ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : అధికార దర్పంతో ఊగిపోతున్న టీడీపీ నాయకులు ఏంచేసినా తమకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో తమపై పోటీచేసిన ప్రత్యర్థులపై దాడులకు ఒడిగడుతున్నారు. ఇటీవల పెదవేగి మండలంలో టీడీపీ నాయకులు పెట్టిన తప్పుడు కేసుల కారణంగా వైఎస్సార్ సీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీ సులు స్టేషన్లు మార్చిమార్చి వారిని హింసించిన ఘటనను మరువకముందే రాష్ట్ర మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఆ నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం మండలంలో ఇటీవల కాలంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసుల బనాయింపులు మితిమీరితున్నాయి. పోలీసులు కూడా భరించలేనంతగా.. వినడానికి కూడా విడ్డూరం అనిపించేత స్థారయిలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నారుు. ఓ వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి పోలీస్‌స్టేషన్ పాలు చేసిన టీడీపీ నాయకులు ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్న సమ యంలోనే.. అదే వ్యక్తి తమపై హత్యాయత్నం చేసి పరారయ్యూడంటూ ఫిర్యాదు చేయడానికి రావడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతరుు్యంది.
టీడీపీ నాయకుల అకృత్యాలివీ
లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామ పరిధిలోని లక్ష్మీగణపవారిగూడెంలో బంటు చంద్రరావు అనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తప్పుడు కేసులు బనాయిం చారు. భార్యాభర్తల తగాదాలో భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, దానికి కారణం చంద్రరావే అంటూ ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కేసును విచారించిన పోలీ సులు చంద్రరావు ప్రమేయం లేదని వదిలేశారు. దీంతో అదే వ్యక్తిపై ఓ మహిళతో అత్యాచార యత్నం కేసు పెట్టించారు. అతడు బెయిల్‌పై బయటకు రావాల్సి వచ్చింది.
ఇదిలావుంటే.. లింగపాలెం మండలం అన్నపనేనివారి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ పదవికి పోటీ చేసిన దొడ్డిగర్ల రవీంద్రబాబుపై ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఓడిపోయినవాడు ఊళ్లో తిరగడానికి అనర్హుడన్నారు. రోడ్డుపై కనబడితే దాడులు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. గ్రామంలో టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఆ కేసును కూడా రవీంద్రపై బనాయించారు. ఊరిలో ఉంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. రవీంద్రబాబు ఈ విషయూన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళగా వారుకూడా కొంతకాలం ఊరినుంచి వెళ్ళిపొమ్మని ఉచిత సలహా ఇచ్చారు.
దీంతో రవీంద్రబాబు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామ సరిహద్దు దాటవలసి వచ్చింది. ఇదిలావుండగా అదే గ్రామానికి చెందిన మందపాటి నీలాంబరం అనే వ్యక్తికి చెందిన ఎకరం భూమిని ఆక్రమించుకోవడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మానుకొండ సంధ్యారావు అనే వ్యక్తి కుటుంబీకులు వందేళ్లుగా ఉంటున్న నివాస గృహాన్ని ఆక్రమించుకునే కుట్రలో భాగంగా అతనిని ఇంటి నుంచి గెంటేయగా, అతను బతిమాలుకుని తిరిగి ఇంటిలోకి ప్రవేశించాల్సివచ్చింది. ఇలా చెప్పుకుంటూపోతే అనేక మందిపై ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయి. కాగా చాలామంది బాధితులు తమ గోడును చెప్పుకుంటే గ్రామంలో కూడా ఉండనివ్వరనే భయంతో ఎవరితోనూ చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు.
అంతుచూస్తామంటున్నారు
గ్రామంలో 40 ఏళ్లుగా ఉంటున్న మమ్మల్ని మా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోమన్నారు. వెళ్లకపోతే అంతుచూస్తామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఇప్పటికే మా అన్నదమ్ములపై తప్పుడు కేసులు బనాయించారు. కేసు నుంచి బయటపడినా మళ్లీ కేసులు పెడతామంటున్నారు. దళితులమనే చిన్నచూపుతోనే మాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.
- బంటు చంద్రరావు, లక్ష్మీగణపవారిగూడెం
రక్షించండి మహాప్రభో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడమే నేను చేసిన నేరంలా ఉంది. టీడీపీ నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యుల్ని బతకనిచ్చేలా లేరు. వారు చేసిన దాడి కారణంగా ఊరువిడిచి వెళ్లిపోయాను. పోలీసులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. మాపై తప్పుడు కేసులు పెట్టకపోతే వారి ఉద్యోగమే పోయేలా ఉందని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామో తెలియడం లేదు. - దొడ్డిగర్ల రవీంద్రబాబు, అన్నపనేనివారిగూడెం.
మంత్రి ఇలాకాలో దౌర్జన్య కాండ
Published Wed, Aug 13 2014 1:15 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement