కాలిపోయిన ఆశలు | Piles of rice burnt down due to the negligence of the Department | Sakshi
Sakshi News home page

కాలిపోయిన ఆశలు

Published Sun, Jan 11 2015 2:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

కాలిపోయిన ఆశలు - Sakshi

కాలిపోయిన ఆశలు

కవిరిపల్లి(మక్కువ): కష్టాలకు ఓర్చుకుని, బాధలు భరించి, రక్తాన్ని చెమటగా మా ర్చి పండించిన పంట కళ్లెదుటే కాలి బూ డిదై పోతుంటే ఆ అన్నదాతలు కన్నీరుమున్నీరైపోయారు. ఏడాది పాటు అన్నం పెట్టాల్సిన పంట అగ్నికి ఆహుతవుతుం టే గుండెలవిసేలా రోదించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా కవిరిపల్లిలో వరి కుప్పలు దగ్ధమైపోయాయి. ఇదే స్థలంలో గతంలో మూడుసార్లు అగ్నిప్రమాదాలు జరిగినప్పటికీ విద్యుత్‌శాఖాధికారులు స్పందించకపోవడమే ఈ ప్రమాదానికి హేతువైంది. కవిరిపల్లి గ్రామం వద్ద శని వారం విద్యుత్ షార్‌‌ట సర్కూ ్యట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమా రు 14ఎకరాలుకు సంబంధించి ఏడు వరి కుప్పలు కాలి బూడిదయ్యాయి.
 
 శని వారం మధ్యాహ్నం 1.15 సమయంలో త్రీ ఫేజ్ సప్లై కోసం విద్యుత్ ట్రిప్ అవ్వడంతో సింగల్‌ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పెద్ద శబ్ధం వచ్చి నిప్పులు పడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆనుకొని పశువులు శాలలు, వరి, గడ్డి కుప్పలు ఉండటంతో నిప్పులు గడ్డికుప్ప, పశువుల శాలపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు చూసిన సమీప గృహస్తులు ఆందోళనకు గురై కేకలు వేయడంతో గ్రామస్తులంతా చేరుకుని గోముఖీ నది నుంచి బిందెలతో నీరు తీసుకువచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో రెండు పశువుల శాలలు, వరి, గడ్డికుప్పలు కాలిబూడిదయ్యాయి. అయితే ఆ సమయంతో పెద్దగా గాలులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిపోయింది. విషయం తెలిసిన వెంటనే ఎస్సై రవీంద్రరాజు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేప్రయత్నం చేశారు.
 
 రైతుల రోదన...
 గ్రామానికి చెందిన రెడ్డి సత్యమూర్తి, పెంట అప్పలస్వామి, రెడ్డి ముత్తినాయుడు, పెంట జయమ్మ, పెంట అప్పలనాయుడు, అలమండ ఏసు, పెంట శ్రీరాములు, రెడ్డి అప్పలనాయుడు తదితరులకు చెందిన ఏడు వరికుప్పలు కాలిబూడిదవ్వడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ శాఖాధికారులు నిర్లక్ష్యంగా కారణంగా తిండిగిం జలు లేకుండా పోయాయని రోదించారు. సంక్రాంతి, గ్రామదేవత ముత్యాలమ్మ పండగకు ధాన్యం విక్రయిద్దామని భావిస్తే మొత్తం బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంట నే అగ్ని మాపక కేంద్రానికి ఫోన్ చేస్తే గంట తర్వాత వచ్చిందని గ్రామానికి చెం దిన రైతులు తెలిపారు. వాహనం వచ్చినప్పటికీ పైపులు ద్వారా సరఫరా అయ్యే నీరు ప్రెజర్ రాకపోవడంతో గ్రా మస్తులు అసహనం వ్యక్తం చేశారు. వీఆర్వోలు పద్మప్రియ, నరేష్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా సంబంధిత ఏఈ, లైన్‌మేన్‌లు చేరుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ప్రభుత్వం ఆదుకోవాలి...
 కవిరిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వ మే ఆదుకోవాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు  పీడిక రాజన్నదొర, మండల కన్వీనర్ మావుడి ప్రసాదునాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మావుడి శ్రీనువాసరావు, మావుడి రంగునాయుడు డిమాండ్ చేశారు. విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల వరికుప్పలు కాలిపోవడంతో రైతులు పండగ పూట పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని  వారు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement