పొమ్మనే హక్కు ఎవరికీ లేదు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాలవారిని వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదని మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. మల్లాపూర్ వీఎన్ ఆర్ గార్డెన్‌లోని పీవీ నరసింహారావు ప్రాంగాణంలో ఆదివారం బ్రాహ్మణ ‘కార్తీక వన సమారాధన-బ్రాహ్మణ సమేళనం’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హారైన మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సెటిలర్ల హక్కులకు ఎలాంటి భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వనభోజనాలు ఏర్పాటు చేసిన సంఘం నాయకులను అభినందిచారు. అనంతరం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వేమురి ఆనంద సూర్య మాట్లాడుతూ ప్రతేడాదిలాగే ఈ ఏడాది కూడా వనభోజనాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆటలపోటీలను నిర్వహించారు.
కార్యక్రమంలో ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకుడు జనక్‌ప్రసాద్, మాజీ డీజీపీ అరవిందరావు, నమస్తే తెలంగాణ ఎండీ రాజం, విజయరాజం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రామచంద్రన్, దైవజ్ఞశర్మ, తులసి శ్రీనివాస్, కొత్త రామరావు తదితరులు పాల్గొన్నారు.