- విశాఖ కల ఫలించింది
- హైకోర్టు బెంచి ఏర్పాటుకు మార్గం సుగమం
- న్యాయవాదుల హర్షం
విశాఖ,లీగల్: విశాఖ కల ఎట్టకేలకు ఫలించింది. నగరంలో హైకోర్టు బెంచి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు బెంచి ఏర్పాటుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుపై నగర న్యా యవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విభజనకు సంబంధించి దాఖలైన కేసులో తుది తీర్పు వెలువడింది. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు జరిగే వరకు విశాఖ,తిరుపతిలో బెంచిలు ఏర్పాటు చేసుకోవచ్చునని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కల్యాణ్ సేన్ జ్యోతి గుప్త, జస్టీస్ పివి సంజయ కుమార్‌లతో కూడిన డివిజనల్ బెంచి సూచించిన సంగతి తెలి సిందే. నగరంలో ఇప్పటికే 61 కోర్టులు వున్నాయి.
వీటితో పాటు సేల్ టాక్స్,కార్మిక శాఖ,వాణిజ్య ప న్నుల శాఖ అపీలు ట్రిబ్యునళ్లు,డెట్ రికవరి ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. విశాఖ పారిశ్రామిక, వాణిజ్య,వ్యాపార,పర్యాటక,ఐటి రంగాల్లో అపారంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని అన్ని దేశాలను కలుపుతూ అంతర్ జాతీయ విమానాశ్రయం వుంది. ఈ నగరం హైకోర్టు బెంచి ఏర్పాటుకి అన్నివిధాలా అనుకూలమని సీనియర్ న్యాయవాది,విశాఖ న్యాయవాదుల సంఘం పూర్వ అధ్యక్షుడు ఎన్‌వి బదరీనాధ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విశాఖలో హైకోర్టు బెంచి సూచన సరైందన్నారు.
డివి చిరకాల స్వప్నం ఫలించింది!: విశాఖలో హైకోర్టు బెంచి కోసం గత 30 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం సాగుతోందని ప్రముఖ న్యాయవాది దివంగత డివి సుబ్బారావు తనయుడు డివి సోమయాజులు తెలిపారు.రాష్ట్రాల విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీకి డివి సుబ్బారావుతో పాటు,విశాఖ న్యాయవాదులందరు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. హైకోర్టు ఏర్పాటుకి 1993లో న్యాయవాదులు ఆరు నెలలు విధులు బహిష్కరించి పోరాటం చేశామని ఆయన తెలిపారు. రాజధానితో పాటు హైకోర్టు ప్రతిపాదనపై డివి కేంద్ర,రాష్ట్రాలకు నివేదించిన సంధర్భలను గుర్తు చేశారు. విశాఖలో హైకోర్టు బెంచి సూచన తో డివి చిరకాల స్వప్నం ఫలించిదన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు,అఖిల భారత న్యాయవాదుల సంఘం,ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్,న్యాయవాది పరిషత్ హర్షం ప్రకటించాయి. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరావు కోరారు.
హైకోర్టు ఉద్యమ నేపథ్యం: విశాఖలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. 1980 నుంచి ఈ ఉద్యమానికి ప్రాధాన్యత ఏర్పడింది. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి విశాఖ న్యాయవాదులు డీవీ సుబ్బారావు, మళ్ల సూర్యనారాయణ శాస్త్రి, కృష్ణ మోహన్ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అందులో విశాఖలో హైకోర్టు బెంచ్ ప్రాధాన్యతను వివరించారు. సువిశాలమైన సముద్ర తీరం, మత్స్యకారులు, గిరిజనులు, కార్మికులు, పారిశ్రామికులు అధికంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు సత్వర న్యాయం పిలుపుతో విశాఖలో హైకోర్టు బెంచ్ ప్రాధాన్యత పెరిగింది. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమ్రంతిగా విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
తదనంతరం న్యాయవాదులు అనేక ఉద్యమాలు చేశారు. 1993లో ఆరు నెలలపాటు పూర్తిగా న్యాయవాదులందరూ విధులు బహిష్కరించి ఉద్యమ బాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలకు హైకోర్టు బెంచ్‌ఆవశ్యకతను వివరిస్తూ అనేక వినతి పత్రాలు సమర్పించారు. విశాఖ వచ్చే మంత్రులు హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు తమ గోడు వెలిబుచ్చేవారు. 1985లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుతో ఈ ఉద్యమం మరింత బలపడింది. న్యాయవాదులందరూ పోరాటం సాగించారు. 2014లో శివరామ కృష్ణన్ కమిషన్ రాష్ట్ర విభజనపై జరిపిన అభిప్రాయాలు సేకరించినప్పుడు అప్పటి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.వి.బదిరినాధ్, డీవీ సుబ్బారావు,సూచనలు అందజేశారు.
న్యాయం జరిగింది
Published Sat, May 2 2015 4:59 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement