నెల్లూరు (అర్బన్): గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించి లక్షలాది మంది రాసిన పరీక్షల్లో నెల్లూరు నగర్‌కి చెందిన ఓ సాధారణ దర్జీ కుమార్తె లక్ష్మీ మౌనిక కేటగిరీ–1లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించి నెల్లూరు జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఏసీ నగర్‌కు చెందిన బొద్దుకూరి చంద్రమోహన్– చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మీ మౌనిక ఇటీవల తిరుపతిలోని పద్మావతి వర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది.
తండ్రి చంద్రమోహన్ ట్రంక్ రోడ్డులోని రిట్జ్ టైలర్ షాపులో దర్జీగా పనిచేస్తున్నాడు. చంద్రమోహన్ సంపాదనతోనే కుటుంబ పోషణ జరుగుతోంది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న మౌనిక ఇటీవల గ్రామ వార్డు సచివాలయాలకు జరిగిన పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. కేటగిరీ–1లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఉద్యోగం వస్తున్నందున ఇప్పుడు తన తల్లిదండ్రులకు అండగా ఉంటానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment