నైజీరియాలో కిడ్నాపైన సాయి శ్రీనివాస్ క్షేమం | Kidnapped visakha engineer sai srinivas in Nigeria safe | Sakshi
Sakshi News home page

నైజీరియాలో కిడ్నాపైన సాయి శ్రీనివాస్ క్షేమం

Published Sat, Jul 16 2016 1:52 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Kidnapped visakha engineer sai srinivas in Nigeria safe

విశాఖ : నైజీరియాలో అపహరణకు గురైన విశాఖ ఇంజినీర్ మంగిపూడి సాయి శ్రీనివాస్ క్షేమంగా ఉన్నారు. శనివారం ఉదయం ఆయనను ఆగంతకులు విడిచి పెట్టారు. ఈ విషయాన్ని శ్రీనివాస్ కుటుంబీకులు ధ్రువీకరించారు. కాగా సాయి శ్రీనివాస్ కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడటంతో ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

గత నెల 29న నైజీరియాలో సాయి శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ఇంజినీర్ కూడా అపహరణకు గురయ్యాడు. 17రోజలు పాటు కిడ్నాపర్ల చెరలో ఉన్న సాయి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం భార్య, పిల్లలతో ఫోన్ లో మాట్లాడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement