సొమ్ముతో వరుడు పరార్..వధువు ఆత్మహత్యయత్నం!
Published Thu, Sep 4 2014 4:42 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
చిత్తూరు: వరుడు చేసిన నిర్వాకం కారణంగా వధువు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం యానాదిబెట్టులో చోటు చేసుకుంది. వరుడు రాజారాం 2 లక్షల రూపాయల కట్నం, మూడున్నర తులాల బంగారంతో ఉడాయించాడు.
వరుడి నిర్వాకంపై వధువు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తట్టుకోలేక వధువు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె బంధువులు తెలిపారు. వధువు పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement