కాలక్షేపం చేస్తే సరిపోతుందనుకోవద్దు....
విజయవాడ : 'ఇతర రాష్ట్రాల నుంచి ఎంపికైన కేడర్ ఆఫీసర్లలో ఇది మరీ ఎక్కువగా ఉంది. కాలక్షేపం చేస్తే సరిపోతుందనే ఆలోచనలో కాకుండా కష్టపడి పనిచేయాలి' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు క్లాస్ తీసుకున్నారు. కలెక్టర్లు ఆఫీసులోనే ఉండి పని చేయాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరి కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. పాలనా వ్యవహారాల్లో ఐటీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి...ఫైళ్లు కూడా ఆన్లైన్లో నిర్వహించాలని ఆయన సూచించారు.
రాజధాని విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం రాజధాని ఎక్కడో చెప్పకుండా విభజన చేసింది. ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. మమ్మల్ని ప్రజలు ఎన్నకున్నారు. మేమే నిర్ణయిస్తాం. ఇది ప్రజల ఇచ్చిన తీర్పు అని అన్నారు. కొత్త రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉంటుంది. జనం, ఊరు, సదుపాయాలు ఉన్నచోటనే రాజధాని ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు అన్నారు. ఎవరెవరో ఏదోదో మాట్లాడుతున్నారు. అంతేకాని ఏదీ లేకుండా సిటీ ఎలా అవుతుంది అని చంద్రబాబు ప్రశ్నించారు.