బైక్‌ చక్రంలో చీర చుట్టుకుని.. | edler woman killed in road accident in challapalli | Sakshi
Sakshi News home page

బైక్‌ చక్రంలో చీర చుట్టుకుని..

Published Mon, Oct 16 2017 3:42 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

edler woman killed in road accident in challapalli - Sakshi

చల్లపల్లి: ప్రమాదం ఏ రూపంలో అయినా ఎదురు కావచ్చు.. మృత్యువు ఎలాగైనా రావచ్చు... ఇలాంటి అనుకోని ఘటనే చల్లపల్లిలో జరిగింది. ద్విచక్ర వాహనం చక్రంలో చీర చుట్టుకుని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణాజిల్లా భావదేవరపల్లికి చెందిన అరజా ఝాన్సి (64) భావదేవరపల్లి నుంచి అవనిగడ్డ వైపు బైక్‌పై వస్తున్నది. అయితే దురదృష్టవశాత్తు 9వ వార్డు పెట్రోల్ బంకు వద్దకు రాగానే చక్రంలో చీర చుట్టుకుపోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది.

బైక్‌ నడుపుతున్న వ్యక్తి ఝాన్సి మృతదేహం దగ్గర కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటనాస్థలంలో పోగైన జనం ప్రమాదం గురించి తెలుసుకుని కంటతడి పెట్టారు. చీర, చుడీదార్‌ ధరించి దిచక్రవాహనాలపై ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రమాదం సూచిస్తోందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement