సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో కలెక్టర్ తదితరులు
ఏఎన్‌యూ(గుంటూరు): ఎందరో అంతర్జాతీయ హాకీ క్రీడాకారులను అందించిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్‌కు ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ హాకీ అసోసియేషన్(ఏపీహెచ్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఏపీ హాకీ ఐదో వార్షికోత్సవం, హాకీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున హాకీ క్రీడకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఏపీ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐఏఎస్ ఆఫీసర్ ఎం.కె.మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ , ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీ కె రామ్‌జీ, ఏపీ హాకీ అసోసియేషన్ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షరీన్‌బేగం ప్రసంగించారు. హాకీ రంగానికి విశేష సేవలందించిన 15 మంది ప్రముఖులకు పురస్కారాలు, ఈ ఏడాది హాకీలో ప్రతిభ కనబరిచిన 9 మంది క్రీడాకారులు, కోచ్‌లు, నిపుణులు, అసోసియేషన్ ప్రతినిధులకు అవార్డులను గవర్నర్ ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment