మోదీ గాలి చంద్రబాబుకు కలిసి వచ్చింది: వైఎస్ జగన్
ఒంగోలు : ఎన్నికల్లో నరేంద్ర మోదీ గాలి కాస్తో కూస్తో చంద్రబాబు నాయుడుకు కలిసి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మంగళవారం ఒంగోలు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండెపి నియోజకవర్గాలపై సమీక్షలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేదన్నారు.బాబులా అబద్ధాలు చెప్పి ఉంటే వైఎస్ఆర్ సీపీకే అధికారం దక్కేదని వైఎస్ జగన్ అన్నారు.