బాబు ఇంటి నిర్మాణానికి తాత్కాలిక బ్రేక్ | Babu's house to build a temporary break | Sakshi
Sakshi News home page

బాబు ఇంటి నిర్మాణానికి తాత్కాలిక బ్రేక్

Published Mon, Nov 10 2014 1:10 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

బాబు ఇంటి నిర్మాణానికి తాత్కాలిక బ్రేక్ - Sakshi

బాబు ఇంటి నిర్మాణానికి తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్: ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ఇంటి నిర్మాణ పనులు వాయి దా పడ్డాయి. కుటుంబపరమైన కొన్ని కారణాల వల్ల ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసినట్లు సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇం టిని విస్తరించాలని చంద్రబాబు యోచించారు. రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి వస్తున్న సందర్శకుల సంఖ్య పెరిగింది.

దీంతో ప్రస్తుతం ఉన్న ఇల్లు సరిపోకపోవడంతో దాన్ని కూల్చి ఆ స్థానంలో కొత్తగా ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. అప్పటి వరకు క్యాంపు కార్యాలయంగా ఉన్న లేక్‌వ్యూ అతిథి గృహాన్ని అధికార నివాసంగా మార్చుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు ఇటీవల లేక్‌వ్యూను పరిశీలించారు. అయితే సొంత ఇంటి నిర్మాణాన్ని కొద్దికాలం పాటు వాయిదా వేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement