సిద్ధిపేట: హైదరాబాద్‌పై సీమాంధ్రుల పెత్తనం ఉంటే తెలంగాణ ఏర్పడినా ప్రయోజనం ఉండదని, ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడతాయని టీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు కుంట వెంకట్‌రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు కీసరి పాపయ్య, నాయకులు సామల మధు, మట్ట బాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ ఆదాయాన్ని సీమాంధ్రకు పంచుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో రాజీ పడితే తెలంగాణ ఏర్పాటు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తేనే ఆమోదిస్తామన్నారు. వెయ్యి మంది ఆత్మబలిదానాలు, కేసీఆర్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిందన్నారు.
ఆంక్షలు లేని తెలంగాణ కావాలి:టీఆర్ఎస్
Published Mon, Nov 11 2013 4:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement