చెన్నై ఫ్యాక్టరీలో బీఎమ్‌డబ్ల్యూ 50,000వ కారు | BMW rolls out 50,000th car from Chennai factory | Sakshi
Sakshi News home page

చెన్నై ఫ్యాక్టరీలో బీఎమ్‌డబ్ల్యూ 50,000వ కారు

Published Thu, May 12 2016 5:01 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

BMW rolls out 50,000th car from Chennai factory

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ తన 50,000వ కారును చెన్నై ఫ్యాక్టరీలో తయారుచేసింది. దాదాపు 50 శాతం వరకు స్థానిక పరికరాలతోనే దీన్ని రూపొందించినట్టు కంపెనీ చెప్పింది. ఈ 50,000వ కారు బీఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్‌కు చెందిందని బీఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంటు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జోచెన్ స్టాల్ క్యాంప్ తెలిపారు. 50,000వ కారును స్థానికంగా తయారుచేయడం తాము గొప్పగా భావిస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక మీదట అన్ని బీఎమ్‌డబ్ల్యూ కార్లను స్థానికంగానే తయారుచేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో బీఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ ను ఇండియాలో ఆవిష్కరించారు. 2007 మార్చి 29 నుంచి చెన్నై ప్లాంటులో ఈ కంపెనీ కార్లను తయారుచేస్తోంది. అప్పటినుంచి స్థానికంగా ఉత్పత్తి అయ్యే పార్ట్ ల షేరును పెంచుకుంటూ, బీఎమ్ డబ్ల్యూ తన మోడళ్లలో వాటిని వాడుతూ వస్తోంది. చెన్నై ప్లాంటు ద్వారా తన స్థానిక సామర్థ్యాన్ని 50శాతం మేర పెంచుకోవాలని భావిస్తున్నట్టు బీఎమ్ డబ్ల్యూ చెప్పింది. ప్రస్తుతం చెన్నై ప్లాంటు నుంచి బీఎమ్ డబ్ల్యూ 1 సిరీస్, 3 సిరీస్, 3 సిరీస్ గ్రాన్ టురిస్మో, 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్ 3, ఎక్స్ 5లు మార్కెట్లోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement