యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి | Youth leadership should | Sakshi
Sakshi News home page

యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

Published Sun, Sep 6 2015 11:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Youth leadership should

యువత అలోచనలు పురోగమనం కంటే తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. పాత అభిరుచులను గౌరవిస్తూనే ప్రస్తుత పరిస్థితులపై దృష్టిసారించాల్సి ఉన్నా నేటి యువతలో అది కొరవడింది. యువతలో నూతన పోక డలు, నాయకత్వ లక్షణాలు ఎప్పుడు వస్తాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం అభిప్రాయపడ్డారు. ఐఎంఏ జోనల్ సమావేశానికి శ్రీకాకుళం వచ్చిన ఆయన జెడ్పీ సమావేశ మందిరంలో ‘సాక్షి’తో ఆదివారం మాట్లాడారు.
 
 శ్రీకాకుళం సిటీ :  సమాజం, దేశం గురించి యువతలో ఆలోచించే ధోరణి తగ్గిందని సమరం ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగం, సంపాదనకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని, ఇది సరైన చర్యకాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో యువత భాగాస్వామ్యం అవసరమన్నారు. యువతలోని, దేశంలోని నాయకత్వ లక్షణాలు లోపించాయన్నారు. యువతకు దిక్యూచిగా నిలపల్సిన నాయకత్వం ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. యువత స్వార్ధరాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. సినిమాల ప్రభావం కూడా యువతపై ఎక్కువగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఐవీ గురించి ప్రస్తావిస్తూ.. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య తగ్గిందన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement