నీట మునిగి ముగ్గురు చిన్నారుల గల్లంతు | three missing in water lake | Sakshi
Sakshi News home page

నీట మునిగి ముగ్గురు చిన్నారుల గల్లంతు

Published Sat, Jun 13 2015 4:42 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

three missing in water lake

హుకుంపేట: విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం చీడిపుట్ట వంతెన సమీపంలోని వాగు (గెడ్డ)లో మునిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. శనివారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్లలోపు వయసున్న ముగ్గురు బాలురు వాగులో స్నానం కోసం దిగి గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో జగదీశ్వరరావు అనే బాలుడి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement