- 65.45శాతం హాజరు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-4) పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలుండగా 17,513 మంది అభ్యర్థులకుగానూ 11,463 మంది (65.45శాతం) హాజరయ్యారు.
కడప నగరంలోని 19 కేంద్రాల్లో 8,450మందికి గానూ 5,804(68.68శాతం) మంది, రాజంపేటలో 11 కేంద్రాల్లో 6063 మందికిగానూ 3717 మంది(61.03శాతం), ప్రొద్దుటూరులో 6 కేంద్రాల్లో 3వేల మంది అభ్యర్థులకుగానూ 1942 మంది(64.73శాతం) హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు.
పంచాయతీ పరీక్ష ప్రశాంతం
Published Mon, Feb 24 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
Advertisement
Advertisement