‘శవాలతో రాజకీయాలు చేస్తారా’ ?.. | TDP Doing Politics With Dead Bodies Says Ambati Rambabu And Brahmanaidu In Guntur | Sakshi
Sakshi News home page

‘శవాలతో రాజకీయాలు చేస్తారా’ ?..

Published Sat, Aug 11 2018 8:23 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

TDP Doing Politics With Dead Bodies Says Ambati Rambabu And Brahmanaidu In Guntur - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు

సాక్షి, గుంటూరు : తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిందిపోయి శవాలతో రాజకీయాలు చేస్తారా అంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులుని ప్రశ్నించారు. శనివారం వినుకొండ తెలుగు దేశం పార్టీ శవ రాజకీయాలపై గుంటూరు ఎస్పీని కలిసి నిష్పక్షపాతంగా యాక్సిడెంట్‌ కేసును దర్యాప్తు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

రాజకీయంగా బ్రహ్మనాయుడిని ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఆంజనేయులు అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఎస్పీకి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఈ కేసును పోలీసులు నిష్పక్షపాతంగా విచారిస్తారని భావిస్తున్నాం. ఎమ్మెల్యే ఆంజనేయులు శవ రాజకీయాలు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. నేర చరిత్ర బ్రహ్మనాయుడికి లేదు ఆంజనేయులుకే ఉంది. ప్రభుత్వ ఒత్తిడికి లొంగి బ్రహ్మనాయుడుపై కేసు పెడితే చూస్తూ ఊరుకో’’మని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement