ఆండ్రాయిడ్ మొబైళ్ల రూపకర్తల్లో ఒకరైన ఆండీ రూబిన్ తను రూపొందించిన తొలి స్మార్ట్‌ఫోన్ ఎసెన్షియల్‌పై భారీగా ధర తగ్గించారు. గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్ల షిప్పింగ్ ప్రారంభమైన క్రమంలో ఆండీ రూబీన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 699 డాలర్లుగా(సుమారు రూ.45,460గా) ఉన్న తమ స్మార్ట్‌ఫోన్ ధరను, 499 డాలర్లకు(సుమారు రూ.32,457కు) తగ్గించారు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,003 మేర తగ్గిపోయింది. సమీక్షించిన ధరల్లో తమ హ్యాండ్‌సెట్‌ను యూజర్లు ఎసెన్షియల్.కామ్‌లో కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ నికోలో డే మాసి చెప్పారు. ఈ తగ్గింపు ఆపిల్ ఐఫోన్ ఎక్స్, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లను ఆకట్టుకోవడంలో సాయపడుతుందని పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్ ధర 999 డాలర్లు కాగ, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ ధర 849 డాలర్లు. ఐఫోన్ ఎక్స్ నవంబర్ 3 నుంచి విక్రయానికి వస్తుండగా.. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఎసెన్షియల్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల పరంగా అంత ఆశించిన రీతిలో లేదని, గత నెలలో కేవలం 5000 యూనిట్లు మాత్రమే విక్రమమైనట్టు బేస్ట్రీట్ రీసెర్చ్ తెలిపింది.
ఎసెన్షియల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు...
ఇంటెలిజెంట్ హోమ్ స్మార్ట్ స్పీకర్, 360 కెమెరా ఈ మొబైల్ ప్రత్యేకతలు
5.7 అంగుళాల ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే
3040 ఎంఏహెచ్ బ్యాటరీ
వెనుకవైపు రెండు 13 ఎంపీ కెమెరాలు
ముందువైపు 8 ఎంపీ కెమెరా
టైప్‌సీ యూఎస్‌బీ పోర్టు
1.9 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ప్రోసెసర్
4 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ
4కె రిజల్యూషన్‌లో వీడియోలు చిత్రీకరించొచ్చు
టైటానియం, సెరామిక్ మెటీరియల్‌తో ఈ మొబైల్‌ను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment