శ్రీకాకుళం సిటీ: రిమాండ్ ఖైదీ మాదిన వల్లభరావు మృతిపై విచారణ కొనసాగుతోంది. రిమ్స్‌లో చికిత్స పొందుతూ అతడు శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే! ఈ కేసుకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు రావడంతో ఆర్‌డీవో స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు. రిమ్స్‌లో ఆర్డీవో బలివాడ దయానిది, తహసీల్దార్ సుధాసాగర్‌ల నేతృత్వంలో శనివారం మృతుడి కుటుంబసభ్యులు, బంధువుల నుంచి సమగ్ర వివరాలను సేకరించారు. తొలుత ఈ కేసు విచారణ నిమిత్తం ఆర్‌డీవో బలివాడ దయానిధి, శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు ఉదయమే రిమ్స్‌కు విచారణకు హాజరయ్యారు. మృతుని బంధువులు పూర్తిస్థాయిలో మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చారు. శనివారం రాత్రి వరకు విచారణ కొనసాగింది. ముందుగా మృతుడి కుటుంబ సభ్యులు రిమ్స్ వద్ద కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాశీబుగ్గ సీఐ ఎస్ తాతారావు, స్థానిక సీఐ తిరుపతి, పాతపట్నం సబ్‌జైల్ సూపరెండెంటెంట్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ ప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment