీల్దార్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల నుంచి ఆధార్ నంబర్లు సేకరించాలి
Published Wed, Mar 4 2015 2:12 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement