సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు ఏపీ ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శ్రీకాకుళం - బీసీ మహిళ, విజయనగరం - బీసీ మహిళ, విశాఖపట్నం - బీసీ జనరల్, రాజమండ్రి - జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు - జనరల్ మహిళ, విజయవాడ - జనరల్ మహిళ, మచిలీపట్నం - జనరల్ మహిళ, గుంటూరు - జనరల్, ఒంగోలు - ఎస్సీ మహిళ, నెల్లూరు - ఎస్టీ జనరల్, తిరుపతి - జనరల్ మహిళ, చిత్తూరు - ఎస్సీ జనరల్, కడప - బీసీ జనరల్, అనంతపురం-జనరల్, కర్నూలు-బీసీ జనరల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
(చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల)
కాగా, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిపి, 27న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
(చదవండి: ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు)
Comments
Please login to add a commentAdd a comment