ఆన్‌లైన్‌లోనే ఆదాయ పన్ను ఫారం-16 సమర్పణ
Published Wed, Jan 29 2014 2:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆదాయ పన్ను ఫారం-16ను విధిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ఆదాయ పన్ను శాఖ సహాయ కమిషనర్ యు.వి. కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదాయ పన్ను మదింపుపై మంగళవారం వరం రెసిడెన్సీలో వివిధ శాఖలు, బ్యాంకులు, బీమా కంపెనీల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఫారం 16 మాన్యువల్‌గా నింపి సమర్పించేవారని, ప్రస్తుతం ఆ విధంగా సమర్పించడానికి ఎటువంటి చట్టబద్ధత లేదన్నారు.
హెచ్‌టీటీపీ://డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడాట్‌టీడీఎస్‌సీపీసీడాట్‌జీవోవీడాట్‌ఇన్ వెబ్‌సైట్‌లో ట్రెసెస్‌పోర్టల్‌లో ప్రవేశించి ఫారం 16ను నింపాలని సూచించారు. ఫారం 16బీను మాత్రం మాన్యువల్‌గా నింపాలన్నారు. ఫారాన్ని పూర్తి చేసినప్పుడు పాన్, టీఏఎన్ నంబరు, బ్యాంకులు అందించే సీఐఎన్ నంబరు, ఐటీఎన్‌సీ చలాన 281, 94 సీ, 94ఐ కోడ్, 200 కింద రెగ్యులర్ పేమెంట్ చేసే హెడ్ నంబరు విధిగా పేర్కొనాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు అందించే వివరాల ఆధారంగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసేటప్పుడు ప్రతి విషయాన్ని డీడీవోలు విపులంగా పరిశీలించాలన్నారు. అందించే సమాచారంలో తప్పులు దొర్లితే డీడీవోలు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు.
ప్రస్తుతం డీడీవోలకు తప్పులకు పెనాల్టీ పడే చట్టాలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారులు ఏవీ చంద్రశేఖర్, ఎస్‌ఎస్ ఎడ్విన్, డి.సంధ్యారాణి, చార్టెడ్ అకౌంటెంట్ వి.చంద్రశేఖర్, సెట్‌శ్రీ సీఈవో వీవీఆర్‌ఎస్ మూర్తి, గృహ నిర్మాణ సంస్థ పీడీ బి.వి.నర్శింగరావు, ఏపీఎంఐపీ పీడీ పద్మజ, వివిధ శాఖల డీడీవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement