ములకలపల్లి, న్యూస్‌లైన్: విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు కాలిబూడిద కాగా మరో ఇల్లు పాక్షికంగా దగ్ధమైన సంఘటన మండలంలోని రాజీవ్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తిమ్మంపేట పంచాయతీలోని రాజీవ్‌నగర్ గ్రామానికి చెందిన తుర్రం వీరస్వామి పూరింట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో వీరాస్వామికి చెందిన 8 క్వింటాల పత్తి, 25 బస్తాల ధాన్యం, రూ.10 వేల నగదు, వంట సామగ్రి, దుస్తులు కాలిబూడిదయ్యాయి. మొత్తం రూ. 80 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వీరాస్వామి తెలిపాడు. ఈ మంటలు పక్కనే ఉన్న ఊకె పోతురాజు ఇంటికి కూడా వ్యాపించడంతో ఆ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది.
సంఘటన స్థలాన్ని తహశీల్దార్ రమాదేవి సందర్శించి పంచనామా నిర్వహించారు. తక్షణసాయంగా వీరస్వామికి రూ. 5 వేలు, పోతురాజుకు రూ.4 వేల నగదు, 10 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఎస్సై ఎం. రాజు, స్థానిక సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల నాయకులు తాండ్ర కృపాకర్, ఆదివాసీ చైతన్య సమాఖ్య నాయకుల సోడె కేశవరావు బాధితులను పరామర్శించారు.
రాజీవ్‌నగర్‌లో పూరిల్లు దగ్ధం
Published Mon, Jan 20 2014 4:08 AM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM
Advertisement