ఇదో దుర్మార్గపు ప్రభుత్వం ! | ysrcp leaders fire on TDP Govt | Sakshi
Sakshi News home page

ఇదో దుర్మార్గపు ప్రభుత్వం !

Published Sun, Aug 20 2017 3:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

ఇదో దుర్మార్గపు ప్రభుత్వం ! - Sakshi

ఇదో దుర్మార్గపు ప్రభుత్వం !

వైఎస్సార్‌సీపీ గుంతకల్‌ నియోజకవర్గ
 సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి


పామిడి: ప్రజా వ్యతిరేక విధానాలతో అవినీతి పాలన అందిస్తున్న టీడీపీది దుర్మార్గపు పాలన అని వైఎస్సార్‌సీపీ గుంతకల్‌ నియోజకవర్గం సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి అన్నారు. స్థానిక అనిమిరెడ్డి ఫ్యాక్టరీలో శనివారం పామిడి, గుత్తి మండలాల పట్టణ, గ్రామ కమిటీ, బూత్‌ కమిటీలకు నవరత్నాల పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వైవీఆర్‌ విచ్చేసి మాట్లాడారు. పార్టీలకతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహోన్నత వ్యక్తి దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి అన్నారు.

 నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్న జననేత జగన్‌ తండ్రిబాటలో పయనిస్తున్నారన్నారు. జగన్‌ సీఎం కావాలన్నది జనం అభిమతం అన్నారు. స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యమన్నారు. అక్రమార్జనతో సంపాదించిన కోట్ల రూపాయల అవినీతి సొమ్మును గుమ్మరించి నంద్యాలలో గెలవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు కుయుక్తులను ఓటరు దేవుళ్లు తిప్పి కొట్టి వైఎస్సార్‌సీపీకి విజయం అందించి ధర్మాన్ని గెలిపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం వీరాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ తొత్తిరెడ్డిగారి రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు మండ్ల శ్యామలా, వడుగూరి రజిత, ఎం కృష్ణవేణి, ఎంపీటీసీలు పద్మావతి, మురళీధర్‌రెడ్డి,  కన్వీనర్లు బొల్లు వెంకట్రామిరెడ్డి, కే.నారాయణరెడ్డి,  జీ నూర్‌మహమ్మద్, సాదక్‌వలి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement