సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్ | Sonia Gandhi should apologise to seemandhra people, says Pawan Kalyan | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్

Published Thu, Mar 27 2014 8:21 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్ - Sakshi

సీమాంధ్ర ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలి: పవన్

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన నేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విశాఖ స్టేడియంలో పవన్ చేసిన ప్రసంగంలోని ముఖ్య అంశాలు కింద ఇవ్వడమైనది
  • నాకు నటుడిగా ఓనమాలు నేర్పింది వైజాగే
  • కాంగ్రెస్‌ను కనికరం లేకుండా మట్టుపెట్టండి
  • పదికోట్లమంది గొంతెత్తితే కాంగ్రెస్ మట్టిలో కలిసిపోతుంది
  • మీ అందరి తరపున పోరాడేందుకే జనసేన పార్టీ పెట్టా
  • నేను కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా
  • ఈ ప్యాకేజీ లతో మనల్ని సంతృప్తిపరచగలరా?
  • వేషధారణలో కాదు..గుండెల్లో ఏముందో అదే నిజం
  • భారతజాతి,తెలుగుజాతి సమగ్రతను కాంగ్రెస్‌ చెరిపివేసింది
  • నేనంత కలిపితే పిడికెడు మట్టే కావొచ్చు.. కాని మన జాతీయ జెండాకు ఉన్నంత పొగరు ఉంది
  • చట్టం కొందరికి చుట్టంలా కాకుండా.. ప్రతి ఒక్కరికి ఒకేలా పనిచేసేలా ఉండాలని... పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం కావాలన్నారు. 
  • ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో తప్పు కనిపించలేదు
  • కొంత మంది నాయకుల ఒత్తిడి వల్లే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. 
  • నమ్ముకున్న సిద్దాంతాలు కోసం ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడను
  • అవినీతి పరులను పార్లమెంట్ పంపుతున్నాం. అందుకే మనకు దుర్ధశ
  • అందరి తరపున పోరాడేందుకే పార్టీ పెట్టాను
  • కాంగ్రెస్ పార్టీయే ప్రజలందర్ని రోడ్డుపైకి తీసుకు వచ్చింది 
  • రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజలకు సోనియా, మన్మోహన్ లు వివరణ ఇస్తానని భావించా.. అలా జరగపోవడంతో కలత చెందాను. 
  • కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, బొత్స సత్యనారాయణలాంటి వ్యాపారవేత్తలకు విభజన అంశంపై పట్టింపేలేదు
  • వ్యాపార వ్యవహారాలు తప్ప సీమాంధ్ర నేతలకు సిద్దాంతాలు లేవు.
  • విభజన చేసిన తీరుపై నాకు కోపం, బాధ ఉంది
  • అన్నయ్యపై కోపం లేదు.. చెరోవైపు ఉన్నాం..అంతా దైవలీల
  • అన్నయ్య చిరంజీవికి ఎదురు వెళ్లడానికి రాజకీయాల్లోకి రాలేదు
  • 30 ఏళ్ల తర్వాత తెలంగాణ, సీమాంధ్రలో కలిసేందుకు ఉద్యమాలు రావోచ్చు
  • రాష్ట్ర విభజన జరిగి సీమాంధ్ర ప్రజలు అల్లాడుతుంటే.. ఇద్దరు కాంగ్రెస్ నేతలు రాజధాని ఏర్పాటుపై జోక్ చేసుకుంటున్నారని.. అలాంటి నేతలను నిలదీయాలన్నారు. 
  • బాధ్యత తెలియన నాయకులను నిలదీయాలి
  • సంపూర్ణ క్రాంతే జనసేన పార్టీ గుర్తు
  • నిస్వార్ధంగా ప్రజల సంక్షేమం కొసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి
  • నిజాయితీ ఉన్న నేతల కోసం వెతుకుతా.. అలాంటి వారిని లభించినపుడే సీమాంధ్ర, తెలంగాణలో పోటీ చేస్తా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement