వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా డుంబ్రీగూడ - అరకు మధ్యలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఒడిశా వెళుతున్న టోయోటా వాహనం డుంబ్రీగూడ శివారుకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అరకు లోయలో వాహనం బోల్తా
Published Sat, Oct 24 2015 2:18 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement