తొలి ఆరు నెలల్లో వృద్ధి 7.2 శాతం | 7.2 percent growth in the first six months | Sakshi
Sakshi News home page

తొలి ఆరు నెలల్లో వృద్ధి 7.2 శాతం

Published Sat, Dec 31 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

తొలి ఆరు నెలల్లో వృద్ధి 7.2 శాతం

తొలి ఆరు నెలల్లో వృద్ధి 7.2 శాతం

► ఆర్థికశాఖ సమీక్ష
► ద్రవ్యోల్బణం అదుపులో ఉందని వివరణ


న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) 7.2 శాతంగా నమోదయినట్లు ఆర్థికశాఖ తన సంవత్సరాంతపు సమీక్షా సర్వేలో పేర్కొంది. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వృద్ధిరేటుగా వివరించింది. ఇక ద్రవ్యోల్బణం కూడా ఈ కాలంలో అదుపులో ఉందని పేర్కొంది. సగటున రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.2 శాతం, టోకు ద్రవ్యోల్బణం 2.7 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.   నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు ...

►  రిటైల్‌ ధరల సూచీ 2014–15లో సగటున 5.9 శాతం ఉంటే, 2015–16లో 4.9 శాతానికి తగ్గింది. టోకు ధరల సూచీ 2014–15లో 2 శాతంగా ఉంటే, మరుసటి ఏడాది అసలు పెరక్కపోగా క్షీణతలో – 2.5 శాతంగా నమోదయ్యింది.
► ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతోపాటు, వ్యయ హేతుబద్ధీకరణ ద్వారా ద్రవ్య పటిష్టతకు చర్యలు, ఆదాయం పెరుగుదలకు వ్యూహాలు, సహకార ఆర్థిక వ్యవహారాలకు తగిన విధంగా పరిపాలనా పరమైన అంశాలపై దృష్టి వంటివి ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి  స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడ్డాయి.
► పెట్రోలియం ధరల పెరుగుదలసహా పలు అంతర్జాతీయ అవరోధాలు ఉన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను అధిగమిస్తోంది.
► వ్యవసాయం– అనుబంధ రంగాలు, పరిశ్రమ, సేవల రంగాల వృద్ధి తొలి ఆరు నెలల కాలంలో వరుసగా 2.5%, 5.6%, 9.2 శాతంగా ఉన్నాయి.
►ఆరు నెలల కాలంలో వాణిజ్యలోటు విలువ 78.2 బిలియన్ డాలర్ల నుంచి 53.2 బిలియన్ డాలర్లకు తగ్గింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement