దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి
తిరుచానూరు : దేశాభివృద్ధిలో విద్యార్థులు, యువకులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. తిరుపతి ఎంజీఎం ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ గురువారం ముగిసింది. ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బాల్యంలోనే మేధావులుగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్పైర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో విద్యావిధానంలో మార్పు తీసుకురానున్నట్లు తెలిపారు. ఆడియో, వీడియో లెర్నింగ్ పద్ధతిని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ స్థాయి ఇన్‌స్పై ర్ ఎగ్జిబిషన్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు
తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌కు ఏడు జిల్లాల నుంచి విద్యార్థులు, గైడ్‌టీచర్లు పాల్గొని వారు రూపొందించిన ప్రయోగాత్మక నమూనాలను ప్రదర్శించారు. ఈ నమూనాలను పరిశీలించిన న్యాయనిర్ణేతలు 24 ఉత్తమ నమూనాలను జాతీయస్థాయికి ఎంపిక చేశారు.
వారిలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి ఎస్‌ఎంఎస్‌వో హైస్కూల్ విద్యార్థి ఎస్‌కే.మౌలాఅలీ(బీ.రాధాకృష్ణ), నెల్లూరు శ్రీనగర్ కాలనీ వోవల్ స్కూల్ విద్యార్థినీ ఎన్.సంజన, సంగం-తరునవాయి జెడ్‌పీ హైస్కూల్ విద్యార్థి జీ.రామ్‌బాబు, సూళూరుపేట-రంగన్నపట్టెడ జెడ్పీపీ హెచ్‌ఎస్ విద్యార్థి జీ.నాగరాజు ఉన్నారు.
ion