సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 12న అద్దె ఇంట్లోకి మారనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 65లోని తన సొంత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 24లో అద్దె ఇంట్లోకి మారుతున్నారు.
నేడు ఢిల్లీకి..: చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆదివారం న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే న్యాయమూర్తుల సమావేశానికి కూడా సీఎం హాజరవుతారు.
నైపుణ్య కేంద్రం ప్రారంభం: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నైపుణ్య కేంద్రాన్ని ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిథి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కంపెనీలతో పాటు వివిధ సంస్థలకు ఇంటర్వ్యూలకు వెళ్లే గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
12న ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు
Published Sat, Apr 4 2015 1:04 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement