మరిదిగారిపై కోపం లేదు : పురందేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తనకు ఎటువంటి కోపం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి శనివారం విజయవాడలో తెలిపారు. తన మరిది చంద్రబాబు నాయుడిని తాను ఎప్పుడూ శత్రువుగా భావించలేదన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు వల్ల ఆ రెండు పార్టీలకు లాభమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
పొత్తు పార్టీల మధ్య కానీ వ్యక్తుల మధ్య కాదని ఆమె గుర్తు చేశారు. తాను బీజేపీ ఆదేశాల మేరకే ముందుకెళ్తానని పురందేశ్వరి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని అంటూన్నారు... మీరు బీజేపీలో ఉన్నారు... మీకు చంద్రబాబు నాయడు అంటే కోపం కదా అని శనివారం విజయవాడ విచ్చేసిన పురందేశ్వరిని విలేకర్ల ప్రశ్నలు సంధించారు. దాంతో పురందేశ్వరి పై విధంగా స్పందించారు.