తెలుగు భాషను కాపాడుకుందాం
మాతృభాషకు ప్రాధాన్యమిస్తామని
పార్టీలు మేనిఫెస్టోల్లో చేర్చాలి
తెలుగు భాషోద్యమ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శౌరీ
నీలా(రెంజల్), న్యూస్‌లైన్:
తెలుగు భాషకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో చే ర్చాలని తెలుగు భాషోద్యమ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి శౌరీ డిమాండ్ చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా మాతృభాష తెలుగేనని అన్నారు. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజ కీయ పార్టీల ప్రతినిధులను కలిసి తెలుగుభాషను మాతృభాషగా అమలు చేస్తామని మేనిఫెస్టోల్లో చేర్చాలని కోరుతామన్నారు.
సోమవారం మండలంలోని నీలా ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా శౌరీ మాట్లాడు తూ.. తెలుగుభాష కలుషిత మవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు రకాలుగా భాష నాశనమవుతోందన్నారు. మొదటిది తల్లిఒడిలో, రెండో బడిలో, మూడోది ఏలుబడిలోనని వివరించారు. తమిళనాడులో 60 శాతం, ఒరిస్సాలో 30 శాతం తెలుగువారున్నారని, అలాగే అన్ని రాష్ట్రాల్లో, ప్రపంచంలో తెలుగువారున్నారన్నారు. అన్య భాషాపదాలను నాశ నం చేయాలని సూచించారు. ఆంగ్లేయులు దేశం మొ త్తం పాలించారని, అన్ని రాష్ట్రాల్లో మాతృభాషను తప్పని సరిగా అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం ఇంగ్లిష్ పద్ధతులనే పాలకులు పాటిస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి వరకు మాతృభాష తప్పనిసరని, మన రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు తెలుగు లేకుం డానే చదువుకుంటున్నారనిఅన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ.. యూనెస్కో నిర్వహిం చిన పరిశోధనలో మాతృభాషల ఉనికి తగ్గుతోందని పేర్కొందని అందులో తెలుగు సైతం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా తల్లిదండ్రులు ఇంగ్లిష్ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇంగ్లిషతోపాటు మాతృభాషను మర్చిపోవద్దని కోరారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గణేష్‌రావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య బోధన్ అధ్యక్షురాలు దుర్గాబాయి, సలహాదారురాలు రాధారాణి తదితరులు పాల్గొన్నారు.