హంద్రీ-నీవా నత్తనడక
Published Wed, Oct 30 2013 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: చిత్తూరు, అనంతపురం జిల్లాలో సాగుతున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు మూడు నెలలుగా మందగించాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా, అన్నీ అసంపూర్తిగానే ఉన్నారుు. ప్రధానంగా మదనపల్లె మండలంలోని చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణ పనులు స్తం భించాయి. ఆరు నెలలుగా పనుల జాడే లేదు. 59వ ప్యాకేజీ పరిధిలోకి వచ్చే ఈ పనులు మదనపల్లె పట్టణానికి మంచినీటిని అందించేందుకు ఉద్దేశించింది. నీటికోసం ప్రజలు అల్లాడుతున్నా పనులు పూర్తికాక పోవడంతో ఏజెన్సీకి ఇప్పటివరకు 29 నోటీసులను ఇ చ్చారు. పనులుచేయాలంటూ ఒత్తిడిచేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అలాగే కేవీపల్లె మండలంలో 23వ ప్యాకేజీలో జరుగుతున్న అడవిపల్లె రిజర్వాయర్ పనులు 86శాతం మాత్రమే పూర్తయ్యూరుు.
20వ ప్యాకేజీలోని పెద్దమండ్యం మండలంలోని ప్రధాన కాలువ, 29వప్యాకేజీలో జరుగుతున్న నీవా బ్రాంచ్ కెనాల్ పనులపైనా, అనంతపురం జిల్లాలో 6,9,10, 11,15 ప్యాకేజీల్లోని పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ కన గానపల్లె, బుక్కపట్నం, కొత్తచెరువు, ముదిగుబ్బ, త లుపుల మండలాల్లో జరగాల్సిన పనుల్లో జాప్యం చో టుచేసుకుంది. దీనిపై ప్రాజెక్ట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ప్యాకేజీ(కాంట్రాక్ట్‌లు)లు పొందిన ఏజెన్సీలు పనులు వేగవంతం చేయాలని లేదంటే కాంట్రాక్టులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. వెంటనే పనులు పూర్తిచేయండి, లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీనిపై ప్రాజెక్టుకు చెందిన ఓ అధికారి మంగళవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మూ డునెలలుగా కొన్ని ప్యాకేజీల్లో పనులు ముందుకు సాగడంలేదని గుర్తించామన్నారు.
దీనిపై పలుమార్లు ఏజెన్సీలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో నోటీసులు జారీ అయినట్టు చెప్పారు. పనులు వేగవంతం అయ్యేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్టర్లు ఇప్పటికైనా స్పందించాలని సూచించారు.
Advertisement