కుదింపు.. కుదుపు! | Employees compression | Sakshi
Sakshi News home page

కుదింపు.. కుదుపు!

Published Sat, Feb 21 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

Employees compression

భూసేకరణ యూనిట్ల ఎత్తివేతకు చర్యలు
ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశాలు
జిల్లాలో ఆరు యూనిట్లు.. మూడుకు కుదింపు
47 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గండం
ఇతర విభాగాలకు బదిలీ కానున్న రెగ్యులర్ ఉద్యోగులు

 
ఉద్యోగుల కుదింపు ఇలా..

రెగ్యులర్..  ప్రస్తుతం ఐదుగురు ఎస్డీసీలు ఉండగా వీరిలో ముగ్గురిని బదిలీ చేస్తారు.
13 మంది డీటీల్లో.. 11 మందిని బదిలీ చేస్తారు.  
ఉప తాహశీల్దార్లు 13 మంది ఉండగా..అందరూ బదిలీ అవుతారు.
సీనియర్ అసిస్టెంట్లు 8 మందిలో ఆరుగురిని తరలిస్తారు.  
ఉన్న ఐదుగురు ప్రత్యేక ఆర్‌ఐలకూ స్థానచలనం తప్పదు  
ఆరుగురు సర్వేయర్లలో ఇద్దరికి బదిలీ తప్పదు

అవుట్ సోర్సింగ్..

13 మంది జూనియర్ అసిస్టెంట్లలో 11మందిని తొలగిస్తారు.
పది మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లలో 8 మందిపై వేటు.
20 మంది అటెండర్లలో 18 మందిని తోలగిస్తారు.
16 మంది చైన్‌మెన్‌లలో 8 మందిపై వేటు.  
నలుగురు వాచ్‌మెన్‌లలో ఇద్దరిని తొలగిస్తారు.
 
శ్రీకాకుళం పాతబస్టాండ్ : భూసేకరణ యూనిట్లకు ప్రభుత్వం మంగళం పాడేస్తోంది. వీటిని కుదించడం ద్వారా ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆరు యూనిట్లు మూడుకు తగ్గిపోనున్నాయి. ఫలితంగా ప్రస్తుతం వీటిలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులను వేరే ప్రాంతాలకు బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం తొలగిస్తారు.

ప్రస్తుతం ఈ యూనిట్లలో పని చేస్తున్న 63 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 47 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఈ నెలాఖరుకల్లా యూనిట్ల కుదింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా ఆధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి ఒకటి, బిఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఐదు భూసేకరణ యూనిట్లు ఉన్నాయి, వీటిలో వంశధార ప్రాజెక్టు పరిధిలోని మూడు యూనిట్లను  ఎత్తివేయనున్నారు.

వంశధార ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళంలో నాలుగు, ఆమదాలవలసలో ఒక యూనిట్ ఉన్నాయి. ఆమదాలవలస యూనిట్‌ను శ్రీకాకుళం-1 యూనిట్‌లో, శ్రీకాకుళం-3,4 యూనిట్లను యూనిట్-2లో విలీనం చేస్తారు. రద్దు చేసిన యూనిట్లలోని రెగ్యులర్ ఉద్యోగులను రెవెన్యూ శాఖలో వివిధ విభాగాలకు బదిలీ చేస్తారు. దీంతో ఉన్న యూనిట్లలో సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. బదిలీ అయిన ఉద్యోగులకు పదోన్నతుల్లోనూ జాప్యం జరుగుతుంది.

రెవెన్యూ శాఖలో ఇప్పటికే సిబ్బంది కొరత, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఉద్యోగులను తగ్గించడంతో ఉన్న ఉద్యోగులపై మరింత భారం పడే ప్రమాదం ఉంది. కాగా పదేళ్లుగా చిరుద్యోగాలనే నమ్ముకొని జీవిస్తున్న అవుట్ సోరింగ్ ఉద్యోగులు ఒక్కసారి రోడ్డున పడనున్నారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే యూనిట్ల ఎత్తివేత జీవో జారీ చేసింది. ఉద్యోగుల్లో వ్యతిరే కత రావడంతో అప్పట్లో తాత్కలికంగా నిలిపివేసి.. ఇప్పుడు తెరపైకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement