పండుగకు ప్రత్యేక రైళ్లు | special trains announced for pongal season | Sakshi
Sakshi News home page

పండుగకు ప్రత్యేక రైళ్లు

Published Wed, Jan 11 2017 6:40 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

పండుగకు ప్రత్యేక రైళ్లు

పండుగకు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖ, తిరుపతి, కాకినాడలకు ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ప్రకటించారు. హైదరాబాద్‌-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-తిరుపతి, హైదరాబాద్‌-తిరుపతిలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. 
 
 
ఈనెల 11న రైలు నెం.07449 సికింద్రాబాద్‌-కాకినాడ పోర్టు(వయా భీమవరం), హైదరాబాద్‌-తిరుపతి-హైదరాబాద్‌(02764, 02763) సర్వీసులు ఈనెల 13,14 తేదీల్లోను, హైదరాబాద్‌-విశాఖ-హైదరాబాద్‌(07148, 07147) సర్వీసులు ఈనెల 15,16 తేదీల్లో, కాకినాడ పోర్టు-తిరుపతి-కాకినాడ పోర్టులకు(07941, 07942) సర్వీసులను ఈనెల 12,13 తేదీల్లో నడుపుతారు. మధురై-విజయవాడల మధ్య కూడా రెండు రైళ్లను నడుపతున్నట్లు ఆయన తెలిపారు. మధురై-విజయవాడ(06069) రైలును ఈనెల 14న, విజయవాడ-మధురై రైలును 16న నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement