విజయనగరం మున్సిపాలిటీ : ఆయిల్ పామ్ తోటల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తోంది. రైతులకు రాయితీపై మొక్కలు పంపిణీ చేయనున్నారు. 2014-15లో 12 వందల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటలు పెంపకం లక్ష్యంగా ఉద్యాన శాఖ నిర్దేశించుకుంది. ఆయిల్‌పామ్ తోటల అభివృద్ధి పథకం ద్వారా హెక్టారురకు స్వదేశీ రకపు మొక్కలతో నాలుగేళ్లకు రూ 22 వేల రాయితీ అందజేస్తారు.
మొక్కలతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యం నిమిత్తం ఎరువులకు మొదటి సంవత్సరానికి రూ.8 వేలు, రెండో సంవత్సరానికి రూ.3,500, మూడో సంవత్సరానికి రూ.4,500 నాలుగో సంవత్సరానికి రూ. 6000 అందజేస్తారు. మొదటి సంవత్సరంలో ఒక హెక్టారుకు 143 ఆయిల్ పామ్ మొక్కలు వేయాలి. మొక్క ఒక్కంటికి రూ.55 చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. ఒక మొక్క ఖరీదు రూ.60, ఇందులో రైతు వాటా కింద రూ.5 చెల్లించి నర్సరీల నుంచి పొందవచ్చు. ఈ పథకంలో గరిష్ఠంగా ఒక రైతుకు 15 హెక్టార్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.
అంతర పంటలపై రాయితీ
ఆయిల్‌పామ్ తోటల్లో అంతరపంటలుగా అరటి , కూరగాయాలు, కంద, కోకో , నిమ్మగడ్డి తదితర పంటలను సాగు చేసుకునేందుకు 50 శాతం రాయితీతో గరిష్ఠంగా రూ.3 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు.
మొక్కలు కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలు
రైతులు ఆయిల్‌పామ్ మొక్కలను ప్రభుత్వం గుర్తించిన సంస్థల యందు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాధిక వెజిటల్ కంపెనీ నర్సరీ (గరివిడి), 3ఎఫ్ కంపెనీ (ఎర్నగూడెం-పశ్చిమగోదావరి జిల్లా), లక్ష్మీబాలాజీ కంపెనీ నర్సరీ (పార్వతీపురం)లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రవాణా ఖర్చు రైతులు భరించుకోవాలి.
సాధారణంగా ఆయిల్‌పామ్ మొక్క ఖరీదు రూ.55 కాగా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5లకు అందజేస్తుంది. ఉద్యానశాఖ అధికారులు సంబంధిత ైరె తు భూమికి నీటి వసతి, తోటల పెంపకానికి అనుకూలమైంది, లేనిది పరిశీలించిన అనంతరం మొక్కలు పంపిణీ చేస్తారు. మొక్కలు పంపిణీ చేసే సమయంలో సదరు రైతు దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం నకలు, పాస్‌పోర్టు సైజు ఫోటో, రేషన్ కార్డు నకలు ఉద్యాన శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని ఉద్యాన సహాయ సంచాలకులు పిఎల్ ప్రసాద్ తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
Published Sat, Aug 9 2014 5:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement