pachayat elections
-
మళ్లీ ఎన్నికలు అవసరం లేదు: సుప్రీం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వివాదంపై మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన చోట్ల తిరిగి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30రోజుల లోపు వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చునని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది మే నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలో దాదాపు 20వేల చోట్ల తృణబుల్ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, సీపీఎం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. నామినేషన్ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీనితో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంలో పిటిషన్లు వేశాయి. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఈ పిటిషన్లను తోసి పుచ్చింది. మళ్లీ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. -
ఇక ఫైనల్స్
సాక్షి, నెల్లూరు: ఎన్నికలేవేనా సింహపురిలో వైఎస్సార్సీపీ సత్తా చాటుతోంది. పంచాయతీ ఎ న్నికలు మొదలుకుని తాజాగా పట్టణ, పల్లెపోరులోనూ తిరుగులేని ఆధిక్యత కనబరచి ప్రత్యర్థి పార్టీలను వైఎస్సార్సీపీ మట్టికరిపించింది. శుక్రవారం వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ జిల్లాలో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని పరిశీలకుల అంచనా. జిల్లాలో పది నియోజకవర్గాలైన నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, కావలి, ఉదయగిరి, గూడూరుతో పాటు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. జిల్లాలో ముగిసిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే సార్వత్రికంలోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యతను సాధించనున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో 941 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. పురపోరులో హవా: ఈ నెల 12 న వెలువడిన మున్సిపల్స్ ఫలితాల్లో వైఎస్సార్సీపీ అధిక మున్సిపాలిటీలు గెలుచుకొని సత్తా చాటింది. జిల్లాలో ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, గూడూరు మున్సిపాలిటీతో నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. వీటిలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ దక్కించుకొంది. ఇక ఆత్మకూరు, గూడూరులలో పోటాపోటీగా నిలిచింది. వెంకటగిరి మున్సిపాలిటీతో టీడీపీ సరిపెట్టుకొంది.ఈ నెల 13న వెలువడిన పరిషత్ ఫలితాల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యతను సాధించింది. జిల్లాలో మొత్తం 46 మండలాలకు 30 ఎంపీపీ, 46 జెడ్పీలకుగాను వైఎస్సార్సీపీ 31 స్థానాలను దక్కించుకొని నెల్లూరు జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకొంది. ఆత్మకూరు జెడ్పీటీసీ స్థానం నుంచి ఎన్నికైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అధిష్టించడం ఇక లాంఛనమే. మొత్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోగా టీడీపీ చాలా చోట్ల పోటీకూడా ఇవ్వలేక పోయింది. ఆ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో డిపాజిట్లు సైతం కోల్పోయారు. వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు సార్వత్రికంలోనూ ఘనవిజయాలు సాధించి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. -

పంచాయతీ పరీక్ష ప్రశాంతం
- 65.45శాతం హాజరు కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-4) పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలుండగా 17,513 మంది అభ్యర్థులకుగానూ 11,463 మంది (65.45శాతం) హాజరయ్యారు. కడప నగరంలోని 19 కేంద్రాల్లో 8,450మందికి గానూ 5,804(68.68శాతం) మంది, రాజంపేటలో 11 కేంద్రాల్లో 6063 మందికిగానూ 3717 మంది(61.03శాతం), ప్రొద్దుటూరులో 6 కేంద్రాల్లో 3వేల మంది అభ్యర్థులకుగానూ 1942 మంది(64.73శాతం) హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు. -
ఆగిన పల్లె ప్రగతి
ఉదయగిరి, న్యూస్‌లైన్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది పంచాయతీల్లో పాలన పరిస్థితి. ప్రత్యేకాధికారుల పాలనతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోవడంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్‌లు అధికారం చేపట్టడంతో ఇక సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని గ్రామీణ ప్రజలు భావించారు. అయితే పరిస్థితి గతంలో కన్నా దారుణంగా తయారవడంతో జనం కష్టాలు పడుతున్నారు. జిల్లాలో 931 పంచాయతీలున్నాయి. వీటిలో 927 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 203 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంకా విడుదల కాలేదు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే ఉద్దేశంతో మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.5 లక్షలు అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.15 లక్షలు, రూ.7 లక్షలుగా నిర్ణయించినా ఇంతవరకు విడుదల చేయలేదు. జిల్లాలోని ఆత్మకూరు డివిజన్లో 37, కావలిలో 32, నెల్లూరులో 53, గూడూరులో 38, నాయుడుపేటలో 37 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నిధులు మంజూరైతే ఏకగ్రీవ పంచాయతీల్లోనైనా అభివృద్ధి పనులు సజావుగా సాగే అవకాశముంది. నిధుల కోసం ఎదురుచూపులు పంచాయతీల్లో ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల నిధులతోనే పనులు చేయాల్సి ఉంటుంది. ఆర్థికసంఘం, తలసరి గ్రాంటు, ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజు, సీనరేజ్, పారిశుధ్యం నిధులు, ఇంటిపన్ను ద్వారా వచ్చే నిధులు పంచాయతీ ఖాతాల్లో జమవుతుంటాయి. ఈ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. రెండేళ్లనుంచి పాలకవర్గాలు లేకపోవడంతో 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఈ నిధులే జిల్లాకు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కాలేదు. పంచాయతీ ఖాతాలో చిల్లిగవ్వ లేకపోవడంతోఎక్కువ మంది సర్పంచ్‌లు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోవున్నారు. కొందరు సర్పంచ్‌లు మాత్రం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులతో చేపడుతున్న పనులకు పాలకవర్గం సమావేశంలో ఆమోదం లభిస్తుందో, లేదోననే భయం కూడా సర్పంచ్‌లను వెంటాడుతోంది. సమస్యల తిష్ట నిధులు లేక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇటీవ ల తరచూ వర్షాలు కురుస్తుండటంతో వీధులన్నీ బురదమయమయ్యాయి. పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబలుతున్నాయి. వీధిలైట్లు లేక పల్లెల్లో చీకట్లు కమ్ముకున్నాయి. విషపురుగుల భయంతో సాయంత్రమైతే ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. కళ్ల ముందే సమస్యలు తీవ్రంగా ఉన్నా సర్పంచ్‌లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. సమ్మెలో అధికారులు: నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేయడంతో సీమాంధ్రలో ఉద్యమం హోరుగా సాగుతోంది. ఉద్యమంలో అటు ఉద్యోగులు, అధికారులు భాగస్వామ్యులు కావడంతో నిధుల విడుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఖజానా ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతుండడంతో బిల్లుల ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. నిధులు విడుదల చేయాలి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ నిధులు వెంటనే విడుదల చేయాలి. పంచాయతీల్లో పనులు చేసేందుకు పైసా కూడా నిధులు లేవు. గ్రామాల్లో పారిశుద్యం అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టే అవకాశముంది. ఇమ్మానుయేలు, డక్కునూరు, వరికుంటపాడు మండలం పైసా లేదు రెండు నెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టినా పనులు చేపట్టేందుకు పంచాయతీలో పైసా నిధులు కూడా లేవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వం వెంటనే 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు తలసరి గ్రాంటు విడుదల చేయాలి. అక్కి వెంకట సుబ్బారెడ్డి, క్రిష్ణంపల్లి సర్పంచ్