తిరుమలలో దిక్కుతోచని స్థితిలో భక్తులు!
తిరుమల: తిరుమలలో భక్తులు పోటెత్తారు. రేపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి), నూతన సంవత్సరం కావడంతో ఈ రోజు నుంచే వేల మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. స్వామివారి దర్శనానికి లైన్ ఎక్కడ ఉందో కూడా వారికి అర్ధం కావడంలేదు. సరైన వసతులు, సౌకర్యాలు లేక వారు దిక్కుతోచని స్థితిలో రోడ్లుపైనే ఆందోళనకు దిగారు.
కొందరు భక్తులు ఒంగోలు నుంచి వచ్చామని చెబితే, మరి కొందరు విశాఖ నుంచి వచ్చినట్లు తెలిపారు. లైన్లు ఎక్కడో తెలియడంలేదన్నారు. తాము రోడ్లుపై కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమని లైన్లోకి వెళ్లకుండా పోలీసులు ఇక్కడే ఆపారని గోవిందమాల భక్తులు చెప్పారు. ఈరోజు లైన్లో నిలబడే అవకాశం కల్పిస్తే, తాము రేపే స్వామివారిని దర్శనం చేసుకుంటామని వారు చెప్పారు.