ఔను ఇతడు ‘ఇన్‌స్పైర్’
టాప్ లేపిన అంధ విద్యార్థి
బహుళ వినియోగ బ్రెరుులీ రైటింగ్ సిస్టమ్ నమూనా రూపకల్పన
ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో మొదటి స్థానం
పెదవాల్తేరు(విశాఖపట్నం) : కళ్లు లేకుంటేనేం.. తన కల నిజం చేసుకున్నాడా అంధ విద్యార్థి. రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ వైజ్ఞానిక పోటీలో మొదటి స్థానం కొట్టేశాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని ఏబీఎం హైస్కూల్‌కు చెందిన ఆర్పీ సారథిరెడ్డి ఆవిష్కరణ అందరినీ అబ్బురపరిచింది. సాధారణ అట్టపై అంధులకు అర్ధమయ్యే రీతిలో రాసే విధానాన్ని రూపొంచాడీ విద్యార్థి. తాను తయారుచేసిన బహుళ వినియోగ బ్రెయిలీ రైటింగ్ సిస్టం నమూనాను విశాఖలో ప్రదర్శించాడు. ఈ నమూనాను రూపొందించేందుకు సాదాసీదా అట్ట మాత్రమే వినియోగించటం విశేషం. అట్టకు క్రమపద్ధతిలో రంధ్రాలు చేశాడు. అట్ట క్లిప్‌కు పేపర్ పెట్టి హోల్స్ ద్వారా చేతులతో తడుముకుని అవసరమైన పదాలను రాయొచ్చని ప్రయోగాత్మంగా నిరూపించాడు. తన ఆలోచనలకు రూపమిచ్చానని.. మొదటి స్థానంలో నిలవటం సంతోషంగా ఉందని సారథిరెడ్డి చెప్పాడు.