‘జన్మభూమి - మాఊరు’ను విజయవంతం చేయాలి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ సిద్థార్థ్‌జైన్
చిత్తూరు(సెంట్రల్) : జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవా రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆర్.మల్లవరం వస్తారని జిల్లా కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ తెలిపా రు. కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. బడిపిలుస్తోంది కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు భూసార పరీక్షల పత్రాలు అందజేత, పేదరికంపై గెలుపునకు సంబంధించి పింఛన్ల పాసుపుస్తకాల పంపిణీ, నూతన పింఛ న్ల పంపిణీ, స్వచ్ఛభారత్‌లో మరుగుదొడ్ల నిర్మా ణం, రోబో ఇసుక విక్రయం, జిల్లాలో నీరు - చెట్టు, సూక్ష్మ సేద్యం కార్యక్రమాల అమలు విధానంపై డిజిటల్ ఫొటోల ప్రదర్శన, ఈ- పాస్ విధానం, వైద్య శిబిరాలు, పాడిపరిశ్రమ తదితర కార్యక్రమాలపై ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధి కూలీలకు జాబ్‌కార్డులు, జన్‌ధన్‌లో రూపే కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారన్నారు. ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లుచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాకు రేపు సీఎం రాక
Published Tue, Jun 2 2015 2:28 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement